Subscribe:

Tuesday, October 9, 2012

Steve Jobs(1955-2011) - 1/6


Winners don't do different things, they do things differently !

స్టీవ్ జాబ్స్ గా మనందరికీ తెలిసిన స్టీవ్ పాల్ జాబ్స్  24  పిబ్రవరి 1955 న  అమెరికా సంయుక్త రాష్ట్రాల కి  చెందిన కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ఫ్రాన్‌సిస్కో నగరం లో జన్మించారు.  జోయాన్ సింప్సన్,  Abdulfattah John  Jandali  లు  స్టీవ్ కన్నతల్లిదండ్రులు  అయితే,   క్లారా &  పాల్ జాబ్స్, స్టీవ్ ని  పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు.  

స్టీవ్ పుట్టేనాటికి ఆయన తల్లిదండ్రులు ఇంకా విద్యార్దులు అవ్వటం వల్ల, పుట్టబోయే బిడ్డని పెంపకానికి ఇవ్వటానికి ఆయన తల్లి ముందే ఒక సంపన్న కుటుంబం తో అంగీకారం కుదుర్చుకున్నారు. కానీ ఆ కుటుంబం చివరి నిమషం లో తమకు అమ్మాయి కావాలి అని నిర్ణయాన్ని మార్చుకోవటం తో స్టీవ్ ని ఎట్టి పరిస్తితులలో నైనా గ్రాడ్యుయేట్ ని చేస్తాం అన్న మాట తీసుకుని క్లారా, పాల్ జాబ్స్ దంపతులకి దత్తత కి ఇచ్చారు . స్టీవ్ పాల్ జాబ్ అన్న పేరు క్లారా, పాల్ జాబ్స్ పెట్టినదే. ఇలా స్టీవ్ జాబ్స్ బాల్యం క్లారా, పాల్ జాబ్స్ తో కాలిఫోర్నియా లో ప్రస్తుత సిలికాన్ వ్యాలీ లోని బాగమైన మౌంటైన్ వ్యూ లో ప్రారంభం అయ్యింది . వృతి రీత్యా పాల్ జాబ్స్ మెషినిస్ట్ అవ్వటం తో స్టీవ్ జాబ్స్ కి చిన్నతనం నుంచే ఎలక్ట్రానిక్ ఉపకరణాల్ని రిపేరు చేసే క్రమం లో వాటిని విడదీయటం , తిరిగి ఎసెంబుల్ చేయటం లాంటి వాటిలో ప్రావీణ్యత సంపాదించే అవకాశం కలిగింది. స్టీవ్ జాబ్స్ ఒకానొక సమయం లో తన తండ్రి గురించి "He was a genius with his hands” అని చెప్పారు . ఇలా తన తండ్రి తో కలిసి ఇంటి గారేజ్ లో చిన్నతనం లో స్టీవ్ చేసిన పనులు తన భవిష్యత్తులో అత్యుత్తమ డిజైన్ ల రూపకల్పన లో ఉపయోగపడ్డాయి.

Steve Jobs (circled) at Homestead High School Electronics Club
Homestead High school లో స్టీవ్ 
సహజం గానే  తెలివితేటలూ , ప్రత్యేకమైన  ఊహశక్తి ఉన్న  స్టీవ్ కి మామూలు స్కూల్ జీవితం విసుగ్గా ఉండేది . స్టీవ్ జాబ్స్ స్కూల్ ని పెద్ద గా పట్టించుకోకుండా నిజానికి turbulent చైల్డ్  గా ఉండేవాడు అంతగా   చదువు  అంటే  ఉత్సాహం  చూపించని  స్టీవ్ ని   తన  ఫోర్త్  గ్రేడ్ టీచర్ (Monta Loma Elementary School)  చాక్లెట్ లని  లంచం గా  యిచ్చి  తన దృష్టి ని చదువు  వైపు  మళ్ళించారు.  దానితో స్టీవ్  స్కూల్ జీవితం  ఒక దారి లో  పడటమే కాదు,  సహజంగానే తెలివి గల  స్టీవ్  ని 5th   గ్రేడ్ స్కిప్  చేసి    4th   గ్రేడ్ నుంచి  డైరెక్ట్  గా  మిడిల్ స్కూల్  కి  పంపొచ్చు   అన్న రికమెండేషన్  కూడా సంపాదించాడు.  కానీ   స్టీవ్  చదువు మీద  అంతగా నమ్మకం లేక ,  స్టీవ్ అల్లరి మీద అతి నమ్మకం తోనూ క్లారా , పాల జాబ్స్ దానికి ఒప్పుకోలేదు :-) .  ఎలిమెంటరీ స్కూల్  తరవాత Crittenden Middle School  లో చేరిన స్టీవ్ జాబ్స్ అక్కడ  స్కూల్ పరిస్తితులకి అలవాటు పడలేకపోయారు . దానితో  స్టీవ్ కోరిక పైన  స్కూల్ మార్చటానికి  సిద్దపడ్డ  క్లారా , పాల్ జాబ్స్ లు  Cupertino జూనియర్ హై స్కూల్ లో స్టీవ్ చదువు  కొనసాగించటానికి  అనువు గా Los Altos  అనే  ప్రాంతానికి  మారిపోయారు .  ఇక్కడే  స్టీవ్ జీవితం మలుపు తిరిగింది .

అప్పుడే  రష్యా  అంతరిక్షం  లోకి విజయవంతం గా   స్పుత్నిక్  పంపడం  తో  పోటీ గా  అమెరికా   టెక్నాలజీ  రంగం మీద  విపరీతం గా   ఖర్చు  చేసి  మరీ ప్రోత్సహిస్తున్న  రోజులు  కావడం తో,   సహజం గానే  స్టీవ్  దృష్టి   ఆ వైపు మళ్ళింది .  అలా  Electronics  రంగం పైన పెరిగిన మక్కువ తో Homestead High స్కూల్ లో చేరే సమయం లో అప్పటికే బాగా  పాపులర్  అవుతున్న  electronics   క్లాసు లో  చేరాడు  . అక్కడ  జాబ్స్ కి బిల్ పెర్నాండేజ్ తో పరిచయం ఏర్పడింది . స్టీవ్ జాబ్స్  కి   electronic   పరికరాల  మీద ఉన్న ఆసక్తి ని చూసిన   బిల్ పెర్నాండేజ్   అదే   రంగం  లో ఆసక్తి  , పరిచయం  ఉన్న  తన    స్నేహితుడు ,    యునివర్సిటీ  అఫ్ మిచిగాన్  విద్యార్ధి   అయిన   స్టీవ్  వోజ్నిక్  ని  జాబ్స్ కి పరిచయం  చేసాడు .  ఈ స్టీవ్ వోజ్నిక్ , స్టీవ్  జాబ్స్  ల  భాగస్వామ్యం లో   రూపుదిద్దుకున్నదే  ఈ రోజున మనం  చూస్తున్న  ఆపిల్  .   

జాబ్స్  వోజ్నిక్ ల  పరిచయం  అయ్యేటప్పటికి  జాబ్స్   వయస్సు 14  అయితే    వోజ్నిక్ వయస్సు  19,   వోజ్నిక్ , బిల్ పెర్నాండేజ్ కలిసి  అప్పటికే  ఒక చిన్న  కంప్యూటర్ బోర్డు   తయారు చేసే పనిలో  ఉన్నారు ,  దాని పేరు  “the Cream Soda Computer” .   .  

వోజ్నిక్ మాటలలో  స్టీవ్  కి  కంప్యూటర్ బోర్డు  మొదటి  సారి చూపించినప్పుడు   తనకి   కలిగిన   అభిప్రాయం 


Typically, it was really hard for me to explain to people the kind of design stuff I worked on, but Steve got it right away. And I liked him. He was kind of skinny and wiry and full of energy. […] Steve and I got close right away, even though he was still in high school […]. We talked electronics, we talked about music we liked, and we traded stories about pranks we’d pulled.

జాబ్స్ ,  వోజ్నిక్ ల పరిచయం అయిన రెండేళ్ళ  తరవాత అంటే 1972 ప్రాంతం లో  AT  & T ఫోన్ నెట్వర్క్ ని హాక్  చేయటానికి  తయారు చేసిన  "బ్లూ బాక్స్" అంటే  phone phreaking  పరికరం (device ) మీద వచ్చిన ఒక ఆర్టికల్   వీళ్ళిద్దరి మీద చూపించన ప్రభావం తో, అటువంటి  ఒక పరికరాన్ని  తయారుచేసే పని లో పడ్డారు.  ఆ  డివైసు చేసే పని ఏమిటి అంటే  ఫోన్ నెట్వర్క్ ని హాక్ చేసి  ఎటువంటి ఖర్చు  లేకుండా  దూరప్రాంతాలకి ఫోన్ చేసే అవకాశం కల్పించటం.  వీళ్ళ  ప్రయత్నం  ఫలించి అటువంటి  పరికరాన్ని తయారుచేయగాలిగారు . అది చూసిన  జాబ్స్ కి  ఆ పరికరాన్ని  అవసరం అయిన వారికి అమ్మితే ఎలా ఉంటుందా అన్న ఆలోచన  వచ్చింది .  దానితో  వోజ్నిక్ ఉంటున్న  బర్కేలీ  స్టూడెంట్  డార్మేటరీ  లోని  ప్రతి   రూం కి వెళ్లి అమ్మే ప్రయత్నం  చేసారు . కాకపొతే ఇది  ఇల్లీగల్ బిజినెస్ కావటం తో  దరిదాపు  పోలీసులకి  దొరికిపోబోయి  ఇక  ఆ ప్రయత్నాన్ని  మానేశారు . 

తొలిసారి గా  వీళ్ళిద్దరూ  కలిసి entrepreneurs  గా మారదామన్న  ప్రయత్నం  ఇలా  ముగిసిందన్న  మాట :-)  వచ్చే భాగం లో  అసలు  ఆపిల్    ఎలా  ఏర్పడిందో చూద్దాం ! అంతవరకూ ..

Stay hungry ! Stay foolish ..


Recommendations :

తన  గురించి  తన మాటల్లో -  స్టీవ్ జాబ్స్ .   (This is one of the greatest speeches of Steve, I   strongly  recommend to watch this  powerful speech) 


-శ్రావ్య 
Image Source : Google images

14 comments :

రాజ్ కుమార్ said...

super...waiting for next part..;)

రాజ్ కుమార్ said...

thanQ so much for sharing that greatest speech

Chandu S said...

I watched it before. I love to watch it again.

Raj said...

the heaviness of being successful was replaced by the lightness of being a beginner again

less sure about everything..


wonderful words

వేణూశ్రీకాంత్ said...

బాగా రాస్తున్నారు శ్రావ్యా... ఆ స్పీచ్ ఇదివరకు చూశాను చాలారోజుల తర్వాత మీ పుణ్యమా అని మళ్ళీ చూస్తున్నాను.

'''నేస్తం... said...

Thanx for sharing :)

Srinivasa Srikanth Podila said...

Nice post, Keep it up :)

Unknown said...

Next part please.....

ఫోటాన్ said...

గుడ్ గుడ్,
మిగిలిన పార్ట్స్ కోసం వెయిట్ చేస్తూ...:)

Vasu said...

Was wondering wouldn't it be a problem to reproduce text from a copyrighted book.
I don't know if the text you quoted is from Walter Isaacson's book. If it is, please be cautious.

Sravya V said...

వాసు గారు కాదండి ఇది ఆ బుక్ నుంచి కాదు , ఇది వీడియోలు , కొన్ని ఇంటర్వ్యూ , ఇంకా నెట్ లో ( copy రైట్ protected కానీ ) sources నుంచి తీసుకున్నది .

Sravya V said...

I will publish all the sources in the last part :-)

బంతి said...

Nice one waiting for next part

Sravya V said...

రాజ్ కుమార్ , శైలజ గారు , శ్రీకాంత్ గారు , రాజేంద్ర , వేణు శ్రీకాంత్ గారు , నేస్తం .... గారు , Srikawnth గారు , సునీత గారు, ఫోటాన్ , వాసు గారు , బంతి అందరికి చాలా చాలా థాంక్స్ అండీ :-)

Post a Comment