హ్మ్ ! ఎప్పుడు చూసినా పేరేమో టెక్నికల్ , పోస్టేమో నాన్ టెక్నికల్ ఈ సారి ఏమి రాసి పూడ్చిందో అని కంగారు పడుతున్నారు కదా ? నో ఈ సారి పద్దతి మార్చా పేరు టెక్నికల్ ఇంకా పోస్ట్ కూడా టెక్నికల్ అన్న మాట :)
ఇక మీకు అర్ధం అయ్యింది కదా మనం ఇప్పుడు cloud computing గురించి మాట్లాడుకుందాం .
క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏదైనా కంప్యూటింగ్ సేవలను ఇంటర్నెట్ ద్వారా వాడుకోవటం . ఉదాహరణ కు మన బ్లాగు నే తీసుకోండి, మీరు రాసేవి కానీ చదివేవి కానీ మీ సిస్టం లో ఉండనవసరం లేదు కదా ? అలాగే మీ కంపెనీకి కావలసిన పే రోల్ సాఫ్ట్వేర్ కావొచ్చు లేదా మీ కంపెనీ డాటా మొత్తాన్ని జాగ్రత్త పరిచే సర్వీసు కావొచ్చు ఇలాంటి వన్నీ ఇంటర్నెట్ ద్వారా పొందటాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటారు .
అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది Old Wine in New Bottle అని కొంతమంది అభిప్రాయం . అలా ఎందుకూ అంటే ఈ కాన్సెప్ట్ traditional web హోస్టింగ్ సర్వీసెస్ కి చాలా దగ్గర గా ఉంటుంది . కానీ ఇక్కడ ఉన్న అదనపు advantage ఏమిటంటే ఎప్పుడైతే అదనపు resources అవసరం అయితే అప్పుడు అదే స్కేల్ లో పెంచుకుంటూ పోవటం , అలాగే అవసరం లేనప్పుడు తగ్గించుకుంటూ పోవటం అనే ఫ్లెక్షిబిలిటీ ఉంటుంది .
ఈ క్రింది బొమ్మలో ఉన్న అంశాలు క్లౌడ్ కంప్యూటింగ్ లో ఉండవలసిన ప్రధానమైన లక్షణాలు :

అసలు క్లౌడ్ అనే పేరు ఎలా వచ్చింది అనేది ఈ పాటికి మీరు ఆలోచిస్తూ ఉంది ఉంటారు కదా ? కరెక్టు దీనికి ఒక కారణం ఉంది . అది సాధారణం గా ఫ్లో చార్ట్స్ గీసేటప్పుడు ఇంటర్నెట్ ని రెప్రజేంట్ చేయటానికి క్లౌడ్ సింబల్ ని వాడతారు కదా , ఆ ఇన్స్పిరేషన్ తో ఈ పేరు పెట్టారన్న మాట .
క్లౌడ్ కంప్యూటింగ్ తో ప్రోవైడ్ చేసే సర్వీసెస్ ని మూడు రకాలు గా చెప్పొచ్చు అవి :
1. Infrastructure as a Service (IaaS)
ఈ సర్వీసు ని కొన్ని సార్లు Hardware as a Service (HaaS) అని కూడా చెప్తారు . ఈ సర్వీసెస్ లో ప్రధానం గా infrastructure అంటే సర్వర్స్ , storage equipment , నెట్వర్క్ components లాంటివి అవుట్ సోర్సు చేస్తారు . ఈ సర్వీసెస్ సాధారణం గా పే పర్ యూజ్ మోడల్ లో బిల్ చేయబడతాయి . అంటే మీకు అవసరం అయినప్పుడు వాడుకొని ఆ వాడుకున్న సమయానికి మాత్రమే డబ్బు కడతారన్న మాట .
2. Platform as a Service (PaaS)
ఈ మోడల్ సర్వీసెస్ లో development కి ఉపయోగపడే software, ప్రోడక్ట్ టూల్స్ లాంటివి అందుబాటులో ఉంటాయి . డెవలపర్స్ ఈ సర్వీసెస్ సహాయం తో ఉదాహరణ కి గూగుల్ apps లాంటి అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు . ప్రస్తుతానికి మాత్రం ఈ సర్వీసెస్ ఇంకా అంత గా వాడకం లోకి రాలేదు . దీనికి ముఖ్యం గా పోర్టబిలిటీ, clients క్రియేట్ చేసిన apps move off చేయనివ్వక పోవటం వంటివి కొన్ని కారణాలు .
3. Software as a Service (SaaS)
క్లౌడ్ కంప్యూటింగ్ లో అత్యంత ప్రాధ్యానత గల సర్వీసు గా దీన్ని చెప్పొచ్చు . గూగుల్ , మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ప్రోవైడ్ చేసే వెబ్ బేసేడ్ ఈమెయిలు సర్వీసు ఈ కాటగిరి లోకే వస్తుంది . అంతే కాకుండా HR , Payroll , ఫైనాన్సు సాఫ్ట్వేర్ సర్వీసెస్ ని నచ్చిన వెండార్ నుంచి కొనుక్కోవచ్చు . ఈ softwares maintenance కి ఎటువంటి ప్రత్యేకమైన IT ఉద్యోగుల నియామాకాలు అవసరం ఉండవు .
సరే క్లౌడ్ కంప్యూటింగ్ అందించే సేవలు గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఉన్న రకాలు గురించి తెలుసుకుందాం . అవి :
1. పబ్లిక్ క్లౌడ్
పబ్లిక్ క్లౌడ్ లో ప్రొవైడర్ తన సేవలని , ఇంటర్నెట్ ఉన్న ఏ వాడకదారు (User) కైనా అందించే సౌలభ్యం ఉంటుంది . ఈ మోడల్ ని స్టాండర్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని కూడా అంటారు . ఈ మోడల్ లో సాధారణం గా ప్రొవైడర్స్ ఇంటర్నెట్ లో access చేయగలిగిన అప్లికేషన్స్ కి స్టోరేజ్ సర్వీసు ని ప్రోవైడ్ చేస్తారు .
Elastic Compute Cloud (EC2), IBM's Blue Cloud, Sun Cloud, Google AppEngine and Windows Azure Services Platform వంటిని పబ్లిక్ క్లౌడ్స్ ఉదాహరణ గా చెప్పొచ్చు .
2. ప్రైవేటు క్లౌడ్
3. హైబ్రిడ్ క్లౌడ్
హైబ్రిడ్ క్లౌడ్ అనేది కనీసం ఒక పబ్లిక్ క్లౌడ్ , అలాగే కనీసం ఒక ప్రైవేటు క్లౌడ్ ల కంపోజిషన్ తో ఏర్పడుతుంది .
ఈ మూడు రకాల ఆర్కిటెక్చర్ లో హైబ్రిడ్ క్లౌడ్ ఐడియల్ మోడల్ గా చెప్పొచ్చు . ఈ మోడల్ లో పబ్లిక్ క్లౌడ్ లో పరిమిత వనరులతో అవసరమైనప్పుడు స్కేలబిలిటీ పెంచుకునే అవకాశం ఉంటుంది అలాగే vulnarable డేటా , లేదా అప్లికేషన్స్ కి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది .
ఇప్పటికే మీ తలలు పట్టుకు ఎటో చూస్తున్నారు అని నాకు అర్ధం అయ్యింది, సో ఇది ఇక్కడితో ఆపేసి వేరే భాగం లో క్లౌడ్ కంప్యూటింగ్ వలన IT కంపెనీల , ఉద్యోగుల రోల్ ఎలా మారబోతుంది . అలాగే దీని వలన ఉపయోగాలు చూద్ద్దాం , అర్జెంటు గా ఇప్పుడైతే వెళ్లి ఒక కప్పు కాఫీ తాగేయండి :)))

ప్రైవేటు క్లౌడ్ అంటే మనకు పేరు తోనే అర్ధం అవుతుంది కదా కేవలం కొద్ది మంది లిమిటెడ్ users కి మాత్రమే అందించే సౌలభ్యం ఉంటుంది . ఈ ప్రైవేటు క్లౌడ్ ప్రధాన ఉద్దేశ్యం organizations కి తమ డేటా పైన పూర్తి కంట్రోల్ కలిగి ఉండటం .