Subscribe:

Friday, October 15, 2010

మేరా భారత్‌ మహాన్‌

వహ్వా వహ్వా నాకు నిజం గా ఇవాళ భలే ఆనందం గా ఉంది . కారణం రకరకాల వార్తలు, అనుమానాల తో మొదలైన CWG 2010 ఇంత చక్క గా ముగియటం ఒక కారణమైతే , పతకాల పట్టికలో మన దేశం రెండో స్థానంలో నిలవటం ఇంకో కారణం . అంతేనా ఆద్యంతం మన సంస్క్రతి ని ప్రతిబింబించే కార్యక్రమాలు నిజం గా చాల బాగున్నాయి . ముఖ్యం గా ముగింపు కార్యక్రమంలో బాగం గా స్కూల్ పిల్లలు మన జాతీయ పతాకం రంగులద్దుకొని చేసిన ప్రోగ్రాం నాకు చాల నచ్చింది . నచ్చనివి లేవా అంటే ఉన్నాయి, ఈ కల్మాడీ గారికి కి ఆర్గనైజింగ్ సెక్రటరీ గా వోట్ థాంక్స్ చెప్పాలని తెలుసు కాదా, ఆ రాసినదేవరో చక్కగా రాసారు ఎవరిని మర్చిపోకుండా ఈయన కొద్దిగా ముందే ఒకటి సార్లు ప్రిప్రేర్ అయ్యి కొద్ది గా అందం గా చదవచ్చు కదా అబ్బే , ఈయన ముందేమి స్కాములు చేసాడో వాటికి ఆధారాలు ఉన్నాయో లేవో నాకు తెలవదు కాని వీలయితే ఈ చదివిన తీరుకి పనిష్మెంట్ ఉండాలి.
ఈ CWG 2010 మొదటి నుంచి చివర దాక చూసిన తరవాత నాకో అనుమానం వచ్చింది నాతో పాటు గా మనలో చాల మంది కి సెగ తగిలితే కాని పని చేయని లక్షణం ఉన్నట్లుంది అంటే డెడ్ లైన్ కి దగ్గర గా వస్తే కాని పని చేయాలన్న మూడ్ రాదనుకుంటా :) ,
ఈ ఆటలలో విజేతలైన , పాలుపంచుకున్న క్రీడాకారులందరికీ నా అభినందనలు , మన హైదరాబాదీలైన సైనా , గగన్ నారంగ్ లకి కొంచెం ప్రత్యేక అభినందనలు ! అలాగే ఈ కార్యకమాలన్ని ఇంత విజవంతం చేసి అంతర్జాతీయ ప్రపంచానికి మన క్రీడా నిర్వాహణ సామర్దాన్ని చాటటానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు !
నేను ఈ పోస్టు రాసే సమయానికి మన ఇండియన్ ఐడొల్ శ్రీరామచంద్ర పాడుతున్నాడు :)