మల్టీ టాస్కింగ్ అన్న టైటిల్ చూసి నేనోదో "టెక్నికల్ విషయాలు " వ్రాస్తున్న అనుకున్నారా అబ్బేలేదండి అప్పుడే అంత రిస్క్ తీసుకోదల్చుకోలేదు. ఈ మల్టీ టాస్కింగ్ నేను వారాంతం లో దిగ్విజయం గా చేసిన పనుల గురించే.
సరే అసలు విషయానికి వస్తే ఆదివారం రోజు సాంబార్ తినాలని కోరిక పుట్టింది (అసలు సాంబార్ కి పప్పు చారు కి తేడా ఏమిటో? ) . ఆదివారం "పొద్దున్నే" 9.౩౦ కి లేచి యధా ప్రకారం ఇంటి కి ఫోన్ చేసి ఒక గంట సేపు మాట్లాడాక కార్యరంగం లోకి దూకాను. పొయ్యి మీద సాంబారు కోసం చింతపండు రసం లో నానా రకాల ముక్కలు వేసి ఉడకపెడుతున్నాను , లాపిలో అన్నమయ్య , రామదాసు పాటలు వింటున్నాను. ఇక నాలో మల్టీ టాస్కింగ్ కళ నిద్రలేచి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఇస్త్రీ చేద్దామని డిసైడ్ అయ్యాను. సరే ఒక డ్రెస్ దిగ్విజయం గా చేశాను, రెండవ డ్రెస్ చున్నీ చేస్తుంటే అన్నమయ్య పాటల మద్య ఏదో హిస్సు హిస్సు మన్న సౌండ్ వస్తూంది, ఇదేమిటా అని చూస్తే పొయ్యి మీ పప్పుచారు నన్ను పట్టించుకోవా అని అలిగి పొంగి పోతున్నది అని అర్ధం అయ్యింది , అయ్యో అని పప్పుచారు ని సముదాయించే లోపు ఐరన్ బాక్స్ కి కోపం వచ్చి చున్నీ ని కాల్చేసింది, ఇక ఇట్లా లాభం లేదు మనికి , మల్టీ టాస్కింగ్ కంపాటబిలిటీ లేదు అని 2020 వ సారి అర్ధం చేసుకోని, ఒక దాని తరవాత ఒకటి గా నా పప్పుచారు వండటం , ఇస్త్రీ చేయటం అనే టాస్క్ లు పూర్తిచేసాను.
మొత్తానికి ఈ ఆదివారం నా పనులు పూర్తి చేసిన తరవాత మల్టీ టాస్కింగ్ ఇన్ హుమన్స్ గురించి గూగుల్ చేస్తే ఈ కింది విషయాలు ఆసక్తికరం గా అనిపించాయి.
1. మగవారికన్నాఆడవారిలో మల్టీ టాస్కింగ్ చేయగల సామర్ద్యం ఎక్కువట, ఇది ఒప్పుకొని వారు ఇక్కడ చూడండి. ఐనా ఈ లింక్ చూడాలా ఒక్క సారి మీ ఇళ్ళల్లో పొద్దున్నే సందడి గుర్తు చేసుకోండి మరీ ముఖ్యం గా స్కూల్ కి వెళ్ళే పిల్లలు ఉన్నాఇళ్ళలో ఐతే ఆడవారిలో మల్టీ టాస్కింగ్ సామర్ద్యం మన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది.
2. మల్టీ టాస్కింగ్ వల్ల నష్టాలు కూడా ఉన్నాయట .
3.మల్టీ టాస్కింగ్ వల్ల ఎంతచక్కగా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవచ్చో ఇక్కడ చూడండి. కాని ఇది అన్ని సమయాల్లో ను అందరి కి కుదరకపోవచ్చు. మనకు లీస్ట్ ప్రయారిటీ అనిపించినవి మన బాస్ కు టాప్ ప్రయారిటీ అలాంటప్పుడు ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తే కొంప కొల్లేరు అవుతుంది. కాని కొన్ని మాత్రం చాల నాచ్చాయి నాకు.
ఏదేమయినా ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించాలన్న అందులో సక్సెస్ కావాలన్న కొద్దో గొప్పో ఖచ్చితం గా మల్టీ టాస్కింగ్ అనేది అవసరం, కాబట్టి చేసే పనులు కష్టంగా కాకుండా ఇష్టం గా చేయటం మొదలు పెడితే విజయం మనదే.
If you want to get more done, be mindful.If you want to have more time, be mindful.