నాకు అప్పుడప్పుడు భలే బుర్ర తొలిచే అనుమానాలు వస్తుంటాయి . అవి అర్జెంటు గా ఎక్కడో ఒక చోట గీకేయకపోతే అస్సలు అన్నం , నిద్ర వంటి వాటికి దూరం కావాల్సి వస్తుంది . అందుకే ఎక్కడ గీకేద్దమా అని చూస్తుంటే, పాపం ఇదుగో నేనున్నాను అంటూ నా బ్లాగు దొరికింది అందుకే ఇక్కడ గీకేస్తున్నా .
ఇంతకీ అనుమానం ఏంటంటే
అదుగో అప్పుడెప్పుడో MF హుస్సేన్ గీసిన బొమ్మల మీద జనాలు విరుచుకు పడ్డారు అని గగ్గోలు పెట్టె మన మానవతావాదులు , కళాభిమానులు , అత్యంత దయార్ధ్ర హృదయులు అయిన వార్తా విశ్లేషకులు , కానీ వారికి నేను సైతం అంటూ మద్దతు పలికే వారు గానీ , టన్నులు టన్నులు కామెంట్లు రాసేవారు గానీ సల్మాన్ రష్దీ గురించి , జైపూర్ లిటరసీ ఫెస్టివల్ లో జరుగుతున్న విశేషాలు గురించి , మైనారిటీ ఓట్లు కోసం ప్రభుత్వం పడుతున్న పాట్లు గురించి మాట్లడరేంటి అని .
నాకు తోచిన సమాధానం ఇది :
హిందువుల మనోభావాలు దెబ్బ తింటే వాళ్ళు చేసేముంటుంది , పైగా అటువంటి వాటిని ఖండిస్తే మంచి లౌకికవాది అన్న పేరొస్తుంది గాని . అదే ఈ విషయం లో ఏదన్నా నోరు జారితే వీళ్ళ తలలకి కూడా విలువ కట్టేస్తారు అన్న భయమేమో అని నాకు చిన్న అనుమానం . ఒక వేళ ఇదే కారణం ఐతే అర్ధం చేసుకోగలిగినదే ముందు ముందు బోలెడు వార్తలు వండి వార్చాలంటే వీళ్ళ తలలు ముఖ్యం కదా . ఆ ఉద్దేశ్యం తో కొంచెం రెస్టు తీసుకొని ఈ పరిస్తితులన్నీ చక్కబడ్డకా మళ్ళీ బురద పోయటం స్టార్ట్ చేస్తే బావుంటుంది అని ఆలోచనేమో . తెలివైన ఆలోచన కదా .
ఇది కాకుండా మీకు ఇంకేమన్నా కారణాలు తోస్తే నాకు చెప్పటం మరిచిపోకండే !
ఇంకో విషయం ఉండదోయ్ , ఇక్కడ చూడండి ఇరాన్ ప్రోగ్రామర్ కి death sentense confrm చేసిన వార్త కూడా ఎందుకో అస్సలు తెలియదనుకుంటా ఈ మానవతావాదులకి
అమ్మయ్య ఇక్కడ గీకేసా కదా, ఇక వెళ్లి అసలే ఇవాళ చైనీస్ న్యూ ఇయర్ మొదటి రోజు కాబట్టి చీపురు ని వాడకూదట , ఇల్లు తుడవకూడదట . నేనా పెద్ద మేధావి నీ కాదు, ఇంకా ఎవరి సంప్రదాయనైనా గౌరవించాలి అన్న అజ్ఞానం లో కూడా మునిగి తేలుతున్నా కాబట్టి మా ఇంటి ఓనర్ చెప్పిన మాట ప్రకారం ఎటువంటి పనీ పెట్టుకోకుండా ఒక కునుకు తీస్తా .
23 comments :
Gong Xi fa cai
సైనాలో కూడా సీపుర్లే వాడతారా? వాక్యూమ్క్లీనర్లు గట్రా ఇంకా రాలేదా సింగపూర్‌లో?
ఇంతకీ సల్మాన్రష్దీకి ఏమయింది? ఇసయం కుసింత ఇవరిస్తే ఏదో ఒకటి కూస్తాం..
శ్రీరామ్ గారు Xin Nian Kuai Le !
Hong Bao Na Lai :-))
పని మనిషి రాని రోజున మేము చైనీస్ న్యూ యియర్ చేసుకుంటాము.
అదేమిటీ, మానవతా వాదిని నేను ఇక్కడికి వచ్చేశాను? తప్పుకోండి, తప్పుకోండి.
ఇలాంటి డవుట్లు మీకు రాకూడదు. వస్తే మీరు మతతత్వ వాది అయిపోగల్రు జాగర్త. కాకపోతే, నేనాల్రెడీ ఆర్.ఎస్.ఎస్ వాదినని కొంత మంది గొప్పోళ్ళు డిసైడ్ చేసారు కాబట్టి, నాకు తెలిసిన ఓ చిన్న విషయం చెబుతాను ..
మానవతా వాదం అనే పదాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అలానే లౌకిక వాదం అనే పదాన్ని కూడా. మెజారిటీలకు సపోర్టుగా మాట్లాడడం మతత్వ వాదమయినట్లు.... మైనారిటీలకు సపోర్టుగా మాట్లాడడం, మెజారిటీల మీద విరుచుకు పడడం, మైనారిటీలను పొరపాటున విమర్శించాల్సి వస్తే వ్యూహాత్మక మౌనం పాటించడం, ఎవరన్నా నిలదీసి అడిగినప్పుడు నేను మెజారిటీలను, మైనారిటీలను ఇద్దరినీ విమర్సిస్తాను అని నిరూపించడానికి ఇలాంటి వాటిని "ఒక్క లైనులో" ఖండించేసి, యధావిధిగా తమ మైనారిటీ వాదాన్ని కొనసాగించడం .. ఇలాంటివన్నీ కలిస్తేనే అది మానవతా వాదం, లౌకిక వాదం అవుతాయి.
చాణుక్య ఏది వాడినా అసలు base class అదే కదా అందుకని అన్నిటి కి రెస్టే !
జైపూర్ లో జరుగుతున్నా లిటరిసీ ఫెస్టివల్ కి సల్మాన్ రష్దీ అటెండ్ అవ్వాలనున్నారు. సాటానిక్ వర్సెస్ గురించి తెలిసే ఉంటుంది మీకు ఆ వివాదం కారణం గా ఆయన జైపూర్ వస్తే మాఫియా వల్ల ఆయన తో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొనే ఇతర రచయితల ప్రాణాలకు ముప్పు అన్న intelligence సమాచారం తో అయన తన పర్యటనను రద్దు చేసుకొన్నారు. ఇప్పుడు అసలు intelligence కి అటువంటి సమాచారం ఏదీ లేదని , అయన పర్యటనను ఆపడానికి సృష్టించిన కధనం అని వినికిడి . పైగా అయన పుస్తకాన్ని చదివి వినిపించిన నలుగురు రచయితలని కూడా ఆ సమావేశం నుంచి బహిష్కరించారని కూడా వార్తలు . దీనికి కారణం త్వరలో జరగబోతున్న రాజస్తాన్ ఎన్నికలు అని కూడా వినికిడి .
బులుసు మాష్టారు హ హ భలే ఐడియా :)))
శ్రీకాంత్ గారు కరెక్టు గా చెప్పారు !
మీరు ఇలాంటివన్నీ అడుగుతున్నారంటే మీరు తప్పకుండా కార్పొరేట్ హిందుత్వ వాది అయి ఉంటారు..
కికికి ఎవడో వచ్చే అనేలోపు నేనే అనేశా... :D
b/n నిన్న పాతబస్తీ ఒవైసీ ఏకంగా సల్మాన్ రష్డీ ని అరెస్ట్ చేయాలన్నాడు.. దానికి కూడా మన సమాధానం "మౌనమే"
చాణుక్య మీకు తెలుగు బ్లాగుల నీళ్ళు పడ్డాయి ఇక మీలోని లౌకికవాదికి తిరుగులేదు :)))
కార్తీక్ చూసానండి ఆయన డిమాండ్ మన వాళ్ళకి ఇప్పటికిప్పుడు చెవుడు , గుడ్డి వచ్చేసి ఉంటాయి కాబట్టి ఇలాంటివి వినపడవు , కనపడవు :))
మీరు తప్పకుండా కార్పొరేట్ హిందుత్వ వాది అయి ఉంటారు
===========================
హ హ అయ్యే ఉండొచ్చు :)))
కారణం..అక్కడెక్కడో చెప్పారు కదండి.. ఈ దేశం 15% ముస్లిం మెజారిటీ దేశం..!
అందులో 80% మంది మైనారిటీ హిందువులు ఉంటున్నారని..!
ఇవాళ, పాపం దర్శకుడు పూరీ జగన్నాధ్ కూడా ఎంతో బాధపడ్డాడు. మనోభావాలు భారతదేశంలోనే ఎక్కువగా గాయపడుతున్నాయని..! (భజరంగదళంవాళ్ళూ, మహిళాసంఘాలు బిజినెస్ మేన్ సినిమాలోని పాటలపై కేసు వెయ్యడం దీని నేపధ్యం)
హిందు ఉగ్రవాదం నశించాలి...! హిందువుల మనోభావాలు కూడా నశించాలి..!
హుస్సేన్ పక్కోల్ల దేవుడి, దేవతల బొమ్మలు కించపరిచే విధం గా వేసారు .. వాళ్ళలో అనైఖ్యత కారణం గా కొంత మందే నిరసన తెలియజేసారు, దాంతో మానవతా వాదులు, మేధావులు తమ లౌకిక వాదాన్ని నిరుపించుకున్నారు...
సల్మాన్ రష్దీ గారేమో మానవతా వాదుల దేవుడినే కించపరిచాడు.. అందుకు మానవతావాదులకు కోపం... మానవతవాదులే మనదేశం లో ఓటర్లు, మనవతవాదులే చెప్పిందే రాజ్యాంగం, వాళ్ళ పరిరక్షనకే మన నాయకులూ ప్రయత్నిస్తున్నారు.. ఇక మనం ఏం చేస్తాం... :( గత పది సంవత్సరాలుగా మన దేశాన్ని కూడా మానవతావాదులే పరిపాలిస్తున్నారు... :((
గత నెల రోజులుగా మా ఇంట్లో చైనీస్ న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేస్తున్నాం... మీరు ఒక్క రోజేనా? ఇది దారుణం... ప్రపంచానికి అధిక జనాభాని అందిస్తున్న దేశానికీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నా... హ హ... :)))
వామన గీత గారు అంతే గాయపడే వాళ్ళ మనోభావాలు నశించాలి :)))
ఫోటాన్ కరెక్టు గా చెప్పారు ! హ హ నెల రోజుల నుంచి సెలెబ్రేట్ చేస్తున్నారా , పాపం బాబోయ్ ఒక్కసారి మీ celebration మూడ్ లోంచి బయటకొచ్చాకా ఆ చీపురు పరిస్తితి ఏంటా అని :)))
శ్రావ్యా మీరు మారాలి. చైనీయుల నూతన సంవత్సరాన్ని జరుపుకునే అభ్యుదయ భావాలు కలిగిన మీరే రేపటి మన సమ సమాజ నిర్మాత. అటువంటి మీకు ఇటువంటి అనుమానం కలగడం శోభస్కరం కాదు. సాక్షాతూ హుస్సేను గారే హిందువులకి ఉన్నంత సహనం ఇతరులకి లేదు అందుకే వాళ్ళ బొమ్మలు ఒళ్ళంతా బట్టలు కట్టి గీస్తాను అని సెలవిచ్చినప్పుడు ఆయనని ఆదర్శంగా తీసుకోవాలి. అంతే కానీ ఇలా మనమెందుకు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నామో బైటికి నిజాలు చెప్పెయ్యకూడదు. ఒక మతాన్నీ, ఆ సనాతన ధర్మాన్నీ పాటించేవాళ్ళని, ఒక రెండు మూడు దేశాలనీ చీల్చి చెండాడే క్రమంలో ఇలాంటి అడ్డంకులు ఎన్నో వస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకుంటే మనం అభ్యుదయవాదులం కాజాలము. కాబట్టి మీరు మారాలి. ఇంకో విషయం మీకు గుర్తు చేస్తున్నాను. MF hussain లో MF అనేవి బైటికి చెప్పుకోలేని బూతు పదాలు. హుస్సేను గారికి కూడా తెలీదు ఆ విషయం. పాపం ఈ లోకంలో లేడు కాబట్టి ఆ విషయం మనం ఆయనకి చెప్పలేం. కానీ మీరలాంటి పదాలు వాడకూడదు. అది మీకు శోభించదు. నా మాట వినండి. ఒక వైపు చైనీయుల నూతన సంవత్సరం పాటిస్తూ మరోవైపు ఒక భావజాలాన్ని సమర్ధించే మితృలని మీరిలా ప్రశ్నించటం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. నా మద్దతు మీకెప్పుడూ ఉంటుంది. కానీ ఇలా బావి నిర్మాతలని వేలెత్తి చూపే విషయంలో మీకు నా మద్దతు ఉండదు. మీరది తెలుసుకోండి. ఇలా ప్రశ్నించకుండా సమాజాన్ని మరింత కలుషితం చేసే క్రమంలో మొదటి అడుగు మీదే ఎందుకు కాకూడదు?
/ఇప్పుడు అసలు intelligence కి అటువంటి సమాచారం ఏదీ లేదని , అయన పర్యటనను ఆపడానికి సృష్టించిన కధనం అని వినికిడి /
రష్దీ రాసిన పుస్తకం చట్టబద్ధంగా నిషేధించబడింది. మరి అందులోని భావాలను పబ్లిక్‌గా అనుమతించడం చట్ట రీత్యా నేరం అవుతుంది. అందులోనూ ప్రభుత్వం నిషేధం ఎత్తివేయకుండా ఎలా అనుమతిస్తుంది? అనేది టెక్నికల్ పాయింట్ అనేది మీరు గుర్తించాలి. అందులోనూ ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం intelligence ఏమో గాని natural stupidity అవుతుంది కూడా.
ఇక పోతే intelligence నివేదిక. ఇది పుట్టించడానికి పెద్ద intelligence అవసరం లేదు. తన intelligence వర్గాలు కూడా ఎవరో కిరాయి హంతకులు తనకోసం వినియోగించారని రష్డి గారే సదరు పండుగకి స4రోజుల క్రితం కేక పెట్టారు. మరి ఎవరిది intelligence, ఇందులో stupidity పాలు ఎంత? అని తెలుసుకోవడానికి time-pass మానవతా లౌకిక వాదులు గోచీలు బిగించాల్సిన అవసరం ఎంతైనా వుందని, వచ్చే ఎన్నికల వరకూ దీనిపై చర్చలు సాగిస్తూ వుండే అవసరం ఎంతైనా వుందని విన్నవించడమైనది.
MF అనేది 'మానవతా ఫెలో' పైన చెప్పిన భావ వైశాల్యముగల time-pass మానవతా వాదులందరూ గర్వించదగ్గ ఫెలోషిప్, ఇందులో బూతేమిటో అర్థం కాలేదు. పద్మ గారితో కేటగోరికల్గా విభేధించే చారిత్రాత్మిక తప్పిదం తెలిసి చేస్తున్నందుకు చింతిస్తున్నాను.
పద్మ గారు హ హ :))) కాకపోతే మీ కామెంట్ context అర్ధం కాక శంకర్ గారి లాంటి వాళ్ళకి కొంచెం confusing గా ఉందనుకుంటాను :)))
శంకర్ గారు రష్దీ చేసినా , హుస్సేన్ చేసినా అదే స్టుపిడ్ పనేనని నా ఉద్దేశ్యం అండి. కాకపొతే హుస్సేన్ చేసింది చాలా కరెక్టు , ఆయనకి భారతరత్న సైతం ఇవ్వాలి అని వాదించే మన మేధావులు రష్దీ విషయం లో ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని నా సందేహం :))
ఇక ఇందులో బూతేమిటో అర్థం కాలేదు
--------------------------------
ఆ అర్ధం భరద్వాజ్ గారి ప్రియ మిత్రుడు చెప్పారండి , ఆయన చెప్పేవరకు అలా కూడా ఆలోచించొచ్చు అని ఎవరికీ తెలియదు :)))
శంకర్ గారూ, (చెయ్యి మొరాయిస్తోంది)
మీరు అభ్యుదయవాది కానందుకు చింతిస్తున్నాను. మీరే నవసమాజ నిర్మాత అయి ఉంటే మీకు MF లో బూతు స్పష్టంగా తెలిసేది. అబ్బే, మీరు మా భావజాలానికి చెందరు, చెందబోరు. మా భావజాలానికి చెందనివారు మాకు ఆమోదయోగ్యులు కారు. వారితో మేము సంభాషించము. కాబట్టి మీరిక ఇటువైపు రాకండి.
:))))))))))))))))))))))))))))))))))
హేం జరిగిందంటే ఆ మధ్య అక్కడెక్కడో ఓ మోస్తరు చర్చ జరిగిందిలెండి. ఆ సంభాషణ తాలూకు ఎఫెక్ట్ అన్నమాట. ఆ చర్చా సమయంలోనే MFకి అద్భుతమైన అర్థం తెలిసింది. పాపం MFవాళ్ళ వాళ్ళు ఎంత అల్లాడిపోయుంటారో ఇలాంటి అర్థం కలిగిన పేరు పెట్టారని తెలిసి.
శ్రావ్య గారన్నట్టు, ఈ మధ్య నెట్ మీద రావడం తగ్గించాక బ్లాగ్విషయ పరిజ్ఞానం తక్కువవుతోంది. :) నేనే పొరపాటు పడి వుంటాను. శ్రావ్య గారు, మీ ద్వీపంలో flower show జరిగిందటగా, వెళ్ళారా? ఫోటోలతో ఓ మంచి పోస్ట్ వేసేయండి.
మీ విశ్లేషణపై నాకు నమ్మకముంది. ఇప్పటి దానికీ, మున్ముందు చేసే చారిత్రిక తప్పిదాలకు గాలిలో కాల్పులు జరిపినట్టు ఓ 24రౌండ్లు ముందస్తు క్షమాపణలు తీసేసుకుంటున్నా.
/శంకర్ గారూ, (చెయ్యి మొరాయిస్తోంది)/
చలికాలం, అలానే చేయి మొరాయిస్తుంటుంది. అలానే నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే సర్దుకుంటుంది, బాగా ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాల(మ్మీ తుచ్.. )అమ్మాయ్ గారు :))
హ హ శంకర్ గారు భలే వారు , దీనికి క్షమాపణలు ఎందుకండీ :))) ఇంతకీ ఫ్లవర్ షో కి వెళ్ళలేదండి :(((
మావతా వాదులను ప్రశ్నించటం ద్వారా మీరు వారి హక్కులకు భంగం కలిగించారు. ఈ టపా రాయటం ద్వారా మీలోని అతివాద హిందుత్వ ధోరణిని భయట పెట్టుకున్నారు.
@కార్తిక్ మీరు మీ అభిజాత్యాన్ని చూపిస్తున్నారు
హమ్మయ్య ఇద్దరినీ ఖండించేసా నేనూ మానవతావాదిని
హ హ చైతన్య మీరు అసలు సిసలు మానవతావాది :)
>>>సల్మాన్ రష్దీ గురించి , జైపూర్ లిటరసీ ఫెస్టివల్ లో జరుగుతున్న విశేషాలు గురించి , మైనారిటీ ఓట్లు కోసం ప్రభుత్వం పడుతున్న పాట్లు గురించి మాట్లడరేంటి అని .
వీడు తోకలో ఈకలాంటోడు అని మానవాతవాదులు క్షమించేసారు
Chetan bhagat Stale the show :P
హరేకృష్ణ హ హ అవును :-))
Post a Comment