Subscribe:

Tuesday, April 2, 2013

అనగనగా ఒక ఇంటర్వ్యూ


ఈ పోస్టు వెనక కథ :
నాకు చిన్నప్పటి నుంచి ఒక తీవ్రమైన కోరిక . అదీ అదీ ...  మరీ ఇంత సాగదీస్తున్నా ఏం కొంపలు మునిగే కోరికో అనుకోకండి. చిన్నదే , మరేం లేదండి ఎవరినైనా పట్టుకుని ఇంటర్వ్యూ అన్న పేరుతొ ప్రశ్నలతో ఎడాపెడా కొట్టాలని. మాములుగా అయితే ఏదన్న పరీక్షల కోసం చదివితే ఆ పరీక్ష అవ్వగానే కనీసం పరీక్ష హాల్ నుంచి బయటికి రాగానే మర్చిపోవటం , అలాగే ఇవాల్టి కోరిక రేపటి కొత్త కోరిక క్రింద కప్పిపెట్టేయడం నాకు బాగా  అలవాటు. కానీ అదేంటో ఈ ఇంటర్వ్యూ చేయాలన్న కోరిక మాత్రం రోజు రోజుకి మందు వేయని పిచ్చి మొక్కలాగా పెరిగి మహావృక్షం అయిపొయింది. ఆ కోరిక మహ ఉదృతంగా పెరగటానికి మన టీవీలలో వచ్చే ఇంటర్వూస్ కావలసిన ఆక్సిజన్ని అదించాయి లెండి . అదండీ ఈ పోస్టు కధ, మరి వెనక  కథ ఉంటె ముందు కథా ఉండాలి గా అందుకే చూడుడు క్రింద . 

ఈ పోస్ట్ ముందు కథ :
రోజు రోజుకీ పెరిగిపోతున్న ఈ నా చిన్న కోరిక నా జీవితఆశయం గా మారి ఎవరో ఒకరి జీవితం బలి తీసుకోకముందే దాని అంతు చూడాలి అని రంగంలో దూకా. నాకున్న స్కిల్స్ అన్నీ వాడి ఇంటర్వ్యూకి కావాల్సిన గెస్ట్ కోసం వెతకటం మొదలెట్టా. అప్పుడు కానీ మన పవర్ అర్ధం కాలేదు. నా నోట్లో నుంచి ఇంటర్వ్యూ లో "ఇ " అన్న అక్షరం కూడా బయటికి రాకముందే జనాలు పారిపోవటం మొదలెట్టారు. ఇక ఇలా లాభం లేదు అని సెంటిమెంట్ తో కొట్టా ఒక కాండిడేట్ని పట్టా . ఎవరా ఆ బకరా, అని ఎదురు చూస్తున్నారా? ఎదురు చూపులలో చాలా ఆనందం ఉంటుంది అట కదా ఒక్క రెండు నిమిషాలు ఓపిక పట్టి క్రిందకి స్క్రోల్ చేసి అసలు కథ అదేలెండి ఇంటర్వ్యూ చదవటం మొదలు పెట్టండి . 



అసలు కథ : 

గెస్ట్   : బంతి
హోస్ట్ : శ్రావ్య


(స్వగతం : Actual గా అయితే నా పేరు పైన రాసి గెస్ట్ పేరు క్రింద రాయమని నా ఇగో మహా గోడవపెడుతుంది ! కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి జీవితంలో ఏమి చేస్తాం, Such is Life !)

సరేలెండి స్వగతాన్ని కాసేపు ఆ ఇనపెట్టెలో దాచిపెట్టి  ఇంటర్వ్యూ లోకి వద్దాం !

నేను : బంతి ఎలా ఉన్నారు ? 
బంతి : బంతి నా , బంతి గారు అనాలి అని కూడా తెలియదా? కనీసం ఇంటర్వ్యూ మర్యాదలు కూడా పాటించటం తెలియకుండా ఓ వచ్చేస్తారండి . 

నేను : అంటే...  మీరు నాకు ముందు నుంచే తెలుసుకదా అని కొంచెం ... అలా పిలిచానండి . సారీ మీకు అభ్యంతరం అయితే అలాగే పిలుస్తాను బంతి గారూ రూ రూ ...
బంతి : ఇది పిలిచినట్టులేదు నే పోతే అరిచినట్టుంది. 

నేను : సర్లేండి  ! ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంత మర్యాదగా పిలిచినా సరే అది మీకు సరిగా అనేట్లుగా లేదు. దీని సంగతి ఇంటర్వ్యూ అయ్యాక పర్సనల్ గా తేల్చుకుందాం. కొద్దిసేపు ఆ పిలుపుల విషయం పక్కన పెట్టి నేను అడిగిన వాటికి సమాధానాలు ఇస్తారా ?
బంతి : ఏమి తేల్చుకోవటం ఏమిటో ! మీరు కానీయండి,. ఇందాక వచ్చాక తప్పుతుందా నాకు, రోట్లో తల పెట్టి రోకటి పోటుకి వెరవటం మా ఇంటా, వంటా లేదు  !

నేను : అబ్బో మీకేదో పెద్ద బాక్గ్రౌండ్ ఉన్నట్లుందే ! ఇంతకీ మీరు ఎక్కడ పుట్టారండీ ?

బంతి : ఏంటీ ఎక్కడ పుట్టానా ? అసలు ఇదీ ఒక ప్రశ్నే ? ఎక్కడ పుడితే మీకేందుకండి ? అసలు నేను ఎక్కడ పుడితే మీకేందుకా అని ? అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అంటే ఇదే .... 
సర్లెండి ఖర్మ కాలి ఇక్కడ దాకా వచ్చినాక , నా విసుగు చూపించి ఉన్న ఇమేజ్ని పాడుచేసుకోవటం ఎందుకు . మళ్ళీ ఈ ఇంటర్వ్యూ ఏదో చదివి వచ్చే నాలుగు పెళ్లి సంబంధాలు వాళ్ళు కూడా రాకుండా చేసుకోవడం ఎందుకు? నేను మా ఊర్లో హాస్పిటల్ లో పుట్టాను . 

నేను : (ఇంత టిప్పు టాప్ గా తయారయ్యి వస్తే ఏదో పాపం ఇంటర్వ్యూ మీద శ్రద్ద అనుకున్నా.  ఈ ఇంటర్వ్యూ అడ్డం పెట్టుకుని మార్కెట్ లో రేట్ పెంచుకొవటానికా నాయన ఈ వేషం . ఏమో అనుకున్నా చానా తెలివే ఉంది ).
అది కాదండి నేను అడిగింది !  హాస్పిటల్ లో పుట్టారా? మీ ఇంట్లో పుట్టారా ? అని కాదు నేనడిగింది.  మీ ఊరేది అని ?

బంతి :మీరు గాని అదేదో ఛానెల్ లో పని చేసారా, ఇంతకు ముందు ? ..ఏం లేదు మీ కొస్చెన్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది లెండి.  మా ఊరు ఏదీ అని మామూలు ఆడొచ్చుగా ? ఎక్కడ పుట్టారు అంటే ఏమనుకుంటాం ? ప్రశ్న ఎలా అడగాలో తెలియదు కానీ వచ్చేస్తారు ఇంటర్వ్యూ చేస్తాం అనుకుంటూ ! 


నేను : తిట్టింది చాలు, కొంచెం మీ ఊరు  ఏదో .... 
బంతి:  హైద్ నుంచి దక్షిణంగా 200 కి.మి వెళ్ళి అక్కడ నుంచి నైఋతి కి తిరిగి 150 కి.మి పోతే లెపాక్షి వస్తుంది .  లేపాక్షి దగ్గర కుడి వైపు తిరిగి వాయువ్యంగా పాతిక కి.మి పోతే మడకశిర వస్తుంది. ఆ ఊళ్ళో ఆగ్నేయంగ హాస్పిటల్ ఉంది . ఆ హాస్పిటల్ పడమటి వైపు ప్రసూతి వార్డ్ ఉంటుంది ఆ వార్డ్ లో పుట్టానండి. కానీ పుట్టిన కొన్ని రోజులకే తూర్పుగా  ప్రయాణం చేసి చిత్తూర్ కి వచ్చేసానండి 

శ్రావ్య :  మీరు కాని వాతావరణశాఖలో పని చేసారా ? అయినా మీరు గ్రేట్ అండి పుట్టిన కొన్ని రోజులకే నడిచేసారా ?
బంతి :  ఏంటీ వెటకారమా .. సెటైరా ?  మా నాన్న గారికి ట్రేన్స్ ఫర్ అయితే చిత్తూర్ వచ్చేసాం

నేను : (దేవుడా ఇంకో అరగంట సేపు నాకు ఓపిక, సహనం ప్రసాదించే బాధ్యత నీది ! ) హి హి మీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా అండి. ఈ సారి నుండి జాగ్రత్తగా అడుగుతా మీరెక్కడి వరకు చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారు ?
బంతి : నేను ఏమి చదువుకున్నా, ఎక్కడ చదువుకున్నా, ఫస్ట్ క్లాసు లో నా గ్రేడ్ ఏంటి ? ఎంసెట్ లో నా రాంక్ ఏంటీ ఇవన్నీ మీకవసరమా అండి ? 
ఏమన్నా అంటే అన్నాం అంటారు మీరు నాకేదన్న ఉద్యోగం ఇవ్వబోతున్నారా ? ఈ ప్రశ్నలు ఏందో మీరెందో .. ఊ తరవాత ప్రశ్న ఏంటో ? ఈ సారి జీతమెంతా అని అడుగుతారా ఏంటి ? ఏం ఇంటర్వ్యూనో  ఏమో కొచెన్స్ ఆన్సర్స్ అన్నీ నేనే చెప్పాలా?  అసలు మీకు ఈ ఇంటర్వ్యూ చేయాలన్న కోరికేంటీ? నా ఖర్మ కాకపొతే 


నేను : (అబ్బా ఆ మొహం చూడు జీతం అడిగితే బ్యాంకు స్టేట్మెంట్ డీటెయిల్స్ మొత్తం ప్లస్ లో పబ్లిక్ పోస్ట్ పెట్టేట్లు గా, ఇంతవరకూ అడిగిన దానికి ఒక్కదానికి తిన్నగా సమాధానం చెప్పలేదు. దేవుడా ఈ శనివారం నీకు 11 కొబ్బరికాయలు గ్యారెంటీ కొద్దిగా మర్డర్లు వగైరా జరగకుండా, ఈ ఇంటర్వ్యూ ఏదో సవ్యంగా ముగిస్తేట్లు చూడు స్వామీ) . హి హి లేదండి జీతం వగైరా నేనుందుకు అడుగుతా అండి ? మీ ఎక్స్పీరియన్స్ , మీ ఉగ్యోగం ఇవి తెలుసుకుని గూగుల్ చేస్తే మాకు ఐడియా వచ్చేస్తుందిగా మరీ అంతగా తెలుసుకోవాలంటే ! లేదులెండి జీతం గురించి కాదు కానీండి ? మీ హాబీస్ ఏంటో చెప్పండి ?
బంతి : నే ఖాళీగా ఉంటే ఫుట్బాల్ ఆడుతా... నా ఫ్రెండ్స్ ఖాళీగా ఉంటే నన్ను ఫుట్బాల్ ఆడుతుంటారు ... 
          ఆసక్తిగా క్రికెట్ చూస్తా ఇండియా గెలిస్తే సుగర్ ఓడితే బి.పి తెచ్చుకుంటా . 
          సీరియస్ గా సినిమాలు - సరదాగా రాజకీయాలు ఫాలో అవుతా )
          ఖాళీ సమయం ఎక్కువ ఉంటే పాదయాత్ర చేస్తా.. .బాధ ఎక్కువయితే ఓదార్పు చేస్తా ..RTC కి నష్టం
          వస్తే బస్సు యాత్ర చేస్తా ( బాగ ఖోపం వస్తే కారు యాత్ర ... సరదాగా సైకిల్  యాత్ర చేస్తా )


నేను : (అమ్మయ్య దేవుడి కొబ్బరికాయల డీల్ తో సంతృప్తి చెందినట్లు ఉన్నాడు) బావున్నాయండి మీ హబీలన్నీ. వీటన్నటితో పాటు ఇంకొకటి చెప్తారు అనుకున్నాను . అదే మీకు మానేజర్లని ఊరికే తిట్టే హాబీ ఉన్నట్లు ఉంది ? అది చెప్పలేదు .....
బంతి : ఇంటర్వ్యూ అంటే మీకు తెలిసిన సమాధానాలు చెప్పాలా ? నా గురించి నాకు తెలిసినవి చెప్పాలా ? అంటే మీ ప్రశ్నలకి సమాధానాలు కూడా మీరే ఫిక్స్ చేసుకున్నారా ? అవి నేను చెప్పాలా ? ఇంతోటి దానికే ఏదో ఇంటర్వ్యూ అని ఒకపేరు ? మీరే ప్రశ్నలు, మీకు తోచిన సమాధానాలు రాసి వీలయితే మార్కులు కూడా వేసుకో లేకపోయారా ?

నేను : (ఖర్మ ! దేవుడా డీల్ అదీ ఇదీ అని వాగినందుకు అర్జెంటుగా నాతొ ఆడుకోకయ్యా  బుద్దొచ్చింది ) అయ్యో అలాంటిదేమీ లేదండి . ఏదో అందరూ అనేది విని అలా అడిగాను అంతే ! అయినా ఉన్న నిజాన్ని చెప్పుకోవటానికి అంత మొహమాటం ఎందుకండీ . 
బంతి : పబ్లిక్ పోస్ట్ లో ఒక మాట ప్రైవేట్ పోస్ట్ లో ఒకమాట మాట్లాడటం మా సీమ రక్తం లో లేదు. మాట కోసం రక్తాభిషేకం చేసే వంశం మాది ! నేను అసలు ఎప్పుడు డామేజర్ని  సారీ అదే మానేజర్ని అస్సలు పొరపాటున కూడా ఒక్క మాట అనను . మానేజర్ అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుడు దేవుండీ అలాంటి వాళ్ళని పట్టుకుని తిట్టడమా రామ రామ . ఇది ఎవరో నా శత్రువులు పుట్టించిన పుకార్లు . 

నేను : (ఏం రక్తంతో బాబు ఆ అభిషేకాలు? కొంపదీసి మేకదో , కోడిదో కాదు కదా ?)ఏవండీ నాకో చిన్న అనుమానం అండీ . నిజం మీరేదో సీమ లో పుట్టానని సమరసింహారెడ్డి లెవెల్లో ఫీల్ అవుతున్నారా ? మీకు శత్రువులు ఉండటం ఏంటి ? పోనీ ఉన్నారు మిమ్మల్ని చూసాకా కూడా వాళ్ళకి కుట్రలు చేయాల్సిన అవసరం ఉందా ? ఉఫ్ అని గట్టిగా ఊదితే సరిపోదు ?
బంతి : ఏంటండీ , ఏంటీ ఈ అరాచకం ?  ఫ్రీ గా ఉంది కదా అని, ఇంటర్వ్యూ పేరు అడ్డు పెట్టుకుని, మీ ఇమేజ్ కి మైలేజ్ కోసం  నా ఇమేజ్ని  డామేజ్ చేస్తున్నారా ? నేను ఇప్పుడే వాక్ అవుట్ చేస్తున్నా , ఇంటర్వ్యూ లేదూ ఏమీ లేదూ ఏమి చేస్తారో చేసుకోండి . 


నేను : ఇందాకటి నుంచి చూస్తున్నా ? ఏంటి ఓ బెదిరిస్తున్నారు ? ఏమి చేస్తానా ? నాకు తోచిన ప్రశ్నలు,   సమాధానాలు రెండూ నేనే రాసి అవి మీరు చెప్పినవే అని పబ్లిష్ చేస్తా ! ఏమి చేస్తారో చేసుకోండి .
బంతి :   ఏంటీ , తమరికి ఈ టాలెంట్ కూడా ఉందా ? ఏది,  ఏమి రాసుకుంటారో ఒకటి చెప్పండి, మీ కలాపోసన సంగతేందో చూద్దాం ?

నేను : ఓహో నన్ను తక్కువ అంచనా వేయొద్దు. సపోజ్ ఫర్ సపోజ్ , మీకు శ్రీకాకుళం అడువుల్లో తిరగడం హాబీ అని రాస్తా. రీమిక్స్ చేసిన విండ్ రైన్ పాట మీకు ప్రాణం అని చెబుతా ..... ఇంకా ఇలాంటి డేటాబేస్ చానా ఉంది నా దగ్గర అదీ విషయం. మరి అలా ఫాలో అయ్యి పొమ్మంటారా? 
బంతి : వామ్మో ! ఇలాంటి దారుణానికి తెగబడతారా ? ఉండండి మీ సంగతి ఇక్కడ కాదు, మా సీమ సంఘం సమావేశం లో తేల్చుతా 


సీమ వాసుల పైన దాడులు ఎక్కువ అవుతున్నాయి.
సీమ వాసులార ఏకంకండి. పోరాడితే పోయేదేమి లేదు సంకెళ్ళు తప్ప!
రండి చేయి చేయి కలపండి పదం పాడుతు కదం తొక్కండి.
జై సీమ ! జై హింద్ !

- శ్రావ్య & చైతన్య 

 PS : ఇది కేవలం సరదాకి చేసిన ప్రయత్నం మాత్రమే !

24 comments :

శ్రీనివాస్ పప్పు said...

<>

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ శ్రావ్యా అదరహో

..nagarjuna.. said...

LOOOOL... epic interview Sravya Ji. Banthi ,as always, you rock dude :)

రహ్మానుద్దీన్ షేక్ said...

:)

Arunodayam said...

wow nice interview

రాజ్ కుమార్ said...

krevvvvvvvvvvvvvv...krEka....
banthi expressions ni taluchukoni chadootunte... arupulu ;)

MURALI said...

అతి ముఖ్యమైన ప్రశ్నలు వదిలేసారు శ్రావ్యా?
1.రంగనాయకమ్మగారింటికి బంతి ఎన్నిసార్లు వెళ్ళాడు? ఇంటికి వెళ్తే కాఫీ ఇచ్చారా? టీ ఇచ్చారా?
2.అప్పట్లో శంకర్‌గారు బంతిని చూసి బంతీ,చామంతి పాట పాడేవారు. ఆ చామంతి ఎవరు?

ఫోటాన్ said...

:)))

Raj said...

lolllllllllllllllzzzzzzzzzzzz... too funny

Vajra said...

Kevveeeest interview......మీరు ఇంటర్వ్యూ చేస్తుంది చదువుతుంటే ..నాకు నువ్వే నువ్వే / నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పండు/బంతి (సునీల్) క్యారెక్టర్ గుర్తుకు వచ్చింది...Heights of awesomeness in u r post..మా అందరిని నవ్వుల నదిలో ప్రవహించేలా చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ....
-Vajra

జలతారు వెన్నెల said...

బంతి గారికి నోట్లో నాలికే లేదు అనుకున్నాను శ్రావ్యా గారు.చిరునవ్వులు చిందుస్తూ ఉంటే అహింసావాదేమో అని కూడా అనుకున్నాను.మీ ఇంటర్వ్యు తో మాకు తెల్లవన్ని పాలు,నల్లవన్ని నీళ్ళు అని నమ్మకూడదు అని అర్ధం అయ్యింది.

బాగా నచ్చిన బంతి గారి లైన్ : "పబ్లిక్ పోస్ట్ లో ఒక మాట ప్రైవేట్ పోస్ట్ లో ఒకమాట మాట్లాడటం మా సీమ రక్తం లో లేదు. మాట కోసం రక్తాభిషేకం చేసే వంశం మాది !"
మీ ఇంటర్వ్యు బాగుంది.మీ తదుపరి ఇంటర్వ్యు ఎప్పుడండి? పోస్ట్ ముగించేముందు,తదుపరి ఇంటర్వ్యు గురించి ప్రొమో ఇవ్వండి ఈ సారి..
:))))

బులుసు సుబ్రహ్మణ్యం said...

టపా, ఇంటర్వ్యూ బెమ్మాండం. పొ.ప.న.

మనసు పలికే said...

శ్రావ్యాజీ... ఇంటర్వ్యూ అదుర్స్ :)))) బంతి గురించి ఇన్నాళ్లుగా తెలీని చాలా విషయాలు తెలిశాయి మీ ఇంటర్వ్యూ పుణ్యమా అని. ఇంతకీ ఆ కొబ్బరికాయలు కొట్టి డీల్ పూర్తి చేసుకున్నారా??;)

మురళి కొశ్చన్స్ సూపరో సూపరు ;)

Unknown said...

:))))))))too good:)))

వేణూశ్రీకాంత్ said...

కెవ్వ్వ్వ్వ్ ఇంటర్వ్యూ :-) ప్రశ్నలు సమాధానాలు రెండూనూ :-))

Sravya V said...

@ శ్రీనివాస్ పప్పు గారు , @ శ్రీకాంత్ గారు, @నాగార్జున , @రహమాన్ గారు , @అరుణ గారు, @రాజ్, ఫోటాన్, @రాజేంద్ర అందరికీ బోలెడు థాంక్స్ :-)

@మురళి గారు అయ్యొయ్యో ఇది నాకు తెలియని విషయాలండీ , కొంచెం ముందు తెలిసినా అదేగేద్దును :-) థాంక్యు !
@వజ్ర గారు హ హ చాల థాంక్స్ అండి :-)
@జలతారు వెన్నెల గారు అయితే పెద్ద పప్పు గిన్నె లో కాలేసారు మీరు :-) ఈ బంతి బాబు సామాన్యుడు కాదండీ ! థాంక్యు !
@గురువు గారు అ.హా , థాంక్యు !
@మనసు పలికే లేదు ఇంకా అంటే ఆ కొబ్బరికాయల డబ్బులు బంతి ఎకౌంటు లోంచి ఎలా లాగేయాలా అని ప్లాన్ చేస్తూ ఉన్నా ఇంకా :-) థాంక్యు !
@సునీత గారు థాంక్యు :-)
@వేణు గారు థాంక్యు :-)

చైతన్య.ఎస్ said...

శ్రీకాంత్ గారు సూపరు :)
మురళీ ఆ ప్రశ్నలు ఇప్పుడు అంత అవసరమా చెప్పు !!
జలతారువెన్నెల గారు అలా అంటారా :(

జలతారు వెన్నెల said...

విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

Sravya V said...

@Chaitanya :-)
@జలతారువెన్నెల గారు థాంక్ యు అండి , మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు !

Anonymous said...

Sravya,

I dont know telugu. But I dropped here to say, thanks for keeping me in your blogroll. I am trying to translate the posts and read it. Will surely come back.

Annasarp,
Prasanna's Ramblings :-)

Sravya V said...

@annasarp Wow ! I am very glad to see you here :-) I love your writings, thank you very much for dropping by !

పరుచూరి వంశీ కృష్ణ . said...

శ్రావ్యా జీ ! టపా అదుర్స్ ..భలే రాసారు ...బాగుంది
:
>>> నే ఖాళీగా ఉంటే ఫుట్బాల్ ఆడుతా... నా ఫ్రెండ్స్ ఖాళీగా ఉంటే నన్ను ఫుట్బాల్ ఆడుతుంటారు .......
ఈ లైన్లు సూపర్ !
అయినా మేనేజర్ ని తిట్టడం హాబీ ఎందుకు అవుతుంది ?గాలి పీల్చకుండా నీరు తాగకుండా ,అన్నం తినకుండా ..మేనేజర్ ని తిట్టకుండా ...ఒక రోజు అసలు ఒక రోజేనా ?
అది మన ( ?? ..మీరు కొంప తీసి మేనేజరులా ?... అయినా తిట్టుకోవడానికి ప్రతి ఒక్కడికీ ఆ పై వాడు ప్రతి ఒక్కడి పైన ఒక మేనేజర్ ని పెడుతుంటాడు )జీవన అవసరం కదా !

ఇదే ఫ్లో లో అప్రైసల్ డిస్కషన్ మీద కూడా ఒక మంచి టపా రాయచ్చు కదా మీరు ...

Sravya V said...

@పరుచూరి వంశీ కృష్ణ,

అబ్బా ఎన్ని రోజుల తరవాత వంశీ, ఎలా ఉన్నారు ఇంతకీ ?
మేనేజర్ నా, హ హ లేదులే ఇంకా ఆ అదృష్టం పట్టలేదు ! అయితే ఇప్పుడు మీరు కూడా మేనేజర్ ని తిట్టే క్లబ్ లో జాయిన్ అయ్యారన్న మాట :-)
పోస్ట్ నచ్చినందుకు చాలా చాల థాంక్స్ :-)

Ennela said...

నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎక్కడండీ...ప్రేక్షకులు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది..టికట్లు నేనమ్ముతా..

Sravya V said...

హ హ ఎన్నెల గారు, టికెట్స్ అమ్ముతారా :-)) థాంక్స్ అండి !

Post a Comment