Subscribe:

Monday, August 8, 2011

సింగపుర - II

మొదటి భాగం చదివారా?   లేకపోతే ఒకసారి ఇక్కడ చూసి వచ్చేయండి . 

ఇప్పుడు అర్ధం అయ్యింది కదా మీకు ఇప్పుడు నేను  నాకు  తెలిసిన  సింగపూర్  ప్రజల  రోజు వారి  జీవితం  గురించి సుత్తి వేయదల్చుకున్నాను అని  ,  అయ్యో భయపడకండి  మనం తెలుగు బ్లాగర్లం  గుండె దిటవు   చేసుకొని  మన సాటి  బ్లాగర్ రాసింది మనం కాకపొతే ఎవరు చదువుతారు అని ఫిక్స్ అయ్యిపొండి ఈసారి కి :) 
సరే ఇప్పుడు ఎక్కడ నుంచి మొదలెడదాం .......... మనిషన్న వాడికి రోటీ , కపడా , మకాన్ అవసరం అన్న మాట ప్రతి భాష లోను , ప్రతి కవి చెబుతున్నాడు కదా అక్కడ నుంచి మొదలెడదాం .


ఆహారం : సింగపూర్ భిన్న సంసృతుల సమ్మేళనం , అలాగే  ఎక్కువ ట్రాన్సిట్ visit  కి అవకాశం ఉండే ఓడరేవు , విమానాశ్రయం ఉండటం , పైగా టూరిజం కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న దేశం కావటం తో అందుబాటు  ధరలలో   రకరకాల  ఆహార పదార్ధాలు ఇక్కడ  దొరుకుతాయి (కొన్ని చోట్ల 24 గంటలు ) . సాంప్రదాయ  భారత ,  చైనా , మలయ్ , మయన్మార్ ఆహరం లభించే ఫుడ్ కోర్ట్స్ , ఖరీదైనా రెస్తారెంట్లే కాకుండా వెస్ట్రన్ ఫుడ్ లభించే దరిదాపు అన్ని ఫుడ్ చైన్స్ ఇక్కడ ఉంటాయి .చాల మంది సింగపూరియన్స్ కి వంట గది ఒక అలంకారం  మాత్రమే .   ఎక్కడ చూసినా ఉండే ఫుడ్ కోర్ట్స్,  పైగా ధరలు కూడా అందుబాటు లో ఉండటం తో  ఎక్కువ మంది ఈ ఫుడ్ కోర్ట్స్  పైనే ఆధారపడతారు .   చైనీస్ కి  చాలా త్వర గా   రాత్రి భోజనం ముగించే అలవాటు , అలాగే ఇక్కడ ఉండే ఎక్కువ  పని గంటలు  కూడా ఈ అలవాటుకి ఒక కారణమేమో అని నా  అభిప్రాయం . సాధరణం గా  మొదటి తరం  ఇండియన్స్ లేదా  మాత్రం  ఈ గ్రూప్ లోకి రారు :)  వ్యవసాయం అనేది లేని దేశం అవటం తో   ప్రతి దీ వేరే దేశం నుంచి  దిగుమతి  చేసుకోవటం తో   నానా రకాల కూరగాయలు , పండ్లు ఇక్కడ దొరుకుతాయి . ఇక్కడ జనాభా కి సరిపడా మంచి నీటి వసతి లేకపోవటం తో నీరు కూడా మలేషియా నుంచి   దిగుమతి  చేసుకుంటారు.  ఈ నీటి సమస్య ని ఎదుర్కోవటానికి , recycling ద్వారా నీటి ని  శుభ్రపరిచి వాడటానికి  ప్రయతిస్తున్నారు ,  దీన్నే  ఇక్కడా న్యూ వాటర్ అంటారు . 
ఇక్కడ steamboat అనే చైనీసు సంప్రదాయ వంటకం ఇక్కడ బాగా ఫేమస్ , చైనీస్ న్యూ ఇయర్ రెండు రోజుల్లో ఒక రోజు ఫ్యామిలీ మొత్తం వెళ్లి ఇది తినడటం అనేది వీళ్ళ అలవాటు. దీని గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూడండి .

నివాసం :85  %  ప్రజలు Multi Storied HDB ( Housing and Development Board ) flats ల లో నివసిస్తూ ఉంటారు .    ప్రతి HDB బ్లాకు కి ఒక మల్టీ storied పార్కింగ్ ఏరియా ఉంటుంది . ఇలాంటి కొన్ని బ్లాకులని కలిపి హౌసింగ్ estates  అంటారు . ఈ HDB లని సింగపూర్ గవర్నమెంట్ డెవలప్ చేసి race  ratios , సిటిజెన్ షిప్  ఆధారం గా allot చేసుంది .     వీటిని కొనుగోలు చేయటాని CPF  నుంచి  loans  provide  చేస్తారు . కొన్ని  అపార్ట్మెంట్ బ్లాక్ లకి కలిపి ఒక గార్డెన్ , exercise equipment maintain  చేస్తుంటారు . ఇవి కాక ప్రైవేటు  కాండోస్ ఉంటాయి , వీటిని ఎవరైనా కొనుగోలు చేయొచ్చు . వీటి ఖరీదు ఎక్కువ గా ఉంటుంది .ఇక్కడ డెంగూ భయం వలన ఇళ్ళలో ఇండోర్ మొక్కల పెంపకం  పైన నిషేధం ఉంది , తరచూ గా HDB లని inspect చేస్తుంటారు , ఇండోర్ మొక్కలు లేదా , నెలలు నిలువ ఉంచిన బకెట్స్ లాంటివి, లేదా శుభ్రత సరిగా లేకపోయినా ఫైన్ విధిస్తుంటారు . అలాగే రెంటల్ వ్యయం చాల ఎక్కువ కాబట్టి సాధారణం గా షేరింగ్ accommodation  prefer   చేస్తారు, అంటే రెండు ఫామిలీస్ కలిసి ఒక ఇంటిని అద్దెకి తీసుకోవటం , లేదా  ఒక రూమ్ ని వంటిరి గా ఉండేవారికి అద్దె కి ఇవ్వటం వంటివి ఎక్కువ గా కనపడుతుంటాయి .
ఇక ఇన్ని తెలుసుకున్న తరవాత మనిషి చివరి  గమ్యం గురించి కూడా తెలుసుకోవాలి కదా :) అంటే  అదేనండి చనిపోయిన ఏమి చేస్తారు అని .  చిన్న  దేశం  పైగా స్థలం ఎక్కువ గా లేకపోవటంతో ఇక్కడ సమాధులు వంటి కట్టడం నిషేధం.  చనిపోయిన తరవాత  ఆ కార్యక్రమాలని నిర్వహించటానికి సాధారణం గా Funeral Directors అని వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు  అలాగే అస్తికల్ని భద్రపరచటానికి ఇక్కడ కొలంబేరియం అనే ఏర్పాటు ఉంటుంది .  ప్రభుత్వ నిర్వహణ లో ఉండే మూడు కొలంబేరియం లు సింగపూరియన్ ప్రజల కోసం   మాత్రమే ,   PRs లేదా మిగిన వాళ్ళు ఈ ఏర్పాటు కోసం ప్రైవేటు కొలంబేరియం లను వాడాల్సి ఉంటుంది . సింగపూరు లో మొదటి లక్సరీ కొలంబేరియం లో యూషున్ అనే ప్రాతం లో ఉంది . దీని గురించి వివరాలు  తెలుస్కోవాలంటే ఇక్కడ  చూడండి . భయపడనక్కర లేదండి , డబ్బుంటే చని పోయినాకా కూడా ఎంత రిచ్ గా ఉండొచ్చో చూడండి .

సరే ఇక సింగపూర్ గురించి వివరాలు ఇక్కడి తో ఆపి ప్రేక్షకుల   కోరిక మేరకు  పర్యాటక విశేషాలు కొన్ని తెలుసుకుందాం :

సింగపూర్ visiting వీసా దొరకటం చాలా సులువు , సాధారణం  గా నెల రోజులకి ఈ వీసా ని ఇస్తారు .  అలాగే ఉండటానికి మన  budget మేరకు అకామిడేషన్ దొరుకుతుంది .

చూడాల్సిన కొన్ని ప్రదేశాలు :

Singapore airport   
ఈ క్రింది లింక్ బ్లాగర్ హరేకృష్ణ గారి కోసం ప్రత్యేకం :)


 సింగపూరియన్స్ కి షాపింగ్ అంటే మహా పిచ్చి , Shop till you Drop, అనేది ఇక్కడ జనాలు పాటించే సూత్రం , కాలరీ లు కరగటానికి కూడా షాపింగ్ ఒక మార్గం అని నమ్ముతారు .సింగపూర్ కి "shopping paradise " అని పెద్ద పేరు , పెద్ద పెద్ద malls మీ పర్సు బరువు తగ్గించుకోవటానికి చక్కగా ఆహ్వానం పలుకుతాయి . మీరు తప్పకుండా కనీసం విండో షాపింగ్ అన్న చేయాల్సిన షాపింగ్ మాల్స్ ఇవి Vivo cityion , Great World City.

అలాగే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన రెండు అంశాలు
సింగపూర్ లో చూయింగ్ గం తినడటం నేరం , అలాగే తీసుకు రావటం కూడా.
మీరు  గాని పొగరాయుళ్ళు ఐతే మీరు బారీ మొత్తం లో సిగిరెట్లు కనక తెస్తుంటే వాటికి డ్యూటీ కట్టవలసి వస్తుంది ఒక వేళ పర్సనల్ వాడుకకోసం ఐతే వాటిని ఐర్పొర్ట్ లో రెడ్ line లో declare చేయాల్సి ఉంటుంది .
ఈ రెండు ముక్కలు మన బంతి గారికి కోసం ఇస్పెషల్ :) సింగపూర్ అంటేనే ఇన్ఫర్మేషన్ సిటీ పేరు కాబట్టి మీరు సింగపూర్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ అయినా నిమషాల్లో తెలుస్కోవచ్చు (బస్సు రాకపోకల తో సహా ) ఇది IT తో నే సాధ్యం . ఇక IT employee భవిష్యత్తు అమెరికా తుమ్మితే ఇండియా కి జలుబు చేస్తుంది , కాని సింగపూర్ కి ఏకంగా టైఫాయిడ్ వస్తుంది అదీ విషయం .
ఇందండి సింగపూర్ గురించి నేను మీకు చెప్పదలుచుకున్న సోది , ఇక ఇక్కడితో దీనికి fullstop పెట్టేస్తున్నా మీరు ఊపిరి పీల్చుకోవచ్చు , అలాగే "Majulah Singapura"   అని ఒకసారి చెప్పి విండో క్లోజ్ చేసి రెస్ట్ తీసుకోండి :)



సింగపూర్ ని ఫోటోలలో చూడాలి అనుకుంటే గతం లో నేను తీసినవి కొన్ని ఇక్కడ చూడొచ్చు !



Singapore