Subscribe:

Tuesday, January 1, 2019

Black Mirror's Bandersnatch

Going out tonight? LOL! No you're not. Come join us, loser.


iఇది 2013- 2014 లో ఆన్లైన్ ప్రపంచాన్ని ముఖ్యం గా ట్విట్టర్ ప్రపంచాన్ని నవ్వుల్లో ముంచిన ఒక ఒక కురుచ సందేశం అనగా ట్వీట్ అని కవి హృదయం. అప్పట్లో కాకు కానీ తర్వాత ఎప్పుడో నేను ఈ ట్వీట్ చూడగానే , నా మనస్సులో తట్టినది Netflix has deep understanding of its userbase అని :-) Anyway ఆ కథ అలా వదిలేస్తే క్వీన్, హౌస్ అఫ్ కార్డ్స్ , extraordinary homes ఇలాంటి చాలా చాలా నాకు నచ్చే సిరీస్లు ఉన్నా బ్లాక్ మిర్రర్ అంటే మాత్రం ఒక ప్రత్యేకమైన ఇష్టం . దానికి కారణం ఈ సిరీస్ థీమైన మనుషులకి , టెక్నాలజీ కు మధ్యన ఉండే రేలషన్శిప్ ను కథలుగా చెప్పటం .

ఇహ Netflix's newest Black Mirror experiment Bandersnatch మాత్రం నా ఇష్టాన్ని ఇంకో లెవెల్ కు పట్టుకుపోయింది ఇప్పటి వరకూ చూడని వాళ్ళు వుంటే ఇది బేసిక్ గా ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగ్ అంటే మీరు ఎన్నుకునే ఛాయస్ protagonist Stefan's fate, స్టోరీ sequences , climax ను మారుస్తుంది . I am not a movie buff, సో నాకు పెద్దగా ఇంతకు ముందు ఎవరైనా  ఇలాంటి కానేప్ట్ ట్రై సుహాసి వుంటే నాకు ఆ వివరాలు తెలియవు కానీ, ఆ attempts ఏవీ కూడా Bandersnatch లాంటి fully realised attempts మాత్రం అయివుండవు అని ఖచ్చితంగా చెప్పగలను. ఒక వేళ అన్ని versions చూడాలని ఫిక్స్ అయితే చిన్నప్పుడు చదువుకున్న పెర్ముటేషన్స్ నాలెడ్జ్ మళ్ళీ ఒకసారి వాడటానికి రెడీ అయిపోవాలి (దరిదాపు ట్రిలియన్ డిఫరెంట్ sequences వుండొచ్చు అని అంచనా) . కాబట్టి ఇహ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోయి Netflix లో మునిగిపోండి :-)


చివరిగా, నాకు ఈ సిరీస్ చూసివున్నప్పుడు గుర్తొచ్చింది ప్రిన్స్ అని dos గేమ్. నాకు అది తెలిసేసరికి జనాలు అందరూ దాన్ని ఆది ఎలా వెళ్తే రాకుమారిని గెలవొచ్చో పెద్ద పెద్ద SOP లు రాసేశారు. అయినా సరే కొన్ని రోజులు తిండి నిద్ర వదిలేసి immerse అయినా గేమ్ అది . అసలు ఆ రంపాల మధ్యలో జంపింగ్స్, ఒక బండ మీద కాక ఇంకో బండ మీద జంప్ చేస్తే అది కూలటం ఇవన్నీ నిజంగా ఎక్సపీరియెన్స్ చేస్తున్నట్లే వుండేది . ముఖ్యంగా ఆ రంపాల గోల అయితే నిద్రలో కూడా :-) దాని నుంచి బయటికి రావటానికి చాలా నెలలేపట్టింది . ఇహ ఇప్పుడు Black Mirror's Bandersnatch ఎన్నాళ్ళు ఆ మాయలో ఉంచుతుందో చూడాలి :-)


Btw, Netflix ఈ Bandersnatch కోసం twine అనే open-source platform వాడిందట. సో రెస్యూమ్స్ అప్డేట్ చేయటానికి మన సారీ అదే అదే కెసిఆర్ గారి అమీర్పేట్ లో ఎవరన్నా ఈ కోర్స్ పాంప్లెట్స్ పంచుతున్నాడేమో ఎంక్వయిరీ చేసి నా చెవిన కూడా వేయండి :-)