అది కురుక్షేత్ర సంగ్రామంలో పదునాల్గోవరోజు ...
తన ప్రియపుత్రుడైన అభిమన్యుని మరణానికి కారణమైన జయద్రథుని(సైంధవుని) సూర్యాస్తమయం లోపు సంహరించలేకపొతే, రాజులందరూ చూస్తూండగానే గాండీవంతో సహా అగ్నిప్రవేశం చేస్తానని శపథం చేసిన అర్జునుడు యుద్ధభూమిలో మహోగ్రంగా చెలరేగుతున్నాడు. అర్జునుని ఈ శపథం గురించి తెలుసుకున్న కౌరవసైన్యం యావత్తు జయద్రథునికి రక్షణకవచంగా ఏర్పడి అర్జునుడి కంటపడకుండా కాపాడుతోంది. అప్పటికే ఒక అక్షౌహిణి కౌరవ సైన్యాన్ని తుదముట్టించిన అర్జునుడు, సుమారు మధ్యాహ్న సమయానికి కర్ణ, అశ్వద్ధామ, ద్రోణ వంటి యోధానుయోధుల పరిరక్షణలో ఉన్న జయద్రథుణ్ణి కనుగొన్నాడు. రక్షణవలయంగా నిలిచిన ఈ వీరాధివీరులందరినీ జయించే క్రమంలో భీకరంగా జరుగుతున్న యుద్ధంతో కాలాతీతం అవుతుంది. కర్తవ్యనిర్వహణలో అలసిన సూర్యభగవానుడు విశ్రమించటానికి నెమ్మదిగా పడమటికొండల పైకి చేరుకోబోతున్నాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు, సుదర్శనచక్రాన్ని సూర్యబింబానికి అడ్డుగా నిలిపి సూర్యాస్తమయం అయిపోయిందనే భ్రాంతిని కల్పించాడు. ఆ మాయతిమిరంలో పూర్తిగా మునిగిపోయిన కౌరవవీరులు సూర్యుడస్తమించాడని భ్రమించి విజయగర్వంతో ఉప్పొంగిపోయారు. ఆశ్చర్యానందాల నడుమ సైంధవుడు రక్షణ కవచం నుండి బయటికివచ్చి తలఎత్తి పడమర దిక్కు ఆశ్చర్యంతో చూస్తూ నిలిచాడు. వెనువెంటనే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ఉపసంహరించడం, అర్జునుడు జయద్రథుని సంహరించడం జరిగిపోయాయి.
*** *** *** *** ***
సూర్యాస్తమయం అవ్వకుండానే, అయ్యిందన్న భ్రాంతిని కలిగించి, శత్రువుని ఏమార్చటమా? What a brilliant War Technique !
Sources :
http://study.com/academy/lesson/the-water-cycle-precipitation-condensation-and-evaporation.html
https://www.quora.com
http://www.theatlantic.com/technology/archive/2015/02/the-science-behind-human-controlled-weather/385601/
http://www.bbc.com/news/uk
https://en.wikipedia.org
https://www.nasa.gov/

కురుక్షేత్ర సంగ్రామం.... అంటే దరిదాపు 10th century BCE ప్రాంతంలో జరిగివుండొచ్చూ అని హిస్టారియన్స్ అభిప్రాయపడుతున్న యుద్ధం. ఈ యుద్ధవర్ణనలోనే ఇటువంటి amazing war strategy గురించిన ప్రస్తావన ఉంటె, మరి మోడరన్ టైమ్స్ లో జరిగిన యుద్దాలలో ఇలాంటి టెక్నిక్స్ వాడాలన్న ఆలోచన ఎవరూ చేయకుండా ఉంటారా? పోనీ... యుద్దాలలో కాకపోయినా రికార్డు స్థాయిలో మంచుకురవటంతో, temperatures ఫ్రీజింగ్ పాయింట్ కన్నా తక్కువకు వెళ్ళిపోయి తద్వారా వచ్చే చల్లటిగాలులతో వణికిపోయేప్పుడో, భగ భగమని మండుతూ తన ప్రతాపాన్ని చూపించే సూర్యభగవానుడిని ధాటికి విలవిలలాడేప్పుడో... ఇవన్నీ కాదుకానీ చక్కగా చల్లటి వేసవికాలాలు & గోరువెచ్చటి శీతాకాలాల కోసం ఇలాంటి Weather modification టెక్నిక్స్ వాడితే ఎలా ఉంటుందో అన్నఆలోచన ఎవరికీ వచ్చి ఉండదా?
ఎందుకు రాలేదు? ఆలోచన రావటమే కాదు, వచ్చిన ఆలోచనను అమలులో పెట్టటం కూడా జరిగింది. అదెలాగా అంటే .....
US's Operation Popeye
అది 1967 - 1972 మధ్యకాలం. ఫ్రాన్స్ వియత్నాం మీద యుద్ధం ప్రకటించింది. అనేకానేక యితర కారణాలతో పాటు ఫ్రాన్స్ - అమెరికాల మధ్య మిలిటరీ & ఎకనామిక్ ఎయిడ్ ఒడంబడిక (ట్రీటీ) ఉండటంతో, ఫ్రాన్స్ కు సపోర్ట్ గా పెంటగాన్ తన ముక్కు దూర్చటంతో పాటు US Air Force ఆధ్వర్యంలో, వియత్నాం అయుధాలు, ఆహారం, ఇతరత్రా ఎక్విప్మెంట్ సైన్యానికి అందజేయటానికి సప్లై రూట్ గా వాడుతున్న "Ho Chi Minh Trail" లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించి శ్రతువుని ఇరుకున పెట్టాలని నిర్ణయం తీసుకోవటమే కాకుండా దానికి అధికారికంగా "Operation Popeye" అని నామకరణం చేసింది. ఈ ఆపరేషన్ ప్రదానలక్ష్యం - అతి ముఖ్యమైన Ho Chi Minh Trail ప్రాంతంలో common form of chemical weather modification గా చెప్పబడుతున్న క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ ద్వారా monsoon season ను పొడిగించి, తద్వారా ఎక్కువ వర్షపాతం నమోదయ్యేట్లు చేయటం. ఈ అధికంగా కురిసే వర్షాలతో ఎక్కువ రోజులు నీళ్ళతో నాని పోవటంతో నేలంతా బురద బురదగా (saturated soil ) గా ఆవ్వడం, రోడ్లు దెబ్బతిని transportation కు పనికిరాకుండా పోవటం, నదులు దాటటానికి వాడే కట్టలు కొట్టుకుని పోవటం, Land slides / land slips ఏర్పడటం లాంటివి జరిగి సప్లై చైన్ బ్రేకవుతుంది. ఇహ End result గా మిలిటరీకు వచ్చే సహాయం ఆగిపోవటంతో శత్రువు ఇరుకున పడతాడు. ఈ లక్ష్యాలకు తగినట్లుగానే ఈ ఆపరేషన్కు "Make mud, not War" అన్న సోగ్లన్ ను వాడారు. Operation Popeye కోసం అమెరికా దరిదాపు 3000 సార్లు విమానాలని Ho Chi Minh Trail ఉపరితం లోకి పంపింది. గాలిలోకి ఎగిరిన ఈ విమానాల పని ఏంటంటే silver iodide particles ను మేఘాల మీద వెదచల్లటం. దానితో Metalhalogen compound అయిన ఈ సిల్వర్ అయోడైడ్ (తరవాత కాలంలో సిల్వర్ అయోడైడ్ వాడటం వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని, దాని బదులు పొటాసియం అయోడైడ్ /డ్రై ఐస్ /లిక్విడ్ ప్రొపేన్/ ఇంట్లో వాడే టేబుల్ సాల్ట్ లాంటి hygroscopic కెమికల్స్ ను దీని కోసం వాడొచ్చు అని తేల్చారు) మేఘంలోని నీటిఆవిరిని ఆకర్షించి ఒక పెద్ద నీటిబిందువుగా మారుస్తుంది. ఇలా నీటిబిందువులుగా మారిన ఆవిరి బరువు ఎక్కువటంతో వర్షంగా భూమిమీదకి పడుతుంది. థాయిలాండ్ భూభాగంలోని Udorn Royal Thai Air Force Base వియత్నాం బోర్డర్ కు దగ్గరగా ఉండి అనుకూలంగా ఉండటంతో, అక్కడ నుంచి aircrafts ను ప్రయొగించారు. మొత్తానికి యుద్ధపు అంతిమ ఫలితం అమెరికా, ఫ్రాన్స్ లకు నిరాశనే మిగిల్చినా అధికారికంగా Defense Intelligence Agency వేసిన లెక్కల ప్రకారం "Operation Popeye" వల్ల ఆ ప్రాంతంలో 30% వర్షపాతం పెరిగినట్లుగా తేల్చారు. ఇక ఈ యుద్ధం మొట్టమొదటిసారిగా 'Weather Modification" అనే ఆయుధాన్ని వాడిన యుద్ధంగా చరిత్రకెక్కింది. అయితే అత్యంత రహస్యంగా మొదలైన ఈ ఆపరేషన్ 1971 లో ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ తో వెలుగుచూడటంతో పొలిటికల్ కాంట్రవర్సీకి దారి తీసి US గవర్నమెంట్ 1977 లో United Nations ప్రతిపాదించిన Convention on the Prohibition of Military or Any Other Hostile Use of Environmental Modification Techniques అగ్రిమెంట్ సైన్ చేయటంతో ముగిసింది.
Rain Prevention by China in 2008 Olympics
అమెరికానేమో తన విజయ పరంపర కొనసాగించటానికి 'వాన వాన వల్లప్పా' అని బ్రతిమలాడి వియత్నాం మీద నీళ్ళని కుమ్మరిస్తే, చైనా ప్రతిష్టాత్మకంగా తను నిర్వహిస్తున్నా ఒలింపిక్ గేమ్స్ లో గడబిడ జరక్కుండా ఉండటానికి 'రైన్ రైన్ గో అవే' అంటూ దూరంగా తోసేసింది. అదెలాగా అంటే, 2008 సమ్మర్ ఒలింపిక్స్ ని చైనా నిర్వహించింది. అందులో భాగంగా ఓపెనింగ్ సెర్మనీ కోసం ఈ ఒలింపిక్స్ కోసం ప్రత్యేకంగా 400 మిలియన్ల డాలర్స్ తో బీజింగ్ లో నిర్మించిన "Bird's nest" అనే 91,000 సీట్స్ ఉన్న స్టేడియం ను ఎన్నుకుంది. One of the key engineering marvels in the world అని చెప్పబడే ఈ స్టేడియం ఓపెన్ రూఫ్ స్టేడియం, దానితో వర్షం నుంచి ఈ స్టేడియం రక్షణ కోసం weather modification technology ను meteorological umbrella గా మార్చే బాధ్యతను 37,000 మంది ఎంప్లాయిస్ పని చేస్తున్న తన Beijing Weather Modification Office కి అప్పగించింది. ఈ సంస్థ 30 ప్లేన్స్, 4,000 రాకెట్ లాంచర్స్, 7,000 anti-aircraft guns సహాయం తో కెమికల్స్ మేఘాల పైకి పంపి వర్షంగా మారబోయే రైన్ droplets ని ష్రింక్ చేయటంతో ఆ స్టేడియం ప్రాంతాన్ని వర్షం భారీన పడకుండా కాపుకాసింది.

Russian way of Weather Modification
1980 అంటే సోవియట్ యూనియన్ పీరియడ్ లో మాస్కో లో వింటర్ సీజన్ లో భారీగా స్నో ను కంట్రోల్ చేయటానికి స్పెషల్ సర్వీస్ ఉండేది. ఈ సర్వీసు పని 8 - 10 ప్లేన్స్ సహయంతో మాస్కో చుట్టుపక్కల most precipitation ఉన్న మేఘాల్ని గుర్తించటం వాటిమీద crystallizing salts ను చల్లటం. సో ఈ మేఘాలు ఇంకా మాస్కో చేరకముందే స్నో కురిసేది, దానితో 20 - 40 % వరకూ మాస్కో లో స్నో ఫాల్ ను తగ్గించెవారు. తర్వాత గోర్భచేవ్ రిఫార్మ్స్ పీరియడ్ లో నిధుల కొరత మూలంగా ఆపెసారు. కానీ ఆ కాలం నుంచీ ఇప్పటి రష్యా ప్రభుత్వం వరకునూ Victory Day, City Day, Russia Day లాంటి స్పెషల్ అకేషన్స్ లో rain prevention methods ని మాత్రం వాడుతూనే వస్తున్నారు. గంటకి $6000 పే చేస్తే పెళ్లి లాంటి ప్రైవేటు పార్టీస్ రోజున sunshine guarantee అనే ప్రైవేటు కంపనీలు ఉన్నాయట ఇప్పుడు :-)
ప్రస్తుతం Weather Modification Technology లో అగ్రస్థానం లో నిలిచిన దేశాలు ప్రత్యక్షం గా ఈ టెక్నాలజీ పబ్లిక్ కు demonstrate చేసిన ప్రధానమైన & బాగా ప్రచారం పొందిన సంఘటనలలో ఇవి కొన్ని. అయితే ఇవే కాకుండా, Beijing Weather Modication Office - 1995 - 2003 మధ్యకాలం లో precipitation 1/8 లెవెల్ కు పెంచి, వర్షపాతాన్ని 7.4 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ పెంచటం ద్వారా వర్షాభావ పరిస్థితులనుంచి గోధుమ పంటను కాపాడినట్లు గానూ, 1997 చైనీస్ న్యూ ఇయర్ డే సెలబ్రేషన్ కోసం బీజింగ్ లో భారీ ఎత్తున స్నో ఫాల్ ను కురిపించినట్లుగానూ official గా క్లెయిమ్ చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ hail stroms, dust storms లను ఆపే రక్షణ వ్యవస్థ ని రూపొందించే పనిలో ఉంది. అలాగే అమెరికా తను తరచూ ఎదుర్కునే హర్రికేన్స్ నుంచి కాపాడుకోవటానికి "Hurricane Modification" రూపొందించే పనిలో ఉంది. ఇప్పటి వరకు లేజర్స్ వాడి hurricanes గా మారే lightning డిశ్చార్జ్ చేయటం, లిక్విడ్ నైట్రోజెన్ ను సముద్రంలో పోయటంతో హీట్ ఎనర్జీని తగ్గించి హర్రికేన్ ఏర్పడకుండా చూడటం లాంటి ప్రయోగాలు చేస్తుంది. వీటితో పాటు California, Colorado, Georgia, Hawaii, Idaho, Illinois, Iowa, Kansas, Montana, Nevada, New Mexico, North Dakota, Oklahoma, Oregon, South Dakota, Texas, Utah, Washington, Wyoming states లో క్లౌడ్ సీడింగ్ చేస్తుంది. Basically Cloud seeding is no longer considered as a fringe science, and is considered as a mainstream tool. ఇహ ఈ మూడు దేశాలు కాకుండా మిగిలిన ప్రపంచం ఈ విషయంలో ఏమి చేస్తుందా అని ఒకసారి చూస్తే ఇంత భారీ స్థాయిలో కాకపోయినా కొన్ని మిగిలిన దేశాలు కూడా ఈ వైపుగా అడుగులు వేస్తూనే ఉన్నాయి. 1950 లో Project Cumulus పేరుతొ UK క్లౌడ్ సీడింగ్ తో weather modification వైపుగా మొదటి ప్రయత్నం చేసింది. దీని ఫలితాలను అధికారికంగా ప్రకటించకపోయినా 16th ఆగష్టు 1952 న 24 గంటల్లో కురిసిన 229 millimeters భారీ వర్షం కారణంగా 35 మంది చనిపోయారు, అనేక బిల్డింగ్స్, bridges నాశనం అయ్యాయి, BBC లెక్కల ప్రకారం ఇది మాములు కన్నా 250 టైమ్స్ అధికంగా నమోదయ్యింది. ఈ భారీ వర్షానికి కారణం Project Cumulus అని ఒక conspiracy theory ప్రచారంలోకి వచ్చింది కానీ ఎక్స్పర్ట్స్ మాత్రం దీన్ని నాన్సెన్స్ క్రింద కొట్టిపారేసారు. 1956- 1985 వరకు కెనడా Alberta Hail Project అన్న పేరుతొ ఒక రిసెర్చ్ ప్రాజెక్ట్ చేపట్టింది. దీని ప్రధాన లక్ష్యం hailstorms నుంచి రక్షణ కల్పించే దిశగా టెక్నాలజీ రూపొందించటం. రీసెర్చ్ వివరాలు ఇక్కడ. ఆస్ట్రేలియా 1960 మొదలుపెట్టి ఇప్పటివరకూ టాస్మేనియా లో చేస్తున్న క్లౌడ్ సీడింగ్ 30 % అధికంగా వర్షపాతం నమోదవుతుంది. జర్మనీ వైన్ గ్రోయింగ్ ఆక్టివిటీ ఎక్కువగా ఉండే సథరన్ బ్రవేరియా ప్రాంతం లో రీజినల్ లెవెల్ లో ఈ క్లౌడ్ సీడింగ్ చేస్తుంది. జపాన్ కు చెందిన Japanese Artificial Rainfall Research Corporation 1961 - 1967 ల మధ్యకాలం లో క్లౌడ్ సీడింగ్ పైన రీసెర్చ్ చేయటానికి 5 ఏళ్ళ ప్రాజెక్ట్ చేపట్టింది, ప్రస్తుతం hazard prevention మీద రీసెర్చ్ ఫోకస్ చేసింది. ఫ్రాన్స్ , స్పెయిన్ లలో నాన్ ప్రాఫిట్ లోకల్ కంపెనీల సాయంతో 1950 నుంచి క్లౌడ్ సీడింగ్ చెస్తున్నారు. రీసెంట్ గా ఫ్రాన్స్ లో Oliver's Travels అనే కంపెనీ £100,000 పే చేస్తే పెళ్ళిలాంటి స్పెషల్ డే న క్లియర్ స్కై గారెంటీ అనే luxury సర్వీస్ ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇహ మన భారతదేశానికి వచ్చేస్తే 1983 - 87 & 1993 - 94 లో తమిళనాడు లోను, 2003 , 2004 లో కర్ణాటక & మహరాష్ట లోను క్లౌడ్ సీడింగ్ ఆపరేషన్స్ చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2003 - 2008 monsoon సీజన్ లో క్లౌడ్ సీడింగ్ చేసారు . వివరాలు ఇక్కడ .
Not to digress, but అసలు సంగతొకటి చెప్పాలిక్కడ. నిజానికి ఈ సో కాల్డ్ weather modification కథా కమామీషు, దీనికి related గా ఎవరెవరు ఏమేమి చేస్తున్నారా అని నేను తొంగి చూడటానికి ఒక కారణం ఉంది. అది ఏంటంటే,
ఆగష్టు 9th 2015 - సింగపూర్ నేషనల్ డే, అందునా గోల్డెన్ జూబ్లీ celebrations, ఆ పైన హాలిడే. ఇహ నేను physically రోడ్డున పడ్డాను. Mentally : Singapore - A tiny country, ఈ 50 ఏళ్ళలో ప్రతికూల పరిస్థితులల్ని ఎదుర్కుని మిగిలిన ప్రపంచం తో పోటీపడటానికి అవసరమైన world class infrastructure ని దరిదాపు సమకూర్చుకుంది, now SG@50 - What Lies Ahead? అన్న ఆలోచనలో పడ్డాను. వెంటనే నా మైండ్ లోకి వచ్చినది వేడిగా humidity తో అవుట్ డోర్ ఈవెంట్స్ కు అంతగా అనుకూలంగా ఉండని వాతావరణం. అబ్బా.. ఈ వాతావరణాన్నికొంచెం చల్లటి గాలులతో ఆహ్లాదకరంగా ఉండేట్లు మార్చుకునే ప్రయత్నం ఏవైనా ఎంత బావుంటుందో అని అనుకుంటూ ఉన్నాను, అంతలోనే పాపం దాహమేసినట్లుంది నీళ్లు త్రాగేసి ఆ భారంతో నెమ్మదిగా కదులుతూవున్న ఒక మేఘాల గుంపొకటి సూర్యుడికి అడ్డుగా రావటంతో సడన్ గా వాతారణంలో మార్పు. అప్పుడు తళుక్కున మెరిసిందో మెరుపు. Wait... Wait ... ఆ మెరుపు ఆకాశంలో కాదు నా మెదడులో అదేంటంటే " Artificial గా మేఘాలని generate చేసి వాటితో సూర్యుడి ప్రతాపానికి కొంచెం అదుపు చేసి " ఈలాంటి వాతావరణం భారీ నుంచి ఉపశమనం కలిగించొచ్చుగా అని :-) అయితే బేసిక్ గా మనకొచ్చిన బగ్ ఈ ప్రపంచంలో ఎవరికో ఒకరి వచ్చే ఉంటుంది let us see వాళ్ళేం చేసారో అని గూగుల్ చేసే టైపు బ్రెయిన్ కాబట్టి, అచ్చూ అలాగే ఈ బోడి ఐడియా కూడా ఎవరికో రాకుండా ఉంటుందా అని యధాప్రకారం గూగుల్ చేసా.
Yes నిజమే నా అంచనా 100 % కరెక్ట్. To be true ఇలా artificial గా మేఘాల వంటివాటిని ఏర్పాటుచేసి భూమి absorb చేసుకునే సోలార్ ఎనర్జీ తగ్గించటానికి 'Solar Radiation Management' అనే బాగా పాపులర్ అయిన Climate Engineering Project . 'Global Warming' ఎదుర్కోవటానికి సొల్యూషన్ గా చెప్తున్న రెండు 'Global cooling' మెకానిజమ్స్ లో ఇది ఒకటి. ఆ రెండో మెకానిజమేమో Green House Gas Removal. Solar Radiation Management లో artificial క్లౌడ్స్ సృష్టించటం / సల్ఫేట్ పార్టికల్స్ కానీ aerosols కానీ stratosphere లోకి ఇంజెక్ట్ చేయటం ద్వారా భూమి absorb చేసుకునే సూర్యశక్తిని తగ్గించటం ద్వారా వేడిని తగ్గించే ప్రయత్నం చెస్తారు. ఆ రెండోవ మెకానిజం అయిన Green House Gas Removal లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా చెప్తున్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ ( water vapor, carbon dioxide, methane, nitrous oxide, and ozone) ను భూవాతావరణం లోంచి తొలిగించే ప్రయత్నం ద్వారా వేడిని తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఇప్పటి వరకూ జరిగిన స్టడీస్ 'Solar Radiation Management' గ్లోబల్ వార్మింగ్ ను delay చేయటానికి నమ్మదగిన, కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ గా చెబుతున్నాయి. 15 June 1991 న ఫిలిపైన్ కు చెందిన Luzon అనే ఐలాండ్ లోని Mount Pinatubo అనే అగ్ని పర్వతం పేలింది. ఇది 20 వ శతాబ్దం రెండవ అతి పెద్ద erosion. ఈ ప్రేలుడు ప్రభావం ఇంచుమించు ప్రపంచం మొత్తం మీదా ఉంది. ఈ అగ్నిపర్వతపు ప్రేలుడు దరిదాపు 10,000,000,000 టన్నుల మాగ్మా, 20,000,000 టన్నుల సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇంకా పెద్ద మొత్తంలో మెటల్స్ & మినరల్స్ భూమి మీదకి రావటానికి కారణం అయ్యింది. ఈ జెనరేట్ అయిన సల్ఫ్యూరిక్ యాసిడ్ haze ఒక గ్లోబల్ లేయర్ లాగా form కావటం తో 1991-1992 భూవాతావరణ ఉష్ణోగ్రత 0.5°C తగ్గింది. ఈ స్టాటిస్టిక్స్ ఆధారంగా aerosols కానీ stratosphere లోకి ఇంజెక్ట్ చేయటం ఎఫెక్టివ్ గ్లోబల్ కూలింగ్ సొల్యూషన్ గా భావిస్తున్నారు. ఏరోసోల్స్ ను స్ట్రాటోస్ఫియర్ లోకి పంపటానికి సల్ఫర్ ను జెట్ ఫ్యుయల్స్ లో యాడ్ చేయటం , ఆర్టిలరీ షెల్ల్స్ గాలిలోకి పంపటం ద్వారా చెయ్యొచ్చన్న ప్రపోజల్స్ తో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ $25-50 billion per year గా లెక్కలు కట్టారు. సల్ఫర్ ని స్ట్రాటోస్ఫియర్ లోకి పంపటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ , availability తో సల్ఫర్ లాంటి ఈక్వేషన్స్ ఇంకా తేలకపోవటంతో ఇప్పటి వరకూ ఏ దేశమూ ప్రాక్టికల్గా ఈ వైపు వెళ్ళలేదు.
Artificial cloud generation గురించి మరన్ని వివరాలు ఇక్కడ. ఈ Artificial clouds గురించి తెలుస్కుంటున్నప్పుడు పాతదే కానీ ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ తెలిసింది :-) అదేంటంటే Tech savvy, innovative visionary అయిన మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ సీ వాటర్ ను ఆకాశంలోకి పంప్ చేయటంద్వారా మేఘాలు సృష్టించి UV rays బ్లాక్ చేసే దిశగా చేసే ప్రయోగాలకి 5 మిలియన్ డాలర్స్ ఫండింగ్ చేసారు.
అబ్బా ఇప్పుడు ఇదంతా బోర్ ఎవరు చదువుతారు అనుకుంటే ఇదుగోండి Artificial clouds - cloud seeding in a nutshell లాగా ఈ NASA's వీడియో చూసేయండి :-)
Well, వర్షాలు, స్నో కురవటాలని ఎక్కువ తక్కువ చేయటం, సూర్యుడి ప్రతాపాన్ని కంట్రోల్ చేసే దిశగా అడుగులు వేయటం వంటి వాటి మీద జరుతుగున్న ఈ బోలేడన్నీ ప్రయోగాలు, అప్పుడప్పుడు ఆశాజనకంగా అనిపిస్తున్న వాటి రిజల్ట్స్ వీటిని బేస్ చేసుకుని మనిషి weather control చేయగలిగే స్థాయికి వచ్చేసినట్లు చెప్పగలమా ? ఈలాంటి ప్రశ్న వస్తే answer is big NO. ప్రస్తుతం హ్యూమన్ రేస్ చేస్తున్న ప్రయోగాలు వాటి ఫలితాలు కేవలం "barely scratching the surface" అంటామే ఆ స్థాయిలోనివి. Weather patterns చాలా చాలా complex patterns మాత్రమే కాదు highly unpredictable కూడాను. మరీ ముఖ్యంగా ఈలాంటి ప్రయోగాలతో weather natural cycle ని టచ్ చేయటంతో వచ్చే నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్ నీ సరిగా assess చేయకపోతే కలిగే నష్టం ఊహించలేనంతగా ఉంటుంది . అందుకే ప్రస్తుత ప్రయోగాలు, అలాగే ఈ patterns విశ్లేషణలు Weather ను కంట్రోల్ చేయటం అటుంచి modification category లో కూడా వేయలేమేమో కానీ, వీటిని little enhancement to existing weather అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. నిజానికి మనం చేస్తున్న ప్రయోగాలే మహాభారతం లో వాస్యుడు వర్ణించిన 'సూర్యాస్తమయ' టెక్నిక్ కూడా enhancement గానే చెప్పలేమో. కేవలం సూర్యాస్తమయ సమయానికి కొద్దిగా ముందుగా ఆ టెక్నిక్ వాడబట్టి సరిపోయింది, అదే యుద్ధం ముందే ముగించేసి రెస్ట్ తీసుకుందాం అని అలోచించి ఏ మధ్యాహ్న టైం లోని వాడి ఉంటె మొదలుకే మోసం వచ్చి శత్రువు జాగర్త పడి ఉండేవాడు :-)
Anyway, may be in long term we will able to develop technologies to modify weather or even to the extent to control it completely. అలాంటి రోజు వస్తే ఏ matrix సినిమాలోనో చూసిన వింతలూ విశేషాలు రియల్ లైఫ్ లోనూ కనిపిస్తాయి. అలాగే సింగపూర్ లాంటి small in size, pragmatic leadership, ఖర్చు పెట్టగలిగినంత డబ్బు, ఉన్న దేశానికి humid గా ఉండే వాతావరణాన్ని చల్లటి ఆహ్లాదమైన వాతావరణం గా మార్చటం పెద్ద ఛాలెంజ్ కాదు. కాబట్టి నేను బ్రతికి బాగుండగానే అలాంటి రోజు ఒకటి రావాలని కోరుకుంటూ ఉంటాను మరి ఇహ. (ఓహ్ ఎవరది "Remember that sometimes not getting what you want is a wonderful stroke of luck" అని అంత పెద్ద resounding వాయిస్ తో ఏదో చెప్పటానికి విపరీతంగా ట్రై చెస్తున్నారు? No I am not listening to anything , I already turned on my deaf year to this kind of reminders :-))

- శ్రావ్య