Subscribe:

Sunday, November 25, 2012

Steve Jobs(1955-2011) - 6/6


Being the richest man in the cemetery doesn’t matter to me … Going to bed at night saying we’ve done something wonderful… that’s what matters to me.
- Steve Jobs

2007 - iPod తో సక్సెస్ చవిచూసిన ఆపిల్ కంప్యూటర్స్ సంస్థ , మార్కెట్ లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ లో తన పరిధిని విస్తరించటానికి మరో అడుగు ముందుకు వేసిన సంవత్సరం.  ఆ అడుగే iPhone. నిజానికి  2003 లోనే ఆపిల్ కంప్యూటర్స్ స్మార్ట్ ఫోన్ తయారు చేసేందుకు తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇంటర్నెట్ కమ్యూనికేటర్, మొబైల్ ఫోన్, iPod  మూడిటిని కలిపి ఒక డిజిటల్ device ని తయారుచేయాలి అన్న ఆపిల్ ప్రయత్నమే  iPhone. స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి అడుగు పెట్టాలి అన్న ఆలోచన రాగానే స్టీవ్ జాబ్స్  మొదట చేసిన ప్రయత్నం అమెరికా లో వైర్లెస్ సర్వీసెస్ రంగం లో  లీడరైన  అప్పటి Cingular Wireless LLC ఇప్పటి AT&T తో డీల్ కుదుర్చుకోవటం. బిజినెస్ negotiationsలో నిష్ణాతుడైన స్టీవ్ జాబ్స్, అప్పటి వరకు Wireless Carriers డిమాండ్స్ కి అనుగుణం గా  handsets తయారు చేసే కంపెనీలు నడుచుకునే తీరును ఒక్కసారిగా మార్చేసాడు. నిజానికి అంతవరకు ఫోన్ ఫీచర్స్, ఖరీదు, మార్కెటింగ్ ఎలా చేయాలి అనేవి Wireless Carrier కంపెనీలు నిర్ణయించేవి. iPhone డీల్ ఈ పరిస్థితి ని పూర్తి గా మార్చేసింది . iPhone ఎలా ఉండబోతుంది అనేది AT&T కి,  కేవలం iPhone రిలీజ్ కి  కొన్ని వారాల ముందు మాత్రమే తెలిసింది. ప్రోడక్ట్ విషయం లో ఇలాంటి సీక్రెసీ  ఆపిల్ కంప్యూటర్స్ కి  కొత్త కాకపోయినా సెల్ ఫోన్ ఇండస్ట్రీ లో మాత్రం అంత వరకూ లేనిది. మొట్ట మొదటి సారిగా Jan .9, 2007 న San Francisco లో జరిగిన Mac World Keynote  address లో స్టీవ్ iPhone ని ఇంట్రడ్యూస్  చేసాడు.  అదే Keynote address లో Apple TV ని ఇంట్రడ్యూస్ చేయటం తో పాటు, కేవలం కంప్యూటర్ రంగం లోనే కాకుండా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగం లో మార్కెట్ లో సాధిస్తున్న విజయాలకి అనుగుణం గా ఆపిల్ కంప్యూటర్స్ Inc. అనే కంపెనీ పేరు ని కేవలం Apple Inc. గా మారుస్తున్నట్లు గా అనౌన్స్ చేసాడు. iPhone తరవాత అదే సంవత్సరం జూన్ 29 నుంచి మార్కెట్ లో అందుబాటు లోకి వచ్చింది. జూన్ 29 మొదటి జనరేషన్ iPhone రిలీజ్  అయితే 2012 లో ప్రస్తుతం నడుస్తున్నది 6th జనరేషన్(iPhone 5). 2011 లో iPhone రెవిన్యూ 47 బిలియన్ డాలర్లు, ఇది కంపెనీ మొత్తం రెవిన్యూ లో 40 శాతం కన్నా ఎక్కువ. iPhone సాధించిన ఈ కీలకమైన  విజయం ఆపిల్ అమెరికా లో అత్యంత లాభదాయకమైన కంపెనీ గా ఎదగటానికి ఒక ముఖ్య కారణం.
(ఇప్పటి వరకు రిలీజ్ అయిన iPhone సిరీస్ వివరాలు ఇక్కడ చూడొచ్చు)

Apple - Steve Jobs introduces the iPhone  - 2007

ఇలా ఆపిల్ ని విజయపధం లో నడిపిస్తున్న స్టీవ్ జాబ్స్  జనవరి 2008 లో జరిగిన  Mac World  సమావేశాలలో లో  ఒక్కసారి గా  సన్నబడి పేలవం  గా కనిపించడం తో,  తన ఆరోగ్యం పైన మొదలైన అనేక రకాలైన రూమర్లు  తరవాత అదే సంవత్సరం జూన్ లో జరిగిన WWDC keynote తర్వాత మరింతగా ఊపందుకున్నాయి. Bloomberg ప్రెస్ ఏజెన్సీ ఆగష్టు లో పొరపాటున స్టీవ్ జాబ్స్ obituary ని పబ్లిష్ చేయటం ఈ రూమర్స్ కి  పరాకాష్ట . చివరికి  అదే సంవత్సరం  సెప్టెంబర్ 9 జరిగిన ఒక మ్యూజిక్ ఈవెంట్స్ లోను ,  అక్టోబర్ 14 న జరిగిన మీడియా ఈవెంట్ లోను స్టీవ్ తన ఆరోగ్యం గురించి మీడియా చేస్తున్న అతి ని ఖండించాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ అనుమానాలు నిజం అయ్యాయి.   2009 ఏప్రిల్ లో pancreas ప్రాబ్లం తిరగబెట్టటం తో  Methodist University Hospital , Memphis లో  స్టీవ్ కి లివర్ transplant ఆపరేషన్ జరిగింది. దీనితో  స్టీవ్,  2009లో ఒక్క సెప్టెంబర్ లో జరిగిన మ్యూజిక్ ఈవెంట్ కి అటెండ్ అవ్వడం తప్ప ,  దరిదాపు మిగిలిన  కాలం అంతా  పబ్లిక్ లైఫ్ కి దూరం గా గడిపాడు . అదే సమయం లో ఆపిల్ సీక్రెట్ device ని డిజైన్ చేస్తుంది అందుకే స్టీవ్ పబ్లిక్ లైఫ్ కి దూరం గా ఉన్నాడు అని రూమర్లు ఉండేవి . ఈ రూమర్లు ని నిజం చేస్తూ  27 జనవరి 2010 న  స్టీవ్ iPad రిలీజ్ ని అనౌన్స్ చేసాడు . iPhone తరవాత ఆపిల్ చేసిన అతి పెద్ద రిలీజ్ ఇది. నిరాశపూర్వకమైన అనలిస్ట్ ల అంచనాలని తలక్రిందులు చేస్తూ ఆపిల్ , iPad తో మార్కెట్ లో మరోసారి విజయం సాధించింది. సెప్టెంబర్ 2010 నాటికి మొత్తం 7.5 మిలియన్ల iPad లని సేల్ చేసి టాబ్లెట్ మార్కెట్ లో తన పట్టు ని నిరూపించుకుంది. (2010 లో iPad  ని రిలీజ్ చేసిన ఆపిల్ తరవాత కాలం లో చేసిన రిలీజ్స్ వివరాలు ఇక్కడ ). 
The future Apple spaceship campus
2010  లో  ఆపరేషన్ తరవాత  కొద్ది గా  మెరుగవుతునట్లు గా  కనిపించిన స్టీవ్ జాబ్స్ ఆరోగ్య పరిస్థితి  మళ్ళీ జనవరి 2011 లో మరోసారి ఇబ్బంది పెట్టడం మొదలైంది. దీనితో జనవరి 2011 లో స్టీవ్  మెడికల్ లీవ్ లో వెళుతున్నట్లు గా ప్రకటించాడు. తన ఆరోగ్యం గురించి రకరకాల ఊహాగానాలు నడుస్తున్న ఈ సమయం లో కూడా మార్చ్ 2011 లో iPad 2 రీలీజ్ చేయటం తో పాటు ,  జూన్ 2011 WWDCలో  iCloud  ని ఇంట్రడ్యూస్ చేసాడు. స్టీవ్ జాబ్స్ చివరి సారి అటెండ్ అయిన పబ్లిక్ ఈవెంట్  -   2011 , జూన్  లో ఆపిల్ ఫ్యూచర్ హెడ్క్వార్టర్స్ ప్లాన్ గురించి వివరించటానికి Cupertino సిటీ కౌన్సిలర్ ని కలవడం . ఆరోగ్య పరిస్టితి మరింత గా క్షీణించటం తో ఆగష్టు 24 2011 న,   ఆపిల్ CEO పదవి కి రిజైన్ చేసాడు (స్టీవ్ జాబ్స్ resignation లెటర్ ).
తన  కుటుంబం తో టూర్ చేయాలి అన్న ఉద్దేశ్యం తో తన చివరి రోజులని  దానికి కావాల్సిన బోట్ డిజైన్ చేస్తూ గడిపిన స్టీవ్ జాబ్స్  ఆ పనిని మాత్రం మధ్య లోనే వదిలి వెళ్ళాల్సి వచ్చింది .  అక్టోబర్  4 న iPhone 4S ని రిలీజ్  చేసిన ఆపిల్,  దురదృష్టవశాత్తు  ఆ తరవాత రోజునే అంటే అక్టోబర్ 5, 2011 న స్టీవ్ జాబ్స్ ఇక లేరు అన్న విషయాన్ని కూడా ప్రకటించాల్సి వచ్చింది . 
Statement by Apple’s Board of Directors
CUPERTINO, Calif.--(BUSINESS WIRE)-- We are deeply saddened to announce that Steve Jobs passed away today.
Steve’s brilliance, passion and energy were the source of countless innovations that enrich and improve all of our lives. The world is immeasurably better because of Steve.
His greatest love was for his wife, Laurene, and his family. Our hearts go out to them and to all who were touched by his extraordinary gifts.
Statement by Steve Jobs’ Family
PALO ALTO, Calif.--(BUSINESS WIRE)--Steve Jobs’ family today made the following statement regarding his death:
Steve died peacefully today surrounded by his family.
In his public life, Steve was known as a visionary; in his private life, he cherished his family. We are thankful to the many people who have shared their wishes and prayers during the last year of Steve’s illness; a website will be provided for those who wish to offer tributes and memories.
We are grateful for the support and kindness of those who share our feelings for Steve. We know many of you will mourn with us, and we ask that you respect our privacy during our time of grief.

Epilogue :

స్టీవ్ సక్సెస్ వెనక ఉన్న సూత్రం  "Keep it Simple". అలాగే తన కంపెనీ కి చెందిన  ప్రోడక్ట్ కి సంబంధించిన ప్రైమరీ టెక్నాలజీ తన కంపెనీ చేతి లోనే ఉండాలి అన్న పాలసీ.

డిజైన్ గురించి స్టీవ్ అభిప్రాయలు కొన్ని :

Design is not just what it looks like and feels like. Design is how it works.
-Steve Jobs
In most people's vocabularies, design means veneer. It's interior decorating. It's the fabric of the curtains of the sofa. But to me, nothing could be further from the meaning of design. Design is the fundamental soul of a human-made creation that ends up expressing itself in successive outer layers of the product or service.

-Steve Jobs

స్టీవ్ జాబ్స్ అంటే గిట్టని వాళ్ళు చేసే ప్రధానమైన  విమర్శ స్టీవ్ జాబ్స్ కనిపెట్టినది ఏమీ లేదు అని :

  నిజమే స్టీవ్ జాబ్స్ ఏదీ కనిపెట్టలేదు కానీ 
  • ఒక పది సంవత్సరాల కాలంలో , దరిదాపు bankruptcy అంచున ఉన్న కంపెనీ ని అత్యంత ప్రభావితం చేయగల హై ఎండ్ టెక్నాలజీ కంపెనీ గా మార్చిన ప్రతిభాశీలి. 
  • ప్రస్తుతం మనం ఉన్నది పోస్ట్ ఇండస్ట్రియల్ ఎరా లో . ఇప్పటి పరిస్తితులకి అనుగుణం గా , కొన్ని వందల మంది ఇంజనీర్స్ ని సరియైన దిశ లో నడిపిన నాయకుడు. 
  • స్వతహా గా తను ఇన్వెంటర్ కాకపోయినా, టెక్నాలజీ భవిష్యత్తు ని చూడగల విజినరీ . 
  • వీటన్నిటిని మించి టెక్నికల్ విషయాలని మామూలు మాటల్లో వివరించగల టెక్ జీనియస్. 
  • తనదైన ఒక ప్రత్యేకమైన ముద్ర తో కంప్యూటర్స్, మ్యూజిక్, మొబైల్, CGI రంగాల రూపు రేఖలనే మార్చేసిన లెజెండ్ .
ఇంకొక ప్రధాన విమర్శ చాలా చాలా డిమాండింగ్ బాస్ అని : దానికి సమాధానం స్టీవ్ మాటల్లోనే "See the result

స్టీవ్ జాబ్స్  కాంటెంపరరీ CEOs లో చాలా మంది తమకి రోల్ మోడల్ గా అంగీకరించే వ్యక్తి స్టీవ్  .

ఈ పై కారణాలు చాలవా ? స్టీవ్ జాబ్స్ ని అత్యంత ప్రతిభావంతుడైన ఐకానిక్ మోడల్ గా గుర్తించటానికి,  కొన్ని మిలియన్ల మంది ఫాన్స్ అవ్వడానికి  :-)

స్టీవ్ జాబ్స్ ఆత్మకథ ని రాసిన ISAACSON ఒకానొక ఇంటర్వ్యూ లో మీరు తయారు చేసిన ప్రోడక్ట్ అన్నిటిలోనూ ఇష్టమైన ప్రోడక్ట్ ఏంటీ? అని అడిగిన  ప్రశ్నకి, స్టీవ్ సమాధానం "Apple Company " అని. అత్యంత మాడ్యులర్ మోడల్ గా మారుతున్న టెక్నాలజీ ప్రపంచం లో closed ఆర్కిటెక్చర్ పాలసీ ని పాటిస్తున్న స్టీవ్ డ్రీం కంపెనీ ఆపిల్ భవిషత్తు ఏంటి అంటే కాలమే జవాబు చెప్పాలి.
80 లలో IBM , 90 లలో Microsoft , 2000 లలో Apple ఇలా  "Every Morning is a Fresh Morning"   అన్నట్లు ఉండే ఈ టెక్నాలజీ ప్రపంచం  లో భవిష్యత్తు లో టెక్నాలజీ రంగాన్ని శాసించబోయే కంపెనీ ఏదైనా స్టీవ్ జాబ్స్  flaw less  presentations, టెక్నాలజీ విజనరీ అయిన తన  ఆలోచనలు ఇంకా కొన్నేళ్ళ పాటు భవిష్యత్తు తరాలకి మార్గదర్శకం గా ఉంటాయి అన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ప్రతి టెక్నాలజీ  user ఇంకా కొన్నిసంవత్సరాల పాటు  తప్పక గుర్తుంచుకునే వ్యక్తి  స్టీవ్ జాబ్స్  అని భావిస్తూ తన మాటలతోనే ఈ సిరీస్ ని  ముగిస్తున్నాను.

Here’s to the crazy ones. The misfits. The rebels. The troublemakers. The round pegs in the square holes. The ones who see things differently. They’re not fond of rules. And they have no respect for the status quo. You can quote them, disagree with them, glorify or vilify them. About the only thing you can’t do is ignore them. Because they change things. They push the human race forward. While some may see them as the crazy ones, we see genius. Because the people who are crazy enough to think they can change the world, are the ones who do.

- Apple Inc
-శ్రావ్య 
(Images Source : Google Images )




Quick facts about Steve Jobs

Born
February 24, 1955, San Francisco

Died
October 5, 2011, Palo Alto (At the age of 56) 

Spouse
Children
Education
Monta Loma Elementary SchoolCupertino Junior High School,  Homestead High School (1972), Reed College,(Drop out)

Parents
Paul JobsClara Jobs, Joanne Carole (Adoptive ) 
Schieble, Abdulfattah John Jandali(Biological)

Siblings

స్టీవ్ జాబ్స్ వ్యక్తిగత ప్రతిష్ఠ  మసకబార్చిన అంశాలు

1.
2.

స్టీవ్  జాబ్స్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ ఫాక్ట్స్ :

1.
స్టీవ్ జాబ్స్ ని తలుచుకోగానే మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యే రూపం తన signature uniform అయిన బ్లూ జీన్స్, బ్లాక్ turtleneck లో కదా ? ఆపిల్ లో తన మొదటి టర్మ్ అంతా ఖరీదైన సూట్లలో కనిపించిన స్టీవ్, 1997 లో తిరిగి ఆపిల్ కి వచ్చిన తరవాత ఈ డ్రెస్ కోడ్ లో స్థిరపడి పోయాడు. బోర్డు మీటింగ్స్ కి కూడా ఇదే డ్రెస్ లో అటెండ్ అయిన స్టీవ్ ఒకానొక ఇంటర్వ్యూ లో దీనికి కారణం గా చెప్పిన సమాధానం ప్రతి రోజు డ్రెస్ సెలెక్ట్ చేసుకునే అవసరం ఉండదు అని . నిజానికి దానికి వెనక ఉన్న సీక్రెట్ ఇది.

2.
స్టీవ్ జాబ్స్ వెజిటేరియన్ . నిజానికి మొదటిసారి pancreas ప్రాబ్లం తో బాధ పడుతున్నపుడు తన స్పెషల్ డైట్ ఆ సమస్య ని క్యూర్ చేస్తుందని నమ్మాడు.

3.
ఈమెయిలు communication,ఆన్లైన్ కాన్ఫరెన్స్ లవంటి వాటికన్నాముఖాముఖీ సమావేశాలు మంచి ఫలితాలు ఇస్తాయని హై ఎండ్ టెక్నాలజీ కంపెనీ కి CEO అయిన స్టీవ్ జాబ్స్ నమ్మకం.




Wednesday, November 14, 2012

Steve Jobs(1955-2011) - 5/6


I remember sitting in his backyard in his garden one day and he started talking about God. He said, "Sometimes I believe in God, sometimes I don't. I think it's 50-50 maybe. But ever since I've had cancer, I've been thinking about it more. And I find myself believing a bit more. I kind of-- maybe it's 'cause I want to believe in an afterlife. That when you die, it doesn't just all disappear. The wisdom you've accumulated. Somehow it lives on. Then he paused for a second and he said 'yeah, but sometimes I think it's just like an on-off switch. Click and you're gone.' He said—and paused again, and he said, "And that's why I don't like putting on-off switches on Apple devices.

జనవరి 2000 లో సీఈఓ గా , స్టీవ్ జాబ్స్  పూర్తి స్థాయి  బాధ్యతలు చేపట్టిన తరవాత ఆపిల్ చేసిన రిలీజ్స్  లో Mac OS X  మొట్టమొదటి  అతి పెద్ద రిలీజ్. ఇది NEXTSTEP ఆధారితంగా డిజైన్ చేయబడిన మాక్ OS.  సెప్టెంబర్ 13 న  Mac OS X పబ్లిక్  బీటా వెర్షన్ ని (Kodak ) రిలీజ్ చేసిన యాపిల్  మార్చ్ 24 2001 న పూర్తి స్థాయి Mac OS X 10.0  (ఛీతా)  ని  రిలీజ్ చేసింది. ప్రస్తుతం (2012) నడుస్తున్న వెర్షన్  OS X 10.8 (Mountain Lion). మొదటి వెర్షన్ లో కొన్ని పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఎదుర్కొన్నప్పటికీ సాధారణం గా వాడే గ్రే కలర్  బదులు translucent కలర్స్ వాడటం,  angles  బదులు గా సర్కిల్స్ వాడటం వంటి  వాటితో  సరికొత్త గా తయారుచేసిన  User Interface (ఆక్వా) తో  మార్కెట్ లో మంచి గుర్తింపు పొందటమే  కాకుండా ఆపిల్ సక్సెస్ లో కీ రోల్ పోషించింది / పోషిస్తుంది.
1980 లలో  డేటాబేస్, spread sheet ప్రోగ్రాం లతోను, 1990 ల లో ఇంటర్నెట్ తోనూ  పెను మార్పులు సంతరించుకున్న పర్సనల్ కంప్యూటింగ్ రంగం లో,  2000 తోలి రోజుల్లో స్తబ్దత నెలకొంది. (దీనికి  dot-com bubble కూడా ఒక కారణం)అంతే కాకుండా ఇంటర్నెట్ సక్సెస్ చూసిన చాలా మంది experts  భవిష్యత్తు లో  పర్సనల్ కంప్యూటర్ కేవలం ఒక టెర్మినల్ device గా మారిపోతుంది అని అభిప్రాయపడ్డారు. కానీ visionary అయిన  స్టీవ్ జాబ్స్ ఆలోచన  దీనికి భిన్నం గా ఉంది.  ఆ ఆలోచనే 2000 సంవత్సరం లో మొదలై  2001సంవత్సరంలో మాక్ వరల్డ్ San  Francisco లో పరిచయం చేసిన  Digital Hub గా రూపుదిద్దుకుని  పర్సనల్ కంప్యూటర్ భవిష్యత్తు ఏమిటి అనే దానికి  సమాధానమయ్యింది. PDAs , DVD వీడియో ప్లేయర్స్ , డిజిటల్ కామెరాస్, వీడియో కామెరాస్,  పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్స్ వంటి డిజిటల్ devices ని మాక్ కి కనెక్ట్ చేసి డిజిటల్ ఫైల్స్ ని షేర్ చేయటం ద్వారా టెక్స్ట్, ఇమేజెస్,  వీడియో, సౌండ్ mix చేయగలిగే సౌకర్యం కలిగించటం అనేది ఈ Digital Hub వెనక ఉన్న ఐడియా. నిజానికి ఈ Digital Hub ప్రధాన ఉద్దేశ్యం  విపరీతమైన పోటీ ఉన్న PC మార్కెట్ లో ఆపిల్ షేర్ ని పెంచుకోవటం, ఈ కాన్సెప్ట్ విజయవంతం కావటం తో  స్టీవ్  ఉద్దేశ్యం నేరవేరింది.
కస్టమర్స్ కి దగ్గర కావాలి అన్న ప్రయత్నంలో భాగంగా  1991 మే 15 న ఆపిల్ తన మొదటి రిటైల్ స్టోర్ ని ప్రారంభించింది. designing అంటే అత్యంత శ్రద్ద చూపించే స్టీవ్ జాబ్స్ ఆధ్వర్యం లో ఈ రిటైల్ స్టోర్స్  ఇన్నోవేటివ్ ఇంటీరియర్స్, జీనియస్ బార్ ఇంకా personalized selling approach, కస్టమర్స్ డైరెక్ట్ గా ఆపిల్ devices ని వాడి చూసే అవకాశం ఉండటం తో సహజం గానే Darlings of the retail computer industry గా మారాయి. సంవత్సరానికి సుమారుగా 75 మిలియన్ల మందిని,ఈ ఆపిల్ రిటైల్ స్టోర్స్ ఆకర్షిస్తున్నాయి అని అంచనా.
డిజిటల్ లైఫ్ స్టైల్ లో భాగం గా అప్పటికే మార్కెట్ లో ఉన్న డిజిటల్ కామెరా, camcorder లాగా ఒక మంచి compelling product ఏదీ డిజిటల్ మ్యూజిక్ ప్లేయర్ రంగం లో లేకపోవటం స్టీవ్ జాబ్స్ దృష్టిని ఆకర్షించింది. దానితో  iPod(i is common Apple's prefix , pod stands for portable open database - the name of software that runs iPod)  విడుదల కి రంగం  సిద్దం  అయ్యింది. కేవలం 9 నెలల  కాలం లో రూపుదిద్దుకున్న iPod ని మొదటిసారిగా అక్టోబర్ 2001 (హాలిడే సీజన్) లో విడుదల చేసారు . నిజానికి మొదట్లో  అది కేవలం  సెప్టెంబర్ 11 ట్విన్ టవర్స్  అటాక్స్ జరిగిన ఆరు వారాల వ్యవధి లోనే కావటం తో ఇంకా అదే షాక్ లో ఉన్న  ప్రజలని అంతగా ఆకట్టు కోలేదు. కానీ క్రమేపీ విండోస్ మెషిన్ తోకూడా చాలా ఈజీ గా మ్యూజిక్ ని ఈ  ప్లేయర్ లోకి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండటం,  gorgeous లుక్, బటన్స్ లాంటివి ఏవీ లేకుండా చిన్న వీల్ తో కావాల్సిన విధం గా మ్యూజిక్ ని కంట్రోల్ చేసే అవకాశం, "a thousand songs in your pocket" అన్న ఆపిల్ ట్యాగ్ లైన్ iPod సూపర్ హిట్ కావటానికి దోహదం చేసాయి.  నిజానికి iPod సక్సెస్ iMac సేల్స్ ని పెంచింది .  ఇలా మ్యూజిక్ రంగం లోకి అడుగు పెట్టిన ఆపిల్ తరవాత కాలం లో మ్యూజిక్ పైరసీ ని ఆపేందుకు , లీగల్ సొల్యూషన్  కనుక్కునే ప్రయత్నం లో ఆన్లైన్ మ్యూజిక్ స్టోర్ దిశ గా అడుగులు వేసింది.  స్టీవ్ జాబ్స్ తన కున్న negotiation స్కిల్స్ తో మ్యూజిక్ కంపెనీలని దీనికి ఒప్పించటం లో  సఫలం అయ్యాడు.28 ఏప్రిల్ 2003 న  ఇలా మొదలైన  iTunes  మ్యూజిక్ స్టోర్ Wal-Mart తరవాత అతి పెద్ద మ్యూజిక్ రిటైల్ స్టోర్ గా మారింది. 2008 నాటికి ఆపిల్ రెవిన్యూ లో సగభాగం iPod, iTunes మ్యూజిక్ స్టోర్ సేల్స్ దే. అంతే కాకుండా  2011 లో స్టీవ్ జాబ్స్ కి మ్యూజిక్ రంగం లో  విశిష్ట  కృషి చేసిన వారికి ఇచ్చే ప్రతిష్ఠాకరమైన Grammy అవార్డు సంపాదించి పెట్టడం తో పాటు జాబ్స్ కిష్టమైన బీటిల్స్ మ్యూజిక్ ని తన జీవిత కాలం లో iTunes స్టోర్ అందించే సౌకర్యాన్ని కల్పించింది . 
(తరవాత కాలం లో ఆపిల్ విడుదల చేసిన iPod వివరాలు ఇక్కడ చూడొచ్చు .)

Apple - Steve Jobs introduces the ipod - 2001

ఇలా ఆపిల్ సక్సెస్ బాట లో సాగిపోతున్న సమయం లో 2003 స్టీవ్ జాబ్స్ ని తిరిగి ఒడిదుడుకులకి గురిచేసింది. అక్టోబర్ 2003 లో రొటీన్ గా abdominal స్కాన్ అటెండ్ అయిన సమయం లో డాక్టర్స్ pancreas లో ట్యూమర్ ఉంది అని గమనించారు. సర్జరీ చేసి ట్యూమర్ తొలిగిస్తే పది సంవత్సరాల వరకు ఎటువంటి ప్రమాదం ఉండదు అన్న డాక్టర్ల మాటలని పట్టించుకోని స్టీవ్, తన స్పెషల్ డైట్ తో క్యూర్ అవుతుంది అన్న నమ్మకం తో అలాగే 9 నెలల కాలం గడిపేసాడు. ఇలా దాదాపు తొమ్మిది నెలలు గడిచాకా కుటుంబసభ్యులు, ఆపిల్ టాప్ management నుంచి వస్తున్న తీవ్రమైన ఒత్తిడి , అలాగే తన ఆరోగ్యపరిస్థితి ఏ మాత్రం సరిగా కాకపోవడం తో సర్జరీ కి ఒప్పుకున్నాడు. ఆగష్టు 2004 లో స్టాన్ఫోర్డ్ మెడికల్ సెంటర్ లో ఈ ఆపరేషన్ జరిగిన అనంతరం, స్టీవ్ ఆరోగ్య విషయం న్యూస్ పేపర్స్ ద్వారా ఆపిల్ ఎంప్లాయిస్ కి, అలాగే స్టాక్ హోల్డర్స్ తో పాటు ప్రపంచానికి తెలిసింది. దీనితో షాక్ కి గురైన షేర్ హోల్డర్స్ ఈ పరిస్థితి ముందే తెలియజేయాల్సింది అని వాదించినప్పటికీ, చాల మంది లాయర్లు అలా తెలియజేయటం అన్నది తప్పనిసరి కాదు, అలాగే అది స్టీవ్ జాబ్స్ కున్న "right to protect privacy" గా అభిప్రాయపడటంతో ఆ వివాదం ముగిసింది.

స్టీవ్ జాబ్స్ మాటల్లో తన ఆరోగ్య పరిస్థితి :
About a year ago I was diagnosed with cancer. I had a scan at 7:30 in the morning, and it clearly showed a tumor on my pancreas. I didn't even know what a pancreas was. The doctors told me this was almost certainly a type of cancer that is incurable, and that I should expect to live no longer than three to six months. My doctor advised me to go home and get my affairs in order, which is doctor's code for prepare to die. It means to try to tell your kids everything you thought you'd have the next 10 years to tell them in just a few months. It means to make sure everything is buttoned up so that it will be as easy as possible for your family. It means to say your goodbyes.

I lived with that diagnosis all day. Later that evening I had a biopsy, where they stuck an endoscope down my throat, through my stomach and into my intestines, put a needle into my pancreas and got a few cells from the tumor. I was sedated, but my wife, who was there, told me that when they viewed the cells under a microscope the doctors started crying because it turned out to be a very rare form of pancreatic cancer that is curable with surgery. I had the surgery and I'm fine now.
Steve Jobs, Stanford Commencement Address, 2005

రికవర్ అవ్వడానికి ఒక నెల రోజుల పాటు సెలవు లో ఉన్న స్టీవ్, అదే సంవత్సరం (2003)  సెప్టెంబర్ లో తిరిగి తన బాధ్యతల్ని చేపట్టాడు. 
2003 - 2006 మధ్య కాలం లో ఆపిల్ తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు :
  • 2002 లో ఎడ్యుకేషన్ మార్కెట్ కోసం  రిలీజ్ చేసిన eMac (cheaper version of iMac ) ని discontinue  చేసి, అదే అవసరాలు తీర్చటం కోసం Mac Mini ని 2005 లో రిలీజ్ చేయడం.
  • జూన్ 2005 లోజరిగిన Apple's Annual Conference (WWDC ) లో భవిష్యత్తు లో IBM processors  బదులు Intel processors కి  స్విచ్ అవుతున్న నిర్ణయాన్ని ప్రకటించడం. 
  • 2006 లో Cupertino లో ఆపిల్ తన రెండవ కాంపస్ ని నిర్మించాలి అన్న నిర్ణయాన్ని ప్రకటించడం .
మరి 2006 తరవాత ఏమి జరిగింది ? అది వచ్చే భాగం లో :-)

- శ్రావ్య
  
No one wants to die. Even people who want to go to heaven don't want to die to get there. And yet, death is the destination we all share. No one has ever escaped it, and that is how it should be, because death is very likely the single best invention of life. It's life's change agent. It clears out the old to make way for the new.







Steve Jobs, Stanford Commencement Address, 2005

(Images Source : Google Images) 

Recommendations 
Steve Jobs introduces the "Digital Hub" strategy at Macworld 2001
Macworld New York 2001-The Apple Retail Store Introduction

Saturday, November 3, 2012

Steve Jobs(1955-2011) - 4/6


I’ll always stay connected with Apple. I hope that throughout my life I’ll sort of have the thread of my life and the thread of Apple weave in and out of each other, like a tapestry. There may be a few years when I’m not there, but I’ll always come back.
- Steve Jobs in 1985 (Source)
స్టీవ్ జాబ్స్ 1997 సెప్టెంబర్ లో తిరిగి ఆపిల్ iCEO గా కుపర్టినో  కి తిరిగి ఎలా వచ్చాడో  తెలుసుకోవాలి అంటే అసలు స్టీవ్,  ఆపిల్ ని వదిలి వెళ్ళాక అక్కడ ఏమి జరిగింది అనేది మనకి తెలియాలి కదా ? అందుకే అసలు ఏమి జరిగింది అనేది  ఒక్కసారి  చూద్దాం. 1985  సెప్టెంబర్  లో స్టీవ్ జాబ్స్ ఆపిల్ ని వదిలేశాక  John Sculley ఆపిల్ ని లాభాల బాట పట్టించటానికి చేపట్టిన  చర్యలలో  కొన్ని ముఖ్యమైనవి  ఇవి.   
  •  ఆపిల్ మాక్ ని  Laser Writer తో integrate   చేయటం  
  •  మాక్ స్పెసిఫిక్   Mac Publisher , Aldus PageMaker   DTP   softwares  రూపొందించటం.
  •  128  KB  మాక్ ని 512 KB  కి  upgrade  చేయటం.
  •  1986 జనవరి  విడుదల చేసిన  1 MB మాక్ ప్లస్ . 
దీనితో కొద్ది కాలం ఆపిల్ లాభాల బాటలోనే  నడిచింది.  నిజానికి  1986 నుంచి 1995 మధ్య కాలం లో GUI  ఇంకా  DTP టెక్నాలజీ  రంగాలలో ఆపిల్  తన మొనోపలీ ని  నిలబెట్టుకుంది.  

కానీ 1990  లో విండోస్ 3.0  ని  విడుదల చేసిన  మైక్రోసాఫ్ట్  ఆపిల్ కి గట్టి పోటీ ని ఇచ్చి ఆపిల్  డౌన్ ఫాల్ కి  తెరతీస్తే,  ఇక  1995 లో మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన  విండోస్ 95 విజయం ఆపిల్ ని కోలుకోలేని దెబ్బ తీసింది.   1994 లో  సుప్రీమ్ కోర్ట్ లో ఆపిల్ , మైక్రోసాఫ్ట్ కి వ్యతిరేకం గా  వేసిన sue  లో ఓడిపోవటంతో, GUI  సాఫ్ట్వేర్  డెవలప్మెంట్ లో  మైక్రోసాఫ్ట్ ని అడ్డుకునే అవకాశంని కోల్పోయింది . ఇక  సాఫ్ట్వేర్ జైంట్ గా ఎదిగిన మైక్రోసాఫ్ట్  విడుదల చేసిన  విండోస్95   అతి తక్కువ ధర కి  మార్కెట్ లో  దొరికే ప్రతి PC   తోనూ   DTP  సదుపాయాన్ని  వాడుకొనే  అవకాశం  కల్పించటం తో  మార్కెట్ లో   మాక్ సేల్స్  పడిపోవటం తో మొదలైన   ఆపిల్ పతనం, దాని తరవాత  Newton,  Performa, Power  macintosh , Power  book  లాంటి  అనేక  ప్రాజెక్ట్స్  ని  సకాలం లో  పూర్తి    చేయలేకపోవటం తో   మరింత  దిగజారింది . 1993  లో ఆపిల్ పగ్గాలు పట్టుకున్న   Michael  Spindler, కానీ  1996 లో  Gil Amelio   కానీ  ఈ పరిస్తితుల్ని ఏ  మాత్రం  సరిద్దిద్దలేకపోయారు.  ఇదే  సమయం లో మాక్   OS  తయారు చేసే  ఉద్దేశ్యం  తో  మొదలైన  ఆపిల్  ఇంటర్నల్  ప్రాజెక్ట్   అయిన  "Copland"  ఫెయిల్ అయ్యింది. దీనితో  BeOS , లేదా  NextStep  లను  కానీ  మాక్  OS   కోసం  కొనుగోలు  చేయాలి  అన్న  ఆలోచనతో  ఉన్న ఆపిల్ మానేజెమెంట్  అనూహ్యం గా  NextStep  వైపు  మొగ్గడం తో  స్టీవ్ జాబ్స్  తిరిగి  యాపిల్  కి  రావటానికి దారి సుగమం  అయ్యింది .  (ఈ Nextstep  తరవాత కాలం లో Mac  OS   గా రూపుదిద్దుకుంది ). 


1997   ఫిబ్రవరి లో ఆపిల్ 429  మిలియన్  డాలర్ల కి Next  కంపెనీ ని  కొన్నది.  ఈ డీల్ లోభాగం గా  స్టీవ్ జాబ్స్  కి 1.5 మిలియన్  డాలర్ల  ఆపిల్  షేర్స్  allot  అవ్వడం తో పాటు గా అప్పటి CEO, Gil Amelio కి అడ్వైజర్ గా నియమించబడ్డాడు.  1997 మొదటి  క్వార్టర్ లో వచ్చిన నష్టం 700 మిలియన్  డాలర్లు గా అంచనా  వేసిన   ఆపిల్  మానేజ్మెంట్ , 1996 నుంచి 1997  వరకు Gil Amelio  ఆధ్వర్యం లో  మొత్తం నష్టం 1 బిలియన్ డాలర్లు గా   గుర్తించింది.  దానితో  పాటు  ఆపిల్ ని  ఈ  పరిస్తితుల నుంచి  రక్షించటానికి  GIl  Amelio   చేపట్టిన  కాస్ట్ కటింగ్   వంటి చర్యలు ఏ మాత్రం సానుకూల ఫలితాలని  ఇవ్వక పోవడం తో అదే  సంవత్సరం  (1997) సెప్టెంబర్ లో Gil  Amelio  ని  CEO  గా తొలిగించి స్టీవ్ జాబ్స్ ని ఇంటరిమ్ CEO  గా నియమించాలి  అన్న నిర్ణయానికి   వచ్చారు.     

ఇలా సరిగ్గా 13  సంవత్సరాల తరవాత రెండో సారి స్టీవ్ జాబ్స్ ఆపిల్ పగ్గాలు చేపట్టేనాటికి bankruptcy ప్రకటించటానికి  కేవలం 90 రోజుల దూరం లో ఉన్న ఆపిల్ కంప్యూటర్స్  కంపెనీ  విలువ   4 బిలియన్  డాలర్లు (2012 లో  apple   విలువ సుమారు  600  బిలియన్ డాలర్లు ) .  ఇలాంటి   పరిస్తితులలో  iCEO గా  బాధ్యతలు   చేపట్టిన స్టీవ్  జాబ్స్ ఆపిల్  పరిస్తితిని  సరిదిద్దటానికి   తనదైన  పద్దతి లో పని చేయటం ప్రారంభించాడు,  అన్నిటి కన్నా  ముందు గా  తన జీతాన్ని  ఒక్క   డాలర్  గా  నిర్ణయించుకున్నాడు .   2011 లో రిజైన్ చేసే వరకూ కూడా  ఇదే కొనసాగింది. 

ఆపిల్  మార్కెట్ లో కోల్పోయిన  ప్రతిష్టని, నమ్మకాన్ని  తిరిగి gain  చేసే ప్రయత్నం లో  భాగంగా  1997 సెప్టెంబర్   28 న  "Think  Different " అన్న  TV కమర్షియల్  కాంపైన్  తో  తన  పనిని మొదలు పెట్టాడు. ఈ కాంపైన్  అంచనాలకి  మించి విజయం  సాధించి  తరవాత కాలం లో  "Think  Different " అనేది   ఆపిల్  స్లోగన్ గా నిలిచిపోయింది.   ఆ   కమర్షియల్ కి  సంబంధించిన    వీడియో ఇక్కడ  చూడొచ్చు.  (దీని ప్రభావం  తో pro mac సేల్స్  ఊపందుకుని  1997 చివరి క్వార్టర్ లో ఆపిల్ 45 మిలియన్ డాలర్ల  లాభాలని చూసింది).  ఇదే  క్రమం లో   ఆపిల్  కి  తలనొప్పి గా మారిన   పేటెంట్  లా సూట్  మూలం గా   మైక్రోసాఫ్ట్  తో  ఏర్పడిన అనేక వివాదాలు  పరిష్కరించే  దిశ  గా   స్టీవ్ జాబ్స్  తన  ప్రయత్నాలు  మొదలు పెట్టాడు. ఆ  ప్రయత్నాల  ఫలితం గానే   1997 లో  వివాదాలకి  ముగింపు  పలికేందుకు   ఒక  అంగీకారానికి వచ్చేలా   బిల్ గేట్స్ ని ఒప్పించగలిగాడు . ఆ డీల్ లో  బాగం గా  మైక్రోసాఫ్ట్ మాక్ కోసం ఆఫీస్ సూట్ సాఫ్ట్వేర్  తయారు చేసేట్లు గాను,  దానికి  ప్రతి గా  మాక్ లో  internet explorer ని  డిఫాల్ట్  బ్రౌజరు గా 5 సంవత్సరాలు  కొనసాగించేట్లు గాను, మైక్రోసాఫ్ట్ ఆపిల్ లో 150 మిలియన్ డాలర్ల  ని non -voting షేర్ల  రూపం లో పెట్టుబడి  పెట్టేట్లు గాను నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ప్రకారమే  1998 నుంచి 2003  వరకు మాక్ లో డిఫాల్ట్  బ్రౌజరు గా  internet explorer  ఉండేది, ఆ తరవాత కాలం లో  ఆపిల్  స్వంత బ్రౌజరు సఫారి ని  విడుదల  చేసారు . 

Macworld Boston 1997-The Microsoft Deal 



ఇలా మార్కెట్ లో కంపెనీ ప్రతిష్ఠ  పెంచే ప్రయత్నాలతో పాటే, స్టీవ్ ఆపిల్ అంతర్గత సమస్యలని పరిష్కరించే పనిలో పడ్డాడు. దానిలో భాగంగా ఆపిల్ లో నడుస్తున్న ప్రతి ఒక్క ప్రాజెక్ట్ సంబంధించిన వివరాలను ఆ టీం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసాడు . ప్రతి ఒక్క టీం , స్టీవ్ జాబ్స్ ని కాన్ఫరెన్స్ రూమ్ లో కలిసి వివరాలు చెప్పి అది కంపెనీ భవిష్యత్తుకి ఎందుకు ఉపయోగమో కన్విన్స్ చేయాల్సిన భాద్యత ఉండేది. (ఆపిల్ ఆఫీస్ ఎలివేటర్ లో ఉన్న సమయం లో కూడా ఎంప్లాయిస్ ని ఫైర్ చేసే అవకాశం ఉంది అన్న రూమర్లు ఉండేవి, దానితో స్టీవ్ తో పాటు ఎలివేటర్లో ప్రయాణం చేయటానికి కూడా ఆపిల్ ఎంప్లాయిస్ భయపడేవారు) ఇలా క్షుణ్ణంగా వివరాలు తెలుసుకున్న తరవాత ఎటువంటి సెంటిమెంట్లు లేకుండా వివిధ దశల్లో ఉన్న మొత్తం  300  ఆపిల్  ప్రాజెక్ట్స్  ని  10   ప్రాజెక్ట్స్  కి తగ్గించాడు. దీన్ని గురించి స్టీవ్ మాటల్లో :
"And I started to ask people," he continued, "why would I recommend a 3400 over a 4400? Or when should somebody jump up to a 6500, but not a 7300? And after three weeks, I couldn't figure this out. And I figured if I can't figure it out working inside Apple with all these experts telling me in three weeks, how are customers ever going to figure this out?"
     -Steve Jobs (at 1998's Worldwide Developers Conference)

iMac 
ఆపిల్ లో కొనసాగించాలి అని నిర్ణయించిన 10 ప్రాజెక్ట్స్ లో ముఖ్యమైనది NC మెషిన్ (Network Computer) అనేది చాల ముఖ్యమైంది. దీని ఆధారంగా iMac ని రూపొందించాలి అని నిర్ణయం తీసుకున్నారు (i stands for internet ). iMac రూపు రేఖలని డిజైన్ చేసిన Jonathan Ive ని తరవాత కాలం లో ఆపిల్ ఇండస్ట్రియల్ డిజైన్ టీం కి హెడ్ గా నియమించారు. iMac USB connectivity తో డిజైన్ చేయబడిన మొట్ట మొదటి మెయిన్స్ట్రీం కంప్యూటర్. అలాగే స్టీవ్ కి ఫ్లాపీ డిస్క్ అంటే ఉన్నఅయిష్టం మూలంగా ఫ్లాపీ డ్రైవ్ లేకుండా డిజైన్ చేయబడిన మొట్ట మొదటి కంప్యూటర్. వీటన్నిటికి మించి iMac బ్లూ / గ్రీన్ రంగులలో డిజైన్ చేయబడిన translucent, round machine అవ్వడం తో అప్పటి వరకు వచ్చిన కంప్యూటర్స్ తో పోల్చితే డిఫరెంట్ డిజైన్ తో మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది . ఇన్ని ప్రత్యేకతలు ఉన్న iMac ని, 14 సంవత్సరాల క్రిత్రం ఎక్కడైతే మొట్టమొదటి మాక్ ని unveil చేసాడో అదే Flint Center auditorium, Cupertino లో మే 6, 1998 న unveil చేసాడు (ఆ వీడియో ని ఇక్కడ చూడొచ్చు) . iMac రెండు సంవత్సరాల కాలం లో రెండు మిలియన్ల యూనిట్ అమ్ముడు అయ్యి, ఆపిల్ ప్రొడక్ట్స్ లో ఒక అతి పెద్ద హిట్ అయిన ప్రోడక్ట్ గా నిలిచిపోయింది. 1980 లో మొదటిసారి గా ఆపిల్ పబ్లిక్ ఇష్యూ కి వెళ్ళినప్పుడు యాపిల్ కి, దానితో పాటు తనకి వచ్చినంత క్రేజ్ ని, కీర్తి ప్రతిష్ఠలని 1998 లో తిరిగి అదే స్థాయి లో పొందగలిగాడు. ఇలా మూడు సంవత్సరాల పాటు విజయవంతం గా ఆపిల్ ని లాభాల బాట లో నడిపిన తరవాత జనవరి 5 , 2000 కీనోట్ అడ్రస్ సమయం లో ఇంటరిమ్ సీఈఓ నుండి ఫుల్ టైం సీఈఓ గా మారాడు .

Macworld San Francisco 2000-Steve Jobs Becomes iCEO of Apple




Why Steve didn't like Switches ?   Wait wait  until next  part :-)
- శ్రావ్య