"మన రాజధానిని ఎవరు లాక్కోకుండా చూడాలని కోరుకుంటున్నా" ఇది ఒక చిన్నారి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తో పంచుకున్న ఆవేదన. నిజానికి ఈ ఆవేదన కొన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సు లోంచి వచ్చిన బాధ .
భవిష్యత్తు తరాలని ఇటువంటి ఆవేదనలు, అనుమానాల నుంచి దూరం చేయాలన్న సంకల్పం, తమ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా అభివృద్ది చేసుకోవాలన్న రాజధాని ప్ర్రాంత ప్రజల తపనలతో, భవిష్యత్ లో ఎంత ఉపయోగకరమో అన్న దానిపై ఏ గ్యారంటీ లేకపోయినా స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ ఎకరాలెకరాల భూమిని ప్రభుత్వం చేతుల్లో పెట్టిన రాజధాని ప్రాంత రైతుల త్యాగం విలువకట్టలేనిది. అమరావతికి తిరిగి ఊపిరిలూదబొతున్న రాజులు వీరే . వీళ్ళకి ఎన్ని చేసినా ఏమిచ్చినా రాబోయే తరాలు వీళ్ళ రుణం తీర్చుకోలేవు.
*** *** ***
ధరణికోట : మొదటి నాగరికత కు నెలవైన నేల. అఖండ భారతవాహినిలో అతి పెద్ద సామ్రాజ్యానికి అధిపతులు అయిన ఆంధ్ర శాతవాహనులు రాజధాని. వేల సంవత్సరాల క్రితమే కృష్ణా నది తీరంలో దాదాపు 12కి,మీ పోడవు తో పడమటి దిక్కున మెరిసిన కోట. తిరిగి 19 వ శతాబ్దంలో తీవ్ర కరువుకాటకాలతో సతమతవుతున్న ప్రజలని అక్కున చేర్చుకుని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి హయాంలో 'అమరావతి' గా మరోసారి వెలుగులు విరజిమ్మిన నేల ఇది.
మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమదీ అనుకునే రాజధాని నిర్మించుకోబోతున్న తరుణం లో ఈ సరికొత్త నగరానికి 'అమరావతి' అని పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం.
సింగపూర్ మాస్టర్ మాస్టర్ ప్లాన్ - ఆంధ్ర కాపిటల్ - లాండ్ పూలింగ్ అంటూ ఫన్ చేయటం favourite pastime గా మారిన జనాల చేసే తమాషాలని వమ్ము చేస్తూ ప్రణాళిక ప్రకారం పని చేసుకుంటూ పోతున్న ప్రభుత్వం మరింత కర్తవ్యదీక్షతో ముందుకు సాగాలని, ఈ అమరావతి పునర్వైభవంతో నలు దిక్కులా విస్తరించి, ఆధునిక నాగరికతకు - గత సంస్కృతికి మధ్య వారధిగా నిలిచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల కీర్తి ప్రతిష్టలను, ప్రపంచానికి చాటి చెప్తూ భవిష్యత్తు తరాలకి భద్రతనందించే మహానగరంగా ఎదగాలని కోరుకుంటున్నాను.
I am proud to say I love Andhra Pradesh.
I am proud to say I love Andhra Pradesh.
-శ్రావ్య