Subscribe:

Saturday, December 20, 2014

Few Random Clicks !

ఆకశములో చందమామ  
కొలను పూసిన కలువ భామ..

నేల నడిచెను
కలసి మెలసి కొత్త దారులలో..
గోరు వెచ్చని నింగి మనసు  
ఆకు పచ్చని నేల సొగసు..

కలిసి కమ్మని తోడు నీడై అడుగులేసేనా..

 నేల రాలిన చినుకు వానగు 
వాన నీరే పారు యేరగు..

పారు యేరులే పొంగి పొరలుతు  
సంద్రమయ్యెనుగా..


 మనసులొకటై మమతలొకటై 
ఆశలొకటై బాసలొకటై..

పరిమళించిన జంటమల్లెలు  
జతను వీడేనా..


Do you want to listen this beautiful song ? Okay, here is it.

Wednesday, November 12, 2014

Blood Swept Lands and Seas of Red !It ....

Killed 17 million people.
Traumatized a generation.
Redrew the world map.
Overturned old empires.
Changed the world's political picture.
Yet its origins often remain obscure. 

That's nothing but  a war.. the First World War  -  A classic example of 20th century's man made disaster. 

*** 
Background :

28th June 1914 - 11th November 1918.  నాలుగు సంవత్సరాల పాటు, దరిదాపు ప్రపంచం లోని అన్ని దేశాలు పాల్గొన్న ఈ 'A War to end all Wars' అని పిలవబడే 'Great War'  మొదలవ్వటానికి 28 జూన్ 1914 న,  సెర్బియా నేషనలిస్ట్ 'గవరిలో ప్రిన్సిప్' (Gavrilo Princip) ,  ఆస్ట్రియా-హంగెరీ   ఆర్చ్ డ్యూక్ 'ఫ్రాంజ్ ఫెర్డినాండ్' (Franz Ferdinand) అతని భార్య 'సోఫీ' లని  కాల్చి చంపటం గా చరిత్ర మన కళ్ళ ముందు సాక్ష్యాధారాలతో  సహా చూపెడుతున్న అతి సులువైన సమాధానం. కానీ ఈ  సంఘటన కేవలం tipping point మాత్రమే.  నిజానికి డ్యూక్ దంపతుల హత్యలకు వియన్నాలో వచ్చిన స్పందన కూడా సామాన్యమైనదే. కానీ అప్పటికే ఉన్న imperialist designs,  అలాగే రాజ్య విస్తీరణ కాంక్షతో group of alliances గా రూపుదిద్దుకున్న  యురోపియన్ మేజర్ పవర్స్ అసలు కారణంగా most of the scholars అంగీకరించిన నిజం. 

ఎనీవే,  అప్పటికే Balkan Wars లో కోల్పోయిన తమ భూభాగాన్ని తిరిగి సాధించటానికి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న  ఆస్ట్రియా-హంగెరీ కింగ్డమ్, సీక్రెట్ గా చేసుకున్న treaty తో జర్మనీ సపోర్ట్ ని assure చేసుకుని, డ్యూక్ దంపతుల హత్యకు కారణం అయిన వారిని తనకప్పగించాల్సిందిగా సెర్బియా కు అల్టిమేటం పంపింది. దానికి సెర్బియా అంగీకరించకపోవటంతో Emperor Franz Josef కు ఎదురుచూసున్న అవకాశం రానే వచ్చింది. దానితో  సెర్బియా ని ఎటాక్ చేయటంతో 1914 జూలై చివరి వారంలో యుద్ధం మొదలైంది.  అయితే  సెర్బియా కు , రష్యా కు మధ్యన treaty ఉండటంతో రష్యన్స్ సెర్బియా కి సహాయంగా వచ్చారు. దీనితో జర్మనీ రష్యా పైన యుద్ధం ప్రకటించింది.  అయితే  అగైన్ రష్యా కు , ఫ్రెంచ్ తో  treaty ఉండటం పైగా అప్పటికే Alsace Lorraine  issues తో జర్మనీ - ఫ్రెంచ్ మధ్య నున్న strained  రిలేషన్స్  ఉండటం తో ,  బెల్జియం మీదుగా మార్చ్ చేస్తూ  జర్మనీ , ఫ్రెంచ్ ని ఎటాక్  చేసింది.ఈ ఎటాక్ మరన్ని చైన్ అఫ్ రియాక్షన్స్ కి కారణం అయ్యింది.  బ్రిటిష్ కు , బెల్జియం  &  ఫ్రాన్స్  రెండిటితోనూ treaties ఉండటంతో బ్రిటిష్ colonies యుద్ధం రంగంలోకి దిగాయి. ఇహ చివరిగా బ్రిటిష్ తో treaty ఉన్న జపాన్, ఆ తరవాత 1917 లో అమెరికా కూడా తమ స్లీవ్స్ మడవటంతో glorified land dispute కాస్తా దరిదాపు  ప్రపంచపటంలో ఉన్న అన్నీ దేశాలు పాల్గొన్న 'The Great War' గా మారిన వైనం చరిత్ర చూపిస్తున్న సత్యం.
 
CNN లిస్టు చేసిన  ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ :
 • June    28, 1914 - Gavrilo Princip assassinates Franz Ferdinand.
 • July     28, 1914 - Austria-Hungary declares war on Serbia.
 • August 2,   1914 - Ottoman Empire (Turkey) and Germany sign a secret treaty of alliance.
 • August 3,   1914 - Germany declares war on France.
 • August 4,   1914 - Germany invades Belgium, leading Britain to declare war on Germany.
 • August 10, 1914 - Austria-Hungary invades Russia. 
***

As I say, World War One is history, it isn’t news. Forget it.  - Harry Patch
 
నిజమే, Harry Patch చెప్పినట్లుగా, World war one is history, ఇంకా తరచి చూస్తే ఇదొక ఫ్యామిలీ వ్యవహారం . బ్రిటన్, జర్మనీ, రష్యాల ఆనాటి state heads అయిన George V, Kaiser Wilhelm II & Tsar Nicholas II లు ఫస్ట్ కజిన్స్ (Royale cousins ) . వీరి మధ్య నున్న కాన్ఫ్లిక్ట్ ఒక గ్రేట్ వార్ గా ఎలా మారాయో ఇంకా గుర్తుంచుకోవాలా అంటే ? Yes, ఈ రోజు గురించి తెలుసుకోవాలి అంటే నిన్నటి గురించి గుర్తించుకోవాలి. నిన్నటి కన్నా ఈ రోజు ఎలా బెటర్ గా ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే నిన్న ఏమి చేసామో గుర్తుంచుకోక తప్పదు . 
ఇలా గుర్తు చేసుకునే క్రమం లోనే, First World  War లో ప్రాణాలు కోల్పోయిన Armed Forces జ్ఞాపకార్ధం,  యుద్ధం ముగిసినట్లుగా official గా ఒ ప్పందం చేసుకున్న నవంబర్ 11 ను 'Remembrance Day' గా  పాటిస్తారు. అమెరికా లో ఇదే రోజును 'Veterans Day'  గా పాటిస్తారు.  అయితే ఈ సంవత్సరం  తో  First World  War  మొదలై 100 సంవత్సరాలు పూర్తి అవ్వటంతో, 'centennial of Britain’s involvement'  కు గుర్తుగా Paul Cummin (ceramic artist ),  Tom Piper  (stage designer)  లు కలిసి  Tower of London  చుట్టూ  888,246  red ceramic poppies ( each representing a British or Colonial military fatality. ) అమర్చాలన్న ఐడియాతో 'Blood Swept Lands and Seas of Redప్రాజెక్ట్ డిజైన్ చెసారు.  17 July 2014 బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ వారసులైన William and Harry and the Duchess of Cambridge ల సందర్శన తో వాలంటీర్స్ మొదలుపెట్టిన ఈ 888,246 సిరామిక్ ఫ్లవర్స్ ప్లాంటేషన్ నవంబర్ 11 న 13 సంవత్సరాల Harry Hayes (member of the School's Combined Cadet Force) చివరి ఫ్లవర్ ని ప్లాంట్ చేయటంతో ముగిసింది. మరన్ని పిక్చర్స్ ఇక్కడ.  

Ceramic Poppies తయారీ వివరాలు : 


But why Red  Poppies?
కెనిడియన్ solider & poet అయిన John McCrae  రాసిన ఈ క్రింద poem poppies ని symbol గా తీసుకోవటానికి కారణంగా చెప్తారు. అంతే కాక ఫ్రాన్స్,  బెల్జియంలలోని యుద్దభూముల్లో  పెరగటం కూడా వీటిని సింబాలిక్ గా గుర్తించటానికి ఒక కారణం. 1921 లో మెదటిసారిగా  బ్రిటిష్ వారి lapels  పైన కనపడటమూ, అదే సంవత్సరం  సైన్యానికి, వారి ఫ్యామిలీస్ హెల్ప్ చేయటానికి అవసరమైన ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం లో భాగం గా అమ్మటం మొదలైంది.  

In Flanders fields the poppies blow
Between the crosses, row on row,
That mark our place; and in the sky
The larks, still bravely singing, fly
Scarce heard amid the guns below.

We are the Dead. Short days ago
We lived, felt dawn, saw sunset glow,
Loved and were loved, and now we lie
In Flanders fields. 
               (Source)

Conclusion : 'గతకాలం మేలు వచ్చుకాలం కంటెను'  అని జనాంతికం గా చెప్తూ ఉంటారు కానీ,  ఒకసారి వెనుదిరిగి చరిత్ర పరిశీలిస్తే  అది అంతగా నిజం అనిపించదు. గతంలో కంటే జీవనప్రమాణాల దృష్ట్యానే  కాకుండా చీటికి మాటికి యుద్ధాలు లేని ప్రశాంతమైన జీవనం గడుపుతున్నాం అని చెప్పక తప్పదు. 

రక్తం తో తడిచిన గత కాలపు చరిత్ర  నుంచి నేర్చుకున్న పాఠాలతో రాబోయే రోజులలో మానవాళి మరింత ప్రశాంతంగా  బ్రతికే రోజులు వస్తాయని ఆశిస్తూ ...  

-శ్రావ్య 


Pictures   Source  : Google images
Content Source : Quora , The Week , BBC History , Wikipedia 

Thursday, July 24, 2014

కథ

మల్లెలు   తనకిష్టం
గులాబీలు  నాకిష్టం

నేనేమో  తనకిష్టం
తనేమో  నా ప్రాణం

అబ్బాబ్బా...  చెప్పిన కథలే ఎన్ని సార్లు చెబుతారు అని మీరనుకోవటం,   మీ మనస్సులో  అనుకున్న మాట విని నేను  చిన్నబోవటం. ఎందుకు, ఇవన్నీ అవసరమా ?! అందుకే నేనే కథా చెప్పబోవటం లేదు,  మీరు చదవబోవటం లేదు కూడాను . అయినా  సరే  కథుంది అందులో అమ్మాయి అబ్బాయి ఉన్నారు.

ఊ ....  అమ్మాయి , అబ్బాయి ఉన్నారు అని చెప్పా ... పోనీ కథ మొత్తం చెప్పక పోయినా ఎండింగ్ చెప్పేయనా ఎక్కువ  సస్పెన్స్ లో పెట్టకుండా ? !  ఉహు వద్దులే ...  ఎంత probability  లెక్కలు కట్టినా  రెండే రెండు  రకాలుగా ఎండ్ చేయగల chances ఉన్న కథకి  ఎండింగ్ చెబితే ఎంత? చెప్పకపోతే ఎంత? అయినా కలిస్తేనే  గొప్పకథ అవుతుందా, లేకపోతే కలవకపోతేనే గొప్పకథ అవుతుందా ఏంటి? 

ఇప్పుడు....  ఎప్పుడూ వార్మ్ గా ఉండే మన సూర్యారావు గారు, ఇహ ఎల్లవేళలా కూల్గా నవ్వులు చిందిస్తూ ఉండే చందమామ ఉన్నారు, వాళ్ళిద్దరూ  అసలు పూర్తిగా ఒకరినొకరు చూసుకోవాలంటేనే ఏ గ్రహణమో రావాలి, అలాంటిది ఇక కలిసేవుంటే,  అమ్మో !!! భూమి మీద ప్రయళమే కదా.  పొరపాటున అదే జరిగితే ఈ భూలోకవాసులకి దిక్కెవ్వరు అని ఆలోచించి కష్టమైనా,   ఇష్టపడి,   అలిసి పోకుండా ఒకరు డే షిఫ్ట్, ఇంకొకరు నైట్ షిఫ్ట్ అదేపనిగా మనకోసం కష్టపడటం లేదూ.  వీళ్ళ కథ కన్నా అందమైన కథ ఇంకొకటుంటుందా? నో వే ప్రపంచంలోని అందమైన కథలోకెల్లా అందమైన కథది. 

అరెరె !!! ఇదేంటి నేను కథ చెప్పను అని ఏవేవో కథలు చెప్తున్నాను ?  No ... No .. I should not do this , అసలే నేను మాటంటే మాటే అని ... మాట రాసుకుని మరీ దాని మీద నిలుచునే మనిషిని, అందుకే  నాకు ఏమీ తెలియదు, నేనేమి చెప్పబోవటం లేదు 

మల్లెలు   తనకిష్టం
గులాబీలు  నాకిష్టం

నేనేమో  తనకిష్టం
తనేమో  నా ప్రాణం

ఇది తప్ప .....   ఇక ఉంటానేం ?!

- శ్రావ్య


PS :  డెల్ వాడిచ్చిన కీబోర్డ్ ఉంది,  అప్పనంగా వచ్చిన ఇంటర్నెట్ ఉంది అని ఏదో బుర్రలో తోచింది అంతా మా మొహం  అదేలెండి .. స్క్రీన్ మీద కొట్టటమే ... అని మీరు తిట్టుకుంటే నాకు తెలిసిపోతుంది కూడా. అందుకే కొంచెం ఆ 'X ' బటన్ కొట్టి అప్పుడు తిట్టుకోండి . అయినా  ఏమండీ  ఏవేవో చదువుతారు .. ఏదో 6 నెలలకి ఒకసారి ఇలా నేను కూడా కీ బోర్డ్ మీద టైపు నేర్చుకుంటుంటే ప్రోత్సహించటం మానేసి అలా తిట్టడం తగునా అంటా ? (ఇప్పుడు మూతి తిప్పిన expression ఎలా రాయాలాబ్బా ఇక్కడ ? ! ఏమో అది నేర్చుకున్నాకా ఈ పోస్ట్ అప్డేట్ చేస్తా, అప్పటి వరకూ ఇంతే ) 

Thursday, May 8, 2014

My Rant about The Hindus: An Alternative History !
యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రా వృతా 
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా !
యా బ్రహ్మ చ్యుత శంకర ప్రభ్రుతి భిర్దే వై స్సదా పూజితా 
సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యా పహా !!
 
****
 
What is myth?

A myth is a story that may or may not be true. Myths are generally very old. This means there are no records or other proof that they happened. We know about them from older people telling them to younger people. Some myths may have started as 'true' stories but as people told and re-told them, they may have changed some parts, so they are less 'true'. They may have changed them by mistake, or to make them more interesting.  (Source :  Wikipedia)

What is history?

History is the study of the past, specifically how it relates to humans. It is an umbrella term that relates to past events as well as the discovery, collection, organization, and presentation of information about these events. History can also refer to the academic discipline which uses a narrative to examine and analyse a sequence of past events, and objectively determine the patterns of cause and effect that determine them.  (Source: Wikipedia)

ఈ రెండిటిని కలగలిపితే ఏమవుతుందో పెంగ్విన్ పబ్లిషర్స్ ఇండియన్  మార్కెట్  నుంచి వెనక్కి తీసుకున్న 'The Hindus'  పుస్తక రచయిత్రి Wendy Doniger మాటల్లో  చూస్తే :

Myth has been called “the smoke of history, and my intention is to balance the smoke of myth with the fire of historical events, as well as to demonstrate how myths too become fires when they do not merely respond to historical events (as smoke arises from fire) but drive them (as fire gives rise to smoke). Ideas are facts too; the belief, whether true or false,that the British were greasing cartridges with animal fat started a revolution in India. For we are what we imagine, as much as what we do.     --  ( Source:   The Hindus: An Alternative History).

ఈ  'The Hindus  An Alternative History '   అనే పుస్తకంలో తనేమి చెప్పబోతున్నారో వెండీ   ఇలా వివరించారు :

"The image of the man in the moon who is also a rabbit in the moon, or the duck who is also a rabbit, will serve as a metaphor for the double visions of the Hindus that this book will strive to present."


***                              ***                               ***
ఓహ్ అంటే ఇది కొన్ని myths  ని ,  హిస్టారికల్ ఫాక్ట్స్ తో seamless గా  కలిపి గతాన్ని construct చేస్తూ , అత్యంత energetic, exciting శైలిలో రాయబడిన పుస్తకమా ? 
అసలు ఆ మాటకొస్తే టైటిల్ లోనే 'Alternative History '  అని ఉంది కదా,  హిందూ మతం మీద గతంలో ఇటువంటి కథనాలు కోకొల్లలుగా వస్తే లేని రభస ఇప్పుడు ఎందుకూ అని eyebrows రైజ్ చేస్తున్నారు కదూ ?!  నిజమే గతం లో వచ్చాయి , భవిష్యత్తు లో కూడా వస్తాయి అందులో సందేహం లేదు . కానీ ఈ పుస్తకం రాసినది ఎవరూ ? అమెరికాలో భారతీయ శాస్త్రాన్ని గత 50 యేళ్లుగా అధ్యయనం చేస్తూ, ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో హిస్టరీ ఆఫ్ రెలిజియన్స్ విభాగంలో సర్వీస్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నవారు.  ఇంకా చెప్పాలి అంటే  మెటామారఫికల్ గా 'I’ve labored all my adult life in the paddy fields of Sanskrit'  అని తన గురించి తను చెప్పుకున్న రెలిజియస్ స్టడీస్ లో పని చేస్తున్న ప్రొఫెసర్. వీటిని దృష్టి లో పెట్టుకుని చూస్తే మన  చరిత్ర, సంస్కృతుల మీద  భవిష్యత్తు లోను / ప్రస్తుతం -  జరిగే'/ జరగబోయే  అనేక పరిశోధనల మీద ఈ పుస్తక ప్రభావం తప్పక ఉంటుంది కాబట్టి,  సహజంగానే ఎక్కువ ఆస్తక్తిని రేకెత్తించటం పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు .
అకడమిక్ దృక్కోణంలోని  ఈ పుస్తక ప్రాధాన్యతని పక్కన పెట్టి,  నా పర్సనల్ రీడింగ్ ఎక్స్పీరియన్స్ కి వస్తే ఇందులో నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయాలకీ, అబ్బురపరచిన అంశాలకి, అసహనం తో కుదిపేసిన అంశాలకి కొదవలేదు.  అందులో కొన్ని:
 • ఒక బ్రాడ్ వ్యూ తో దరిదాపు 50 BCE నుంచి - ప్రస్తుతకాలం వరకు వేల ఏళ్ళ చరిత్రని నిక్షిప్తం చేస్తున్న ఈ పుస్తకంలో రచయిత్రి 1922 ప్రాంతంలో గుజరాత్ లోని ఆదివాసీల 'Devi movement' ని, తరవాత కాలంలో గాంధీజీ "Nationalist movement' ని, 1990 లో ఆంధ్రప్రదేశ్ లోని ఒక చిన్న ప్రాంతమైన దూబగుంట (నెల్లూరు జిల్లా) లో మొదలైన Antiliquor campaign ఒక త్రెడ్ తో కలిపి చూపించటం చాలా అబ్బురపరిచింది. అయితే వెను వెంటనే గాంధీజీ గురించి mention అంశాలు చిరాకు తెప్పించాయి. గాంధీజీ, తనకు సంబంధించిన వివాదస్పద అంశాలని కూడా తన ఆటో బయోగ్రఫీలో చెప్పుకున్నారు (Infact, he was too harsh on himself). అవి తెలిసిన ప్రపంచానికి కొత్తగా ఎవరైనా అయన గురించి కొత్తగా చెప్పేందుకు ఏముంటుంది?! ఒకవేళ చెప్పినా అవి పెద్దగా ఆశ్చర్యం కలిగించవు అని నాకో అభిప్రాయం ఉండేది. కానీ ఈ పుస్తకంలో వెండీ గాంధీజీ ancient Tantric techniques ప్రాక్టీస్ చేసారు అని చెప్తూ నన్ను ఆశ్చర్యపరిచారు. (రచయిత్రి మాటల్లో : Gandhi was a one-man strange bedfellow. His insistence on celibacy for his disciples caused difficulty among some of them, as did his habit of sleeping beside girls young enough to be called jailbait in the United States, to test and/or prove his celibate control or to stiffen his resolve. But this practice drew not so much upon the Upanishadic and Vaishnava ascetic traditions, which were the source of many of Gandhi’s practices, as upon the ancient Tantric techniques of internalizing power, indeed creating magical powers, by first stirring up the sexual energies and then withholding semen.) ఏ ఆధారాలతో ఈ మాటలు చెప్పారో తెలియదు.
 • December 6, 1992 న అయోధ్య లో జరిగిన Babri-Masjid-Rama-Janma- Bhumi ఇష్యూ లో అప్పట్లో టీవీ లో ప్రసారమవుతున్న 'రామానంద్ సాగర్ రామాయణ్' కూడా ప్రభావం చూపించింది అని రూమర్ (కేవలం రూమర్ మాత్రమే) ఉంది. అంత చిన్న విషయం రచయిత్రి దృష్టికి రావటం నన్ను ఆశ్చర్యపరిస్తే, వెంటనే ఆ disputed ల్యాండ్ లో గుడి ఉండేది అని ఆర్కియాలజీ డిపార్టుమెంటు నిర్ధారించిన విషయాన్ని myth గా చెప్పటం అసహనాన్ని కలిగించిది .
 • ఇక SHIVA, THE SKULL BEARER అని చెప్తూ శివ, బ్రహ్మ, సరస్వతుల గురించిన కథనం ఎంత వరకూ నిజమో,  అసలు ఆ మాటకొస్తే నిజమో/ కాదో చెప్పే పరిజ్ఞానం నాకు లేదు కానీ, ఈ కథనం నేను ఇంతకూ ముందు ఎప్పుడూ వినని వెర్షన్ .
  ఈ కధనాలలో నిజమెంతుందో చెప్పగలిగే, అలాగే  రచయిత్రి తను పరిశోధించిన అంశాలని అన్వయించిన తీరు సరైనదో లేదో నిర్ధారించగలిగే  అకడమిక్  పరిజ్ఞానం గానీ, అసలు ఆ మాటకొస్తే పేరు లోనే alternative history అని ఉంది కదా వెండీ రాసిన విషయాలకి ఆధారాలు కావాలా అన్న ప్రశ్నకి సమాధానం కానీ నా దగ్గర  లేవు.   కాబట్టి , 'నాకు తెలిసిన / విన్న కొన్ని విషయాలతో పాటూ,  ఎప్పుడూ వినని కథనాలతో,  కొంత ఆశ్చర్యాన్ని & అసహనాన్ని కలిగిస్తూ ఒక bumpy ride తీసుకున్న అనుభూతిని ఈ పుస్తకం కలిగించింది'  అని చెప్తూ,  ఇక్కడితో పుస్తకం లోని విషయాలని ప్రస్తావించటం  ఆపేస్తాను .
  ***                              ***                               ***  

  ఇహ  ప్రస్తుత వివాదానికి దారి తీసిన  విషయాలకి వస్తే :
  2009 లో పెంగ్విన్ పబ్లిషర్స్ ప్రచురించిన ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు అభ్యంతరకరం అని, అవి హిందువుల ఫీలింగ్స్ ని   'hurt'  చేసేవిగా ఉన్నాయని 2011 దీనా నాథ్ బాత్ర (Head of Shiksha Bacho Andolan) 'IPC 295 A'    క్రింద lawsuit  ఫైల్  చేసారు (లీగల్ నోటీసు వివరాలు ) .
   
   IPC 295 A ఏమి చెప్తోంది :
  "295A. 5[ Deliberate and malicious acts intended to outrage religious feelings of any class by insulting its religion or religious beliefs.-- Whoever, with deliberate and malicious intention of outraging the religious feelings of any class of 6[ citizens of India], 7[ by words, either spoken or written, or by signs or by visible representations or otherwise] insults or attempts to insult the religion or the religious beliefs of that class, shall be punished with imprisonment of either description for a term which may extend to 8[ three years], or with fine, or with both.] "  (Source
  2011 లో  లీగల్ సూట్ ఫైల్ చేస్తే  దరిదాపు 3 ఏళ్ళ తరవాత 2014  Feb లో పెంగ్విన్ పబ్లిషర్స్  కోర్ట్ బయట    ఇండియన్ మార్కెట్ నుంచి ఈ పుస్తకాన్ని recall చేస్తాం అని 'Shiksha Bacho Andolan' తో   కుదుర్చుకున్న ఒప్పందంతో ఈ కేసు కి కోర్ట్ లో తెరపడింది .  (ఒప్పందం వివరాలు ఇక్కడ) . 

  పెంగ్విన్ పబ్లిషర్స్ పుస్తకాన్ని మార్కెట్ నుంచి ఉపసహరించుకోవటం మీద రచయిత్రి అభిప్రాయం : 
  "The true villain of this piece," she said, is "the Indian law that makes it a criminal rather than civil offence to publish a book that offends any Hindu, a law that jeopardises the physical safety of any publisher, no matter how ludicrous the accusation brought against a book."    (Source) .  ***                              ***                               ***           

  పెంగ్విన్ పబ్లిషర్స్ , 'Shiksha Bacho Andolan' కుదుర్చుకున్న out of court ఒప్పందంతో ఈ వివాదం ముగిసిపోయిందా?!  లేదు అలా జరగలేదు.  ఆశ్చర్యంగా పుస్తకంలోని విషయాలు అభ్యంతకరంగా ఉన్నాయి అని కోర్టులో 'లా సూట్'  ఫైల్ చేసిన నాటి కన్నా,  మార్కెట్ నుంచి వెనక్కి  తీసుకున్నారు అని తెలిసిన రోజున అతి పెద్ద వివాదానికి తెర లేచింది.  'Right to free speech', ఇంకా మతపరమైన విషయాల పట్ల పెరిగిపోతున్న హిందువుల అసహనం వంటి విషయాల మీద ప్రింట్ మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియా లోను ,  of course obvious గా ఇంటర్నెట్ లోను చర్చలు విసృతమయ్యాయి. 

  ఈ చర్చలలోని అంశాలలోకి  వెళ్ళే ముందు, అసలు పుస్తకం లోని విషయం మీద కోర్టు ద్వారా కాకుండా  కౌంటర్  arguments తో వేరే పుస్తకం ద్వారా కానీ, క్రిటిక్ రివ్యూ ద్వారా కానీ ఎదుర్కునే ప్రయత్నం చేయకుండా, ఇంత ఆందోళనకి దారితీసి కోర్టు తలుపులు తట్టాల్సినదిగా ప్రోవోక్ చేసే పరిస్థితులు ఎందుకు వచ్చాయో ఒకసారి చూద్దాం. 
  దురదృష్టవశాత్తు పురాతనమైన నాగరికతలలో ఒకటిగా చెప్పబడుతున్న మన గత కాలపు చరిత్రకి సంబంధించిన  ఆధారాలు జాగ్రత్తగా రికార్డు చేయబడలేదు,  దీనికి తోడుగా  విదేశీదాడుల్లో కొల్లగట్టబడిన, నాశనం చేసిన ఆధారాలు తక్కువ కాదు. అంతే కాకుండా హిస్టరీని, మైథాలజీని విడిగా చూడకపోవటంతో చరిత్ర కాస్తా ఫిక్షన్ గా మారింది. దీనితో ఒకే సంఘటనకి సంబంధించిన అనేక కథనాలు లభ్యం అవుతాయి. ఇక గత కాలాన్ని వదిలి ప్రస్తుతానికి వస్తే :  According to Article 28.1 of The Constitution of India : “No religious instruction shall be provided in any educational institution wholly maintained out of State funds.” దీనితో ప్రభుత్వం నుంచి ఆర్ధికపరమైన సహాయం అందకపోవటం పోవటంతో, రాజకీయంగా, ఆర్ధికంగా , సామాజికంగా ప్రధాన పాత్ర పోషిసిస్తున్న మతం గురించి  authentic గా అధ్యనయం చేసే అవకాశాలు తక్కువ.  ఈ vacuum ని పూరించటానికి వేరే దేశాల institutions చేసే రెలిజియస్ స్టడీస్  అధ్యనయనాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. పైగా తలకి మించిన ఆర్ధిక, రక్షణ సమస్యలు ఎదుర్కుంటున్న అభివృద్ధి చెందుతున్న దేశం ఇటువంటి రెలిజియస్ స్టడీస్ మీద ఎంత వరకూ ఖర్చు పెట్టగలదు?  ఇదో ప్రధాన సమస్య.  ఇటువంటి పరిస్థితుల్లో poor historiography & inaccuracies ([10][11][12][13])  ఉన్నాయని విమర్శలు  ఎదుర్కుంటున్న పుస్తకం ఎంత alternative history అని   పేరు పెట్టినా, తరువాతి కాలంలో అసలు చరిత్రకి ఒక రిఫరెన్స్ గా మారే ప్రమాదం ఉంది అన్న ఆందోళనలు సహజం. ఈ ఆందోళనలని మత మౌడ్యంగా కన్నా,  ఇప్పటి వరకూ చరిత్ర పట్ల పెద్దగా ఆసక్తి చూపని ఒక మతం, దాని వల్ల జరుతున్న నష్టాలని గురిస్తున్న పరిణామక్రమం లోని భాగంగా ఈ ఆందోళనలని చూడాలి అని నా అభిప్రాయం .

  ఏ పుస్తకానైనా  నిషేధించటం, తగులబెట్టటం వంటి చర్యలు ఏ సివిలైజ్డ్ సొసైటీకి ఆమోదయోగ్యం కాదు. ఇది తప్పక అందరూ అంగీకరించే / అంగీకరించాల్సిన సత్యం.  కానీ 'మతపరమైన విషయాల పట్ల  హిందువుల అసహనం ప్రమాదస్థాయి లో పెరిగిపోతుంది'  అని ప్రింటింగ్ మీడియా లోను, ఎలక్ట్రానిక్ మీడియా లోను ఉదారవాదులు చేస్తున్న విపరీత ప్రచారంలో నిజమెంత? అలాగే ఏ ఆంక్షలు లేని 'free speech' అమలు పరచటానికి భారతదేశంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా?(ఫ్రీ స్పీచ్ అంటూ 24X 7 lectures దంచే సో కాల్డ్ ఉదారవాదులు , సెలబ్రిటీస్ తమ దాకా వస్తే సోషల్ మీడియా లోని కామెంట్ల మీద కూడా పోలీసులకి పిర్యాదులు చేసే సంఘటనలు వేళ్ళ మీద లెక్క పెట్టె కన్నా ఎక్కువే) అన్నవి పరిశీలిస్తే :   

  1. 'మతపరమైన విషయాల పట్ల  హిందువుల అసహనం ప్రమాదస్థాయి లో పెరిగిపోతుంది' అన్న ఆరోపణల్లో నిజం : ఇది ఇప్పటివరకూ ఇండియా లో బాన్ చేసిన / బాన్ చేయాలని చాలెంజ్ చేసిన పుస్తకాల లిస్టు . ఈ లిస్టు చూస్తే ఈ ఆరోపణల్లో నిజమెంతో తెలుసుకోవచ్చు . ఇక గత కొద్ది సంవత్సరాలుగా అమాయకుల ప్రాణాలను టార్గెట్ చేస్తూ జరుతున్న దాడుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  నిజంగా హిందువుల్లో ఈ లిబరల్స్ చెబుతున్న స్థాయిలో మతమౌడ్యం వెర్రి తలలు వేస్తుంటే ఈ మాత్రం ప్రశాంతత కూడా ఉండేది కాదేమో ఈ దేశంలో. ఇక అదృష్టవశాత్తు ఈపుస్తక విషయంలో ఎటువంటి హింసాత్మక చర్యలు, రచయిత తలకి వెల కట్టటం వంటి అనాగరిక చర్యలకి పాల్పడటం వంటివి జరగలేదు. అలాగే  లీగల్ ప్రొసీడింగ్స్ చివరి వరకూ జరిగి ఉంటె ఏమి జరిగేదో తెలియదు కానీ, ప్రస్తుతం మాత్రం పుస్తకాన్ని బాన్ చేయలేదు, కేవలం మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు.  ఒకవేళ బాన్ చేసి ఉంటె ఇలా పుస్తకం గురించిన చర్చలు, టెక్స్ట్ కోట్ చేయటం కూడా నేరమే అయి ఉండేవి.

  2. ఆంక్షలు లేని 'free speech' : భారతదేశం demographics ని పరిశీలిస్తే ఎల్లలు లేని 'free speech '  hate speech గా రూపుదిద్దుకుని తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పటానికి పెద్దగా సర్వేలు , రీసెర్చ్ లు , అనాలసిస్లు అక్కరలేదు . ఇప్పటికే ఒక సెక్యులర్ దేశంగా చాటి చెప్పుకోవటానికి నానారకాల విన్యాసాలు చేస్తున్న దేశానికి ఇదో పెద్ద ఓవర్ బర్డెన్.  ఆంక్షలు లేని ఫ్రీ స్పీచ్  కన్నా ఒక మామూలు మనిషి సుఖంగా,  సేఫ్ గాను బ్రతకటానికి కావాల్సిన communal harmony అనేది ముఖ్యం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ పుస్తకం తో సంబంధం లేని అంశం అయినప్పటికీ ప్రస్తావించకుండా ఉండలేని అంశం. అమాయకుల ప్రాణాలు కోల్పోయే అవకాశమున్న సంఘటనల కన్నా  పోలిస్తే myths ఆధారంగా రాయబడిన పుస్తకం మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవటం అనేది పెద్ద అంశంగా గుర్తించి వెల్లువెత్తిన లిబరల్స్ స్పందన  నాకు ఆశ్చర్యాన్ని కలిగిచింది. 


  ఇక, ఈ పుస్తకం లో అంశాలు మీద లీగల్గా  proceed అవ్వడం అనేది అలనాటి సోక్రటీస్ కి వేసిన మరణ శిక్ష , గలీలియో కి వేసిన జీవిత ఖైదు తో పోల్చే వారికి ఒక రిక్వెస్ట్ : Guys , సోక్రటీస్ & గలీలియో అనేవాళ్ళు myth కాదు ఈ  భూమి మీద మనలానే flesh and blood తో బ్రతికిన మనుషులు . వాళ్ళ  పరిశోధనలకి విలువనిద్దాం . తాము నమ్మిన దాని కోసం  మరణానికి , జీవిత ఖైదుకి కి సిద్దపడిన వారిని , నా పుస్తకం మీద లీగల్ గా కేసు వేసారు కాబట్టి నేను ఇండియా రాను ఇక మీదట అనే సిల్లీ స్టేట్మెంట్స్ ఇచ్చే వాళ్ళతో కంపేరు చేసి విలువని తగ్గించొద్దు అని . 

  Finally , Wendy Doniger has a right to say whatever she wants to  say and  publish it . I will defend her right. However, it does not mean to ask Batra should not exercise his right and keep silent if he find her work is rubbish.


  - శ్రావ్య


  Btw, I totally forgot to  mention one thing above ,  కోర్టులో కేస్ వేసి , లీగల్గా  ప్రొసీడ్ అయ్యి బాత్రా , వెండీ పుస్తకానికి ప్రాముఖ్యతని తెచ్చి, సేల్స్ పెంచారు . ఇది అక్షరాలా అంగీకరించాల్సిన విషయం,  సందేహం ఏ మాత్రం  లేదు. కాకపోతే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్న వాళ్ళు మరచిపోతున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, బాత్రా వెండీ పుస్తకానికి తెచ్చిన ప్రాముఖ్యత కన్నా ఇంకా కనీసం రెండో మూడో రెట్లు ఎక్కువ  ప్రాముఖ్యత   'IPC 295 A' కి ఈ చర్చల ద్వారా వచ్చింది అని. ఇప్పుడు నాలాంటి సామాన్యులకి కూడా ఏదన్నా పుస్తకం నచ్చకపోతే ఏమి చేయాలి అనే awareness వచ్చింది :-)


  References : 
  The Hindus: An Alternative History
  A Passion for Hindu Myths
  Beheading Hindus 
  Meeting the book ban man
  హిందూమత చరిత్రలో ప్రత్యమ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? 
  Wendy Doniger 'On Hinduism' 
  Here comes the book police


  (తోలి ముద్రణ మాలిక మాగజైన్ మే 2014 ఇష్యూ లో ఇక్కడ)

  Tuesday, February 4, 2014

  The Future Grocery Store !


  నేనొక సూపర్ మార్కెట్ కడనిల్చి చివాలున తలతిప్పి 
  వెళ్లిపోవునంతలోన ఐటమ్స్ అన్నియు జాలిగ
  నోళ్ళువిప్పి మమ్ముకొనిపోవాయనుచు 
  బావురుమన్నవి  అటుచూసినంతనే     
  నా మానసమందేదో తళుకుమన్నది ఈ బ్లాగ్ పోస్టయ్యి ...
                                                                                         (జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి  క్షమాపణలతో )

  నాకు మీ హ హ కారాలు వినిపిస్తున్నాయి.  ఏదో  కొత్తదనాన్ని, క్రియేటివిటీని అప్లై చేద్దామనుకుంటే, ఇంకేదో అయ్యేట్లుగా ఉంది. సరే,  మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం దేనికి కానీ,  నా మామూలు స్టైల్ లోకి  వచ్చేస్తా . ఇంతకీ అసలు విషయం ఏంటంటే ?!  (చదవండి  క్రింద మరి)

  ***

  ఒక వారం/పది రోజుల రోజుల క్రితం లంచ్ టైములో తిండి కార్యక్రమం ముగించి తిరిగి  ఆఫీసుకి వెళుతుంటే, ఆ ఫుడ్ కోర్ట్ ఉన్న మాల్లో ఉన్న ఒకానొక సూపర్ మార్కెట్లో ఈ ఫోటోలోని  సెటప్ నా కంటపడింది.   ఏం కంటపడింది,  ఏముంది ఆ ఫోటోలో అంత విశేషం అంటారా?! అయితే నేను ఫోటో సరిగా విషయం హైలైట్ అయ్యేట్లు తీయలేదు.  సో ఇక వేరే దారి లేదు ఎక్ష్ప్లైన్ చేయటం తప్ప.  ఆ ఫోటోలో పై భాగంలో మీరు గమనిస్తే  "3 easy steps " అని రాసున్నది కనిపిస్తుంది కదా ?!  అదన్న మాట అసలు విషయం . ఆ మూడు స్టెప్స్ ఏంటంటే మీరు కొనుక్కున వస్తువులని మీరే స్కాన్ అదేలెండి బిల్ చేసి, బాగ్ లో వేసుకుని, డబ్బు కట్టి వెళ్ళిపొండి అని . అదే అదే 'Self-service checkout' . నిజానికి ఇందులో వావ్ అనిపించే గొప్ప సరికొత్త  టెక్నాలజీ బ్యూటీ  ఏమి లేదు,  కానీ ఉన్న టెక్నాలజీనే చిన్నపాటి మార్పులతో implement చేసిన తీరు చూడగానే,  భవిష్యత్తు లో ఈ  'Self-service checkouts ' సూపర్ మార్కెట్ / గ్రోసెరీ స్టోర్ కొత్త అందాలని అద్దుకోవటంలో ఎలాంటి రోల్ పోషించబోతున్నాయా  అన్న ఆలోచన వచ్చింది.  ఆ మాటకొస్తే అసలు future grocery store ఎలా ఉండబోతుందో కూడా ఒక చూపు చూద్దాం అనిపించింది . 

  అవునూ ...  అసలు భవిష్యత్తులో  గ్రోసరీ స్టోర్ / రిటైల్ మార్కెట్ అభివృద్ధి లో 'Self-service checkout'  పాత్ర ఎలా  ఉంటుందో  ఊహించే ముందు,  అసలు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఈరోజుల్లో వీటి పరిస్థితి ఏంటోచూస్తే కొంచెం బాగా ఊహించుకోవచ్చు కదా ? !  కరెక్ట్ ! అందుకే నా ముందున్న బుల్లి వెండితెర మీద గ్లోబ్ ని సర్రున తిప్పాను . అది వెళ్లి USA దగ్గర ఆగింది. ఒకే,   మన కథ అక్కడి నుంచే  మొదలు పెడదాం రండి .

  అమెరికా ...  అమెరికా లో  'Self-service checkout' తో షాపింగ్ experience గురించి తెలుసుకోవాలి !... ఇలా అనుకోగానే వెంటనే ఒక ఫ్రెండ్ కి మెయిల్ చేసాను. మీ దేశం లో ఈ Self Checkouts పరిస్థితి ఏంటి అని . అంతే కొన్ని నిమషాల వ్యవధిలో ఈ క్రింది డిటైల్డ్  ఇన్ఫర్మేషన్ నా ముందు ప్రత్యక్షం .  

  "Self-checkout? అవి చాలా ఏళ్ళే అయ్యింది ఇక్కడి వచ్చి(నాకు తెలిసి ఏడెనిమిదేళ్లయిందేమో, కరెక్ట్ గా గుర్తులేదు). చాలా స్టోర్స్ లో ట్రయిల్ రన్ క్రింద పెట్టి కొన్నింటిలో తీసేసారు. వాల్ మార్ట్ లో చాలానే పెట్టారు, తీసేసారు, మళ్లీ పెట్టారు. కాస్ట్ కోలో ఇప్పటికీ ఉన్నాయి.
  ఒకటే తలనొప్పి ఏంటంటే, దాని మీద ఐటమ్ పెట్టి స్కాన్ చేసాక, అది సరిగా పక్కకి స్లైడ్ చేసి బెల్ట్ మీద  పడేయకపోతే, లేదూ పక్కనున్న బ్యాగ్ లో పెట్టకపోతే ఆ స్కానర్ పట్టుకుంటుంది. Improper activity అని సస్పెక్ట్ చేసి బెల్ మోగుతుంది. ఆ తరువాత్ స్కాన్ చేయనివ్వదు. అది unlock చేయటానికి స్టోర్ పర్సన్ కోసం వెయిట్ చేయాలి.  ఇలాంటి చికాకు బాగా ఎక్కువయ్యేసరికి, స్టోర్స్ వాళ్లు వేస్ట్ అని తీసేసారు కొన్ని చోట్ల.  కానీ  మళ్లీ అన్నిటిలో వచ్చేసాయి. సాఫ్ట్ వేర్ ఇంప్రూవ్ చేసారు. ఇంకా  ఏం చేస్తున్నారంటే ఒక నాలుగో, ఆరో ఇలాంటి టర్మినల్స్ పెట్టేసి, వీటికి సెంట్రల్ గా మళ్ళీ ఒక దగ్గిర అక్కడే ఒక చిన్న టర్మినల్ పెట్టి, అక్కడ పర్మనెంట్ గా ఒక మనిషిని deploy చేస్తున్నారు.. సో ఈ నాలుగో, ఆరో వాటిల్లో ఏ ఒక్కటి struck అయినా, ఆ పర్సన్ వెంటనే అక్కడే ఉంటారు కాబట్టి  ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తారు.కాస్ట్ కో లాంటి స్టోర్స్ లో సక్సెస్ ఫుల్ గా వాడుతున్నారంటే  సక్సెస్ అయినట్లే. ఎందుకంటే కాస్ట్ కో లో భారీ ఎత్తున purchase చేయటానికి వెళ్ళే  స్టోర్. 
  కానీ నేను చాలా కొన్ని ఐటమ్స్ ఉంటే తప్ప self checkout వైపు వెళ్ళను. చిరాకు, అన్నీ మనమే చేసుకోవాలి, కార్ట్ లోంచి ఎత్తి పెట్టి, స్కాన్ చేసి, పక్కకు తీసి, బెల్ట్ మీదో, బ్యాగ్ లోనో పెట్టి, అట్లా ఓ ముప్పై ఉంటే వాటన్నిటికీ చేసి, మధ్యలో ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆ attend చేసే పర్సన్ రావాలి..ఎందుకొచ్చిన గోల  అని నేను రెగ్యులర్ రిజిస్టర్ దగ్గిరకే వెళ్తాను... అన్నీ వాళ్లే చేస్తారు.. మనం కార్ద్ స్లైడ్ చేయటమే.  కానీ కొన్నే ఉంటే  self checkout బెటర్ "
   
  ఇలా అమెరికాలో ఉన్నవాళ్ళ experience తెలుసుకున్న తరవాత యూరోప్ లో ఏమి జరుగుతుందో చూద్దాం అని ఈసారి గూగుల్ ని ఆశ్రయించా . సేం స్టోరీ.  ఒకటి, రెండు decades క్రింద వాడకం మొదలుపెట్టినా పెద్దగా  సక్సెస్ రుచి చూడలేదు కానీ, మళ్ళీ ఇప్పుడిప్పుడే సక్సెస్ బాట పడుతుంది అని . ఆస్ట్రేలియా : Around 2008 లో వాడకం మొదలుపెట్టినా పెద్దగా సక్సెస్ చూడలేదు . అయితే, One of the major player అయిన   'Woolie s' ఈ self checkouts ని తగ్గిస్తుంటే , మరో  major player  'Coles '  వాడకాన్ని పెంచుతుంది . ఇహ ఆసియా - పసిఫిక్ , మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఈ వైపుకి అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి .

  మొత్తం మీద ఒక decade క్రితమే ఈ 'Self Checkouts'  అనేవి ప్రపంచానికి తెలిసినా , ఒక 5/6 years నుంచి వాడకం పెరిగింది, భవిష్యత్తులో పెరిగే సూచనలు కనపడుతున్నాయి అని  'Retail Banking Research'  చేసిన సర్వేలు చెబుతున్నాయి.  కాబట్టి  సమీప భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఈ 'Self Checkouts'  ఎక్కువగా కనపడటం (అది కూడా దరిదాపు traditional checkouts obsolete అయ్యేంతగా) అనేది ఖచ్చితం అని ఊహించొచ్చు. ఇహ future grocery స్టోర్ లో కేవలం  ఈ 'Self Checkouts' వాడకం కాకుండా ఇంకేమి మార్పులు చోటు చేసుకోవచ్చు?!  ఒకవేళ అసలు, ఇప్పటికే Amazon అందిస్తున్న Amazon Fresh లాంటి  ఆన్లైన్ ఆర్డర్ , హోం డెలివరీ / పికప్ సర్వీసెస్ విపరీతంగా వృద్ధి చెంది భవిష్యత్తులో అది గ్రోసెసరి స్టోర్  natural death కి దారి తీసి రిటైల్ మార్కెట్ పూర్తిగా తన ముఖ చిత్రాన్నే మార్చుకోనుందా ? 

  If anyone ask me the same question, my answer is a big NO. ఎందుకూ ? Shopping is not exactly the same thing as buying,  ఏ section of people అయినా ఏదో కొన్ని సందర్భాల్లో ఇటువంటి సర్వీసెస్ మీద ఆధారపడతారేమో కానీ, జీవితకాలం మొత్తం షాపింగ్ అనే సోషల్ ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వడం అనేది జరగని పని. మిగిలిన నాన్ ఫుడ్ ఐటమ్స్ తో పోల్చితే ఫెరిషబుల్ అయిన ఫుడ్ ఐటమ్స్ ని డెలివరీ చేయటం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.పైగా గతకొద్ది సంవత్సరాలుగా గమనిస్తే, Now a days people are more health conscious than olden days. ఇది భవిష్యత్తులో మరింతగా పెరుగుతుంది. దీనితో healthy లైఫ్ స్టైల్ కి అనుగుణంగా లభ్యమయ్యే wide range of choices నుంచి కావాల్సినవి ఎన్నుకోవటం , అలాగే ఫ్రెష్నెస్ ని చెక్ చేసి కొనగలిగే అవకాశం మార్కెట్స్ తో ఎక్కువగా ఉంటుంది . So,  గ్రోసెరీ స్టోర్ అనే కాన్సెప్ట్ మన జీవితాల్లో నుంచి మాయం కావటం అనేది జరగదు కానీ, సరికొత్త మార్పులని మాత్రం సంతరించుకుంటుంది. అవి ..

  •  షాపింగ్ ట్రాలీస్ పైన మౌంట్ చేసిన టచ్ devices తో లేదూ స్మార్ట్ ఫోన్ యాప్  తో మనకి కావాల్సిన ఐటెం స్టోర్ లో ఎక్కడుందో ఈజీ గా వెతుక్కోగలగటం. 
  •  షాపింగ్ చేయాల్సిన లిస్టు ఈ టచ్ డివైస్ లోకి డౌన్లోడ్ చేసుకోగలటం .  దీంతో మనకి కావాల్సిన ఐటమ్స్ స్టాక్ లో ఉన్నాయో లేవో, ఉంటె వాటి లొకేషన్ ఈజీ గా తెలుసుకోవటం. 
  • హెల్త్ ప్రొఫైల్ని , సూపర్ మార్కెట్ డాటా తో integrate చేయటంతో, కొనబోయే ఐటెం గురించి అవసరమైన మెడికల్ suggestion  (ఉదాహరణ కి అలెర్జీస్ లాంటివి ) లాంటివి popup చేయటం. అలాగే హెల్త్ ప్రొఫైల్ కి అనుగుణం గా మార్కెట్ లోకి వచ్చిన కొత్త ప్రొడుక్ట్స్ సజెస్ట్ చేయటం. 
  •  మన షాపింగ్ హిస్టరీ ని అనలైజ్ చేసి , ఎక్కువగా కొనే, లేదూ ఫేవరెట్  ఐటమ్స్ లిస్టు ని చూపించటం . 
  • మరి కొంచెం కొంచెం ముందుకి వెళితే ఇంట్లో అయిబొతూన్న ఐటమ్స్ , expiry అయిపోయిన ఐటమ్స్ లిస్టు ని చూపించటం . 
  • RFID based Checkouts  - అంటే మార్కెట్  ప్రతి వస్తువుపైన బార్  కోడ్ బదులుగా స్మార్ట్ లేబుల్స్ (RFID టాగ్స్ )  వాడతారు . షాపింగ్ అయిపోయి కార్ట్ తో బయటకి వచ్చేటప్పుడు  RFID రీడర్స్ తో డిజైన్ చేసిన ఎగ్జిట్ లోంచి బయటకి వస్తుంటే, ఆ షాపింగ్ కార్ట్ లోని ఐటమ్స్ ఆ రీడర్ రీడ్ చేసి , ఆ లిస్టు ని స్టోర్ వాళ్ళకి పంపుతుంది. బిల్లు మాత్రం మీ బ్యాంకు ఎకౌంటు కి పంపుతుంది లేదూ అక్కడే పే చేయొచ్చు . (వీటిని ఇప్పటికే ట్రయిల్ బేసిస్ లో వాడుతున్నారు). 
  • ఇక గ్రోసెరీ స్టోర్ వాల్స్ ఎంత మాత్రం మామూలు బోరింగ్ గా ఉండే plain వాల్స్ కానే కావు. సరికొత్త ఐటమ్స్ యాడ్స్ ,  రక రకాల ఆఫర్స్ తో మాయాజాలం చేసే డిజిటల్ తెరలు గా మారతాయి. 
  •  పైన చెప్పినవన్నీ  టెక్నాలజీ తో ముడిపడి ఉంటె అలా టెక్నాలజీతో  సంబంధం లేని అంశం ఇది. పెరుగుతున్నఆరోగ్యం పట్ల  జాగ్రత్త,  ఇంట్లో పెంచిన  అదేలెండి  పెరట్లో పెంచిన (హోం గ్రోన్) ,  ఇంట్లో వండిన (హోం cooked) ఫుడ్స్ మీద ఆసక్తి ఇంకా పెరిగి ఫుడ్ స్వాప్ చేసుకునే సెంటర్స్ గా కూడా  సూపర్ మార్కెట్స్ చిన్న పాత్ర పోషిస్తాయేమో . 
  •  
       ఇలా చెప్పుకుంటే పోతుంటే వస్తూనే ఉన్నాయి ఆలోచనలు ఫ్రీ కదా, ఖర్చు  ఏముంది :-) కానీ మీకు మరీ ఎక్కువసేపు బోర్ కొట్టిస్తే నా immediate ఫ్యూచర్ ఏంటో నా కళ్ళ ముందు కనపడుతుంది . అందుకే ఇక్కడ full stop పెడతాను నేను . మీరు మాత్రం  మొహమాటపడకుండా మీ కొచ్చిన ఐడియాలు ఇక్కడ  చెప్పండి . ఏమో  ఒక ఐడియా జీవితాన్నే మార్చొచ్చు  కదా ?!!!!!! హలో !! హలో !! చెప్పమన్నా కదా అని జీవితాన్ని నెగటివ్ దిశలోకి దూసుకు పోయే గ్రాఫ్స్  లాగా గీయటానికి కావాల్సిన coordinates కి పనికొచ్చే ఐడియాలు ఇవ్వటానికి రెడీ ఆవుతున్నారు, ఏంటండీ అన్యాయంగా?  ముందుకి...  ముందుకి..  దూసుకుపోదాం మనం అది గుర్తు పెట్టుకొండి.  ఇక నేనుంటాను మరి :-)
  -శ్రావ్య