Subscribe:

Friday, March 8, 2013

సిరిసిరిమువ్వ - ఒక విజేత



చూడటానికి నాజూకైన మల్లెతీగంత సుకుమారి..
బోల్డంత -- అభిమానం... ఆపేక్ష... అప్యాయత...
స్వచ్చమైన -- చిరునవ్వు.. పలకరింపు.. ప్రోత్సాహం.. అన్నీ కలగలసిన మృదుస్వభావి!!

                                            నిషిగంధ 

ఇలాంటి ప్రత్యేకత కలిగిన అందమైన వ్యక్తితో పరిచయం అయితే మనకి చాల సంతోషంగా ఉంటుంది కదూ ? మరి ఆ సంతోషాన్ని చుట్టూ ఉన్నవాళ్ళతో పంచుకుంటే? అది   రెట్టింపవుతుంది .  అందుకే నా సంతోషాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నంలో ఆ అందమైన వ్యక్తి మీలో చాలా మందికి తెలిసినా సరే మరోసారి నా మాటల్లో పరిచయం చేయాలి అని నా ఈ ప్రయత్నం. 

అసలు ఈ వ్యక్తి తో నా పరిచయం ఎలా అయ్యిందో మీరు తెలుసుకోవాలి అంటే కొంచెం, కొంచెం అంటే కొంచెం నాతొ పాటుగా నా జ్ఞాపకాలతో వెనక్కి ప్రయాణం చేయాలి. అవి నేను కొత్త కొత్త గా బ్లాగులు చదువుతున్న రోజులు, అప్పుడు ఒకసారి ఇదేనా పరిష్కారం అనే పోస్టు చూసి ఒకింత ఆవేశం గానే ఆ పోస్ట్ లో కంటెంట్ కి వ్యతిరేకంగానే కామెంట్ రాసాను. ఆ బ్లాగ్ లో కామెంట్ రాయటం అదే మొదటిసారి కానీ , ఆ బ్లాగ్ మాత్రం కొత్త కాదు అప్పటికే ఆ బ్లాగ్ మొత్తం తిరగేసాను  కాబట్టి. అలా మొదటి కామెంట్ కొంచెం వ్యతిరేకం గా రాసినప్పటికీ తర్వాత తర్వాత మాత్రం ఆ బ్లాగ్ మీద అభిమానం పెరిగింది. మరీ ముఖ్యంగా ఆవిడ రాసే వాళ్ళ ఊరికబుర్లు, జ్ఞాపకాలు, సమాజం గురించి ఆలోచనలు ఇవి మరింతగా  అభిమానం పెంచాయి. అన్నట్లు ఈ పోస్టు నాకు చాలా చాలా ఇష్ట మండోయి.


ఆ తరవాత బజ్ , ప్లస్ ఆవిడ బ్లాగుతోనే కాకుండా ఆవిడతో నా పరిచయం పెంచేసాయి. చాలా సార్లు మరీ ముఖ్యం గా ఆన్లైన్ లో మనకి వ్యక్తిగత పరిచయం పెరిగే కొద్ది , అప్పటి వరకు  ఎదుటి వ్యక్తి ఏవన్నా  అందమైన మాయపొరలు కప్పుకుని ఉంటే అవి కరిగిపోవటం మొదలయ్యి అసలు రూపం పరిచయం అవుతుంది. ఆవిడ మాత్రం ఆ పరిచయం పెరిగే కొద్దీ మరింత అందంగా కనిపించారు. అదుగో అప్పుడే ఆవిడ పిల్లల గురించి రాసిన పోస్టులు నాకు ఆవిడ మీద మరింత అభిమానాన్ని పెంచాయి.

మరి అక్కడితో ఆగిపోయిందా ? లేదు !  ఆవిడ కాన్సర్ గురించి రాసిన ఈ సిరీస్ లో  మొదటి పోస్ట్ చదివినప్పుడు నివ్వెరపోయాను.  నాకు ఆవిడ బ్లాగ్ తో పరిచయం ఉన్న కారణం గా ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఏదో ఆరోగ్యపరమైన సమస్య ఉంది అని తెలుసు, కానీ అది కాన్సర్ అని మాత్రం ఊహించలేదు. ఒక్కొక పోస్ట్ చదువుతున్న కొద్దీ ఆవిడ ఆ సమస్యని ఎదుర్కున్న తీరు నన్ను ఆశ్చర్యంలో ముంచేసింది. ఆవిడ ధైర్యం  కన్నా,  తనకే ఎందుకు రావాలి అన్న ఆలోచన గానీ,  అయ్యో ఇలా జరిగిందేంటి  అన్న సెల్ఫ్ సింపతి కానీ లేకుండా తన శరీరం లో ఏమి జరుగుతుంది అన్న విషయం గురించి క్షుణ్ణం గా తెలుసుకోవటానికి చేసిన ప్రయత్నం చాలా చాలా నచ్చింది.  ఆవిడ తనకొచ్చిన ఆరోగ్యసమస్యని ఎదుర్కొన్న తీరు మనం చదివే కొన్ని పుస్తకాలలోని,   చూసే సినిమాల్లో ధీరొధాత్తమైన పాత్రలకి ఏ మాత్రం తీసిపోదు.  ఇదంతా ఒక ఎత్తు అయితే  వేరే వాళ్ళకి ధైర్యం, అవేర్నెస్ కలిగించాలి అన్న సదుద్దేశ్యం తో అప్పుడు పడిన బాధని,  మర్చిపోవాల్సిన చేదు జ్ఞాపకాలని  మరోసారి గుర్తు చేసుకుని మరీ తన బ్లాగ్ లో అక్షరబద్ధం చేయడం నాకు చాలా చాలా నచ్చింది. ఇదంతా చదివిన తరవాత ఇప్పటికవరకు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అదేలెండి రాస్తున్నానో మీకు అర్ధం అయిపొయింది కదా ? ఊ ఊ మీరు కరెక్టే ఇదంతా సిరిసిరిమువ్వగా మనకు పరిచయం అయిన వరూధిని గారి గురించే.

ఊ ..... వరూధిని గారు & ఇంకా ఈ పోస్ట్ చదువుతున్న మిత్రులు, ఇలా నేను చెప్పుకుంటూ పోవటం కాదు కానీయండి, వరూధినిగారికి ఇష్టమైన, అలాగే వరూధిని గారిని అభిమానించే మన మిత్రులు, ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందిస్తున్న సందేశాలని ఈ క్రింద చూడండి . అన్నట్లు వరూధిని గారు, వీటిల్లో మీకో ప్రత్యేకమైన విజ్ఞప్తి ఉందండోయ్!  మరీ భాద్యతలు అన్నీ మీరే భరించేస్తున్నారు అని బాధ పడుతున్నారు ఎవరో, కొంచెం వారి విజ్ఞప్తిని ప్రత్యేకంగా పరిశీలించండి మరి :-)



ఇంత మంది ఇంత అందంగా చెప్పిన తరవాత ఇక నేను చెప్పటానికి ఏముందండి? అయినా సరే నా ప్రయత్నం నేను చేస్తాను :-)

వరూధిని గారు, మీలాంటి అరుదైన విశిష్ట వ్యక్తిత్వం ఉన్న వారితో పరిచయం కావడం నాకు చాలా సంతోషంగా ఉహు కాదు కాదు చాలా గర్వంగా ఉందండి. అమావాస్య, పౌర్ణమిలలాగా మనజీవితంలో సంతోషంతో పాటు బాధని కూడా కొద్ది రోజులు రుచిచూడాల్సిందే అనుకుంటే, మీరు అమావాస్య లాంటి చీకటి రోజులని ధైర్యంగా ఎదుర్కున్నారు కాబట్టి, కొత్తావకాయ గారు చెప్పినట్లు జీవితం మీద ప్రేమ ఉన్న మీకు  ఇక ముందు ముందు రోజులన్నీ ఆనందదాయకంగా గడవాలి, అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .

-శ్రావ్య 

ఇంత అందమైన శుభాకాంక్షలు అందించిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఆ శుభాకాంక్షలని ఇంత అందంగా ఒక దగ్గర పేర్చి మాలనల్లిన  నిషికి స్పెషల్ థాంక్స్ ! చదువరి గారు many Thanks !


36 comments :

Unknown said...

వరూధిని గారు అన్ని భాగాలు రాసిన తరువాత చదువుదాం అని + కొన్ని నిజ జీవితం లో చుసిన సంఘటనల వల్ల చదవటానికి hesitate చేసాను తట్టుకోగాలనో లేదో అని.....కానీ ఈ పోస్ట్ చూసాక చాల మంచి గా అనిపించింది..ధైర్యం తో కాన్సర్ ను ఎదుర్కున్న వరూధిని గారికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు....మున్ముందు వరూధిని గారికి అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా.

బులుసు సుబ్రహ్మణ్యం said...

వరూధిని గారు చేసిన పోరాటం చాలా మందికి స్ఫూర్తిని ఇస్తుంది. ఆవిడ ధైర్యం, ఆత్మ స్థైర్యం, కష్టాలకి ఎదురీదడానికి మరింతమందిలో విశ్వాసాన్ని,ఉత్సాహాన్ని నింపుతుంది.పప్పు శ్రీనివాస్ గారన్నట్టు కష్ట సమయంలో వరూధిని గారిని తలుచుకుంటే ధైర్యం వస్తుంది.

మన మధ్యనే ఉన్న ఈ విజేతకి శిరసు వంచి నమస్కరిస్తున్నాను.
ఆవిడ పోరాటం లో వారి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తక్కువ కాదు.వారికి అభినందనలు.

ఇంత చక్కగా స్ఫూర్తిదాయకం గా ఈ టపా వ్రాసిన శ్రావ్య గారికి అభినందనలు, ధన్యవాదాలు. (ఇటువంటి పని శ్రావ్య గారే చేయగలరు....దహా.)

శ్రీనివాస్ పప్పు said...

అద్భుత:

శశి కళ said...

ఎన్ని విషయాలు.ఇవన్నీ chaదివిన తరువాత ఆవిడ మీద ఎంతో గౌరవం
పెరిగింది.వరూధిని గారు మన మధ్య ఉనందుకు చాలా గర్వంగా ఉంది .
అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

Unknown said...

అద్భుత:...copy, paste:)))కానీ భావమదే.ఇంకెలా చెప్పాలో తెలీక:))

కృష్ణప్రియ said...

వరూధిని గారి గురించి ఏం రాసినా తక్కువే. ఆవిడ సిరీస్ చదువుతున్నప్పుడు వ్యాఖ్య ఏం రాయాలన్నా నాకు చాలా మొహమాటం గా ఉండేది. నాకు కలిగిన భావ తీవ్రత లో లక్షో వంతు కూడా అక్షరాల్లోకి దింపలేకపోతున్నానని.
హాట్స్ ఆఫ్ టు హర్.

అలాగే శ్రావ్య కి కూడా చప్పట్లు..
ఇక్కడ తమ అభిప్రాయాలని చెప్పిన చెప్పిన వారికందరికీ అభినందనలు..

రాజ్ కుమార్ said...

Happy varudhini's Day...
అద్బుతః

MURALI said...

జీవితంలో రోజూ ఎందరినో కలుస్తాం. అందులో కొందరే గుర్తించుకోదగిన వాళ్ళుంటారు. కానీ కొందరు గుర్తుంచుకుతీరాల్సిన వాళ్ళుంటారు. శిరీష్ గారూ, వరూధినిగారూ గుర్తుంచుకు తీరాల్సిన వ్యక్తులు. ఒకటి, రెండూ కాదు ఎన్నో విషయాల్లో ఆదర్శవంతంగా కనిపిస్తారు. కాస్తంత పరిచయంతోనే మనల్ని ప్రభావితం చెస్తారు. ఇలాంటి వ్యక్తులతో పరిచయం ఖచ్చితంగా మన అదృష్టం. ఈ పరిచయం ఇలానే పరిమళించాలని ఆశిస్తూ...

Sneha said...

వరూధిని గారి గురించి ఏమి రాసినా తక్కువే అవుతుంది. ఆవిడ వ్యక్తిత్వం మాత్రం అద్భుతం.

శ్రావ్యా(Hope you don't mind me calling Sravya instead of Sravya gaaru.), ఈ పోస్ట్ చదివాకా మీ గురించి మరి కొంచెం తెలుసుకున్నట్టైంది. మీ స్నేహశీలత, ఎదుటి వారిని ప్రోత్సహించే తీరు, ఎదైనా నచ్చకపోతే ముక్కుసూటిగా చెప్పేతీరు ఇవన్ని కలిపి నాకు శ్రావ్య భలే నచ్చింది.

తులసి said...

పేరు కూడా వినడానికి భయపడే రోగాన్ని ధైర్యంగా ఎదుర్కుని మరొకరికి ధైర్యం చెప్పే మానసిక ధృడత్వం ఉండటం వరూధినిగారి అదృష్టం.మీకు ,ఆవిడకు ధన్యవాధాలు .

Anonymous said...

వరూధిని గారూ .." మీరు గ్రేట్ అండీ......ఉహు,గ్రేటెస్ట్ అండీ.... ఇంకా ఏవనాలో తెలీట్లేదండి " . మిమ్మల్ని తప్పనిసరిగా ఒకసారి కలవాలనుందండీ

సిరిసిరిమువ్వ said...

ఏం చెప్పాలో..ఎలా చెప్పాలో కూడా తెలియటంలేదు. వ్యాఖ్య వ్రాయటానికి అడ్డు పడుతున్న కన్నీటి పొర...ఎంత తొలిగిద్దామన్నా తొలగదే!

పప్పు గారూ..మురళి గారూ..సౌమ్యా..నాగార్జునా..వేణూ...రాజ్..పద్మ గారూ..కొత్తావకాయ గారూ...ఇంత మంది ఆత్మీయ అభిమానులను సంపాదించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

శ్రావ్యా..నిషీ...I am speechless. అసలు నేను చేసింది ఏముంది? ఆ పరిస్థితుల్లో ఎవరు ఉన్నా థైర్యం దానంతట అదే వచ్చేస్తుందేమో!

ఆత్మీయ వ్యాఖ్యలకి అందరికీ ధన్యవాదాలు.

Sravya V said...

@స్నేహ గారు , మీరు ఇంతకు ముందు బ్లాగ్ రాసేవారు కదూ ? నాకు తెలిసిన ఆ స్నేహ గారే అనుకుంటున్నా :-) ఏమి పర్వాలేదండి శ్రావ్య అంటేనే నాకు comfortable గా ఉంటుంది . థాంక్ యు మీ వాఖ్యకి !

నిరంతరమూ వసంతములే.... said...

Very nice post Sravya garu..no doubt Varoodhini garu is Wonderful human being!

Unknown said...

వరూధిని గారు రాసిన సీరిస్ చదివినప్పుడల్ల కేవలం కళ్ళేం కాదు మనసు కూడా తడి అయిన సంధర్భాలు ఎన్నో, కృష్ణప్రియగారు చెప్పినట్టు మనసులోని భావాలని కామెంట్ రూపంలో ఎలా పెట్టాలో కూడా తెలియలేదు నాకు. ఒడిదుడుకులలో ధైర్యంగా ఉండమని చెప్పడం చాలా తేలిక, అసలు సమయం వచ్చినప్పుడా ధైర్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలవడం నిజంగా చాలా పెద్ద విషయం, విజయం. ఈ మహిళా దినోత్సవాన వరూధిని గారికంటే పెద్ద విజేతలెవరు? మీకు హేట్సాఫ్.. మీరిప్పుడూ ఇలాగే మొక్కవోని ధైర్యంతో హాయిగా ఉండాలి... ఈ పేజీని ఇంత అర్ధవంతంగా చేసిన మితృలందరికీ నా ధన్యవాదాలు..

వేణూశ్రీకాంత్ said...

అమేజింగ్ జాబ్ శ్రావ్యా అండ్ నిషీ, పోస్ట్ లో రాసిన విషయం అండ్ ప్రజంటేషన్ చాలా బాగుంది. నాకూ అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు.
విమెన్స్ డే కాదు వరూధినీ'స్ డే అన్న ఐడియాకి మాత్రం గాట్టిగా చప్పట్లు :-)

జ్యోతి said...

ధాంక్ యూ శ్రావ్యా.. అసలు నాకైతే ఏం చెప్పాలో కూడా మాటలు రావడం లేదు. కాని అలాటి సందర్భం వచ్చినప్పుడు మాత్రం వరూధినిగారిని తప్పకుండా గుర్తు చేసుకుంటాను. హ్యాట్సాఫ్..

కిరణ్ కుమార్ కే said...

నేను కూడా వరూధిని గారు రాసినవి చదివాను, నిజంగా అధ్బుతమే.

శ్రావ్య గారికి, వరూధిని గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

..nagarjuna.. said...

పెద్దదే అయినా తనకు ఎదురైన సమస్య చాలా చిన్నదేననీ దాన్ని ఓడించి గెలవచ్చనీ, ఆ సమస్య గురించి అపోహలు తొలగించేందుకు సహృదయంతో పదిమందితో తన అనుభవాలను పంచుకొని ఇప్పుడు ఇందరిలో కొండంత స్ఫూర్తిని నింపిన మువ్వగారికి ’ఆమె సైన్యం’ చదువరి గారికి, వారి కుటుంబానికి ధన్యవాదాలతో కూడిన పాదాభివందనాలు... మీలాంటి వారితో పరిచయం కలిగినందుకు చాలా అదృష్టవంతుడిగా ఫీలవుతున్నానండీ.

మువ్వగారికి అభినందన తెలిపేందుకు నాకూ అవకాశం ఇచ్చినందుకు శ్రావ్య గారికి వాటిని అందంగా తీర్చిదిద్దినందుకు నిషిగారికి ధన్యవాదాలు.

sneha said...

అవును ఆ స్నేహనే :-)

జలతారు వెన్నెల said...

శ్రావ్య , నాకు అసలు వరూధిని గారు రాసిన సిరీస్ గురించి తెలీదు, until I read your post today. వరూధిని గారిని కిందటి సంవత్సరం కలిసాను కాబట్టి, ముఖపరిచయమే కాక, ఎంత స్నేహశీలో నాకు బాగా తెలుసు. Thanks for this post, and I will read through her series.. but may God bless her a long life and all the good things in life.

ఫోటాన్ said...

ఎన్ని రోజులకు మళ్ళీ వెన్నెల వచ్చింది :)
వెల్కం బ్యాక్ జ.వె. గారు!!

ఫోటాన్ said...

స్లైడ్స్ లో చాలా మంచి మాటలు వున్నాయి,
రాజ్ చెప్పిన మాటే నాదీ కూడా.
ఇక మీ ప్రజెంటేషన్ గురించి, ఎప్పటిలాగే బాగుంది శ్రావ్యాక్కా #1





జలతారు వెన్నెల said...

Sorry I did not mention a word about your writeup and the way you put it all together - that too on a special day like this - Women's day...
Kudos to you! And I will just say "God bless you" for all the lovely things you always do to everyone you know.
Thanks Harshaa...

ఫోటాన్ said...

>>>ఫోటాన్ said...

ఎన్ని రోజులకు మళ్ళీ వెన్నెల వచ్చింది :)
వెల్కం బ్యాక్ జ.వె. గారు!!<<<<



అయ్యో, ఈ కామెంట్ జ.వె. గారి బ్లాగ్ పోస్ట్ లో రాయాల్సింది, ఇక్కడికి ఎలా వచ్చింది :)

జయ said...

శ్రావ్య గారు చాలా మంచిపని చేసారు. ఈ ఒక్క రోజు మాత్రమే వరూధిని డే కాదు. జీవితమంతా గుర్తుంచుకోవాల్సిన పాఠాలు ఇవి.ఎవ్వరూ ఏనాటికీ మరిచిపోలేరు. మీకు నా అభినందనలు, ధన్యవాదాలు కూడా.
వరూధిని గారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

నిషిగంధ said...

చాలా చక్కగా రాశావు, Sravya!

వరూధిని గారు, we are just celebrating the great attitude... అంతకంటే అస్సలు ఏమీ చేయలేదు... :)

Kathi Mahesh Kumar said...

Brilliant...

Sravya V said...

@శేఖర్ నాదీ కూడా అదే విష్ !

@బులుసు సుబ్రహమణ్యం గారు , గురువు గారు వరూధుని గారి గురించి చక్కగా చెప్పారు . ఈ చివర్లో రాసిన ఆ లైన్ చూసి భలే సంతోషం వేసింది లెండి (ద.హా ).

@పప్పు సారూ అంటే అంటారా :-)

@శశికళ గారు అవునండి నాకూ గర్వం గా ఉంది . మీకో మహిళాదినోత్సవ శుభాకాంక్షలు !

@ సునీత గారు మీకు ఎలా చెప్పాలి అన్న సంగ్థిధము గా ఉన్నా , ఏమీ చెప్పాలి అనుకున్నారో నాకు అర్ధం అయిపొయింది, థాంక్ యు :-)

@కృష్ణప్రియ గారు హ్మ్ , మేము మాత్రం మీ వాయిస్ టెస్ట్ చేసే ఛాన్స్ కోల్పోయాం, సరే ఏమి చేస్తాం మళ్ళీ ఎదోక సందర్భం రాదా ? వినకపోతామా :-)

@రాజ్ కుమార్ ఏదీ మీ మెసేజ్ కదా? అవును నిజమే :-)

Sravya V said...

@మురళి గారు, వరూధిని గారు & చదువరి గారు వీళ్ళిద్దరి గురించి చక్కగా చెప్పారు. మీ కామెంట్ తో వందశాతం అంగీకరిస్తున్నా !

@స్నేహ గారు చాల రోజుల తర్వాత, మిమ్మల్ని చూడటం సంతోషం గా ఉందండి. ఇంకా పలకరిస్తారు అని అని ఆశిస్తున్నా . మీ అభిమానానికి ధన్యవాదాలండీ !

@తులసి గారు అవునండి, మీరు చెప్పినట్లు అలా మానసిక దృడత్వం అదొక వరం అవసరం కూడాను, థాంక్ యు !

@లలిత గారు ఇంకా ఆలోచిస్తున్నారా, ఈసారి వాళ్ళ ఊరు ఎప్పడోస్తున్నారో తెలుసుకుని కలిసేయండి :-)

@నిరంతరం వసంతంలే , సురేష్ గారు అవునండి మీతో వంద శాతం ఏకీభవిస్తున్నా !

@ప్రసీద గారు అవునండి, ఆ సిరీస్ చదివిన తర్వాత, మనందరి అభిప్రాయం అదే ! థాంక్ యు అండి మా ప్రయత్నం మీకు నచ్చినందుకు !

@వేణు గారు మీరు ఇలా ఫైనల్ ప్రోడక్ట్ రావడానికి మీరు చేసిన హెల్ప్ చాల చాల ఉపయోగపడింది. అసలు నేను మీకు బోలెడు థాంక్స్ చెప్పాలి .

@జ్యోతి గారు అవునండి మీరన్నట్లు వరూధిని గారిని ఆదర్శం గా తీసుకోవాలి, థాంక్ యు అండి !

@గ్రీన్ స్టారు గారు , మా అందరి అభిప్రాయం తో ఏకీభవించినందుకు సంతోషం గా ఉందండి . థాంక్ యు అండి !

Sravya V said...

@నాగార్జున, అవకాశం అదీ ఇదీ పెద్ద మాటలు చెప్తే ఒక నెల జీతం అడిగేస్తాను ఏమనుకుంటున్నారో (జస్ట్ కిడ్డింగ్ ). నాగార్జున మీ అందరి అభినందనలు లేకపోతే ఇది కూడా మరో మామూలు పోస్టు అయ్యి ఉండేది అంతే అదీ విషయం :-)
ఇంకా చదువరి గారి గురించి , వరూధుని గారి చెప్పిన మీ మాటలే నావీ కూడా .

@జలతారు వెన్నెల గారు చాలా రోజుల తరవాత కనిపిస్తున్నారు. సంతోషంగా ఉండండి మిమ్మల్ని మళ్ళీ ఇలా కలవడం. అవును లాస్ట్ ఇయర్ మీ ఇండియా ట్రిప్ లో వరూధిని గారిని కలిసారు కదా నాకు గుర్తుంది . మీరు అర్జెంటు గా ఆ సిరీస్ చదివేయండి ! ఇంకా మీ బ్లెస్సింగ్స్ కూడా థాంక్స్ అండి .

@ఫోటాన్ ఎప్పటి లాగేనే నీకు థాంక్స్ :-)
ఆ పై కామెంట్ హాక్ చేసి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టా :P

@జయ గారు ఈ ప్రయత్నం మీకు నచ్చినందుకు సంతోషం గా ఉందండి ! నిజం మీరు చెప్పినట్లు ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన పాఠాలు ఇవి.

@నిషి థాంక్స్ :-)

@కత్తి మహేష్ కుమార్ గారు థాంక్స్ !

Sravya V said...

@సిరిసిరిమువ్వ,
వరూధిని గారు పైన నిషి చెప్పినట్లు, మేము ఏమీ చేయడం లేదు, just celebrating your attitude అంతే ! అది కూడా ఏదో హడావుడి గా ఈ రెండు మూడు నెలలలో ఏర్పడిన అభిప్రాయం కాదండి. ఒక నాలుగు సంవత్సరాలు దగ్గరగా చూసి ఏర్పరుచుకున్న అభిప్రాయం. మీరు రాసిన ఈ సిరీస్ మాత్రమే కాదు అసలు ఫామిలీ రిలేషన్స్ కి మీరిచ్చే గౌరవం, ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఆలోచించి మాట్లాడం ఇవన్నీ కూడా ఈ గౌరవం పెరగటానికి కారణం . నాకు ఇప్పటికీ గుర్తుంది ఏదో సీరియస్ డిస్కషన్ లో మీ కామెంట్ అత్తింటి వారు వైపు మాత్రం ఎందుకు హెల్ప్ చేయరు అవసరం వస్తే అని ఏదో కాంటెక్స్ట్ లో . ఇలా ఒకరి కాదు రెండు కాదు చాలానే కారణాలు ఉన్నాయి మీమీద ఈ గౌరవం అభిమానం పెరగటానికి.You completely deserve what we did :-)

ఇక ఈ చేదు జ్ఞాపకాలన్నీ వదిలేసి హాయిగా గడిపేయండి మీరు, ఇలానే బోలెడంత మంది అభిమానాన్ని సంపాదించుకుంటూ !

Kottapali said...

Best Wishes

Sravya V said...

@Narayanaswamy garu, Thank you !

రాజ్ కుమార్ said...

నా మెసేజ్ కాదండీ... మీ పోస్ట్, ప్రెజెంటేషన్ అద్బుతః ;)

Sravya V said...

హ హ రాజ్ థాంక్ యు :-)

Post a Comment