Subscribe:

Sunday, October 18, 2009

నేను, నా మల్టీ టాస్కింగ్


మల్టీ టాస్కింగ్ అన్న టైటిల్ చూసి నేనోదో "టెక్నికల్ విషయాలు " వ్రాస్తున్న అనుకున్నారా అబ్బేలేదండి అప్పుడే అంత రిస్క్ తీసుకోదల్చుకోలేదు. ఈ మల్టీ టాస్కింగ్ నేను వారాంతం లో దిగ్విజయం గా చేసిన పనుల గురించే.

సరే అసలు విషయానికి వస్తే ఆదివారం రోజు సాంబార్ తినాలని కోరిక పుట్టింది (అసలు సాంబార్ కి పప్పు చారు కి తేడా ఏమిటో? ) . ఆదివారం "పొద్దున్నే" 9.౩౦ కి లేచి యధా ప్రకారం ఇంటి కి ఫోన్ చేసి ఒక గంట సేపు మాట్లాడాక కార్యరంగం లోకి దూకాను. పొయ్యి మీద సాంబారు కోసం చింతపండు రసం లో నానా రకాల ముక్కలు వేసి ఉడకపెడుతున్నాను , లాపిలో అన్నమయ్య , రామదాసు పాటలు వింటున్నాను. ఇక నాలో మల్టీ టాస్కింగ్ కళ నిద్రలేచి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఇస్త్రీ చేద్దామని డిసైడ్ అయ్యాను. సరే ఒక డ్రెస్ దిగ్విజయం గా చేశాను, రెండవ డ్రెస్ చున్నీ చేస్తుంటే అన్నమయ్య పాటల మద్య ఏదో హిస్సు హిస్సు మన్న సౌండ్ వస్తూంది, ఇదేమిటా అని చూస్తే పొయ్యి మీ పప్పుచారు నన్ను పట్టించుకోవా అని అలిగి పొంగి పోతున్నది అని అర్ధం అయ్యింది , అయ్యో అని పప్పుచారు ని సముదాయించే లోపు ఐరన్ బాక్స్ కి కోపం వచ్చి చున్నీ ని కాల్చేసింది, ఇక ఇట్లా లాభం లేదు మనికి , మల్టీ టాస్కింగ్ కంపాటబిలిటీ లేదు అని 2020 వ సారి అర్ధం చేసుకోని, ఒక దాని తరవాత ఒకటి గా నా పప్పుచారు వండటం , ఇస్త్రీ చేయటం అనే టాస్క్ లు పూర్తిచేసాను.

మొత్తానికి ఈ ఆదివారం నా పనులు పూర్తి చేసిన తరవాత మల్టీ టాస్కింగ్ ఇన్ హుమన్స్ గురించి గూగుల్ చేస్తే ఈ కింది విషయాలు ఆసక్తికరం గా అనిపించాయి.

1. మగవారికన్నాఆడవారిలో మల్టీ టాస్కింగ్ చేయగల సామర్ద్యం ఎక్కువట, ఇది ఒప్పుకొని వారు ఇక్కడ చూడండి. ఐనా ఈ లింక్ చూడాలా ఒక్క సారి మీ ఇళ్ళల్లో పొద్దున్నే సందడి గుర్తు చేసుకోండి మరీ ముఖ్యం గా స్కూల్ కి వెళ్ళే పిల్లలు ఉన్నాఇళ్ళలో ఐతే ఆడవారిలో మల్టీ టాస్కింగ్ సామర్ద్యం మన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది.

2. మల్టీ టాస్కింగ్ వల్ల నష్టాలు కూడా ఉన్నాయట .

3.మల్టీ టాస్కింగ్ వల్ల ఎంతచక్కగా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవచ్చో ఇక్కడ చూడండి. కాని ఇది అన్ని సమయాల్లో ను అందరి కి కుదరకపోవచ్చు. మనకు లీస్ట్ ప్రయారిటీ అనిపించినవి మన బాస్ కు టాప్ ప్రయారిటీ అలాంటప్పుడు ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తే కొంప కొల్లేరు అవుతుంది. కాని కొన్ని మాత్రం చాల నాచ్చాయి నాకు.

ఏదేమయినా ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించాలన్న అందులో సక్సెస్ కావాలన్న కొద్దో గొప్పో ఖచ్చితం గా మల్టీ టాస్కింగ్ అనేది అవసరం, కాబట్టి చేసే పనులు కష్టంగా కాకుండా ఇష్టం గా చేయటం మొదలు పెడితే విజయం మనదే.


If you want to get more done, be mindful.If you want to have more time, be mindful.

16 comments :

చైతన్య.ఎస్ said...

ఇంతకీ సాంబార్ ఎలా ఉంది చెప్పలేదు :)

Sravya Vattikuti said...

చైతన్య.ఎస్ థాంక్స్ , ఇక సాంబార్ సంగతా అదుర్స్ :)

భాస్కర్ రామరాజు said...

:):)
తెలుగులో సాంబారు అనేది లేదు. అది తమిల పదం.
చారులో పప్పు వేస్తే పప్పు చారు. :):)
ఏఏపనులతో మల్టైటాస్కింగ్ చేయాలో చూస్కోవద్దా? :):):):)
మగవారికన్నా ఆడవారే మల్టై టాస్కింగ్లో రాణించరా? ఏమో..చూడబోతే నిజమేలా ఉంది. [ఇంట్లో సూత్తాల్లేదా?? అవును సూత్తన్నా:)]
>>కాబట్టి చేసే పనులు కష్టంగా కాకుండా ఇష్టం గా చేయటం మొదలు పెడితే విజయం మనదే.
ఇది మాత్రం బాగ చెప్పావు
కాబట్టి అద్దెచ్చా మల్టై టాస్కింగ్ చేసేప్పుడు విచ్ గోస్ హ్యాండి ఇన్ హ్యాండ్ చూస్కుని చేస్కోవాలి...

Rani said...

baavundi sravya mee post :)

pappu chaaru sangathi pakkana pettandi, bangaaram laanti chunni kaalinanduku naa santhaapaalu :P

Sravya Vattikuti said...

భాస్కర్ గారు అదా సంగతి మన తెలుగు పప్పుచారు కి సాంబార్ అనేది తమిళ్ వెర్షన్ అన్నమాట, నాకు ఇన్ని రోజులు తేడ తెలియక ఇంట్లో చేస్తే పప్పు చారు , బయట హోటల్ లో ఐతే సాంబార్ అని ఫిక్స్ అయ్యాను.:)
ఏఏపనులతో మల్టైటాస్కింగ్ చేయాలో చూస్కోవద్దా? >> అవును అక్కడే దెబ్బ తిన్నాను :(.

రాణి గారు ముందు గా నా బ్లాగ్ చదివినందుకు ధన్యవాదాలు , అవునండి మంచి చున్నీ కాలిపోయింది :(

jeevani said...

ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని.

Shashank said...

మీ సంగతి తెలీదు కాని.. నేను యే ఒక్క నిమిషం కూడా single task చేయలేను. at any point of time multi task cheyalsinde... ఫోన్ లో మాట్లాడుతు కోడిన్గ్ వంట చేస్తూ కోడిన్గ్.. అలా అన్నమాట. అలవాటు చేస్కోన్డి.. రోజుకి ఇంకొన్ని గంటలు additional గా వచ్చిన feeling ఉంటది.

Sravya Vattikuti said...

వామ్మో ఏంటడి శశాంక్ గారు ఫోన్ లో మాట్లాడుతూ అంటే ఓకే ఇది అనుభవమే కాని వంట చేస్తూ కూడా కోడింగ్ ? ఎలా సాధ్యం ? try చేయాల్సిందే !
-----
రోజుకి ఇంకొన్ని గంటలు additional గా వచ్చిన feeling ఉంటది.>> అవునండి ఇది నిజం, అందుకే తిప్పలు పడుతున్నా :)

VAMSI said...

NAA GURINCHI NENU CHEPPUKOKOODADEMO GANEE ..PERINTA KALAM TELIYADU GANEE EE TAS"KING" LO NENU KING NI .....ASALU NENU SYSTEM LO PAATALU VINTOO CHAT CHESTOO BLOG UPDATE CHESTOOO TASK BAR NINDAA BAARU GAA TASKULU UNTAAYI LENDI...

Sravya Vattikuti said...

@Vamsi first of all Thank you for reading my blog, and regarding your comment it is funny man so are the king of multi tasking:)

Nagaraju said...

Good one Sravya garu.... Narration bhavundhi

Sravya Vattikuti said...

నాగరాజు గారు ధన్యవాదాలు !

కొత్త పాళీ said...

తమరింకొంచెం తరచుగా రాయొచ్చు, ఈ మల్టీటాస్కింగులతో సేవ్ చేసిన టైముతో!

Sravya Vattikuti said...

కొత్తపాళీ గారు మీకొక రహస్యం చెప్పనా నాకు వ్రాయటం కన్నా చదవటం ఇష్టం అందుకని ఇలా సేవ్ చేసిన టైములో ఏ బ్లాగు విడిచిపెట్టకుండా కామెంట్లతో సహా చదివేస్తున్నా :)

రాజేంద్ర తడవర్తి said...

కి కి కి.. Multitasking is an art... :)

Sravya Vattikuti said...

Rajendra gaaru ha ha yes you are right :-))

Post a Comment