Subscribe:

Monday, December 14, 2009

జై సమైక్యాంధ్ర !

రాష్ట్రం లో విభజన చిచ్చు పెట్టి తమాషా చూస్తున్న కెసిఆర్ గారికి నా అభినందనలు . మా స్టేట్ ఆంధ్రప్రదేశ్ మేముండేది హైదరాబాద్ అని చెప్పుకోవాంటే సిగ్గు పడే స్థితి కి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినందుకు మీకు వేల వేల ధన్యవాదాలు . సంస్కృతి, చరిత్ర అని ఒకటేమైన ఆరాటపడే వేర్పాటు వాదులార ఎవరికి లేదు సంస్కృతి, చరిత్ర ? ఇప్పుడు మీతో పాటు జీవిస్తున్న ప్రతి వారికి మీకు ఎన్ని యేండ్ల చరిత్ర వాళ్లకు అన్ని యేండ్ల చరిత్ర ఉంది. 50 ఏళ్ల కిత్రం ఎప్పుడు కావాలనే అప్పుడు విడిపోవచ్చని రాసుకున్న జెంటిల్ మాన్ డాక్యుమెంట్లు చూపిస్తున్న మీరు మరి ఇంకో 1౦ ఏండ్ల కిత్రం నిజాం పాలించాడట మరి వాళ్ళ వారసులు వస్తే ఈ తెలంగాణా వదులుకొని వాళ్ళ కింద్ర బతకటానికి సిద్దమేనా ? ఆంధ్ర వాళ్ళంతా మిమ్మల్ని దోచుకుంటున్నరన్న సత్యం మీకు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం చేసినప్పుడు తెలియలేదా లేకపోతె పంట ఇంకా కోతకి రాలేదని చప్పుడు చేయకుండా నిద్రలు పోయారా ?
ఈ రాష్ట్రము ఇప్పుడు విడిపోవచ్చు లేదా కలిసి ఉండచ్చు కాని మీరు నాటిన విషబీజాలు మాత్రం వృక్షాలు మారి ఈ రాష్ట్రాన్ని ఒక వంద ఏళ్ళు వెనకకు తీసుకెళతాయి అన్న విషయం లో మాత్రం ఎటువంటి సందేహం లేదు . మీ కుట్ర ఫలిచినందుకు మీరు ఇప్పుడు సంతోషం గా ఉన్న మీరుఈ రోజు అరచేతి లో చూపిస్తున్న స్వర్గం కనపడనప్పుడు ఇదే జనాలు మిమ్మల్ని తరిమి తరిమి కొడుతున్నప్పుడు మీ సహచరులు చెప్పే "కవితా న్యాయానికి " అసలైన అర్ధం అని తెలుసుకుంటారు .

33 comments :

karthik said...

ఈ రాష్ట్రము ఇప్పుడు విడిపోవచ్చు లేదా కలిసి ఉండచ్చు కాని మీరు నాటిన విషబీజాలు మాత్రం వృక్షాలు మారి ఈ రాష్ట్రాన్ని ఒక వంద ఏళ్ళు వెనకకు తీసుకెళతాయి అన్న విషయం లో మాత్రం ఎటువంటి సందేహం లేదు .

కరెక్టుగా చెప్పారు!!
thats worst part of the whole drama

Sravya Vattikuti said...

Thank you Karthik !

చైతన్య.ఎస్ said...

"ఒక వంద ఏళ్ళు వెనకకు తీసుకెళతాయి అన్న విషయం లో మాత్రం ఎటువంటి సందేహం లేదు"---బాగా చెప్పారు

జై సమైక్య అంధ్ర

Sravya Vattikuti said...

చైతన్య.ఎస్ Thank you !

madhavarao.pabbaraju said...

శ్రావ్య గారికి, నమస్కారములు.

మీ "సమైక్య" అభిప్రాయాల్ని చక్కగా చెప్పారు. ఇప్పటికైనా, ప్రజలు, తమ అమాయకత్వాన్ని వీడి, కొంతమంది స్వార్ధ రాజకీయ నాయకుల మాటల వలలొ చిక్కుకోకుండా, కళ్ళు తెరిచి, నిజం తెలుసుకొని, మన రాష్ట్రాన్ని రక్షించుకోవాలి.

భవదీయుడు,
మాధవరావు.

Shashank said...

శ్రావ్యా - కరెష్ట్ గా చెప్పారు. నా అభిప్రాయం కూడా అదే. ఈ వెధవల వళ్ళ చక్కని నా రాష్ట్రం విధ్వంసం ఔతోంది..

finally.. mee blog lo commentalante koncham kasthame..

Sravya Vattikuti said...

మాధవరావు గారు నమస్కారం , ధన్యవాదాలండి !

శశాంక్ నిజం గా పరిస్తితి చూస్తుంటే దిగులేస్తుంది ఎక్కడి కి వెళుతున్నామా అని .
finally.. mee blog lo commentalante koncham kasthame.. > ఎందుకలా ?

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

బహుశా మీబ్లాగు కూడాలిలో లేనందువల్లేననుకుంటా ముష్కరదాడూలు, జుగుప్సాకర వ్యాఖ్యలు చోటుచేసుకోలేదు ఇందులో. మనతలరాత అలాఉంటే ఏమిచెయ్యగలం చెప్పండి. అవసరమైతే దేశాన్నైనా ముక్కలుచెయ్యగల హస్తినవారికి రాష్ట్రాన్ని కొయ్యడాం ఎంతసేపు చెప్పండి?

Sravya Vattikuti said...

సుబ్రహ్మణ్య ఛైతన్య సుబ్రహ్మణ్య ఛైతన్య!
అవసరమైతే దేశాన్నైనా ముక్కలుచెయ్యగల హస్తినవారికి రాష్ట్రాన్ని కొయ్యడాం ఎంతసేపు చెప్పండి? >> కరెక్టుగా చెప్పారు :(

Nizamabad said...

Hello Sravya garu visit this link http://www.slideshare.net/faizuddin123/why-we-want-telangana and tell enduku telangana ki inta chinna choopu chustunnaru... 10 districts unna telangana ki anni takkuve endukani?..
Samaikyandra ani rajakeeya nayakulu enduku antunnarante vallu HYD lo pettina pettubadi gurinchi.. Jai Telangana! Jai Jai Telangana..marichipoya monna andhra lo udyamalu jarigite evvarini arrest cheyaledu but ikkada udyalamu cheste arrest lu case lu paiga donga cese lu.. ekkada choosina police balagalu idena nyayam?

Nizamabad said...

Singapore lo undi matladadam kaadandi okkasari Osmania Campus ki randi ma brothers ki ee prabutvam chestunna vedimpulu telustai..
Jai Telangana! Jai Jai Telangana!!

Sravya Vattikuti said...

అయ్యా నిజామాబాదు బ్లాగరు గారు ఎవరికి తెలంగాణా అంటే చిన్న చూపు ? అది మీకు మీరు అనుకునేది తప్ప ఏమి లేదు . రాజకీయ నాయకుల పెట్టుబడుల కోసం సామాన్య ప్రజానీకం పోరాటం చేస్తున్నారా ? మరి అదే ఆంద్ర వాళ్ళు తెలంగాణా రాజకీయ నాయకుల స్వలాభం కోసమే తెలంగాణా పోరాటం అంటే మీరు ఒప్పుకుంటారా? ఆంధ్ర లో ఉద్యమాలు జరిగినాయి కాని ఎవరి ప్రైవేటు ఆస్తులు నాశనం చేయలేదు లేదా నాయకుల మీద దాడి చేయలేదు , ఉద్యమానికి అనుకూలం గా లేని వారి మీద కూడా నిరసన తెలియజేసారు గాని వాళ్ళ మీద దాడు చేయలేదు మరి.
సింగపూర్ లో ఇప్పుడు ఉంటే 25 సంవత్సరాలు పెరిగన హైదరాబాద్ సంగతి వదిలేయాలా?ఇక ఉస్మానియా గుంరించి మీ కన్నా నాకే బాగా తెలుసు అందుకంటే దానికి కూతవేటు దూరం లోనే మా ఇల్లు కాబట్టి :)

రవిగారు said...

శ్రావ్య గారు కూతవేటు దూరం నుంచి అందనంత దూరానికి వెళ్లి పోయి తప్పించుకున్నారు .
మేము మాత్రం కూతవేటు దూరం లో వుండడం చేత బంద్ అనగానే కార్స్ లోపల పడేసి
నడుచుకుంటూ పదండి ముందుకు పదండి తోసుకు అని పోవాల్సి వస్తోంది మా ఏరియా లో .
అసలు కెసిఆర్ ని నెల్లాళ్ళ కి తెలంగాణా కి ముఖ్యమంత్రి గా చేసి అప్పుడు కూడా ప్రజలు (తెరాస వంద మంది కాదు)
ఆమోదం తెలిపితే అప్పుడు తెలంగాణ ఇవ్వమనొచ్చు .అంతెందుకు హైదరాబాద్ లో వోటింగ్ పెట్టి తెలంగాణా కావాలో
వద్దో తెల్చుకోమనండి దమ్ములుంటే .ఇదంతా కుడా వొక 50 మంది రాజకీయ నాయకులకి వచ్చే పదవుల లాభం తప్ప
నిజమైన తెలంగాణ ప్రజలకి వోరిగేది ఏమి లేదు .ఫండ్స్ ఆగి పోవడం అభివృద్ది కుంటూ పడటం తప్ప .
అనట్టు ఇప్పుడు హైదరాబాద్ లో బాగా అమ్ముడు పోతున్న పుస్తకం నేను రాసిందే , మొన్న
బుక్స్ exibition టైం కి తయారవ్వలేదు . అదే ముప్పై రోజుల్లో'' తెలంగాణాభాష ( యాస )''

Sravya Vattikuti said...

రవి గారు నేను తప్పించుకున్నా కాని మా వాళ్ళు అక్కడే ఉన్నారు కదా:)
అసలు కెసిఆర్ ని నెల్లాళ్ళ కి తెలంగాణా కి ముఖ్యమంత్రి గా చేసి అప్పుడు కూడా ప్రజలు (తెరాస వంద మంది కాదు)
ఆమోదం తెలిపితే అప్పుడు తెలంగాణ ఇవ్వమనొచ్చు >> very true !

Nizamabad said...

హలో శ్రావ్య బ్లాగర్ garu చాల సంతోసమంది తెలంగాణా అంటే చిన్న చూపు లేనప్పుడు http://nizamabadblog.blogspot.com/2009/12/blog-post_29.html ఇందులోని ఘనంకాలకు సమాదానం చెప్తారా మరి 1) Catchment area of Krishna Basin రాయలసీమ 18% ఆంధ్ర 13% తెలంగాణా 69%

Nizamabad said...

Allocation of Krishna water as per tribunal recommendation=
రాయలసీమ 16% ఆంధ్ర 49% తెలంగాణా 35%
Actual utilization రాయలసీమ 13% ఆంధ్ర 87% తెలంగాణా less than 1%
Godavari river catchment area తెలంగాణా 79% (1170 TMC) ఆంధ్ర 21% (310 TMC)
Utilization of Godavari waters ఆంధ్ర 23% (320 TMC i.e. 110% of allotted) తెలంగాణా 9.6 % (143 TMC)
- 405 TMC is being diverted to Andhra via Polavaram ప్రాజెక్ట్
ఇలాంటివి ఇంకా చాల ఉన్నాయ్ శ్రావ్య గారు పది జిల్లాలు ఉన్న తెలంగాన డిగ్రీ కాలేజీ లు 74 అదే 4 జిల్లాలు ఉన్న రాయలసీమ లో 70 9 జిల్లాలు ఉన్న ఆంధ్ర లో 167 , జూనియర్ కాలేజీ లు ఆంధ్ర లో 266, రాయలసీమ లో 138, తెలంగాణా లో 168, 1969 నుండి ఇప్పటివరకు జూనియర్ కాలేజీ పైన కర్చు చేసిన అమౌంట్ in crores Andhra 365, raayalaseema 162, telangana 55.....Teachers in schools Andhra 88,435, raayalaseem 38,552.. telangana 65,040... Schools in andhra 26,786.. rayalaseema 12,857.. Talangana 17,594...
ఇంకా చెప్పమంటారా ఇవి అన్ని అందరికి తెలిసిన నిజాలే, మాది కడుపు కూటి కోసం పోరాటం అదే ఆంద్ర వాళ్ళది ఆస్తులు కాప్డుకోవడానికి చేసే పోరాటం.. ఆంధ్ర లో ఉద్యమాలు జరిగి కాని ఎవరి మీద దాడులు చేయలేదా
మా స్టూడెంట్స్ లో బెదపిప్రయాల కోసం కొందరు చేస్తున్న ప్రయత్నమే గౌరవనీయులు శ్రీ నాగం జనార్దన రెడ్డి పైన జరిగిన సంగటన, రాజీనామాలు చేయడం ఆంధ్ర వల్లే గ నేర్పింది, ఇక్కడి కన్నా ఎక్కువ దాడులు అక్కడే జరిగి ఐన మీరు కూడా ఆంధ్ర వల్లే గ, అయ్యా రవి గారు హైదరాబాద్ లో కాదు తెలంగాణా లో ఎక్కడైనా వోటింగ్ పెట్టండి 90% వాళ్ళు తెలంగాణా కావాలి అంటారు ఇక 10% మీలాంటి వాళ్ళు మాతరం ఎక్కడైనా ఉంటారు లెండి, ఒక్కసారి హైదరాబాద్ అనే కాకుండా గ్రామాలలోకి వెళ్లి చూడండి సర్ మీకే తెలుస్తుంది, ఇక OU గురించి మీకు తెలిసింది చాల తక్కువ నేను ఉండేది maanikeshwari nagar లో గుర్తొచ్చిందా అన్యంగా ఇళ్ళలోకి వచ్చి మరి లాటి ఛార్జ్ చేసారు పోలీసు వాళ్ళు, అప్పుడు నేను కూడా లాటి దెబ్బలు తిన్నాను, ఇక మా మిత్రుల కి అన్నం పెట్టడానికి వచ్చిన హాస్టల్ వర్కేర్ ని కూడా కొట్టారు ఇప్పుడు ఆతను హాస్పిటల్ లో ఉన్నాడు , ఎక్కడ కొంచెం వీలున్న కాంపస్ లోపలి వెళ్ళడానికి అక్కడ ఇనుప కంచే వేసి మరి పోలీసు లని కపాల పెట్టి మరి లాటి ఛార్జ్ చేసారు చివరికి గిర్ల్స్ ని కూడా కొట్టారు... ఇదే ఆంధ్ర లో చోదయం చూసినట్టు చూసారు తప్ప వాళ్ళని ఏమైనా అన్నారా.. ఒక్కసారి Telangana లో ఎక్కడైనా సరే జై సైక్యంద్ర అనండి చూద్దాం....................
Jai Telangana! Jai Jai Telangana!!

Sravya Vattikuti said...

నిజామాబాదు బ్లాగరు గారు (మీ పేరేమిటో తెలియదు అందుకే ఇలా సంభోదిస్తున్నాను ). మీరు నదులు పారే విస్తీరణం తప్ప , వాటి సంఖ్యా తప్ప ఆయా ప్రాంతాల నేలల స్వభావాన్ని భలే కన్వీనియెంట్ గా మరిచిపోతునట్టున్నారు. అంతే కాకుండా ఇక్కడ సీ లెవెల్ ని కూడా పరిగణన లో తీసుకోవాలి. అలా చూస్తే
నిజామాబాదు -1296 ft
వరంగల్ - 991 ft
కరీంనగర్ - 869 ఫట్
వరంగల్ - 991 ft
నల్గొండ - 1381 ft

విజయవాడ - 39 ft
విశాఖపట్నం -16 ft
రాజమండ్రి - 46 ft
చూసారు కాదా ఎంత తేడా ఉందో. ఈ ఎత్తు పెరిగే కొద్ది వాటర్ లిఫ్ట్ చేయటం కష్టమవుతుంది , ఖర్చు కూడా పెరుగుతుంది . మరి ఇది ఆంధ్ర వాళ్ళు చేసిన కుట్ర లేకపోతె పకృతి స్వభావమా ? అయన మాస్టారు వరదలు , తుఫాను లు అనేవి మీరు చూసారా ? సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఈ ప్రాంత ప్రజలు ఎలాంటి పరిస్తితులలో బతుకుతారో మీరకు తెలుసా, మరి వాళ్ళు ఎప్పుడు ఎవరిని విమర్శించలేదు , అన్నిటికి దేవుడు లేదా ఖర్మ మీద భారం వేసి బతుకుతున్నారు . ఈనాటికి ఈ ప్రాంతం లో కొద్దిపాటి వర్షానికే మునిగి పోయే లంక గ్రామాలున్నాయి అని మీకు తెలుసా . ఈ 24 గంటల న్యూస్ చానల్స్ పని పాత లేకుండా, లేకపోతే కొంత మంది స్వార్ధ పరులు వాడే పడికట్టు మాటలు , కాకి లెక్కలు చూసి ఆంధ్ర వాళ్ళ మీదు ద్వేషాన్నిపెంచుకోవటం అనేది నీతిమాలిన పని .
నాకొక విషయం ఒక పది , పదిహేను సంవత్సరాల కిత్రం మీ నిజామాబాదు ప్రాంతం లోనే 50 ఎకరాల కన్నా ఎక్కువ భూములున్న భూస్వాములు పంటలు పడించే పరిస్తితులు ఉన్నాయా ? అన్నలు వచ్చి ఎర్ర జెండాలు పాతితే ఇక అంతే అలా సంవత్సరాల తరబడి బీడు పడ్డ భూములు వ్యవసాయ యోగ్యమా ? దీని కి ఆంధ్రవాల్లకు సంభంధం ఏమిటి ?

ఇక కాలేజి ల విషయం రాసారు ఇదే రాసే ముందు మీరు లెక్కలు కూడా రాయాల్సింది . మరి ఇండియన్ బిజినెస్ స్కూల్, IIT, NIT, IIIT వీటిని భలే మరుగున పడేసారు కదా :)

Sravya Vattikuti said...

ఉస్మానియా లో జరిగిన సంఘటన ఆంధ్ర వల్లే నేర్పారు , ఆంధ్ర వాళ్ళే చేసారు ఇలా వ్రాసినప్పుడే మీ ఆలోచన విధానం తెలుస్తుంది , ఇక దీన్ని గుంరించి నేను మాట్లాడినా వేస్ట్. ఇక ultimate ఇది ఒక్కసారి "Telangana లో ఎక్కడైనా సరే జై సైక్యంద్ర అనండి చూద్దాం" ఇక తరవాత కూడా చెప్పండి నాలుకలు కోస్తాం, తలకాయలు కోస్తాం అని.

jeevani said...

మీ కామెంట్ స్పేస్ ను వాడుతున్నందుకు ముందుగా క్షమాపణలు. దయచేసి ఒక్కసారి జీవని వెబ్సైట్ www.jeevanianantapur.org ను చూసి మార్పులు చేర్పులు సూచించవలసిందిగా కోరుతున్నాము. మి అమూల్యమైన సలహా తప్పక ఉపయోగపడుతుంది.
kathasv@gmail.com
jeevani.sv@gmail.com

మీ,

జీవని.

Anonymous said...

hi sravya this is shashanka vattikuti.

could you please send me your details of your home town and other stuff, may be we are related.

my email. shashank.187@gmail.com

రమణారెడ్డి said...

well said

Sravya Vattikuti said...

రమణారెడ్డి గారు & శశాంక్ ధన్యవాదాలు !

hanu said...

nice one andi, mee visleshaNa chala bagumdi

సావిరహే said...

baga chepparu :-)

సావిరహే said...

ned comments at my blog :

http://prasthanatraya.blogspot.com/
http://sarasalalonavarasaalu.blogspot.com/
http://lalithayamini.blogspot.com/

నీలు said...

డిసెంబరు నుండీ పోస్టులు వెయ్యలేదు మీరు?

Sravya Vattikuti said...

నీలు గారు బద్ధకం అంతే :)

కెక్యూబ్ said...

మీ బ్లాగు చాలా బాగుంది..
విడిపోదామని ఒక్క కెసిఆర్ కోరుకున్నంత మాత్రాన విడిపోతారా? దాని వెనక తెలంగాణా ప్రజల ఆకాంక్ష లేకపోతే ఇన్నాళ్ళుగా కొనసాగేదా? కేంద్రం స్పందించేదా? ఒక ఉద్యమం వెనక ప్రజల దన్ను లేకపోతే అది టీకప్పులో తుఫాను లా సమసిపోదా? కానీయండి ఈ డిసెంబరు వస్తోంది. వేచి చూద్దాం?

కామెంట్లతోనే సరిపెట్టేస్తున్నారు. ఇక్కడ కూడా రాయండి మేడం.. బ్లాగింగ్ ఆలోచనలు షేర్ చేసుకుంటు సరిదిద్దుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయని నమ్మకం వుంది నాకు. Thanks for this space..

Sravya Vattikuti said...

కేక్యుబ్ గారు తప్పకుండా ప్రయత్నిస్తాను , ధన్యవాదాలు !
@we3ours3 నమస్కారమండి !

మంచు said...

మీ బ్లాగ్ కి కామెంట్ మోడరేషన్ ఉందెమో అని చెక్ చేసా... కంగారు పడకండి :-))

Sravya Vattikuti said...

మంచు గారు :)

Anonymous said...

gud discussion kani ekkada evari lonu clarity ledu... ofcourse alntaudu miru clear ga cheppochuga anukovachu naku antha clarity akkarledu anduke blogger ga kakunda anonymous ga comment peduthunna
jaruguthunnadi rajakiyam ani bhavisthe manam sandinchatam shudda dandaga... endukante danni evadu marchaledu kabatti
ika lekkalu pathrala vishayamante adi avi thayaru chesina vallu kuda gunde pai chey veskoni 100% correct ani cheppaleru...
prathi okkaru thama abhiprayame corect anukuntaru kabatti deeniki saraina parishkaram chupadam kastam...
final ga ikkada charchinchadam ante okarakamga oka issue lono bhavaveshanni udvignathalani pattukoni time pass cheyadam lantide thamasha cheskodam lantide.... nijaniki deeniki saraina parishkaram dorike chota arthavanthmaina charcha jaripinche shakthi unnavallu kavali manaki kani ee rajakiyalani aa kcr ni ee chief ministers ni delhi peetanni shasinche shakthi entha mandiki undi... okka otu power tho ayina potu veyagala satha undaa.....???
ledane anukuntunnaa( kontha sepu cinema lo viravesham lo chupinche dailogues ni manaki anvayinchukovadam pakkana petti nijayithiga matladukogaligithe manam cheyagalama adi idi ani oo thega cheppestharu gaa ala kakunda)

so vedava gola mani ... papam chachi chedi bathukuthunna janala gurinchi alochinchagaligithe manavathvam konchemaina parimalinchi ilanti rajakiyanayakula pranthala godavalaki duramga snehasumalu virise avakashalu chala unnayi ( enduku chebuthunnanante malo anni pranthala snehithulam unnam kani ilanti charcha rachcha eppudu raledu kabatti)....

so ala padimandiki upayogapade blogs vasthayani ashisthu..... evarinaina noppisthe kshaminchalani koruthu......

సంతు (santu) said...

"పంట ఇంకా కోతకి రాలేదని చప్పుడు చేయకుండా నిద్రలు పోయారా ?"

ఏంటండి, తెలంగాణా ప్రజలపై జ్వలిస్తున్నట్టుగా ఉన్నారే....
తెలంగాణా ప్రజలు అమాయకులండి, అచ్చు నాలాగే(మనము తెలంగాణే కాని).. :p
ఎవరు ఎటు తెసుకేల్తే అటుగా వెళ్తారు, మీరే కొంచెం దగ్గరుండి సరియగు బాటలో నడిపిస్తే మల్లి తొక్కలో తెలంగాణా,సమైఖ్యంద్ర ఉద్యమాలు రావేమో...
మనమంతా మొదట తెలుగు తల్లి బిడ్డలం.... :) :)