Subscribe:

Thursday, November 3, 2011

రండి రండి దయచేయండి ......!

నమస్కారాలు నమస్కారాలు  అందరూ బాగున్నారా ?  ఈరోజు  బృహుత్తరమైన ప్రణాళిక తో మీ ముందుకు  వచ్చా !  అదేంటంటే  అదేంటంటే .....

హూ  ! అర్ధం అయ్యింది , "సోది  ఆపి పని చూడు"  అనే  మీ వ్యంగపు చూపుల  అర్ధం ?  మరీ తెలుగు బ్లాగర్లు  అదీ నా బ్లాగు కూడా  చదువుతున్న మీకు ఇంత ఓపిక కూడా లేకపోతే  మహా కష్టం సుమండీ .  వస్తున్నా  విషయానికి  ఇప్పుడు మిమ్మలిని  కొన్ని ప్రశ్నలు   అడుగుతా మీరు చెప్పేయాలి అంతే !
  1.  "నవ్వడం ఒక భోగం,నవ్వించడం ఒక యోగం.నవ్వకపోడం ఒక రోగం "  అన్నది  ఎవరు ? 
  2.  "పడమటి సంధ్యారాగం ,  శ్రీవారికి ప్రేమలేఖ ,  మల్లెపందరి ,  అహ నా పెళ్ళంట ,   వివాహ         భోజనంబు ,  చంటబ్బాయి ,  రెండు రెళ్ళు ఆరు "   ఈ పేర్లన్నీ  చదువుతుంటే  మీకు కామన్ గా        గుర్తొస్తున్న   వ్యక్తి ఎవరు ?
  3. సుత్తివేలు , సుత్తి వీరభద్రరావు , బ్రహ్మానందం , శ్రీలక్ష్మి  వీళ్ళని మనకు దగ్గర గా పరిచయం    చేసిన   వ్యక్తి  ఎవరు ?
నాకు  తెలుసు  మీరు  మహా షార్ప్  కదా బేసిక్ గా  అందుకే ఈజీ పట్టేశారు  ఆన్సర్  :))   యెస్   మీరు అనుకున్నట్లు నేను మాట్లాడుతుంది   హాస్య బ్రహ్మ గా  పేరు  పొందిన   జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించే . ఇప్పుడు అర్జెంటు గా ఎందుకు అంటే ?   జంధ్యాల  గారి  గురించి  మనకు తెలియని విషయాలు  తెలుసుకోవటానికి అలాగే మనకు తెలిసింది  పంచుకోవటానికి  , మన తెలుగు బ్లాగరు  మిత్రులు  కొంతమంది  కలిసి  ఒక చిన్న ప్రయత్నం మొదలు పెట్టారు . అదే  జంధ్యావందనం అనే  ఈ సైటు .  మీకు తీరిక ఉన్నప్పుడు  ఒకసారి  వారి ప్రయత్నాన్ని  అభినందిస్తారు  అని నా ఈ చిరు పరిచయం .

అలాగే నా బ్లాగులో  కుడి వైపున ఒక బాడ్జీ  కనపడుతుంది  చూడండి "జంధ్యావందనం " అని అలాంటివి మీరు కూడా వీలయితే  మీ బ్లాగులో పెడితే  మీకు చదివే వారందరూ అక్కడ కూడా ఒక చూపు చూడటానికి వీలు గా ఉంటుంది :)   మీ అభినందనలు ఆ సైట్ లో కామెంట్ గా రాయమని మనవి . 
ఈ సైటు  గురించి  ముందే తెలిసిన మిత్రులు   మీకు తెలిసిన విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే  తప్పేమీ  లేదు దీని గురించి   జంధ్యాల మార్కు  తిట్ల వర్షం నా మీద కురిపించ వద్దని మనవి .

14 comments :

రసజ్ఞ said...

హహహ ఇంత మంచి విషయాలు చెప్తే ఎందుకు తిడతాం!

Sravya Vattikuti said...

రసజ్ఞ గారు మీరెంత మంచి వారండి , తిట్టలేదు పైగా మెచ్చుకున్నారు కూడా థాంక్ యు వేరి మచ్ :)))

Chandu S said...

శ్రావ్య గారూ template మార్చారా? బాగుంది

Anonymous said...

sravya garuu, nenu mee blog lo comentadaaniki kudaratledu. kaaranamu yenti?
baadha padutoo -ennela

Sravya Vattikuti said...

చందు గారు అవునండి టెంప్లేట్ మార్చాను థాంక్స్ మీకు నచ్చినందుకు :))
ఎన్నెల గారు కామెంట్ పెట్టలేకపోతున్నారా , మీ జిమెయిల్ ID తోనా , కామెంట్ బాక్స్ సెట్టింగ్ మర్చిచూస్తాను ఉండండి !

KumarN said...

A laudable effort. Great work.
Thanks

Narayana said...

మీరు ప్రకటనకు రెండు రొజుల ముందుగా నేను ఆ బ్లాగు చూసాను. కాని మీ ప్రకటన ఆ సైట్ కి ముందు మాటలా ఉంది. మీ బ్లాగు మొదటి సారి చూస్తున్నాను. మీ బ్లాగు బాగోలేదన్న వాన్ని బాకుతొ పొడుస్తా..... (జంధ్యాల గారి స్టైల్లో )

Sravya Vattikuti said...

కుమార్ గారు :)))
చాణుక్య నాకు తెలుసు మీ లాంటి వాళ్ళు ఇలా అంటారు అని , అందుకే కామెంట్లు అక్కడ అని చెప్పా :)))
నారాయణ గారు థాంక్ యు వేరి మచ్ , మరీ పోడిచేస్తే కేసు అవుతుందేమోనండి :)))

ఎందుకో ? ఏమో ! said...

thanks for the link

"telugammayi" garu

the way ur presentation is also good.

?!

Sravya Vattikuti said...

ఎందుకో ఏమో గారు థాంక్ యు !

kiran said...

శ్రావ్య గారు...మరేమో మీరు ఆ మార్కు తిట్లు మా మీద ఉపయోగిస్తారేమో అని ఆ సైట్ గురించి తెలిసిన మరో సారి వెళ్లాను..:P
కాని చాలా చక్కటి పని చేస్తున్నారు...నా లాంటి వాళ్ళకి చాలా ఉపయోగకరం... :)
బై ది వే ..మీ టెంప్లేట్ క్యూట్ ఉంది...:)...అండ్ టెస్టి లాగ పైన మువ్వ గారు మీ గురించి రాసిన లింక్ కూడా బాగుంది :)
చాలా రోజుల తర్వాత బ్లాగ్స్ ఓపెన్ చేశాను..సో మీ పోస్ట్ అంత కామెంట్ పెట్టాను..తిట్టుకోకండోయ్..:)

Sravya Vattikuti said...

కిరణ్ హ హ భయపడి ఆ సైట్ కి వెళ్లి చూసొచ్చారా ???:)))
టెంప్లేట్, లింక్ , ఇంకా పోస్టు నచ్చినందుకు బిగ్ థాంక్స్ :))) తిట్టడం ఎందుకు హ్యాపీ కామెంట్ చూసి .

Anonymous said...

మీరు తిట్టొద్దన్నారు కాబట్టి తిట్టట్లేదంతే!!!
Ennela

Sravya Vattikuti said...

హ హ ఎన్నెల గారు థాంక్ యు !

Post a Comment