Subscribe:

j

Sunday, February 12, 2012

Graceful Shutdown

ఆలో  ఆలో  టెకీస్   ఆ టైటిల్    చూసి   ఆ సర్వర్ కో కనెక్ట్   అయ్యిపోకుండా  మామూలు ప్రపంచం లో కి   రండి . నేను   మాట్లాడేది  మన మామూలు   జీవితం లో కొన్ని సోషల్   రిలేషన్ షిప్స్ , హాబీలు వగైరా   వగైరా    నుంచి  నుండి   తప్పనిసరి అనిపించినప్పుడు గ్రేస్ఫుల్ గా పక్కకు    తప్పుకోవటం  గురించి . మరి  ఆ టైటిల్  ఎందుకు అంటే,  క్యాచీ గా ఉంటుంది అని  తెలుగు  దర్శకుల  బాట పట్టా  :)

అసలు  ఏదన్నా  రిలేషన్ షిప్స్ , హాబీలు వీటి  నుంచి పక్కకి ఎందుకు  వెళ్ళాలి  అని ఎవరన్నా  అయోమయం గా నావైపు చూస్తుంటే  వాళ్ళకి  నా సమాధానం   మీరు ఇప్పటి వరకు అదృష్టవంతులు infront there is crocodile festival    అని అన్న మాట .    నీ KJ లు ఆపి సరిగ్గా  చెప్పవమ్మా  ఆంటే  ఏముందండి  మన బుర్ర  లో తోచే ఆలోచనలు  ఇవాళ    ఉన్నట్లు  రేపు ఉండకపోవచ్చు , లేదు  తప్పనిసరి గా మన జీవితం లో  వచ్చే మార్పులకి  అనుకూలం గా మారాల్సి  రావచ్చు . కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్లు దీనికి కూడా బోలెడు కారణాలు అన్నమాట. 
సరే  ఇక ఎలాగు  తప్పదు అని మనకి  తెలిసినప్పుడు  దాని నుంచి  బయటపడాలి కదా ,  అదే కొంచెం అందం గా చేస్తే మనకి , మనతో పాటు గా  ఇన్నాళ్ళు  ఉన్నవాళ్ళకి  కొంచెం బాధ  తగ్గుతుంది .  మన హాబీ లేదా అలవాటు నుంచి  బయటికి  రావాలి  అంటె ఎదుటి వారికి ఎందుకు చెప్పాలి అంటారా ?  చెప్పాలి  ఎందుకంటే  మనం మన ఆనందం కోసం చేసిన  ప్రయత్నాలలో  కొద్దో గొప్పో ఎదుటి ప్రమేయం లేకుండా ఉండదు, దానితో మనకు  తెలియకుండానే  వాళ్ళు మన కోసం వాళ్ళ  టైం ని , లేదా  వాళ్ళ ఆలోచనలని మన కోసం  ఖర్చు పెట్టి ఉండొచ్చు .  దానికి గౌరవం ,  విలువ  ఇవ్వాలి కదా ? ఉదాహరణకి  రోజూ   ఏ టేన్నిసో, కారంస్ లాంటి ఆటలు, లేదా టైం పాస్ ముచ్చట్లు కో  ఒక గుంపు తో కలుస్తున్నారు అనుకోండి  రేపటి నుంచి మీకు వీలవక  మానేద్దాం అనుకున్నారు  ఆ గుంపులోని  వారికి     ఒక ముక్క  చెప్పటం మర్యాద  తొక్కలే  ఎదుటి  వాళ్ళు   ఏమైతే నాకేంటి  నేను నాకు ముఖ్యం అనుకునే వాళ్ళకి  నేను  చెప్పేది  ఏమి లేదు , మీ ఇష్టం  . కానైతే  ప్రోపబిలిటీ   ప్రకారం ఎక్కడో ఒక చోట మీకు ఇదే పరిస్తితి  ఎదురవటం లో  మీకు మీరే సాయం చేసుకుంటున్నారు అని  చెప్పటం తప్ప . ఇలా చెప్పటం లో ఇంకొక లాభం కూడా  ఉందండోయ్ .  నలుగురికి చెప్పి  మానేశాము అనుకోండి , రేపెప్పుడో  మనస్సు మాట వినక అటువైపే లాగేస్తుంటే  ఎదుటి వాళ్ళు మానేస్తానన్నావు గా అడుగుతారేమో అన్న భయం తో నన్న అటు వెళ్ళం, కాదంటారా ? 

ఆ తరవాత మీరు ఒదిలేసిన  అలవాటునో, వ్యక్తుల గురించో  చెడు గా  చెప్పటం  అనేది  అస్సలు చేయకూడని పని . ఇదే విషయం  మనం ఉద్యోగ  రీత్యా మారిన వదిలేసిన కంపెనీలకి , ఉద్యోగాలకి కూడా వరిస్తుంది .  వీటిని కించపరిస్తే  మీ గతాన్ని మీరు  కించపర్చుకున్నట్లు  కానీ   వేరేవరినో కాదు . 

అలవాట్లు  అంటె  మనకు ఫిజికల్   గా  కనపడవు కాబట్టి  పర్వాలేదు , కానీ  వ్యక్తుల  విషయం లో మనకు ఏదో ఒక సందర్భం  లో  ఎదురు పడే  అవకాశం  ఉంటుంది , అలాంటప్పుడు   కేవలం వాళ్ళు  నోచ్చుకోవటానికి  మాత్రం ఇప్పుడు మనతో  ఉన్న వాళ్ళ  గొప్పతనం  గురించి  ఊదరగొడుతూ  లేని పోనీ సూటిపోటీ   మాటలు  విసరటం లాంటి   పనులకి దిగకపోతే  గౌరవం  గా ఉంటుంది . 

ఇందంతా కాదు మిమ్మల్నే ఒకవేళ  అవతలి వారు  ఏదో విధం గా  యవాయిడ్  చేయటానికి  ప్రయతిస్తున్నారు  అంటె,  ఒకటి రెండు సార్లు వాళ్ళతో  మాట్లాడాటానికి  ప్రయత్నం చేయండి , మీరేంటో  అవతలి వాళ్ళకి  నిజాయితీ గా తెలియజెప్పే  ప్రయత్నం  చేయండి . అవతలి  వాళ్ళు   మీ  ప్రయత్నాన్ని ప్రతిసారి  లోకువ గా  తీసుకుంటుంటే  మీకు వెన్నుముక  ఉంది అని  గుర్తు  చేసుకోండి forced shutdown  చేయండి , అంతటితో  ఆ కథ కి ఖచ్చితమైన  fullstop    (అంటె మూడో  వ్యక్తీ దగ్గర   వీరి ప్రసక్తిని ఎత్తి  లేని పోనీ విమర్శలు చేసి మీ విలువ తగ్గించుకోకండి .)  పెట్టేయండి .

ఖచ్చితం గా చెప్పాలి అంటె మన ప్లస్సులో  బ్లాక్  ఆప్షన్ మాదిరి  అన్నమాట  (అంటె మీ రాతలు   వాళ్లకి   కనపడవు , వాళ్ళ రాతలు మీకు  కనపడవు కదా అలా) . ఈ దెబ్బ కి మీరు మీ మూడ్ ఖరాబు చేసుకొని బి పి పెంచుకునే బాధ తప్పుతుంది . 


పైదంతా   చదివి ఇప్పుడు ఈ సోది  అంతా   ఎందుమ్మాయి అన్న ప్రశ్న   మీ మనస్సులో కి రావొచ్చు తప్పు లేదు ,  దానికి నా సమాధానం  . రేపో మాపో  Feb 14  వస్తుంది కదా , మొత్తం  ప్రపంచానంత  ప్రేమించేయమని   అందరూ  చెబుతారు  కానీ     ఒకవేళ  విడిపోవాల్సి  వస్తే  ఏమి చేయాలో ఒక్క రవీయం లో  బ్లాగులో  చదివితే మాత్రమే మీకు  తెలుస్తుంది అన్న మాట  ( నాకు తెలుసు   ఈ మాత్రం సోది మాకు  తెలుసు  అని  మీరు తిట్టే  తిట్లు,   అవి  ఆపేసి ఒక కామెంట్ పెట్టి  relax   ఆవ్వండి :))  

P.S.అసలు సంగతి  చెప్పటం  మర్చిపోయా  నేను పైన రాసినది సోషల్  రిలేషన్ షిప్స్   గురించి మాత్రమే , ఫ్యామిలీ రిలేషన్ షిప్స్  గురించి కాదు .