నిజం గా స్నేహం అంత గొప్పదా ? అసలు స్నేహం అంటే ఏమిటి అని నేను నా చిన్నప్పటి నుంచి అర్థం చేసుకోవటానికి ప్రయతిస్తున్నా కాని అది ఒక అర్థం గాని సమీకరణం గానే మిగిలింది. ఎవరినన్నా అడుగుదామంటే అది కూడా తెలియదా అని ఎగతాళి చేస్తారేమో అని భయం పోనీ బాగా తెలిసిన వారిని అడుగుదామా మేము నీ స్నేహితులం కాదా అని బాధ పడతారేమో అని అనుమానం . మరి నా సమస్య తీరేదెలా అందుకే ఇక్కడ వ్రాస్తే నా అనుమానం తీరుస్తారేమో అని ఆశ.
నాకు తెలిసి నేను చదివిన పుస్తకాలు, చూసిన సినిమా ఆధారం గా నేను అర్థం చేస్తుకొన్నది స్నేహం అంటే ఒకరి కి ఒకరు తోడూ గా ఉండటం, సహాయం అవసరం ఐతే నేనున్నాని స్పందించటం.
కాని నాకు నా స్వానుభవం లో అర్ధమయింది మాత్రం తెలివి కలవాడు (ఇక్కడ తెలివి కలవాడు అంటే బ్రతకనేర్చిన తెలివి) ఎప్పుడు తన అవసరం తీరేవరకు లేదా అవతలివాడు తనకు ఉపయోగం ఉన్నంతవరకు మాత్రమే ఈ స్నేహమనే నాటకం ఆడతాడు ఆ అవసరం తీరిన తరువాత తన విశ్వరూపం చూపిస్తాడు / చూపిస్తుంది . ఈ రకం మనుషులు ని గుర్తించడానికి ఏమైనా టెక్నిక్స్ ఉంటే కొద్దిగా చెప్పి పుణ్యం కట్టుకోండి దయచేసి .ఇక నా స్వానుభావానికి వస్తే ఇండియా లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటివి ఎదురు కాలేదు కాని ఈ సింగపూరు మాత్రం నాకు ఈ విషయం గట్టి పాఠాలు నేర్పింది. ఇక్కడ నా అనుభవాలను పంచుకోవటం లో ఎవరిని కించపరిచే ఉద్దేశ్యం లేదు , ఎవరికయినా నాలాంటి పరిస్థితులు ఎదురయితే జాగ్రత పడతారనే అని తప్ప !
12 comments :
ఈరోజు పొద్దున్నే దేనికో భా.రా.రె తో మాటల్లో ఇలా మాట్లాడుకున్నాం -
మంచి మితృల స్నేహం సాయంత్రపు ఎండ నీడ లాంటిది. కారణం ఆ నీడ పెరుగుతుంది.
ఇద్దురు మూర్ఖుల స్నేహం పొద్దున ఎండ నీడ లాంటిది అది తరుగుతుంది అని
సరే!! ఎక్కడో ఇలా చదివినట్టు గుర్తు -
ప్రతీ మనిషికి
ఆనందంలో ఉత్సుకతని రేపేవాడు
కష్టంలో పలుపంచుకునేవాడు
నష్టంలో అండగా నిలిచేవాడూ
ఓ మితృడు ఉండాలి
ఆ మితృడు ముందు తన్లో ఉండాలి అని.
భాస్కర్ గారు మీ కామెంట్ నాకు భలే నచ్చేసిందండి.
మంచి మితృల స్నేహం సాయంత్రపు ఎండ నీడ లాంటిది. కారణం ఆ నీడ పెరుగుతుంది.ఇద్దురు మూర్ఖుల స్నేహం పొద్దున ఎండ నీడ లాంటిది అది తరుగుతుంది అని >>
ఇది నాకు చిన్నపుడు పద్యరూపం లో చదివిన గుర్తు ! ఇక్కడ నేనడిగేది నిజజీవితం లో అంత నిజాయితీ గల స్నిహితులు దొరకటం సాధ్యమేనా అని?
ఆ మితృడు ముందు తన్లో ఉండాలి అని.>>మీ ఈ వాక్యం నన్ను రాత్రంతా ఆలోచింపజేసింది నేనలా ఉన్నానా అని కాని నా వరకు నేను మాత్రం ఎదుటి వాళ్ళ బలహీనతను వాడుకునే రకం కాదు అని మాత్రం గాట్టి గా చెప్పగలను.
కాక పొతే ఇండియా లో ఉన్నంత కాలం నాకు క్లోజ్డ్ సర్కిల్ మాత్రామే ఉండేది. ఇప్పటికి నాకు ఇండియా లో నేను నా ఫ్రెండ్స్ అని చెప్పే వాళ్ళు వేళ్ళ మీద లెక్కపెట్టే అంత మంది మాత్రామే కాని చాల క్లోజ్ . ఆ అనుభవం తోనే ఇక్కడ దెబ్బతిన్నాను .
శ్రావ్య!! ఆ మితృడు తనలో ఉండాలీ అంటే - సెల్ఫ్ మోటివేషన్ లాగా అన్నమాట. తనని తాను ఓదార్చుకుని, తనని తాను ఎప్పుడూ కరెక్ట్ చేస్కుంటు, తనని తాను ఎప్పుడూ ఆడిట్ చేకుంటూ ఉండాలి అని...
అవును!! ఈరోజు రేపట్లో గాలికి కొట్టుకువెళ్ళిన జీవితాల్లో, మితృలు దొరకటమే కష్టమైన ఈ జీవితాల్లో, *ఈ క్యాలిటీస్ ఉన్నాయా* అని వెతకటం సమయాన్ని వృధా చేస్కోటమేనేమో.
నీకు ఆ మాత్రం అయినా ఉన్నారు శ్రావ్యా, నాకు ఎవ్వరూ లేరు ఈరోజున, నిజంగా.
మొదలఁ జూచినఁగడు గొప్ప పిదపఁ గుఱుచ,
యాదిఁగొంచెము తర్వాత నధిక మగుచుఁ,
దనరు, దినపూర్వపరభాగ జనితమైన
చాయపోలికఁ గుజనసజ్జనుల మైత్రి.
తా:- దుర్మార్గునితో స్నేహం ప్రాతఃకాలపు నీడవలె తొలుత విస్తారంగా ఉండి ఆ తర్వాత క్రమ క్రమం గా క్షీణించి పోతుంది. సజ్జనుల మైత్రి సాయంకాలపు నీడవలె మొదట చిన్నదిగా ఉండి క్రమక్రమం గా వృద్ధి పొందుతూ ఉంటుంది. ఈ రెండింటిలో ఏది యుక్తమో బుద్ధిమంతుడు గ్రహించాలి.
ఖలులతోడి పొందు కలుషంబుఁ గలిగించు
మాన దెంత మేటి వానికైన
వాని చేదఁదీయ వలవదు చెడుదువు
విశ్వదాభిరామ వినుర వేమ!
కాలనేమి గారు మొదలఁ జూచినఁగడు >> ఈ పద్యం గురించి నేను గుర్తు చేసుకున్నాను భావం గుర్తుంది కాని పద్యం మర్చిపోయాను . ఇక్కడ పోస్టు చేసినందుకు ధన్యవాదాలు , భావం కూడా చాల బాగా చెప్పారు !
ఈ మధ్య బ్లాగడం తగ్గించారా ?:)
భాస్కర్ గారు ఎంత మాట అన్నారండి ! మేమందరం లేమా ?
శ్రావ్యా!! ఆ మాట అన్నావు!! సంతోషం.
ధన్యవాద్
nivu face chesina problems gurinch kluptamga vivarinchu
दिये जलते हैं, फूल खिलते हैं
बड़ी मुश्किल से मगर, दुनिया में लोग मिलते हैं
दौलत और जवानी, एक दिन खो जाती है,
सच कहता हूँ, सारी दुनिया
दुश्मन बन जाती है
उम्र भर दोस्त लेकिन, साथ चलते हैं
ఏముంది నువ్వు పీకలలోతు సమస్యల్లో కూరకపోయినట్టు సందర్బం ఒకటి సృష్టించు ..నువ్వే నాకు దిక్కు అని మొహం మీదే అనేసేయండి...,ఇప్పుడు నీ స్నేహితుడెవరో నీకే సమాధానం దొరుకుతుంది ..! :-)
@కిరణ్ తేజ అంతే అంటారా ;)
బహుశా మీకు అంతా మోసగాలే తారస పడినట్టు ఉన్నారు,
స్నేహితులు అంటే కేవలం మన తెలివి ని చూసి మన దరి చేరేవాళ్ళు కాదు, మనకంటూ ఒక నీడ తోడుగా ఉండేవాళ్ళు
కొన్ని విషయాలను ఇంటా బయట చెప్పుకోలెం, మరి కొన్ని విషయాలను అడగలేం....
ఇలాంటి అన్ని situations లో మనకు స్నేహితులే గతి....
@Sravya Garu Super andi
Post a Comment