Subscribe:

Saturday, February 2, 2013

Let the Stupidity Prevail !డిసెంబర్ 2012 -  ఏదో బ్రహ్మాండం బద్దలు అవుతుంది అన్నారు, ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది అన్నారు. అబ్బో ఎన్నెన్ని కథలు, సినిమాలు, అనాలిసిస్లు. మొత్తం మీద చాలా మంది ఊహించినట్లే ఏమీ జరగలేదు. యధావిధిగా లేస్తున్నాం, తింటున్నాం, వీలయితే ఎవర్నో ఒకరిని హాయిగా తిడుతూ కాలం గడుపుతున్నాం. 

అది అలా పక్కన పెడితే, అసలు ఈ ప్లానెట్  నాశనం కావాలంటే ఎలాంటి కారణాలు ఉంటాయి?   
అంతరిక్షం నుంచి అతి పెద్ద ఆస్టరాయిడ్ దూసుకొచ్చి భూమిని తాకితేనా ? 
గ్లోబల్ వార్మింగ్ ? ...
on and on and on ...

నో నో  ఇలాంటి నాచురల్ డిజాస్టర్ ఏదైనా  మనిషి జయించగలడు. అసలు అలోచిస్తే మనిషికి వేరే శత్రువు అవసరమా?  ఏదో ఒకే ఒక్క స్టుపిడ్ రీజన్ తో భారీ ఎత్తున  riots  లేదూ యుద్ధమో సృష్టించి నింగి నేల  ఏకం చేసి నాశనం చేయగల సమర్థత ఈసృష్టి లో మనిషికి కాక ఇంకెవరికి ఉంది?  మనిషికి మనిషి తప్ప వేరే శత్రువు అవసరం లేదు. అందుకే ఈప్లానెట్ ని పూర్తిగా నాశనం చేయాలంటే మనిషికి మాత్రమే సాధ్యం అయ్యే పని. 

మనిషికి  కాకుండా మరి ఇంకెవరికి ఆ అవకాశం ఉంది ?
An idea. Resilient, highly contagious. Once an idea has taken hold of the brain it’s almost impossible to eradicate. An idea that is fully formed, fully understood. That sticks, right in there somewhere.
Inception movie 
uh-hu...! Believe in this concept. Think  Sravs think  ....It's Theory-making time again ! ....hurrah got it !

The  Idea :
నాగరికత కరువు, కాటకాలు లేని, ఒకరికొకరు భయపడనవసరం లేని, మందు లేని వ్యాధే లేని, అసలు వీటన్నిటికీ మించి stupidity కి అర్ధమే తెలియని ఒక యుటోపియా లాంటి ఉచ్ఛస్థితికి చేరాలి. అలాంటి   పర్ఫెక్షన్ లోంచి  .. అకస్త్మాత్తు గా ఒకరోజు ఈభూమి దానంతటే అదే నాశనం అవుతుంది. భూమి మీద జీవిస్తున్న జీవం దానితో పాటే నాశనం. ఆ భయంకరమైన  వినాశనం లోంచి సరికొత్త భూమి ఆవిర్భావం జరుగుతుంది. మళ్ళీ ఏకకణ ఆమీబా,  etc ...ఇలా సరికొత్త  సృష్టి చక్రం మొదలవుతుంది. 

మరి  మనం నివసిస్తున్న ఈ ప్లానెట్ అలాంటి ప్రమాదం లో పడుతుంటే చూస్తూ ఊరుకోలేం కదా , అ ప్రమాదం నుంచి కాపాడటానికి ఏదో ఒక ప్రయత్నం  చేయాలి. అందుకే మన వంతుగా మన  ప్రయత్నాలు  చేసి సివిలైజేషన్నిఅధమ స్థాయికి చేర్చుదాం. ఇంకా బాగా చెప్పాలంటే Planet age defying programme అన్నమాట .  ప్రమాదాన్ని నివారించటానికి నాకు తోచిన కొన్ని చిట్కాలు :
 • కొద్ది రోజుల క్రితం నిర్భయ మీద దారుణం గా దాడి గుర్తుంది కదా?  ఇలాంటి దాడులు చేసే ప్రవృత్తి ఎందుకు పెరిగిపోతుందో అధ్యయనం  చెయ్యాల్సిన సోషియాలజిస్టుల పని మనమే చేసిపారేద్దాం. వాళ్ళంతా దిగువ తరగతికి చెందిన వాళ్ళు కాబట్టి సానుభూతి చూపించాలి అని  అనాలసిస్లు రాసి  పారేద్దాం. సమాజాన్ని ముక్కలు ముక్కలు గా విడగొట్టటానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా మన ప్రయత్నాలు మనం చేద్దాం. 
 • సరదా కాలక్షేపానికో, మనకున్న హాబీలు , చేసే పనులు  మెరుగుదిద్దుకునేందుకో, లేదూ  ప్రపంచం లో   ఏ  మూల ఏమి జరుగుందో ఫస్ట్ హాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం కోసం వాడుకోవాల్సిన సోషల్ నెట్వర్కింగ్  వెబ్ సైట్ స్పేస్ లో మన మనోవికారాల్ని ఏ మాత్రం మొహమాటపడకుండా ప్రదర్శిద్దాం. 
 • సినిమా నుంచి, సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైటు కామెంట్లు వరకు దేన్నీ వదలొద్దు. మన స్థాయి లో  మనం పరిష్కరించాల్సిన  విషయాన్ని కూడా లీగల్ ప్రాబ్లం గా చేసి, ఇంకా చెప్పాలంటే  వీలైనంత పెద్ద విషయంగా చేసి ఒక కంప్లయింట్ పట్టుకుని పోలీస్ స్టేషన్ కి పరుగులు తీద్దాం. 
 • అలా  అని, పొద్దున  లేస్తే  పరిగెడుతున్నాం కదా అని,  ఆ పోలీస్ స్టేషన్ లో పని చేసే వాళ్ళంటే  గౌరవం అదీ ఎమన్నా చూపించాలేమో అని కంగారు పడొద్దు.  అది పొరపాటున కూడా చేయకూడదు, మనకి వీళ్ళతో పనిలేనప్పుడు మన రోజు వారీ జీవితం లో జరిగే ప్రతిదానికి వాళ్ళకున్న అధికారం కారణం అంటూ మన రాతలతో ఆడిపోసుకోవాలి. ఏ  సంఘ వ్యతిరేక గ్రూప్ లో  చేసే అరాచకం లో వీళ్ళు  మరణిస్తే కూడా మనం కనీసం సానుభూతి కూడా చూపించనక్కర్లేదు.  ఉద్యమాల్లో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి అని చేతులు దులుపుకోవాలి .
 • ఆ మనోజ్ వాజ్పేయ్ లాంటి వాళ్ళు ఏదో  "The culture of tolerance and debate is over in this country" అని పిచ్చి మాటలు చెబుతుంటారు. అలాంటి పిచ్చి మాటలు అవీ పొరపాటున కూడా బుర్రలోకి దూరకుండా జాగ్రత్త పడాలి, కేవలం ఈ  చెవితో విని ఆ చెవితో వదిలేయాలి. 
 • సమాజానికి వ్యతిరేకం గా పనిచేసే ప్రతి గ్రూప్ మన కోసం పోరాడుతుంది అని జనాలకి భ్రమలు కలిగించి, కేవలం  వాళ్ళ హక్కుల కోసం పోరాడటమే మానవహక్కుల కోసం పోరాడం అని నమ్మించగలగాలి .
 • పొరపాటున శత్రుదేశం కుట్ర పన్ని మన దేశంలో అమాయకుల రక్తాన్ని రుచి చూసిన వాళ్ళు ఎవరన్నా చట్టానికి దొరికితే వాళ్ళని సకల మర్యాదలతో చూడాలి అని డిమాండ్ చేయాలి. అసలు అలా చేసేందుకు కారణం ఆకలి పోరాటం అని నమ్మబలకాలి . వారికి వేసే శిక్షలు అన్యాయం అని గొంతెత్తి పోరాటం చేయాలి. 
 • మన ఆరోగ్యం కోసమో , మన భవిష్యత్తు ఆహార అవసరాలు తీర్చెందుకో కావలన్సిన టెక్నాలజీని అభివృద్ధి చేసే ప్రయత్నాల్ని ఎట్టి  పరిస్తితుల్లోనూ  ప్రోత్సహించకూడదు .
 • ఉపాధి అవసరాలు లాంటివి అసలు పట్టించుకోకూడదు. పారిశ్రామిక వేత్తల్నో, లేదూ వైద్య , ఇంజనీరింగ్, వ్యవసాయ ఇలాంటి రంగాల్లో అరుదైన మేధావులని గురిస్తే వాళ్ళు యూత్ కి ఐకాన్ గా మారే ప్రమాదం ఉంది కాబట్టి అసలు పట్టించుకోనక్కర్లేదు. పొరపాటున వీళ్ళకి ఈ దేశపు అత్యున్నత పురస్కారాలు ఇవ్వాలి అని ప్రతిపాదన చేస్తే అవి  entertainment / స్పోర్ట్స్ ఇలాంటి వాటిలోని వ్యక్తులకి మాత్రమే ఇవ్వాలి  అని వీధి పోరాటాలు చేద్దాం .  
 • మనకి మాత్రమే స్వంతమైన కులాల కుమ్ములాటల్ని జాగ్రత్తగా కాపాడుకుందాం.  వీలయితే ఏదో కులాన్ని తీసుకుని వాళ్ళకే తెలియని ఒక మోడల్ వగైరాలు ప్రతిపాదించి గొప్ప రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసినట్లు గా ఫీలై పోదాం . 
 • మనం పుట్టిన దేశం మీద కనీస గౌరవం కూడా లేకుండా sex starved nation,  terrorist state అని ప్రచారం చేయటానికి ఏ మాత్రం మోహమాట పడొద్దు. కావాలంటే ఏ అరుంధతి రాయ్ లాంటి వాళ్ళ వీడియోలో అడ్డుపెట్టుకుని మన  మనస్సులో మాటలు చెప్పేద్దాం.
 • అసలు సంగతి చెప్పడం మర్చిపోయా మనం  రాసే రాతలు ఎవరన్నా వ్యతిరేకిస్తే వాళ్ళు CIA ఏజెంట్లు అని కనీసం కామన్ సెన్స్ లేని సీరియస్ జోకులు పేలుద్దాం . 
ఇలా రాస్తూ పొతే లిస్టు చాలా  పెద్దది అయ్యేట్లు గా ఉంది. అయినా ఏదన్న మంచి పని చేయాలంటే కష్టం కానీ, ఇలా stupidity ని పెంచుకుంటూ పోవటం మనకి వెన్నతో పెట్టిన విద్య కదా ? అందుకే వద్దన్నా ఇలాంటి బోలెడు ఐడియాలు నాచురల్ గానే మనకి మా బాగా వస్తాయి కాబట్టి  మనం పెద్ద కష్టపడనక్కర్లేదు, మరీ పెద్ద లిస్టు నేను ఇక్కడ ఇవ్వనక్కరలేదు. మనం ఎవరి స్థాయిలో వాళ్ళు కృషి చేసి అప్పుడెప్పుడో పాత రాతి యుగంకి వెళ్ళటానికి టైం ట్రావెల్ లాంటి పెద్ద టెక్నాలజీస్ ఏమీ అవసరం లేకుండా చేద్దాం. సింపుల్ గా చెప్పాలంటే మన stupidity ని కాపాడుకుందాం, చల్లగా  కాకిలా కలకాలం బ్రతుకుదాం. 

Let the stupidity prevail forever to save the planet Earth  !

26 comments :

KumarN said...

Well written Sravya. Good Job.
Race to the bottom అని, అది గుర్తోస్తోంది జరిగే వాటిని చూస్తూంటే!

సంతు (santu) said...

Hatred the post..... :p
-CIA Agent

శ్రీరామ్ said...

ఏమిటీ శ్రావ్య గారు, నైరాశ్యం లో రాశారా ? లేక, కొత్తాగా ఎమన్నా "ఆర్ట్ అఫ్ లివింగ్" టైపు కోర్స్ లో జాయిన్ అయ్యారా?

Just kidding ;-)

Bhardwaj Velamakanni said...

LOL

vajra said...

Very intensive approach in writing.Well writen Shravya Garu..
Mana desham lo tappu chesthe dhanni kappi puchukovadaniki anekamaina rahadarulani vetukutam..Alanti tappulato to kudina rahadarulani mind lo feed chesukoni janalu bratikestunnaru...Jai Hind...

Anonymous said...

తెలుగు టపాలో మరీ అన్ని ఇంగ్లీషు పదాలు వాడటం అవసరమా? ఇంగ్లీషు పదాలు బాగా తగ్గించి, అవసరమైన చోట మాత్రమే వాడుతూ వ్యాసం తిరగ రాయగలిగితే చదివి సంతోషించగలం.

A Homemaker's Utopia said...

Wonderful post Sravya..:-)

Sravya Vattikuti said...

@కుమార్ గారు థాంక్ యు :-) ఇంతకీ Race to Bottom పుస్తకమా ? సినిమానా ?
@హ హ సంతోష్ నేను అనే ముందు మీరే లేబుల్ చేసుకున్నారా ? థాంక్స్ ! ఇంతకీ చదువు ఎలా సాగుతుంది ?
@శ్రీకాంత్ గారు థాంక్స్ :-)
@శ్రీరాం గారు నైరాశ్యం? లేదండి నేను ఎక్కువ కాలం బ్రతుకుదాం అంటే మీరు ఇలా అర్ధం చేసుకుంటే ఎలా ? థాంక్స్ :-)
@భరద్వాజ్ గారు LOL కి ఏమి రెస్పాన్స్ ఇవ్వాలో తెలియట్లా అందుకే థాంక్స్ :-)
@వ్రజ గారు చాలా చాలా థాంక్స్ ! మీ ప్రోత్సాహం నాకు ఎప్పుడూ రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది :-)

Sravya Vattikuti said...

@అనానిమస్ గారు మీరన్నది నిజమే. ఎక్కువ ఇంగ్లీష్ పదాలు దొర్లాయి, నాకు నేను అనుకున్నది వ్రాత లో పెట్టడం కొంచం కష్టమండి. అచ్చూ తెలుగులో అంటే మరీ కష్టం.పొరపాటున ఏదన్న పదం వాడితే అది వేరే అర్ధం వచ్చి నేను వ్రాసినది ఏదో అయితే చదివే వాళ్ళకి ఇంకేదో అర్ధం అవుతుందేమో అని ఆ రిస్క్ తీసుకొను. ఈ ఇంపోజిషన్ శిక్ష ఈసారికి రద్దు చేసేయండి మాష్టారు దయచేసి.
@ A Homemaker's Utopia గారు నేను రాసినది మీకు నచ్చినందుకు సంతోషం గా ఉందండి , Welcome to my blog & Thanks :-)

Sekhar said...

Important విషయాల మీద ఆక్టివ్ గా ఉండే ఒక గళం కొన్ని issues కి దూరం గా ఉన్నపుడే అనుకున్నా...ఇలాంటి సూటిగా..స్పష్టం గా ఉండే పోస్ట్ ఒకటి రాబోతుంది అని.చాల అలోచించి రాసినట్లున్నారు.Very well written.Let the stupidity prevail

రాజేంద్ర తడవర్తి said...

Let the stupidity prevail..

excellent..

Anonymous said...

This dynamism makes Sravya as if one my few favorite bloggers ever! 

Anonymous said...

"ఈసారికి రద్దు చేసేయండి మాష్టారు దయచేసి."
డిజాస్టర్ = ఉపద్రవం
ప్లానెట్ = గ్రహం
స్టుపిడిటీ = మూర్ఖత్వం
ఇలా టపాకింద రాసేయండి, ఇంగ్లీషు రాని లేదా ఇంగ్లీషులో వచ్చినంత సులభంగా తెలుగులో చెప్పలేమని డాంబికాలు పోని సామాన్యులు ఎలా చదవాలి?
"చల్లగా కాకిలా కలకాలం బ్రతుకుదాం. "
కూల్‌గా క్రో లాగా లివ్వుదాము అనలేక పోయారా? :)

Sravya Vattikuti said...

@శేఖర్ , @రాజేంద్ర @ అరుణ్ గారు Thank you very much :-)
@అనానిమస్ గారు వామ్మో ఇదేంటండీ ఇలా బెత్తం పుచ్చుకుంటున్నారు ? ఆ పదాలు నాకు తెలుసు కానీ నిజానికి గ్రహం తప్ప ఇంకా మిగిలిన ఏ పదాలు వాడినా అదేదో నేను పెద్ద గా తిట్టేస్తు రాస్తున్నట్లు గా అనిపించింది అండి. అందుకే వాడలేదు . నాకు తెలుగు రాదు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు అని డాంభికాలు పోవడం కాదండి, నిజానికి దొందూ దొందే ఏదీ సరిగ్గా వచ్చి చావదు. కాని నేను గమనించనంత వరకు కాస్త సీరియన్ విషయం ఇంగ్లీష్ పదాలు వాడి చెప్తే బానే ఊరుకుంటారు అండి మనవాళ్ళు అచ్చ తెలుగు లో సీరియస్ గా చెప్తే వేరే రకంగా రెస్పాండ్ అవుతారు . అసలు విషయం అదీ .
మీరు మరీ కానీ ఆ పదాలు తెలుగు కన్నా ఇంగ్లీష్ లోనే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు అని నా అంచనా ! థాంక్స్ ఉహు కాదు లెండి ధన్యవాదాలు :-)

Sunita Manne said...

ఏమి చెప్పాలో తెలీటంలేదు శ్రావ్స్....

ఫోటాన్ said...

As usual, excellent :)

Anonymous said...

నాకు తెలుగు రాదు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు అని డాంభికాలు పోవడం కాదండి,-----
మీరు డాంబికాలు పోవడం కాదు "డాంబికాలు పోని మాలాంటి సామాన్యులు ఎలా చదవాలి?" అని సవినయంగా మా బాధ చెప్పుకున్నాను. సోమెనీ పీపుల్ ప్రైస్ చేస్తుంటే ఆట్ లీస్ట్ ట్వెంటీ ఫైవ్ పర్సెంట్ రీడే వుంటారని అస్యూం చేసుకున్నా, మీరు బాగా వ్రైటారన్నట్టే. నేను 75పర్సెంట్లో ఫాలానని (పడ్డానని) చింతిస్తున్నా సారి వర్రీ అవుతున్నా. మీరేమి రె రైట్ చేయాల్సిన నెసిసిటీ లేదు. నేను చదవలేకపోయానే అనే నా వర్రీ అంతా. :)

Anonymous said...

hilarious, yet critical

Sravya Vattikuti said...

@సునీత గారు :-)
@శ్రీకాంత్ గారు హ హ నిజమే కదా :-)
@ఫోటాన్ ఎప్పటిలాగే థాంక్స్ అన్నమాట :-)
@అనానిమస్ గారు హ హ హిలేరియస్ :-)

Sravya Vattikuti said...

@puranapandaphani gaaru Thanks :-)

నవజీవన్ said...

Stupidity ని కాపాడుకుంటూ కలకాలం కాకి ల బతకమని సలహా ఇచ్చారేంటి మేడమ్..నిరాశావాదం తో ఉన్న రచన అయిన బాగానే రాసారు
మేడమ్ . ఏది ఏమైనా మనిషి లో ఈ కాలం లో స్వార్ధం పెరుగుతున్నంత కాలం ఈ భూమి పై అంతే భారం పెరుగుతుంది. ఆ భారాన్ని మోయలేక ఆ భూమాత ఎపుడు మనల్ని ఏ సునామి కి బలి పెడుతుందో...

Rao S Lakkaraju said...

చెంపపెట్టు లాంటి పోస్ట్. ఇప్పటికయినా రోజుకో మంచిపని చేద్దామని అనుకుంటూ మంచిగా ఆలోచించటానికి ప్రయత్నం చెయ్యలేమా !

Anonymous said...

సూపర్.... ఇంకొన్ని పాయింట్స్ నన్ను చెప్పమంటారా.? ఏమీ లేదు మరీ ఇన్ని తక్కువ ఐడియాలా అని .
స్టుపిడిటి గురించి ఎంత చెప్పుకోవచ్చు మనము.. అసలు ఎంత చెప్పినా తరగని ఘనత ... మన దెగ్గర ఉన్న ఏకైక ఆస్తి , దినదినా అభివృద్ధి చెందుతున్నవెలకట్టలేని ఐశ్వర్యం .

జ్యోతిర్మయి said...

చాలా మంచి పోస్ట్ శ్రావ్య గారు.

Sravya Vattikuti said...

@నవజీవన్ గారు మన చుట్టూ జరుగుతున్నవి చూసి సెటైర్ లాగా రాసానండి . మీకు నచ్చినందుకు థాంక్స్ :-)
@రావ్ లక్క రాజు గారు హ్మ్ అవునండి మన ఆలోచన తీరు మారాలి అని నా కోరిక కూడా . థాంక్స్ అండి !
@చంద్రకళ హ హ అంతే కదా మన తరగని ఆస్తి అదే !
@జోతిర్మయి గారు థాంక్ యు !

సంతు (santu) said...

@శ్రావ్య గారు మీ కామెంట్ చుస్కోలేదు, yeah పర్లేదు బానే చదువుతున్న ప్రస్తుతానికి.... :)

Post a Comment