Subscribe:

Friday, December 28, 2012

రతన్ నావల్ టాటా



I do not know how history will judge me, but let me say that I’ve spent a lot of time and energy trying to transform the Tatas from a patriarchal concern to an institutional enterprise. It would, therefore, be a mark of failure on my part if it were perceived that Ratan Tata epitomizes the Group’s success. What I have done is establish growth mechanisms, play down individuals and play up the team that has made the companies what they are. I, for one, am not the kind who loves dwelling on the ‘I’. If history remembers me at all, I hope it will be for this transformation.

- Ratan Tata

2012 డిసెంబర్ లో యుగాంతం కాలేదు కానీ, భారతదేశపు పారిశ్రామిక రంగంలో మాత్రం ఒక శకం ముగుస్తోంది. 1991 నుంచి అంటే 21 సంవత్సరాల పాటు టాటా గ్రూప్ ని విజయపథంలో నడిపిన రతన్ నావల్ టాటా (రతన్ టాటా)  75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో, ఈరోజు (28/12/2012) చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. వంటింట్లో ఉండే ఉప్పు, పంచదారల నుంచి ఆకాశం లో ఎగిరే విమానాల  తయారీ లో వాడే స్టీల్ వరకు, ప్రధానమైన ఏడు బిజినెస్ సెక్టార్స్ లో  (Communications & Information Technology, Engineering, Materials, Services, Energy, Consumer products and Chemicals)  దరిదాపు 85 దేశాలలో,  100 కు పైగా కంపెనీలతో,  సుమారు 100 బిలియన్ US డాలర్ల పైగా బిజినెస్ చేసే  ఈ పారిశ్రామిక దిగ్గజం గురించి నేను కొత్తగా  పరిచయం చేయనక్కర్లేదు. కానీ అత్యంత successful గా తన tenure ని పూర్తి చేసుకున్న, this iconic man  deserves resepect, love, affection and recognition from every individual Indian అని నా అభిప్రాయం,  అందుకే కొండని అద్దంలో చూపించే ఈ చిన్న ప్రయత్నం.

రతన్ టాటా JRD టాటా మునిమనవడు. రతన్  టాటా వ్యక్తిగతజీవితం గురించి పబ్లిక్ డొమైన్ లో తెలిసింది చాలా తక్కువ.  ఆ కొద్దిపాటి వివరాల ప్రకారం బోంబే ప్రెసిడెన్సీకి చెందిన ఒక పార్సీ కుటుంబం లో 1937 డిసెంబర్  28 న  జన్మించిన రతన్ టాటా బాల్యం అంత సాఫీగా గడవలేదు. రతన్ నావెల్ టాటా తల్లిదండ్రులు నావెల్ H టాటా & సూనూనావెల్ H టాటాని  JRD టాటా చిన్నకొడుకు వారికి పిల్లలు లేకపోవటం తో  దత్తత తీసుకున్నారు .  రతన్ టాటా వయస్సు 7 ఏళ్ళు, ఆయన తమ్ముడు జిమ్మీ వయస్సు 5 ఏళ్ళు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు, అప్పటి నుంచి నాయనమ్మ నవాజ్ భాయ్ పెంచి పెద్ద చేసారు.  ఆ తరవాతి కాలంలో నావెల్ H టాటా వేరే వివాహం చేసుకున్నారు ఆ వివాహం ద్వారా కలిగిన సంతానం నోయెల్ టాటా (ప్రస్తుత Trent Ltd  వైస్ చైర్మన్ & టాటా ఇంటర్నేషనల్ డైరెక్టర్ ). 

Campion స్కూల్ (అప్పటి బొంబాయి ఇప్పటి ముంబై ),  బిషప్ కాటన్ స్కూల్ సిమ్లా,  Cathedral  & Jhon Connon స్కూల్ ముంబై లలో తన స్కూలింగ్ పూర్తిచేసిన రతన్ టాటా ,  1962 లో Cornell University నుంచి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయ్యారు. గ్రాడ్యుయేట్ అయిన వెంటనే JRD టాటా సలహా మేరకు జెంషెడ్ పూర్ లోని టాటా స్టీల్ లో ఒక సాధారణ బ్లూ కాలర్ ఉద్యోగి గా చేరారు . ఆ తరవాత 1971 లో అప్పట్లో  ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కుంటున్న NELCo  (National Radio & Electronics Company) లో Director in-charge  గా బాధ్యతలు తీసుకున్నారు.  40% నష్టాలు, 2% మార్కెట్ వాటా తో కష్టాలలో ఉన్న NELCo ని మూడు సంవత్సరాలలో అంటే 1975 నాటికి,  2% నష్టాలు, 25% శాతం మార్కెట్ వాటా ఉన్న కంపెనీ గా మార్చగలిగారు. కానీ తరవాతి కాలం లో దేశం లోని ఎమర్జెన్సీ మూలం గా వచ్చిన ఎకనామిక్ రిసెషన్, యూనియన్ బందులు వీటి ప్రభావం తో లాకౌట్ ప్రకటించారు. 1981 లో డైరెక్టర్, టాటా  ఇండస్ట్రీస్ గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా  మరోసారి 1986 లో Empress మిల్స్ విషయం లో ఇటువంటి చేదు  అనుభవాన్ని చూసారు. ఈ చేదు అనుభవాలతో 1991 లో,  లెజెండరీ పారిశ్రామికవేత్త అయిన  JRD టాటా వారసుడిగా టాటా ఇండస్ట్రీస్ చైర్మన్ పదవీబాధ్యతలు స్వీకరించే సమయంలో కొద్దిపాటి విమర్శల్ని ఎదుర్కొవాల్సి వచ్చింది.  

1991 లో  టాటా ఇండస్ట్రీస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరవాత అప్పటి వరకు ఫ్యామిలీ బిజినెస్ గా ఉన్న టాటా గ్రూప్ ముఖచిత్రాన్ని  అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థగా మార్చారు (ప్రస్తుత టాటా గ్రూప్ ఆదాయంలో  48 %  ఇండియా వెలుపలి నుంచి వచ్చేదే).  

ఈ ప్రయాణంలో సాధించిన కొన్ని విజయాలు :
1.యంగ్ మానేజర్స్ కి   ప్రాధాన్యతనివ్వటానికి రతన్ టాటా చేపట్టిన చర్యలు ముందుతరం వారినుంచి కొద్ది పాటి విమర్శలు ఎదుర్కునప్పటికీ ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో టాటా గ్రూప్ అతి పెద్ద బిజినెస్ హౌస్ గా ఎదగటానికి ఉపయోగపడ్డాయి.
2. TCS పబ్లిక్ ఇష్యూ కి వెళ్ళటంతో పాటు అతి పెద్ద ఇండియన్ బేస్డ్ , మల్టీనేషనల్ IT సంస్థ గా ఎదిగింది. 
3. టాటా మోటార్స్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజి లో లిస్టు అయ్యింది.
4. 2007 లో 11.6 బిలియన్ US డాలర్ల డీల్ తో, ఆంగ్లో డచ్ కంపనీ అయిన Corus ని టాటా స్టీల్ తో చేసిన  విలీనం టాటా స్టీల్ ని ప్రపంచం లోని 5వ అతిపెద్ద స్టీల్ కంపెనీ గా మార్చడంతో పాటు రతన్ టాటా కు బిజినెస్ సెలబ్రిటీ గుర్తింపు తెచ్చింది.
5. 2008 లో జాగ్వర్ ల్యాండ్ రోవర్ ని టాటా మోటార్స్ లో విలీనం చేయడం.
6. వీటన్నిటికి మించి తరతరాల నుంచి  టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనస్సులో నిలపటం లో 100 శాతం విజయాన్ని సాదించారు.
అంతర్జాతీయం గా ఇన్ని విజయాలు సాదించిన టాటా గ్రూప్ కి స్వదేశం లో మాత్రం నానో కార్ల ప్రాజెక్ట్ ని వెస్ట్ బెంగాల్ నుంచి గుజరాత్ కి మార్చాల్సి రావటం వంటి కొన్నిచికాకులు ఎదుర్కోవాల్సి వచ్చింది .


లభించిన కొన్ని గుర్తింపులు :
1.2008 లో "టైం మాగజైన్" ప్రకటించిన  100  World's most influential people లో ఒకరు గా నిలిచారు.
2.భారత ప్రభుత్వం నుంచి 2000 సంవత్సరం లో పద్మభూషణ్,  2008 లో పద్మవిభూషణ్ అవార్డ్ ని అందుకున్నారు .
3.2007 లో రతన్ టాటా ను  "Fortune" పత్రిక ప్రకటించిన  25 most influential business people లో ఒకరు గా గుర్తించింది.
4.2008 లో  "Forbes "  పత్రిక  తాజ్ హోటల్ పై జరిగిన దాడుల తరవాత స్పందించిన తీరుతో రతన్ టాటాని, India 's  most respected business leader గా కొనియాడింది(రాజకీయ రంగం లో అడుగుపెట్టాల్సింది గా అభిప్రాయపడింది).
5.2008 లో సింగపూర్ గవర్నమెంట్ Honorary Citizenship  తో సత్కరించింది. రతన్ టాటా ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు.
6.2009 లో honorary  Knight Commander of British Empire గా నియమించబడ్డారు.
7.బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో Ohio State University నుంచి, టెక్నాలజీ రంగం లో Asian Institute of Technology నుంచి, సైన్స్ లో Warwick university నుంచి గౌరవడాక్టరేట్లతో పాటు  , London School of Economics నుంచి Honorary fellowship ని అందుకున్నారు.


ఇన్ని విజయాలు సాధించి, 100 బిలియన్ డాలర్ల కి పైగా వ్యాపారం చేస్తున్న సంస్థలకి అధిపతి అయినా,  ఈయన lifestyle మాత్రం చాలా సింపుల్.  సెల్ఫ్ డ్రైవింగ్ లో వర్క్ ప్లేస్ కి వెళ్ళడం చాలా సాధారణమైన విషయం. ఇప్పటి వరకు  పుస్తకాలు, CD లతో నిండివుండే  సౌత్ ముంబై లోని  బాచలర్ పాడ్ లో నివసిస్తున్న ఈ బిజినెస్ టైకూన్ రిటైర్మెంట్ తరవాత ముంబై లో తన కోసం ప్రత్యేకం గా రూపుదిద్దుకున్న మాన్షన్ కి మారబోతున్నారు. స్మోకింగ్ & డ్రింకింగ్ కి దూరం గా ఉండే ఈయనకు  రెండు జర్మన్ షెపర్డ్ డాగ్స్ ప్రియనేస్తాలు, అలాగే ఫాస్ట్ కార్స్ ని డ్రైవ్ చేయడం , జెట్స్ నడపటం , స్పీడ్ బోటింగ్ రేస్ లు హాబీలు. బాచలర్ గా జీవితం గడుపుతున్న రతన్ టాటా  ఇద్దరు అమ్మాయిలని దత్తత తీసుకున్నారు . 


Now What ? Today is December 28th 2012, Ratan Naval Tata turned 75 and gracefully walking out of his position by leaving healthy legacy to his successor. I wish the  iconic man Mr. Ratan Naval Tata who immensely contributed for the growth of modern India,  a very happy birthday and wonderful retirement life ahead.

-శ్రావ్య 

Sunday, December 23, 2012

Perception


ఈ అందమైన ఫోటో చూసిన తరవాత నాకొచ్చిన తమాషా ఆలోచన. సరదాకి  రాసిన తవికలు మాత్రమే  దీనిలో  చంధస్సు,   కవితాత్మలాంటి ఇంకేవో నాకు తెలియని వాటి కోసం వెతక్కండి  :-))



 
నీ రాకని  తెలియజెప్పే 
కమ్మని సంగీతం వంటి 
ఎండుటాకుల  చిరుసవ్వడి 
పక్షుల కిలకిలారావాలు 
చల్లని పైరగాలి పిల్లతెమ్మరెలు 
నాలో రేపే ఆనందహేల నీకు 
తెలియచేప్పాలంటే పదాలే దొరకవేం ...

నిరంతం ముసిరే  వీడని నీ జ్ఞాపకాలు
దారి తెన్నులు తెలియని నా ఆలోచనలు
నా  శుష్కదేహాన్ని క్షతగాత్రం చేస్తూ
గమ్యమే తెలియని నా ప్రయాణం లో
ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నాయి  ప్రతీ క్షణం ....

ఆ ఎండిన ఆకులు వంటి నీ
జ్ఞాపకాలు నా మది లోంచి
తుడిచేయటానికి  ఒకే ఒక్క
క్షణం  చాలు కదా తెలుసా ..

అబ్బా అబ్బా రోజు రాలే 
ఈ ఆకులుని శుభ్రం చేయలేక చస్తున్నా 
మళ్ళీ వీటిని ఫోటోలు తీసే పిచ్చోళ్ళు  కొంతమంది 
ఆ ఫోటో చూసి బ్లాగులు రాసే తిక్కలోళ్ళు 
ఇంకా  కొంతమంది..


(నన్ను వదిలేసి,   మీ తలనొప్పికి కారణమైన ఈ తవికలకి మూలం ,  ఈ పిక్చర్ తీసిన వారి  ఫోటోగ్రఫీ స్కిల్  గా గుర్తించి  మీ అక్షింతలు వారికి  మాత్రమే  పరిమితం చేయాల్సిందిగా మనివి)