Subscribe:

Sunday, October 17, 2010

వారాంతపు పొలిటీషియన్ గారు ఇది మీ కోసమే !

వీకెండ్ పోలిటిషీయన్ గారు భలే ! హన్నా ఎంత మాట నా స్తాయి గంగా భవానీ, శోభారాణీ మాత్రమేనా ఇంకొంచెం క్రియేటివిటీ వాడండి సారూ . ఆ అయినా కామెంట్ రాయటానికి కూడా లాజిక్ కాపీ కొట్టే మీరేమి వాడతారు బుర్ర నా వెర్రి గానీ . ఇంతకూ ఆ హక్కుల కోసం పోరాడిన కార్యకర్త గా మీరొక్కరే చరిత్ర లో మిగిలిపోదామనుకున్నారా ఎంత అన్యాయం మీ ముందు నుంచి ఉన్నవాళ్ళ సంగతేమిటి ? మహానుభావా మీకు ఇందంతా తెలవాలంటే కొద్ది గా రెండు సంవత్సరాలు వెనకెళ్ళి బ్లాగులు అన్ని చదవాలి, మరీ షార్ట్కట్ లో లీడర్ అయ్యిపోవాలంటే ఎలా ?
పైన రాసింది చదివి మీకున్న చిన్న బుర్రతో అలోచించి అలిసిపోయి మళ్ళీ వేరే వాళ్ళ లాజిక్ కాపీ కొట్టటానికి బయలుదేరకండి, నా ఉద్దేశ్యం నేను రాసిన కామెంట్ నిజం గానే మీ ఒక్కళ్ళ గురించి మాత్రమే కాదు అని చెప్పటమే . నిజం గానే మీ గురించే రాయాలంటే ఖచ్చితం గా మీ బ్లాగులోనో లేదా మీపేరు ఉదాహరించో రాసేదాన్ని నాకు ఆ ధైర్యం ఉంది మీకు లాగ ఒక పని చేయటానికి వేరే వేషం లో వెళ్ళాల్సిన పని నాకు లేదు.
BTW వేరే పార్టీ కార్యకర్తల సంగతి సరే మీకేంటి పాపం ఒక్క కార్యకర్త దొరకలేదా అన్ని వేషాలు మీరే వేస్తున్నట్లు ఉన్నారు (ఆఖరికి ఆత్మహత్య చేసుకొనే అజ్ఞాత తో సహా) .

Friday, October 15, 2010

మేరా భారత్‌ మహాన్‌

వహ్వా వహ్వా నాకు నిజం గా ఇవాళ భలే ఆనందం గా ఉంది . కారణం రకరకాల వార్తలు, అనుమానాల తో మొదలైన CWG 2010 ఇంత చక్క గా ముగియటం ఒక కారణమైతే , పతకాల పట్టికలో మన దేశం రెండో స్థానంలో నిలవటం ఇంకో కారణం . అంతేనా ఆద్యంతం మన సంస్క్రతి ని ప్రతిబింబించే కార్యక్రమాలు నిజం గా చాల బాగున్నాయి . ముఖ్యం గా ముగింపు కార్యక్రమంలో బాగం గా స్కూల్ పిల్లలు మన జాతీయ పతాకం రంగులద్దుకొని చేసిన ప్రోగ్రాం నాకు చాల నచ్చింది . నచ్చనివి లేవా అంటే ఉన్నాయి, ఈ కల్మాడీ గారికి కి ఆర్గనైజింగ్ సెక్రటరీ గా వోట్ థాంక్స్ చెప్పాలని తెలుసు కాదా, ఆ రాసినదేవరో చక్కగా రాసారు ఎవరిని మర్చిపోకుండా ఈయన కొద్దిగా ముందే ఒకటి సార్లు ప్రిప్రేర్ అయ్యి కొద్ది గా అందం గా చదవచ్చు కదా అబ్బే , ఈయన ముందేమి స్కాములు చేసాడో వాటికి ఆధారాలు ఉన్నాయో లేవో నాకు తెలవదు కాని వీలయితే ఈ చదివిన తీరుకి పనిష్మెంట్ ఉండాలి.
ఈ CWG 2010 మొదటి నుంచి చివర దాక చూసిన తరవాత నాకో అనుమానం వచ్చింది నాతో పాటు గా మనలో చాల మంది కి సెగ తగిలితే కాని పని చేయని లక్షణం ఉన్నట్లుంది అంటే డెడ్ లైన్ కి దగ్గర గా వస్తే కాని పని చేయాలన్న మూడ్ రాదనుకుంటా :) ,
ఈ ఆటలలో విజేతలైన , పాలుపంచుకున్న క్రీడాకారులందరికీ నా అభినందనలు , మన హైదరాబాదీలైన సైనా , గగన్ నారంగ్ లకి కొంచెం ప్రత్యేక అభినందనలు ! అలాగే ఈ కార్యకమాలన్ని ఇంత విజవంతం చేసి అంతర్జాతీయ ప్రపంచానికి మన క్రీడా నిర్వాహణ సామర్దాన్ని చాటటానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు !
నేను ఈ పోస్టు రాసే సమయానికి మన ఇండియన్ ఐడొల్ శ్రీరామచంద్ర పాడుతున్నాడు :)