Subscribe:

Sunday, December 23, 2012

Perception


ఈ అందమైన ఫోటో చూసిన తరవాత నాకొచ్చిన తమాషా ఆలోచన. సరదాకి  రాసిన తవికలు మాత్రమే  దీనిలో  చంధస్సు,   కవితాత్మలాంటి ఇంకేవో నాకు తెలియని వాటి కోసం వెతక్కండి  :-))



 
నీ రాకని  తెలియజెప్పే 
కమ్మని సంగీతం వంటి 
ఎండుటాకుల  చిరుసవ్వడి 
పక్షుల కిలకిలారావాలు 
చల్లని పైరగాలి పిల్లతెమ్మరెలు 
నాలో రేపే ఆనందహేల నీకు 
తెలియచేప్పాలంటే పదాలే దొరకవేం ...

నిరంతం ముసిరే  వీడని నీ జ్ఞాపకాలు
దారి తెన్నులు తెలియని నా ఆలోచనలు
నా  శుష్కదేహాన్ని క్షతగాత్రం చేస్తూ
గమ్యమే తెలియని నా ప్రయాణం లో
ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నాయి  ప్రతీ క్షణం ....

ఆ ఎండిన ఆకులు వంటి నీ
జ్ఞాపకాలు నా మది లోంచి
తుడిచేయటానికి  ఒకే ఒక్క
క్షణం  చాలు కదా తెలుసా ..

అబ్బా అబ్బా రోజు రాలే 
ఈ ఆకులుని శుభ్రం చేయలేక చస్తున్నా 
మళ్ళీ వీటిని ఫోటోలు తీసే పిచ్చోళ్ళు  కొంతమంది 
ఆ ఫోటో చూసి బ్లాగులు రాసే తిక్కలోళ్ళు 
ఇంకా  కొంతమంది..


(నన్ను వదిలేసి,   మీ తలనొప్పికి కారణమైన ఈ తవికలకి మూలం ,  ఈ పిక్చర్ తీసిన వారి  ఫోటోగ్రఫీ స్కిల్  గా గుర్తించి  మీ అక్షింతలు వారికి  మాత్రమే  పరిమితం చేయాల్సిందిగా మనివి)

22 comments :

రాజ్ కుమార్ said...

mummyyyyyyyyyyyyyyyyyyyyyyyy

రాజ్ కుమార్ said...

రాలిన ఆకులు ఫోటో తీసి బ్లాగులో పెట్టడం వల్ల ఇన్ని అనర్ధాలు జరుగుతాయయని ఇప్పుడే తెలిసింది... ;) ;)
(JK)

ఫోటాను ఫోటో బాగుందీ, దానికి మీ తవిక భీ బాగుంది..

ఫోటాన్ said...

అర్జునా... అర్జునా....
(పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు వచ్చేటపుడు ఇలా అరుస్తుంటాము :))

ఆహా...అక్షింతలు నాకా... నేను లేను బాబోయ్, పరార్ ... :))

ఫోటాన్ said...

>>>నిరంతం ముసిరే వీడని నీ జ్ఞాపకాలు
దారి తెన్నులు తెలియని నా ఆలోచనలు
నా శుష్కదేహాన్ని క్షతగాత్రం చేస్తూ
గమ్యమే తెలియని నా ప్రయాణం లో
ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నాయి ప్రతీ క్షణం ....<<<

వావ్.. ఈ లైన్స్ నచ్చాయి నాకు :)

బంతి said...

ఏం ఏం ... ఎందుకిలా డిసైడ్ చేసారు ? వై? క్యున్ ?

అన్నట్టు కవితాత్మ అంటే ఏంటండి!

కవిత+ఆత్మ లేక కవిత యొక్క ఆత్మ ??

తృష్ణ said...

photo & kavita.. both are nice :)

Chandu S said...

Very good. Sravya, try to write more. 

బులుసు సుబ్రహ్మణ్యం said...

పూల బాసలు తెలుసు ఎంకీకి
ఎండుటాకుల పాట తెలుసు శ్రావ్యాకి.

చాలా బాగుంది మీ కవిత.

వేణూశ్రీకాంత్ said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ :-))))

శశి కళ said...

kevvvvvvvvvvvvv malla malla raale aakulu :))

చాతకం said...

Wow! Btw, whose memories are compared to fallen leaves?that bad? Ouch!!! ;)

చాతకం said...

Forget that sad poetry. Ahem. We want know more about camera settings. Looks like SLR. What lense is used? ISO? Aperture? Fp? Macro lens? Tripod or not? Demand the details. ;) .

Unknown said...

నిజమే ? !!

ఇది రవీయం బ్లాగేనా :))

కవిత బాగుంది శ్రావ్య గారు

ఆ.సౌమ్య said...

శ్రావ్య యు భీ?? నహీఈఈఈఈఈఈఈ :))

but good try :)

Sravya V said...

@రాజ్కుమార్ ఫోటో తో పాటు తవిక భీ నచ్చినందుకు బోలెడు థాంక్స్ :-)
@ఫోటాన్ నేను లేను అంటే మాత్రం కుదురుతుందా , లేకపోతే అర్జునా అర్జునా అని అరిస్తే కుదురుతుందా , నో నహీ :-) చాల చాల థాంక్స్ హర్ష !
@బంతి పోయి నన్ను అడుగుతారు ఈ సంధులు సమాసాలు. ఏదో నేను చెప్పేది ఎదుటివాళ్ళకి అర్ధం అయితే చాలు అనుకునే రకం నేను :-) థాంక్స్ !
@తృష్ణ గారు చాలా థాంక్స్ అండి :-)
@శైలజ అబ్బా మీకు బోలెడు థాంక్స్ అండి :-)

Sravya V said...

@బులుసు సుబ్రహమణ్యం గారు , గురువు గారు మీకు నచ్చింది అంటే వంద మార్కులు వచ్చినట్లే :-) థాంక్స్ అండి !
@శ్రీకాంత్ గారు మీరు అసలు సూపర్ ! నిజం గా చాల బాగా రాసారు ! థాంక్స్ అండి :-)
@వేణు గారు కెవ్వు మన్నందుకు బోలెడు థాంక్స్ :-)
@శశికళ గారు హ హ థాంక్స్ అండి :-)
@చాతకం గారు ఎవరివి అనుకుంటే వాళ్ళవి ఫీలింగ్స్ :-) చాలా థాంక్స్ అండి . ఈ ఫోటో తీసిన ఫోటాన్ ఊరు చెక్కేసాడు హాలిడేస్ కి రాగానే మీకు ఆ టెక్నికల్ విషయాలు చెప్పేస్తాను !

Sravya V said...

@స్వాతి శంకర్ గారు మిమ్మల్ని ఇక్కడ చూడటం చాల సంతోషం గా ఉందండి ! మీకు నచ్చినందుకు బోలెడు థాంక్స్ :-)
@శేఖర్ అవును అవును అదే బ్లాగ్ , మీరు సరైన ప్లేస్ కే వచ్చారు :-) థాంక్స్ అండి :-)
@సౌమ్య గారు ఏదో సరదాకి , మీరు కంగారు పడకండి :-) థాంక్స్ !

ఫోటాన్ said...

Chathakam garu!
my camera is Sony HXV-20, it is not DSLR.

here is details of the pic, (captured with Auto Mode in settings)

Camera: DSC-HX20V
Exposure: 0.013 sec (1/80)
Aperture: f/4.5
Focal Length: 13.61 mm
ISO Speed: 160
Exposure Bias: -
Flash Used: No

Sravya V said...

@ఫోటాన్ చాలా చాలా థాంక్స్ ఇంత బిజీ లో కూడా గుర్తు పెట్టుకుని వివరాలు చెప్పినందుకు :-)

చాతకం said...

Thank you harsha. That was awesome. Great PS macro camera. I suspected DSLR or the new sony NEX camera ;) I suggest you also maintain a flikr or flickriver account for sony user groups that would give us more motivation to tinker and learn a lot. I joined sony DSLR user group a couple of years back, man I am humbled by them still learning by copying. ;)

Anuradha said...

కవిత బాగుంది శ్రావ్య :)

Sravya V said...

@అను గారు థాంక్స్ :-)

Post a Comment