Subscribe:

Tuesday, April 3, 2012

Cloud Computing - II

ముందు భాగం లో   క్లౌడ్ కంప్యూటింగ్  అంటే ఏంటి  ఇంకా  అలాగే  దీనిలో భాగం  గా   వాడే  పదాల  గురించి  తెలుసుకున్నాం  కదా .  అసలు  ఈ క్లౌడ్  కంప్యూటింగ్  IT  కంపెనీలకి  /  IT  ప్రోడక్ట్  end  users   ఎలా  ఉపయోగపడుతుందో  చూద్దాం .

ఇప్పుడు  మనం  కాసేపు అలా ఉహా లోకం లోకి  వెళ్ళోద్దాం  కళ్ళు  తెరిచి  నేను  ఇక్కడ రాసినది  చదువుతూ  ఊహించుకోండి .

మీకు ఒక మంచి  బ్యాంకింగ్  లేదా  హెల్త్ కేర్ కి  ఉపయోగపడే  సాఫ్ట్వేర్  తయారు చేసే  డొమైన్ knowledge *   ఉంది ,  దానికి  తగ్గ  సర్వీసెస్ ని  అందించగలిగే మాన్ పవర్    (అంటే  development ,  టెస్టింగ్  ఇంకా అవసరమైన  ఇతర  స్టాఫ్) ని  నిర్వహించగలిగే  సామర్ధ్యం  ఉంది .   సో ఇప్పుడు  మీ తక్షణ  కర్తవ్యమ్  ఒక కంపెనీ  మొదలు పెట్టడం .  మరి దానికి  కావలసిన  infrastructure  (అంటే  హార్డువేర్, సాఫ్ట్వేర్, నెట్వర్క్ components  ఇలాంటివన్నీ )  ఎక్కడ  నుంచి వస్తుంది ?  అప్పుడు  మీరు వెంటనే  ఏమి చేయాలి ?  ఇక్కడ  మీకు రెండు options   ఉన్నాయి . 
  • ట్రెడిషనల్  పద్దతి లో   మీ  ఇంట్లోదో , మీరు  మరీ  తెలివైన  వారైతే  ఊర్లో వాళ్ళ  ఇంట్లో దో డబ్బు  తెచ్చి  మీకు  కావలిసిన  సాఫ్ట్వేర్,  హార్డువేర్ ,  datastorage  కి  కావాల్సిన  సదుపాయాలు   వగైరాలు  అన్ని కమిటీ వేసి  ఏది మంచిదో  నిర్ణయం  తీసుకొని  ఆ పని మీద  ఉండాలి .  ఒక వేళ మీ  అంచనా తప్పి  ఇంకా ఎక్కువ infrastrucure అవసరం  అయ్యింది  మళ్ళీ   మొదలు ఇదే పద్దతి .  లేదు ఒక వేళ  కొన్న infrastructure  ఎక్కువ అయ్యింది  అంటే  అదో ఒక నష్టం . ఒక  ఇదంతా  సెటప్ చేసాకా   ఈ databackup  ,   hardaware  క్రాష్  అయితే చెయ్యాల్సిన   పద్దతులని  సమీక్షించి  వాటి కోసం   అవసరమైన  స్టాఫ్  నియామకాలు  చెయ్యాల్సి  ఉంటుంది .
లేదూ
  •  మీ అవసరాలకు  అనుగుణం గా IaaS * లేదా  PaaS *   ప్రొవైడ్ చేసే  వెండార్ ని  కోసం  వెతకాలి  . ఆ  వెండర్ తో అగ్రీమెంట్  చేసుకొని  మీకు  కావలిసిన infrastracture  ని  virtual  గా  పొందొచ్చు  .   తరవాత ఒక ఇంటర్నెట్  కనెక్షన్  దానితో పాటు   ఒక SaaS  provider  ని  వెతికి  ఈమెయిలు  సర్వీసు సెటప్  చేసుకుంటే   ఇక పని మొదలు పెట్టొచ్చు . మీ డేటా backup , సెక్యూరిటీ , హార్డువేర్ రిలయబిలిటీ , అవసరమైనప్పుడు  ఎక్కువ  infrastucture ని  వాడుకోవటం  లేదూ  తగ్గించుకోవటం  వంటి సదుపాయాలు  ఇందులో  ఉంటాయి . మరీ  ముఖ్యం గా మీరు  వాడుకున్న  సమయానికి  మాత్రమే  బిల్ కట్టే  సదుపాయం   ఉంటుంది .  వీటన్నికన్నా  ముఖ్యమైంది  మీ డేటా  ఇంకా virtual   infrastrucure  ఎక్కడి నుంచైనా  access  చేసే  సదుపాయం ఉంటుంది .

ఇప్పుడు పై రెండు  options   ని  పరిశీలించాక మీ ఏ ఆప్షన్  ని ఎంచుకోవటానికి  ఇష్టపడతారు ?

నాకు తెలుసు  నేను  అంత 3D   సినిమా   చూపించాకా  మీరు రెండో ఆప్షన్  ఇష్టపడతారు  అని . కానీ  సినిమా   అన్నాక  హీరో తో  పాటు విలన్ ఎంత  అవసరమో , టెక్నాలజీ  అన్న తరవాతా   advatanges   తో పాటు disadvantages  తెలుసుకోవటం కూడా  అంతే ముఖ్యం  కాబట్టి  అవి కూడా  తెలుసుకుందాం .

మీరు క్లౌడ్ కంప్యూటింగ్  ద్వారా  మీ ప్రోడక్ట్ సర్వీసెస్  ని అందచేస్తుంటే     అత్యవసరమైన  మార్పులు  చేయవలసి ఉంటె  uptime  , down  time  మీ కంట్రోల్ లో  ఉండదు  . దీని   కోసం మీ క్లౌడ్ Provider  మీద ఆధారపడాల్సి  ఉంటుంది .
  1. ఎప్పుడూ కాకపోయినా  కొన్ని  అత్యవసర  సందర్భాలలో   scheduled downtime   పాటించాల్సిన అవసరం రావచ్చు .(Chances are very thin for this).
  2. ఒక వేళ వెండార్ సరైన  జాగ్రత్తలు  తీసుకోక పొతే , సెక్యూరిటీ  లేదా డేటా లాస్  కి అవకాశం ఉంటుంది .  కానీ  దీనిని  లీగల్  పాలసీల  ద్వారా  నియంత్రించ  వచ్చు .
  3. ఇక అత్యంత ప్రధానమైనది  కంపాటబిలిటీ .  ఉదారణ కి ఒక మీ ప్రోడక్ట్  సర్వీసు ని మైక్రోసాఫ్ట్  azure ప్లాట్ఫారం  పైన deploy చేయదలుచుకుంటే  మీ ప్రోడక్ట్  లేటెస్ట్  రిలీజ్  వెర్షన్ లో డెవలప్ చేసినది  లేదు మైగ్రేట్  చేసినది అయి ఉండాలి . కొన్ని  సార్లు  ఇది కష్టం తో కూడుకున్న  పని కావొచ్చు .
ఫై  ఉదాహరణ లో  ఈ టెక్నాలజీ  ప్రభావం   వెండార్ పైన  ఎలా ఉంటుందో  చూసాం  కదా  ఇప్పుడు  End  User   వైపు  నుంచి  చూద్దాం .

మీకొక  చిన్న  పరిశ్రమ  ఉంది , దానిలో పనిచేసే  employees   payroll   maintain  చేయాలి .  దీని కోసం  మామూలు గా  అయితే  మీ  అవసరాలు  అనుగుణం  గా  ఉండే ఒక సాఫ్ట్వేర్ వెండార్ ని కాంటాక్ట్  చేయాలి , తరవాత  దానికి  అవసరమైన  హార్డువేర్  మీద ఇన్వెస్ట్  చేయాలి . ఈ  హార్డువేర్ , సాఫ్ట్వేర్ మైంటైన్  చేయటానికి అవసరమైన  IT  స్టాఫ్ ని  recruit  చేసుకోవాలి . డేటా  రక్షణ  కోసం  సరైన  జాగ్రత్తలు  తీసుకోవాలి .  ఇవన్నీ   కాకుండా  మీకు  ఇదే సాఫ్ట్వేర్  మీకు  Cloud Computing లోని భాగమైన  SaaS   మోడల్  లో లభించింది  అనుకోండి  ఈ క్రింది  సదుపాయాలు  ఉంటాయి .

అదనం గా  హార్డువేర్ మీద  ఖర్చు పెట్టనక్కర లేదు .
  1. అప్పటికే  deploy  చేసి  ready  to  Use  mode  లో    ఉంటుంది కాబట్టి tedious   deployment  procedures ఫాలో కానవసరం లేదు . 
  2. డేటా backup ,  సెక్యూరిటీ  ల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు  అవసరం లేదు .
  3. ట్రెడిషనల్  apps  పోల్చితే  తక్కువ  వనరులలో  latest  టెక్నాలజీ  ఇంకా  అవసరమైన  యాడ్ ఆన్ updates  పొందటం   సులువు .
వెబ్ ఈమైలింగ్ ,  ఫోటో షేరింగ్  సర్వీసు  ఈ  SaaS  మోడల్ కి  మంచి  ఉదాహరణ  .

క్లౌడ్ కంప్యూటింగ్ అంటే  ఏంటి , అదెలా పని చేస్తుంది అనే  ఒక అవగాహన  వచ్చాం కదా ఇక ఇప్పుడు  ఈ టెక్నాలజీ  IT   కంపెనీల , ఉద్యోగుల  మీద  చూపెడుతున్న / రాబోయే రోజుల్లో  ప్రభావితం చేస్తుంది   అని భావిస్తున్న  అంశాలు  ఏంటో చూద్దాం .

  •  IT  బేస్డ్   ప్రొడక్ట్స్  అనీ   బిజినెస్   సర్వీసెస్  గా  మారిపోతాయి  .
  • సర్వీసు ఈ పదం  విన్న వెంటనే మన మైండ్  లోకి  వచ్చేది  Customer  Experience .  Supplier  ఒక సర్వీసు  వెండార్ గా  మారటం తో  సాధారణం  గా  కస్టమర్  expectations ఎక్కువవుతాయి .    అంటే 24X7   ఎవైలబిలిటీ, క్వాలిటీ ,  సెక్యూరిటీ,  కాంపిటేన్సి ఇలాంటివి . (So  Guyz & Gals get ready  to work for 24X7:)) 
  • అప్లికేషను  development,  టెస్టింగ్,   deployment  ప్రాసెస్  మార్పు చోటు చేసుకుంటాయి (Meaning should be capable  more genric in nature,  and every app should be potential to become more intelligent and more adaptive).  
  • ఇప్పటి వరకు TB ల లో మాట్లాడుతున్న డేటా  సైజు , petabytes and zetabytes లో మాట్లాడటం  మామూలు  అవుతుంది  (FaceBook is already doing it ).


ఇక ఉదోగ్యాల  విషయానికి  వస్తే ,
  •  చాల  వరకు  సాఫ్ట్వేర్  installations , backup procedures లాంటివి automateded  సర్వీసెస్  మారే అవకాశాలు  ఉంటాయి  కాబట్టి  కొన్ని  roles  మాయం కావచ్చు .
  • చాల  వరకు  అవసరమైన ఈ బిజినెస్ కైనా  అవసరమైన   functionality  available గా ఉంటుంది కాబట్టి ఈ functionality  ని   అవసరాలకు  అనుగుణం గా  మలుచుకోవటానికి  అవసరమైన  మంచి  డొమైన్  knowledge  ఉన్న  బిజినెస్ ananlysts లకి  డిమాండ్ ఉంటుంది .  
  • Data driven applications  కి డిమాండ్  ఉంటుంది .    Customer data, visitor data, partner data, behavioral data అనేవి  బిజినెస్ ప్లాన్స్  కి  అందుబాటు లోకి వస్తాయి  . అలాగే డేటా ని analyze  చేయటానికి , దాని  ద్వారా బిజినెస్ ప్లాన్స్ ని రూపొందించు కోవటానికి  అవసరమైన  డేటా analylists  వంటి  roles  ప్రతి బిజినెస్ కి   అవసరం  ఉంటుంది . (Already  google is talking about serendipity engine)
  • క్లౌడ్  కంప్యూటింగ్  లో అతి ముఖ్యమైన infrastructure ఇంకా డేటా    ఇంటర్నల్ గా కాకుండా క్లౌడ్ ప్రొవైడర్ తో మైంటైన్ చేయాల్సి ఉంటుంది . దీని  వల్ల  సహజం గానే unauthorized access ఇంకా customer information will be leak వంటివి జరగకుండా అత్యంత జాగ్రత్త అవసరం అవుతుంది . ఇలాంటివి జరగకుండా ఉండటానికి Highly skillied IT security experts కి డిమాండ్  ఉంటుంది .
ఇవండీ  ప్రస్తుతానికి క్లౌడ్ కంప్యూటింగ్  గురించి  నాకు  తెలిసిన  కొన్ని  అంశాలు .   క్లౌడ్  సెక్యూరిటీ  సంభందిచిన  కొన్ని  అంశాలు  ని వేరే   భాగం లో చూద్దాం .....