మల్లెలు తనకిష్టం
గులాబీలు నాకిష్టం
నేనేమో తనకిష్టం
తనేమో నా ప్రాణం
అబ్బాబ్బా... చెప్పిన కథలే ఎన్ని సార్లు చెబుతారు అని మీరనుకోవటం, మీ మనస్సులో అనుకున్న మాట విని నేను చిన్నబోవటం. ఎందుకు, ఇవన్నీ అవసరమా ?! అందుకే నేనే కథా చెప్పబోవటం లేదు, మీరు చదవబోవటం లేదు కూడాను . అయినా సరే కథుంది అందులో అమ్మాయి అబ్బాయి ఉన్నారు.
ఊ .... అమ్మాయి , అబ్బాయి ఉన్నారు అని చెప్పా ... పోనీ కథ మొత్తం చెప్పక పోయినా ఎండింగ్ చెప్పేయనా ఎక్కువ సస్పెన్స్ లో పెట్టకుండా ? ! ఉహు వద్దులే ... ఎంత probability లెక్కలు కట్టినా రెండే రెండు రకాలుగా ఎండ్ చేయగల chances ఉన్న కథకి ఎండింగ్ చెబితే ఎంత? చెప్పకపోతే ఎంత? అయినా కలిస్తేనే గొప్పకథ అవుతుందా, లేకపోతే కలవకపోతేనే గొప్పకథ అవుతుందా ఏంటి?
ఇప్పుడు.... ఎప్పుడూ వార్మ్ గా ఉండే మన సూర్యారావు గారు, ఇహ ఎల్లవేళలా కూల్గా నవ్వులు చిందిస్తూ ఉండే చందమామ ఉన్నారు, వాళ్ళిద్దరూ అసలు పూర్తిగా ఒకరినొకరు చూసుకోవాలంటేనే ఏ గ్రహణమో రావాలి, అలాంటిది ఇక కలిసేవుంటే, అమ్మో !!! భూమి మీద ప్రయళమే కదా. పొరపాటున అదే జరిగితే ఈ భూలోకవాసులకి దిక్కెవ్వరు అని ఆలోచించి కష్టమైనా, ఇష్టపడి, అలిసి పోకుండా ఒకరు డే షిఫ్ట్, ఇంకొకరు నైట్ షిఫ్ట్ అదేపనిగా మనకోసం కష్టపడటం లేదూ. వీళ్ళ కథ కన్నా అందమైన కథ ఇంకొకటుంటుందా? నో వే ప్రపంచంలోని అందమైన కథలోకెల్లా అందమైన కథది.
అరెరె !!! ఇదేంటి నేను కథ చెప్పను అని ఏవేవో కథలు చెప్తున్నాను ? No ... No .. I should not do this , అసలే నేను మాటంటే మాటే అని ... మాట రాసుకుని మరీ దాని మీద నిలుచునే మనిషిని, అందుకే నాకు ఏమీ తెలియదు, నేనేమి చెప్పబోవటం లేదు
మల్లెలు తనకిష్టం
గులాబీలు నాకిష్టం
నేనేమో తనకిష్టం
తనేమో నా ప్రాణం
ఇది తప్ప ..... ఇక ఉంటానేం ?!
- శ్రావ్య
PS : డెల్ వాడిచ్చిన కీబోర్డ్ ఉంది, అప్పనంగా వచ్చిన ఇంటర్నెట్ ఉంది అని ఏదో బుర్రలో తోచింది అంతా మా మొహం అదేలెండి .. స్క్రీన్ మీద కొట్టటమే ... అని మీరు తిట్టుకుంటే నాకు తెలిసిపోతుంది కూడా. అందుకే కొంచెం ఆ 'X ' బటన్ కొట్టి అప్పుడు తిట్టుకోండి . అయినా ఏమండీ ఏవేవో చదువుతారు .. ఏదో 6 నెలలకి ఒకసారి ఇలా నేను కూడా కీ బోర్డ్ మీద టైపు నేర్చుకుంటుంటే ప్రోత్సహించటం మానేసి అలా తిట్టడం తగునా అంటా ? (ఇప్పుడు మూతి తిప్పిన expression ఎలా రాయాలాబ్బా ఇక్కడ ? ! ఏమో అది నేర్చుకున్నాకా ఈ పోస్ట్ అప్డేట్ చేస్తా, అప్పటి వరకూ ఇంతే )