ఆలో ఆలో టెకీస్ ఆ టైటిల్ చూసి ఏ సర్వర్ కో కనెక్ట్ అయ్యిపోకుండా మామూలు ప్రపంచం లోకి రండి . నేను మాట్లాడేది మన మామూలు జీవితం లో కొన్ని సోషల్ రిలేషన్ షిప్స్ , హాబీలు వగైరా వగైరా నుంచి నుండి తప్పనిసరి అనిపించినప్పుడు గ్రేస్ఫుల్ గా పక్కకు తప్పుకోవటం గురించి . మరి ఆ టైటిల్ ఎందుకు అంటే, క్యాచీ గా ఉంటుంది అని తెలుగు దర్శకుల బాట పట్టా :)
అసలు ఏదన్నా రిలేషన్ షిప్స్ , హాబీలు వీటి నుంచి పక్కకి ఎందుకు వెళ్ళాలి అని ఎవరన్నా అయోమయం గా నావైపు చూస్తుంటే వాళ్ళకి నా సమాధానం మీరు ఇప్పటి వరకు అదృష్టవంతులు infront there is crocodile festival అని అన్న మాట . నీ KJ లు ఆపి సరిగ్గా చెప్పవమ్మా ఆంటే ఏముందండి మన బుర్ర లో తోచే ఆలోచనలు ఇవాళ ఉన్నట్లు రేపు ఉండకపోవచ్చు, లేదు తప్పనిసరి గా మన జీవితం లో వచ్చే మార్పులకి అనుకూలం గా మారాల్సి రావచ్చు . కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్లు దీనికి కూడా బోలెడు కారణాలు అన్నమాట.
సరే ఇక ఎలాగు తప్పదు అని మనకి తెలిసినప్పుడు దాని నుంచి బయటపడాలి కదా, అదే కొంచెం అందంగా చేస్తే మనకి, మనతో పాటుగా ఇన్నాళ్ళు ఉన్నవాళ్ళకి కొంచెం బాధ తగ్గుతుంది . మన హాబీ లేదా అలవాటు నుంచి బయటికి రావాలి అంటె ఎదుటి వారికి ఎందుకు చెప్పాలి అంటారా ? చెప్పాలి ఎందుకంటే మనం మన ఆనందం కోసం చేసిన ప్రయత్నాలలో కొద్దో గొప్పో ఎదుటి ప్రమేయం లేకుండా ఉండదు, దానితో మనకు తెలియకుండానే వాళ్ళు మన కోసం వాళ్ళ టైం ని , లేదా వాళ్ళ ఆలోచనలని మన కోసం ఖర్చు పెట్టి ఉండొచ్చు . దానికి గౌరవం , విలువ ఇవ్వాలి కదా ? ఉదాహరణకి రోజూ ఏ టేన్నిసో, కారంస్ లాంటి ఆటలు, లేదా టైం పాస్ ముచ్చట్లుకో ఒక గుంపుతో కలుస్తున్నారు అనుకోండి రేపటి నుంచి మీకు వీలవక మానేద్దాం అనుకున్నారు ఆ గుంపులోని వారికి ఒక ముక్క చెప్పటం మర్యాద . తొక్కలే ఎదుటి వాళ్ళు ఏమైతే నాకేంటి నేను నాకు ముఖ్యం అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏమి లేదు , మీ ఇష్టం . కానైతే ప్రోపబిలిటీ ప్రకారం ఎక్కడో ఒక చోట మీకు ఇదే పరిస్తితి ఎదురవటం లో మీకు మీరే సాయం చేసుకుంటున్నారు అని చెప్పటం తప్ప. ఇలా చెప్పటంలోఇంకొక లాభం కూడా ఉందండోయ్ . నలుగురికి చెప్పి మానేశాము అనుకోండి, రేపెప్పుడో మనస్సు మాట వినక అటువైపే లాగేస్తుంటే ఎదుటి వాళ్ళు మానేస్తానన్నావు గా అడుగుతారేమో అన్న భయం తో నన్న అటు వెళ్ళం, కాదంటారా ?
ఆ తరవాత మీరు ఒదిలేసిన అలవాటునో, వ్యక్తుల గురించో చెడు గా చెప్పటం అనేది అస్సలు చేయకూడని పని . ఇదే విషయం మనం ఉద్యోగ రీత్యా మారిన వదిలేసిన కంపెనీలకి , ఉద్యోగాలకి కూడా వరిస్తుంది . వీటిని కించపరిస్తే మీ గతాన్ని మీరు కించపర్చుకున్నట్లు కానీ వేరేవరినో కాదు .
అలవాట్లు అంటె మనకు ఫిజికల్గా కనపడవు కాబట్టి పర్వాలేదు, కానీ వ్యక్తుల విషయంలో మనకు ఏదో ఒక సందర్భం లో ఎదురుపడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కేవలం వాళ్ళు నొచ్చుకోవటానికి మాత్రం ఇప్పుడు మనతో ఉన్న వాళ్ళ గొప్పతనం గురించి ఊదరగొడుతూ లేని పోనీ సూటిపోటీ మాటలు విసరటం లాంటి పనులకి దిగకపోతే గౌరవంగా ఉంటుంది .
ఇందంతా కాదు మిమ్మల్నే ఒకవేళ అవతలివారు ఏదో విధంగా యవాయిడ్ చేయటానికి ప్రయతిస్తున్నారు అంటె, ఒకటి రెండు సార్లు వాళ్ళతో మాట్లాడాటానికి ప్రయత్నం చేయండి, మీరేంటో అవతలి వాళ్ళకి నిజాయితీగా తెలియజెప్పే ప్రయత్నం చేయండి . అవతలి వాళ్ళు మీ ప్రయత్నాన్ని ప్రతిసారి లోకువ గా తీసుకుంటుంటే మీకు వెన్నుముక ఉంది అని గుర్తు చేసుకోండి forced shutdown చేయండి. అంతటితో ఆ కథకి ఖచ్చితమైన fullstop పెట్టేయండి. (అంటె మూడో వ్యక్తీ దగ్గర వీరి ప్రసక్తిని ఎత్తి లేని పోనీ విమర్శలు చేసి మీ విలువ తగ్గించుకోకండి .) .
ఖచ్చితం గా చెప్పాలి అంటె మన ప్లస్సులో బ్లాక్ ఆప్షన్ మాదిరి అన్నమాట (అంటె మీ రాతలు వాళ్లకి కనపడవు, వాళ్ళ రాతలు మీకు కనపడవు కదా అలా) . ఈ దెబ్బ కి మీరు మీ మూడ్ ఖరాబు చేసుకొని బి పి పెంచుకునే బాధ తప్పుతుంది .
పైదంతా చదివి ఇప్పుడు ఈ సోది అంతా ఎందుమ్మాయి అన్న ప్రశ్న మీ మనస్సులో కి రావొచ్చు తప్పు లేదు , దానికి నా సమాధానం . రేపో మాపో Feb 14 వస్తుంది కదా , మొత్తం ప్రపంచానంత ప్రేమించేయమని అందరూ చెబుతారు కానీ ఒకవేళ విడిపోవాల్సి వస్తే ఏమి చేయాలో ఒక్క రవీయం లో బ్లాగులో చదివితే మాత్రమే మీకు తెలుస్తుంది అన్న మాట ( నాకు తెలుసు ఈ మాత్రం సోది మాకు తెలుసు అని మీరు తిట్టే తిట్లు, అవి ఆపేసి ఒక కామెంట్ పెట్టి relax ఆవ్వండి :-))
P.S.అసలు సంగతి చెప్పటం మర్చిపోయా నేను పైన రాసినది సోషల్ రిలేషన్ షిప్స్ గురించి మాత్రమే , ఫ్యామిలీ రిలేషన్ షిప్స్ గురించి కాదు .