Subscribe:

Friday, October 19, 2012

Steve Jobs(1955-2011) - 3/6


The heaviness of being successful was replaced by the lightness of being a beginner again, less sure about everything. It freed me to enter one of the most creative periods of my life.
- Steve Jobs

1980 డిసెంబర్ లో పబ్లిక్ ఇష్యూ కి వెళ్ళిన ఆపిల్, ఫోర్డ్ కంపెనీ (1956) తరవాత అమెరికా చరిత్ర లో అతి పెద్ద సక్సెస్ చూసిన కంపెనీ గా అత్యంత ఆదరణ పొందింది . దానితో పాటే 1982 Feb లో టైం మాగ్జైన్ కవర్ పేజ్ మీద స్టీవ్ ఫోటో ని ప్రింట్ చేసింది. దీనితో 27 యేళ్ళ స్టీవ్ జాబ్స్ కి, అమెరికా Young Entrepreneurs సింబల్ గా ఇమేజ్ వచ్చింది . కానీ రోజులు ఎప్పుడూ ఒకే రకం గా ఉండవు కదా,  క్రమేణా తరవాతి రోజులలో ఆపిల్ నష్టాలు చవి చూడాల్సి వచ్చింది . దానితో పాటే స్టీవ్ కూడా కొన్ని చేదు అనుభవాలు చూడాల్సి వచ్చింది. అవి :

  • 1980 మే లో ఆపిల్ రిలీజ్ చేసిన ఆపిల్ III సీరియస్ స్టెబిలిటీ సమస్యల తో మార్కెట్ లో ఫెయిల్ అవ్వడం, ఇది కంపెనీ పైన తీవ్రమైన ఒత్తిడి పెంచింది. 
  • Feb . 7 1981 న వోజ్నిక్ నడుపుతున్న Beechcraft Bonanza A36TC క్రాష్ అవ్వటంతో  ఆరోగ్యపరం గా ఆపిల్ నుంచి దూరం గా ఉండాల్సి వచ్చింది. 
  • 1979 లో స్టీవ్ Xerox Palo Alto Research Center లో చూసిన మౌస్, GUI (Graphical User Interface ) టెక్నాలజీ ఆధారం గా  తన ఊహలకి రూపకల్పన చేయాలి అని మొదలు  పెట్టిన   లిసా ప్రాజెక్ట్ కి కంపెనీ అంతర్గత సమస్యలతోదూరంగా ఉండాల్సి వచ్చింది.  
  • లిసా ప్రాజెక్ట్ నుంచి దూరం జరిగిన స్టీవ్, మాక్ (Macintosh) ప్రాజెక్ట్ ని లీడ్ చేస్తుండటంతో అది కాస్తా లిసా, మాక్ టీం మధ్య అంతర్గత కాంపిటీషన్ గా మారింది . 
  • అదే సమయంలో పర్సనల్ కంప్యూటర్ రంగంలో ఆపిల్ సక్సెస్ ని చూసిన IBM, తన IBM PC తో మార్కెట్ లో ఆపిల్ కి అతి పెద్ద పోటీదారుగా మారింది. 
  • IBM PC దెబ్బతో లిసా, మాక్ (first model) రెండూ నష్టాలు చూడాల్సి వచ్చింది . దీనికి ప్రధాన కారణాలు 1) IBM PC తో పోల్చితే ఖరీదు ఎక్కువ కావటం ఒక కారణం అయితే . ఆపిల్ - ii వరకు ఓపెన్ ఆర్కిటెక్చర్ వాడిన ఆపిల్ , మాక్ తో క్లోస్డ్ ఆర్కిటెక్చర్ ని వాడటం తో up gradation కష్టం కావటం 2)128 kilobytes of main memory తో తయారైన మాక్ మొదటి మోడల్ కి హార్డ్ డిస్క్ కానీ రెండోవ ఫ్లాపీ డ్రైవ్ కానీ లేకపోవటం తో సిస్టం , ప్రోగ్రాం మధ్య స్విచ్ కావాల్సిన అవసరం ఉండేది.ఇలాంటి సమస్యలతో IBM PC తో పోల్చితే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి , వాడటానికి సులువు గా ఉండి, తరువాతి కాలం లో కంప్యూటింగ్ face   నే మార్చేసిన   మాక్ మార్కెట్ లో వెనుకంజ వేయాల్సి వచ్చింది. 

ఇలా వరుస ఫెయిల్యూర్స్, అంతర్గత వివాదాలతో ముదురుతున్న సమస్యలని పరిక్షరించడానికి ఆపిల్ మేనేజ్మెంట్ ఏప్రిల్ 1985 లో re-organization దిశ గా అడుగులు వేసింది. Jean-Louis Gassée ని మాక్ టీం కి మానేజర్ గా నియమించారు. కొత్తగా R & D డిపార్టుమెంటు ప్రారంభించాలి అన్న స్టీవ్ ప్రతిపాదనకి, రాత పూర్వకమైన గారెంటీ అడగటం తో అప్పటికే సరైన సంబంధాలు లేని స్టీవ్, Sculley ల మధ్య పర్సనల్ వార్ కి దారి తీసింది,  మానేజెమెంట్ Sculley కి మద్దతు గా నిలవడం తో 1985 సెప్టెంబర్ లో తన సన్నిహితులతో ఆపిల్ నుంచి బయటికి వచ్చేసాడు.
At 30 I was out. And very publicly out. What had been the focus of my entire adult life was gone, and it was devastating. I really didn't know what to do for a few months. I felt that I had let the previous generation of entrepreneurs down — that I had dropped the baton as it was being passed to me. I met with David Packard and Bob Noyce and tried to apologize for screwing up so badly. I was a very public failure, and I even thought about running away from the Valley.

-Stanford Commencement Address, 12 Jun 2005
ఇలా ఆపిల్ నుంచి బయటికి వచ్చిన స్టీవ్ ఒక్క దాన్ని తప్ప, తన మిగిలిన ఆపిల్ స్టాక్స్ ని అన్నిటి ని అమ్మేసాడు. ఈ ఒక్క స్టాక్ ని ఉంచకోవటం వెనక రకరకాలైన కథనాలు ఉన్నాయ్ :-) ఈ వచ్చిన డబ్బు తో బిజినెస్, రీసెర్చ్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ అవసరాలకి అనుగుణం గా పవర్ఫుల్ కంప్యూటర్ ని డిజైన్ చేయాలి అన్న ఉద్దేశ్యం తో Next అనే హార్డువేర్ సాఫ్ట్వేర్ కంపనీ ని రిజిస్టర్ చేసాడు. 1985 లో రిజిస్టర్ చేసినప్పటికి, కంపెనీ రిజిస్టర్ చేయగానే 6 కో-ఫౌండర్స్ అయిన తన ex -employees ని ఆపిల్ కంపెనీ టెక్నాలజీ దొంగిలించారు అన్న ఆరోపణ తో sue చేయటం తో ఒక సంవత్సరం పాటు ఈ ప్రోడక్ట్ పైన వర్క్ చేసే వీలు లేకపోయింది. ఈ సమయాన్ని, "A " player only works with "A" అన్న పాలసీ నమ్మే స్టీవ్ జాబ్స్ తన డ్రీం టీం ని రిక్రూట్ చేయటానికి వాడుకున్నాడు . Next కంపెనీ గురించి సిలికాన్ వాలీ లో బోలెడంత హైప్ ఉండేది . దానికి తగ్గట్లే Next working environment , సౌకర్యాలు, పే ఉండేవి. స్టీవ్ 1988 అక్టోబర్ లో తన మొదటి "Next Cube" presentation ని ఇచ్చారు. ఈ presentation చివరిలో వయలినిస్ట్ తో పాటు గా Next Cube పాడిన డ్యూయట్ తో మొదటిసారి గా కంప్యూటర్ సౌండ్ ఎబిలిటీ ని ప్రపంచానికి పరిచయం చేసాడు . టెక్నాలజీ పరం గా విపరీతం గా ఆకర్షించిన Next Cube ఖరీదు ఎక్కువ కావటం తో కేవలం 50,000 యూనిట్స్ మాత్రమే మార్కెట్ చేయగలిగారు. కానీ తరవాత కాలం లో ఈ టెక్నాలజీ ఈ రోజు మనం చూస్తున్న web server, web browsers డిజైన్ కి ఫౌండేషన్ గా ఉపయోగపడింది. Next Cube మార్కెట్ లో అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోవటం తో Next ని కేవలం సాఫ్ట్వేర్ సేవలకి మాత్రమే పరిమితం చేసి , తన దృష్టి ని Pixar వైపు మళ్ళించాడు.

Next ని ప్రారంభించిన స్టీవ్ జాబ్స్ అదే సమయం లో (1986 లో) హాబీ గా ఇప్పుడు Pixar animanation studios గా అని పిలుస్తున్న అప్పటి Lucasfilm అనే కంపెనీ లో అనిమేషన్ విభాగాన్ని కొనడం తో పాటు, 5 వేల మిలియన్ డాలర్లని అదే కంపెనీ లో పెట్టుబడి పెట్టాడు. Pixar Image Computers ని అమ్మాలి అన్న ఉద్దేశ్యం తో ప్రారంభించిన అది అంత గా ఆశాజనకం గా లేకపోవటం తో, 1990 లో కేవలం కార్టూన్ సినిమా తయారీ మీద దృషి పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అలా నిర్ణయించిన తర్వాత Pixar డిస్నీ కోసం 30 మిలియన్ డాలర్ల తో ప్రొడ్యూస్ చేసిన "Toy Story " (worlds first computer animated feature film) 360 మిలియన్ డాలర్ల సంపాదించింది. నిజానికి ఈ సక్సెస్ అప్పటికే మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టినా Next, PIG కంప్యూటర్స్ అనుకున్నంత గా సక్సెస్ కాకపోవటం తో ఫైనాన్షియల్ సమస్య లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న స్టీవ్ ని ఒక్కసారి గా ఒడ్డున పడేసింది. "Toy Story " సక్సెస్ తో, Pixar 29 నవంబర్ 1995 లో పబ్లిక్ ఇష్యూ కి వెళ్ళింది. తరవాత 2006 లో Walt Disney తో మెర్జ్ అయ్యింది . దీనితో డిస్నీ లో స్టీవ్ మేజర్ షేర్ హోల్డర్ అయ్యారు. ఇవాళ Pixar, CGI అనిమేషన్ రంగం లో నెంబర్ వన్ అని మనందరికీ తెలిసిన విషయమే.

How Steve reinvented Apple ? - Wait Wait it will be in next part :-)
-శ్రావ్య 

Apple has some tremendous assets, but I believe without some attention, the company could, could, could — I'm searching for the right word — could, could die.
-Steve Jobs(18 August 1997)

(Images credit: Google Images)

World's first computer animated feature film

Recommendations :

http://youtu.be/tBjo5-u_mHo
http://youtu.be/0lvMgMrNDlg
http://youtu.be/ZImohBzSRDU

Thursday, October 11, 2012

Steve Jobs(1955-2011) - 2/6


స్కూల్ చదువు  పూర్తి  చేసిన  స్టీవ్ ఆ తరవాతి సంవత్సరం  సౌత్  వెస్ట్  పోర్ట్లాండ్ , ఒరెగాన్ లోని  రీడ్  కాలేజ్ లో చేరటానికి  నిర్ణయించుకున్నారు.  ఈ రీడ్ కాలేజ్ లో చదువు  చాలా  ఖరీదు  అయిన   వ్యవహారం కావటం తో  క్లారా , పాల్ జాబ్స్  సంపాదన లో చాల  భాగం తన ఫీజ్ లకే ఖర్చు కావటం, పైగా  ఆ కాలేజ్  చదువు తన భవిష్యత్తు కి  ఎలా  ఉపయోగపడుతుందో  అన్న ఆలోచనలతో  ఉన్న   జాబ్స్   ఆరు నెలల కంటే తన చదువుని  కొనసాగించలేక పోయారు.

స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో legendary commencement address సందర్భం గా స్టీవ్ తన కాలేజ్ చదువు గురించి  గుర్తు చేసుకున్న మాటలు ఇవి:

After six months, I couldn't see the value in it. I had no idea what I wanted to do with my life and no idea how college was going to help me figure it out. And here I was spending all of the money my parents had saved their entire life. So I decided to drop out and trust that it would all work out OK. It was pretty scary at the time, but looking back it was one of the best decisions I ever made. The minute I dropped out I could stop taking the required classes that didn't interest me, and begin dropping in on the ones that looked interesting.
It wasn't all romantic. I didn't have a dorm room, so I slept on the floor in friends' rooms, I returned coke bottles for the 5¢ deposits to buy food with, and I would walk the 7 miles across town every Sunday night to get one good meal a week at the Hare Krishna temple. I loved it.


ఇలా   గ్రాడ్యుయేట్   కాకుండానే  తన  మామూలు  చదువు కి ఫుల్ స్టాప్ పెట్టిన  జాబ్స్ , 18 నెలల  పాటు అక్కడే  కాలిగ్రఫీ   కోర్సు చేస్తూ   దాదాపు   ఒక హిప్పీ  లాగా  రోజులు  గడిపారు.  ఈ కాలిగ్రఫీ  కోర్సు,   తరవాతి కాలం లో  తనకి  టైపోగ్రఫి  పట్ల ఆసక్తి పెంచింది.  లాంటి  సమయం లో  స్టీవ్ కి  వచ్చిన  అత్యవసరంగా డబ్బు అవసరమైన  పరిస్తితులు,    ఆయన్ని 1974 లో  Atari  అనే  వీడియో  గేమ్  కంపెనీ లో  ఉద్యోగం  చేసేట్లు గా  ప్రోత్సహించాయి. Atari   లో  పనిచేస్తున్న  సమయం లోనే  హార్వార్డ్   ప్రొఫెసర్   రిచర్డ్  అల్పెర్ట్  (ఇండియా లో   రామదాస్  గా పిలిచేవారు ) టీచింగ్స్  ప్రభావం తో   స్టీవ్,   తన   రీడ్  కాలేజ్   స్నేహితుడైన   డాన్ కోట్కే  తో  కలిసి  ఇండియా   వచ్చారు ,   కానీ  ఈ యాత్ర  స్టీవ్  కి  నిరుత్సాహం  మిగిల్చింది . 

ఆపిల్ 1
స్టీవ్  ఇండియా  కి వచ్చిన  సమయం లో వోజ్నిక్  కి  HP   లో  ఉద్యోగం   వచ్చింది.  ఇది  ఒక రకం గా వోజ్నిక్ కి తన డ్రీంజాబ్.   అయితే హార్డువేర్  జీనియస్ ఇంకా   FORTRAN compilers,  BASIC  ప్రోగ్రామ్స్  రాయటం లో  ప్రతిభ  ఉన్న    వోజ్నిక్  తన  ఉద్యోగం తో  పాటు Homebrew Computer Club  అనే  geeky  గ్రూప్  లో చేరాడు .  ఇందులో సభ్యులంతా    టెక్నాలజీ   మీద   విపరీతమైన  పాసినేషన్ ఉన్న  ఇంజినీర్లు.  ఇక్కడే  వోజ్నిక్స్  తన  గ్రూప్   సభ్యులకి  ఉపయోగపడే  ఒక కిట్  ని  తయారు  చేసాడు, అదే తరవాత  లో  ఆపిల్1  గా  మనకందరికీ తెలిసింది . ఈ ప్రయత్నం   విజయవంతం కావటం తో  స్టీవ్ జాబ్స్  కి మనమే  ఈ  ప్రింటెడ్  సర్క్యూట్   బోర్డ్స్  తయారు చేసి  ఎందుకు అమ్మకూడదు  అన్న  ఆలోచన   వచ్చింది.  ఆ ఆలోచన  వోజ్నిక్ కి కూడా నచ్చటం తో  వెంటనే   కావలసిన  పెట్టుబడి కూడబెట్టే  పని లో పడ్డారు. 1000$ డాలర్ల తో  మొదలైన  ఈ  కంపెనీ  పెట్టుబడి కోసం  వోజ్నిక్ తన  HP 65  కాలుక్యులేటర్ అమ్మితే,    జాబ్స్  ఏమో   vw వాన్    అమ్మేసారు . ఇవి రెండూ అమ్మి సంపాదించిన  డబ్బు  తో ఫూల్స్  డే అయిన ఏప్రిల్ 1 , 1976 న  స్టీవ్ జాబ్స్  ఇంటి  గారేజ్ లో  ఆపిల్ కంప్యూటర్స్ ని  ప్రారంభించారు .  ఇలా కంపెనీ ప్రారంభం  అయిన    మొదటి  రోజుల్లో  ఇద్దరూ  స్టీవ్ లు  కాక   Ron Wayne    అనే   మూడో పార్టనర్ ఉండేవారు .  ఈయన  ఇద్దరు  స్టీవ్ ల కన్నా వయస్సులో   పెద్ద ,  కంపెనీ  ఎకౌంటు  వ్యవహారాలు  ఈయన  చూసేట్లు  గా  ఒప్పందం  చేసుకున్నారు.  కంపెనీ లో ఇద్దరు  స్టీవ్ ల వాటా  చెరో  45% అయితే , రాన్  వాటా 10 % . కానీ కంపెనీ ప్రారంభం అయిన  కొన్ని  వారాల్లోనే  అప్పటికే  కుటుంబ బాధ్యతలు  ఉన్న   రాన్ నమ్మకం లేని రిస్క్  తీసుకోలేక కంపెనీ ని వదిలేసారు . 

Apple-1 Logo
ఆపిల్ 1 లోగో 
ఆపిల్ పేరు వెనక కథ : ఒక టెక్నాలజీ కంపెనీ కి ఆపిల్ అని పేరు పెట్టడం వెనక కథ ఏమిటో తెలుసుకోవాలని మనలో చాలా మంది కి ఆసక్తి కదా? దీనికి కారణం అప్పటికే ఉన్న చాలా టెక్నాలజీ కంపెనీల పేర్లు పలక టానికి కష్టం గా ఉండటం తో త్వరగా  జనాల్లోకి వెళ్ళాలి అంటే ఈజీ గా పలికే పేరు ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు . కానీ కంపెనీ రిజిస్టర్ చేసే చివరి నిమషం వరకు ఏ పేరు తట్టలేదు . దాని తో స్టీవ్ తన కష్ట కాలం  లో   ఏ   పళ్ళు తిని తన ఆకలి తీర్చుకున్నాడో అదే ఆపిల్ పేరు పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు . అంతే కాకుండా ఆపిల్ చాలా న్యూట్రియస్ విలువలున్న పెర్ఫెక్ట్ పండు అని , ఇంకా మిగలిన పండ్ల తో పోలిస్తే అందమైన ప్యాకింగ్ తో ఉండి , త్వర గా పాడవదు అన్న అభిప్రాయం తో కంపెనీ కి ఆ  పేరు పెట్టాలి అన్న నిర్ణయం తీసుకున్నారు .  ఇలా  ప్రింటెడ్  సర్క్యూట్  బోర్డులు  తయారు చేసి అమ్ముదామని  మొదలైన  ఆపిల్  కంపెనీ కి మొదటి ఆర్డర్ "The Byte Shop "  అనే  కంప్యూటర్ షాప్  నుంచి  50  పూర్తి  గా  ఎసెంబుల్ చేసిన కంప్యూటర్స్ కోసం వచ్చింది .  దీని కి గుర్తు గా ఆ తరవాత  ఆపిల్ 2  రిలీజ్  చేసే ముందు  తయారుచేసిన  ఆపిల్ లోగో లో ఒక  పక్కన  ఉన్న  bite తో డిజైన్  చేసారు.   అంటే ఆ bite ,   byte  కి   గుర్తు . 
ఇలా 1976 ఏప్రిల్ 1 ప్రారంభం అయిన  ఆపిల్ కంప్యూటర్స్ జూలై 1976 లో   మొదటి ఆపిల్  1 ని   666.66 $  కి అమ్మడం  మొదలు పెట్టింది.  తయారు  చేసిన 200 ల ఆపిల్ 1  లలో  175  కంప్యూటర్స్ ని 10 నెలల  కాలం లో అమ్మ గలిగారు. 
అదే  సమయం లో   Mike Markkula (Apple's Angel Investor) అనే  మిలియనీర్  ఆపిల్  కంప్యూటర్స్ లో    పెట్టిన  క్వార్టర్ మిలియన్ డాలర్ల పెట్టుబడి  ఆపిల్ కంప్యూటర్స్,   ఆపిల్ - 2  వైపు గా అడుగులు వేయటానికి  ఉపయోగపడింది . 1977 లో ఆపిల్ కంప్యూటర్స్  , మొట్టమొదటి  user friendly   కలర్   డిస్ప్లే    ఉన్న   పర్సనల్ కంప్యూటర్  ని    రిలీజ్ చేసింది .  అప్పుడే   రిలీజ్ అయిన  VisiCalc, అనే  మొట్టమొదటి  మైక్రో computers  కోసం  తయారు చేసిన  spreadsheet    ఒక్క సారి గా ఆపిల్ కంప్యూటర్స్   బిజినెస్  ని  నెలకి 1000  units  నుంచి 10000 units  కి పెంచింది .  ఇలా   1978, 79 , 80 లలో  చవి చూసిన   సక్సెస్  తో 1980 డిసెంబర్ 12 న  ఆపిల్ కంప్యూటర్స్  Inc . పబ్లిక్  ఇష్యూ కి వెళ్ళింది . అప్పటి  కంపెనీ  విలువ  1.8 బిలియన్  డాలర్లు . 

కంపెనీ మానేజింగ్  డైరెక్టర్  గా   ఆధునిక  మార్కెటింగ్  కిటుకులు  తెలిసిన  చరిస్మాటిక్  వ్యక్తి  ఉండాలి అన్న అవసరాన్ని  గుర్తించిన  Mike Markkula ,  జాబ్స్  దానికి  సరైన వ్యక్తి  గా  పెప్సి మేనేజర్ గా పనిచేస్తున్న John  Sculley ని గుర్తించారు . 

John  Sculley ని ఆపిల్ లో చేరటానికి ఒప్పించటానికి  స్టీవ్  వాడిన  ఈ క్రింది  వాక్యం  తరవాత  కాలం లో  బాగా   ఫేమస్  అయ్యింది   :-)  

Do you want to sell sugared water for the rest of your life or do you want to come with me and change the world?”

(అసలు   సిసలు కార్పొరేట్  యుద్దాలు  తరవాత భాగం లో అప్పటి వరకు) 

"So when a good idea comes, you know, part of my job is to move it around, just see what different people think, get people talking about it, argue with people about it, get ideas moving among that group of  100 people, get  different people together to explore different aspects of it quietly, and, you know" ... just explore things
- Steve Jobs

-శ్రావ్య 

(Image Credit : Google images)

Recommendations

Tuesday, October 9, 2012

Steve Jobs(1955-2011) - 1/6


Winners don't do different things, they do things differently !

స్టీవ్ జాబ్స్ గా మనందరికీ తెలిసిన స్టీవ్ పాల్ జాబ్స్  24  పిబ్రవరి 1955 న  అమెరికా సంయుక్త రాష్ట్రాల కి  చెందిన కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ఫ్రాన్‌సిస్కో నగరం లో జన్మించారు.  జోయాన్ సింప్సన్,  Abdulfattah John  Jandali  లు  స్టీవ్ కన్నతల్లిదండ్రులు  అయితే,   క్లారా &  పాల్ జాబ్స్, స్టీవ్ ని  పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు.  

స్టీవ్ పుట్టేనాటికి ఆయన తల్లిదండ్రులు ఇంకా విద్యార్దులు అవ్వటం వల్ల, పుట్టబోయే బిడ్డని పెంపకానికి ఇవ్వటానికి ఆయన తల్లి ముందే ఒక సంపన్న కుటుంబం తో అంగీకారం కుదుర్చుకున్నారు. కానీ ఆ కుటుంబం చివరి నిమషం లో తమకు అమ్మాయి కావాలి అని నిర్ణయాన్ని మార్చుకోవటం తో స్టీవ్ ని ఎట్టి పరిస్తితులలో నైనా గ్రాడ్యుయేట్ ని చేస్తాం అన్న మాట తీసుకుని క్లారా, పాల్ జాబ్స్ దంపతులకి దత్తత కి ఇచ్చారు . స్టీవ్ పాల్ జాబ్ అన్న పేరు క్లారా, పాల్ జాబ్స్ పెట్టినదే. ఇలా స్టీవ్ జాబ్స్ బాల్యం క్లారా, పాల్ జాబ్స్ తో కాలిఫోర్నియా లో ప్రస్తుత సిలికాన్ వ్యాలీ లోని బాగమైన మౌంటైన్ వ్యూ లో ప్రారంభం అయ్యింది . వృతి రీత్యా పాల్ జాబ్స్ మెషినిస్ట్ అవ్వటం తో స్టీవ్ జాబ్స్ కి చిన్నతనం నుంచే ఎలక్ట్రానిక్ ఉపకరణాల్ని రిపేరు చేసే క్రమం లో వాటిని విడదీయటం , తిరిగి ఎసెంబుల్ చేయటం లాంటి వాటిలో ప్రావీణ్యత సంపాదించే అవకాశం కలిగింది. స్టీవ్ జాబ్స్ ఒకానొక సమయం లో తన తండ్రి గురించి "He was a genius with his hands” అని చెప్పారు . ఇలా తన తండ్రి తో కలిసి ఇంటి గారేజ్ లో చిన్నతనం లో స్టీవ్ చేసిన పనులు తన భవిష్యత్తులో అత్యుత్తమ డిజైన్ ల రూపకల్పన లో ఉపయోగపడ్డాయి.

Steve Jobs (circled) at Homestead High School Electronics Club
Homestead High school లో స్టీవ్ 
సహజం గానే  తెలివితేటలూ , ప్రత్యేకమైన  ఊహశక్తి ఉన్న  స్టీవ్ కి మామూలు స్కూల్ జీవితం విసుగ్గా ఉండేది . స్టీవ్ జాబ్స్ స్కూల్ ని పెద్ద గా పట్టించుకోకుండా నిజానికి turbulent చైల్డ్  గా ఉండేవాడు అంతగా   చదువు  అంటే  ఉత్సాహం  చూపించని  స్టీవ్ ని   తన  ఫోర్త్  గ్రేడ్ టీచర్ (Monta Loma Elementary School)  చాక్లెట్ లని  లంచం గా  యిచ్చి  తన దృష్టి ని చదువు  వైపు  మళ్ళించారు.  దానితో స్టీవ్  స్కూల్ జీవితం  ఒక దారి లో  పడటమే కాదు,  సహజంగానే తెలివి గల  స్టీవ్  ని 5th   గ్రేడ్ స్కిప్  చేసి    4th   గ్రేడ్ నుంచి  డైరెక్ట్  గా  మిడిల్ స్కూల్  కి  పంపొచ్చు   అన్న రికమెండేషన్  కూడా సంపాదించాడు.  కానీ   స్టీవ్  చదువు మీద  అంతగా నమ్మకం లేక ,  స్టీవ్ అల్లరి మీద అతి నమ్మకం తోనూ క్లారా , పాల జాబ్స్ దానికి ఒప్పుకోలేదు :-) .  ఎలిమెంటరీ స్కూల్  తరవాత Crittenden Middle School  లో చేరిన స్టీవ్ జాబ్స్ అక్కడ  స్కూల్ పరిస్తితులకి అలవాటు పడలేకపోయారు . దానితో  స్టీవ్ కోరిక పైన  స్కూల్ మార్చటానికి  సిద్దపడ్డ  క్లారా , పాల్ జాబ్స్ లు  Cupertino జూనియర్ హై స్కూల్ లో స్టీవ్ చదువు  కొనసాగించటానికి  అనువు గా Los Altos  అనే  ప్రాంతానికి  మారిపోయారు .  ఇక్కడే  స్టీవ్ జీవితం మలుపు తిరిగింది .

అప్పుడే  రష్యా  అంతరిక్షం  లోకి విజయవంతం గా   స్పుత్నిక్  పంపడం  తో  పోటీ గా  అమెరికా   టెక్నాలజీ  రంగం మీద  విపరీతం గా   ఖర్చు  చేసి  మరీ ప్రోత్సహిస్తున్న  రోజులు  కావడం తో,   సహజం గానే  స్టీవ్  దృష్టి   ఆ వైపు మళ్ళింది .  అలా  Electronics  రంగం పైన పెరిగిన మక్కువ తో Homestead High స్కూల్ లో చేరే సమయం లో అప్పటికే బాగా  పాపులర్  అవుతున్న  electronics   క్లాసు లో  చేరాడు  . అక్కడ  జాబ్స్ కి బిల్ పెర్నాండేజ్ తో పరిచయం ఏర్పడింది . స్టీవ్ జాబ్స్  కి   electronic   పరికరాల  మీద ఉన్న ఆసక్తి ని చూసిన   బిల్ పెర్నాండేజ్   అదే   రంగం  లో ఆసక్తి  , పరిచయం  ఉన్న  తన    స్నేహితుడు ,    యునివర్సిటీ  అఫ్ మిచిగాన్  విద్యార్ధి   అయిన   స్టీవ్  వోజ్నిక్  ని  జాబ్స్ కి పరిచయం  చేసాడు .  ఈ స్టీవ్ వోజ్నిక్ , స్టీవ్  జాబ్స్  ల  భాగస్వామ్యం లో   రూపుదిద్దుకున్నదే  ఈ రోజున మనం  చూస్తున్న  ఆపిల్  .   

జాబ్స్  వోజ్నిక్ ల  పరిచయం  అయ్యేటప్పటికి  జాబ్స్   వయస్సు 14  అయితే    వోజ్నిక్ వయస్సు  19,   వోజ్నిక్ , బిల్ పెర్నాండేజ్ కలిసి  అప్పటికే  ఒక చిన్న  కంప్యూటర్ బోర్డు   తయారు చేసే పనిలో  ఉన్నారు ,  దాని పేరు  “the Cream Soda Computer” .   .  

వోజ్నిక్ మాటలలో  స్టీవ్  కి  కంప్యూటర్ బోర్డు  మొదటి  సారి చూపించినప్పుడు   తనకి   కలిగిన   అభిప్రాయం 


Typically, it was really hard for me to explain to people the kind of design stuff I worked on, but Steve got it right away. And I liked him. He was kind of skinny and wiry and full of energy. […] Steve and I got close right away, even though he was still in high school […]. We talked electronics, we talked about music we liked, and we traded stories about pranks we’d pulled.

జాబ్స్ ,  వోజ్నిక్ ల పరిచయం అయిన రెండేళ్ళ  తరవాత అంటే 1972 ప్రాంతం లో  AT  & T ఫోన్ నెట్వర్క్ ని హాక్  చేయటానికి  తయారు చేసిన  "బ్లూ బాక్స్" అంటే  phone phreaking  పరికరం (device ) మీద వచ్చిన ఒక ఆర్టికల్   వీళ్ళిద్దరి మీద చూపించన ప్రభావం తో, అటువంటి  ఒక పరికరాన్ని  తయారుచేసే పని లో పడ్డారు.  ఆ  డివైసు చేసే పని ఏమిటి అంటే  ఫోన్ నెట్వర్క్ ని హాక్ చేసి  ఎటువంటి ఖర్చు  లేకుండా  దూరప్రాంతాలకి ఫోన్ చేసే అవకాశం కల్పించటం.  వీళ్ళ  ప్రయత్నం  ఫలించి అటువంటి  పరికరాన్ని తయారుచేయగాలిగారు . అది చూసిన  జాబ్స్ కి  ఆ పరికరాన్ని  అవసరం అయిన వారికి అమ్మితే ఎలా ఉంటుందా అన్న ఆలోచన  వచ్చింది .  దానితో  వోజ్నిక్ ఉంటున్న  బర్కేలీ  స్టూడెంట్  డార్మేటరీ  లోని  ప్రతి   రూం కి వెళ్లి అమ్మే ప్రయత్నం  చేసారు . కాకపొతే ఇది  ఇల్లీగల్ బిజినెస్ కావటం తో  దరిదాపు  పోలీసులకి  దొరికిపోబోయి  ఇక  ఆ ప్రయత్నాన్ని  మానేశారు . 

తొలిసారి గా  వీళ్ళిద్దరూ  కలిసి entrepreneurs  గా మారదామన్న  ప్రయత్నం  ఇలా  ముగిసిందన్న  మాట :-)  వచ్చే భాగం లో  అసలు  ఆపిల్    ఎలా  ఏర్పడిందో చూద్దాం ! అంతవరకూ ..

Stay hungry ! Stay foolish ..


Recommendations :

తన  గురించి  తన మాటల్లో -  స్టీవ్ జాబ్స్ .   (This is one of the greatest speeches of Steve, I   strongly  recommend to watch this  powerful speech) 


-శ్రావ్య 
Image Source : Google images

Friday, October 5, 2012

Steve Jobs(1955-2011) - Prologue


I’ve always felt that death is the greatest invention of life. I’m sure that life evolved without death at first and found that without death, life didn’t work very well because it didn’t make room for the young. It didn’t know how the world was fifty years ago. It didn’t know how the world was twenty years ago. It saw it as it is today, without any preconceptions, and dreamed how it could be based on that. We’re not satisfied based on the accomplishment of the last thirty years. We’re dissatisfied because the current state didn’t live up to their ideals. Without death there would be very little progress.  
                                                                                                 - Steve Jobs 

ప్రియమైన   జాబ్స్,

సరిగ్గా ఒక సంవత్సరం  .... నువ్వు  ఈ  ప్రపంచానికి  వీడ్కోలు   చెప్పి  ..


ఈ సంవత్సరకాలంలో నిన్ను తలుచుకోకుండా ఒక్కరోజు అయినా గడిచిందా? లేదనేచేప్పాలి !!   నిన్ను  ఎప్పుడూ నేను  personal గా కలవక పోయినా , టెక్నాలజీకి ఈస్తటిక్ సెన్స్ అద్దాలి  అన్న ఆలోచన, Pixar చేసే wondrous things,  extra-ordinary  ప్రోడక్ట్ లాంచింగ్  టెక్నిక్స్, ఇంకా...మృత్యువు  సమీపిస్తుంది అని  తెలిసీ నిబ్బరం గా వ్యవహరించిన తీరు ఇవన్నీ నీ  millions of  fans లో నన్ను ఒక దాన్ని చేసాయి.   You are the only one entrepreneur who enjoyed the ROCK STAR status, and you truly  deserve that.  అసలు ...  ముందు  చెప్పిన వాటి అన్నిటి కన్నా  ఈ  చివర చెప్పిన  ఒకే ఒక్క కారణం తోనే  నువ్వంటే  నాకు బోలెడంత అభిమానం .

Jobs, I strongly  believe in one of your sayings  that  "our time is limited, so don't waste it living someone else's life. Don't be trapped by dogma - which is living with the results of other people's thinking. Don't let the noise of others' opinions drown out your own inner voice."  And I wish I truly follow this until my last  breath !

Rest in Peace Jobs ! We  are missing your fire !

Signing off,
with loads of love!
Sravya


PS :జాబ్స్ అంటే    నాలాంటి , మీలాంటి   కొన్ని మిలియన్ ల మందికి  ఎందుకు ఇష్టమో ,  తను ఎందుకు ఈ దశాబ్దపు  ఉత్తమ  CEO  నో,     నా లాంటి , మీలాంటి  చాలా మంది కి ఎందుకు   ఐకానిక్  ఫిగరో , అలాగే కొంచెం  మంది కి   జాబ్స్ అంటే ఎందుకు  పడదో  లాంటి   విషయాలలో నా ఆలోచనలని  వచ్చే  భాగాలలో   ఇక్కడ  మీతో  పంచుకోవాలి  అని నా ప్రయత్నం .