నాక్కూడా మీలాగే కొంచెం మంది ఫ్రెండ్స్ ఉన్నారు . వాళ్ళకి అప్పుడప్పుడు క్విజ్జ్లు పెడుతుంటానన్న మాట . సరే ఈ రోజు కూడా అలాంటి క్విజ్ ఒకటి తట్టింది వెంటనే SMS పంపా . ఇంతకీ ప్రశ్న ఏంటి అంటారా అక్కడికే వస్తున్నా .
ATM అంటే ? - సరే సమాధానాలు వచ్చాయి అవేంటో చూద్దాం .
మొదటి ఫ్రెండ్ నుంచి సమాధానం : ATM - Any Time Murder
నేను మనస్సు లో : హ్మ్ తనకి ఈ చిరంజీవి సినిమా పిచ్చి వదిలే వరకు జీవితం లో బాగుపడడు, మనం బేసిక్ గా ఏమి చేయలేము )
రెండోవ సమాధానం : ATM - Any Time Money
నేను : అబ్బో ఈ డబ్బు పిచ్చి బొత్తి గా హద్దు , అదుపూ లేకుండా పెరిగిపోతుంది
ఇక మూడో ఆన్సర్ : ATM - Automated Teller Machine
నేను : పోనీలే కనీసం ఏదో బ్యాంక్ IT డిపార్టుమెంటు లో పని చేస్తూ ఆ ఉప్పు తింటున్నదుకు కనీసం ఇదన్నా నేర్చుకున్నావ్
పైన నా ప్రశ్న చూసి విషయం చూసి విషయం మీకు అర్ధం కాకపోయినా నా ఫ్రెండ్స్ కి అర్ధం అయ్యింది , వాళ్ళకి ఒక కనీసం ఒక పది పదేహేను నిమషాలు ఏదో బుర్ర తినే session ఉంది అని .సరే వాళ్ళ బుర్రలు ఎలాగు తిన్నా ఇక మరి మిమ్మల్ని మాత్రం ఎందుకు వదలాలి అందుకే ఈ పోస్టు :P
( Image Source : గూగుల్ images ) |
అసలు రోజుకు రెండు మూడు సార్లు వెళ్లి ఒక కార్డు పెట్టి డబ్బులు ఇలా లాగేసుకోవటం తప్పా, అసలు ఈ ATM ఏంటి ఎవరు కనిపెట్టారు అని ఆలోచించారా ? ఆలోచించరు నాకు తెలుసు అందుకంటే అంతా Use and Throw policy , టెక్నాలజీ ని వాడుకోవటం ఆ తరవాత తీరిగ్గా మన జీవితాల్ని నాశనం చేస్తున్నాయి ఈ టెక్నాలజీ inventions అని తిట్టుకోవటం . పోనీ వాడటం మానేస్తారా అదీ లేదు. ఇవాల్టి నుంచి కొంచెం అది వదలి కొంచెం మనం వాడే వస్తువుల గురించి తెలుసుకోండి . ఊ ఊ అర్ధం అయ్యింది మీ తిట్లకి అర్ధం సోది ఆపి ఆ చెప్పే రెండు ముక్కలు రాస్తే చదువుతాం లేదంటే మాకు ఖాళీ ఉన్నప్పుడు గూగుల్ చేసి చదువుకుంటాం ఇదే కదా ? వద్దు అంత అవకాశం మీకివ్వను నేను రాసి మీతో చదివించేస్తా .
ATM ని 1967 లో Scottish inventor అయిన John Shepherd Barron అనే ఆయన కనుకొన్నారు . ఆ రోజుల్లో ATM ని DACS (De La Rue Automatic Cash System ) అని పిల్చేవారట . ఆయనకీ దీనికి ప్రేరణ ఇచ్చింది Candy వెండింగ్ మెషిన్ అట . సరే ఆయన ATM కనిపెట్టిన రోజుల్లో ప్లాస్టిక్ కార్డులు గట్రా లేవు కదా అందుకని carbon 14 laced cheques ని వాడేవారట . అంటే ATM cheque మీద ఉన్న radio active material అయిన Carbon 14 మార్క్ ని రీడ్ చేసి మనం ఎంటర్ చేసిన PIN నెంబర్ తో చెక్ చేసి డబ్బులు ఇచ్చేదన్న మాట . ఎవరు ఎంత మొత్తుకున్నా ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ తప్పని గా ఉంటుంది అన్న మాట నిజం అని మరోసారి నొక్కి వక్కాణించే క్రమం లో Shepherd గారి వైఫ్ Caroline ఈయనకి ఈ PIN కాన్సెప్ట్ ని రూపొందిచటానికి సహాయ పడ్డారట .
ఈ ATM వెనకాల కథ ఇదన్న మాట . ఈ కథ తెలుసుకున్నాకా మీకు అసలు మొదటి ATM ఎక్కడ ప్రారంభించారు అని తెలుసుకోవాలి అని మీకు అనిపించటం సహజం అందుకే ఈ క్రింది ముక్కలు .
మొదటిసారి గా ATM ని 1967 లో Barclay's Bank , Enfield, North London లో ప్రారంభించారు , ఆ తర్వాత మియామి లో జరిగిన 2000 మంది సభ్యులు పాల్గొన్న Banker 's కాన్ఫరెన్స్ కి ఆహ్వానించారు . ఈ కాన్ఫరెన్స్ తరవాత మన John Shepherd Barron గారికి Pennsylvania Bank , Philadelphia ఆరు ATM లకి ఆర్డర్ ప్లేస్ చేసింది మన ఇక అక్కడి నుంచి ప్రారంభం అయ్యి ఈ రోజు వీధికొక ATM దాకా ప్రయాణం అప్రతిహతం గా కొనసాగుతూ సాగుతూ వస్తున్నది అన్న మాట .
John Shepherd Barron గురించి కొన్ని వివరాలు :
(Image Source : గూగుల్ images ) |
పూర్తి పేరు :
John Adrian Shepherd-Barron
పుట్టిన తేదీ :
23 rd జూన్ 1925
పుట్టిన ప్రదేశం :
అప్పటి అస్సాం , ఇప్పటి మేఘాలయ లోని షిల్లాంగ్
వృత్తి :
ఇక కొంచెం సేపు వరల్డ్ మ్యాప్ లోంచి ఇండియా ని జూమ్ చేసి చూద్దాం . ఇండియా లో మొదటి సారి గా ATM ని HSBC బ్యాంకు 1987 లో అంధేరీ , ఈస్ట్ ముంబై లో ప్రారంభించింది .
అన్నీ మంచి మాటలే చెప్పుకుంటే ఏమి బాగోదు కదా అందునా టెక్నాలజీ అన్నది రెండువైపులా పదునున్న కత్తి లాంటిదని మనం దాన్ని దేని కోసం వాడుతున్నాం అన్న దాన్ని బట్టి ఫలితం ఉంటుంది అని నేను ప్రత్యేకం గా చెప్పవలసిన పని లేదు కదా . అలాగే మన ఉద్దేశ్యం మంచిదే అయినా వేరే రకం గా వాడే వాళ్ళ ద్వారా కొన్ని సార్లు మోసపోయే పరిస్తితి ఉంటుంది కాబట్టి దీనికి ఉన్న అందుకే రెండో పార్శ్వాన్ని కూడా చూద్దాం .
ATM skimmers అనేవి ప్రస్తుతం అన్నీ బ్యాంకు లని వణికిస్తున్న ఫ్రాడ్ devices . skimmers అనేవి అతి పల్చ గా ఉండి ATM కార్డు insert చేసే slot లో కూర్చునే విధం గా తయారు చేస్తారు అన్న మాట . ఇక అక్కడ కూర్చున్న తరవాత దాని పని మన ATM కార్డుల వెనక బాగం లో ఉన్న మాగ్నెటిక్ stripes మీద ఉన్న డేటా ని రికార్డు చేయటం . ఇక ఒకసారి ఈ డేటా ఈ మాయల మరాటీల చేతిలో పడ్డాక వాళ్ళ పని మన ఎకౌంటు ని చక్క గా శుభ్రపరచటం .
ATM skimmers అనేవి ప్రస్తుతం అన్నీ బ్యాంకు లని వణికిస్తున్న ఫ్రాడ్ devices . skimmers అనేవి అతి పల్చ గా ఉండి ATM కార్డు insert చేసే slot లో కూర్చునే విధం గా తయారు చేస్తారు అన్న మాట . ఇక అక్కడ కూర్చున్న తరవాత దాని పని మన ATM కార్డుల వెనక బాగం లో ఉన్న మాగ్నెటిక్ stripes మీద ఉన్న డేటా ని రికార్డు చేయటం . ఇక ఒకసారి ఈ డేటా ఈ మాయల మరాటీల చేతిలో పడ్డాక వాళ్ళ పని మన ఎకౌంటు ని చక్క గా శుభ్రపరచటం .
ఇవండీ ATM గురించి నేను మీతో పంచుకుందాం అన్న విశేషాలు . మీకు తెలిసిన ఇంకొన్ని విశేషాలు కామెంట్ల రూపం లో చెప్పడం మర్చిపోకండే.
PS : పైన నేను రాసిన క్విజ్ , ఫ్రెండ్స్ వగైరాలు కేవలం ఐస్ బ్రేకింగ్ statements మాత్రమే !