ఆలో ఆలో టెకీస్ ఆ టైటిల్ చూసి ఏ సర్వర్ కో కనెక్ట్ అయ్యిపోకుండా మామూలు ప్రపంచం లోకి రండి . నేను మాట్లాడేది మన మామూలు జీవితం లో కొన్ని సోషల్ రిలేషన్ షిప్స్ , హాబీలు వగైరా వగైరా నుంచి నుండి తప్పనిసరి అనిపించినప్పుడు గ్రేస్‌ఫుల్ గా పక్కకు తప్పుకోవటం గురించి . మరి ఆ టైటిల్ ఎందుకు అంటే, క్యాచీ గా ఉంటుంది అని తెలుగు దర్శకుల బాట పట్టా :)
అసలు ఏదన్నా రిలేషన్ షిప్స్ , హాబీలు వీటి నుంచి పక్కకి ఎందుకు వెళ్ళాలి అని ఎవరన్నా అయోమయం గా నావైపు చూస్తుంటే వాళ్ళకి నా సమాధానం మీరు ఇప్పటి వరకు అదృష్టవంతులు infront there is crocodile festival అని అన్న మాట . నీ KJ లు ఆపి సరిగ్గా చెప్పవమ్మా ఆంటే ఏముందండి మన బుర్ర లో తోచే ఆలోచనలు ఇవాళ ఉన్నట్లు రేపు ఉండకపోవచ్చు, లేదు తప్పనిసరి గా మన జీవితం లో వచ్చే మార్పులకి అనుకూలం గా మారాల్సి రావచ్చు . కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్లు దీనికి కూడా బోలెడు కారణాలు అన్నమాట.
సరే ఇక ఎలాగు తప్పదు అని మనకి తెలిసినప్పుడు దాని నుంచి బయటపడాలి కదా, అదే కొంచెం అందంగా చేస్తే మనకి, మనతో పాటుగా ఇన్నాళ్ళు ఉన్నవాళ్ళకి కొంచెం బాధ తగ్గుతుంది . మన హాబీ లేదా అలవాటు నుంచి బయటికి రావాలి అంటె ఎదుటి వారికి ఎందుకు చెప్పాలి అంటారా ? చెప్పాలి ఎందుకంటే మనం మన ఆనందం కోసం చేసిన ప్రయత్నాలలో కొద్దో గొప్పో ఎదుటి ప్రమేయం లేకుండా ఉండదు, దానితో మనకు తెలియకుండానే వాళ్ళు మన కోసం వాళ్ళ టైం ని , లేదా వాళ్ళ ఆలోచనలని మన కోసం ఖర్చు పెట్టి ఉండొచ్చు . దానికి గౌరవం , విలువ ఇవ్వాలి కదా ? ఉదాహరణకి రోజూ ఏ టేన్నిసో, కారంస్ లాంటి ఆటలు, లేదా టైం పాస్ ముచ్చట్లుకో ఒక గుంపుతో కలుస్తున్నారు అనుకోండి రేపటి నుంచి మీకు వీలవక మానేద్దాం అనుకున్నారు ఆ గుంపులోని వారికి ఒక ముక్క చెప్పటం మర్యాద . తొక్కలే ఎదుటి వాళ్ళు ఏమైతే నాకేంటి నేను నాకు ముఖ్యం అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏమి లేదు , మీ ఇష్టం . కానైతే ప్రోపబిలిటీ ప్రకారం ఎక్కడో ఒక చోట మీకు ఇదే పరిస్తితి ఎదురవటం లో మీకు మీరే సాయం చేసుకుంటున్నారు అని చెప్పటం తప్ప. ఇలా చెప్పటంలోఇంకొక లాభం కూడా ఉందండోయ్ . నలుగురికి చెప్పి మానేశాము అనుకోండి, రేపెప్పుడో మనస్సు మాట వినక అటువైపే లాగేస్తుంటే ఎదుటి వాళ్ళు మానేస్తానన్నావు గా అడుగుతారేమో అన్న భయం తో నన్న అటు వెళ్ళం, కాదంటారా ?
ఆ తరవాత మీరు ఒదిలేసిన అలవాటునో, వ్యక్తుల గురించో చెడు గా చెప్పటం అనేది అస్సలు చేయకూడని పని . ఇదే విషయం మనం ఉద్యోగ రీత్యా మారిన వదిలేసిన కంపెనీలకి , ఉద్యోగాలకి కూడా వరిస్తుంది . వీటిని కించపరిస్తే మీ గతాన్ని మీరు కించపర్చుకున్నట్లు కానీ వేరేవరినో కాదు .
అలవాట్లు అంటె మనకు ఫిజికల్‌గా కనపడవు కాబట్టి పర్వాలేదు, కానీ వ్యక్తుల విషయంలో మనకు ఏదో ఒక సందర్భం లో ఎదురుపడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కేవలం వాళ్ళు నొచ్చుకోవటానికి మాత్రం ఇప్పుడు మనతో ఉన్న వాళ్ళ గొప్పతనం గురించి ఊదరగొడుతూ లేని పోనీ సూటిపోటీ మాటలు విసరటం లాంటి పనులకి దిగకపోతే గౌరవంగా ఉంటుంది .
ఇందంతా కాదు మిమ్మల్నే ఒకవేళ అవతలివారు ఏదో విధంగా యవాయిడ్ చేయటానికి ప్రయతిస్తున్నారు అంటె, ఒకటి రెండు సార్లు వాళ్ళతో మాట్లాడాటానికి ప్రయత్నం చేయండి, మీరేంటో అవతలి వాళ్ళకి నిజాయితీగా తెలియజెప్పే ప్రయత్నం చేయండి . అవతలి వాళ్ళు మీ ప్రయత్నాన్ని ప్రతిసారి లోకువ గా తీసుకుంటుంటే మీకు వెన్నుముక ఉంది అని గుర్తు చేసుకోండి forced shutdown చేయండి. అంతటితో ఆ కథకి ఖచ్చితమైన fullstop పెట్టేయండి. (అంటె మూడో వ్యక్తీ దగ్గర వీరి ప్రసక్తిని ఎత్తి లేని పోనీ విమర్శలు చేసి మీ విలువ తగ్గించుకోకండి .) .
ఖచ్చితం గా చెప్పాలి అంటె మన ప్లస్సులో బ్లాక్ ఆప్షన్ మాదిరి అన్నమాట (అంటె మీ రాతలు వాళ్లకి కనపడవు, వాళ్ళ రాతలు మీకు కనపడవు కదా అలా) . ఈ దెబ్బ కి మీరు మీ మూడ్ ఖరాబు చేసుకొని బి పి పెంచుకునే బాధ తప్పుతుంది .
పైదంతా చదివి ఇప్పుడు ఈ సోది అంతా ఎందుమ్మాయి అన్న ప్రశ్న మీ మనస్సులో కి రావొచ్చు తప్పు లేదు , దానికి నా సమాధానం . రేపో మాపో Feb 14 వస్తుంది కదా , మొత్తం ప్రపంచానంత ప్రేమించేయమని అందరూ చెబుతారు కానీ ఒకవేళ విడిపోవాల్సి వస్తే ఏమి చేయాలో ఒక్క రవీయం లో బ్లాగులో చదివితే మాత్రమే మీకు తెలుస్తుంది అన్న మాట ( నాకు తెలుసు ఈ మాత్రం సోది మాకు తెలుసు అని మీరు తిట్టే తిట్లు, అవి ఆపేసి ఒక కామెంట్ పెట్టి relax ఆవ్వండి :-))
P.S.అసలు సంగతి చెప్పటం మర్చిపోయా నేను పైన రాసినది సోషల్ రిలేషన్ షిప్స్ గురించి మాత్రమే , ఫ్యామిలీ రిలేషన్ షిప్స్ గురించి కాదు .
27 comments :
( నాకు తెలుసు ఈ మాత్రం సోది మాకు తెలుసు అని మీరు తిట్టే తిట్లు, అవి ఆపేసి ఒక కామెంట్ పెట్టి relax ఆవ్వండి :))
RELAXXXXXXXXX :))))))))
@@ సరే ఇక ఎలాగు తప్పదు అని మనకి తెలిసినప్పుడు దాని నుంచి బయటపడాలి కదా , అదే కొంచెం అందం గా చేస్తే మనకి , మనతో పాటు గా ఇన్నాళ్ళు ఉన్నవాళ్ళకి కొంచెం బాధ తగ్గుతుంది.
Veru well Said Sravya. Some of the points mentioned are essential for everyone to know.
బాగుంది ఆర్టికల్....ఎడోవ పార అయితే చాల బాగుంది...
Sorry It's 6th Para :-)
@శ్రీకాంత్ గారు నేను స్నేహితులు, పరిచయస్తులని ద్రుష్టి లో పెట్టుకుని రాసానండి కానైతే ఏదో సందర్భం వచ్చింది కదా అని Feb . 14 ని వాడేసాను :) థాంక్ యు !
@భరద్వాజ్ గారు హ హ , అంటే మీరు తిట్టేసారన్న మాట :))
@పద్మవల్లి గారు కొద్ది లో కొద్ది బాధ తగ్గుతుంది కదా , థాంక్ యు :)))
@శేఖర్ గారు ఐతే మీకు ఫైనల్ గా ఆరవ పేరా నచ్చిందంటారా థాంక్ యు :)))
యధాప్రకారం బాగా రాసావ్ అదీ సంగతి(అనుకుంటాం కానీ అన్నీ మనచేతిలో ఉంటాయా చెప్పు)
>> రేపటి నుంచి మీకు వీలవక మానేద్దాం అనుకున్నారు ఆ గుంపులోని వారికి ఒక ముక్క చెప్పటం మర్యాద.
నేను పాటించాలి ఇది ;)
ఇంకా నాకు నచ్చిన పాయింట్లు..
>>మిమ్మల్నే ఒకవేళ అవతలి వారు ఏదో విధం గా మిమ్మల్ని యవాయిడ్ చేయటానికి ప్రయతిస్తున్నారు అంటె ఒకటి రెండు సార్లు వాళ్ళతో మాట్లాడాటానికి ప్రయత్నం చేయండి , మీరేంటో అవతలి వాళ్ళకి నిజాయితీ గా తెలియజెప్పే ప్రయత్నం చేయండి . అవతలి వాళ్ళు మీ ప్రయత్నాన్ని ప్రతిసారి లోకువ గా తీసుకుంటుంటే మీకు వెన్నుముక ఉంది అని గుర్తు చేసుకోండి forced shutdown చేయండి
---forced shutdown కొంచెం కష్టమే కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తప్పదేమో..
అంతటితో ఆ కథ కి ఖచ్చితమైన fullstop (అంటె మూడో వ్యక్తీ దగ్గర వీరి ప్రసక్తిని ఎత్తి లేని పోనీ విమర్శలు చేసి మీ విలువ తగ్గించుకోకండి .) పెట్టేయండి .
హ్మ్మ్....
మీరు ఒదిలేసిన అలవాటునో, వ్యక్తుల గురించో చెడు గా చెప్పటం అనేది అస్సలు చేయకూడని పని. వీటిని కించపరిస్తే మీ గతాన్ని మీరు కించపర్చుకున్నట్లు కానీ వేరేవరినో కాదు .
well said :)
హ్మ్మ్.. nice post andee ;)
>>>ఒకవేళ అవతలి వారు ఏదో విధం గా మిమ్మల్ని యవాయిడ్ చేయటానికి ప్రయతిస్తున్నారు అంటె ఒకటి రెండు సార్లు వాళ్ళతో మాట్లాడాటానికి ప్రయత్నం చేయండి.....
అపార్ధం చేసుకొని ఎవరో మనల్ని యవాయిడ్ చేస్తే వాళ్ళకి సంజాయిషీ ఇచ్చుకోవాలంటారా? నేను ఒప్పుకోను. మళ్ళీ వాళ్ళు సపార్ధం (అపార్ధానికి ఆపోజిట్ అన్నమాట) చేసుకొన్నా నాలుగు తిట్టి కానీ దగ్గరకు రానీయను.రాముడు మంచి బాలుడు లాగా ఉండడం కష్టమేమో అన్ని విషయాలలో. ...... దహా.
చాలా చాల బాగుంది శ్రావ్యా మంచి విషయం గురించి చెప్పారు... గ్రేస్ ఫుల్ షట్ డౌన్ చాలాముఖ్యం, మీరు చెప్పిన విషయాలు తప్పక పాటించవలసినవి.
>>చేసుకొన్నా నాలుగు తిట్టి కానీ దగ్గరకు రానీయను.
గురువు గారూ,
ఈ సూత్రం ఇలియానాకు కూడా వర్తిస్తుందా?? :P
(j/k)
శ్రావ్య గారూ,
మీ రాసిన విషయం గురించి చెప్పడానికి నా దగ్గర పెద్దగా ఎమీ మిగల్లేదు.. టపాలోనూ, కామెంట్లలోనూ అందరూ చెప్పేశారు..
>>తొక్కలే ఎదుటి వాళ్ళు ఏమైతే నాకేంటి నేను నాకు ముఖ్యం అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏమి లేదు , మీ ఇష్టం .
ప్రస్తుత సమాజం లో ఈటైపు జనాభా ఎక్కువగా కనిపిస్తున్నారు కనుక మనం చెప్పేది అరణ్య రోదనగా మిగిలిపోతుందేమో..
Today relations are treated as deals, bonds and agreements.. so I wonder how many have the courtesy to say "Bye"
కార్తీక్ గారూ ... ఇలియానా గుండె గుడిలో దేవత. రూల్స్ దేవతలకి వర్తించవు...... దహా.
"అవతలి వాళ్ళు మీ ప్రయత్నాన్ని ప్రతిసారి లోకువ గా తీసుకుంటుంటే మీకు వెన్నుముక ఉంది అని గుర్తు చేసుకోండి..."
ఈ పాయింట్ చాలా బావుంది శ్రావ్యగారూ !! ఎన్నాళ్ళైనా నేను నేర్చుకోలేకపోతున్నది ఇదే మరి...:(((
Well said Shravya -:)
Good one.. I hear you Sravya! :)
chala chakkaga vishayaanni chepparu...
@పప్పు సారూ అన్నీ మన చేతిలో ఉండవు కానీ మన ప్రయత్నం చేయాలి కాదా ? కాదంటారా ?:))
@ చాణుక్య హ హ newton థర్డ్ లా ప్రకారం తప్పాడు మరి రెడీ గా ఉండండి :)))
@రాజ్ నిజమే బాధాకరమే కానీ కొన్ని తప్పదేమో మరి :((
@బులుసు మాష్టారు అంటే చంద్రమండలాని టార్గెట్ పెడితే కనీసం డిల్లీ దాకా నన్నా పోవచ్చు కదా అని , అదన్నా మాట :))
@వేణు గారు థాంక్ యు :))
@కార్తీక్ గారు మీకు గురువు గారు సమాధానం ఇచ్చారు చూసుకున్నారా ?:)
అరణ్య రోదనగా మిగిలిపోతుందేమో
-------------------------------------------
అంతే అంటారా :((
@తృష్ణ గారు హ్మ్ మీకు ఇక ఇలా నేర్చుకోవాలి అన్న ఆలోచనే కలగకుండా గడవాలి అని కోరుకుంటున్నాను !
@కృష్ణవేణి గారు థాంక్ యు :))
@శశి గారు థాంక్ యు :))
@మధుర then Are you with me ?:P
Thank you Madhura !
Yes of course.. I'm with you lady! :)
Thanks again Madhura :)
చాలా విలువయిన విషయాలన్నిటినీ చెప్పారు! మీరు చెప్పినవన్నీ పాటిస్తే ఆ మనిషిని పూజించచ్చేమో నేటి కాలంలో! కానీ చాలా విషయాల్లో మౌనానికి మించిన ఆయుధం లేదు ఏమంటారు?
Good lesson to all of us.
రసజ్ఞ గారు ఏమంటానండి మీరు అన్న దానికి ఊ అంటాను (j/k) మీరు చెప్పింది కరెక్టు , కానైతే ఇక్కడ మనవైపు నుంచి ఒక చిన్న ఆలోచన రావచ్చు గా అని అన్నమాట థాంక్ యు :))
నిర్మల్ గారు థాంక్స్ అండి !
( నాకు తెలుసు ఈ మాత్రం సోది మాకు తెలుసు అని మీరు తిట్టే తిట్లు, అవి ఆపేసి ఒక కామెంట్ పెట్టి రెలక్ష్ ఆవ్వండి :)) >>>> నేను కామెంట్ పెట్టేసాను .. రిలాక్ష్ కూడా అవుతున్నా ..... హహహ్ శ్రావి భలే చెపావు గా కరెక్ట్ అని ఒప్పుకోక తప్పదుగా ..... సోషల్ రిలేషన్షిప్ గురించి రాసిన అన్ని పాయింట్స్ తో నేను ఏకిభవిస్తున్నా ... గుడ్ పోస్ట్ Graceful shutdown :)))))
Ekkado chadivanoo leka vinnano teledu.. Mana kante eduti valalni ishtapadamta or love cheyadam manchidi kadu.. vallu avoid cheyadam start cheste manam tattukolem ani.. yes, agree with u.. Inka elagina tappadu, vidipovali ante cheyalsinde.. no doubt, but the thing is how? In case ala start chesi vidipoyi vundagalara? For ex: Two best frds or lovers vunaru anukondi.. vallaki evo chinna godavalu leka edo vachayi like parents opukokapovadam etc, so vallu dooram avvali.. ala avadam anta easy na? In case meru annatu forced shutdown chesam anukondi, ala chesaka idharu happy ga vunte.. adi true friendship or love avutunda? I really confused in these 2 factors..
@రంజని థాంక్ యు :)))
@అనానిమస్ గారు కాలం గాయాలు మాన్పుతుంది అనేది మీరు వినే ఉంటారు . అది నిజం ! ఒకవేళ అది నిజం కాకపొతే ప్రపంచం లో ఇంత జనాభా ఉండేది కాదు .
నేను చెప్పేది మీకు కొంచెం బాధ కలిగించనా ఇది నిజం . ఇలాంటి relationship లో అయ్యో మోసపోయానే అన్న బాధ తో ఎక్కువ గా ఫీల్ అవుతుంటారు . నిజమైన friendship అంటే మనకి నచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషం గా ఉండటం అని నేను అనుకుంటానండి . మనతో ఉండటం ఎదుటి వాళ్లకి నచ్చనప్పుడు వాళ్ళ దారిన వాలని వదిలేయటం బెటర్ అనవసరమైన emotional బ్లాక్ మెయిల్స్ చేయకుండా ! ofcourse అది మొదట్లో కొంచెం బాధ గానే ఉంటుంది తరవాత అదే అలవాటు అయిపోతుంది :)))
Sravya garu, nenu chepindi edutu valu manato vundatam ishtam lekapote kadandi. Yes, manato vundatam eduti vallaki ishtam lekapote inka tappadu. Nijame, kalam anni gayalu manputundi. but aa gayam mane varaku ayye time chala painful. nenu face chesanu, face chestune vunanu. :) And nijame, nijamaina friendship or love ante, manaki nachina vallu ekkaduna happy ga vundali ani, kani ala manam valalni vadili vunnam ante adi true love avutunda anede na doubt. Meeru chepindi kooda nijame, ade nijam kakapote world lo inta mandi janabha vundaremo kada.:) emo andi life lo chala choostunanu, chala nerchukuntuna. but life lo rojuko lesson nerchukuntuna.. i think that is life anukunta :) anyhow thanks for ur reply. Srinivas
Post a Comment