Subscribe:

Tuesday, July 3, 2012

నేను ఎవరు ?



అదో  అందమైన  హాలు !  ఈరోజేంటో మరీ హడావుడిగా ఉంది పరుగులు  తీస్తూ,  ప్రతిది  అబ్బురంగా  కళ్ళు పెద్దవి గా చేసి చూస్తున్న బుజ్జాయిలతో మరింత సందడిగా ఉంది  ఏదయినా  సెలవు రోజు  అయ్యిండొచ్చా ?  

నేను ఒక  ప్రక్కగా  నిల్చుని  ఆ తమాషాగా   ఉన్న  హాడావుడిని  చూస్తున్నా .  ఎంత హడావుడి  గా ఉన్నా  ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం అన్నా ఆగి మరీ  నన్ను  చూస్తున్నారు .  ఇందుకే    ఆ దేవుడి ఇచ్చిన అందం శాపంగా మారిందేమో అని ఒక్కోసారి  బాధ పడుతుంటాను.  నాకు  ఉదయం పని గంటలు  మొదలవుతుంటే చాలు  ఎక్కడా  లేని దిగులు  ఈ రోజు  ఎంతమంది అదే పని గా నాకేసే కన్ను  ఆర్పకుండా  చూస్తూ  మురిసిపోతుంటారో అని  .

దారుణమైన విషయం ఏమిటంటే నాఅందం తోటి స్తీల కి ఈర్ష్యగా మారి నన్ను ఈ ప్రపంచం నుంచి వేరు చేసింది . దీని కన్నా బాధ కలిగించేది అందమైన వాళ్ళకి గర్వం, స్వార్ధం ఉంటాయి అన్న భ్రమతో నాకు లేని లక్షణాలు ఆపాదించటం. ఏరోజు కారోజు ఎంత మంది మళ్ళీ మళ్ళీ ఈ మాటలు నాముందే అంటారో వద్దన్నా నా మనస్సు   లెక్కలు కట్టక మానదు ,  హ్మ్ !

అయ్యో ఎవరితను ?  అంత    తదేకం గా  చూస్తుంటే  నాకెంత  ఇబ్బందిగా ఉంటుందో   ఎలా  చెప్పాలి  తనకి ? కొంచెం అన్నా  కదలకుండా  అలాగే   విగ్రహంలా నిలబడితే  ఎవరన్నా  ఏమనుకుంటారో అని సందేహం  కూడా లేదా  ఇతనికి ?  రింగుల రింగుల  జుట్టుతో , పొడవు గా ఎంత అందం గా ఉన్నాడు  ఇతను .   అతని  చూపుల్లో  నా మీద ఉన్న ప్రేమ నాకు అర్ధం అవుతుంది,  కానీ ఆ చూపుల తాకిడికి తట్టుకోలేకపోతున్నాను.  ఏమి  చేయలేని  అసహాయత  నన్ను  పిచ్చి దాన్ని  చేస్తుంది .

సమయం  గడిచే కొద్దీ మరింత మంది జనాలతో అందమైన  హాలు మరింత   కోలాహలంగా మారింది . ఇతను  మాత్రం  వచ్చీ పోయే  జనాల విసుగుని పట్టించుకోను  కూడా పట్టించుకోవటం  లేదు, నా నుంచి  ద్రుష్టి  మరల్చటం లేదు . నా ఇబ్బంది కాస్తా  భయం  గా మారింది .  నా  చుట్టూ  ఉన్న జనసందోహం  ఈభయం నుంచి  కొద్దిగా  ఊరట కలిగిస్తుంది .

సాయంత్రం అయ్యింది , నా ఆలోచనలలో పడి అక్కడే ఎంత సేపు నిల్చుండి పోయానో కూడా మర్చిపోయాను . ఒక్కసారి నా ఆలోచనల నుంచి బయటికి వచ్చి చూస్తే దరిదాపు నిర్మానుష్యం గా ఉన్న హాలు. ఉలిక్కి పడి చుట్టూ చూస్తే ఇంకా నావైపే తదేకంగా చూస్తున్నా ఆ యువకుడు . ఒక్క సారి గుండె జల్లు మంది . అతను వేగంగా నా వైపే దూసుకొస్తున్నాడు . అతని చూపులలోని ప్రేమ, చేతలలోని తెగువ నన్ను నిశ్చేస్టురాలిని చేసాయి, ఏమి చేయబోతున్నాడు ఇతను ?

అంతే  ఒక్కసారి గా నా దగ్గరగా  వచ్చి అందమైన  నా చేతులని ముద్దాడుతున్న తను. నేను ఆ మైకం లోంచి  బయటికి   రాకముందే  .....


ఎక్కడి నుంచో ఓయ్   !!!  ఆగు మ్యుజియం లో బొమ్మలని తాకటం నేరం అన్న విషయం తెలియదా అన్న సెక్యురిటీ గార్డ్ అరువు నా చెవులని తాకింది . అంతే నాలోని వివేకం మేల్కుని తిరిగి నా నిజరూపమైన స్థాణువు గా మారిపోయాను !!!!!

(P.S : Inspired by one of my friend's blog post )

44 comments :

రాజ్ కుమార్ said...

wow... never expected this kind of post from...
too good... i liked it :)

జలతారు వెన్నెల said...

Sraavya.. Wow.. I loved the way you narrated it!!
Nice.

రాజ్ కుమార్ said...

btw.. meeru sraavya ;)

Anonymous said...

Dream of Rebecca?

the tree said...

bhale raasaarandi, good one, keep writing.

Anonymous said...

keka..
chala bagundi..
:venkat

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

చివరి ప్యారాగ్రాఫ్ వరకు నాకు ఆశ్చర్యం! నేను చదివేది శ్రావ్య బ్లాగేనా అని!! కొత్త విషయం; మంచి మార్పేలే అని ఆనందిస్తూ ఉండగా "లేదు లేదు" అని తేలిపోయింది :-)

ఏదేమైనా రాసే తీరు బాగుంది. ఈ స్టయిల్లో ఇంకా రాయండీ. ఆల్ ది బెస్ట్!

కొత్తావకాయ said...

శ్రావ్యా... మీరేనా..? మీరు రాయలేరని కాదు. రాసారని ఆశ్చర్యం! డ్రీం ఆఫ్ రెబెకా.. వావ్!

శ్రీనివాస్ said...

కొత్తగా వ్రాసిన కొత్త శ్రావ్య

kiran said...

:)..బొమ్మ పెట్టకుండా ఉంటే నా లాంటి మేధావులకు కూడా ట్విస్ట్ ఉండేది శ్రావ్య జి :P

నాకు కూడా నచ్చేసిందోచ్ :))

ఫోటాన్ said...

Superrr Sravyakka :)

Padmarpita said...

వావ్....ఫీలింగ్స్ ఎవరికైనా ఒకటేనన్నమాట...అమ్మాయి అయినా బొమ్మైనా!భలే భలే:-)

పద్మవల్లి said...

చాలా బావుంది శ్రావ్యా. అసలు చదువుతుంటే నువ్వేనా రాసింది అని ఆశ్చర్యపోయాను. నీ అసలు శైలికి చాలా భిన్నంగా ఉంది. టెంపో పోకుండా, బోర్ కొట్టకుండా, కేవలం అవసరమైనన్ని తక్కువ వాక్యాల్లో చాలా బావుంది. Good Job.

MURALI said...

నన్నెవరన్నా కొంచెం గిల్లండీ ప్లీజ్ :)

MURALI said...

నాపై కామెంట్ ఊరికే కిడ్డింగ్. శ్రావ్యా మీరు ఏం వ్రాసినా బాగానే వ్రాస్తారు. కాకపోతే ఇలాంటివి పెద్దగా మీరు ట్రై చెయ్యకపోవటంతో అంతా కాస్త ఆశ్చర్యపడుతున్నారంతే.

Ramani Rao said...

నేనీ కామెంట్స్ చదివి, మీ బ్లాగు చదివాను అలాగే సిరి సిరి మువ్వగారి మాటల్లో మీరెవరో కూడా చదివాను . వారి మాటల్లో మీరు నాకు చాలా నచ్చారు అనుకుంటుండగా .. మీ మాటల్లో మీరు మరింత నచ్చారు... చాలా బాగుంది శ్రావ్యగారు!

జ్యోతిర్మయి said...

మీరెవరో తెలుసుకోవాలని మువ్వగారి వేలు పట్టుకుని వెళితే తెలుసుకోవలసినది చాలా ఉందని అర్ధం అయింది. ఆసక్తికరంగా బాగా వ్రాశారు శ్రావ్యా..

శ్రీనివాస్ పప్పు said...

అంతా మోసం దగా కుట్ర

anrd said...

ఊహించని మలుపులతో చాలా బాగా రాసారండి.

గిరీష్ said...

Nice..

సిరిసిరిమువ్వ said...

Good narration. కాస్త ప్రయత్నిస్తే అంటే తరుచుగా వ్రాస్తుంటే మంచి కథకురాలివవుతావు..అప్పుడప్పుడు ఇలాంటివి వ్రాస్తుండు.

ఇలాంటి ఇతివృత్తంతోనే ఓ కథ చదివా..పేరు గుర్తుకు రావటం లేదు..వచ్చినప్పుడు చెప్తా!

Sravya V said...

@రాజ్ బాగా పెద్ద surprise ఇచ్చినట్లు ఉన్నాను మీకు :)) Thank you , నేను శ్రావ్య నే కానీ పోస్టులో ఫీలయినా అమ్మాయి ఎవరు అని :)))

@ జలతారువెన్నెల గారు థాంకులు థాంకులు మీకు నచ్చినందుకు :)))

@ ఫణి గారు , కొత్తావకాయ గారు నేను Dream of Rebeccaa గురించి విన్నాను కానీ చదవలేదండీ :)) మొన్న Mannequin on the move చూసాను daani ప్రభావం ఇది :)) థాంక్ యు !

Sravya V said...

@The Tree gaaru థాంక్ యు :))
@అవినేని భాస్కర్ గారు బాగా ఆశ్చర్య పోయారా హ హ థాంక్ యు :))
@చాణక్య థాంక్ యు :))

Sravya V said...

@శ్రీనివాస్ అవును అవును కొత్త శ్రావ్య హ హ థాంక్ యు :))
@కిరణ్ అయితే బాగా నచ్చిందా మీకు థాంక్ యు :)) ముందు బొమ్మ పెట్టొద్దు అనుకున్నా కానీ ఏంటో అలా జరిగిపోయింది :))
@ఫోటాన్ థాంక్ యు :)))
@ఆకాశరామన్న గారు కొంచెం రూట్ మార్చా ఈ ఒక్కసారి కి :))) హ హ ఇప్పుడు మీరు చెప్పాకా నాకు ఆ సీన్ గుర్తొచ్చింది :)) థాంక్ యు :))

Sravya V said...

@ పద్మార్పిత గారు హ హ అంతే కదా మరి , థాంక్ యు అండి మీకు నచ్చినందుకు :))
@పద్మ గారు అంతే అంటారా థాంక్ యు థాంక్ యు :))
@మురళి గారు హ హ మీ ప్రశంస కు థాంక్ యు అండి :))
@రమణి గారు థాంక్ యు :))

Sravya V said...

@జ్యోతిర్మయి గారు థాంక్ యు :))
@పప్పు సారూ ఏమి కాదు అంతా నిజం :)))
@anrd గారు థాంక్ యు :))
@మువ్వ గారు వావ్ అది నాకు పెద్ద ప్రశంస మీ నుండి తప్పక ప్రయత్నం చేస్తా థాంక్ యు అండి :))

Anonymous said...

Excellent one, I am also surprised :-)

-- Badri

Sravya V said...

@Badri gaaru :-)) Thank you !

Sravya V said...

@Bharadwaj gaaru Thank you :-))

Kranthi M said...

chala chaala chaala bagundandi srAvya gAru. keep writing :-)

Sravya V said...

@Kranti Kumar gaaru Thank You :-))

వేణూశ్రీకాంత్ said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ శ్రావ్యా :))) ఇందాకనగా చదివి కిందపడిపోయి ఇపుడే లేచి కామెంట్ రాస్తున్నా :P ఆ అబ్బాయి కదిలేవరకూ నేనైతే నిజమే అనుకున్నా :))
మొత్తంమీద మీ కలానికి రెండువైపులా పదునుందని మరోసారి నిరూపించారు :)
పోస్ట్ చదివినంతసేపు పెళ్ళిపుస్తకంలో బాసుకుట్టిలా "శ్రావ్యా? శ్రావ్యే? శ్రావ్యే!!" అని తెగ ఆశ్చర్యపడిపోయా నిజంగా :))

Sravya V said...

హ హ వేణు జీ , నిజం అని ఎలా అనుకున్నారా నా డౌట్ ఇప్పుడు . అసలు మొదటి కొన్ని లైనులు చదవగానే పట్టేస్తారు అనుకున్నా :D
Thank you :))

నిషిగంధ said...

ఏంటో కలికాలం!! లేకపోతే శ్రావ్య ఇలాంటి పోస్టులు రాయడమేమిటీ!!

వాటే ప్లెజెంట్ సర్ప్రైజ్, శ్రావ్యా!! చాలా చాలా.. (ఇంకా బోల్డు చాలా లు పెట్టుకో ఇక్కడ) నచ్చేసింది!!!! గ్రేట్ జాబ్!

నువ్వేమనుకోనంటే నాదో చిన్న రిక్వెస్ట్... మాకు తెలిసిన శ్రావ్యని, ఈ కొత్తమ్మాయిని బ్లెండర్‌లో వేసి తిప్పేసి ఒక సరికొత్త శ్రావ్యతో పోస్టులు రాయిస్తే చదవాలని ఉంది! :-)

Sravya V said...

హ హ నిషి, థాంక్ యు :-)) ఇది కలికాలమే కదా :-))

మాకు తెలిసిన శ్రావ్యని, ఈ కొత్తమ్మాయిని బ్లెండర్‌లో వేసి తిప్పేసి ఒక సరికొత్త శ్రావ్యతో పోస్టులు రాయిస్తే చదవాలని ఉంది! :-)
--------------------------------------------------
ఇదేంటో అర్ధం కాలేదు :((( అలా , ఇలా కాకుండా బ్లెండర్‌లో వేసి ఎలా రాయాలా అని ఆలోచిస్తున్నా నిషి :))

Ennela said...

"హ హ వేణు జీ , నిజం అని ఎలా అనుకున్నారా నా డౌట్ ఇప్పుడు . అసలు మొదటి కొన్ని లైనులు చదవగానే పట్టేస్తారు అనుకున్నా :D" nenaithey meere anukunnaa..alaage oohinchukuntunnaa koodaa mimmalni..(madhuravaani profile bomma levello)...chaalaa baagundi...(katha +naa oohallo mee roopu)

Sravya V said...

హ హ ఎన్నెల గారు :-))) థాంక్ యు ! btw చాల రోజుల కు కనపడుతున్నారు, బావున్నారా ?

Unknown said...

Nice One with Deja vu feeling.

Narration is simply wonder :))

Sravya V said...

@Sekhar "Deja vu feeling" are you sure ?:P
Thank you :-))

Unknown said...

అవునండి.....ఎక్కడో జరిగినట్టు,చదివినట్టు,చూసినట్టు..
I am sure :))

మధురవాణి said...

మొదటి రెండు పేరాలు చదివాక నాకు తెలిసిపోయింది శ్రావ్యా మీరు శిల్పం గురించి రాస్తున్నారని.. :))
కానీ, రాసిన విధానం మాత్రం చాలా బాగుంది. Good one! Kepp writing such versatile posts! :)

Sravya V said...

హ హ మధుర :-)) నేననుకోవటం రెండు పేరాలు చదివే సరికి అందరికీ తెలిసి ఉంటుంది , ఏదో రాయక రాయక రాసా అని పాపం ఫ్రెండ్స్ అంతా ఏదో మురిపిస్తున్నారు :-))

Thank you !

KumarN said...

Whoa!!! ఏంటీ ఇది శ్రావ్యా రాసిందే!!!!!!!!!!

మధురా, మీరు ప్రో అయిపోయినట్లున్నారు రచనల్లో, నాకేం తెలీలేదు ఫస్ట్ టూ పారాగ్రాఫ్స్ లో. నేనింకా అది శ్రావ్యే అనుకున్నాను చాలా సేపు.

శ్రావ్యా, way too impressed!! I think you should try your hand at writing these kind of posts, more often.

Sravya V said...

@Kumar jee ha ha thank you :-)

Post a Comment