Subscribe:

Sunday, May 12, 2013

Relationship Vs Time


మనందరం చిన్నప్పుడు ఫిజిక్స్ లో బట్టీ  వేసిన న్యూటన్ లాస్ గుర్తున్నాయా?  ఒకే ! గుడ్, అవి గుర్తు ఉన్నాయి అంటే Albert Einstein ప్రతిపాదించిన "Special Theory of Relativity" ఒక్కసారిగా ఈ న్యూటన్ లాస్ ని డ్రమాటిక్ గా break చేసి ఇవాల్టి ప్రపంచం అంతా అంగీకరించే  impressive workగా ఎలా గుర్తింపు తెచ్చుకుందో కూడా గుర్తుకోచ్చేసి ఉంటుంది :-)


ఇప్పుడు విషయం ఏంటి అంటే, Albert Einstein ని ఆదర్శం గా తీసుకొని మనకందరికీ తెలిసిన relationship Vs  Time గురించి మనకి తెలిసిన విషయాలనే ఇంకొంచెం refine చేసి మీ ముందుకు తీసుకొద్దాం అని చిన్న ప్రయత్నం చేసా.   అదేంటో తెలుస్కోవాలి అంటే తప్పదు మీకు క్రింద రాసిన సోది చదవటం, కానివ్వండి మరి  :-) 

*  *  *
Theory #1:Some relationships are tremendously exciting, but I believe without some attention, with time  the relationship could,  could, could - I'm searching for the right word - could, could die.(Yeah, I am a big fan of Steve Jobs!)

"హే ఇప్పుడా రావడం, ఎంత సేపటి నుంచో వెయిట్ చేస్తున్నానో తెలుసా నీ కోసం" ?!
"హ్మ్ ! సారీ ! ఏం  చేయమన్నావ్ చెప్పు , నీకు తెలియంది ఏముంది?! పని పని.....  తరగదు,  దానికి తోడు దిక్కుమాలిన మీటింగ్ అని పేరు పెట్టి బుర్రలు తినే ప్రోగ్రామ్స్"
"సరే, అంత చిరాకు ఎందుకంటా, ఇలా ఎంతోమంది మన కోసం పని చేస్తుంటేనే ఇంత  హాయిగా ఉండగలుగుతున్నాం, కూల్ బాబా కూల్ !" 
"నీకేం నువ్వు బానే చెప్తావ్, నా position లో నువ్వుంటే తెలుస్తుంది ఎంత కూల్ గా ఉంటావో" 
"సరే పోనీ ఇప్పుడు ఆ కంపేర్ చేసుకోవటం ఎందుకు, నువ్వే కష్ట పడుతున్నావ్ సరా ?!  ఎంచక్కా ఈ పాట విను మన కోసమే రాసినట్లు గా లేదు ?!"

తూరుపు వెలుగుల , పడమటి జిలుగుల పగడపు మెరుపులలో మనమే 
సాగరతీరపు  చల్లని గాలుల గానంలో మనమే 
చంద్రుడైనా చిన్నబోయే ఇంద్రదనస్సున  ఇద్దరమే 
చీకటి నలుపున మనమే, చిగురాకుల ఎరుపున మనమే  !

" ఆ .... ఆపు  !  ఇప్పుడు నాకు ఆ పాటలు విని ఆనందించే టైం లేదు కానీ , నువ్వు ఎంజాయ్ చేయి. కానీ అది కూడా నేను ఇక్కడ నుంచి  వెళ్ళాక ! నాకు కడుపు కాలిపోతుంది ఏదన్నా ఆర్డర్ చేసావా లేదూ ఇప్పుడు ఇంకో గంట ఇక్కడ వెయిట్ చేయాలా ?!"
"హ్మ్ ! నీ సంగతి నాకు తెలియదా, నీకు ఏమి ఇష్టమో అదే ఆర్డర్ చేసా కదా ?! కొంచెం ఆ చిరాకు పక్కన పెట్టి నవ్వు ! లేకపోతే,  జనాలు  మనం ఎందుకు కొట్టుకున్నమో తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీతో  బిపీలు పెంచుకుని ఆరోగ్యాలు చెడగొట్టుకుంటే  అదొక గిల్టీ ఫీలింగ్ !"
"హే !  కాసేపట్లో నా మూడ్ అంతా మార్చేస్తావ్ కదా , అందుకే .... 

(ఇక్కడతో ఆపేద్దాం అండి , ఇంకా ఎక్కువ వినడం మనకు న్యాయం కాదు,  అసలు ఇంకా వింటే అపెండహే నస అనాలి అని కూడా అనిపిస్తుంది .)

 ****

"ఏంటి ఇంత లేట్ ?"
"ఏమి చేయమంటావ్ ఆఫీసు లో చావకొట్టి చెవులు మూస్తుంటే డెడ్ లైన్లని అవనీ, ఇవనీ "
"ఓహో  అక్కడకి తమరోక్కరే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నట్లు గా భలే చెప్తున్నావ్ !"
"అంటే ఏంటి ? నేను ఊరుకే  కావాలని నేను లేట్ గా వచ్చాను నీ ఉద్దేశ్యమా ?"
"ఆ మాట నేను అనలేదు , అయినా టైం కి రావాలన్న ఉద్దేశ్యం ఉంటె కదా ఈ explanations అన్నీ "
"హే  ! ఏమి మాట్లాడుతున్నావ్ నువ్వు నాకు మాత్రం ఇష్టమా నిన్ను ఇలా వెయిట్ చేయించటం? ఇలా నీతో అనిపించుకోవటం "
"ఆపు ఇప్పుడు నిన్ను నేనేమన్నాను అని , అంతగా వాయిస్ రైజ్ చేస్తున్నావ్?  అసలు ఏ  రోజన్నా చెప్పిన టైం కి వచ్చావా ?  లేదూ చెప్పిన పని చేసావా ? ఎప్పుడు చూసినా వంద సార్లు టెక్స్ట్ చేసో కాల్ చేసో గుర్తు చేయాలి? అసలు మనిషి అంటే ఇంట్రెస్ట్ ఉంటె కదా ?"
"ఏయ్ ! ఏమైంది నీకు ఏమి మాట్లాతున్నవో తెలుస్తుందా? అంటే ఇంత వరకు నువ్వంటే ఇష్టం లేకపోతేనే ఇలా ఉన్నామా మనం"
"ఏంటి ఇష్టం ? ఎదీనేను చెప్పే వరకు గుర్తు లేకపోవటం, నేను ఉన్నాను అని నా అంతట నేను గుర్తు చేసే వరకు  అన్న  సృహే లేకపోవటమా?"
"Just shut up, నేను బిజీ ఉన్నాను అని కూడా అర్ధం చేసుకోకుండా ఏదంటే అది మాట్లాడతావా?"
"What, what you said just now ????  shut up ? వావ్,  కమాన్ నిన్ను ఇంక ఒక్క నిమషం కూడా భరించే ఓపిక లేదు నాకు,  get lost, నేను ఇప్పుడే వెళ్తున్నా , నీ ఇష్టం వచ్చింది చేసుకో ! Btw,  don't ever try to reach me again ! Good Bye !"


--------------------------------------------------------------------------------------------------------


Theory #2:టైం బాబు టైం ! అవతలి వ్యక్తి  మన కోసం టైం స్పేర్ చేయటానికి అనువైన పరిస్థితులు ఉన్నాయో లేవో  తెలుసుకుని అప్పుడు ఆ పర్సనల్ స్పేస్ లోకి అడుగుబెట్టాలి   !

"హాయ్ !"
"హాయ్ ! చెప్పండి , whats up ?"
"Nothing ! లంచ్ కి నాతొ జాయిన్ అవుతారేమో అని "
"yeah ! Why not sure !"
"Okay,  Let us go ! మీరు ఏ క్యుజిన్  ప్రిఫర్ చేస్తారు ?"
"అదేమీ లేదు లెండి నాకు పెద్ద ఫుడ్ గురించి అంత  స్ట్రిక్ట్ రూల్స్, preferences  లేవు !   If you have any  preference let us go for that" .

***

"హాయ్ !"
"హాయ్ ! చెప్పండి !
"ఏంటి ఏదో బిజీ గా ఉన్నట్లు గా ఉన్నారు ?  ఈ రోజు లంచ్ కి నాతొ జాయిన్ అవుతారేమో అని ?"
"ఏంటీ ఏదన్నా విశేషమా ? btw నేను కొంచెం బిజీ గా ఉన్నాను, మీతో జాయిన్ కాలేనేమో !"
"బిజీ అది ఎప్పుడూ ఉండేదే కదా , కాసేపు పక్కన పడేస్తే పర్లేదు లెండి !"
"లేదండి ఈ రోజుతో ఇది కంప్లీట్ చేయాలి,సారీ మరోసారి చూద్దాం లెండి  !"
"భలే వారు అసలు ఇలాంటి అప్పుడే కొంచెం మైండ్ డైవెర్ట్ చేసుకోవాలి స్ట్రెస్ లెవెల్ తగ్గటానికి రండి "
"హలో !ఇక్కడ  ఇంకొక్క ముక్క మాట్లాడినా,   I will rip you down  into pieces!   Can't you   understand what I am trying to convey ? "  (There you go ! English is such a beautiful language కదా ? తిట్టినా ఎంత ముద్దుగా ఉందొ  :P )


--------------------------------------------------------------------------------------------------------

Theory #3:కొన్ని relationships విలువ వయస్సు పెరుగుతుంటే కానీ తెలియదు. అలాగే వయస్సుతో పాటు  అవి మరింతగా దృఢమవుతాయి !

"అమ్మా ! రేపు పార్లర్ కి వెళతా! "
"ఎందుకో"
"నా ఫ్రెండ్స్ అంతా జుట్టు ఎంత స్టైల్ గా మైంటైన్ చేస్తున్నారో చూసావా , నేను పార్లర్ కి వెళ్లి స్టైలింగ్ చేయించుకుంటా "
"వద్దామ్మా, ఎంత బావుందో చూడు నీ జుట్టు పట్టులాగ. అలా చేయిస్తే పాడై పోతుంది "
"ఏం కాదు ! నువ్వు ఎప్పుడూ అన్నిటికి ఇలానే చెప్తావ్ ! నా ఫ్రెండ్స్ అందరూ చూడు ఎలా మైంటైన్ చేస్తున్నారో"
"బంగారుతల్లీ, నేను చెప్పిన మాట వింటుందట.  అలా చేస్తే ఇప్పుడు బావున్నా తరవాత పాడువుతుంది అమ్మా , నా మాట విను. నేను ఏది చెప్పినా నీ మంచికి కాదు ?"
"ఏం  కాదు ఎప్పుడూ నీ ఇష్ట ప్రకారమే చేయాలంటావ్.  I hate you ! నువ్వు మంచి అమ్మవు కాదు !"  

***

"అమ్మా ఏం చేస్తున్నావ్ "
"ఏమి చేయటం లేదమ్మా !  ఏముంటుందీ చెప్పు . ఇంతకీ నువ్వెలా ఉన్నావా, ఏదన్నా తిన్నావా లేదా ఇంకా !"
"అబ్బా తింటాలేమ్మా ! అలా ఏం పని లేదు అంటూనే ఉంటావ్. ఏదో ఒకటి చేస్తూనే ఉన్తవు. నీకు అసలు రెస్ట్ తీసుకోవాలి అని ఉండదా ?"
"రెస్ట్ కాక ఏం చేస్తున్నా నేను ఇప్పుడు ?! పిచ్చిదానివి కాబట్టి ఇక్కడ నేనేదో తెగ కష్ట పడుతున్నా అని ఊహించుకుంటూ ఉంటావ్ అంతే ! ఇక్కడ నేను హాయిగా ఉన్నాను. "
"సరే నేను చెప్పింది నువ్వు వినవు కదా ! ఇంతకీ అమ్మా నిన్న పంపినా రెండు పిక్స్ లో ఆ డ్రెస్ బావుందో చెప్పలేదు? నేను ఈ రోజు వెళ్లి ఆర్డర్ చేస్తాను ఏది బావుంది ?"
"నేను ఇక్కడ నుంచి చెప్పేది ఏంటి తల్లీ, అక్కడ చూసి ఏది సూట్ అవుతుందో అది తీసుకో నీకు కదా నచ్చాల్సింది . " 
"లేదమ్మా నీ సెలక్షన్ బావుంటుంది, నా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటే  నాకు ఎంత గర్వంగా  ఉంటుందో తెలుసా ? చెప్పమ్మా ప్లీజ్ !"
"వినవు కదా , సరే నీకు ఆ పింక్ కలర్ చాలా నప్పుతుంది అదే తీసుకో!"
"థాంక్ యు అమ్మా , నాకు తెలుసూ నీకూ అదే నచ్చుతుంది అని. లవ్ యు, బై !"


PS : సరదాకి చేసిన ప్రయత్నం. నిజంగా ఆ theory of relativity ని అర్ధం చేసుకోవటమే మహా కష్టం నాలాంటి వాళ్ళకి. ఇక ఆ మేధావి తో పోటీ పడటం , లేదు నేను అంత సాహసం చేయబోవటం లేదు. అండ్ అందరికీ తెలిసినదే అనుకోండి Albert Einstein నోబెల్ ప్రైజ్ తెచ్చిపెట్టినది ఈ theory of relatively కాదు, Theoretical Physics లో ఆయన చేసిన సేవలకి గాను, మరీ ముఖ్యం గా Law of Photoelectric effect కనుకున్నందుకు.  
Btw ఏంటి ఈ అమ్మాయికి సడన్ గా ఈ విపరీతమైన ఆలోచన బుర్రలో తొలిచింది అనుకుంటున్నారు కదూ  హ హ , ఒక్కసారి ఈ రోజు specialty ఏంటో గుర్తు చేసుకోండి :-)

-శ్రావ్య