నోట్లోకి నాలుగువేళ్ళూ వెళ్ళటం కోసం పన్జేసే పన్లేకపోతే ... అంటే, సో కాల్డ్ వీకెండ్ తో పాటు అదనంగా ఒకరోజో/ రెండు రోజులో హాలిడేస్ వస్తే ...
నాకు
ఒక్కోసారి గడపకూడా దాటకుండా ఇంట్లోనే ఉండటం ఇష్టం
కొన్నిసార్లు బాగా జనాలతో రద్దీ గా ఉండే లోకల్ మార్కెట్ తిరగటం ఇష్టం
మరికొన్నిసార్లు బాగా పాంపెర్ చేసే హై ఎండ్ luxury మాల్స్ లో పడి తిరగటం ఇష్టం
ఇంకాకొన్నిసార్లు, యు సీ, నువ్వు ఎన్ని వేషాలు వేసినా నీ అసలు రూట్స్ ఇవి సుమా గుర్తు చేసేట్లుగా ఉండే పచ్చని ప్రకృతిలో ఒంటరిగా గడపటం మరీ ఇష్టం.
ఇక్కడకి దాకా చదివారంటే, ఆ పైన రాసినదంతా పోస్ట్ మొదలెట్టటానికి రాసిన ఫిల్లింగ్ మెటీరియల్ అని ఈపాటికి అర్ధమయ్యే ఉంటుంది 



. మీరు 100% కరెక్ట్. అసలు విషయం తెలిసిపోయింది కాబట్టి సోది వదిలేసి అసలు విషయానికి వస్తే, నేను చూసిన చిన్ని 'Hot Spring ' గురించి చెప్పటం ఈ పోస్ట్ ఉద్దేశ్యం. ఆవునూ, ఇంతకీ Hot Spring ని తెలుగులో ఏమంటారు చెప్మా ? 'వేడినీటి బుగ్గ ' / 'వేడి నీటి ఊట' అనా ? అమ్మో ఇప్పుడు బుగ్గ అనాలో ఊట అనాలో అని ఆలోచిస్తుంటే, అసలు విషయం వదిలి ఇంకెటో మళ్ళీ వెనక్కి తిరిగిరాలేనంత దూరం వెళ్ళే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి , ఏమనాలో... ఎలా రాయాలోనన్న... గడబిడల గుబుళ్ళన్నీ బాషాభిమానులకి/ భాషావేత్తలకి వదిలి అసలు సంగతిలోకి ఎగిరిపొతే ఎంత బావుంటుంది, అందుకే I will do it right now
.
Btw, Hot Spring అనే మాట మొదటిసారి వింటూ ఇక్కడకొస్తే, 'Hot spring' అంటే సహజంగా భూమిలోంచి ఎగసిపడే వేడినీటి ఊట. ప్రపంచంలోని కొన్ని fascinating హాట్ స్ప్రింగ్స్ వివరాలు ఇక్కడ. ఇండియా లోని హాట్ స్ప్రింగ్ వివరాలు ఇక్కడ.






Btw, Hot Spring అనే మాట మొదటిసారి వింటూ ఇక్కడకొస్తే, 'Hot spring' అంటే సహజంగా భూమిలోంచి ఎగసిపడే వేడినీటి ఊట. ప్రపంచంలోని కొన్ని fascinating హాట్ స్ప్రింగ్స్ వివరాలు ఇక్కడ. ఇండియా లోని హాట్ స్ప్రింగ్ వివరాలు ఇక్కడ.
*** *** *** *** ***



ఆ పరిసరాలలోకు వెళ్ళగానే సల్ఫర్ వాసన మన ముక్కుపుటలను తాకుతుంది. వీటివల్లనో ఏమో
తెలియదు కానీ, ఈ వాటర్ కు వంటినొప్పులు, కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ ని
తగ్గించే గుణం ఉంది అని నమ్ముతారు. ముఖ్యంగా ఈ వాటర్ లో పాదాలను
సోక్ చేయటం వలన / ఈ నీటితో స్నానం చేస్తేనూ అదృష్టం వస్తుంది అని కూడా
నమ్ముతారు. అందుకే, ఈ క్రింది పిక్చర్ లోలా ఆ బావికి మూడు వైపులా, ఈ బావిలోని స్ప్రింగ్ వాటర్ పైపుల ద్వారా వచ్చే ఏర్పాటు చేసారు. వేడిగా పొగలు కక్కుతున్న నీళ్ళు ఆ బకెట్స్ లోకి పడుతూ ఉంటె, ఎవరికీ కావాల్సిన నీళ్ళు వాళ్ళు తీసుకుని అవి సరిపడే వేడికి చల్లారేవరకు, చుట్టూ ఉన్న చల్లని చెట్ల నీడలో ఒక చైర్ వేసుకుని కూర్చుని వెయిట్ చెస్తూ ఉండటమే. పొరపాటున చూసుకోకుండా ఆ వేడి వేడి నీటిలో చెయ్యో, కాలో పెట్టామా ఇహ అంతే, తాట ఊడి వస్తుంది అంటారే అది ప్రాక్టికల్ గా కనపడుతుంది మన నోట్లోంచి కెవ్వుమని కేక ఇంకా బయటికి కూడా రాకముందే .
Recent times లో, అదృష్టం వస్తుంది అనే నమ్మకం కొంచెం పలచనబడి రద్దీ తగ్గింది కానీ,
ఒక 5 -6 ఏళ్ళ క్రిత్రం వరకూ కూడా ఇక్కడకు దగ్గరలో ఉన్న క్రాంజీ race course కి
పందాలు కాయటానికి వెళ్ళేవాళ్ళు, అలాగే లాటరీ టికెట్స్ కొని అదృష్టం పరీక్షించుకునే వాళ్ళు ఆయా పనులు చేయటానికి వెళ్ళేముందు ఇక్కడికి
వచ్చి స్నానం / పాదాలు సోక్ చేసుకుని వెళ్ళే వాళ్లతో ఒక వెలుగు వెలుగుతూ
ఉండేదట ఈ హాట్ స్ప్రింగ్ ప్రాంతం. ఇప్పుడు అంతగా రద్దీ లేదు
కానీ, సరదాగా గ్రీనరీ చూడటానికి వచ్చి పాదాలు సోక్ చేసుకుంటూ బుక్ చదువుతూ టైం ప్సేండ్ చేసేవాళ్ళో /
సైక్లింగ్ కి batches గా వెళ్లి చివరిగా ఇక్కడకి వచ్చి కొద్దిసేపు ఆ
వేడినీటిలో పాదాలు సోక్ చేసుకుని లేదూ స్నానం చేసి వెళ్ళేవాళ్ళతో సందడి
సందడిగానే ఉంటుంది. వీటితో పాటు నాకు అక్కడ గమ్మత్తుగా అనిపించిన మరో విషయం కూడా ఉంది. అది ఏంటంటే, కొంతమంది రా
ఎగ్స్ తెచ్చి వాటిని ఆ వేడినీటిలో వేసి కొద్దిసెపయిన తర్వాత ఆ పై పెంకు వలుచుకుని తినడం. అది చూసిన
తర్వాత గూగుల్ చేస్తే నాకు తెలిసిన విషయం అలా ఎగ్ ను హాట్ స్ప్రింగ్ వాటర్ లో ఉడకపెట్టటం అనేది 'onsen tamago' అనే జపనీస్ traditional ఫేమస్ recipe అని, దానికి జపనీస్ క్యుజిన్ లో మంచి గిరాకీ అనీను
.

ఇది ఈ హాట్ స్ప్రింగ్ ప్రస్తుత అంటే 2015 లో నేను వెళ్ళినప్పటి పరిస్థితి . మరి అసలు ఒక హాట్ స్ప్రింగ్ అనేది ఒకటి ఉందని ఎప్పుడు ఎలా తెల్సింది, అలా తెలిసినప్పుడు ఇక్కడ ఎలా ఉండేది? అప్పటినుంచి ఇప్పటి వరకు వచ్చిన ఇక్కడ ఏమన్నా మారిందా అనే వివరాలలోకి చూస్తే ...
1908 లో మొట్టమొదటిగా Municipal ranger, W.A.B. Goodall ఈ హాట్ స్ప్రింగ్ ని డిస్కవర్ చేసారట, దాంతో ఆ అయిన ల్యాండ్ ఓనర్ అయిన చైనీస్ బిజినెస్ మాన్ ఈ వాటర్ 'safe for consumption' అన్న టెస్ట్ రిజల్ట్స్ తరవాత బిజినెస్ చేయటానికి అనువుగా ' Singapore Natural Mineral Hot Springs Company' అనే కంపెనీ స్టార్ట్ చెసారు. ఇదే కంపెనీ పేరు తరువాత కాలంలో 'Singapore Hot Springs Limited' గా మార్చారు. 1909 లో ఈ నీళ్ళని '“Zombun” అన్న బ్రాండ్ పేరుతొ బాటిల్స్ లో అమ్మటానికి ' ఈ కంపెనీ అమ్మడం మొదలుపెట్టింది. 1921 లో Fraser and Neave Limited (F&N) ఈ కంపెనీ ని టేక్ ఓవర్ చేసి “Zom”, “Vichy Water” అనే బ్రాండ్ పేర్లతో అమ్మడం మొదలెట్టింది. ఈ కంపెనీ + ఏరియా కు 'Seletar Hot Springs' అనే పేరు పెట్టి టూరిస్ట్ స్పాట్ గుర్తించి పబ్లిక్ కు ఓపెన్ చేసారు. ఇప్పటికీ ఈ చుట్టుపక్కల ప్రదేశాన్ని ఇదే పేరుతొ పిలుస్తారు. ఆ తర్వాత 1942 – 1945 మధ్యకాలంలో సింగపూర్ జపాన్ అధీనం లో ఉన్నప్పుడు, ఈ ప్రాంతమంతా జపాన్ ఉన్నతాధికార్లకు thermal bath heaven గా ఉండేదట, వాటిలోకి సామాన్యులకి ప్రవేశం ఉండేది కాదుట. 1944. లో జపాన్ కు వ్యతిరేకంగా Allied Forces జరిపిన బాంబింగ్ లో ఆ నిర్మాణాలన్నీ నాశనం అయ్యాయట.

(వాటర్ టెస్ట్ రిజల్ట్ రిపోర్ట్ , బాటిల్డ్ వాటర్ అమ్మకానికి సంబంధించిన పేపర్ యాడ్, 1967 లో అధికారుల ఫ్యాక్టరీ సందర్శన, చుట్టూ గోడలు కట్టక ముందు బావి, పిల్లలు ఆడుకుంటున్నా అప్పటి పరిసరాలను ఈ క్రింది పిక్చర్స్ లో చూడొచ్చు. పెద్దవిగా చూడటానికి డబల్ క్లిక్ చేయండి . Picture Credits : Singapore National Archives)
(Source : Singapore National Archives)
గతం లోంచి వర్తమానం లోకి వచ్చేస్తే.. అదృష్టం, ఆరోగ్యప్రయోజనాలు వంటివి పక్కన పెడితే, (I don't believe in all those anyway) ఈ హాట్ ప్శ్రింగ్ కి వెళ్ళే దారి, అక్కడ thick vegetation, నిశ్శబ్దంగా ఉండి కేవలం అప్పుడప్పుడు పక్షుల chirping మాత్రమే వినిపిస్తూ ఉండే పచ్చని పరిసరాలు నాకు చాలా చాలా నచ్చాయి. నిజానికి ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో ఎక్కువ ఎండలేనప్పుడు కేవలం మందు చల్లే spray tanks చేసే చప్పుడు మాత్రమే బాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వినిపిస్తూ ఉంటే పచ్చని పొలాల గట్లమీద నడిచిన అనుభూతి మరోసారి అనుభవం లోకి వచ్చింది. నేను అప్పుడు చూసిన కుప్పల కుప్పల కుక్కగొడుగులు, పక్కన పారుతున్న చిన్న కాలువ లాంటిది మళ్ళీ ఇంకోసారి ఈ హాట్ స్ప్రింగ్ వెళ్ళే దారిలో కనపడి నిజంగా అక్కడే ఉన్నానేమో అన్నకొద్దిపాటి భ్రమ కలిగించాయి. I thoroughly enjoyed this foray. ఇంకోసారి హాలిడే వచ్చినప్పుడు ఇలాంటి ఎక్కువ పాపులర్ కానీ ఇంకో ప్లేస్ గురించి తెలుసుకోవాలి మళ్ళీ :-)
- శ్రావ్య