రండి రండి మీరందరూ సోషల్ స్టడీస్ పాఠాలు చదివి చాలారోజులు అయిపొయింది కదూ ? 9th ఆగష్టు సింగపూర్ నేషనల్ డే అంటే సింగపూర్ పుట్టినరోజు !అందుకే ఈ వారం అంతా, నేను మీ అందరితో సింగపూరు చరిత్ర చదివించాలి అని కంకణం కట్టుకున్నా . ఇక మీకు తప్పదు.:-).
ఏదో పైపైన రెండు లైన్లు చదివి విండో క్లోజ్ చేయటమో , ఒక కామెంట్ పెట్టటమో కాదు , చదివి exam రాయాలి మీరందరూ . ఏంటి బహుమతా ? .....ఉన్నాయండి, ఫస్ట్ , సెకండ్ , థర్డ్ ప్రైజెస్ , ఆకర్షణీయమైన ఆ గిఫ్ట్లు మొత్తం పోస్టు చదివితే తెలుస్తాయి , కానీయండి మరి !
మనం వెస్ట్రన్ స్టైల్ లో పిలుస్తున్న సింగపూర్ అసలు పేరు సింగపుర . ఈ పేరు రెండు మలయ్ (మూలం సంస్కృతం) పదాలైన సింగ (సింహము) మరియు పుర (పురము) అనే రెండు పదాల కలయిక వలన వచ్చింది. చారిత్రక ఆధారాల ప్రకారము, పధ్నాలుగువ శతాబ్దపు సుమత్ర ద్వీప యువరాజు "సంగ్ నిల ఉతమ" ఈ ద్వీపాన్ని సందర్శించినప్పుడు సింహము తల లాగా ఉన్న ఒక వింత జంతువు కనిపించినందుకు ఆ పేరు పెట్టాడట(ఇప్పుడు లేవులేండి మీరు అర్జెంట్ గా వెతకటం మొదలుపెట్టి కష్టపడొద్దు ) .
భౌగోళిక లక్షణాలు :
దక్షిణ ఆసియా లో (మలేషియా , ఇండోనేషియా దేశాల మధ్య) ప్రధానద్వీపంతో చేరి 63 ద్వీపాలతో కూడిన అతి చిన్న దేశము సింగపూర్. సింగపూర్ మొత్తం విస్తీర్ణం 704 చదరపు కిలోమీటర్లు , అయితే ప్రభుత్వం చేపట్టిన అనేక భూమి విస్తీర్ణ కార్యక్రమాల కారణంగా క్రమేణా పెరుగుతూ వస్తుంది . ఈ విస్తీరణ చిన్న చిన్న దిబ్బలా ఉన్న దీవులని , కొండ ప్రాంతాలని నివాసయోగ్యం గా మార్చటం ద్వారా జరుగుతుంది . ఇండోనేషియా పక్కనే ఉన్నప్పటికీ , ఆ దేశం లో ఉన్న ఫాల్ట్ లైన్ కి కొన్ని వందల కిలోమీటర్ల దూరం లో ఉండటం వల్ల seismic activity వల్ల పెద్ద ప్రమాదం లేదని అంచనాలు , అలాగే సముద్రం పక్కనే ఉన్నప్పటికీ "సమత్రా లాండ్ మాస్" వల్ల 2004 లో వచ్చిన అతి పెద్ద సునామీ నుండి సురక్షితం గా బయటపడింది .
భూమధ్య రేఖకి 100 మైళ్ళ కన్నా తక్కవ దూరం లోనే ఉండటం వల్ల , ఇక్కడ రాత్రి , పగలు కాలాలు సమానం గా ఉంటాయి . అలాగే సంవత్సరం అంతా ఒకే రకమైన వాతావరణ పరిస్టితులు ఉంటాయి . ఈ సమయమలో నైనా వర్షం కురవోచ్చు . గాలిలో తేమ శాతం అధికం గా ఉంటుంది (సరాసరిన 90 % శాతం ).
ఆర్దిక అంశాలు :
ప్రపంచ దేశాలలో ఆర్ధికంగా 13వ స్థానంలో స్థానం సంపాదించింది . అంతర్జాతీయ వ్యాపార రంగంలోనాలుగు ఆసియా టైగర్స్ గా వర్ణించబడే దేశాలలో సింగపూరు ఒకటి (మిగిలినవి వరసగా హాంగ్‌కాంగ్, కొరియా ఇంకా తైవాన్). ఇంకా విదేశీమారక వ్యాపారరంగంలో పేరుపొందిన వ్యాపార అంతర్జాతీయ కేంద్రాలైన లండన్, న్యూయార్క్ , టోక్యో ల సరసన చేరింది.
ఎంట్రీపోర్ట్(tax free)వ్యాపార విధానాల వలన ఆర్ధికరంగాన్ని చక్కదిద్దుకున్న దేశాలలో సింగపూరు ఒకటి. సింగపూరు ఆదాయంలో 26 శాతం రాబడి పరిశ్రమల (ఎలక్ట్రానిక్స్, రిఫైనరీ, రసాయనాలు, మెకానికల్ ఇంజనీరింగ్ ,బయో మెడికల్ సైన్స్ ) ద్వారా వస్తుంది . .. సింగపూరు రేవు అత్యంత చురుకైన రేవుగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది . అత్యంత వ్యాపారానుకూల దేశంగా కూడా సింగపూరు కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది .
సంస్కృతి :
సింగపూరులో పూర్వీకులైన మలాయ్ ప్రజలు,మూడవ తరానికి చేరుకున్న చైనీయులు, విదేశీవాసులైన ఇండియనులు, అరేబియనులు, యూరేషియనులు నివసిస్తున్న కారణంగా మిశ్రమ సంప్రదాయాలు కలిగి ఉంది. కులాంతర, మతాంతర వివాహాలు ఇక్కడ సహజం. వివిధ మతాల ఆలయాలు ఇక్కడి మిశ్రమ మత సంప్రదాయానికి ప్రతీకలు.
సంప్రదాయ నిర్మాణాలతో నిండి ఉండే చైనా టౌన్ ,లిటిల్ ఇండియా ప్రదేశాలు సింగపూరు విభిన్న సాంప్రదాయాలకు గుర్తులు . ఇవి ఈస్టిండియా కంపెనీ కాలంలో ఇక్కడ పనులు చేయడానికి దేశాంతరాలనుండి వచ్చి స్థిరపడిన పౌరుల నివాసాలు. చైనీయులు, ఇండియనులు ఇక్కడ నివాసముంటారు. చర్చులు, హిందూకోవెలలు, మసీదులు, బౌద్ధ దేవాలయాలు కూడా ఇక్కడి ప్రజల సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి. వీటిని కాపాడవలసిన పురాతన చిహ్నాలుగా ప్రభుత్వం భావిస్తుంది.
హిందూ, చైనీస్ సంసృతులకి సంభదించిన దేవాలయాలు సాధారణం గా అన్ని ప్రదేశాల్లో పక్కన పక్కనే ఉండటం ఇక్కడ సాధారణం గా కనపడుతుంది . హిందూ దేవాలయాల్లో తమిళ సాంప్రదాయ పద్దతులలో పూజలు నిర్వహిస్తారు .సింగపూరు జాతీయ భాష మలయ్, జాతీయ గీతం మజులా సింగపుర . అధికార భాషలు మలాయ్, మాండరిన్, ఇంగ్లీష్, తమిళం. దేశ స్వాతంత్ర్యానంతరము ఇంగ్లీష్ అధికారిక హోదాను పొందింది. మొదట అమెరికన్ యాసతో ప్రభావితమైన ఇంగ్లీష్ ప్రారంభమైంది. విద్యా విధానాలలో ఇంగ్లీష్ మాధ్యమం కారణంగా ఇంగ్లీష్ వాడకం దేశమంతా వ్యాపించింది అలా ఇంగ్లీష్ సాహిత్యం అధికంగా సింగపూరు సాహిత్యంలో చోటు చేసుకోవడం సహజమై పోయింది. రాజ్యాంగ ప్రచురణలకు ఇతర అధికారిక అనువాదాలతో కూడిన ఇంగ్లీషుకు ప్రాముఖ్యత ఇవ్వడం అలవాటు. వివిధ భాషలను మాతృభాషగా కలిగిన ప్రజలు నివసిస్తున్న కారణంగా అనుసంధాన భాషగా ప్రజల మధ్య ఇంగ్లీష్ ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఇక్కడి ప్రజల మాతృభాషలతో కలగలసిన సింగ్లీష్ ఇక్కడి ప్రజల స్వంతం.
చరిత్ర :
ఈ ద్వీపము 'సుమత్రన్ శ్రీవజయ' సామ్రాజ్యములో తెమసెక్(సముద్ర పురము) అనే పేరుతో క్రీపూ 2 వ శతాబ్దమునుండి 14 వ శతాబ్దము వరకు వ్యాపారకేంద్రముగా విలసిల్లిన తరవాత క్షీణదశ ఆరంభమైంది ( పురాతన అవశేషాలు మిగిలి ఉన్నా ఆర్కియాలజిస్టులచే ఇది నిర్ధారించబడలేదు). 16వ శతాబ్ధము నుండి 19వ శతాబ్ధపు ప్రారభం వరకు జోహర్లో (మలేషియా) ఒక భాగంగా ఉంది. ఆ సమయములో ఈ ద్వీపము జాలరుల నివాసస్థలంగా ఉండేది .
1819వ సంవత్సరము లో "థోమస్ స్టాన్ ఫోర్డ్స్ రాఫిల్స్" భౌగోళికంగా సింగపూరు వ్యాపారానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా గుర్తించి ఈస్టిండియా కంపెనీ తరఫున బ్రిటిష్ వ్యాపారకేంద్రముగా అభివృద్ధి పరచే ఉద్దేశముతో ఒక ఒప్పందము చేసుకున్నాడు.ఈ ఒప్పందము దేశములో ఆధునిక యుగానికి నాంది పలికింది. ఈయనని ఆధునిక సింగపూర్ రూపకర్త గా చెప్పవచ్చు , ఈయన పేరు మీద ఏర్పడిన raffles place ఏరియా ప్రముఖ వాణిజ్య సముదాయలకి నెలవు . దీనినే డౌన్ టౌన్ అని కూడా అంటారు.అంతర్జాతీయంగా ఇక్కడకు వచ్చినివసించే వారిపై పౌరసత్వ కట్టుబాట్లు నిర్బంధం లేని కారణంగా వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలు ఇక్కడ స్థిరపడటము ఆరంభము అయినది. 1858 వ సంవత్సరము నుండి జరిగిన ఈస్టిండియా పరిపాలన 1867 వ సంవత్సరమున బ్రిటిష్ సామ్రాజ్యపు పాలన లో కి వచ్చింది . బ్రిటిష్ కలోనీ నగరనిర్మాణ వ్యూహాలతో నగరాన్ని సంస్కృతి పరంగా విభజించింది. సింగపూర్ నది ప్రాంతము వ్యాపారుల,బ్యాంకర్ల ఆధిక్యములో వాణిజ్యపరంగా అభివృద్ధిని సాధించింది.
రెండవ ప్రపంచ యుద్ధకాలములో ఈ ద్వీపము 1942 వ సంవత్సరము 6 రోజుల యుద్ధము తరవాత జపాను సైన్యంచే ముట్టడించబడి జపాను వశమైంది. 1945 వ సంవత్సరము సెప్టెంబర్ 12 వ తేదీన జపానీయుల లొంగుబాటు తరువాత తిరిగి ఈ ద్వీపాన్ని బ్రిటిష్ వశపరచుకుంది. 31 August 1963 లో బ్రిటన్ నుంచి Federation of Malaysia లో భాగం గా స్వాతంత్ర్యం పొందింది . తరవాత రెండు సంవత్సరాల తరవార ఒప్పందాల ప్రకారంమలేసియా నుంచి విడిపోయి 9th ఆగష్టు 1965 న రిపబ్లిక్ అఫ్ సింగపూర్ గా ఏర్పడింది .
రాజకీయ అంశాలు :
సింగపూర్ పార్లమెంటరీ రిపబ్లిక్ అయినప్పటికీ అదికార పార్టీ అయిన PAP (పీపుల్ ఆక్షన్ పార్టీ ) 1965 నుంచి ఇప్పటికి వరకు వరుస గా ఎన్నిక అవుతూ వస్తుంది . ప్రతిపక్ష పార్టీ ప్రభావం తక్కువే అయినప్పటికీ , 2011 లో జరిగిన ఎన్నికలలో మాత్రం ఓటింగ్ శాతాన్ని గతం లో పోలిస్తే గణనీయం గా పెంచుకుంది . ప్రధాన ప్రతిపక్ష పార్టీలు (SDP & SDA) కలిసి పోటీ చేయటం వలన ఇది సాధ్యమైంది అని విశ్లేషకుల అంచనా .
సింగపూరు అతితక్కువ అవినీతి కలిగిన దేశంగా ఆసియాలో ప్రధమ స్థానంలోను, అంతర్జాతీయంగా పదవ స్థానంలోనూ ఉంది. సుస్తిరమైన రాజకీయ పరిస్తితులు , పాలకుల విచక్షణ , పరిపాలనా దక్షత దీనికి కారణాలు గా చెప్పవచ్చు .
సింగపూర్ లో రెండు రకాలైన ELECTORAL DIVISIONS ఉంటాయి .
1 . Single Member Constituencies (SMC ) : ఇవి సాధాణం గా జనాభా లోను , విస్తీరణం లో చిన్నవి . ఈ పార్లమెంటరీ డివిజన్ ని కేవలం ఒక MP రేప్రజేంట్ చేస్తారు . అంటే ప్రజలు ఒక MP ని మాత్రమే ఎన్నుకుంటారు . ప్రస్తుత SMC ల సంఖ్య - 12.2 Group Representation Constituencies (GRCs): విస్తీరణం లోను , జనసాంద్రత లోను పెద్దవి . 3 - 6 మంది MP లను ప్రెసిడెంట్ నియమిస్తారు . ఈ మొత్తం సభ్యులలో ఒకరు తప్పని సరి గా మైనార్టీ రేస్ నుంచి ఉంటారు . ప్రస్తుత GRC ల సంఖ్య - 15 .
MP గా పోటీ చేయటానికి అభ్యర్ధి తప్పనిసరిగా పొలిటికల్ సైన్సు తప్పని సరి గా చదవి ఉండాలి .
అంతర్జాతీయ సంబంధాలు :
సింగపూరుకు దరిదాపు 175 దేశాలతో మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి. సింగపూరుకు ఐక్యరాజ్యసమితిలో, కామన్వెల్త్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో సభ్యత్వము ఉంది. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియాలతో కలిసి ఐదు దేశాల రక్షణ ఒప్పందము ఉంది. సింగపూర్ యునైటెడ్ కింగ్‌డమ్ తో , అమెరికాతో కూడా మంచి సంబంధాలను కలిగి ఉంది, అలాగే అనేక దేశాలతో విసృత వ్యాపార ఒప్పందాలను కలిగి ఉంది.
విద్య
సింగపూరు అత్యధిక అక్షరాస్యులు కలిగిన దేశం. ఇక్కడ ప్రైమరీస్కూలు ఆరవసంవత్సరం నుండి మొదలౌతుంది. స్కూలుకు ముందు తరగతులు ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తుంటాయి. , మొదటి భాషగా ఇంగ్లీష్, ఇతర భాషలను (హిందీ, తమిళ్ , మాండరిన్ వంటివి)రెండవ భాషగానూ బోధిస్తుంటాయి. కొన్ని చైనీస్ పాఠశాలలు మాండరిన్ మాధ్యమంగానూ బోధిస్తూ ఉంటాయి.విద్యావిధానంలో చేరని మూడు సంవత్సరాల కిండర్ గార్డెన్ (ప్రాధమిక విద్యకు ముందు తరగతులు) తరవాత 6 సంవత్సరాల primary education ఉంటుంది . స్కూల్ లీవింగ్ పరీక్షల (PSLE) తరువాత ఎంచుకున్న పాఠ్యాంశాలతో 4 నుండి 5 సంవత్సరాల Seconday Education అనంతరం N లెవెల్ లేక O లెవెల్ పరీక్షలు నిర్వహిస్తారు.జూనియర్ colleges 2 నుండి 3 సంవత్సరాల ప్రి యునివర్సిటీ తరగతులు నిర్వహిస్తాయి. దీని తరవాత మాస్టర్స్ కోర్సులు చేయటానికి అర్హులు . నిరుద్యోగ శాతం 1 .5 శాతం మాత్రమే కావటం తో ఎక్కువ మంది ప్రీ యునివర్సిటీ కోర్సులు కాగానే ఉద్యోగాలలో చేరటానికి మక్కువ చూపుతారు .
రక్షణ వ్యవహారాలు
సింగపూరు రక్షణవ్యవహారాలు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(MINDEF)ఆధ్వర్యంలో ఉంటాయి. సింగపూరు ఆర్మీ, రిపబ్లిక్ ఆఫ్ సింగపూరు నావీ, రిపబ్లిక్ ఆఫ్ సింగపూరు ఎయిర్ ఫోర్స్ఈ మూడు కలిసి సింగపూరు ఆర్మ్ ఫోర్స్ రక్షణశాఖ మంత్రి అధికారంలోఉంటాయి. వీటికి సివిల్ డిఫెన్సు వంటి కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా తమ సేవలు అందిస్తాయి.ప్రతి సింగపూరు పురుషుడు రక్షణవ్యవస్థలో కనీసం 2 సంవత్సరాల కాలం పనిచేయాలి. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లోని వారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. రెండవతరానికి చెంది సింగపూరులో స్థిరనివాస మేర్పరచుకున్న పురుషులకు ఈ చట్టం వర్తిస్తుంది. రెండు సంవత్సరముల సేవల అనంతరం రక్షణశాఖలో కొనసాగే విషయం స్వయంగా నిర్ణయించుకోవచ్చును.సింగపూరు ఆర్మీ అంతర్జాతీయ శిక్షణా కేంద్రాలను అమెరికా, ఆస్ట్రేలియా, రిపబ్లిక్ చైనా, న్యూజిలాండ్, బ్రూనై, ఫ్రాన్స్, థాయిలాండ్, భారత్ మరియు దక్షిణాఫ్రికా లలో నిర్వహిస్తుంది. 1991 సింగపూరు ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 117ను హైజాక్ చేసినప్పుడు సింగపూరు స్పెషల్ ఆపరేషనల్ ఫోర్స్ ప్రయాణీకులకుగాని సిబ్బందికిగాని ప్రాణనష్టం లేకుండా హైజాకర్ల వ్యూహాన్ని తిప్పికొట్టింది. ఈ ఆపరేషన్ లో నలుగురు హైజాకర్స్ ప్రాణాలు కోల్పోయారు . ఇది వీరి ప్రతిభ కి ఒక మచ్చు తునక .
సాధారణ ప్రజల జీవన విధానం , పర్యాటక విశేషాలు రెండో భాగం లో తెలుసుకుందాము ...... అంత వరకు take a break :)
30 comments :
టీచర్ టీచర్ నేను నేర్చేసుకున్నాను. కంఠతా పట్టేస్తున్నాను. సింగపుర చరిత్ర, సంస్కృతి, భూగోళం కాదు కాదు భౌభౌ గోళం అన్నీ చదివేసాను. ప్రైజు ఇచ్చేస్తారా మరి.
pOst sagame chadivaanandee.... quarterly syllabus anukunnaanu.. half yearly syllabus ichchestaaraa?? ;) :) :)
ayinaa inta matter ekkada gather chesaroo? mee opika ki lal salam.
telugu wiki lo kooda petteyyandee.
exam eppudandee? (exam mundu roju chadavatam alavaatu naaku )
ఆ, సింగపూర్ గురించి తెలియనిది ఏమిటి అని సరదాగా ఇది చదవటం మొదలెట్టాను. చక్కటి విషయాలు చెప్పారు. ముఖ్యం గా ప్లేన్ హైజాక్ విషయం. 11 గంటల బుల్లి హైజాక్...ఎంత దేశానికి అంత హైజాక్ అన్నమాట.
Jokes apart,1991 లో నే అలా తిప్పికొట్టగలిగారంటే అధ్భుతమే. రాజకీయ తదితర ఒత్తిడిలు లేకపోవడమే కారణమేమో. ఇప్పటికీ అలాంటివి లేవె లెండి. ఇది చదవగానే మన జస్వంత్ సింగ్ సగౌరవంగా తీవ్రవాదిని సాగనంపిన ద్రుశ్యం మెదిలింది ....ప్చ్చ్.
http://infopedia.nl.sg/articles/SIP_834_2004-12-30.html.com
బాగుందండీ సింహపురం చరిత్ర...
ఏంటి తెవికీకి వ్యాసమేమన్నా రాస్తున్నారా...
అసలే చరిత్రంటే చిరాకు..ఐనా కష్టపడి ఇంత చరిత్ర చదివితే ఉత్తిబ్రేకేనా.. కనీసం కిట్ కాట్ ఐనా లేదా.. :-)
నాకు బాగా నచ్చింది సింగపూర్ లో: అరిటాకులో భోజనం పెట్టి దగ్గరుండి వడ్డించటం. భోజన శాల సరంగూన్ రోడ్ లో అనుకుంటాను.
బాగుందండి మీ సింహపురం, వీలున్నపుడు చూడాలండి. మీ దేశంలో ఓ చివరనుంచి మరో చివరకు చేరుకోడానికి లాంగ్ డ్రైవ్ అవసరంలేదనుకుంటా... సైకిల్లో వెళ్ళి, ఒక ఎండ్ బ్రేక్ఫాస్ట్ చేసి, మరో ఎండులో లంచ్ చేసిరావచ్చు. మాదేశంలో ఒక ఎండునుంచి మరో ఎండుకు (కాశ్మీర్) వెళితే తిరిగిరావడం కష్టమే. :) :P
రుషి గారు, ఆ పోలిక అంత సరి కాదేమో అది జరిగింది సింగపూర్లో, కాందహార్లో తాలిబాన్ కోటలో కాదు. సందు దొరికితే చాలు మా ముసలి మాతృదేశం మీద రాళ్ళేస్తారు కదా! దేనికదే... మాదేశంలో రోడ్ల మీద వంట చేసుకుని తిని ఆటా-పాట చేస్తాం, మీ సింగపురంబులో మాగ్గావాలె అంటే ఎన్నేళ్ళైనా విచారణలేకుండా మాస్ సలామతే అన్నది గమనించుడీ.
బ్లాగు మొదటి పేజ్ లో ఏమేమి ఇంత చిన్న పోస్ట్ :)
అంతా టెంప్లేట్ మహిమ, బావుంది ఈ టెంప్లేట్
చరిత్ర ఇంత చిన్నగా ఉందేమిటి అనుకుంటే రీడ్ మోరా..:)
మోరా పాట హమ్మింగ్స్
http://www.youtube.com/watch?v=J5kLJQTRiS4&feature=related
ప్రైజ్ రెండో భాగం అయ్యాక :(((
సందేహములు
---------------
సింహం ఫౌంటైన్ కి చెరొవైపు ఉన్న బిల్దింగ్ లను విశదీకరించుము
SMC ల సంఖ్య - 12.
ఇందులొ ఇండియన్స్ ఎంతమంది ఉంటారు .. సుమారుగా ఒకవేళ మన జనాలను తొక్కెసే తొక్కుడు బిల్ల లాంటి ఫెసిలిటీస్ ఉంటే చెప్పగలరు
తరువాతి భాగం లో పర్యాటక విశేషాలు కాస్త ఎక్కువ రాయగలరు..with pictures :)
>>take a break :)
have a Kitkat :)
hammayya! chadivaesaanu! naa voeTu kooDaa!
చరిత్ర పాఠాలు ఇలా కూడా చెప్పొచ్చన్నమాట:) మంచి విషయాలు చెప్పారు. పూర్వాశ్రమంలో మీరు సోషల్ టీచర్ కాదు కదా!
"ప్రతి సింగపూరు పురుషుడు రక్షణవ్యవస్థలో కనీసం 2 సంవత్సరాల కాలం పనిచేయాలి"...ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. మనకు కూడా అలాంటి ఓ రూలు పెట్టాలి. రక్షణ శాఖలో కనీసం రెండు సంవత్సరాలు పనిచేసినవాళ్ళే ఎన్నికల్లో పోటీ చేయటానికి అర్హులు అని పెట్టాలి.
మా పిల్లల్ని చదువు కోసం సింగపూరు పంపాలనుకున్నా కానీ ఇద్దరూ ఆసక్తి చూపించలేదు.
మరిన్ని విషయాలు నేర్చుకోవటానికి మేమంతా రెడీ.. మీదే ఆలస్యం..నెక్స్టు క్లాసు ఎప్పుడు టీచర్??
"ఫస్ట్ , సెకండ్ , థర్డ్ ప్రైజెస్ , ఆకర్షనీయమైన ఆ గిఫ్ట్లు మొత్తం పోస్టు చదివితే తెలుస్తాయి"..
నాలుగు సార్లు చదివినా ఏం గిఫ్టులో తెలియలేదు కానీ సింగపూరు చరిత్ర మాత్రం నోటికొచ్చేసింది :)
@బులుసు మాష్టారు మీరు ఏకసంతాగ్రాహి , ఇక గిఫ్ట్ ఇచ్చేస్తాము నెక్స్ట్ పార్ట్ కాగానే :))) Thank you !
@వేణు రాం మీకు quarterly ఎక్షమ్ కి half yearly సిలబస్ ఇచ్చినట్లు ఉందా ? మరంతే కదా రోజులు మారిపోయాయి , ఎక్షమ్ డేట్ ముందు మీకే చెబుతా :))) Thank you !
రావు గారు అది బనానా లీఫ్ రెస్టారెంట్ అండి , సరంగూన్ రోడ్ కరెక్టేనండి. మీ దగ్గర కూడా కొన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నట్లు ఉన్నాయండి వీళ్ళవి :) Thank you !
శంకర్ గారు వీలున్నపుడు చూస్తారా హ హ :) అసలు మీరు మా దేశం అనడం నేను తీరం గా ఖండిస్తున్నా , మీరు ఈ మాట వాపస్ తీసుకోకపోతే స్వరజన సమ్మె కి పిలుపునిస్తా , ఇక అప్పుడు "మాస్ సలామతే" ఐనా సరే :))) Thank you !
హరేకృష్ణ చాలా రోజులనుండి ఇదే template కదా ? మీరు ఈ రోజు బ్లాగ్ URL వాడారా , పోస్టు URL బదులు ? అమ్మయ్య మీరు ఒక్కరు అర్ధం చేసుకున్నారు రెండో బాగం తరవాత గిఫ్ట్ అని:)
ఇక సింహకారం లో ఉన్న బొమ్మ ని మెర్లియన్ అంటారు , దానికి కుడివైపు ఎలిప్స్ లాగా కనపిస్తుంది చూడండి అది ఎస్ప్లానేడ్ థియేటర్స్ ( మూవీ కాదు డ్రామా , ఇంకా మిగిలిన ఆర్ట్ థియేటర్స్), see here http://www.esplanade.com/index.jsp for more details . మీకు ధూమ్ 2 గుర్తుంటే ఆ విలన్ స్థావరం ఉంటుంది చూడండి లాస్ట్ లో అది ఇదే . చాలా బావుంటుంది . దాని వెనక కొంచెం ఎత్తుగా కనిపస్తుంది అది Mandarin Oriental హోటల్ , దానికి వెనక ఫోటోలో రెండు టవర్లు మాత్రమే కనపడుతున్నాయి , కాని అవి మొత్తం నాలుగు towers అవి suntec సిటీ towers . ఎడమ వైపున రౌండ్ గా ఉంది కదా అది Swissôtel The Stamford , సింగపూర్ లో ఎతైన హోటల్ , దాని వెనక ఉన్నవి raffels place ఏరియా బిజినెస్ బిల్డింగ్స్ .
నెక్స్ట్ పార్ట్ లో పర్యాటక విశేషాలు తప్పకుండా రాస్తాను . Thank you !
సునీత గారు Thank you .
మువ్వ గారు అబ్బే లేదండి నాకు సోషల్ కి ఏ మాత్రం సంభంధం లేదు :)))
పురుషుడు రక్షణవ్యవస్థలో కనీసం 2 సంవత్సరాల కాలం పనిచేయాలి"...ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. మనకు కూడా అలాంటి ఓ రూలు పెట్టాలి
-------------
అవునండి ఇది నిజం , రక్షణ అవసరాల మాటేమో కాని జనాలకి కొద్ది పాటి డిసిప్లిన్ వస్తుంది .
మా పిల్లల్ని చదువు కోసం సింగపూరు పంపాలనుకున్నా కానీ ఇద్దరూ ఆసక్తి చూపించలేదు.
-----------------
అవునా అండి ? ఇక్కడ బాచిలర్స్ కన్నా మాస్టర్స్ చేస్తే ఉపయోగం అండి , అది management వైపు ఐతే SMU కి మంచి పేరుంది .
నెక్స్ట్ పార్ట్ 9 న పబ్లిష్ చేద్దామని అనుకుంటున్నానండి :))) గిఫ్ట్ రెండో భాగం కూడా అయ్యాక అండి :))) Thank you !
1991 సింగపూరు ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 117ను హైజాక్ చేసినప్పుడు సింగపూరు స్పెషల్ ఆపరేషనల్ ఫోర్స్ ప్రయాణీకులకుగాని సిబ్బందికిగాని ప్రాణనష్టం లేకుండా హైజాకర్ల వ్యూహాన్ని తిప్పికొట్టింది.
అవునా నాకసలు తెలియదు :)
రిషి గారు అవును బుల్లి హైజాక్ కానీ వాళ్ళు హేండిల్ చేసిన విధానం గ్రేట్ కదా . అలాగే ఇలాంటి సున్నితమైన విషయాల్లో ఎటువంటి ఒత్తుడులు లేకపోవటం మెచ్చుకోవాల్సిన విషయం అనిపిస్తుంది నాకు ! Thank you !
వేణు గారు మీకు కూడా చరిత్ర అంటే చిరాకేనా , thank you కష్టపడి చదివినందుకు :))). బ్రేక్ టైం లో కిట్ కట్ మన గుంటూరు లో నా పేరు చెప్పి ఒకటి కొనేసుకొండి :)))
శ్రావ్యా,
మీ సింగపూరు సోషల్ పాఠం బావుంది. శ్రద్ధగా చదివాను. :)
కానీ, ఇప్పుడే మీరు ఏ సంవత్సరంలో ఏం జరిగింది లాంటి ప్రశ్నలతో పరీక్ష మాత్రం పెట్టకండి ప్లీజ్.. :P
నేస్తం గారు హ హ ఇండియాలో లాగ లైవ్ టెలికాస్ట్ చేసే టీవీలు లేవు కదా అందుకే మిస్సయ్యేమో :)
మధుర ఇష్ ఇష్ ఇలాంటి సీకెట్లు మనం ప్రైవేటు గా మాట్లాడుకోవాలి :))
Snkr గారూ, నా దేశ భక్తిని శంకించారు మీరు,ఎంత "శంక"రులు అయితే మాత్రం :)?
ఇప్పుడు నేను అర్జెంటుగా పంద్రాగస్టులోపు " నేనూ నా దేశం,పవిత్ర భారత దేశం" అని పాడి నా భక్తి నిరూపించెద.
ఇక పోతే, నేను మెచ్చుకున్నది ఒత్తిడులకి తలొగ్గని వీరి ప్రభుత్వ విధానం. అప్పటి మన ప్రభుత్వం కాందాహార్ హైజాక్ విషయంలో ఇంకాస్త గట్టిగా వ్యవహరించిఉండాల్సింది, అమెరికా ద్వారా చెప్పించో మరో " హై కమాండ్ విధానం" ( " అమ్మ" కాదు ) ద్వారానో అనిపిస్తుంది నాకు.
రాజకీయం గా కానీ, భౌగోళికం గా కానీ సారూప్యత లేని దీనితో ఇండియా ని పోల్చకూడదు. కానీ కొంపలంటుకుపోతున్నా కానీ "నా కేంటి" అనే తత్వాన్ని వీడని నాయకులని చూస్తే మాత్రం కంపారిజన్ వచ్చెస్తుంది ఆటొమేటిక్ గా. ధనిక దేశానికి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టేసా అనకండి :)).
శ్రావ్య గారూ,
మీ బ్లాగులో ఓ పోస్టు లాంటి కామెంట్ రాస్తున్నందుకు క్షమించండి.
రిషి గారు No problem , feel free, బ్లాగర్ వాడు బోలెడు స్పేస్ ఇచ్చాడు :)
మా పిల్లలకి చదివించి చదివించి.. అలవాటు ప్రకారం మీ వ్యాసం లోంచి పరీక్షలకి రావచ్చు అనుకునే తేదీలు, ముఖ్యాంశాలు పక్కన నోట్ పాడ్ లో రాసేస్తూ...
గుర్తొచ్చింది.. ఇది హాయిగా చదివేయచ్చు.. డేట్లు ఎవ్వరూ అడిగి చెప్పకపోతే బెత్తం తో కొట్టరు.. అని :))
"సింగపూరు రేవు అత్యంత చురుకైన రేవుగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది ." అత్యంత చురుకుగా వ్యాపార కార్యకలాపాలు జరిగే రేవు..అంతే కదండీ..
టూరిస్ట్ గైడ్ తరహా టపా అనగానే 'మహాబలిపురం..మహాబలిపురం..' పాడుకుంటూ చదవడం మొదలు పెట్టాను.. పాట అయిపొయింది కానీ, టపా అవలేదు.. అలా ఓ ఐదారుసార్లు పాటయ్యాక అప్పుడు మొదటి భాగం పూర్తయ్యింది.. రెండో భాగానికి వేరే ఏదన్నా పాట వెతుక్కోవాలి అయితే.. సీరియస్ విషయాలకి వస్తే, టపా చాలా బాగుందండీ.. ముఖ్యంగా చెప్పిన విధానం.. దగ్గరున్న డేటా కి యాంత్రిక అనువాదం కాకుండా, ఆసక్తిగా చదివించేలా రాశారు.. టూరిజాన్ని గురించి కొంచం వివరంగా రాయండి..
కృష్ణప్రియ గారు :))) Thank you !
మురళి గారు
సింగపూరు రేవు అత్యంత చురుకైన రేవుగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది ." అత్యంత చురుకుగా వ్యాపార కార్యకలాపాలు జరిగే రేవు
--------------
అవునండి అదే అదే :)
ఐతే మహాబలిపురం పాట ఐదు సార్లు విన్నారన్న మాట, నా పోస్టు వల్ల :))) నెక్స్ట్ పార్ట్ లో టూరిజం కూడా తప్పకుండా రాస్తానండి .
Thank you !
అబ్బే ఇలా మెటీరియల్ ఇచ్చి చదివేసుకుని పరీక్ష రాసేయండి అంటే కుదరదు. నాకూ, మా ఆవిడకీ రెండు టికెట్లు పంపించి, సింగపూర్ మొత్తం తిప్పి చూపించి అప్పుడు పెట్టండి పరీక్ష. వందకి వంద తెచ్చుకోకపోతే మీరు పెట్టిన ఖర్చులు వాపస్. :)
(ఆల్రెడీ బులుసు గారు ఈ పరీక్ష కోసమని కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశారు. ఆయన,శిష్యుడిగా నేను పరీక్ష రాసేవాళ్ళ కోసం స్లిప్పులు ప్రిపేర్ చేస్తున్నాం. ఆ బిజీలో ఉంది కాస్త లేటుగా కామెంట్ పెట్టడం జరిగింది అని గమనించగలరు)
>>MP గా పోటీ చేయటానికి అభ్యర్ధి తప్పనిసరిగా పొలిటికల్ సైన్సు తప్పని సరి గా చదవి ఉండాలి
ఇదేదో బాగుందండి.
'అమెరికా - సింగపూర్- ఐ.టి' రెండో భాగం లో చర్చించాల్సింది గా మనవి.
శ్రావ్య గారు.. పురుషులు రక్షణవ్యవస్థలో పనిచేయాలని రూల్ పెడతారా..? మా తల్లే(మా ఊర్లో ఇట్టాగే అంటారు). మీకేం? హాయిగా ఇంట్లో కూర్చుని టీవీ సీరియల్స్ చూసుకుంటారు. ఇప్పుడు బోర్డర్‌లో తుపాకులు పట్టుకుని కాపలా కాయాలంటే నావల్ల కాదు. మన దేశంలో ఇలాంటి చట్టాలు చెయ్యకుండా ఒక చట్టం చెయ్యాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
శంకర్ గారు అబ్బే లాభం లేదండి , ముందు థియరీ పాస్ అయితే కాని మేము ప్రాక్టికల్స్ కి allow చేయం :))) హ హ సిప్ల్లు తయారీ లో బిజీ అన్న మాట మీరు గురువు గారు :)) Thank you !
బంతి గారు తప్పకుండా మీకోసం IT -- Singapore నెక్స్ట్ పార్ట్ లో :))) Thank you !
చాణుక్య గారు అబ్బే మరీ బోర్డర్ లో తిరకక్కర్లేదు జస్ట్ కాంపస్ లో ట్రైనింగ్ ఐతే చాలు, అయినా మీ లాంటి యూత్ ఇలా అంటే ఎలా :))))
అమ్మయ్య నేనూ మొత్తం ఆసాంతం చదివేసాను :)
మాల గారు Thank you !
చాణుక్య :)))
బాబోయ్..శ్రావ్య జి...మీ ఓపిక కి నా జోహారులు...!! :)
ఎంత బాగా అన్ని తెల్సుకున్నారో...
నాకు ప్రైజ్ ఏది..ఇన్ని రోజులైనా..అభిమానం తో మీ బ్లాగు కు వచ్చి చదివినందుకు...:P
నేను సోషల్ లో బాగా వీక్ టీచర్...కాస్త దయ ఉంచి ప్రశ్నలు అడగవలసింది గ మనవి...
హ హ కిరణ్ థాంక్ యు , వీక్ అన్నా , స్త్రొంగ్ అన్నా ఎక్షమ్ తప్పదు , నేనసలే స్ట్రిక్ట్ :)))) btw ఏంటి కూర్చిని సీరియస్ గా అన్ని పోస్టులు చదివేస్తున్నారా ఇవాళా :))))
Post a Comment