Subscribe:

Saturday, January 24, 2015

Kong Meng San Phor Kark See Monastery - A blissful place


I had a rather unusual adventure on the last day of the year 2014అది ఏంటంటే ....
***
ఈ పిక్చర్స్ లో కనపడుతున్న పార్క్ పక్కనున్న రోడ్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు,  బయట నుంచి కనిపించే వ్యూ చూసి బావుందే ఎప్పుడైనా ఒకసారి లోపలి వెళ్లి తిరిగి చూడాలి అని చాలా సార్లే అనుకున్నాను. మొత్తానికి ఒకానొక మధ్యాహ్నం వేళ పార్క్ కు వెళ్ళే అవకాశం వచ్చింది. ఎప్పుడు? ఎలా? వెళితే ఏమైంది? అసలు ఆ పార్క్ కి ఈ  పోస్ట్ టైటిల్ కి ఉన్న relationship ఏంటి?  అన్న అతి క్లుప్తమైన ప్రశ్నలకు  బహు పొడవైన సమాధానాలే ఈ పోస్ట్.   

***
తేదీ : 31 డిసెంబర్  2014 
సమయం : మధ్యాహ్నం 2.30 
స్థలం : న్యూ ఇయర్ ఈవ్ కావటం తో హాఫ్ డే పర్మిషన్ ఇచ్చేయటం తో దరిదాపుగా  ఖాళీ అయిన ఆఫీసు. 

'వావ్ ఈ రోజు 2.30 కే ఆఫీసు నుంచి బయటికెళ్ళిపోతున్నా' అని మైండ్ లో మెరిసిన ఆలోచనతో, ట్రిగ్గర్ అయిన 'పెండింగ్ ఉన్న పనులేమున్నాయబ్బా'  అన్న సెర్చ్ query  execute అయ్యి 'ఇప్పుడంత అర్జెంటు గా  చేసేయ్యల్సినవి ఏవీ లేవు' అన్న empty result set  రిటర్న్ చేయటంతో...  అప్పటినుంచో అనుకుంటున్నా కదా ఈ పార్క్ కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను.  డిసైడ్ అయ్యాక ఇక ఆలస్యమెందుకు , అంతే ఇంకో 15 మినిట్స్ ఆ పార్క్ లో ఉన్నాను.  అంత పెద్ద పార్క్ లోను ఎక్కడో అక్కడక్కడ తప్ప పెద్దగా జనాలు లేకపోవటంతో, ఉన్న వాళ్ళు కూడా  నైట్ న్యూ కౌంట్ డౌన్ కోసం ఒక పక్క జరుతున్న ప్రోగ్రాం ఏర్పాట్లు చూడటంలో మునిగి ఉండటంతో, నేను హాయిగా  ఒక పక్క నుంచి ఇంకో పక్కకు పూర్తిగా చక చక తిరిగేసి, కొద్దిగా కాళ్ళు నొప్పులు తెలియటం తో, ఇహ నెమ్మదిగా ఇంటికి వెళ్దాం అని బయటికి వెళ్ళే దారి కోసం వెతుకుతున్నా.   అప్పుడు... సరిగ్గా అప్పుడు కనిపించింది.. నేను వెళ్ళాల్సిన దారికి exact గా opposite వైపు కొంచెం దూరంలో  ఎత్తుగా   బంగారు రంగులో తళ తళలాడుతున్న గోపురం లాంటిది.   చూడగానే తెలుస్తూనే ఉంది,  అది ఏదో బుద్దిస్ట్ టెంపుల్ అని. కాసేపు కాళ్ళ నొప్పులు సంగతి పక్కన పెట్టి అదేంటో చూద్దామని నిర్ణయించుకున్నాను. చూస్తుంటే దగ్గరగా అనిపించింది కానీ కొంచెం దూరమే :-) 
ఎనీవే అలా నడుచుకుంటూ పార్క్ నుంచి బయటికి రాగానే ఆ టెంపుల్ ఎదురుగా నాకు కనిపించిన రోడ్ ఇది.ఇప్పుడు  ఆ రోడ్ డివైడర్ మీద ... ఇటు స్క్రీన్ వైపు కాదు....  అటు రోడ్ వైపు నిలుచుంటే మీ ఎడమ చేతివైపునుంది పార్క్,  కుడిచేతి వైపున ఉన్నది నేను పోస్ట్ కి టైటిల్ గా పెట్టిన 'Kong Meng San Phor Kark See Monastery'  అని పిలవబడే Mahayana Buddhist temple అన్నమాట.. ఉహు కాదు కాదు ఉన్నమాటే :-)
ఆ రోడ్ క్రాస్ చేసి అక్కడ ఉన్న గేటు లోంచి లోపలకి వెళ్లాను ... అంతే.. వావ్ అంటే రియల్ వావ్, its amazing. అక్కడ కనిపించిన ఆ MASSIVE structures ని, వాటి మీద చెక్కి ఉన్న dragons ఇంకా వేరే mythical creatures, ఎక్కడ చూసిన decorate చేయటానికి వాడిన బోన్సాయ్ మొక్కలు, wall frescoes వీటన్నిటిని చూసి I was just astonished. Basically గా అది కేవలం ఒక్క టెంపుల్ కొంత గ్రీనరి మాత్రమే కాదని .. కొన్ని టెంపుల్స్, ప్రేయర్ హాల్స్, meandering paths, fishponds, turtle ponds, and yes crematorium and columbarium services ఆఫర్ చేసే హాల్స్ ఇలా ఒక కొత్త బిగ్ వరల్డ్ అన్న మాట. ఒక 30 - 45 minutes లో చూసి వెళ్లి పోవచ్చు అనుకుని లోపలకి వెళ్ళిన నేను 4 హౌర్స్ అక్కడే గడిపాను. అది కూడా డిటైల్డ్ గా కాదు కేవలం చక చకా ఒక్కసారి చూడటానికి. It's truly amazing place.

Unfortunately, I don't have enough vocabulary in words to explain beauty and grandeur of this place, so కేవలం నా సెల్ ఫోన్ లోంచి తీసిన కొన్ని పిక్చర్స్ ని ఇక్కడ షేర్ చేస్తున్నా, కొన్ని డీటెయిల్స్ తో.


రోడ్ క్రాస్ చేసి టెంపుల్ కాంప్లెక్స్ లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఇలా చిన్న చిన్నపాండ్స్ ఉన్నాయి. (పిక్చర్స్ పెద్దవిగా చూడటానికి వాటి మీద క్లిక్ చేయండి )

 

 

ఇహ,  రైట్ సైడ్?!  MASSIVE  టెంపుల్ కాంప్లెక్స్ ఉంది. నాకు పార్క్ లోంచి కనపడిన బంగారు రంగు గోపురం,  ఇదే మెయిన్ టెంపుల్ . (ఇది పార్క్ నుంచి  కనపడిన వ్యూ కాదు, నేను టెంపుల్ కాంప్లెక్స్ లోకి ఎంటర్ అయిన తరవాత ). ఎంట్రన్స్ లోనే ఒక ప్రేయర్ హాల్ ఉంది . అది దాటగానే ఇలా మెట్లు. మెయిల్ టెంపుల్ కి వెళ్ళటానికి ఆ మెట్లు ఎక్కుతూ ఉంటె, రైట్ సైడ్ లో ఉండే మొదటి టెంపుల్. 
 ఆ టెంపుల్ లోపల బుద్ధ భగవానుడుఆ టెంపుల్  చూసిన తరవాత మళ్ళీ మెట్ల మీద గానో, ఆ పక్కన ఉన్న స్లోపే మీదగానో మన నడక కొనసాగిస్తే... 


ఇదుగోండి ఇక్కడ దాక వస్తాం.  పిక్చర్ లో మనకు పెద్ద బుద్ధా తో పాటు కన్పిస్తున్న రెండు టెంపుల్స్ కాక, లెఫ్ట్ సైడ్  మాంక్ pray చేస్తున్నారు కదా, ఆయన వెనుక కూడా  ఒక టెంపుల్ ఉంది. ఇదే ఫస్ట్ పిక్చర్ లో చూసిన మెయిన్ టెంపుల్ . 


మెయిన్ టెంపుల్ లో మాత్రం ఫోటోగ్రఫీ not  allowed.  సో నేను పిక్చర్స్ తీయలేదు.  ఈ మెయిన్ టెంపుల్ లో ఉన్న 10,000 బుద్దాస్ గురించి explanation క్రింది పిక్చర్ లో ఉంది. (లెఫ్ట్ సైడ్ పిక్చర్ లో ఉంది joss sticks అంటే  మనం దేవుడి దగ్గర సంబ్రాణీ కడ్డీలు / ఊదోత్తులు అంటాం కదా  అలాంటివి బట్ ఇవి స్మోక్ ఫ్రీ ఉంటాయి అవి వెలిగించే కంటైనర్)మెయిన్ టెంపుల్ కి నడుస్తూ ఉన్నప్పుడు దారి. 

ఫుడ్ సర్వ్ చేసే హాల్స్ 


 Crematorium and columbarium services  ఆఫర్ చేసే హాల్స్ . ఇక్కడ నేను పెట్టిన పిక్చర్స్ & చెప్పింది  50 % కవర్ చేసి ఉంటాయేమో, కానీ ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తో బోర్ కొట్టించకుండా ఇక్కడితో ఆపేస్తాను. Island ఉండేవాళ్ళు ఎవరైనా ఇంకా చూడకపోయినా,  లేదు ఎవరైనా  island visit కోసం plan చేసే వాళ్ళు ఉన్నా I can definitely recommend going to the Monastery. It is truly spectacular,  and you will enjoy the visit. I guaranty that. 

డీటెయిల్స్ కోసం  Monastery  official website :  Kong Meng San Phor Kark See Monastery

-శ్రావ్య