Subscribe:

Tuesday, August 13, 2013

GM Food - II


Contd..  from Part I  

నిజంగా ఈ జన్యుమార్పిడి అనేది మన భవిష్యత్తు ఆహర అవసరాల కోసం దొరికిన సమాధానమేనా? Conventional  Plant Breeding తో పోల్చిస్తే ఇది ఎలా అనుకున్న రిజల్ట్ ఖచ్చితంగా  ఇవ్వగలదు? ఒకవేళ అనుకున్న రిజల్ట్ ఇచ్చినా  దీనితో ఎటువంటి  రిస్క్ గానీ  నష్టం గానీ లేదా? అదే నిజం  అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ  GMOs కు  వ్యతిరేకం గా  ఇన్ని ఆందోళనలు ఎందుకు ?  Dr. వందనా శివ లాంటి వారు ఆరోపిస్తున్నట్లుగా  ఈ GMOs  తో అగ్రి బిజెనెస్ లో అగ్రగామిగా నిలుస్తున్న Monsanto లాంటి  corporates బయో రేప్ కు  తెగబడుతున్నయా ?

ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలి అంటే అసలు ముందు ఈ జన్యుమార్పిడి అనేది ఎలా జరుతుందో చూద్దాం . మొక్కలు , జంతువులు, మనుషులు  ఇలా అన్ని ప్రాణులు జీవకణ సముదాయాలు అని మనకందరికీ తెలిసిన విషయమే.  బ్రతకటానికి అవసరమైన రకరకాల జీవక్రియలలోపాల్గొనే ఈ జీవకణాల లోపల ఆర్గనైల్ అనే  ఇంకా బోలెడు చిన్న చిన్న ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి.  వీటిలో అన్నిటికన్నా పెద్దదైన, అలాగే జీవక్రియలకి అధికారక కేంద్రమైన  న్యూక్లియస్ లోపల సుమారు అయిదారడుగుల పొడవున్న అతి సన్నని  DNA పోగులు ప్రోటీన్లని  చుట్టుకుని  ఉంటాయి. ఈ పొడుగాటి  DNA  లోని  ఒక్కొక్క భాగాన్ని  జీన్ అంటాం (అంటే ఇలాంటి చాలా జీన్స్ కలిస్తే ఒక DNA తయారవుతుంది). ఈ జీన్స్ చేసే ముఖ్యమైన పని జీవ కణాలు చేసే రకరకాల పనులు నిర్వర్తించే  ప్రోటీన్ ని  ఎలా తయారుచేయాలోఆ కోడ్ ని కలిగి ఉండటం. జన్యుమార్పిడి పద్దతిలో ఈ జీన్స్ ని డైరెక్ట్ గా manipulate చేయటం ద్వారా  స్పెసిఫిక్  DNA sequence ని మార్చి అత్యంత ఎఫెక్టివ్ గా సరికొత్త characteristics ఉన్న  organism ని  సృష్టిస్తారు.  అలాగే ఈ పద్ధతిలో జీన్స్ ని వేరే జాతి మొక్కల నుంచి కానీ, లేదూ జంతువుల నుంచి కానీ  తీసుకోవచ్చు అని కొన్ని examples తో సహా చూసాం కదా? అలా ఒక జాతి నుంచి జీన్స్ ని వేరే జాతి జీన్స్ లోకి ప్రవేశపెడితే వచ్చే ఆ resulted genetically modified organism (GMO) ని 'transgenic' అంటారు . 

ఈ జీన్స్ manipulation కి రకరకాల పద్దతులని ఉపయోగిస్తారు అందులో కొన్ని ముఖ్యమైనవి ఇవి:   
*1. Bacterial carriers *2. Biolistics *3. Electroportation *4. Gene Silencing *5. Gene Splicing  *6. Micro injection *7. Viral carriers

ఇలా conventional plant breeding లో లాగా కాకుండా కావాల్సిన లక్షణాలు ఎంచుకుని డైరెక్ట్ గా జీన్ కోడ్ ని మార్చటం ద్వారా  కావాల్సిన సరి కొత్త లక్షణాలు ఉన్న మొక్కలని ఉత్పత్తి చేస్తారు కాబట్టి సంవత్సరాల తరబడి జాగ్రత్తగా కావలసిన result కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. అలాగే కేవలం కావలసిన లక్షణాలు ఉన్న జీన్స్ ను మాత్రమే మార్పుకు  గురిచేయటం వల్ల conventional plant breeding తో పోల్చితే కావాల్సిన రిజల్ట్స్ ఖచ్చితంగా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

ఈ కావాల్సిన లక్షణాలని చొప్పించటం వల్ల ఉపయోగాలు ఏంటో  ఒకసారి చూద్దాం. 
1. తెగుళ్ళు, చీడ పురుగులుని  (అంటే పంటలని నాశనం చేసే కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగు లాంటివి ) తట్టుకునేట్లుగా కొత్త  genetic traits ని రూపొందించటం ద్వారా పర్యావరణానికి హాని చేసే క్రిమిసంహారక మందులు వాడకాన్ని తగ్గించవచ్చు .
  • ప్రత్తి పంటకి 'లెపిడోప్టెరిన్ లార్వా' (Boll worm)  ద్వారా కలిగే నష్టాన్ని క్రిమిసంహారక మందులు వాడకుండా నాశనం చేయటానికి 'బాసిల్లం తురింజెనెసిస్'  అనే బాక్టీరియా నుంచి జీన్స్ ని ప్రత్తి లో ప్రవేశపెట్టి   BT కాటన్ ని రూపొందించారు. (మరిన్ని వివరాలకు  BT Cotton). 
  • BT కాటన్ ఎక్కువగా సాగుచేసే ఇండియా, చైనా లలో bollworm క్రమేపీ ఈ BT పంటలని ఎదుర్కొనేందుకు రెసిస్టన్స్ పెంచుకున్నట్లుగా రీసెంట్ స్టడీస్ చెబుతున్నాయి. దీనికి మోనసాంటో సమాధానం - "Natural and expected" (ఈ కాంట్రవర్సీ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ  ) 
  • బొప్పాయి లో వచ్చే రింగ్ స్పాట్ వైరస్ ని ఎదుర్కోవటానికి రెయిన్బో అనే F1 హైబ్రిడ్ వెరైటీ ని రూపొందించారు (మరిన్ని వివరాలకు Rainbow Papaya )   
  • మొక్కజొన్న లో   European corn worm, Corn ear worms ఇంకా  Root worms వంటి చీడలని అరికట్టటానికి   'బాసిల్లం తురింజెనెసిస్'  అనే microorganism ని   మొక్కజొన్న జీనోమ్ లోకి ప్రవేశపెట్టడం ద్వారా BT కార్న్ ని రూపొందించారు. (మరిన్ని వివరాలకు BT Corn )
  • మోనార్క్ butterfly కాంట్రవర్సీ వివరాలు ఇక్కడ
2. కరువు ప్రాంతాల్లో సాగుకి వీలుగా తక్కువ నీటిని వినియోగించుకునేట్లు గాను, అలాగే వేరే అననుకూల వాతావరణ పరిస్థితులు తట్టుకునేట్లుగా కొత్త  traits ని ఉత్పత్తి చెయొచ్చు. 
  • Grey Mangrove  నుంచి  Avicennia marina అనే జీన్ ని పొగాకులో ఇంప్లాంట్ చేయటం ద్వారా ఉప్పునేలలో కూడా సాగుచేసేట్లుగా రూపొందించారు . 
3.పౌష్టికాహార లోపాలని అధిగమించేందుకు ఎక్కువ న్యూట్రియస్ విలువలు ఉండే ఉత్పత్తులని అందించే genetic traits ని అందుబాటులోకి తేవచ్చు.
  • A విటమిన్ లోపం వల్ల వచ్చే బ్లైండ్నెస్ అని అరికట్టటానికి గోల్డెన్ రైస్ అనే Vitamin- A enriched వెరైటీని రూపొందించారు . (మరన్ని వివరాలకి  Golden rice )
ఇవి జన్యుమార్పిడి అనే కాయిన్ కి ఒక వైపు ఉన్న ఉపయోగాలు అయితే మరి రెండో వైపు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన  ఆందోళనకి గురిచేస్తున్న అంశాలు ఏమున్నాయో చూద్దాం. 
  1. జన్యుమార్పిడి అనేది పూర్తిగా నిపుణులు  లాబ్స్ లో చేసే ప్రక్రియ. దాంతో రైతు తన భూమిలో ఏమి పండిచాలి అనేది క్రమేపీ MNC ల ఆద్వర్యంలో నడిచే రీసెర్చ్ సెంటర్స్ లో నిర్ణయించబడే ప్రమాదం పొంచి ఉంటుంది.
  2. ఈ పధ్ధతి ద్వారా పండించిన ఆహారపదార్ధాలని తినడం allergies,  కాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది అని అనేక అభియోగాలు ఉన్నాయి కానీ ఇంతవరకూ వాటిని నిరూపించ గలిగిన ఎటువంటి ఆధారాలు లేవు.
  3. GMO , Non GMO  పంటల క్రాస్ పోలినేషన్ ద్వారా బయోడైవర్సిటీ కి వచ్చే ముప్పు.ఈ సమస్యని ఎదుర్కోవటానికి ఈ క్రింది  పరిష్కారాలు ఉన్నాయి .
  • GM ప్లాంట్స్ ని పోలినేషన్ కి అవసరమైన  పోలీన్ ని (male sterile చేయటం) ప్రొడ్యూస్ చేయకుండా modify చేయడం. 
  • పోలీన్ లో modified జీన్స్ లేకుండా modify చేయడం.  
  • GM పంటలని పండించే ఫీల్డ్స్ చూట్టూ బఫర్ జోన్స్ ని మైంటైన్ చేయడం. 
ఈ మూడు పద్దతులలో ఏదో ఒక పద్దతి ద్వారా క్రాస్ పోలినేషన్ ప్రమాదాన్ని నివారించవచ్చు.  
మరి ఇలా సొల్యూషన్ ఉన్న సమస్యలతో  నిజంగా GMOs ని ఇంత భారీ ఎత్తున వ్యతిరేకించాలా అంటే సమాధానం "No" అనే  చెప్పాలి . క్లైమాటిక్ చేంజెస్ కి అనుగుణం గా నాచురల్ గా ప్రకృతిలో జరిగే మార్పులు చాలా నిదానంగా జరుగుతాయి, మరి అలాంటప్పుడు   పెరుగుతున్న జనాభా అవసరాలకి సరిపడా ఆహారభద్రత  సంగతి ఏంటి అంటే ? తప్పనిసరిగా పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడకుండా వేరే దారుల కోసం వెతకాల్సిందే. అటువంటి అవసరాలకి ఈ  GMOs ప్రొడ్యూస్ చేయడం అనేది ప్రస్తుతం మనకి కనపడుతున్న ఏకైక పరిష్కారం.  
అసలు నిజానికి ఈ GMOs వ్యతిరేకించే/ బూచిగా చూపించే ప్రయత్నం చేసే  చాలా మంది చెప్పే కారణాలు పరిశీలిస్తే అవి ప్రధానంగా  ఈ  టెక్నాలజీ ద్వారా పొంచి ఉండే ప్రమాదం కన్నా  ఈ రంగంలో మొనోపలీ సాధించిన Aventis, Monsanto  లాంటి   కంపెనీల లాభాలే ధ్యేయంగా సాగే వ్యవహారశైలి, అలాగే  వాటి పాలసీల వల్ల రైతులకి ఆర్ధికంగా కలిగే నష్టాల  లిస్టు పెద్దగా ఉంటుంది. 
ఉదాహరణకి 
  • టాక్స్ avoid చేయటానికి  ఒక స్వంత టౌన్ ని నిర్మించుకుని అక్కడే hazardous waste ని వదిలివేయడం ద్వారా విపరీతంగా pollute చేయటానికి తెగబడటం . 
  • Patented పాలసీ  అడ్డుపెట్టుకుని భారీ మొత్తంలో నష్టపరిహారాన్ని వసూలు చేయటం కోసం  పేద రైతుల మీద కేసులు పెట్టడం. 
  • గవర్నమెంట్ పాలసీలు తమకి అనుకూలంగా ఉండేట్లుగా  లాబీయింగ్ చేయడం. 
  • మరీ ముఖ్యంగా కంపెనీలు రూపొందించిన  ప్రతి GMO కి ఒక నిర్ణీత కాలవ్యవధిలో  thorough evaluation and assessment అయిన తరవాత మాత్రమే అనుమతి పొందాల్సి ఉంటుంది. లాభాలని దృష్టిలో పెట్టుకుని ఈ కాలపరిమితిని తగ్గించినా లేదూ సరైన పరిక్షలు  చేయకపోయినా భవిష్యత్తు లో విపరీతంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది . ఇంత సున్నితమైన విషయంలో ఈ కంపెనీల వ్యవహారశైలి  transparent గా  లేకపోవటం అనేక అనుమానాలకి తావునిస్తుంది. 
కంపెనీలు వాటి అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలకి మాత్రమే చెందిన సమస్యల పరిష్కారానికి మొత్తం టెక్నాలజీనే బ్లేం చేయటం,  GMOs ని హేట్  చేస్తూ భారీ ఎత్తున ఆందోళనలు చేయటం సరైనదేనా ? 
ఖచ్చితంగా కాదు.
GM crops కి అనుకూల , వ్యతిరేకవాదనలు చూస్తే polarize  అయిన దాఖలాలు కనిపిస్తాయి. నిజానికి   Unethical practices కి తెగబడే corporation stuff  ని  వదిలేసి టెక్నాలజీని  హేట్ చేసే   anti -GMO activists చేసే ఆందోళనలు, స్వంత లాభాల కోసం  అదే unethical practices కి పాల్పడే కంపెనీలు చేసే నష్టంతో ఏ  మాత్రం తీసిపోవు. GM crops ని వ్యతిరేకించే వారి భయాందోళనలని పరిశీలించి వాటి నివారణకి కావాల్సిన safety  measures  పాటించాల్సిన బాధ్యత కంపెనీలు, ప్రభుత్వాలు మీద ఎంత ఉందో,  భవిష్యత్తు అవసరాలకు కావాల్సిన ఈ టెక్నాలజీ ప్రజలని  తీవ్రమైన పానిక్ కి లోనుచేయకుండా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం GMOs ని వ్యతిరేకించే వారి మీద కూడా అంతే ఉంది.    

జెనెటికల్లీ modified crops  కి ఆకలి / కరువు, మాల్ న్యూట్రిషన్ వంటి ప్రొబ్లెమ్స్ సాల్వ్ చేసి,  క్రిమిసంహారక మందులు & herbicides వంటి రసాయనాల వాడకాన్ని తగ్గించటం ద్వారా ప్రకృతి సమతుల్యతని కాపాడే సామర్ధ్యం  ఉంది. అదే సమయంలో సేఫ్టీ టెస్టింగ్ , regulation, ఇంటర్నేషనల్ పాలసీల  వంటి చాలెంజెస్ ని సమర్దవంతంగా ఎదుర్కొవలసిన అవసరం కూడా అంతే ఉంది. 

ఒక్కసారి గత కొద్ది సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన మార్పులని చూస్తే మానవసమాజం పైన టెక్నాలజీ చూపించిన ప్రభావాన్ని గమనించొచ్చు. Certainly technology made our present day life much better than olden days ! మిగిలిన టెక్నాలజీస్ లానే  ఈ GM crops  కూడా  భవిష్యత్తు తరాలకి కావాల్సిన ఆహారభద్రతని అందిస్తూ మరింత  ఆరోగ్యవంతమైన మానవసమాజ నిర్మాణంలో తన వంతు పాత్ర తను పోషిస్తుంది అని నేను నమ్ముతున్నాను . 

-శ్రావ్య 
Images' source - Google images

Additional Notes :

2012 - GM crops స్టాటిస్టిక్స్ 

Table 1

GMOs వల్ల కేవలం పంటల ద్వారానే కాకుండా  మనం పొందుతున్న లాభాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యం గా చెప్పుకోవాల్సింది డయాబెటిక్ patients వాడే ఇన్సులిన్. అలాగే మనం ఈ రోజు చూస్తున్న చాలా రకాల పెట్ డాగ్స్ ఇలా పుట్టినవే . 

*1.Bacterial carriers :The bacterium Agrobacterium can infect plants, which makes it a suitable carrier for delivering DNA to a new organism. 
The bacterium is prepared in a special solution to make its cell walls more porous. The selected gene is inserted into an extrachromosomal DNA molecule (called a plasmid) and dropped into the solution. The solution is heated, which allows the plasmid to enter the bacterium and express the new gene. 
The genetically altered bacterium (or recombinant) is allowed to recover (is ‘rested’) and grow and, depending on the plasmid, make extra copies of the new gene. The bacterium is then allowed to infect the target plant cells so it can deliver the plasmid and the new gene into the cells to be transformed.
*2.Biolistics: The selected DNA is attached to microscopic particles of gold or tungsten. Like firing a gun, these DNA-laden metal particles are shot into the target cells using pressurised gas. The microscopic particles release the DNA inside the plant cells.
*3.Electoporation: The prepared target cells are immersed in a special solution with the selected DNA. A short but intense electric shock is then passed through the solution. The result is small pores or tears in the cell walls, which allow the new genetic material access to the nuclei. 
The damaged cells are placed into another solution and encouraged to repair their breached walls, locking the ‘donor’ DNA inside the cell. The selected DNA is incorporated as a plasmid into the host, which is then incorporated into the plant DNA to provide the host with a new gene.
*4.Gene silencing : This technique is designed to eliminate an unwanted characteristic from an organism. The gene responsible for the organism’s undesirable trait is identified and ‘switched off’. 
One method of ‘silencing’ a particular gene is to attach a second copy of the gene the wrong way around. This technique is used to prevent plants like peanuts and wheat from producing the proteins (allergens) commonly responsible for human allergies. Another approach is to insert foreign DNA within a gene to inactivate it.
*5.Gene splicing :The concept of gene splicing involves cutting a gene from one organism and inserting it into the DNA of another organism so the desired characteristic can be transferred from one organism to another. Bacteria contain restriction enzymes that form part of their defense against invasion by another organism or bacteriophage (a bacterial virus). The restriction enzymes attack the foreign DNA by cutting it into precise sections and preventing it from being inserted into the bacterium’s chromosome. 
Different bacteria produce different restriction enzymes that cut any DNA at different places, making the DNA ‘sticky’ in some cases, which means they can be ‘pasted’ directly onto the target organism’s prepared DNA. 
Using these restriction enzymes from bacteria, molecular biologists can genetically engineer the DNA for insertion into target (host) cells to modify gene traits. The molecular biologist then uses another enzyme (DNA ligase) to fuse the new gene sequences into the chromosome. 
Alternatively, instead of pasting, the new gene may be inserted into a plasmid that invades the target cell and delivers the gene. An example of this is the invasion of plant cells by Agrobacterium tumefaciens.
*6.Microinjection : The selected DNA is injected into a fertilised ovum (female egg cell) through an extremely slender device called a glass capillary tube. The genetically modified egg is then transplanted into the prepared uterus of a receptive female and allowed to grow to term. 
This method ensures that almost every cell in the developing organism’s body contains the new DNA, but not all the offspring will carry the transgene (and be deemed ‘transgenic’).
*7.Viral carriers
Some viruses can invade target cells, but not cause cell damage or death. The selected DNA is added to the genetic makeup of the carrier virus and the virus is allowed to infect the target. As the virus invades cells and replicates, the selected DNA is added to the target cells.

Wednesday, June 5, 2013

GM Food - I


ఈ pic లో ఉన్నవి ఏంటో గుర్తుపట్టగలరా? ఎంటబ్బా ముత్యాలు, పగడాలు వగైరా వగైరా మొక్కజొన్న పొత్తులలాగా పండిస్తున్నారా అని ఆశ్చర్యపోతున్నారా?
అయితే,  మీకు  డిజైనర్ ఫుడ్ అయిన GM  ఫుడ్ గురించి అంతగా తెలియదన్నమాట. రండి రండి ఖచ్చితంగా ఈ పోస్టు మీకోసమే. 
*** 
హ్మ్ ! ఎక్కడ నుంచి మొదలు పెడదాం?  ముందు అసలు GM ఫుడ్  అనే పేరు ఎలా వచ్చింది? అసలు ఆ మాటకొస్తే GM అంటే  అర్ధం ఏంటో చూద్దాం. 'జెనెటికల్లీ మోడిఫైడ్ (జన్యు మార్పిడి)  ఫుడ్' అనేది,  GM ఫుడ్  పూర్తి పేరు. మరి ఇలా ఎందుకంటారు? 'తన సంతతికి   శాశ్వతంగా కొత్త లక్షణాలని అందించేట్లుగా ఒక జాతి ప్రత్యేక లక్షణానికి సంబంధించిన జీన్స్ ను మరొక జాతి జీన్స్ లోకి ప్రవేశపెట్టడం వల్ల ఆ  జాతి జీన్స్ కోడ్ ని  మార్చి  ఒక కొత్త జెనెటికల్లీ మోడిఫైడ్ అర్గానిజంని  సృష్టించటం ద్వారా  ఈ ఫుడ్ ఉత్పత్తి  జరుగుతుంది కాబట్టి దీన్ని  జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ అంటారు.  ఈ జన్యుమార్పిడి పధ్ధతిలో  మొక్కల నుంచి మొక్కలకు మాత్రమే కాదు జంతువుల నుంచి మొక్కలకు కూడా ఈ  జీన్స్ అదే జన్యువులని మార్చే అవకాశం ఉంటుంది.  ఉదాహరణకి టమోటా ఫెరిషబుల్ వెజిటబుల్ అని మనకందరికీ తెలుసు కదా?  1991 లో DNA Plant Technologies అనే కంపెనీటమోటాలోకి చేప జన్యువులని ప్రవేశపెట్టడం ద్వారా టమోటా త్వరగా పండిపోకుండా, అలాగే  నీళ్ళలో ఎక్కువ కాలం నిలువుండేట్లు చేయటానికి ప్రయత్నం చేసింది.  కానీ ఈ ప్రయోగం ఫలించక  ఫిష్ టమోటాని మనం సూపర్ మార్కెట్స్ లో చూడలేకపోయాం. అయితే, ప్రస్తుతం మనం తినే పదార్ధాలలో తప్పకుండా ఈ GM ఫుడ్ traces ఉన్నాయని  చెప్పక మాత్రం తప్పదు. అదెలాగో ముందు చూద్దాం.  

ఇప్పుడు ఈ జన్యుమార్పిడి ప్రక్రియ అంటే ఒక ఐడియా వచ్చింది  కదా ?  మరి నిజంగా  ఈ జన్యుమార్పిడి అనేది  'Modern Marvel' లాంటి ప్రక్రియేనా ?   ఆ మాటకొస్తే ఇలా చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు చేయాలి ?అసలు సాంకేతికంగా ఇది ఎలా సాధ్యం? అనే విషయాలు  చూద్దాం

1980 ప్రాంతం లో తొలిసారిగా టమోటాని  "antisense” approach  (అంటే టమోటా పండటానికి అవసరమైన ఎంజైమ్ ఉత్పత్తికి అవసరమైన polygalacturonase అనే ను జీన్ ను క్రోమోజోం నుంచి వేరు చేసి తిరిగి వ్యతిరేకదిశలో (antisense direction) ప్రవేశపెట్టడం) వాడి  ఎక్కువ కాలం నిలువ ఉండేలా చేయచ్చు అన్న ప్రయత్నాలను మొదలుబెడితే, అంతకు ముందు కొన్ని వందల సంవత్సరాల నుంచి రకరకాల పళ్ళు, కూరగాయలు, మిగిలిన ఆహారధాన్యాలు మరింత రుచికరమైన, వేరు వేరు ఆకారాల్లోను, మరింత కాలం ఎక్కువ నిలువుండేట్లు గాను, మరింత మెరుగ్గా మొక్కలు వ్యాధులని ఎదుర్కునేట్లు గాను చేయటానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి. నిజానికి ఈ ప్రయత్నాలు చాలా విజయవంతం కూడా అయ్యాయి, పైగా వాటి ఫలితాలని మనం 'రుచి' చూస్తున్నాం కూడా. మరి అదెలా సాధ్యం? అంటే ఈ జన్యుమార్పిడి కన్నా ముందు నుంచి ఏదో టెక్నిక్ ఉందన్న మాట ఇలాంటి వాటిని సాధ్యం చేయటానికి. కరెక్ట్ ఉంది, అదే Conventional Plant Breeding/ Traditional Plant Breeding. 

Conventional  Plant Breeding/ Traditional Plant Breeding : 
ఈ పధ్ధతిలో In Breeding,  Cross Breeding(Hybridization),  Grafting (అంటుకట్టడం)  అనే  టెక్నిక్స్ ని  వాడతారు. ఈ పేర్లు చూడగానే చిన్నప్పుడు చదువుకున్న బోటనీ పాఠాలు గిర్రున బుర్రలో తిరిగాయి కదా? ఒకే ,  ఏ విషయం అయినా  సరే అప్పటికప్పుడు గూగుల్ చేసి చూసి, అవసరం తీరగానే బుర్రలోనుంచి shift + del  కొట్టే కాలం లో బ్రతుకుతున్నాం కాబట్టి సరిగా గుర్తురాకపోవటం  పెద్ద క్రైమ్ కాదు. అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళ కోసం వీటి గురించి కొంచెం క్లుప్తం గా వివరించటానికి ప్రయత్నం చేస్తాను . 

  • ఈ  మూడు పద్దతులలో ఎటువంటి లక్షణాలు ఉన్న వెరైటీ ని పెంచాలి అనుకుంటున్నామో దానికి తగ్గ పేరెంట్ ప్లాంట్స్ ఎన్నుకుంటారు. 
  • In Breeding  Cross Breeding  లలో అయితే ఈ పేరెంట్ ప్లాంట్స్ ని simultaneous గా పెంచుతారు. దీని వల్ల పేరెంట్స్ రెండూ ఒకే టైములో పూత దశ కి వచ్చే అవకాశం ఉంటుంది . 
  • పూతదశకి రాగానే నాచురల్ pollination జరగకుండా జాగ్రత్తలు తీసుకుని, కొత్త  సంతతికి కావాల్సిన లక్షణాలు వచ్చేట్లుగా paintbrushes, tweezers  సహాయం తో మేల్ పేరెంట్ లోని pollen ని ,  ఫిమేల్ పేరెంట్ లోని stigma మీద ఉంచటం ద్వారా  artificial fertilization చేస్తారు.  
  • కొన్ని మొక్కలలో pollen ని,  ఫిమేల్ ప్లాంట్ pistil లోకి ప్రవేశపెట్టిన తరవాత ఆ వచ్చే మొదటితరం గింజలని  మొదట గ్రీన్ హౌస్ లోను, తరవాత  ఫీల్డ్స్ లోను కావాల్సిన  ప్రత్యెక లక్షణాలు వచ్చే వరకు పరీక్షించటం ద్వారా తయారుచేస్తారు. 
  • Cross Breeding కు  In Breeding  కు  ఉన్న తేడా :In breeding లో  parents,  ప్లాంట్స్ రెండూ genetically same group కి చెందినవిగా ఉంటాయి, అదే Cross Breeding లో పేరెంట్ ప్లాంట్స్  genetically different individuals  అయి ఉండొచ్చు . 
  • ఇక Grafting (అంటుకట్టడం) లో ఎన్నుకున్న మొక్కలోని ఒక మొక్క టిష్యూ (కణజాలాన్ని) వేరే మొక్క కణజాలం లోకి చొప్పించటం ద్వారా కొత్త లక్షణాలు వచ్చేట్లుగా చేస్తారు.  మరింత గా తెలుసుకోవటానికి ఇక్కడ చూడండి . 
  • Luther Burbank అనే అమెరికన్ Botanist తన 55 సంవత్సరాల కెరీర్ లో 800 రకాలకు పైగా జాతుల మొక్కలని అభివృద్ధి ఈ పద్ధతిలో అభివృద్ధి చేసారు. (వివరాలు ఇక్కడ ).
  • మన రాష్ట్రంలో ఈ పద్ధతిలో సాధించిన అభివృద్ధికి ఈ ఉదాహరణ చెప్పొచ్చు:  మన ప్రాంతంలో  ఎక్కువగా సాగు చేసే వరిని తీసుకుంటే. 1980ల వరకు కూడా బాగా ప్రసిద్ది చెందిన మసూరిలో పొడుగు  రకాన్ని పండించేవారు. ఈ రకంలో మొక్క ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. దీని పంట సాధారణం గా రైతు చేతికొచ్చే కీలకసమయమైన నవంబర్, డిసెంబర్ నెలలో ఋతుపవనాల మూలంగా పడే వర్షాలకు పంట ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల  త్వరగా ఒరిగిపోవటంతో గింజలు తడిసిపోయి నానిపోవటం వల్ల విపరీతమైన నష్టం జరిగేది. దీన్ని తట్టుకొవటానికి మన వాతావరణంకి అనుకూలమైన పరిస్థితులలో ఎత్తు తక్కువగా పెరిగే రకం వరివంగడాలని  ఇదే traditional పద్దతిలో అభివృద్ధి చేసారు. తరవాతి కాలంలో ఎక్కువ రోజులు నీళ్ళు నిలవ ఉన్నా తట్టుకునేట్లుగాను,  అలాగే నీళ్ళు తక్కువగా లభ్యమయ్యే కరువు సమయాల్లో ఆ పరిస్థితులకి తట్టుకునేట్లు గాను ఎన్నో రకాలు అభివృద్ధి చేస్తూనే ఉన్నారు . (వివరాలు ఇక్కడ చూడొచ్చు) 
Well, అంతా బావుంది కదా ! ఇలా అంతా చక్కగా గడిచి పోతుంటే మరి ఈ జన్యుమార్పిడి లాంటి పద్ధతులు ఎందుకు? ఉన్నాయి..  ఉన్నాయి..  కారణాలు ఉన్నాయి!


పైన Conventional Plant Breeding గురించి చదివినప్పుడు మీకు ఒక అనుమానం బుర్రలో తొలిచి ఉండాలి. మరీ ముఖ్యం గా ఇన్  బ్రీడింగ్ గురించి చూస్తే. అది ఏంటో నేనే చెప్తా ! సీతాకోకచిలుకలు, గాలి, ఇంకా ఏవేవో ప్రకృతి సహజమైన పద్దతుల ద్వారా కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది కదా, మరి మనం ప్రత్యేకంగా ఇలా చేయటం ఎందుకు అని ? ఈ అనుమానం సరైనది, మరి అలా ఎందుకుచేస్తున్నాం? ప్రకృతి సహజంగా  చేసిన ఈ ఏర్పాటు -  పెరుగుతున్న మన జనాభా అవసరాలకి సరిపడా ఉత్పత్తి పెంచటానికి, మరింత నాణ్యమైన ఉత్పత్తులని ప్రొడ్యూస్ చేయటానికి, అలాగే అననుకూల పరిస్థితులని ఎదుర్కోవటానికి సరిపోకపోవటంతో ఇలా ఎక్సెల్ చేయాల్సిన అవసరం కలిగింది. అయితే ఈ Conventional Plant Breeding చాల వరకు మన అవసరాలు తీర్చింది కానీ, ఈ పద్ధతిలో result సాధించటం అనేది చాలా టైం తో కూడుకున్న పని, కొన్ని సార్లు 5 నుంచి పది సంవత్సరాల వరకు, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు. రిజల్ట్ అన్ని సార్లు పాజిటివ్ గానే ఉంటుంది అన్న assurance కూడా తక్కువ. కాలం గడిచే కొద్దీ crop పెర్ఫార్మన్స్ తగ్గుతూ పోతుంది కాబట్టి కొత్త ప్రయోగాలు తప్పని సరి.  అలాగే ఈ Conventional Plant Breeding అనేది closely related characteristics ఉన్న జాతుల మధ్య మాత్రమే సాధ్యపడుతుంది.  ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా పెరుగుతున్న జనాభా, తరుగున్న పంట భూముల విస్తీర్ణం, వృధా అవుతున్న పెరిషబుల్స్ ని అరికట్టడం, అలాగే త్వరితగతిన మారుతున్న క్లైమేట్, తరుగుతున్న నీటి వనరులు వీటిని ఎదుర్కుని మన భవిష్యత్తు అవసరాలకి అనుగుణంగా మరింత పోషక విలువలున్న ఆహరం లభించేట్లుగా పంటలు పండించాలి అంటే ఏమి చేయాలి? ఈ ప్రశ్నలకి సమాధానంగా మనకు ఇప్పటి వరకు దొరికిన జవాబు ఈ జన్యు మార్పిడి.


నిజంగా ఈ జన్యుమార్పిడి అనేది మన భవిష్యత్తు ఆహర అవసరాల కోసం దొరికిన సమాధానమేనా? Conventional Plant Breeding తో పోలిస్తే ఇది ఎలా అనుకున్న రిజల్ట్ ఖచ్చితంగా ఇవ్వగలదు? ఒకవేళ అనుకున్న రిజల్ట్ ఇచ్చినా దీనితో ఎటువంటి రిస్క్ గానీ నష్టం గానీ లేదా? అదే నిజం అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ GMOs కు వ్యతిరేకం గా ఇన్ని ఆందోళనలు ఎందుకు ? Dr. వందనా శివ లాంటి వారు ఆరోపిస్తున్నట్లుగా ఈ GMOs తో అగ్రి బిజెనెస్ లో అగ్రగామిగా నిలుస్తున్న Monsanto లాంటి corporates బయో రేప్ కు తెగబడుతున్నయా ?
Dr. Vandana Shiva Tweet


కొంచెం ఆగండి .. ఇప్పటికే చాలా పెద్ద పోస్ట్ అయ్యింది కదా అందుకే,  ఇప్పటికి ఇక్కడ ఆపేసి  రెండో భాగం లో ఆ విశేషాలు చూద్దాం . 

-శ్రావ్య 
Images' source - Google images

Sunday, May 12, 2013

Relationship Vs Time


మనందరం చిన్నప్పుడు ఫిజిక్స్ లో బట్టీ  వేసిన న్యూటన్ లాస్ గుర్తున్నాయా?  ఒకే ! గుడ్, అవి గుర్తు ఉన్నాయి అంటే Albert Einstein ప్రతిపాదించిన "Special Theory of Relativity" ఒక్కసారిగా ఈ న్యూటన్ లాస్ ని డ్రమాటిక్ గా break చేసి ఇవాల్టి ప్రపంచం అంతా అంగీకరించే  impressive workగా ఎలా గుర్తింపు తెచ్చుకుందో కూడా గుర్తుకోచ్చేసి ఉంటుంది :-)


ఇప్పుడు విషయం ఏంటి అంటే, Albert Einstein ని ఆదర్శం గా తీసుకొని మనకందరికీ తెలిసిన relationship Vs  Time గురించి మనకి తెలిసిన విషయాలనే ఇంకొంచెం refine చేసి మీ ముందుకు తీసుకొద్దాం అని చిన్న ప్రయత్నం చేసా.   అదేంటో తెలుస్కోవాలి అంటే తప్పదు మీకు క్రింద రాసిన సోది చదవటం, కానివ్వండి మరి  :-) 

*  *  *
Theory #1:Some relationships are tremendously exciting, but I believe without some attention, with time  the relationship could,  could, could - I'm searching for the right word - could, could die.(Yeah, I am a big fan of Steve Jobs!)

"హే ఇప్పుడా రావడం, ఎంత సేపటి నుంచో వెయిట్ చేస్తున్నానో తెలుసా నీ కోసం" ?!
"హ్మ్ ! సారీ ! ఏం  చేయమన్నావ్ చెప్పు , నీకు తెలియంది ఏముంది?! పని పని.....  తరగదు,  దానికి తోడు దిక్కుమాలిన మీటింగ్ అని పేరు పెట్టి బుర్రలు తినే ప్రోగ్రామ్స్"
"సరే, అంత చిరాకు ఎందుకంటా, ఇలా ఎంతోమంది మన కోసం పని చేస్తుంటేనే ఇంత  హాయిగా ఉండగలుగుతున్నాం, కూల్ బాబా కూల్ !" 
"నీకేం నువ్వు బానే చెప్తావ్, నా position లో నువ్వుంటే తెలుస్తుంది ఎంత కూల్ గా ఉంటావో" 
"సరే పోనీ ఇప్పుడు ఆ కంపేర్ చేసుకోవటం ఎందుకు, నువ్వే కష్ట పడుతున్నావ్ సరా ?!  ఎంచక్కా ఈ పాట విను మన కోసమే రాసినట్లు గా లేదు ?!"

తూరుపు వెలుగుల , పడమటి జిలుగుల పగడపు మెరుపులలో మనమే 
సాగరతీరపు  చల్లని గాలుల గానంలో మనమే 
చంద్రుడైనా చిన్నబోయే ఇంద్రదనస్సున  ఇద్దరమే 
చీకటి నలుపున మనమే, చిగురాకుల ఎరుపున మనమే  !

" ఆ .... ఆపు  !  ఇప్పుడు నాకు ఆ పాటలు విని ఆనందించే టైం లేదు కానీ , నువ్వు ఎంజాయ్ చేయి. కానీ అది కూడా నేను ఇక్కడ నుంచి  వెళ్ళాక ! నాకు కడుపు కాలిపోతుంది ఏదన్నా ఆర్డర్ చేసావా లేదూ ఇప్పుడు ఇంకో గంట ఇక్కడ వెయిట్ చేయాలా ?!"
"హ్మ్ ! నీ సంగతి నాకు తెలియదా, నీకు ఏమి ఇష్టమో అదే ఆర్డర్ చేసా కదా ?! కొంచెం ఆ చిరాకు పక్కన పెట్టి నవ్వు ! లేకపోతే,  జనాలు  మనం ఎందుకు కొట్టుకున్నమో తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీతో  బిపీలు పెంచుకుని ఆరోగ్యాలు చెడగొట్టుకుంటే  అదొక గిల్టీ ఫీలింగ్ !"
"హే !  కాసేపట్లో నా మూడ్ అంతా మార్చేస్తావ్ కదా , అందుకే .... 

(ఇక్కడతో ఆపేద్దాం అండి , ఇంకా ఎక్కువ వినడం మనకు న్యాయం కాదు,  అసలు ఇంకా వింటే అపెండహే నస అనాలి అని కూడా అనిపిస్తుంది .)

 ****

"ఏంటి ఇంత లేట్ ?"
"ఏమి చేయమంటావ్ ఆఫీసు లో చావకొట్టి చెవులు మూస్తుంటే డెడ్ లైన్లని అవనీ, ఇవనీ "
"ఓహో  అక్కడకి తమరోక్కరే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నట్లు గా భలే చెప్తున్నావ్ !"
"అంటే ఏంటి ? నేను ఊరుకే  కావాలని నేను లేట్ గా వచ్చాను నీ ఉద్దేశ్యమా ?"
"ఆ మాట నేను అనలేదు , అయినా టైం కి రావాలన్న ఉద్దేశ్యం ఉంటె కదా ఈ explanations అన్నీ "
"హే  ! ఏమి మాట్లాడుతున్నావ్ నువ్వు నాకు మాత్రం ఇష్టమా నిన్ను ఇలా వెయిట్ చేయించటం? ఇలా నీతో అనిపించుకోవటం "
"ఆపు ఇప్పుడు నిన్ను నేనేమన్నాను అని , అంతగా వాయిస్ రైజ్ చేస్తున్నావ్?  అసలు ఏ  రోజన్నా చెప్పిన టైం కి వచ్చావా ?  లేదూ చెప్పిన పని చేసావా ? ఎప్పుడు చూసినా వంద సార్లు టెక్స్ట్ చేసో కాల్ చేసో గుర్తు చేయాలి? అసలు మనిషి అంటే ఇంట్రెస్ట్ ఉంటె కదా ?"
"ఏయ్ ! ఏమైంది నీకు ఏమి మాట్లాతున్నవో తెలుస్తుందా? అంటే ఇంత వరకు నువ్వంటే ఇష్టం లేకపోతేనే ఇలా ఉన్నామా మనం"
"ఏంటి ఇష్టం ? ఎదీనేను చెప్పే వరకు గుర్తు లేకపోవటం, నేను ఉన్నాను అని నా అంతట నేను గుర్తు చేసే వరకు  అన్న  సృహే లేకపోవటమా?"
"Just shut up, నేను బిజీ ఉన్నాను అని కూడా అర్ధం చేసుకోకుండా ఏదంటే అది మాట్లాడతావా?"
"What, what you said just now ????  shut up ? వావ్,  కమాన్ నిన్ను ఇంక ఒక్క నిమషం కూడా భరించే ఓపిక లేదు నాకు,  get lost, నేను ఇప్పుడే వెళ్తున్నా , నీ ఇష్టం వచ్చింది చేసుకో ! Btw,  don't ever try to reach me again ! Good Bye !"


--------------------------------------------------------------------------------------------------------


Theory #2:టైం బాబు టైం ! అవతలి వ్యక్తి  మన కోసం టైం స్పేర్ చేయటానికి అనువైన పరిస్థితులు ఉన్నాయో లేవో  తెలుసుకుని అప్పుడు ఆ పర్సనల్ స్పేస్ లోకి అడుగుబెట్టాలి   !

"హాయ్ !"
"హాయ్ ! చెప్పండి , whats up ?"
"Nothing ! లంచ్ కి నాతొ జాయిన్ అవుతారేమో అని "
"yeah ! Why not sure !"
"Okay,  Let us go ! మీరు ఏ క్యుజిన్  ప్రిఫర్ చేస్తారు ?"
"అదేమీ లేదు లెండి నాకు పెద్ద ఫుడ్ గురించి అంత  స్ట్రిక్ట్ రూల్స్, preferences  లేవు !   If you have any  preference let us go for that" .

***

"హాయ్ !"
"హాయ్ ! చెప్పండి !
"ఏంటి ఏదో బిజీ గా ఉన్నట్లు గా ఉన్నారు ?  ఈ రోజు లంచ్ కి నాతొ జాయిన్ అవుతారేమో అని ?"
"ఏంటీ ఏదన్నా విశేషమా ? btw నేను కొంచెం బిజీ గా ఉన్నాను, మీతో జాయిన్ కాలేనేమో !"
"బిజీ అది ఎప్పుడూ ఉండేదే కదా , కాసేపు పక్కన పడేస్తే పర్లేదు లెండి !"
"లేదండి ఈ రోజుతో ఇది కంప్లీట్ చేయాలి,సారీ మరోసారి చూద్దాం లెండి  !"
"భలే వారు అసలు ఇలాంటి అప్పుడే కొంచెం మైండ్ డైవెర్ట్ చేసుకోవాలి స్ట్రెస్ లెవెల్ తగ్గటానికి రండి "
"హలో !ఇక్కడ  ఇంకొక్క ముక్క మాట్లాడినా,   I will rip you down  into pieces!   Can't you   understand what I am trying to convey ? "  (There you go ! English is such a beautiful language కదా ? తిట్టినా ఎంత ముద్దుగా ఉందొ  :P )


--------------------------------------------------------------------------------------------------------

Theory #3:కొన్ని relationships విలువ వయస్సు పెరుగుతుంటే కానీ తెలియదు. అలాగే వయస్సుతో పాటు  అవి మరింతగా దృఢమవుతాయి !

"అమ్మా ! రేపు పార్లర్ కి వెళతా! "
"ఎందుకో"
"నా ఫ్రెండ్స్ అంతా జుట్టు ఎంత స్టైల్ గా మైంటైన్ చేస్తున్నారో చూసావా , నేను పార్లర్ కి వెళ్లి స్టైలింగ్ చేయించుకుంటా "
"వద్దామ్మా, ఎంత బావుందో చూడు నీ జుట్టు పట్టులాగ. అలా చేయిస్తే పాడై పోతుంది "
"ఏం కాదు ! నువ్వు ఎప్పుడూ అన్నిటికి ఇలానే చెప్తావ్ ! నా ఫ్రెండ్స్ అందరూ చూడు ఎలా మైంటైన్ చేస్తున్నారో"
"బంగారుతల్లీ, నేను చెప్పిన మాట వింటుందట.  అలా చేస్తే ఇప్పుడు బావున్నా తరవాత పాడువుతుంది అమ్మా , నా మాట విను. నేను ఏది చెప్పినా నీ మంచికి కాదు ?"
"ఏం  కాదు ఎప్పుడూ నీ ఇష్ట ప్రకారమే చేయాలంటావ్.  I hate you ! నువ్వు మంచి అమ్మవు కాదు !"  

***

"అమ్మా ఏం చేస్తున్నావ్ "
"ఏమి చేయటం లేదమ్మా !  ఏముంటుందీ చెప్పు . ఇంతకీ నువ్వెలా ఉన్నావా, ఏదన్నా తిన్నావా లేదా ఇంకా !"
"అబ్బా తింటాలేమ్మా ! అలా ఏం పని లేదు అంటూనే ఉంటావ్. ఏదో ఒకటి చేస్తూనే ఉన్తవు. నీకు అసలు రెస్ట్ తీసుకోవాలి అని ఉండదా ?"
"రెస్ట్ కాక ఏం చేస్తున్నా నేను ఇప్పుడు ?! పిచ్చిదానివి కాబట్టి ఇక్కడ నేనేదో తెగ కష్ట పడుతున్నా అని ఊహించుకుంటూ ఉంటావ్ అంతే ! ఇక్కడ నేను హాయిగా ఉన్నాను. "
"సరే నేను చెప్పింది నువ్వు వినవు కదా ! ఇంతకీ అమ్మా నిన్న పంపినా రెండు పిక్స్ లో ఆ డ్రెస్ బావుందో చెప్పలేదు? నేను ఈ రోజు వెళ్లి ఆర్డర్ చేస్తాను ఏది బావుంది ?"
"నేను ఇక్కడ నుంచి చెప్పేది ఏంటి తల్లీ, అక్కడ చూసి ఏది సూట్ అవుతుందో అది తీసుకో నీకు కదా నచ్చాల్సింది . " 
"లేదమ్మా నీ సెలక్షన్ బావుంటుంది, నా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటే  నాకు ఎంత గర్వంగా  ఉంటుందో తెలుసా ? చెప్పమ్మా ప్లీజ్ !"
"వినవు కదా , సరే నీకు ఆ పింక్ కలర్ చాలా నప్పుతుంది అదే తీసుకో!"
"థాంక్ యు అమ్మా , నాకు తెలుసూ నీకూ అదే నచ్చుతుంది అని. లవ్ యు, బై !"


PS : సరదాకి చేసిన ప్రయత్నం. నిజంగా ఆ theory of relativity ని అర్ధం చేసుకోవటమే మహా కష్టం నాలాంటి వాళ్ళకి. ఇక ఆ మేధావి తో పోటీ పడటం , లేదు నేను అంత సాహసం చేయబోవటం లేదు. అండ్ అందరికీ తెలిసినదే అనుకోండి Albert Einstein నోబెల్ ప్రైజ్ తెచ్చిపెట్టినది ఈ theory of relatively కాదు, Theoretical Physics లో ఆయన చేసిన సేవలకి గాను, మరీ ముఖ్యం గా Law of Photoelectric effect కనుకున్నందుకు.  
Btw ఏంటి ఈ అమ్మాయికి సడన్ గా ఈ విపరీతమైన ఆలోచన బుర్రలో తొలిచింది అనుకుంటున్నారు కదూ  హ హ , ఒక్కసారి ఈ రోజు specialty ఏంటో గుర్తు చేసుకోండి :-)

-శ్రావ్య 

Tuesday, April 2, 2013

అనగనగా ఒక ఇంటర్వ్యూ


ఈ పోస్టు వెనక కథ :
నాకు చిన్నప్పటి నుంచి ఒక తీవ్రమైన కోరిక . అదీ అదీ ...  మరీ ఇంత సాగదీస్తున్నా ఏం కొంపలు మునిగే కోరికో అనుకోకండి. చిన్నదే , మరేం లేదండి ఎవరినైనా పట్టుకుని ఇంటర్వ్యూ అన్న పేరుతొ ప్రశ్నలతో ఎడాపెడా కొట్టాలని. మాములుగా అయితే ఏదన్న పరీక్షల కోసం చదివితే ఆ పరీక్ష అవ్వగానే కనీసం పరీక్ష హాల్ నుంచి బయటికి రాగానే మర్చిపోవటం , అలాగే ఇవాల్టి కోరిక రేపటి కొత్త కోరిక క్రింద కప్పిపెట్టేయడం నాకు బాగా  అలవాటు. కానీ అదేంటో ఈ ఇంటర్వ్యూ చేయాలన్న కోరిక మాత్రం రోజు రోజుకి మందు వేయని పిచ్చి మొక్కలాగా పెరిగి మహావృక్షం అయిపొయింది. ఆ కోరిక మహ ఉదృతంగా పెరగటానికి మన టీవీలలో వచ్చే ఇంటర్వూస్ కావలసిన ఆక్సిజన్ని అదించాయి లెండి . అదండీ ఈ పోస్టు కధ, మరి వెనక  కథ ఉంటె ముందు కథా ఉండాలి గా అందుకే చూడుడు క్రింద . 

ఈ పోస్ట్ ముందు కథ :
రోజు రోజుకీ పెరిగిపోతున్న ఈ నా చిన్న కోరిక నా జీవితఆశయం గా మారి ఎవరో ఒకరి జీవితం బలి తీసుకోకముందే దాని అంతు చూడాలి అని రంగంలో దూకా. నాకున్న స్కిల్స్ అన్నీ వాడి ఇంటర్వ్యూకి కావాల్సిన గెస్ట్ కోసం వెతకటం మొదలెట్టా. అప్పుడు కానీ మన పవర్ అర్ధం కాలేదు. నా నోట్లో నుంచి ఇంటర్వ్యూ లో "ఇ " అన్న అక్షరం కూడా బయటికి రాకముందే జనాలు పారిపోవటం మొదలెట్టారు. ఇక ఇలా లాభం లేదు అని సెంటిమెంట్ తో కొట్టా ఒక కాండిడేట్ని పట్టా . ఎవరా ఆ బకరా, అని ఎదురు చూస్తున్నారా? ఎదురు చూపులలో చాలా ఆనందం ఉంటుంది అట కదా ఒక్క రెండు నిమిషాలు ఓపిక పట్టి క్రిందకి స్క్రోల్ చేసి అసలు కథ అదేలెండి ఇంటర్వ్యూ చదవటం మొదలు పెట్టండి . 



అసలు కథ : 

గెస్ట్   : బంతి
హోస్ట్ : శ్రావ్య


(స్వగతం : Actual గా అయితే నా పేరు పైన రాసి గెస్ట్ పేరు క్రింద రాయమని నా ఇగో మహా గోడవపెడుతుంది ! కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి జీవితంలో ఏమి చేస్తాం, Such is Life !)

సరేలెండి స్వగతాన్ని కాసేపు ఆ ఇనపెట్టెలో దాచిపెట్టి  ఇంటర్వ్యూ లోకి వద్దాం !

నేను : బంతి ఎలా ఉన్నారు ? 
బంతి : బంతి నా , బంతి గారు అనాలి అని కూడా తెలియదా? కనీసం ఇంటర్వ్యూ మర్యాదలు కూడా పాటించటం తెలియకుండా ఓ వచ్చేస్తారండి . 

నేను : అంటే...  మీరు నాకు ముందు నుంచే తెలుసుకదా అని కొంచెం ... అలా పిలిచానండి . సారీ మీకు అభ్యంతరం అయితే అలాగే పిలుస్తాను బంతి గారూ రూ రూ ...
బంతి : ఇది పిలిచినట్టులేదు నే పోతే అరిచినట్టుంది. 

నేను : సర్లేండి  ! ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంత మర్యాదగా పిలిచినా సరే అది మీకు సరిగా అనేట్లుగా లేదు. దీని సంగతి ఇంటర్వ్యూ అయ్యాక పర్సనల్ గా తేల్చుకుందాం. కొద్దిసేపు ఆ పిలుపుల విషయం పక్కన పెట్టి నేను అడిగిన వాటికి సమాధానాలు ఇస్తారా ?
బంతి : ఏమి తేల్చుకోవటం ఏమిటో ! మీరు కానీయండి,. ఇందాక వచ్చాక తప్పుతుందా నాకు, రోట్లో తల పెట్టి రోకటి పోటుకి వెరవటం మా ఇంటా, వంటా లేదు  !

నేను : అబ్బో మీకేదో పెద్ద బాక్గ్రౌండ్ ఉన్నట్లుందే ! ఇంతకీ మీరు ఎక్కడ పుట్టారండీ ?

బంతి : ఏంటీ ఎక్కడ పుట్టానా ? అసలు ఇదీ ఒక ప్రశ్నే ? ఎక్కడ పుడితే మీకేందుకండి ? అసలు నేను ఎక్కడ పుడితే మీకేందుకా అని ? అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అంటే ఇదే .... 
సర్లెండి ఖర్మ కాలి ఇక్కడ దాకా వచ్చినాక , నా విసుగు చూపించి ఉన్న ఇమేజ్ని పాడుచేసుకోవటం ఎందుకు . మళ్ళీ ఈ ఇంటర్వ్యూ ఏదో చదివి వచ్చే నాలుగు పెళ్లి సంబంధాలు వాళ్ళు కూడా రాకుండా చేసుకోవడం ఎందుకు? నేను మా ఊర్లో హాస్పిటల్ లో పుట్టాను . 

నేను : (ఇంత టిప్పు టాప్ గా తయారయ్యి వస్తే ఏదో పాపం ఇంటర్వ్యూ మీద శ్రద్ద అనుకున్నా.  ఈ ఇంటర్వ్యూ అడ్డం పెట్టుకుని మార్కెట్ లో రేట్ పెంచుకొవటానికా నాయన ఈ వేషం . ఏమో అనుకున్నా చానా తెలివే ఉంది ).
అది కాదండి నేను అడిగింది !  హాస్పిటల్ లో పుట్టారా? మీ ఇంట్లో పుట్టారా ? అని కాదు నేనడిగింది.  మీ ఊరేది అని ?

బంతి :మీరు గాని అదేదో ఛానెల్ లో పని చేసారా, ఇంతకు ముందు ? ..ఏం లేదు మీ కొస్చెన్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది లెండి.  మా ఊరు ఏదీ అని మామూలు ఆడొచ్చుగా ? ఎక్కడ పుట్టారు అంటే ఏమనుకుంటాం ? ప్రశ్న ఎలా అడగాలో తెలియదు కానీ వచ్చేస్తారు ఇంటర్వ్యూ చేస్తాం అనుకుంటూ ! 


నేను : తిట్టింది చాలు, కొంచెం మీ ఊరు  ఏదో .... 
బంతి:  హైద్ నుంచి దక్షిణంగా 200 కి.మి వెళ్ళి అక్కడ నుంచి నైఋతి కి తిరిగి 150 కి.మి పోతే లెపాక్షి వస్తుంది .  లేపాక్షి దగ్గర కుడి వైపు తిరిగి వాయువ్యంగా పాతిక కి.మి పోతే మడకశిర వస్తుంది. ఆ ఊళ్ళో ఆగ్నేయంగ హాస్పిటల్ ఉంది . ఆ హాస్పిటల్ పడమటి వైపు ప్రసూతి వార్డ్ ఉంటుంది ఆ వార్డ్ లో పుట్టానండి. కానీ పుట్టిన కొన్ని రోజులకే తూర్పుగా  ప్రయాణం చేసి చిత్తూర్ కి వచ్చేసానండి 

శ్రావ్య :  మీరు కాని వాతావరణశాఖలో పని చేసారా ? అయినా మీరు గ్రేట్ అండి పుట్టిన కొన్ని రోజులకే నడిచేసారా ?
బంతి :  ఏంటీ వెటకారమా .. సెటైరా ?  మా నాన్న గారికి ట్రేన్స్ ఫర్ అయితే చిత్తూర్ వచ్చేసాం

నేను : (దేవుడా ఇంకో అరగంట సేపు నాకు ఓపిక, సహనం ప్రసాదించే బాధ్యత నీది ! ) హి హి మీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా అండి. ఈ సారి నుండి జాగ్రత్తగా అడుగుతా మీరెక్కడి వరకు చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారు ?
బంతి : నేను ఏమి చదువుకున్నా, ఎక్కడ చదువుకున్నా, ఫస్ట్ క్లాసు లో నా గ్రేడ్ ఏంటి ? ఎంసెట్ లో నా రాంక్ ఏంటీ ఇవన్నీ మీకవసరమా అండి ? 
ఏమన్నా అంటే అన్నాం అంటారు మీరు నాకేదన్న ఉద్యోగం ఇవ్వబోతున్నారా ? ఈ ప్రశ్నలు ఏందో మీరెందో .. ఊ తరవాత ప్రశ్న ఏంటో ? ఈ సారి జీతమెంతా అని అడుగుతారా ఏంటి ? ఏం ఇంటర్వ్యూనో  ఏమో కొచెన్స్ ఆన్సర్స్ అన్నీ నేనే చెప్పాలా?  అసలు మీకు ఈ ఇంటర్వ్యూ చేయాలన్న కోరికేంటీ? నా ఖర్మ కాకపొతే 


నేను : (అబ్బా ఆ మొహం చూడు జీతం అడిగితే బ్యాంకు స్టేట్మెంట్ డీటెయిల్స్ మొత్తం ప్లస్ లో పబ్లిక్ పోస్ట్ పెట్టేట్లు గా, ఇంతవరకూ అడిగిన దానికి ఒక్కదానికి తిన్నగా సమాధానం చెప్పలేదు. దేవుడా ఈ శనివారం నీకు 11 కొబ్బరికాయలు గ్యారెంటీ కొద్దిగా మర్డర్లు వగైరా జరగకుండా, ఈ ఇంటర్వ్యూ ఏదో సవ్యంగా ముగిస్తేట్లు చూడు స్వామీ) . హి హి లేదండి జీతం వగైరా నేనుందుకు అడుగుతా అండి ? మీ ఎక్స్పీరియన్స్ , మీ ఉగ్యోగం ఇవి తెలుసుకుని గూగుల్ చేస్తే మాకు ఐడియా వచ్చేస్తుందిగా మరీ అంతగా తెలుసుకోవాలంటే ! లేదులెండి జీతం గురించి కాదు కానీండి ? మీ హాబీస్ ఏంటో చెప్పండి ?
బంతి : నే ఖాళీగా ఉంటే ఫుట్బాల్ ఆడుతా... నా ఫ్రెండ్స్ ఖాళీగా ఉంటే నన్ను ఫుట్బాల్ ఆడుతుంటారు ... 
          ఆసక్తిగా క్రికెట్ చూస్తా ఇండియా గెలిస్తే సుగర్ ఓడితే బి.పి తెచ్చుకుంటా . 
          సీరియస్ గా సినిమాలు - సరదాగా రాజకీయాలు ఫాలో అవుతా )
          ఖాళీ సమయం ఎక్కువ ఉంటే పాదయాత్ర చేస్తా.. .బాధ ఎక్కువయితే ఓదార్పు చేస్తా ..RTC కి నష్టం
          వస్తే బస్సు యాత్ర చేస్తా ( బాగ ఖోపం వస్తే కారు యాత్ర ... సరదాగా సైకిల్  యాత్ర చేస్తా )


నేను : (అమ్మయ్య దేవుడి కొబ్బరికాయల డీల్ తో సంతృప్తి చెందినట్లు ఉన్నాడు) బావున్నాయండి మీ హబీలన్నీ. వీటన్నటితో పాటు ఇంకొకటి చెప్తారు అనుకున్నాను . అదే మీకు మానేజర్లని ఊరికే తిట్టే హాబీ ఉన్నట్లు ఉంది ? అది చెప్పలేదు .....
బంతి : ఇంటర్వ్యూ అంటే మీకు తెలిసిన సమాధానాలు చెప్పాలా ? నా గురించి నాకు తెలిసినవి చెప్పాలా ? అంటే మీ ప్రశ్నలకి సమాధానాలు కూడా మీరే ఫిక్స్ చేసుకున్నారా ? అవి నేను చెప్పాలా ? ఇంతోటి దానికే ఏదో ఇంటర్వ్యూ అని ఒకపేరు ? మీరే ప్రశ్నలు, మీకు తోచిన సమాధానాలు రాసి వీలయితే మార్కులు కూడా వేసుకో లేకపోయారా ?

నేను : (ఖర్మ ! దేవుడా డీల్ అదీ ఇదీ అని వాగినందుకు అర్జెంటుగా నాతొ ఆడుకోకయ్యా  బుద్దొచ్చింది ) అయ్యో అలాంటిదేమీ లేదండి . ఏదో అందరూ అనేది విని అలా అడిగాను అంతే ! అయినా ఉన్న నిజాన్ని చెప్పుకోవటానికి అంత మొహమాటం ఎందుకండీ . 
బంతి : పబ్లిక్ పోస్ట్ లో ఒక మాట ప్రైవేట్ పోస్ట్ లో ఒకమాట మాట్లాడటం మా సీమ రక్తం లో లేదు. మాట కోసం రక్తాభిషేకం చేసే వంశం మాది ! నేను అసలు ఎప్పుడు డామేజర్ని  సారీ అదే మానేజర్ని అస్సలు పొరపాటున కూడా ఒక్క మాట అనను . మానేజర్ అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుడు దేవుండీ అలాంటి వాళ్ళని పట్టుకుని తిట్టడమా రామ రామ . ఇది ఎవరో నా శత్రువులు పుట్టించిన పుకార్లు . 

నేను : (ఏం రక్తంతో బాబు ఆ అభిషేకాలు? కొంపదీసి మేకదో , కోడిదో కాదు కదా ?)ఏవండీ నాకో చిన్న అనుమానం అండీ . నిజం మీరేదో సీమ లో పుట్టానని సమరసింహారెడ్డి లెవెల్లో ఫీల్ అవుతున్నారా ? మీకు శత్రువులు ఉండటం ఏంటి ? పోనీ ఉన్నారు మిమ్మల్ని చూసాకా కూడా వాళ్ళకి కుట్రలు చేయాల్సిన అవసరం ఉందా ? ఉఫ్ అని గట్టిగా ఊదితే సరిపోదు ?
బంతి : ఏంటండీ , ఏంటీ ఈ అరాచకం ?  ఫ్రీ గా ఉంది కదా అని, ఇంటర్వ్యూ పేరు అడ్డు పెట్టుకుని, మీ ఇమేజ్ కి మైలేజ్ కోసం  నా ఇమేజ్ని  డామేజ్ చేస్తున్నారా ? నేను ఇప్పుడే వాక్ అవుట్ చేస్తున్నా , ఇంటర్వ్యూ లేదూ ఏమీ లేదూ ఏమి చేస్తారో చేసుకోండి . 


నేను : ఇందాకటి నుంచి చూస్తున్నా ? ఏంటి ఓ బెదిరిస్తున్నారు ? ఏమి చేస్తానా ? నాకు తోచిన ప్రశ్నలు,   సమాధానాలు రెండూ నేనే రాసి అవి మీరు చెప్పినవే అని పబ్లిష్ చేస్తా ! ఏమి చేస్తారో చేసుకోండి .
బంతి :   ఏంటీ , తమరికి ఈ టాలెంట్ కూడా ఉందా ? ఏది,  ఏమి రాసుకుంటారో ఒకటి చెప్పండి, మీ కలాపోసన సంగతేందో చూద్దాం ?

నేను : ఓహో నన్ను తక్కువ అంచనా వేయొద్దు. సపోజ్ ఫర్ సపోజ్ , మీకు శ్రీకాకుళం అడువుల్లో తిరగడం హాబీ అని రాస్తా. రీమిక్స్ చేసిన విండ్ రైన్ పాట మీకు ప్రాణం అని చెబుతా ..... ఇంకా ఇలాంటి డేటాబేస్ చానా ఉంది నా దగ్గర అదీ విషయం. మరి అలా ఫాలో అయ్యి పొమ్మంటారా? 
బంతి : వామ్మో ! ఇలాంటి దారుణానికి తెగబడతారా ? ఉండండి మీ సంగతి ఇక్కడ కాదు, మా సీమ సంఘం సమావేశం లో తేల్చుతా 


సీమ వాసుల పైన దాడులు ఎక్కువ అవుతున్నాయి.
సీమ వాసులార ఏకంకండి. పోరాడితే పోయేదేమి లేదు సంకెళ్ళు తప్ప!
రండి చేయి చేయి కలపండి పదం పాడుతు కదం తొక్కండి.
జై సీమ ! జై హింద్ !

- శ్రావ్య & చైతన్య 

 PS : ఇది కేవలం సరదాకి చేసిన ప్రయత్నం మాత్రమే !

Friday, March 8, 2013

సిరిసిరిమువ్వ - ఒక విజేత



చూడటానికి నాజూకైన మల్లెతీగంత సుకుమారి..
బోల్డంత -- అభిమానం... ఆపేక్ష... అప్యాయత...
స్వచ్చమైన -- చిరునవ్వు.. పలకరింపు.. ప్రోత్సాహం.. అన్నీ కలగలసిన మృదుస్వభావి!!

                                            నిషిగంధ 

ఇలాంటి ప్రత్యేకత కలిగిన అందమైన వ్యక్తితో పరిచయం అయితే మనకి చాల సంతోషంగా ఉంటుంది కదూ ? మరి ఆ సంతోషాన్ని చుట్టూ ఉన్నవాళ్ళతో పంచుకుంటే? అది   రెట్టింపవుతుంది .  అందుకే నా సంతోషాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నంలో ఆ అందమైన వ్యక్తి మీలో చాలా మందికి తెలిసినా సరే మరోసారి నా మాటల్లో పరిచయం చేయాలి అని నా ఈ ప్రయత్నం. 

అసలు ఈ వ్యక్తి తో నా పరిచయం ఎలా అయ్యిందో మీరు తెలుసుకోవాలి అంటే కొంచెం, కొంచెం అంటే కొంచెం నాతొ పాటుగా నా జ్ఞాపకాలతో వెనక్కి ప్రయాణం చేయాలి. అవి నేను కొత్త కొత్త గా బ్లాగులు చదువుతున్న రోజులు, అప్పుడు ఒకసారి ఇదేనా పరిష్కారం అనే పోస్టు చూసి ఒకింత ఆవేశం గానే ఆ పోస్ట్ లో కంటెంట్ కి వ్యతిరేకంగానే కామెంట్ రాసాను. ఆ బ్లాగ్ లో కామెంట్ రాయటం అదే మొదటిసారి కానీ , ఆ బ్లాగ్ మాత్రం కొత్త కాదు అప్పటికే ఆ బ్లాగ్ మొత్తం తిరగేసాను  కాబట్టి. అలా మొదటి కామెంట్ కొంచెం వ్యతిరేకం గా రాసినప్పటికీ తర్వాత తర్వాత మాత్రం ఆ బ్లాగ్ మీద అభిమానం పెరిగింది. మరీ ముఖ్యంగా ఆవిడ రాసే వాళ్ళ ఊరికబుర్లు, జ్ఞాపకాలు, సమాజం గురించి ఆలోచనలు ఇవి మరింతగా  అభిమానం పెంచాయి. అన్నట్లు ఈ పోస్టు నాకు చాలా చాలా ఇష్ట మండోయి.


ఆ తరవాత బజ్ , ప్లస్ ఆవిడ బ్లాగుతోనే కాకుండా ఆవిడతో నా పరిచయం పెంచేసాయి. చాలా సార్లు మరీ ముఖ్యం గా ఆన్లైన్ లో మనకి వ్యక్తిగత పరిచయం పెరిగే కొద్ది , అప్పటి వరకు  ఎదుటి వ్యక్తి ఏవన్నా  అందమైన మాయపొరలు కప్పుకుని ఉంటే అవి కరిగిపోవటం మొదలయ్యి అసలు రూపం పరిచయం అవుతుంది. ఆవిడ మాత్రం ఆ పరిచయం పెరిగే కొద్దీ మరింత అందంగా కనిపించారు. అదుగో అప్పుడే ఆవిడ పిల్లల గురించి రాసిన పోస్టులు నాకు ఆవిడ మీద మరింత అభిమానాన్ని పెంచాయి.

మరి అక్కడితో ఆగిపోయిందా ? లేదు !  ఆవిడ కాన్సర్ గురించి రాసిన ఈ సిరీస్ లో  మొదటి పోస్ట్ చదివినప్పుడు నివ్వెరపోయాను.  నాకు ఆవిడ బ్లాగ్ తో పరిచయం ఉన్న కారణం గా ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఏదో ఆరోగ్యపరమైన సమస్య ఉంది అని తెలుసు, కానీ అది కాన్సర్ అని మాత్రం ఊహించలేదు. ఒక్కొక పోస్ట్ చదువుతున్న కొద్దీ ఆవిడ ఆ సమస్యని ఎదుర్కున్న తీరు నన్ను ఆశ్చర్యంలో ముంచేసింది. ఆవిడ ధైర్యం  కన్నా,  తనకే ఎందుకు రావాలి అన్న ఆలోచన గానీ,  అయ్యో ఇలా జరిగిందేంటి  అన్న సెల్ఫ్ సింపతి కానీ లేకుండా తన శరీరం లో ఏమి జరుగుతుంది అన్న విషయం గురించి క్షుణ్ణం గా తెలుసుకోవటానికి చేసిన ప్రయత్నం చాలా చాలా నచ్చింది.  ఆవిడ తనకొచ్చిన ఆరోగ్యసమస్యని ఎదుర్కొన్న తీరు మనం చదివే కొన్ని పుస్తకాలలోని,   చూసే సినిమాల్లో ధీరొధాత్తమైన పాత్రలకి ఏ మాత్రం తీసిపోదు.  ఇదంతా ఒక ఎత్తు అయితే  వేరే వాళ్ళకి ధైర్యం, అవేర్నెస్ కలిగించాలి అన్న సదుద్దేశ్యం తో అప్పుడు పడిన బాధని,  మర్చిపోవాల్సిన చేదు జ్ఞాపకాలని  మరోసారి గుర్తు చేసుకుని మరీ తన బ్లాగ్ లో అక్షరబద్ధం చేయడం నాకు చాలా చాలా నచ్చింది. ఇదంతా చదివిన తరవాత ఇప్పటికవరకు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అదేలెండి రాస్తున్నానో మీకు అర్ధం అయిపొయింది కదా ? ఊ ఊ మీరు కరెక్టే ఇదంతా సిరిసిరిమువ్వగా మనకు పరిచయం అయిన వరూధిని గారి గురించే.

ఊ ..... వరూధిని గారు & ఇంకా ఈ పోస్ట్ చదువుతున్న మిత్రులు, ఇలా నేను చెప్పుకుంటూ పోవటం కాదు కానీయండి, వరూధినిగారికి ఇష్టమైన, అలాగే వరూధిని గారిని అభిమానించే మన మిత్రులు, ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందిస్తున్న సందేశాలని ఈ క్రింద చూడండి . అన్నట్లు వరూధిని గారు, వీటిల్లో మీకో ప్రత్యేకమైన విజ్ఞప్తి ఉందండోయ్!  మరీ భాద్యతలు అన్నీ మీరే భరించేస్తున్నారు అని బాధ పడుతున్నారు ఎవరో, కొంచెం వారి విజ్ఞప్తిని ప్రత్యేకంగా పరిశీలించండి మరి :-)



ఇంత మంది ఇంత అందంగా చెప్పిన తరవాత ఇక నేను చెప్పటానికి ఏముందండి? అయినా సరే నా ప్రయత్నం నేను చేస్తాను :-)

వరూధిని గారు, మీలాంటి అరుదైన విశిష్ట వ్యక్తిత్వం ఉన్న వారితో పరిచయం కావడం నాకు చాలా సంతోషంగా ఉహు కాదు కాదు చాలా గర్వంగా ఉందండి. అమావాస్య, పౌర్ణమిలలాగా మనజీవితంలో సంతోషంతో పాటు బాధని కూడా కొద్ది రోజులు రుచిచూడాల్సిందే అనుకుంటే, మీరు అమావాస్య లాంటి చీకటి రోజులని ధైర్యంగా ఎదుర్కున్నారు కాబట్టి, కొత్తావకాయ గారు చెప్పినట్లు జీవితం మీద ప్రేమ ఉన్న మీకు  ఇక ముందు ముందు రోజులన్నీ ఆనందదాయకంగా గడవాలి, అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .

-శ్రావ్య 

ఇంత అందమైన శుభాకాంక్షలు అందించిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఆ శుభాకాంక్షలని ఇంత అందంగా ఒక దగ్గర పేర్చి మాలనల్లిన  నిషికి స్పెషల్ థాంక్స్ ! చదువరి గారు many Thanks !


Sunday, February 17, 2013

ప్రేమలేఖ


హాయ్ ,

ఉరుములు, పిడుగులు లేకుండా ఎప్పుడూ లేని  ఈ లేఖల గోల ఏంటీ కొత్తగా అని ఆశ్చర్యపోతున్నావా? ఉంది ఉంది దానికో కారణం ఉంది. 

ప్రేమలేకుంటే  ఉదయమైనా  చీకటేనంటా,  ప్రేమ తోడుంటే మరణమైనా జననమంటా  - అబ్బా ఇలా చెవిలో  జొరీగల్లా  గోల పెట్టె వాళ్ళని చూస్తుంటే అదేదో సినిమాలో చిరంజీవి చెప్పినట్లు 

కరెక్టే ప్రేమ గురించి  నాకేం తెలుసు 
లైలా మజ్నులకి తెలుసు 
పారు దేవదాసులకి తెలుసు  
ఆ తరవాత తమరికే తెలుసు 

ఇలా అరిచి చెప్పాలి అనిపిస్తుంది, కానీ అలా చెప్తే మరీ గయ్యాళి అని అంటారు కదా?  అందుకే నాకు నీమీదున్న   ప్రేమని అక్షరబద్ధం చేసి నాకు ఒక ప్రేమ కథ ఉందోచ్చ్, అని అందరికీ చాటి చెప్పాలని నిర్ణయించుకున్నా. అర్ధం అయ్యింది కదా ? మరి కాస్త ప్రశాంతం గా కొంచెంసేపు  ఈఅక్షరాల ఉప్పెనని  తట్టుకో .

అవును మొదటిసారి ఎప్పుడు చూసాను నిన్ను? ఊ ఊ..  గుర్తొచ్చింది స్కూల్ excursion పేరుతొ కదా ఇంట్లో అందరి ప్రాణాలు తీసి మరీ నిన్ను చూడటానికి వచ్చాను.  అమ్మ వాళ్లకి ముందే తెలిసిపోయినట్లుది నిన్ను చూస్తే  నే నీమాయలో పడిపోతానని అందుకే ఎన్ని జాగ్రత్తలు చెప్పి పంపారనుకున్నావ్? అయినా సరే నీ మాజిక్ ముందు ఆ జాగ్రత్తలన్నీ బలాదూర్. ఇక ఆ తరవాత ఏముందీ?  నేను నీ మాయలో పడిపోయా అనుకో. నవ్వకోయ్ అప్పటి నుంచి నువ్వు మాత్రం ఏం  తక్కువ చేసావ్ ?  నీ గాలి సోకకుండా ఉండేంత దూరం నేను వెళ్ళిపోయినా, సెలవల పేరుతొ  నేను ఎక్కడి వెళితే అక్కడికి  నాకన్నా ముందే వెళ్లి అక్కడ నాకోసం తిష్ట వేసేవాడివి కాదా? ఎక్కడి  బాపట్ల, మచిలీపట్నం, ముంబై, రామేశ్వరం, చివరికి ఈ చివరి కొసనున్న  కన్యాకుమారి,  అక్కడికి వెళ్ళినా నన్ను వదలలేదు కదా ? 

ఆఖరికి,   దేశం కానీ దేశం వస్తుంటే ఇక్కడ నేను  ఒంటరిగా ఏమి దిగులు పడతానో అని  తోడూగా ఉండటానికి నాకన్నా ముందే వచ్చేసావ్ కదా? ఏ  మాటకామాటే చెప్పాలి,  ఎవరూ లేకపోయినా నువ్వు గల గల చేప్పే కబుర్లు వింటూ, నిన్ను చూస్తూ అలా నేను ఎన్ని గంటలైనా గడపగలను తెలుసా?  గంభీరం ఉండే నీ రూపు చూసి కొంతమందికి  భయమేస్తుందట, నాకేమో చచ్చేంత ఇష్టం!  అసలు ఆరూపం చూసే కదా నీ మాయ లో పడిపోయా.  అవునూ, నాకొక అనుమానం అన్నన్ని బడబాగ్ని లాంటి  రహస్యాలు కడుపులో ఎలా దాచుకుంటావ్ నువ్వు అదీ పైకీ ఏమి తెలియనట్లు గా ఉంటూ?

ఇన్నేసి  పొగడ్తలు వింటూ మహా ఆనందంతో ఉప్పొంగిపొతున్నావ్ కదా? అసలు నీలో నచ్చనిది ఏమీ లేదు అని పొరపడకు, ఉంది నచ్చనిది కూడా ఉంది. అయ్యో అప్పుడే అలక ఒక్కటే కదా నచ్చదు అంది, అంతమాత్రానికే ఇంత అలక? మరి కోపం వస్తే చాలు,  ఏం పట్టకుండా ముందూ వెనక చూడకుండా,  ఊరు వాడ  ఏకం చేసేసే నీ ఉద్రేకం చూస్తే నాకు బాధగా ఉండదా? అయినా నువ్వు మాత్రం ఏమి చేస్తావులే కోపం ప్రకృతి ధర్మం. పేదవాడి కోపం పెదవికి చేటని, నాలాంటి వాళ్లకి  కోపం వస్తే ఏమి చేయలేం. మరి నువ్వంటే అలా కాదు కదా,  ఎంతో మంది బాగోగులు  చూస్తుంటావు,  అద్భుతమైన నిధి నిక్షేపాలు కడుపులో దాచుకుంటావు, నాలాంటి బోల్డు మందికి సంతోషాన్ని పంచుతుంటావు, అందుకే నీ కోపం చెలియలికట్ట దాటుతుంటే అది ప్రళయమే. కొంచెం ఆ కోపాన్ని తగ్గించుకోవూ ప్లీజ్? అప్పుడు ఇంకెంతమందికో నచ్చేస్తావ్ తెలుసా ?

హ్మ్ , ఇలా నిన్ను పొగుడుతూ , నీ గురించే ఆలోచిస్తూ ఉంటె ఎన్ని రోజులైనా సరిపోవు నాకు . అయినా  ఇలా నీ మీద ప్రేమతో, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావ్ అన్న ఆనందంతో పొంగిపోతుంటా కానీ, ఒక్కొక్కసారి ఎంత భయమేస్తుందో తెలుసా? భయం దేనికి అంటావా?  భయం కాక మరి ఏంటి? ఆ యమున, కృష్ణవేణి ఇలా బోలెడుమంది అందగత్తెలు  హొయలు పోతూ నీ చూట్టునే తిరుగుతుంటే వాళ్ళ మాయలో పడి నన్ను అసలే మర్చిపోతావేమో అని దిగులేయదా మరి?

హలో హలో మరీ సంబరపడిపోకు,  నన్ను ఉడికించటానికి ఒక కారణం దొరికింది కదా అని. ఆ పప్పులు ఏమీ ఉడకవు.  నన్నే గుర్తుంచుకో,  నన్నే ప్రేమించు అని నీ వెంట నేనేమి పడటం లేదు. నువ్వంటే నాకు ఇష్టం, పిచ్చి అది నిజం!  నువ్వు నన్ను ఇష్టపడు, పడకపో, అసలు ఆ మాటకొస్తే నువ్వేమి ఫీల్ అవుతావో  నాకేమి సంబంధం? నీ ఇష్టం వచ్చినట్లు ఉండు,  నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అంతే :P 

బోలెడంత ప్రేమతో 
శ్రావ్య 


ఇంతకీ ఎవరినబ్బా శ్రావ్య ఇంత దబాయించి మరీ ప్రేమిస్తుంది అని ఆశ్చర్యపోతున్నారు కదా, ఇదుగో ఎప్పుడూ నా వెన్నంటే ఉండే  ఇతన్నే :-) ఇక వింటున్నా కదా అని నా చెవిలో జోరీగల్లా  కాదు కానీ , అద్భుతంగా గోల పెడుతున్నది ఎవరో తెలుస్కోవాలంటే ఇక్కడ చూడండి. 



  

Saturday, February 2, 2013

Let the Stupidity Prevail !



డిసెంబర్ 2012 -  ఏదో బ్రహ్మాండం బద్దలు అవుతుంది అన్నారు, ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది అన్నారు. అబ్బో ఎన్నెన్ని కథలు, సినిమాలు, అనాలిసిస్లు. మొత్తం మీద చాలా మంది ఊహించినట్లే ఏమీ జరగలేదు. యధావిధిగా లేస్తున్నాం, తింటున్నాం, వీలయితే ఎవర్నో ఒకరిని హాయిగా తిడుతూ కాలం గడుపుతున్నాం. 

అది అలా పక్కన పెడితే, అసలు ఈ ప్లానెట్  నాశనం కావాలంటే ఎలాంటి కారణాలు ఉంటాయి?   
అంతరిక్షం నుంచి అతి పెద్ద ఆస్టరాయిడ్ దూసుకొచ్చి భూమిని తాకితేనా ? 
గ్లోబల్ వార్మింగ్ ? ...
on and on and on ...

నో నో  ఇలాంటి నాచురల్ డిజాస్టర్ ఏదైనా  మనిషి జయించగలడు. అసలు అలోచిస్తే మనిషికి వేరే శత్రువు అవసరమా?  ఏదో ఒకే ఒక్క స్టుపిడ్ రీజన్ తో భారీ ఎత్తున  riots  లేదూ యుద్ధమో సృష్టించి నింగి నేల  ఏకం చేసి నాశనం చేయగల సమర్థత ఈసృష్టి లో మనిషికి కాక ఇంకెవరికి ఉంది?  మనిషికి మనిషి తప్ప వేరే శత్రువు అవసరం లేదు. అందుకే ఈప్లానెట్ ని పూర్తిగా నాశనం చేయాలంటే మనిషికి మాత్రమే సాధ్యం అయ్యే పని. 

మనిషికి  కాకుండా మరి ఇంకెవరికి ఆ అవకాశం ఉంది ?
An idea. Resilient, highly contagious. Once an idea has taken hold of the brain it’s almost impossible to eradicate. An idea that is fully formed, fully understood. That sticks, right in there somewhere.
Inception movie 
uh-hu...! Believe in this concept. Think  Sravs think  ....It's Theory-making time again ! ....hurrah got it !

The  Idea :
నాగరికత కరువు, కాటకాలు లేని, ఒకరికొకరు భయపడనవసరం లేని, మందు లేని వ్యాధే లేని, అసలు వీటన్నిటికీ మించి stupidity కి అర్ధమే తెలియని ఒక యుటోపియా లాంటి ఉచ్ఛస్థితికి చేరాలి. అలాంటి   పర్ఫెక్షన్ లోంచి  .. అకస్త్మాత్తు గా ఒకరోజు ఈభూమి దానంతటే అదే నాశనం అవుతుంది. భూమి మీద జీవిస్తున్న జీవం దానితో పాటే నాశనం. ఆ భయంకరమైన  వినాశనం లోంచి సరికొత్త భూమి ఆవిర్భావం జరుగుతుంది. మళ్ళీ ఏకకణ ఆమీబా,  etc ...ఇలా సరికొత్త  సృష్టి చక్రం మొదలవుతుంది. 

మరి  మనం నివసిస్తున్న ఈ ప్లానెట్ అలాంటి ప్రమాదం లో పడుతుంటే చూస్తూ ఊరుకోలేం కదా , అ ప్రమాదం నుంచి కాపాడటానికి ఏదో ఒక ప్రయత్నం  చేయాలి. అందుకే మన వంతుగా మన  ప్రయత్నాలు  చేసి సివిలైజేషన్నిఅధమ స్థాయికి చేర్చుదాం. ఇంకా బాగా చెప్పాలంటే Planet age defying programme అన్నమాట .  ప్రమాదాన్ని నివారించటానికి నాకు తోచిన కొన్ని చిట్కాలు :
  • కొద్ది రోజుల క్రితం నిర్భయ మీద దారుణం గా దాడి గుర్తుంది కదా?  ఇలాంటి దాడులు చేసే ప్రవృత్తి ఎందుకు పెరిగిపోతుందో అధ్యయనం  చెయ్యాల్సిన సోషియాలజిస్టుల పని మనమే చేసిపారేద్దాం. వాళ్ళంతా దిగువ తరగతికి చెందిన వాళ్ళు కాబట్టి సానుభూతి చూపించాలి అని  అనాలసిస్లు రాసి  పారేద్దాం. సమాజాన్ని ముక్కలు ముక్కలు గా విడగొట్టటానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా మన ప్రయత్నాలు మనం చేద్దాం. 
  • సరదా కాలక్షేపానికో, మనకున్న హాబీలు , చేసే పనులు  మెరుగుదిద్దుకునేందుకో, లేదూ  ప్రపంచం లో   ఏ  మూల ఏమి జరుగుందో ఫస్ట్ హాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం కోసం వాడుకోవాల్సిన సోషల్ నెట్వర్కింగ్  వెబ్ సైట్ స్పేస్ లో మన మనోవికారాల్ని ఏ మాత్రం మొహమాటపడకుండా ప్రదర్శిద్దాం. 
  • సినిమా నుంచి, సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైటు కామెంట్లు వరకు దేన్నీ వదలొద్దు. మన స్థాయి లో  మనం పరిష్కరించాల్సిన  విషయాన్ని కూడా లీగల్ ప్రాబ్లం గా చేసి, ఇంకా చెప్పాలంటే  వీలైనంత పెద్ద విషయంగా చేసి ఒక కంప్లయింట్ పట్టుకుని పోలీస్ స్టేషన్ కి పరుగులు తీద్దాం. 
  • అలా  అని, పొద్దున  లేస్తే  పరిగెడుతున్నాం కదా అని,  ఆ పోలీస్ స్టేషన్ లో పని చేసే వాళ్ళంటే  గౌరవం అదీ ఎమన్నా చూపించాలేమో అని కంగారు పడొద్దు.  అది పొరపాటున కూడా చేయకూడదు, మనకి వీళ్ళతో పనిలేనప్పుడు మన రోజు వారీ జీవితం లో జరిగే ప్రతిదానికి వాళ్ళకున్న అధికారం కారణం అంటూ మన రాతలతో ఆడిపోసుకోవాలి. ఏ  సంఘ వ్యతిరేక గ్రూప్ లో  చేసే అరాచకం లో వీళ్ళు  మరణిస్తే కూడా మనం కనీసం సానుభూతి కూడా చూపించనక్కర్లేదు.  ఉద్యమాల్లో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి అని చేతులు దులుపుకోవాలి .
  • ఆ మనోజ్ వాజ్పేయ్ లాంటి వాళ్ళు ఏదో  "The culture of tolerance and debate is over in this country" అని పిచ్చి మాటలు చెబుతుంటారు. అలాంటి పిచ్చి మాటలు అవీ పొరపాటున కూడా బుర్రలోకి దూరకుండా జాగ్రత్త పడాలి, కేవలం ఈ  చెవితో విని ఆ చెవితో వదిలేయాలి. 
  • సమాజానికి వ్యతిరేకం గా పనిచేసే ప్రతి గ్రూప్ మన కోసం పోరాడుతుంది అని జనాలకి భ్రమలు కలిగించి, కేవలం  వాళ్ళ హక్కుల కోసం పోరాడటమే మానవహక్కుల కోసం పోరాడం అని నమ్మించగలగాలి .
  • పొరపాటున శత్రుదేశం కుట్ర పన్ని మన దేశంలో అమాయకుల రక్తాన్ని రుచి చూసిన వాళ్ళు ఎవరన్నా చట్టానికి దొరికితే వాళ్ళని సకల మర్యాదలతో చూడాలి అని డిమాండ్ చేయాలి. అసలు అలా చేసేందుకు కారణం ఆకలి పోరాటం అని నమ్మబలకాలి . వారికి వేసే శిక్షలు అన్యాయం అని గొంతెత్తి పోరాటం చేయాలి. 
  • మన ఆరోగ్యం కోసమో , మన భవిష్యత్తు ఆహార అవసరాలు తీర్చెందుకో కావలన్సిన టెక్నాలజీని అభివృద్ధి చేసే ప్రయత్నాల్ని ఎట్టి  పరిస్తితుల్లోనూ  ప్రోత్సహించకూడదు .
  • ఉపాధి అవసరాలు లాంటివి అసలు పట్టించుకోకూడదు. పారిశ్రామిక వేత్తల్నో, లేదూ వైద్య , ఇంజనీరింగ్, వ్యవసాయ ఇలాంటి రంగాల్లో అరుదైన మేధావులని గురిస్తే వాళ్ళు యూత్ కి ఐకాన్ గా మారే ప్రమాదం ఉంది కాబట్టి అసలు పట్టించుకోనక్కర్లేదు. పొరపాటున వీళ్ళకి ఈ దేశపు అత్యున్నత పురస్కారాలు ఇవ్వాలి అని ప్రతిపాదన చేస్తే అవి  entertainment / స్పోర్ట్స్ ఇలాంటి వాటిలోని వ్యక్తులకి మాత్రమే ఇవ్వాలి  అని వీధి పోరాటాలు చేద్దాం .  
  • మనకి మాత్రమే స్వంతమైన కులాల కుమ్ములాటల్ని జాగ్రత్తగా కాపాడుకుందాం.  వీలయితే ఏదో కులాన్ని తీసుకుని వాళ్ళకే తెలియని ఒక మోడల్ వగైరాలు ప్రతిపాదించి గొప్ప రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసినట్లు గా ఫీలై పోదాం . 
  • మనం పుట్టిన దేశం మీద కనీస గౌరవం కూడా లేకుండా sex starved nation,  terrorist state అని ప్రచారం చేయటానికి ఏ మాత్రం మోహమాట పడొద్దు. కావాలంటే ఏ అరుంధతి రాయ్ లాంటి వాళ్ళ వీడియోలో అడ్డుపెట్టుకుని మన  మనస్సులో మాటలు చెప్పేద్దాం.
  • అసలు సంగతి చెప్పడం మర్చిపోయా మనం  రాసే రాతలు ఎవరన్నా వ్యతిరేకిస్తే వాళ్ళు CIA ఏజెంట్లు అని కనీసం కామన్ సెన్స్ లేని సీరియస్ జోకులు పేలుద్దాం . 
ఇలా రాస్తూ పొతే లిస్టు చాలా  పెద్దది అయ్యేట్లు గా ఉంది. అయినా ఏదన్న మంచి పని చేయాలంటే కష్టం కానీ, ఇలా stupidity ని పెంచుకుంటూ పోవటం మనకి వెన్నతో పెట్టిన విద్య కదా ? అందుకే వద్దన్నా ఇలాంటి బోలెడు ఐడియాలు నాచురల్ గానే మనకి మా బాగా వస్తాయి కాబట్టి  మనం పెద్ద కష్టపడనక్కర్లేదు, మరీ పెద్ద లిస్టు నేను ఇక్కడ ఇవ్వనక్కరలేదు. మనం ఎవరి స్థాయిలో వాళ్ళు కృషి చేసి అప్పుడెప్పుడో పాత రాతి యుగంకి వెళ్ళటానికి టైం ట్రావెల్ లాంటి పెద్ద టెక్నాలజీస్ ఏమీ అవసరం లేకుండా చేద్దాం. సింపుల్ గా చెప్పాలంటే మన stupidity ని కాపాడుకుందాం, చల్లగా  కాకిలా కలకాలం బ్రతుకుదాం. 

Let the stupidity prevail forever to save the planet Earth  !