Subscribe:

Monday, July 16, 2012

Dieu merci !


ఎనిమిదవుతుంది , ఇంక్కొక సెకన్ కూడా నేను ఆలోచించే శక్తి లేదు !

హ్మ్ ! చిరాకు పుడుతుంది .

ఈ ఫోన్ ఏంటో ప్రొద్దుటి నుంచి దాని దారిని వాగి వాగి అలిసి పోయినట్లుంది .. ఒక సారి  కాల్స్ మిస్సిడ్ కాల్స్ లిస్టు చెక్ చేయాలి.

తీసి చూస్తే ఒక పాతిక missed కాల్స్ . అందులో ఒక పది ఇంటి నుంచి . . అబ్బా మళ్ళీ అప్పుడే ఇంకో కాల్ , ఇక తప్పదు మాట్లాడాలి


నేను : ఏంటమ్మా అంత అర్జెంటు ఈ టైం లో

అమ్మ : ప్రొద్దుటి నుంచి అన్ని కాల్స్ చేస్తే ఒక్క దానికి సమాధానం లేదు...

నేను : అబ్బా ఇప్పుడు ఈ క్లాసు ఏంటి నాకు ? నేను బిజీ గా ఉన్నాను తరవాత చేస్తాను

అమ్మ : ఒక్క నిమషం మాట్లాడటానికి అంత విసుగెందుకు నీకు ? ఎంత పని లో ఉన్నా ఒక్క నిమషం కుదురు గా మాట్లాడలేవా ?

నేను : ప్లీజ్ నేనిప్పుడు నీ తో వాదించ లేను . నన్ను వదిలెయ్యి నేను తరవాత మాట్లాడతా .


---------------------------------


అమ్మయ్య ఈ రోజుకి పనులు తెమిలినట్లే .

హ్మ్ ఈ రోజన్నా ఫ్రెండ్ కి మెయిల్ చేయాలి అనుకున్నాను , ఇప్పుడు ఆ పని చేసి పడుకుంటే ..

ఆ అయినా ఏంటి తనకి అంత పొగరు , ఎప్పుడో విసుగు లో గొడవ పడితే మాత్రం నేనే ఎందుకు మాట్లాడాలి,  ప్రతి సారి ?

నాకేనా పట్టుదల లేంది. Let him go to hell , he deserve it !

రాయను కాక రాయను అంతే...
--------------------------------------------


ఇంకొక రోజు మొదలైంది .... ఉదయం ... మళ్ళే రొటీన్ మొదలు ...ఇక లేచి తయారయ్యి office కి వెళ్ళాలి .............

రాత్రి పడుకునే ముందు బాగా తలనొప్పి అనిపించింది . బాగా నిద్ర పోయి లేవటం వల్ల అనుకుంటా శరీరం అంతా తేలిగ్గా అనిపిస్తుంది .

అమ్మో అప్పుడే ఎనిమిదవుతుందా లేట్ అవుతుంది త్వర గా రెడీ కావాలి .

ఆశ్చర్యం ...

అమ్మా , నాన్న ఇక్కడున్నారు, అదేంటి అంతా దిగులు గా, ఎందుకు ఏడుస్తున్నట్లు గా ఉన్నారు ? అసలెప్పుడు వచ్చారు ?

ఏమి జరిగింది ? ఆ పక్కన ఏంటి అది ?

ఏంటి పిలుస్తుంటే పలకరు ? నా గొంతు వినిపించటం లేదా ? లేదూ నా మీద   కోపం తో ఉన్నారా ?

అరె వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏంటి నేనేదన్నా మర్చిపోయానా ?

 strange ..


హ ఇదేంటి ఆక్కడ ఉన్నాను నేను ... అదీ పడుకుని ఇదెలా సాధ్యం ?

నేను ఇంత గట్టి గా పిలుస్తుంటే ఎవరు పట్టించుకోరేమి ? అసలు ఏమి జరుగుతుంది ?

హ్మ్ !


నేను ..
నేను ..
నేను .. చనిపోయానా ? అక్కడ ఉంది నేనేనా ? ఇదెలా ? అందుకే ఎవరికీ నేను పిలుస్తుంటే వినిపించటం లేదా ?
నాకు అర్ధం కావటం లేదు అసలు ఇలా ఎలా జరిగింది ?


ఇప్పుడు అమ్మ , నాన్న ఎలా ?
దేవుడా వీళ్ళ బాధ నేను ఎలా చూడాలి ? ఎవరు వీళ్ళని ఓదార్చాలి?

ఒక్క నిమషం ....

అరె తను తనేనా ఇక్కడ ? అసలు ఎలా తెలిసిది తనకి ఈ విషయం ?
తన కళ్ళ వెంట నీళ్ళు ?

ఓహ్ తనని ఇలానా చూస్తాను అనుకున్నాను ? చిన్న misunderstanding ఎంత దూరం చేసింది ఇద్దరినీ . అయినా అంత పట్టుదల ఏంటి మా ఇద్దరి కి ?

ఒక్కసారి తన దగ్గర గా వెళ్లి సారీ చెప్తే ?

What the hell? పట్టించుకొడేమి ? ఇంకా అదే ఈగో నా ? ఇదే చిరాకు తెప్పిస్తుంది నాకు .

హ్మ్! కాదు కాదు నేను తనకి కనిపించటం లేదనుకుంటా ?

ఓహ్ గాడ్ నిజం గానే చనిపోయానా ?

ఇప్పుడు ఎలా ? ఏమి చేయాలి ?

నా దగ్గరికి వెళ్లి క్రింద కూర్చిండి పోయాను , ఏమి చెయ్యాలో తెలియని నిస్సహాయత !

ఎంత పెద్ద తప్పు చేసాను , కొద్ది రోజుల నుంచి ఎంత అనవసరమైన చిరాకు చూపించాను . ఒక్క సారి కూడా వాళ్ళకి తెలిసేలా చెప్పలేకపోయాను వాళ్ళని నేను ఎంత ఇష్ట పడుతున్నానో . ఇదేనా నరకం  అంటే   . ఇంత కష్టం గా ఉంటుందా ?

దేవుడా ఒక్కసారి ఒకే ఒక్కసారి

let me make my mother smile just once !
let me make to feel my dad proud on me at least for a moment
let me tell to my friend how much I liked him ...
and and

Just let me thank them for the wonderful time I had with them ..


ఒకే ఒక్కసారి ఈ అవకాశం నాకివ్వు... మళ్ళీ ఈ తప్పు చేయను నేను ..

ఇదేంటి ఇప్పుడు ఈ మ్యూజిక్ ?

ఎక్కడ నుంచి వినిస్తుంది ? బాగా తెలిసినట్లు గా ఉంది 

అది అది mission impossible థీమ్ సాంగ్ మ్యూజిక్ కదూ , ఇక్కడ ఎక్కడ నుంచి ...


ఇంత దగ్గర గా

ఏదో విడిపోతున్న భావన , అసంకల్పితం గా నా ఎడమ చేయి ఏదో వెతుకుతుంది అని తెలుస్తుంది ....

నా మెదడు ఏదో చెప్పటానికి ప్రయత్నం చేస్తుంది ..

అప్పటి కి పూర్తి గా మెలకువ రాని స్తితి .... . 

నా మెదడు చెప్తోంది నాకు అర్ధం అయ్యింది , అది చెప్పేది "యు స్టుపిడ్ కళ్ళు తెరిచి చూడు, ఫోన్ తియ్యి అని" :P

ఏమి జరిగిందో నాకు అర్ధం అయ్యింది ....:D

That was the one of the happiest moment in my life ! I really thanked the God :-)

And, yes I have learned
that I should always leave loved ones with loving words. It may be the last time I see them .



Almost everything--all external expectations, all pride, all fear of embarrassment or failure--these things just fall away in the face of death, leaving only what is truly important. Remembering that you are going to die is the best way I know to avoid the trap of thinking you have something to lose. You are already naked. There is no reason not to follow your heart. 
- Steve Jobs

Tuesday, July 3, 2012

నేను ఎవరు ?



అదో  అందమైన  హాలు !  ఈరోజేంటో మరీ హడావుడిగా ఉంది పరుగులు  తీస్తూ,  ప్రతిది  అబ్బురంగా  కళ్ళు పెద్దవి గా చేసి చూస్తున్న బుజ్జాయిలతో మరింత సందడిగా ఉంది  ఏదయినా  సెలవు రోజు  అయ్యిండొచ్చా ?  

నేను ఒక  ప్రక్కగా  నిల్చుని  ఆ తమాషాగా   ఉన్న  హాడావుడిని  చూస్తున్నా .  ఎంత హడావుడి  గా ఉన్నా  ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం అన్నా ఆగి మరీ  నన్ను  చూస్తున్నారు .  ఇందుకే    ఆ దేవుడి ఇచ్చిన అందం శాపంగా మారిందేమో అని ఒక్కోసారి  బాధ పడుతుంటాను.  నాకు  ఉదయం పని గంటలు  మొదలవుతుంటే చాలు  ఎక్కడా  లేని దిగులు  ఈ రోజు  ఎంతమంది అదే పని గా నాకేసే కన్ను  ఆర్పకుండా  చూస్తూ  మురిసిపోతుంటారో అని  .

దారుణమైన విషయం ఏమిటంటే నాఅందం తోటి స్తీల కి ఈర్ష్యగా మారి నన్ను ఈ ప్రపంచం నుంచి వేరు చేసింది . దీని కన్నా బాధ కలిగించేది అందమైన వాళ్ళకి గర్వం, స్వార్ధం ఉంటాయి అన్న భ్రమతో నాకు లేని లక్షణాలు ఆపాదించటం. ఏరోజు కారోజు ఎంత మంది మళ్ళీ మళ్ళీ ఈ మాటలు నాముందే అంటారో వద్దన్నా నా మనస్సు   లెక్కలు కట్టక మానదు ,  హ్మ్ !

అయ్యో ఎవరితను ?  అంత    తదేకం గా  చూస్తుంటే  నాకెంత  ఇబ్బందిగా ఉంటుందో   ఎలా  చెప్పాలి  తనకి ? కొంచెం అన్నా  కదలకుండా  అలాగే   విగ్రహంలా నిలబడితే  ఎవరన్నా  ఏమనుకుంటారో అని సందేహం  కూడా లేదా  ఇతనికి ?  రింగుల రింగుల  జుట్టుతో , పొడవు గా ఎంత అందం గా ఉన్నాడు  ఇతను .   అతని  చూపుల్లో  నా మీద ఉన్న ప్రేమ నాకు అర్ధం అవుతుంది,  కానీ ఆ చూపుల తాకిడికి తట్టుకోలేకపోతున్నాను.  ఏమి  చేయలేని  అసహాయత  నన్ను  పిచ్చి దాన్ని  చేస్తుంది .

సమయం  గడిచే కొద్దీ మరింత మంది జనాలతో అందమైన  హాలు మరింత   కోలాహలంగా మారింది . ఇతను  మాత్రం  వచ్చీ పోయే  జనాల విసుగుని పట్టించుకోను  కూడా పట్టించుకోవటం  లేదు, నా నుంచి  ద్రుష్టి  మరల్చటం లేదు . నా ఇబ్బంది కాస్తా  భయం  గా మారింది .  నా  చుట్టూ  ఉన్న జనసందోహం  ఈభయం నుంచి  కొద్దిగా  ఊరట కలిగిస్తుంది .

సాయంత్రం అయ్యింది , నా ఆలోచనలలో పడి అక్కడే ఎంత సేపు నిల్చుండి పోయానో కూడా మర్చిపోయాను . ఒక్కసారి నా ఆలోచనల నుంచి బయటికి వచ్చి చూస్తే దరిదాపు నిర్మానుష్యం గా ఉన్న హాలు. ఉలిక్కి పడి చుట్టూ చూస్తే ఇంకా నావైపే తదేకంగా చూస్తున్నా ఆ యువకుడు . ఒక్క సారి గుండె జల్లు మంది . అతను వేగంగా నా వైపే దూసుకొస్తున్నాడు . అతని చూపులలోని ప్రేమ, చేతలలోని తెగువ నన్ను నిశ్చేస్టురాలిని చేసాయి, ఏమి చేయబోతున్నాడు ఇతను ?

అంతే  ఒక్కసారి గా నా దగ్గరగా  వచ్చి అందమైన  నా చేతులని ముద్దాడుతున్న తను. నేను ఆ మైకం లోంచి  బయటికి   రాకముందే  .....


ఎక్కడి నుంచో ఓయ్   !!!  ఆగు మ్యుజియం లో బొమ్మలని తాకటం నేరం అన్న విషయం తెలియదా అన్న సెక్యురిటీ గార్డ్ అరువు నా చెవులని తాకింది . అంతే నాలోని వివేకం మేల్కుని తిరిగి నా నిజరూపమైన స్థాణువు గా మారిపోయాను !!!!!

(P.S : Inspired by one of my friend's blog post )