Subscribe:

Tuesday, February 4, 2014

The Future Grocery Store !


నేనొక సూపర్ మార్కెట్ కడనిల్చి చివాలున తలతిప్పి 
వెళ్లిపోవునంతలోన ఐటమ్స్ అన్నియు జాలిగ
నోళ్ళువిప్పి మమ్ముకొనిపోవాయనుచు 
బావురుమన్నవి  అటుచూసినంతనే     
నా మానసమందేదో తళుకుమన్నది ఈ బ్లాగ్ పోస్టయ్యి ...
                                                                                       (జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి  క్షమాపణలతో )

నాకు మీ హ హ కారాలు వినిపిస్తున్నాయి.  ఏదో  కొత్తదనాన్ని, క్రియేటివిటీని అప్లై చేద్దామనుకుంటే, ఇంకేదో అయ్యేట్లుగా ఉంది. సరే,  మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం దేనికి కానీ,  నా మామూలు స్టైల్ లోకి  వచ్చేస్తా . ఇంతకీ అసలు విషయం ఏంటంటే ?!  (చదవండి  క్రింద మరి)

***

ఒక వారం/పది రోజుల రోజుల క్రితం లంచ్ టైములో తిండి కార్యక్రమం ముగించి తిరిగి  ఆఫీసుకి వెళుతుంటే, ఆ ఫుడ్ కోర్ట్ ఉన్న మాల్లో ఉన్న ఒకానొక సూపర్ మార్కెట్లో ఈ ఫోటోలోని  సెటప్ నా కంటపడింది.   ఏం కంటపడింది,  ఏముంది ఆ ఫోటోలో అంత విశేషం అంటారా?! అయితే నేను ఫోటో సరిగా విషయం హైలైట్ అయ్యేట్లు తీయలేదు.  సో ఇక వేరే దారి లేదు ఎక్ష్ప్లైన్ చేయటం తప్ప.  ఆ ఫోటోలో పై భాగంలో మీరు గమనిస్తే  "3 easy steps " అని రాసున్నది కనిపిస్తుంది కదా ?!  అదన్న మాట అసలు విషయం . ఆ మూడు స్టెప్స్ ఏంటంటే మీరు కొనుక్కున వస్తువులని మీరే స్కాన్ అదేలెండి బిల్ చేసి, బాగ్ లో వేసుకుని, డబ్బు కట్టి వెళ్ళిపొండి అని . అదే అదే 'Self-service checkout' . నిజానికి ఇందులో వావ్ అనిపించే గొప్ప సరికొత్త  టెక్నాలజీ బ్యూటీ  ఏమి లేదు,  కానీ ఉన్న టెక్నాలజీనే చిన్నపాటి మార్పులతో implement చేసిన తీరు చూడగానే,  భవిష్యత్తు లో ఈ  'Self-service checkouts ' సూపర్ మార్కెట్ / గ్రోసెరీ స్టోర్ కొత్త అందాలని అద్దుకోవటంలో ఎలాంటి రోల్ పోషించబోతున్నాయా  అన్న ఆలోచన వచ్చింది.  ఆ మాటకొస్తే అసలు future grocery store ఎలా ఉండబోతుందో కూడా ఒక చూపు చూద్దాం అనిపించింది . 

అవునూ ...  అసలు భవిష్యత్తులో  గ్రోసరీ స్టోర్ / రిటైల్ మార్కెట్ అభివృద్ధి లో 'Self-service checkout'  పాత్ర ఎలా  ఉంటుందో  ఊహించే ముందు,  అసలు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఈరోజుల్లో వీటి పరిస్థితి ఏంటోచూస్తే కొంచెం బాగా ఊహించుకోవచ్చు కదా ? !  కరెక్ట్ ! అందుకే నా ముందున్న బుల్లి వెండితెర మీద గ్లోబ్ ని సర్రున తిప్పాను . అది వెళ్లి USA దగ్గర ఆగింది. ఒకే,   మన కథ అక్కడి నుంచే  మొదలు పెడదాం రండి .

అమెరికా ...  అమెరికా లో  'Self-service checkout' తో షాపింగ్ experience గురించి తెలుసుకోవాలి !... ఇలా అనుకోగానే వెంటనే ఒక ఫ్రెండ్ కి మెయిల్ చేసాను. మీ దేశం లో ఈ Self Checkouts పరిస్థితి ఏంటి అని . అంతే కొన్ని నిమషాల వ్యవధిలో ఈ క్రింది డిటైల్డ్  ఇన్ఫర్మేషన్ నా ముందు ప్రత్యక్షం .  

"Self-checkout? అవి చాలా ఏళ్ళే అయ్యింది ఇక్కడి వచ్చి(నాకు తెలిసి ఏడెనిమిదేళ్లయిందేమో, కరెక్ట్ గా గుర్తులేదు). చాలా స్టోర్స్ లో ట్రయిల్ రన్ క్రింద పెట్టి కొన్నింటిలో తీసేసారు. వాల్ మార్ట్ లో చాలానే పెట్టారు, తీసేసారు, మళ్లీ పెట్టారు. కాస్ట్ కోలో ఇప్పటికీ ఉన్నాయి.
ఒకటే తలనొప్పి ఏంటంటే, దాని మీద ఐటమ్ పెట్టి స్కాన్ చేసాక, అది సరిగా పక్కకి స్లైడ్ చేసి బెల్ట్ మీద  పడేయకపోతే, లేదూ పక్కనున్న బ్యాగ్ లో పెట్టకపోతే ఆ స్కానర్ పట్టుకుంటుంది. Improper activity అని సస్పెక్ట్ చేసి బెల్ మోగుతుంది. ఆ తరువాత్ స్కాన్ చేయనివ్వదు. అది unlock చేయటానికి స్టోర్ పర్సన్ కోసం వెయిట్ చేయాలి.  ఇలాంటి చికాకు బాగా ఎక్కువయ్యేసరికి, స్టోర్స్ వాళ్లు వేస్ట్ అని తీసేసారు కొన్ని చోట్ల.  కానీ  మళ్లీ అన్నిటిలో వచ్చేసాయి. సాఫ్ట్ వేర్ ఇంప్రూవ్ చేసారు. ఇంకా  ఏం చేస్తున్నారంటే ఒక నాలుగో, ఆరో ఇలాంటి టర్మినల్స్ పెట్టేసి, వీటికి సెంట్రల్ గా మళ్ళీ ఒక దగ్గిర అక్కడే ఒక చిన్న టర్మినల్ పెట్టి, అక్కడ పర్మనెంట్ గా ఒక మనిషిని deploy చేస్తున్నారు.. సో ఈ నాలుగో, ఆరో వాటిల్లో ఏ ఒక్కటి struck అయినా, ఆ పర్సన్ వెంటనే అక్కడే ఉంటారు కాబట్టి  ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తారు.కాస్ట్ కో లాంటి స్టోర్స్ లో సక్సెస్ ఫుల్ గా వాడుతున్నారంటే  సక్సెస్ అయినట్లే. ఎందుకంటే కాస్ట్ కో లో భారీ ఎత్తున purchase చేయటానికి వెళ్ళే  స్టోర్. 
కానీ నేను చాలా కొన్ని ఐటమ్స్ ఉంటే తప్ప self checkout వైపు వెళ్ళను. చిరాకు, అన్నీ మనమే చేసుకోవాలి, కార్ట్ లోంచి ఎత్తి పెట్టి, స్కాన్ చేసి, పక్కకు తీసి, బెల్ట్ మీదో, బ్యాగ్ లోనో పెట్టి, అట్లా ఓ ముప్పై ఉంటే వాటన్నిటికీ చేసి, మధ్యలో ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆ attend చేసే పర్సన్ రావాలి..ఎందుకొచ్చిన గోల  అని నేను రెగ్యులర్ రిజిస్టర్ దగ్గిరకే వెళ్తాను... అన్నీ వాళ్లే చేస్తారు.. మనం కార్ద్ స్లైడ్ చేయటమే.  కానీ కొన్నే ఉంటే  self checkout బెటర్ "
 
ఇలా అమెరికాలో ఉన్నవాళ్ళ experience తెలుసుకున్న తరవాత యూరోప్ లో ఏమి జరుగుతుందో చూద్దాం అని ఈసారి గూగుల్ ని ఆశ్రయించా . సేం స్టోరీ.  ఒకటి, రెండు decades క్రింద వాడకం మొదలుపెట్టినా పెద్దగా  సక్సెస్ రుచి చూడలేదు కానీ, మళ్ళీ ఇప్పుడిప్పుడే సక్సెస్ బాట పడుతుంది అని . ఆస్ట్రేలియా : Around 2008 లో వాడకం మొదలుపెట్టినా పెద్దగా సక్సెస్ చూడలేదు . అయితే, One of the major player అయిన   'Woolie s' ఈ self checkouts ని తగ్గిస్తుంటే , మరో  major player  'Coles '  వాడకాన్ని పెంచుతుంది . ఇహ ఆసియా - పసిఫిక్ , మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఈ వైపుకి అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి .

మొత్తం మీద ఒక decade క్రితమే ఈ 'Self Checkouts'  అనేవి ప్రపంచానికి తెలిసినా , ఒక 5/6 years నుంచి వాడకం పెరిగింది, భవిష్యత్తులో పెరిగే సూచనలు కనపడుతున్నాయి అని  'Retail Banking Research'  చేసిన సర్వేలు చెబుతున్నాయి.  కాబట్టి  సమీప భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఈ 'Self Checkouts'  ఎక్కువగా కనపడటం (అది కూడా దరిదాపు traditional checkouts obsolete అయ్యేంతగా) అనేది ఖచ్చితం అని ఊహించొచ్చు. ఇహ future grocery స్టోర్ లో కేవలం  ఈ 'Self Checkouts' వాడకం కాకుండా ఇంకేమి మార్పులు చోటు చేసుకోవచ్చు?!  ఒకవేళ అసలు, ఇప్పటికే Amazon అందిస్తున్న Amazon Fresh లాంటి  ఆన్లైన్ ఆర్డర్ , హోం డెలివరీ / పికప్ సర్వీసెస్ విపరీతంగా వృద్ధి చెంది భవిష్యత్తులో అది గ్రోసెసరి స్టోర్  natural death కి దారి తీసి రిటైల్ మార్కెట్ పూర్తిగా తన ముఖ చిత్రాన్నే మార్చుకోనుందా ? 

If anyone ask me the same question, my answer is a big NO. ఎందుకూ ? Shopping is not exactly the same thing as buying,  ఏ section of people అయినా ఏదో కొన్ని సందర్భాల్లో ఇటువంటి సర్వీసెస్ మీద ఆధారపడతారేమో కానీ, జీవితకాలం మొత్తం షాపింగ్ అనే సోషల్ ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వడం అనేది జరగని పని. మిగిలిన నాన్ ఫుడ్ ఐటమ్స్ తో పోల్చితే ఫెరిషబుల్ అయిన ఫుడ్ ఐటమ్స్ ని డెలివరీ చేయటం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.పైగా గతకొద్ది సంవత్సరాలుగా గమనిస్తే, Now a days people are more health conscious than olden days. ఇది భవిష్యత్తులో మరింతగా పెరుగుతుంది. దీనితో healthy లైఫ్ స్టైల్ కి అనుగుణంగా లభ్యమయ్యే wide range of choices నుంచి కావాల్సినవి ఎన్నుకోవటం , అలాగే ఫ్రెష్నెస్ ని చెక్ చేసి కొనగలిగే అవకాశం మార్కెట్స్ తో ఎక్కువగా ఉంటుంది . So,  గ్రోసెరీ స్టోర్ అనే కాన్సెప్ట్ మన జీవితాల్లో నుంచి మాయం కావటం అనేది జరగదు కానీ, సరికొత్త మార్పులని మాత్రం సంతరించుకుంటుంది. అవి ..

  •  షాపింగ్ ట్రాలీస్ పైన మౌంట్ చేసిన టచ్ devices తో లేదూ స్మార్ట్ ఫోన్ యాప్  తో మనకి కావాల్సిన ఐటెం స్టోర్ లో ఎక్కడుందో ఈజీ గా వెతుక్కోగలగటం. 
  •  షాపింగ్ చేయాల్సిన లిస్టు ఈ టచ్ డివైస్ లోకి డౌన్లోడ్ చేసుకోగలటం .  దీంతో మనకి కావాల్సిన ఐటమ్స్ స్టాక్ లో ఉన్నాయో లేవో, ఉంటె వాటి లొకేషన్ ఈజీ గా తెలుసుకోవటం. 
  • హెల్త్ ప్రొఫైల్ని , సూపర్ మార్కెట్ డాటా తో integrate చేయటంతో, కొనబోయే ఐటెం గురించి అవసరమైన మెడికల్ suggestion  (ఉదాహరణ కి అలెర్జీస్ లాంటివి ) లాంటివి popup చేయటం. అలాగే హెల్త్ ప్రొఫైల్ కి అనుగుణం గా మార్కెట్ లోకి వచ్చిన కొత్త ప్రొడుక్ట్స్ సజెస్ట్ చేయటం. 
  •  మన షాపింగ్ హిస్టరీ ని అనలైజ్ చేసి , ఎక్కువగా కొనే, లేదూ ఫేవరెట్  ఐటమ్స్ లిస్టు ని చూపించటం . 
  • మరి కొంచెం కొంచెం ముందుకి వెళితే ఇంట్లో అయిబొతూన్న ఐటమ్స్ , expiry అయిపోయిన ఐటమ్స్ లిస్టు ని చూపించటం . 
  • RFID based Checkouts  - అంటే మార్కెట్  ప్రతి వస్తువుపైన బార్  కోడ్ బదులుగా స్మార్ట్ లేబుల్స్ (RFID టాగ్స్ )  వాడతారు . షాపింగ్ అయిపోయి కార్ట్ తో బయటకి వచ్చేటప్పుడు  RFID రీడర్స్ తో డిజైన్ చేసిన ఎగ్జిట్ లోంచి బయటకి వస్తుంటే, ఆ షాపింగ్ కార్ట్ లోని ఐటమ్స్ ఆ రీడర్ రీడ్ చేసి , ఆ లిస్టు ని స్టోర్ వాళ్ళకి పంపుతుంది. బిల్లు మాత్రం మీ బ్యాంకు ఎకౌంటు కి పంపుతుంది లేదూ అక్కడే పే చేయొచ్చు . (వీటిని ఇప్పటికే ట్రయిల్ బేసిస్ లో వాడుతున్నారు). 
  • ఇక గ్రోసెరీ స్టోర్ వాల్స్ ఎంత మాత్రం మామూలు బోరింగ్ గా ఉండే plain వాల్స్ కానే కావు. సరికొత్త ఐటమ్స్ యాడ్స్ ,  రక రకాల ఆఫర్స్ తో మాయాజాలం చేసే డిజిటల్ తెరలు గా మారతాయి. 
  •  పైన చెప్పినవన్నీ  టెక్నాలజీ తో ముడిపడి ఉంటె అలా టెక్నాలజీతో  సంబంధం లేని అంశం ఇది. పెరుగుతున్నఆరోగ్యం పట్ల  జాగ్రత్త,  ఇంట్లో పెంచిన  అదేలెండి  పెరట్లో పెంచిన (హోం గ్రోన్) ,  ఇంట్లో వండిన (హోం cooked) ఫుడ్స్ మీద ఆసక్తి ఇంకా పెరిగి ఫుడ్ స్వాప్ చేసుకునే సెంటర్స్ గా కూడా  సూపర్ మార్కెట్స్ చిన్న పాత్ర పోషిస్తాయేమో . 
  •  
     ఇలా చెప్పుకుంటే పోతుంటే వస్తూనే ఉన్నాయి ఆలోచనలు ఫ్రీ కదా, ఖర్చు  ఏముంది :-) కానీ మీకు మరీ ఎక్కువసేపు బోర్ కొట్టిస్తే నా immediate ఫ్యూచర్ ఏంటో నా కళ్ళ ముందు కనపడుతుంది . అందుకే ఇక్కడ full stop పెడతాను నేను . మీరు మాత్రం  మొహమాటపడకుండా మీ కొచ్చిన ఐడియాలు ఇక్కడ  చెప్పండి . ఏమో  ఒక ఐడియా జీవితాన్నే మార్చొచ్చు  కదా ?!!!!!! హలో !! హలో !! చెప్పమన్నా కదా అని జీవితాన్ని నెగటివ్ దిశలోకి దూసుకు పోయే గ్రాఫ్స్  లాగా గీయటానికి కావాల్సిన coordinates కి పనికొచ్చే ఐడియాలు ఇవ్వటానికి రెడీ ఆవుతున్నారు, ఏంటండీ అన్యాయంగా?  ముందుకి...  ముందుకి..  దూసుకుపోదాం మనం అది గుర్తు పెట్టుకొండి.  ఇక నేనుంటాను మరి :-)
-శ్రావ్య

16 comments :

వంశీ పరుచూరి said...

భార్యామణులు ఏ వస్తువు కొరకు ఎంత సేపు సమయాన్ని వెచ్చిస్తున్నారొ భర్త గారికి మెయిల్ రావాలి . ఒక వేళ పట్టు చీరల వైపు వెళ్తుంటే సైరన్ మోగాలి .. నాకింకా చాలా ఆలోచనలు వస్తున్నాయి అక్కడ చెప్తా :)

Anonymous said...

కార్ట్ లోంచి ఎత్తి పెట్టి, స్కాన్ చేసి, పక్కకు తీసి, బెల్ట్ మీదో, బ్యాగ్ లోనో పెట్టి, అట్లా ఓ ముప్పై ఉంటే వాటన్నిటికీ చేసి,

This used to be case 6-7yrs back. Now you don't need to do all these. Scan items from trolly itself, slide card and you are all set.

Ennela said...

చాలా రోజులయ్యింది శ్రావ్యా మీ వ్రాతలు చదివి.

Anonymous said...

Hilarious.A brilliant write up.

Sravya V said...

@ వంశీ : మామూలుగా లేవు బాబు నీ ఐడియాలు . దీనికి కౌంటర్ ఐడియాస్ ఆలోచించేవాళ్ళు ఉంటారు మర్చిపోకు :-)) Thank You !

@ అనానిమస్ గారు : మీరు చెప్పేది RFID చెకౌట్ గురించా ? పైన వివరాలు ఇచ్చానండి మిస్సయ్యరా ?:-) మామూలు బార్ కోడ్ రీడ్ చేయటానికి ఇప్పటికైనా ఒక్కొక్క ఐటెం మాత్రమే స్కాన్ చేయగలం కదండీ .

@ ఎన్నెల గారు : అవునండి కొంచెం గ్యాప్ :-) Thank you and very happy to see you here !

@ అనానిమస్ గారు : Thank you :-)

వేణూశ్రీకాంత్ said...

పోస్ట్ ప్రారంభంలో రాసిన పుష్పవిలాపం పారడీ సూపర్ గా ఉందండీ :-)) అలాగే పోస్ట్ లో రాసిన ఐడియాలు కూడా బాగున్నాయ్ :-)

Anonymous said...

I am saying, in US "కార్ట్ లోంచి ఎత్తి పెట్టి, స్కాన్ చేసి, పక్కకు తీసి, బెల్ట్ మీదో, బ్యాగ్ లోనో పెట్టి, " this is no longer the case (except at small groceries stores). You dont need to remove from the cart, then scan and then keep it in a belt or bag. You can simply scan from the cart itself (individually of course), pay by card/cash that's it.

Sravya V said...

@ అనానిమస్ గారు : Many Thanks for the clarification, and now I got what you meant :-) Thanks again !

@వేణు గారు : Thank you so much :-)

జ్యోతిర్మయి said...

పేరడీ సూపర్ శ్రావ్య గారు.

కొత్తావకాయ said...

"షాపింగ్ ట్రాలీస్ పైన మౌంట్ చేసిన టచ్ devices తో లేదూ స్మార్ట్ ఫోన్ యాప్ తో మనకి కావాల్సిన ఐటెం స్టోర్ లో ఎక్కడుందో ఈజీ గా వెతుక్కోగలగటం"

ఈ యాప్ రాగానే నా చెవిన వెయ్యండి శ్రావ్యా. :) ఎంత టైం ఆదా అవుతుందో!! ఎప్పుడూ వెళ్ళే స్టోర్ లో అయితే ఏవెక్కడున్నాయో తెలుస్తాయ్ కానీ కొత్త ఐటెం ఏదైనా మార్కెట్ లోకి రాగానే మన యాప్ ఓ అలర్ట్ ఇస్తే, నచ్చితే వెళ్ళి ఇట్టే తెచ్చేసుకోగలిగితే బావుంటుంది. అలర్ట్ లు కస్టమైజ్ చేసుకోనే ఆప్షన్ ఉండాలి లెండి డిఫాల్ట్ గా. :)

మీ ఐడియాస్ మాత్రం బెమ్మాండం. అంతే! :)

Anonymous said...

చాల బాగుందండి శ్రవ్య గారు ..... కరుణ శ్రీ

Sravya V said...

@ జ్యోతిర్మయి గారు : థాంక్ యు :-)

@ కొత్తావకాయ గారు : యా యా చెప్తానండి ముందు మీకే :-) అలర్ట్ లు కస్టమైజ్ చేసుకోనే ఆప్షన్ ఉండాలి >>> noted it అండి :-)) Thank you !

@ కరుణ శ్రీ : Finally this post made you to comment here :-))) అంటే ఇప్పుడు కరుణ శ్రీ అని పేరు పెట్టేసుకుని కామెంట్ పెడితే, ఆ నా పారడీ చూసి కరుణ శ్రీ గారు మురిసి పోయి వచ్చి కామెంట్ రాసారని అనుకోవాలనా ? అబ్బే లాభం లేదు, రాసిన 4 పదాలలో రెండు తప్పులు :P
Thank you !

సంతు (santu) said...

ఇంకో 10 సంవత్సారాల తరువాత ఇండియా లో ఉన్న ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి Self Checkouts పరిస్థితి ఏంటి అని అడగుతారా మరి...
సో అప్పుడు మరొక post పెడతార మీ స్టైల్ లో... :p

మీరు చెప్పిన సరికొత్త మార్పులకి patent తీసేసుకోండి శ్రావ్య గారు చాల బాగా ఉన్నాయి ideas.... =D

Sravya V said...

@ సంతోష్ ,
పదేళ్ళ తరవాత , ఫోన్ చేస్తానా ? :-)) నో , నా ప్రొజెక్షన్ ని పంపి ఎలా ఉందొ తెలుసుకుంటాను.
పోస్ట్ నా స్టైల్లో రాస్తానా ?:-)) లేదూ 'Thought Transfer ' ని వాడి నేను ఏమి ఆలోచిస్తున్నానో ఇలా మీలాంటి వాళ్ళకి visualize చేస్తాను :-))

On the serious note ,

నేను ఈ పోస్ట్ రాసేటప్పుడు అనుకున్నాను, ఇండియా లో ఎలా ఉంటుందా అని . కానీ prediction కష్టం నా లాంటి ఏదో అలా అలా పైన పైన రాసేవాళ్ళకి . ఇండియా లో ఏదైనా ఇండస్ట్రీ ఫ్యూచర్ ఊహించటం కష్టం . అలాగే longevity of success ని హోల్డ్ చేయటం కంపెనీలకి చాలా చాలా కష్టం (ఇంత పెద్ద దేశం లో అలాంటి కంపెనీలని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు) . ఇలాంటి మేజర్ చేంజెస్ రావాలంటే అలాంటి కంపెనీలు అవసరం . ప్రపంచం లో ఎక్కడా లేనన్నన్ని pressure groups ఉండి ఏది ముందుకు పోకుండా వెనక్కి లాగటం కి భలే సహాయపడతాయి :-)))

సరే ఇదో పెద్ద విషయం కానీ, మొన్న జనవరి లో బిగ్ బజార్ లో షాపింగ్ experience రాస్తాను , ఇక్కడ కాదులే ప్లస్ లో రాసి టాగ్ చేస్తా . అది కొంచెం దీనికి రిలేటెడ్ :-)))

Vijetha Supermarket said...

చాల బాగుందండి శ్రవ్య గారు.. బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు.థాంక్స్

Sravya V said...

@Vijetha Supermarket,

Wow, That's pretty interesting అండి.. సేం బిజినెస్ లైన్ లో ఉండేవాళ్ళే వచ్చి చదివి బావుంది అని appreciate చేయటం. I am very glad and wishing you lots of good luck in your grocery business.

Thank you very much for stopping by :-)

Post a Comment