Subscribe:

Monday, January 23, 2012

సల్మాన్ రష్దీ , MF హుస్సేన్ , Saeed Malekpour


నాకు అప్పుడప్పుడు  భలే బుర్ర తొలిచే  అనుమానాలు  వస్తుంటాయి .   అవి  అర్జెంటు గా ఎక్కడో ఒక చోట   గీకేయకపోతే    అస్సలు  అన్నం , నిద్ర  వంటి వాటికి  దూరం  కావాల్సి వస్తుంది . అందుకే  ఎక్కడ గీకేద్దమా   అని  చూస్తుంటే,   పాపం ఇదుగో   నేనున్నాను అంటూ నా బ్లాగు   దొరికింది  అందుకే  ఇక్కడ  గీకేస్తున్నా .

ఇంతకీ అనుమానం ఏంటంటే 

అదుగో అప్పుడెప్పుడో  MF హుస్సేన్  గీసిన  బొమ్మల  మీద    జనాలు విరుచుకు పడ్డారు అని  గగ్గోలు  పెట్టె  మన మానవతావాదులు , కళాభిమానులు  , అత్యంత  దయార్ధ్ర హృదయులు అయిన వార్తా విశ్లేషకులు , కానీ వారికి నేను సైతం అంటూ మద్దతు  పలికే  వారు గానీ , టన్నులు టన్నులు కామెంట్లు రాసేవారు  గానీ  సల్మాన్ రష్దీ  గురించి    , జైపూర్ లిటరసీ ఫెస్టివల్  లో జరుగుతున్న విశేషాలు   గురించి , మైనారిటీ  ఓట్లు  కోసం ప్రభుత్వం  పడుతున్న పాట్లు గురించి  మాట్లడరేంటి అని .

నాకు తోచిన  సమాధానం ఇది :
 హిందువుల  మనోభావాలు  దెబ్బ తింటే  వాళ్ళు చేసేముంటుంది , పైగా  అటువంటి వాటిని  ఖండిస్తే మంచి లౌకికవాది అన్న  పేరొస్తుంది  గాని . అదే  ఈ విషయం  లో ఏదన్నా  నోరు జారితే   వీళ్ళ తలలకి  కూడా  విలువ  కట్టేస్తారు అన్న  భయమేమో అని నాకు చిన్న అనుమానం .  ఒక వేళ ఇదే కారణం ఐతే  అర్ధం చేసుకోగలిగినదే    ముందు ముందు   బోలెడు  వార్తలు  వండి వార్చాలంటే  వీళ్ళ  తలలు ముఖ్యం కదా .  ఆ ఉద్దేశ్యం తో    కొంచెం  రెస్టు తీసుకొని  ఈ పరిస్తితులన్నీ  చక్కబడ్డకా  మళ్ళీ   బురద పోయటం  స్టార్ట్   చేస్తే  బావుంటుంది అని ఆలోచనేమో .  తెలివైన ఆలోచన కదా . 
ఇది కాకుండా  మీకు ఇంకేమన్నా కారణాలు   తోస్తే నాకు చెప్పటం మరిచిపోకండే !

ఇంకో  విషయం ఉండదోయ్ , ఇక్కడ  చూడండి  ఇరాన్ ప్రోగ్రామర్ కి  death  sentense confrm  చేసిన  వార్త  కూడా ఎందుకో అస్సలు తెలియదనుకుంటా  ఈ మానవతావాదులకి   
 
అమ్మయ్య  ఇక్కడ  గీకేసా కదా,   ఇక  వెళ్లి    అసలే ఇవాళ చైనీస్ న్యూ ఇయర్  మొదటి  రోజు కాబట్టి  చీపురు ని  వాడకూదట , ఇల్లు తుడవకూడదట .  నేనా  పెద్ద మేధావి నీ   కాదు,  ఇంకా   ఎవరి సంప్రదాయనైనా  గౌరవించాలి అన్న  అజ్ఞానం లో  కూడా మునిగి తేలుతున్నా  కాబట్టి మా ఇంటి ఓనర్ చెప్పిన మాట  ప్రకారం ఎటువంటి పనీ  పెట్టుకోకుండా ఒక కునుకు తీస్తా .  



Sunday, January 15, 2012

శ్రీ S.K.జయచంద్ర IPS

కొంతమంది  వ్యక్తులతో  మనకు ఎటువంటి   రక్త సంబంధం   ఉండకపోవచ్చు కానీ  సడన్ గా  తళుక్కున మెరిసి  మన  జీవితం లో  మంచి మలుపు కి మాత్రం కారణం అవుతారు . ఒకసారి  వెనక్కి  తిరిగి చూసుకుంటే  ప్రతి ఒక్కరి జీవితం  లో కనీసం ఒక్కరన్నా అలా  గుర్తుకొస్తారు  అని నాకు గట్టి నమ్మకం . . అలా   వెనక్కి తిరిగి చూసుకుంటే  నేను తప్పని సరి గా  గుర్తు చేసుకోవాల్సిన  వారు శ్రీ  జయచంద్ర IPS .   వీరి దగ్గర  నేను దాదాపు  ఒక  సంవత్సర  కాలం పని చేసాను .  

వీరి గురించి కొన్ని వివరాలు 


Education : 
M.Sc, (Nuclear Physics)

M.Phil,
MBA (HRD)


AwardsPolice Medal for meritorious services
President's Police Medal for Distinguished services
Indira Gandhi National Award for Outstanding Services
Indian Medical Association (IMA) Award for Outstanding Services

వీరి  పూర్తి   బయోడేటా  ని ఇక్కడ  చూడొచ్చు . 

దేశం లోని అత్యున్నత  సర్వీసు  లో పని చేసిన  వీరి  గురించి  నేను ప్రత్యేకం  గా  చెప్పవలసిన  పని లేదు కానీ,  వారిని చూసి నేను   నేర్చుకున్నా  , తెలుసుకున్న విషయాలు మాత్రం బోలెడు , వాటిని పంచుకుందామనే  ఈ ప్రయత్నం ....

సాధారణం  గా  మనలో  చాలా మంది కి ఎగ్జామ్స్ కి ప్రిపేర్  కావటం అంటే  పడి పడి  చదవటం , లేదా  బోలెడు  రిఫెరెన్సు  పుస్తకాలు  సంపాదించటం ,  అది వ్రాత పరీక్ష ఐతే  నేరుకున్న దాన్ని  సరిగా    ప్రెజెంట్   చేయగలుతున్నామా   అని  చెక్  చేసుకోవటం, ఇంకా   ఓపిక  ఉంటె  మాక్ టెస్టులు అటెండ్  అవటం   ఇలా చేస్తాం కదా ?  వీరి  దగ్గర  నేను  నేర్చుకున్నది ,   మనకి ఒక సబ్జెక్టు కి   సంబంధించిన    ఎక్షామ్  ఏ సమయం  లో ఉంటుందో ఆ సమయం లో  అదే విధం గా   పరీక్షలకి కొంచెం ముందు నుంచి  ప్రిపేర్ అవ్వడం .   దీని వల్ల  మనకి తెలియకుండానే  మన  బ్రెయిన్  షెడ్యూల్  అవుతుంది , దానితో  మంచి result   కి అవకాశం ఉంటుంది 

ఈ టిప్  నేను ఇప్పటికి ఫాలో  అవుతాను . ఒకవేళ  క్లైంట్  కి ఒక పర్టిక్యులర్  టైం లో  రన్ అవ్వవసిన  schedules ఉంటె  కరెక్టు గా  ఆ షెడ్యూల్  టైం కి కనీసం ఒక్క  సారన్న  టెస్ట్ రన్  చేయకుండా రిలీజ్ చేసే ప్రసక్తే లేదు :)

ఇలా నన్ను ఆశ్చర్య పరచిన కొన్ని విషయాలు 
  • హాబీ గా వెబ్ designing చేయటం .  
  • ఎంతో   ఓపికగా  టెక్నికల్ టిప్స్  వివరించటం .
  • ఈ సివిల్ సర్వీస్ లో  ఉండే వారికి  మరి ఆ ఎనర్జీ  ఎలా వస్తుందో కానీ   లాంగ్  hours వర్క్ చేసినా సరే  అదే  ఎనర్జీ తో  ఉన్నారు . మరి అది ఎలా  సాధ్యం  వాళ్ళే చెప్పాలి .
  • అంత బిజీ లైఫ్ లో  ఉండి  కూడా     విష్ణు సహస్రం   ని   అర్ధం తో సహా   తెనిగించడం  . 
  • ఇక భక్తి   విషయం లో  నాకు తెలిసినప్పటి నుంచి  కార్తీక  మాసం మొత్తం  ఉపవాసం చేస్తారు  . 
  • పదవులతో    తో   సంబంధం   లేకుండా  టాలెంట్  ని గుర్తించి ఎంకరేజ్  చేయటం .

ఇలా చెబుతూ ఉంటె ఈ లిస్టు  చాలా పొడవుతుంది కాబట్టి , ఇక్కడి తో  సరిపెడతాను .

నాతో సహా ఎందరికో స్పూర్తినిచ్చిన జయచంద్ర గారు గత నెలాఖరున డీజీపీ గా పదవీ విరమణ చేశారు. పదవులతో నిమిత్తం లేకుండా వారు అందించే స్ఫూర్తి మరెందరికో అందాలని మనస్పూర్తిగా కోరుకుంటూ... 





( నెమలికన్ను మురళి గారికి  ప్రత్యేక  ధన్యవాదాలు )