Subscribe:

Wednesday, June 5, 2013

GM Food - I


ఈ pic లో ఉన్నవి ఏంటో గుర్తుపట్టగలరా? ఎంటబ్బా ముత్యాలు, పగడాలు వగైరా వగైరా మొక్కజొన్న పొత్తులలాగా పండిస్తున్నారా అని ఆశ్చర్యపోతున్నారా?
అయితే,  మీకు  డిజైనర్ ఫుడ్ అయిన GM  ఫుడ్ గురించి అంతగా తెలియదన్నమాట. రండి రండి ఖచ్చితంగా ఈ పోస్టు మీకోసమే. 
*** 
హ్మ్ ! ఎక్కడ నుంచి మొదలు పెడదాం?  ముందు అసలు GM ఫుడ్  అనే పేరు ఎలా వచ్చింది? అసలు ఆ మాటకొస్తే GM అంటే  అర్ధం ఏంటో చూద్దాం. 'జెనెటికల్లీ మోడిఫైడ్ (జన్యు మార్పిడి)  ఫుడ్' అనేది,  GM ఫుడ్  పూర్తి పేరు. మరి ఇలా ఎందుకంటారు? 'తన సంతతికి   శాశ్వతంగా కొత్త లక్షణాలని అందించేట్లుగా ఒక జాతి ప్రత్యేక లక్షణానికి సంబంధించిన జీన్స్ ను మరొక జాతి జీన్స్ లోకి ప్రవేశపెట్టడం వల్ల ఆ  జాతి జీన్స్ కోడ్ ని  మార్చి  ఒక కొత్త జెనెటికల్లీ మోడిఫైడ్ అర్గానిజంని  సృష్టించటం ద్వారా  ఈ ఫుడ్ ఉత్పత్తి  జరుగుతుంది కాబట్టి దీన్ని  జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ అంటారు.  ఈ జన్యుమార్పిడి పధ్ధతిలో  మొక్కల నుంచి మొక్కలకు మాత్రమే కాదు జంతువుల నుంచి మొక్కలకు కూడా ఈ  జీన్స్ అదే జన్యువులని మార్చే అవకాశం ఉంటుంది.  ఉదాహరణకి టమోటా ఫెరిషబుల్ వెజిటబుల్ అని మనకందరికీ తెలుసు కదా?  1991 లో DNA Plant Technologies అనే కంపెనీటమోటాలోకి చేప జన్యువులని ప్రవేశపెట్టడం ద్వారా టమోటా త్వరగా పండిపోకుండా, అలాగే  నీళ్ళలో ఎక్కువ కాలం నిలువుండేట్లు చేయటానికి ప్రయత్నం చేసింది.  కానీ ఈ ప్రయోగం ఫలించక  ఫిష్ టమోటాని మనం సూపర్ మార్కెట్స్ లో చూడలేకపోయాం. అయితే, ప్రస్తుతం మనం తినే పదార్ధాలలో తప్పకుండా ఈ GM ఫుడ్ traces ఉన్నాయని  చెప్పక మాత్రం తప్పదు. అదెలాగో ముందు చూద్దాం.  

ఇప్పుడు ఈ జన్యుమార్పిడి ప్రక్రియ అంటే ఒక ఐడియా వచ్చింది  కదా ?  మరి నిజంగా  ఈ జన్యుమార్పిడి అనేది  'Modern Marvel' లాంటి ప్రక్రియేనా ?   ఆ మాటకొస్తే ఇలా చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు చేయాలి ?అసలు సాంకేతికంగా ఇది ఎలా సాధ్యం? అనే విషయాలు  చూద్దాం

1980 ప్రాంతం లో తొలిసారిగా టమోటాని  "antisense” approach  (అంటే టమోటా పండటానికి అవసరమైన ఎంజైమ్ ఉత్పత్తికి అవసరమైన polygalacturonase అనే ను జీన్ ను క్రోమోజోం నుంచి వేరు చేసి తిరిగి వ్యతిరేకదిశలో (antisense direction) ప్రవేశపెట్టడం) వాడి  ఎక్కువ కాలం నిలువ ఉండేలా చేయచ్చు అన్న ప్రయత్నాలను మొదలుబెడితే, అంతకు ముందు కొన్ని వందల సంవత్సరాల నుంచి రకరకాల పళ్ళు, కూరగాయలు, మిగిలిన ఆహారధాన్యాలు మరింత రుచికరమైన, వేరు వేరు ఆకారాల్లోను, మరింత కాలం ఎక్కువ నిలువుండేట్లు గాను, మరింత మెరుగ్గా మొక్కలు వ్యాధులని ఎదుర్కునేట్లు గాను చేయటానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి. నిజానికి ఈ ప్రయత్నాలు చాలా విజయవంతం కూడా అయ్యాయి, పైగా వాటి ఫలితాలని మనం 'రుచి' చూస్తున్నాం కూడా. మరి అదెలా సాధ్యం? అంటే ఈ జన్యుమార్పిడి కన్నా ముందు నుంచి ఏదో టెక్నిక్ ఉందన్న మాట ఇలాంటి వాటిని సాధ్యం చేయటానికి. కరెక్ట్ ఉంది, అదే Conventional Plant Breeding/ Traditional Plant Breeding. 

Conventional  Plant Breeding/ Traditional Plant Breeding : 
ఈ పధ్ధతిలో In Breeding,  Cross Breeding(Hybridization),  Grafting (అంటుకట్టడం)  అనే  టెక్నిక్స్ ని  వాడతారు. ఈ పేర్లు చూడగానే చిన్నప్పుడు చదువుకున్న బోటనీ పాఠాలు గిర్రున బుర్రలో తిరిగాయి కదా? ఒకే ,  ఏ విషయం అయినా  సరే అప్పటికప్పుడు గూగుల్ చేసి చూసి, అవసరం తీరగానే బుర్రలోనుంచి shift + del  కొట్టే కాలం లో బ్రతుకుతున్నాం కాబట్టి సరిగా గుర్తురాకపోవటం  పెద్ద క్రైమ్ కాదు. అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళ కోసం వీటి గురించి కొంచెం క్లుప్తం గా వివరించటానికి ప్రయత్నం చేస్తాను . 

  • ఈ  మూడు పద్దతులలో ఎటువంటి లక్షణాలు ఉన్న వెరైటీ ని పెంచాలి అనుకుంటున్నామో దానికి తగ్గ పేరెంట్ ప్లాంట్స్ ఎన్నుకుంటారు. 
  • In Breeding  Cross Breeding  లలో అయితే ఈ పేరెంట్ ప్లాంట్స్ ని simultaneous గా పెంచుతారు. దీని వల్ల పేరెంట్స్ రెండూ ఒకే టైములో పూత దశ కి వచ్చే అవకాశం ఉంటుంది . 
  • పూతదశకి రాగానే నాచురల్ pollination జరగకుండా జాగ్రత్తలు తీసుకుని, కొత్త  సంతతికి కావాల్సిన లక్షణాలు వచ్చేట్లుగా paintbrushes, tweezers  సహాయం తో మేల్ పేరెంట్ లోని pollen ని ,  ఫిమేల్ పేరెంట్ లోని stigma మీద ఉంచటం ద్వారా  artificial fertilization చేస్తారు.  
  • కొన్ని మొక్కలలో pollen ని,  ఫిమేల్ ప్లాంట్ pistil లోకి ప్రవేశపెట్టిన తరవాత ఆ వచ్చే మొదటితరం గింజలని  మొదట గ్రీన్ హౌస్ లోను, తరవాత  ఫీల్డ్స్ లోను కావాల్సిన  ప్రత్యెక లక్షణాలు వచ్చే వరకు పరీక్షించటం ద్వారా తయారుచేస్తారు. 
  • Cross Breeding కు  In Breeding  కు  ఉన్న తేడా :In breeding లో  parents,  ప్లాంట్స్ రెండూ genetically same group కి చెందినవిగా ఉంటాయి, అదే Cross Breeding లో పేరెంట్ ప్లాంట్స్  genetically different individuals  అయి ఉండొచ్చు . 
  • ఇక Grafting (అంటుకట్టడం) లో ఎన్నుకున్న మొక్కలోని ఒక మొక్క టిష్యూ (కణజాలాన్ని) వేరే మొక్క కణజాలం లోకి చొప్పించటం ద్వారా కొత్త లక్షణాలు వచ్చేట్లుగా చేస్తారు.  మరింత గా తెలుసుకోవటానికి ఇక్కడ చూడండి . 
  • Luther Burbank అనే అమెరికన్ Botanist తన 55 సంవత్సరాల కెరీర్ లో 800 రకాలకు పైగా జాతుల మొక్కలని అభివృద్ధి ఈ పద్ధతిలో అభివృద్ధి చేసారు. (వివరాలు ఇక్కడ ).
  • మన రాష్ట్రంలో ఈ పద్ధతిలో సాధించిన అభివృద్ధికి ఈ ఉదాహరణ చెప్పొచ్చు:  మన ప్రాంతంలో  ఎక్కువగా సాగు చేసే వరిని తీసుకుంటే. 1980ల వరకు కూడా బాగా ప్రసిద్ది చెందిన మసూరిలో పొడుగు  రకాన్ని పండించేవారు. ఈ రకంలో మొక్క ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. దీని పంట సాధారణం గా రైతు చేతికొచ్చే కీలకసమయమైన నవంబర్, డిసెంబర్ నెలలో ఋతుపవనాల మూలంగా పడే వర్షాలకు పంట ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల  త్వరగా ఒరిగిపోవటంతో గింజలు తడిసిపోయి నానిపోవటం వల్ల విపరీతమైన నష్టం జరిగేది. దీన్ని తట్టుకొవటానికి మన వాతావరణంకి అనుకూలమైన పరిస్థితులలో ఎత్తు తక్కువగా పెరిగే రకం వరివంగడాలని  ఇదే traditional పద్దతిలో అభివృద్ధి చేసారు. తరవాతి కాలంలో ఎక్కువ రోజులు నీళ్ళు నిలవ ఉన్నా తట్టుకునేట్లుగాను,  అలాగే నీళ్ళు తక్కువగా లభ్యమయ్యే కరువు సమయాల్లో ఆ పరిస్థితులకి తట్టుకునేట్లు గాను ఎన్నో రకాలు అభివృద్ధి చేస్తూనే ఉన్నారు . (వివరాలు ఇక్కడ చూడొచ్చు) 
Well, అంతా బావుంది కదా ! ఇలా అంతా చక్కగా గడిచి పోతుంటే మరి ఈ జన్యుమార్పిడి లాంటి పద్ధతులు ఎందుకు? ఉన్నాయి..  ఉన్నాయి..  కారణాలు ఉన్నాయి!


పైన Conventional Plant Breeding గురించి చదివినప్పుడు మీకు ఒక అనుమానం బుర్రలో తొలిచి ఉండాలి. మరీ ముఖ్యం గా ఇన్  బ్రీడింగ్ గురించి చూస్తే. అది ఏంటో నేనే చెప్తా ! సీతాకోకచిలుకలు, గాలి, ఇంకా ఏవేవో ప్రకృతి సహజమైన పద్దతుల ద్వారా కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది కదా, మరి మనం ప్రత్యేకంగా ఇలా చేయటం ఎందుకు అని ? ఈ అనుమానం సరైనది, మరి అలా ఎందుకుచేస్తున్నాం? ప్రకృతి సహజంగా  చేసిన ఈ ఏర్పాటు -  పెరుగుతున్న మన జనాభా అవసరాలకి సరిపడా ఉత్పత్తి పెంచటానికి, మరింత నాణ్యమైన ఉత్పత్తులని ప్రొడ్యూస్ చేయటానికి, అలాగే అననుకూల పరిస్థితులని ఎదుర్కోవటానికి సరిపోకపోవటంతో ఇలా ఎక్సెల్ చేయాల్సిన అవసరం కలిగింది. అయితే ఈ Conventional Plant Breeding చాల వరకు మన అవసరాలు తీర్చింది కానీ, ఈ పద్ధతిలో result సాధించటం అనేది చాలా టైం తో కూడుకున్న పని, కొన్ని సార్లు 5 నుంచి పది సంవత్సరాల వరకు, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు. రిజల్ట్ అన్ని సార్లు పాజిటివ్ గానే ఉంటుంది అన్న assurance కూడా తక్కువ. కాలం గడిచే కొద్దీ crop పెర్ఫార్మన్స్ తగ్గుతూ పోతుంది కాబట్టి కొత్త ప్రయోగాలు తప్పని సరి.  అలాగే ఈ Conventional Plant Breeding అనేది closely related characteristics ఉన్న జాతుల మధ్య మాత్రమే సాధ్యపడుతుంది.  ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా పెరుగుతున్న జనాభా, తరుగున్న పంట భూముల విస్తీర్ణం, వృధా అవుతున్న పెరిషబుల్స్ ని అరికట్టడం, అలాగే త్వరితగతిన మారుతున్న క్లైమేట్, తరుగుతున్న నీటి వనరులు వీటిని ఎదుర్కుని మన భవిష్యత్తు అవసరాలకి అనుగుణంగా మరింత పోషక విలువలున్న ఆహరం లభించేట్లుగా పంటలు పండించాలి అంటే ఏమి చేయాలి? ఈ ప్రశ్నలకి సమాధానంగా మనకు ఇప్పటి వరకు దొరికిన జవాబు ఈ జన్యు మార్పిడి.


నిజంగా ఈ జన్యుమార్పిడి అనేది మన భవిష్యత్తు ఆహర అవసరాల కోసం దొరికిన సమాధానమేనా? Conventional Plant Breeding తో పోలిస్తే ఇది ఎలా అనుకున్న రిజల్ట్ ఖచ్చితంగా ఇవ్వగలదు? ఒకవేళ అనుకున్న రిజల్ట్ ఇచ్చినా దీనితో ఎటువంటి రిస్క్ గానీ నష్టం గానీ లేదా? అదే నిజం అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ GMOs కు వ్యతిరేకం గా ఇన్ని ఆందోళనలు ఎందుకు ? Dr. వందనా శివ లాంటి వారు ఆరోపిస్తున్నట్లుగా ఈ GMOs తో అగ్రి బిజెనెస్ లో అగ్రగామిగా నిలుస్తున్న Monsanto లాంటి corporates బయో రేప్ కు తెగబడుతున్నయా ?
Dr. Vandana Shiva Tweet


కొంచెం ఆగండి .. ఇప్పటికే చాలా పెద్ద పోస్ట్ అయ్యింది కదా అందుకే,  ఇప్పటికి ఇక్కడ ఆపేసి  రెండో భాగం లో ఆ విశేషాలు చూద్దాం . 

-శ్రావ్య 
Images' source - Google images