Subscribe:

Saturday, August 18, 2012

ATM కథా కమామీషు


నాక్కూడా  మీలాగే  కొంచెం మంది ఫ్రెండ్స్  ఉన్నారు .  వాళ్ళకి అప్పుడప్పుడు  క్విజ్జ్లు  పెడుతుంటానన్న మాట . సరే ఈ రోజు కూడా అలాంటి  క్విజ్  ఒకటి  తట్టింది  వెంటనే  SMS పంపా .  ఇంతకీ  ప్రశ్న ఏంటి అంటారా  అక్కడికే వస్తున్నా . 

ATM అంటే ? -  సరే సమాధానాలు  వచ్చాయి   అవేంటో చూద్దాం .
మొదటి ఫ్రెండ్  నుంచి  సమాధానం  :  ATM  -  Any Time Murder   
నేను మనస్సు లో  : హ్మ్ తనకి ఈ చిరంజీవి సినిమా పిచ్చి  వదిలే వరకు  జీవితం లో  బాగుపడడు, మనం బేసిక్ గా ఏమి చేయలేము )

రెండోవ  సమాధానం  :  ATM - Any Time Money 
నేను : అబ్బో ఈ డబ్బు  పిచ్చి బొత్తి గా  హద్దు , అదుపూ లేకుండా పెరిగిపోతుంది 

ఇక మూడో  ఆన్సర్  :  ATM - Automated Teller Machine  
నేను :  పోనీలే  కనీసం  ఏదో  బ్యాంక్  IT డిపార్టుమెంటు లో  పని చేస్తూ ఆ ఉప్పు తింటున్నదుకు కనీసం ఇదన్నా నేర్చుకున్నావ్ 

పైన నా ప్రశ్న  చూసి విషయం చూసి  విషయం మీకు అర్ధం కాకపోయినా నా ఫ్రెండ్స్ కి అర్ధం అయ్యింది , వాళ్ళకి ఒక కనీసం ఒక పది పదేహేను నిమషాలు ఏదో బుర్ర  తినే session ఉంది అని .సరే వాళ్ళ  బుర్రలు ఎలాగు తిన్నా  ఇక మరి మిమ్మల్ని మాత్రం ఎందుకు వదలాలి అందుకే  ఈ పోస్టు  :P

(  Image Source   : గూగుల్ images )
అసలు రోజుకు రెండు మూడు సార్లు  వెళ్లి ఒక కార్డు పెట్టి డబ్బులు ఇలా లాగేసుకోవటం తప్పా,  అసలు ఈ ATM ఏంటి ఎవరు కనిపెట్టారు  అని ఆలోచించారా  ? ఆలోచించరు   నాకు తెలుసు  అందుకంటే అంతా Use and Throw policy ,  టెక్నాలజీ ని  వాడుకోవటం  ఆ తరవాత  తీరిగ్గా  మన జీవితాల్ని నాశనం  చేస్తున్నాయి  ఈ టెక్నాలజీ  inventions   అని  తిట్టుకోవటం . పోనీ వాడటం మానేస్తారా  అదీ లేదు.  ఇవాల్టి నుంచి కొంచెం అది వదలి  కొంచెం  మనం వాడే వస్తువుల గురించి  తెలుసుకోండి .  ఊ  ఊ  అర్ధం అయ్యింది మీ తిట్లకి అర్ధం   సోది ఆపి ఆ చెప్పే రెండు ముక్కలు రాస్తే  చదువుతాం లేదంటే మాకు ఖాళీ  ఉన్నప్పుడు గూగుల్  చేసి చదువుకుంటాం ఇదే కదా ? వద్దు అంత అవకాశం మీకివ్వను  నేను రాసి మీతో  చదివించేస్తా   .

ATM ని 1967 లో   Scottish inventor అయిన  John Shepherd  Barron  అనే ఆయన కనుకొన్నారు . ఆ రోజుల్లో  ATM ని DACS (De La Rue Automatic Cash System )  అని పిల్చేవారట . ఆయనకీ  దీనికి ప్రేరణ ఇచ్చింది  Candy  వెండింగ్ మెషిన్ అట .  సరే ఆయన ATM కనిపెట్టిన  రోజుల్లో ప్లాస్టిక్  కార్డులు  గట్రా లేవు కదా  అందుకని carbon 14   laced cheques  ని వాడేవారట . అంటే  ATM cheque మీద ఉన్న radio active material అయిన  Carbon  14  మార్క్ ని  రీడ్ చేసి  మనం ఎంటర్ చేసిన PIN నెంబర్ తో  చెక్ చేసి డబ్బులు ఇచ్చేదన్న మాట .  ఎవరు ఎంత మొత్తుకున్నా ప్రతి పురుషుడి  విజయం వెనక ఒక స్త్రీ తప్పని  గా  ఉంటుంది అన్న మాట నిజం అని మరోసారి నొక్కి వక్కాణించే  క్రమం లో  Shepherd  గారి  వైఫ్ Caroline    ఈయనకి  ఈ PIN కాన్సెప్ట్ ని  రూపొందిచటానికి  సహాయ పడ్డారట .

ఈ ATM వెనకాల కథ ఇదన్న మాట  . ఈ కథ  తెలుసుకున్నాకా  మీకు అసలు మొదటి ATM ఎక్కడ  ప్రారంభించారు అని  తెలుసుకోవాలి అని మీకు అనిపించటం సహజం  అందుకే  ఈ క్రింది ముక్కలు . 

మొదటిసారి గా ATM ని  1967 లో  Barclay's Bank ,  Enfield, North London    లో ప్రారంభించారు , ఆ తర్వాత మియామి లో జరిగిన  2000 మంది సభ్యులు పాల్గొన్న   Banker 's  కాన్ఫరెన్స్  కి  ఆహ్వానించారు .  ఈ కాన్ఫరెన్స్  తరవాత మన John Shepherd  Barron  గారికి  Pennsylvania Bank ,  Philadelphia ఆరు ATM లకి ఆర్డర్ ప్లేస్ చేసింది   మన  ఇక అక్కడి నుంచి ప్రారంభం అయ్యి  ఈ రోజు  వీధికొక   ATM దాకా  ప్రయాణం అప్రతిహతం గా కొనసాగుతూ  సాగుతూ  వస్తున్నది  అన్న మాట .

John Shepherd  Barron గురించి కొన్ని వివరాలు : 
(Image Source : గూగుల్ images )
పూర్తి   పేరు  :
John Adrian Shepherd-Barron 
పుట్టిన తేదీ   :
23 rd  జూన్ 1925  
పుట్టిన  ప్రదేశం :
అప్పటి  అస్సాం , ఇప్పటి మేఘాలయ లోని  షిల్లాంగ్   
వృత్తి  :
Managing Director De La Rue Insturments                                                                                     

ఇంకొన్ని  వివరాలకి  ఇక్కడ చూడండి .



ఇక కొంచెం సేపు   వరల్డ్ మ్యాప్ లోంచి  ఇండియా ని జూమ్ చేసి  చూద్దాం .  ఇండియా లో  మొదటి సారి గా  ATM  ని  HSBC  బ్యాంకు 1987 లో అంధేరీ , ఈస్ట్  ముంబై లో ప్రారంభించింది . 

అన్నీ మంచి మాటలే చెప్పుకుంటే  ఏమి బాగోదు కదా  అందునా    టెక్నాలజీ అన్నది  రెండువైపులా  పదునున్న కత్తి  లాంటిదని    మనం దాన్ని  దేని కోసం  వాడుతున్నాం అన్న దాన్ని  బట్టి  ఫలితం ఉంటుంది అని  నేను ప్రత్యేకం  గా చెప్పవలసిన పని లేదు కదా   .  అలాగే మన ఉద్దేశ్యం  మంచిదే అయినా  వేరే  రకం గా వాడే  వాళ్ళ  ద్వారా  కొన్ని సార్లు  మోసపోయే  పరిస్తితి  ఉంటుంది  కాబట్టి  దీనికి  ఉన్న అందుకే  రెండో పార్శ్వాన్ని  కూడా చూద్దాం .  

ATM skimmers అనేవి ప్రస్తుతం  అన్నీ  బ్యాంకు లని  వణికిస్తున్న ఫ్రాడ్ devices .   skimmers అనేవి అతి  పల్చ గా ఉండి  ATM కార్డు  insert  చేసే slot లో కూర్చునే  విధం గా తయారు చేస్తారు అన్న మాట .  ఇక  అక్కడ కూర్చున్న  తరవాత దాని పని  మన ATM కార్డుల వెనక బాగం లో ఉన్న మాగ్నెటిక్ stripes  మీద ఉన్న డేటా ని రికార్డు చేయటం .  ఇక ఒకసారి  ఈ డేటా  ఈ మాయల మరాటీల చేతిలో పడ్డాక  వాళ్ళ పని  మన ఎకౌంటు  ని చక్క గా శుభ్రపరచటం . 

ఇటువంటి వాటిని  ఎదుర్కోవటానికి  ప్రస్తుతం   అన్ని బ్యాంకులు చేస్తున్న పని ప్రతి transaction  కి ఎకౌంటు హోల్దేర్ కి SMS పంపటం. ఈ   SMS  తో  మన ఎకౌంటు  బాలన్సు చెక్ చేసూకుంటూ   ఏదన్నా  తేడా transaction   గుర్తిస్తే  వెంటనే  బ్యాంకు సిబ్బంది కి  తెలియచేసి  కార్డు ని బ్లాక్  చేయటం ద్వారా వంటి  జాగ్రత్త లతో  మన ఎకౌంటు సేఫ్ గార్డ్  చేసుకోవచ్చు  .  అలాగే  అవసరం అయితే తప్ప   బ్యాంక్  పరిసర  ప్రాంతాలలో ఉన్న ATM ని వాడటం అనేది  మంచి పద్దతి  (ఇది అన్ని సార్లు కుదరక పోవచ్చు  )  ఇంకా కొన్ని ఇలాంటి skimmers  గురించి   వివరాలు   తెలుసుకోవాలి అంటే  ఇక్కడ  చూడండి  . 

ఇవండీ  ATM గురించి  నేను మీతో  పంచుకుందాం  అన్న విశేషాలు . మీకు  తెలిసిన ఇంకొన్ని  విశేషాలు  కామెంట్ల  రూపం లో  చెప్పడం మర్చిపోకండే. 

PS : పైన నేను రాసిన  క్విజ్  , ఫ్రెండ్స్  వగైరాలు  కేవలం  ఐస్ బ్రేకింగ్  statements మాత్రమే !

24 comments :

రాజ్ కుమార్ said...

హమ్మో.. హమ్మో.. మళ్ళీ జ్ఞానాన్ని ప్రసాదించే పోస్టు.. అప్పుడప్పుడూ ఏటవుతాదండీ మీకూ? ఇలా జనాల్ని బెదిరించి మరీ చదివిస్తారూ..
"అప్పుడప్పుడూ వినాయకుడు పాలు తాగుతుంటాడు.. నేను ఉన్నానూ అని చెప్పడానికి"
"అప్పుడప్పుడూ టెర్రరిస్టులు బాంబులు పెడతారు... ఐడెంటిటీ కోసం"
ఇది కూడా అలాగే అనుకోమంటారా?? కికికికి

జోక్స్ పక్కన పెడితే... యెస్.. మంచి పనికొచ్చే విషయాలు షేర్ చేశారు.

ఇహ పోతే ఏటీఎమ్ ల గురించి నా ముప్పై పైసలు ఇవిగో...

"ఓరేయ్..స్టేట్ బ్యాంకోళ్ళారా.... నా మూడు వేలు కొట్టేస్తారా..? ఎప్పుడిస్తారు నా డబ్బులూ?? నేనేం పాపం చేశానూ? ఏ(*&(()*#@$"

(దీనర్ధం అప్పుడప్పుడూ ఏటీఎమ్ లలో ప్రోబ్లెం వస్తాయీ..మన డబ్బులకి విమానం టికెట్స్ వస్తాయ్ అనీ)

Anonymous said...

హ్మ్.. ATM అంటే Any Time Money కాదని నాకు ఇంజినీరింగుకి వచ్చే వరకూ తెలీదు. (పనిలో పనిగా నాకు అది ఇంజినీరింగు చదివేప్పుడే తెలుసు అని చెప్పేసినట్టుంటుంది కదా అని అలా అన్నానన్న మాట :-) )

మిగిలిన విషయాలు మాత్రం ఇప్పుడే చూస్తున్నా. బ్యాంకు పక్కనే ఉన్న ATM ను వాడడం వల్ల చాలా లాభాలున్నాయి. ఒకసారి అమౌంటు డ్రా చేసేప్పుడు .. 100 రూపాయల నోటు చివరలో ఎవరో కత్తిరించినట్టు కట్టైపోయింది. పక్కనే బ్యాంకు ఉంది కాబట్టి, ట్రాన్సాక్షన్ స్లిప్పుని, ఆవందనీ తీసుకెల్లి బ్యాంకులో చూపించా. నాకే కాదు నాతరువాత వచ్చిన ఇద్దరికి కూడా అలానే డబ్బులు వచ్చాయి. (కొద్దిగా కట్ అయ్యి). దానితో బ్యాంకు వారు వెంటనే వెల్లి ATM సెంటరుని మూసేసి .. లోపం ఎక్కడుందో వెతకడం మొదలు పెట్టారు. మా వందలు మాకు సేఫ్ గా వచ్చేశాయి. :-))

Raj said...

Informative post...

దీని బట్టి నాకు అర్ధం అయ్యింది ఏమిటి?? నేనిప్పుడు urgentగా blogs ఎవరు కనిపెట్టారో తెలుసుకోవాలి :)

మాలా కుమార్ said...

పోస్ట్ ఉపయోగకరంగా వుంది .

ఫోటాన్ said...

Nice Post!

Unknown said...

ఒక భారతీయుడు అనమాట :)

గుడ్ Write up

Padmarpita said...

వామ్మో....నాకు కూసింత జ్ఞానమొచ్చిందిగా మీ పోస్ట్ చదివాక:-) థ్యాంక్యూ

Sravya V said...

@రాజ్ మరే అప్పుడప్పుడు నా తలలో పురుగు నేనున్నా నేనున్నా అని చెబుతుంది అప్పుడు ఈ పోస్టులు అన్న మాట :-)) ఇంతకీ బెదిరించించి చదివించానా :-)) థాంక్స్ !
btw ఇక మూడు వేల సంగతి మర్చిపోరా మీరు :-))

@శ్రీకాంత్ గారు హ హ రెండు రకాల informations ఒకే కామెంట్ తో చెప్పారన్న మాట బాగు బాగు . అవునండి కొంచెం బ్యాంకు దగ్గర ATM తో లాభాలే అంతే కాకుండా ఇలా టాంపరింగ్ చేసే అవకాశాలు తక్కువ కదా , Thanks for you comment :-))

Sravya V said...

@రాజేంద్ర గారు థాంక్స్ :-)) ఇక మరి మీరు చెప్పినట్లు ఆ కనిపెట్టే పని లో ఉండండి :P
@SNDP గారు థాంక్స్ :-))
@మాల గారు థాంక్స్ :-))
@ఫోటాన్ థాంక్స్ :-))

Sravya V said...

@శేఖర్ లాభం లేదు మీతో ఇంపోజిషన్ రాయించాలి , ఆయన కేవలం భారతదేశం లో పుట్టాడు , అప్పుడు ఇంకా బ్రిటిష్ పాలన లో ఉన్నాం కదా వాళ్ళ ఫాదర్ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న Chittagong Port Commissioners లో చీఫ్ ఇంజనీర్ అట , ఆయన Scottish . Thanks for your comment :-))

@పద్మార్పిత గారు హ హ ఇలా ఆంటే మీ కవితల పోస్టులు చూసి మేము అనుకోవాలి అంటారు :-)) థాంక్స్ :-))

శశి కళ said...

మంచి పోస్ట్...ఆలోచించాల్సిన తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి

Sravya V said...

Sashi gaaru thank you :-))

రసజ్ఞ said...

చాలా బాగుందండీ! informative! కార్బన్ డేటింగ్ ని ఇలా కూడా ఉపయోగించేవారనమాట!!

ఒకసారేప్పుడో చదివిన గుర్తు, 1930-40 మధ్యలో సిమ్జియన్ అనే ఒక శాస్త్రవేత్త మొదటగా ఇటువంటిదానిని (hole in the wall machine for financial transactions) కనుక్కుని పేటెంటు కూడా అప్లై చేశారనీ కానీ ఏడాది లోపుగానే ఈయన కనుగొన్నది పెద్దగా ప్రయోజనకరంగా లేకపోవటం వలన దాని వాడకాన్ని ఆపివేసారనీ, దానిని ఒక నమూనాగా చేసుకుని Barron గారు దీనిని కనుగొన్నారనీ గుర్తు.

Sravya V said...

రసజ్న గారు మీరు చెప్పినట్లు సిమ్జియన్ ట్రై చేసారు కానీ అది successful కాలేదు అని చదివానండి . Barron claim చేసింది మాత్రం దీనికి స్ఫూర్తి కాండీ మెషిన్ అని . అలాగే ఈయన పేటెంట్ అప్లై చేయలేదు ! Thanks for informative comment !

Anonymous said...

వూ.. స్కిమ్ చేసి కార్డ్ ఇన్‌ఫర్మేషన్ గ్రహిస్తారు, ఈ డేటాని ఎలా వుపయోగిస్తారు?! అది కూడా వివరించండి, ప్లీజ్. ఇప్పటి ATM మిషన్లలో వీటికి విరుగుడుగా ఏమైనా మార్పులు చేశారా? లేదు అంటే.. మా ఇంటిదగ్గర ఓ ATM వుంది, మీ టెక్నిక్ ప్రయోగించి చూస్తాను. మీరు చెప్పింది విజయవంతం అయితే 20% రాయల్టీ ఇచ్చుకోగలను. :D

Sravya V said...

హ హ SNKR గారు వీటి గురించి నీకు నేను చెప్పటం తాత కి దగ్గు నేర్పించటం :-)) మీరు పని చేసే రంగం ( నా ఉద్దేశ్యం skimmers అని కాదండోయ్ :P )ఏదో నాకు తెలుసుననుకుంటున్నాను :-))
Thank you :-))

Anonymous said...

నాది ATMలు సర్దే పని అని ఎలా కనిపెట్టేశారా అని ఆశ్చర్యపోతున్నా!!! ఖళ్ ..ఖళ్... :) Snkr

Sravya V said...

హ హ SNKR గారు ఇదో రకం స్కిమ్ :-))

David said...

nice information

Sravya V said...

Devid gaaru Thank you :-)

సంతు (santu) said...

బాగుందండి.... జోకేసి రాకేసి ఓ విషయం చెప్పారు, అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.....

@రాజేంద్ర గారు మరి blogs ఎవరు కనిపెట్టారో ఇంకా చెప్పనే లేదు... :(

Sravya V said...

@Santu gaaru Thank you :-)

త్రివిక్రమ్ Trivikram said...

మాకు ఎం.సి.ఏ.లో కంప్యూటర్ నెట్వర్క్స్ అని ఒక పేపరుండేది. ఆ టెక్స్ట్ బుక్కు రాసిన Andrew S. Tanenbaum "అసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ మోడ్ (ATM) గురించి చెప్తూ ATM అంటే ప్రతి వీధిలో కనబడే automated teller machines అనుకోకండి బడుద్ధాయిల్లారా" అని ప్రత్యేకంగా చెప్పి జ్ఞానోదయం కలిగించాడు :-).

Sravya V said...

హ హ త్రివిక్రమ్ గారు :-) థాంక్ యు అండి !

Post a Comment