రాష్ట్రం లో విభజన చిచ్చు పెట్టి తమాషా చూస్తున్న కెసిఆర్ గారికి నా అభినందనలు . మా స్టేట్ ఆంధ్రప్రదేశ్ మేముండేది హైదరాబాద్ అని చెప్పుకోవాంటే సిగ్గు పడే స్థితి కి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినందుకు మీకు వేల వేల ధన్యవాదాలు . సంస్కృతి, చరిత్ర అని ఒకటేమైన ఆరాటపడే వేర్పాటు వాదులార ఎవరికి లేదు సంస్కృతి, చరిత్ర ? ఇప్పుడు మీతో పాటు జీవిస్తున్న ప్రతి వారికి మీకు ఎన్ని యేండ్ల చరిత్ర వాళ్లకు అన్ని యేండ్ల చరిత్ర ఉంది. 50 ఏళ్ల కిత్రం ఎప్పుడు కావాలనే అప్పుడు విడిపోవచ్చని రాసుకున్న జెంటిల్ మాన్ డాక్యుమెంట్లు చూపిస్తున్న మీరు మరి ఇంకో 1౦ ఏండ్ల కిత్రం నిజాం పాలించాడట మరి వాళ్ళ వారసులు వస్తే ఈ తెలంగాణా వదులుకొని వాళ్ళ కింద్ర బతకటానికి సిద్దమేనా ? ఆంధ్ర వాళ్ళంతా మిమ్మల్ని దోచుకుంటున్నరన్న సత్యం మీకు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం చేసినప్పుడు తెలియలేదా లేకపోతె పంట ఇంకా కోతకి రాలేదని చప్పుడు చేయకుండా నిద్రలు పోయారా ?
ఈ రాష్ట్రము ఇప్పుడు విడిపోవచ్చు లేదా కలిసి ఉండచ్చు కాని మీరు నాటిన విషబీజాలు మాత్రం వృక్షాలు మారి ఈ రాష్ట్రాన్ని ఒక వంద ఏళ్ళు వెనకకు తీసుకెళతాయి అన్న విషయం లో మాత్రం ఎటువంటి సందేహం లేదు . మీ కుట్ర ఫలిచినందుకు మీరు ఇప్పుడు సంతోషం గా ఉన్న మీరుఈ రోజు అరచేతి లో చూపిస్తున్న స్వర్గం కనపడనప్పుడు ఇదే జనాలు మిమ్మల్ని తరిమి తరిమి కొడుతున్నప్పుడు మీ సహచరులు చెప్పే "కవితా న్యాయానికి " అసలైన అర్ధం అని తెలుసుకుంటారు .