Subscribe:

Friday, October 15, 2010

మేరా భారత్‌ మహాన్‌

వహ్వా వహ్వా నాకు నిజం గా ఇవాళ భలే ఆనందం గా ఉంది . కారణం రకరకాల వార్తలు, అనుమానాల తో మొదలైన CWG 2010 ఇంత చక్క గా ముగియటం ఒక కారణమైతే , పతకాల పట్టికలో మన దేశం రెండో స్థానంలో నిలవటం ఇంకో కారణం . అంతేనా ఆద్యంతం మన సంస్క్రతి ని ప్రతిబింబించే కార్యక్రమాలు నిజం గా చాల బాగున్నాయి . ముఖ్యం గా ముగింపు కార్యక్రమంలో బాగం గా స్కూల్ పిల్లలు మన జాతీయ పతాకం రంగులద్దుకొని చేసిన ప్రోగ్రాం నాకు చాల నచ్చింది . నచ్చనివి లేవా అంటే ఉన్నాయి, ఈ కల్మాడీ గారికి కి ఆర్గనైజింగ్ సెక్రటరీ గా వోట్ థాంక్స్ చెప్పాలని తెలుసు కాదా, ఆ రాసినదేవరో చక్కగా రాసారు ఎవరిని మర్చిపోకుండా ఈయన కొద్దిగా ముందే ఒకటి సార్లు ప్రిప్రేర్ అయ్యి కొద్ది గా అందం గా చదవచ్చు కదా అబ్బే , ఈయన ముందేమి స్కాములు చేసాడో వాటికి ఆధారాలు ఉన్నాయో లేవో నాకు తెలవదు కాని వీలయితే ఈ చదివిన తీరుకి పనిష్మెంట్ ఉండాలి.
ఈ CWG 2010 మొదటి నుంచి చివర దాక చూసిన తరవాత నాకో అనుమానం వచ్చింది నాతో పాటు గా మనలో చాల మంది కి సెగ తగిలితే కాని పని చేయని లక్షణం ఉన్నట్లుంది అంటే డెడ్ లైన్ కి దగ్గర గా వస్తే కాని పని చేయాలన్న మూడ్ రాదనుకుంటా :) ,
ఈ ఆటలలో విజేతలైన , పాలుపంచుకున్న క్రీడాకారులందరికీ నా అభినందనలు , మన హైదరాబాదీలైన సైనా , గగన్ నారంగ్ లకి కొంచెం ప్రత్యేక అభినందనలు ! అలాగే ఈ కార్యకమాలన్ని ఇంత విజవంతం చేసి అంతర్జాతీయ ప్రపంచానికి మన క్రీడా నిర్వాహణ సామర్దాన్ని చాటటానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు !
నేను ఈ పోస్టు రాసే సమయానికి మన ఇండియన్ ఐడొల్ శ్రీరామచంద్ర పాడుతున్నాడు :)

11 comments :

3g said...

>>నాకో అనుమానం వచ్చింది నాతో పాటు గా మనలో చాల మంది కి సెగ తగిలితే కాని పని చేయని లక్షణం ఉన్నట్లుంది అంటే డెడ్ లైన్ కి దగ్గర గా వస్తే కాని పని చేయాలన్న మూడ్ రాదనుకుంటా....

హి..హి..హి.... నేను కూడా సేం బేచ్.ఏమైనా ముందనుకున్నట్టుగా పరువు పోకుండా కాపాడారు సంతోషం. కాని డబ్బులే విపరీతంగా ఖర్చు చేసినట్టున్నారు.

Rishi said...

అవును,ముగింపు కూడా బాగుంది. కాస్త ఆ "అగ్ని" బోరు కొట్టింది నాకు.

>> ఈయన ముందేమి స్కాములు చేసాడో వాటికి ఆధారాలు ఉన్నాయో లేవో నాకు తెలవదు కాని వీలయితే ఈ చదివిన తీరుకి పనిష్మెంట్ ఉండాలి.
:) నాకయితే బాలక్రిష్ణ చదివినట్లనిపించింది.

Sravya V said...

3g గారు అమ్మయ్య నాకు చాల మంది తోడున్నారన్న మాట :)
రిషి గారు బాలకృష్ణ చదినట్లుందా మీకు :)

Rishi said...

కాదా చెప్పండి?ఒక్కసారి మీరు మన బాలక్రిష్ణ "హెహె హె హే" అనడాన్ని గుర్తు చేసుకుని కల్మాడీ స్పీచ్ ఊహించుకోండి,అలాగే లేదూ?

Sravya V said...

మీరు మరీ అంత ఉదాహరణలతో సహ చెబితే నేనెలా కాదంటాను :)

హరే కృష్ణ said...

రిషి గారు :)
3g గారు సంఘాలు ఎక్కువైపోయాయి ఇప్పటికే :)

unique identification కోసం ఎక్కువ సంఘాల్లో ఉన్న సభ్యులు అనే సంఘం ఒక్కటే మిగిలింది

మిగతా ఆంధ్రులకు కూడా ప్రత్యేక ఆభినందనలు

హరే కృష్ణ said...

ముఖ్యంగా సరైన వసతులు లేకపోయినా కూడా పతకాలను సాధించిన athletes కి జోహార్లు

మన singers హిందీ పాటలతో పాటు ఇంగ్లీష్ పాటలను కూడా పాడుతున్నట్టుగా act చేసారు అది తప్ప అంతా బావుంది

Glasgow వాళ్ళు చేసిన షో చాలా బావుంది

Sravya V said...

హరేకృష్ణ చూసారా నేను మర్చేపోయాను - అవును తెలుగువాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు , అవును Glasgow వాళ్ళ షో బాగుంది కాని నేను కొంచెం పక్షపాతిని అదీ సంగతి :). సరైన వసతులు లేకపోయినా ప్రతిభ ని చూపించినందుకు విజేతలైనా కాకపోయినా సరే వాళ్ళ ప్రతిభ ని మెచ్చుకుని తీరాలి. బ్లాగరు నాగార్జున గారు రాసిన "విజేత " పోస్టు చదివి "కృష్ణపూనియా" పట్టుదలకి నిజం గా అబ్బురపడ్డాను .
3g గారు హరేకృష్ణ గారు మిమ్మల్నే ఏదో అంటున్నారు చూసుకోండి :)

మంచు said...

మొత్తం మీద కామెన్వెల్త్ క్రీడలు మీతొ ఒక పొస్ట్ వేయించాయి :-))

మంచు said...

కామెంట్ మోడరషన్ పెట్టండి శ్రావ్యగారు......

Sravya V said...

మంచు గారు అవునండీ ఇంకో రొండు నెలలైతే సంవత్సరం అయ్యేది :)
కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేశా థ్యాంక్ యూ !

Post a Comment