Subscribe:

Thursday, November 3, 2011

రండి రండి దయచేయండి ......!

నమస్కారాలు నమస్కారాలు  అందరూ బాగున్నారా ?  ఈరోజు  బృహుత్తరమైన ప్రణాళిక తో మీ ముందుకు  వచ్చా !  అదేంటంటే  అదేంటంటే .....

హూ  ! అర్ధం అయ్యింది , "సోది  ఆపి పని చూడు"  అనే  మీ వ్యంగపు చూపుల  అర్ధం ?  మరీ తెలుగు బ్లాగర్లు  అదీ నా బ్లాగు కూడా  చదువుతున్న మీకు ఇంత ఓపిక కూడా లేకపోతే  మహా కష్టం సుమండీ .  వస్తున్నా  విషయానికి  ఇప్పుడు మిమ్మలిని  కొన్ని ప్రశ్నలు   అడుగుతా మీరు చెప్పేయాలి అంతే !
  1.  "నవ్వడం ఒక భోగం,నవ్వించడం ఒక యోగం.నవ్వకపోడం ఒక రోగం "  అన్నది  ఎవరు ? 
  2.  "పడమటి సంధ్యారాగం ,  శ్రీవారికి ప్రేమలేఖ ,  మల్లెపందరి ,  అహ నా పెళ్ళంట ,   వివాహ         భోజనంబు ,  చంటబ్బాయి ,  రెండు రెళ్ళు ఆరు "   ఈ పేర్లన్నీ  చదువుతుంటే  మీకు కామన్ గా        గుర్తొస్తున్న   వ్యక్తి ఎవరు ?
  3. సుత్తివేలు , సుత్తి వీరభద్రరావు , బ్రహ్మానందం , శ్రీలక్ష్మి  వీళ్ళని మనకు దగ్గర గా పరిచయం    చేసిన   వ్యక్తి  ఎవరు ?
నాకు  తెలుసు  మీరు  మహా షార్ప్  కదా బేసిక్ గా  అందుకే ఈజీ పట్టేశారు  ఆన్సర్  :))   యెస్   మీరు అనుకున్నట్లు నేను మాట్లాడుతుంది   హాస్య బ్రహ్మ గా  పేరు  పొందిన   జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించే . ఇప్పుడు అర్జెంటు గా ఎందుకు అంటే ?   జంధ్యాల  గారి  గురించి  మనకు తెలియని విషయాలు  తెలుసుకోవటానికి అలాగే మనకు తెలిసింది  పంచుకోవటానికి  , మన తెలుగు బ్లాగరు  మిత్రులు  కొంతమంది  కలిసి  ఒక చిన్న ప్రయత్నం మొదలు పెట్టారు . అదే  జంధ్యావందనం అనే  ఈ సైటు .  మీకు తీరిక ఉన్నప్పుడు  ఒకసారి  వారి ప్రయత్నాన్ని  అభినందిస్తారు  అని నా ఈ చిరు పరిచయం .

అలాగే నా బ్లాగులో  కుడి వైపున ఒక బాడ్జీ  కనపడుతుంది  చూడండి "జంధ్యావందనం " అని అలాంటివి మీరు కూడా వీలయితే  మీ బ్లాగులో పెడితే  మీకు చదివే వారందరూ అక్కడ కూడా ఒక చూపు చూడటానికి వీలు గా ఉంటుంది :)   మీ అభినందనలు ఆ సైట్ లో కామెంట్ గా రాయమని మనవి . 
ఈ సైటు  గురించి  ముందే తెలిసిన మిత్రులు   మీకు తెలిసిన విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే  తప్పేమీ  లేదు దీని గురించి   జంధ్యాల మార్కు  తిట్ల వర్షం నా మీద కురిపించ వద్దని మనవి .