It ....
Killed 17 million people.
Traumatized a generation.
Redrew the world map.
Overturned old empires.
Changed the world's political picture.
Yet its origins often remain obscure.
That's nothing but a war.. the First World War - A classic example of 20th century's man made disaster.
***
Background :
28th June 1914 - 11th November 1918. నాలుగు సంవత్సరాల పాటు, దరిదాపు ప్రపంచం లోని అన్ని దేశాలు పాల్గొన్న ఈ 'A War to end all Wars' అని పిలవబడే 'Great War' మొదలవ్వటానికి 28 జూన్ 1914 న, సెర్బియా నేషనలిస్ట్ 'గవరిలో ప్రిన్సిప్' (Gavrilo Princip) , ఆస్ట్రియా-హంగెరీ ఆర్చ్ డ్యూక్ 'ఫ్రాంజ్ ఫెర్డినాండ్' (Franz Ferdinand) అతని భార్య 'సోఫీ' లని కాల్చి చంపటం గా చరిత్ర మన కళ్ళ ముందు సాక్ష్యాధారాలతో సహా చూపెడుతున్న అతి సులువైన సమాధానం. కానీ ఈ సంఘటన కేవలం tipping point మాత్రమే. నిజానికి డ్యూక్ దంపతుల హత్యలకు వియన్నాలో వచ్చిన స్పందన కూడా సామాన్యమైనదే. కానీ అప్పటికే ఉన్న imperialist designs, అలాగే రాజ్య విస్తీరణ కాంక్షతో group of alliances గా రూపుదిద్దుకున్న యురోపియన్ మేజర్ పవర్స్ అసలు కారణంగా most of the scholars అంగీకరించిన నిజం.
ఎనీవే, అప్పటికే Balkan Wars లో కోల్పోయిన తమ భూభాగాన్ని తిరిగి సాధించటానికి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆస్ట్రియా-హంగెరీ కింగ్డమ్, సీక్రెట్ గా చేసుకున్న treaty తో జర్మనీ సపోర్ట్ ని assure చేసుకుని, డ్యూక్ దంపతుల హత్యకు కారణం అయిన వారిని తనకప్పగించాల్సిందిగా సెర్బియా కు అల్టిమేటం పంపింది. దానికి సెర్బియా అంగీకరించకపోవటంతో Emperor Franz
Josef కు ఎదురుచూసున్న అవకాశం రానే వచ్చింది. దానితో సెర్బియా ని ఎటాక్ చేయటంతో 1914 జూలై చివరి వారంలో యుద్ధం మొదలైంది. అయితే సెర్బియా కు , రష్యా కు మధ్యన treaty ఉండటంతో రష్యన్స్ సెర్బియా కి సహాయంగా వచ్చారు. దీనితో జర్మనీ రష్యా పైన యుద్ధం ప్రకటించింది. అయితే అగైన్ రష్యా కు , ఫ్రెంచ్ తో treaty ఉండటం పైగా అప్పటికే Alsace Lorraine issues తో జర్మనీ - ఫ్రెంచ్ మధ్య నున్న strained రిలేషన్స్ ఉండటం తో , బెల్జియం మీదుగా మార్చ్ చేస్తూ జర్మనీ , ఫ్రెంచ్ ని ఎటాక్ చేసింది.ఈ ఎటాక్ మరన్ని చైన్ అఫ్ రియాక్షన్స్ కి కారణం అయ్యింది. బ్రిటిష్ కు , బెల్జియం & ఫ్రాన్స్ రెండిటితోనూ treaties ఉండటంతో బ్రిటిష్ colonies యుద్ధం రంగంలోకి దిగాయి. ఇహ చివరిగా బ్రిటిష్ తో treaty ఉన్న జపాన్, ఆ తరవాత 1917 లో అమెరికా కూడా తమ స్లీవ్స్ మడవటంతో glorified land dispute కాస్తా దరిదాపు ప్రపంచపటంలో ఉన్న అన్నీ దేశాలు పాల్గొన్న 'The Great War' గా మారిన వైనం చరిత్ర చూపిస్తున్న సత్యం.
CNN లిస్టు చేసిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ :
- June 28, 1914 - Gavrilo Princip assassinates Franz Ferdinand.
- July 28, 1914 - Austria-Hungary declares war on Serbia.
- August 2, 1914 - Ottoman Empire (Turkey) and Germany sign a secret treaty of alliance.
- August 3, 1914 - Germany declares war on France.
- August 4, 1914 - Germany invades Belgium, leading Britain to declare war on Germany.
- August 10, 1914 - Austria-Hungary invades Russia.
కెనిడియన్ solider & poet అయిన John McCrae రాసిన ఈ క్రింద poem poppies ని symbol గా తీసుకోవటానికి కారణంగా చెప్తారు. అంతే కాక ఫ్రాన్స్, బెల్జియంలలోని యుద్దభూముల్లో పెరగటం కూడా వీటిని సింబాలిక్ గా గుర్తించటానికి ఒక కారణం. 1921 లో మెదటిసారిగా బ్రిటిష్ వారి lapels పైన కనపడటమూ, అదే సంవత్సరం సైన్యానికి, వారి ఫ్యామిలీస్ హెల్ప్ చేయటానికి అవసరమైన ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం లో భాగం గా అమ్మటం మొదలైంది.
In Flanders fields the poppies blow
Between the crosses, row on row,
That mark our place; and in the sky
The larks, still bravely singing, fly
Scarce heard amid the guns below.
We are the Dead. Short days ago
We lived, felt dawn, saw sunset glow,
Loved and were loved, and now we lie
In Flanders fields. (Source)
Conclusion : 'గతకాలం మేలు వచ్చుకాలం కంటెను' అని జనాంతికం గా చెప్తూ ఉంటారు కానీ, ఒకసారి వెనుదిరిగి చరిత్ర పరిశీలిస్తే అది అంతగా నిజం అనిపించదు. గతంలో కంటే జీవనప్రమాణాల దృష్ట్యానే కాకుండా చీటికి మాటికి యుద్ధాలు లేని ప్రశాంతమైన జీవనం గడుపుతున్నాం అని చెప్పక తప్పదు.
రక్తం తో తడిచిన గత కాలపు చరిత్ర నుంచి నేర్చుకున్న పాఠాలతో రాబోయే రోజులలో మానవాళి మరింత ప్రశాంతంగా బ్రతికే రోజులు వస్తాయని ఆశిస్తూ ...
-శ్రావ్య
Pictures Source : Google images
Content Source : Quora , The Week , BBC History , Wikipedia
రక్తం తో తడిచిన గత కాలపు చరిత్ర నుంచి నేర్చుకున్న పాఠాలతో రాబోయే రోజులలో మానవాళి మరింత ప్రశాంతంగా బ్రతికే రోజులు వస్తాయని ఆశిస్తూ ...
-శ్రావ్య
Pictures Source : Google images
Content Source : Quora , The Week , BBC History , Wikipedia