Subscribe:

Sunday, July 26, 2009

నాకు లక్కుందా?

ఈ పోస్టు నా లక్కు గురించండి ! ఈ వాక్యం వ్రాసా కాదా అని మనకేదో కేజిల కేజీల లక్కు ఉంది మీరు అనుకుంటే మీరు అసలే రేట్ పెరిగిందని జనాలు మొత్తుకుంటున్నారే ఆ కందిపప్పు ఉడకపెట్టిచేసే ముద్దపప్పు లో కాలు పేసినట్టే. నాకు లక్కు కు ఎంత దూరమంటే నాకు నేను లక్కుతో మనకు సంభంధం ఏమిటి తొక్కలో లక్కు చేతగాని వాళ్లకి కాని మనలాంటి experts కి అవసరం లేదు అని ఓదార్చుకొనే అంత :).
సరే అసలు విషయం వదిలి ఏదో చెబుతున్నా విషయం ఏమిటంటే ఒక రెండు నెలల క్రితం నా EZ link కార్డు (అంటే సింగపూర్ లో పబ్లిక్ transport కి వాడే prepaid టికెట్) , ఎక్సేంజ్ చేస్తుంటే ఒక లక్కీ కూపన్ ఇచ్చారు అది పూర్తి చేసి డ్రాప్ చేసాను. ఒక నెల తరవాత ఒక లెటర్ వచ్చింది మీ NRIC No డ్రా లో వచ్చింది ౩౦$ గిఫ్ట్ వోచరు గెలుచుకున్నారు అని. అడ్రస్ అనుమానం గా ఒకసారి చెక్ చెసుకున్నా నాదే. రెండు వారాలు గడిచాయి ఒక శనివారం ఏమి చేయాలా అని ఆలోచిస్తుంటే ఈ వోచరు సంగతి గుర్తు వచ్చింది.
సరే ఈ పని ఫినిష్ చేద్దామని బయల్దేరా తిన్న గా వెళ్లి వోచర్ తీసుకున్నా, ఇక ఆలాగే తిరిగి ఇంటికి వస్తే నేనేందుకవుతాను. మళ్లీ తిరిగి ట్రైన్ లో ఇంటికి వెళ్ళటానికి బోర్, సరే బస్సు స్టాప్ కి వెళ్లి నుంచుంటే 136 నెంబర్ బస్సు (తరవాత గుర్తుకు వచ్చిన విషయం రోజు నేను చూసేది 139 అని )కనపడింది ఇదేదో మన ఏరియా లో రోజు కనపడే నెంబర్ అనిపించి ఎక్కి కూర్చున్న, ఇక ఆ బస్సు లో కూర్చున్న 1 గంట తరవాత నాకర్దమైన విషయం నేను వెళ్ళవలసింది గ్రీన్ లైన్ బస్సు తిరిగేది రెడ్ లైన్ సరే నాకు నచ్చిన ఒక బస్సు స్టాప్ చూసుకొని దిగేసాను, బస్సు స్టాప్ వెనకాల ఒక షాపింగ్ మాల్ కనిపించిది సరే ఏమైనా తాగుదాం అని వెళ్లి ఒక వాటర్ బాటిల్ తీసుకొని, 20 $ పెట్టి ఒక టాప్ కొన్నా. తిరిగి బస్సు స్టాప్ కి వచ్చి బస్సు కోసం వెయిట్ చేయాలంటే బద్ధకం వేసి కాబ్ లో ఇంటికి వచ్చా 17 $ ఖతమ్. ౩౦ $ కోసం నేను ఖర్చుచేసింది 40 $. ఇంకొక కొసమెరుపు ఏమిటంటే ఆ టాప్ ట్రై చేసిన తరవాత నాకు తెలిసిన నిజం 20 $ బుట్ట దాఖలా అని :(
ఇప్పుడు నేనమనుకోవాలి నాకు లక్కు ఉందా లేదా ?

Friday, July 24, 2009

స్నేహమంటే ....

నిజం గా స్నేహం అంత గొప్పదా ? అసలు స్నేహం అంటే ఏమిటి అని నేను నా చిన్నప్పటి నుంచి అర్థం చేసుకోవటానికి ప్రయతిస్తున్నా కాని అది ఒక అర్థం గాని సమీకరణం గానే మిగిలింది. ఎవరినన్నా అడుగుదామంటే అది కూడా తెలియదా అని ఎగతాళి చేస్తారేమో అని భయం పోనీ బాగా తెలిసిన వారిని అడుగుదామా మేము నీ స్నేహితులం కాదా అని బాధ పడతారేమో అని అనుమానం . మరి నా సమస్య తీరేదెలా అందుకే ఇక్కడ వ్రాస్తే నా అనుమానం తీరుస్తారేమో అని ఆశ.
నాకు తెలిసి నేను చదివిన పుస్తకాలు, చూసిన సినిమా ఆధారం గా నేను అర్థం చేస్తుకొన్నది స్నేహం అంటే ఒకరి కి ఒకరు తోడూ గా ఉండటం, సహాయం అవసరం ఐతే నేనున్నాని స్పందించటం.
కాని నాకు నా స్వానుభవం లో అర్ధమయింది మాత్రం తెలివి కలవాడు (ఇక్కడ తెలివి కలవాడు అంటే బ్రతకనేర్చిన తెలివి) ఎప్పుడు తన అవసరం తీరేవరకు లేదా అవతలివాడు తనకు ఉపయోగం ఉన్నంతవరకు మాత్రమే ఈ స్నేహమనే నాటకం ఆడతాడు ఆ అవసరం తీరిన తరువాత తన విశ్వరూపం చూపిస్తాడు / చూపిస్తుంది . ఈ రకం మనుషులు ని గుర్తించడానికి ఏమైనా టెక్నిక్స్ ఉంటే కొద్దిగా చెప్పి పుణ్యం కట్టుకోండి దయచేసి .ఇక నా స్వానుభావానికి వస్తే ఇండియా లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటివి ఎదురు కాలేదు కాని ఈ సింగపూరు మాత్రం నాకు ఈ విషయం గట్టి పాఠాలు నేర్పింది. ఇక్కడ నా అనుభవాలను పంచుకోవటం లో ఎవరిని కించపరిచే ఉద్దేశ్యం లేదు , ఎవరికయినా నాలాంటి పరిస్థితులు ఎదురయితే జాగ్రత పడతారనే అని తప్ప !

Saturday, July 11, 2009

My First Post

Hi Friends........

నేను ఈ బ్లాగు క్రియెట్ చేసి 6 నెలలు అయినా ఇంత వరకు ఒక్క టపా కూడ వ్రాయలేదంటే నా బద్దకం గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు కదా?(ఈ టపా కి సంబంధం లేకుండా ఒక చిత్రం పెట్టటానికి కూడ అదే కారణం అని తెలిసి పోయిందా కొంపతీసి :()
సరే ఎదో గుగూల్ పుణ్యమా అని నేను ఒక బ్ల్గాగు మెదలు పెట్టా కాని వ్రాయాలంటే బుర్రలో గుజ్జుండాలి కదా అది మనకు నిల్. ఇంత వరకు చేతికి దొరికిన కాగితం వదలకుండా చదివి అది బాగలేదు ఇది బాగలేదు అని వంక పెట్టే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది వ్రాయటం ఎంత కష్టమో ! సరే నా కష్టం గురించి సోది మీకెందులేండి గాని మరీ చదువరి, తెలుగోడు, జీడిపప్పు గారి అంత స్థాయి లో కాకపోయిన కొంచం నా వ్రాత కళానైపుణ్యం పెంపొందించుకొందామని ఈ నా ప్రయత్నం.