Subscribe:

Thursday, January 27, 2011

అన్నీ వృత్తులు సమానం కాదా ? ఎందుకు ?

ఏంటో ఇప్పుడు బ్లాగుల్లో వృతుల టాపిక్ బాగా హాట్ అనుకుంటా కదూ ? . ఏది క్లిక్ ఐతే దానికి వెనకే పరిగెత్తే తెలుగు జాతిలో పుట్టి ఇప్పుడు నేను దీని మీద ఒక పోస్టు రాయకపోతే నా ఐడెంటిటీ కే ప్రాబ్లం . సరేలెండి ఈ సోదంతా ఎందుకు కాని ఒకవేళ మీకు ఈ టపా బాక్గ్రౌండ్ తేలియకపోతే మంచు గారు ,  వేణు బాబు గారు రాసినవి ఒక చూపు చూసి వచ్చేయండి . ఇక మీకు మనం మన బుర్రలు ఎందుకు బద్దలు కొట్టుకోబోతున్నామో అర్ధం అయ్యింది కదా :)

సరే మీరందరూ ఆదిత్య 369 అదేంటండీ అలా చూస్తారు అదే మన సినిమా లో బాలయ్య వాడలా అది ఎక్కేసి అలా క్రీపూ 7000 సంవత్సరాల క్రితాని కి వెళ్ళండి . వెళ్ళారా ? ఏమి కనిపిస్తుంది అక్కడ ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వేటాడి , లేదా దొరికిన కొమ్మలు , ఆకులు , పళ్ళు , కాయలు (అదేలెండి మన సలాడ్ స్టైల్ గా ) తింటున్నారు కదా. ఒకే ఇప్పుడు కొంచెం ముందుకు రండి ఏమి కనిపిస్తుంది అదేలెండి గుంపులు గుంపులు గా కలిసి వేటాడటం , లేదా ఏదో ఒక పంట పండించటం చేస్తున్నారు కదా ? ఇంకా కొంచెం ముందుకు రండి ఇప్పుడు కొంత మంది వ్యవసాయం చేస్తున్నారు , ఇంకొంత మంది వాళ్ళకి కావాల్సిన పనిముట్లు తయారు చేస్తున్నారు , కొంత మంది పిల్లల సంరక్షణ వగైరాలు చేస్తున్నారు కదా . అదండీ అక్కడ పడింది మొదటి బీజం మన వృత్తుల వర్గీకరణ కి . సరేలెండి ఇక మన టైంమెషిన్ లో పెట్రోల్ అయ్యిపోయ్యేట్లు ఉంది . ఇక మన బ్లాగుల కాలానికి వచ్చేయండి .

వచ్చేసారా ఇప్పుడు ఒక సారి మీ చిన్నతనాన్ని ఊహించుకోండి బావుంది కదా హాయి గా తినటం , తిరగటం :) సరే ఆ రెండేనా కొంచెం చదువు కూడా కావలిగా ఒక సారి మీ పుస్తకాల బ్యాగ్ గుర్తుతెచ్చుకోండి , ఏమి సబ్జేక్ట్లు ఉండేవి , సైన్సు , సోషల్ , తెలుగు, హిందీ , ఇంగ్లీష్ , మాధ్స్ యిలా కదా ? సరే పిల్లలు ఉన్నవాళ్ళు మీ పిల్లలు ఏమి సబ్జక్ట్స్ చదువుతున్నారో ఒక సారి గుర్తు తెచ్చుకోండి లేని వాళ్ళు అదేనండి పక్కింట్లో ఉంటారు కదా ఆ పిల్లల పుస్తకాలు చూడండి , ఆశ్చర్యం గా ఉంది కదా ఒక నాలుగు రకాల సైన్సులు, ఒక నాలుగు రకాల సోషల్లు ఇంకా ఏవేవో సరే కాసేపు అది అలా వదిలేద్దాం. ఇప్పుడు ,ఆసుప్తత్రుల గోల చూద్దాం మీ చిన్నప్పుడు మీకు జలుబు , జ్వరమో వస్తే మీ ఆమ్మమో , తాతో డాక్టర్ తీసుకెళ్ళి ఒక ఇంజెక్షన్ చేయిస్తే మరుసటి రోజుకి గంతులు వేసే వాళ్ళు కదా, మరి ఇప్పుడు ఒకసారి హాస్పిటల్ కి వెళదాం రండి , ఇక్కడే సందేహం కదా ఎవర్నీ కలవాలి జనరల్ ఫిజీషియన్ , అక్కడనుంచి జలుబు కాబట్టి పల్మనాలజిస్టు కి చూపిస్తే బెటర్ , వామ్మో కొంచెం వణుకు కూడా వుంది న్యురాలజిస్ట్ , కాదు కాదు కొంచెం గుండె దడ కూడా కార్డియాలజిస్ట్ అబ్బ ఎంత కన్ఫుజన్ . సరే ఆ రెస్టారెంట్ లో కొంచెం ఏమన్నా తిండి తిని దీని సంగతి చూద్దాం . ఇక రెస్టారెంట్ లో చైనీసు , ఇటాలియన్ , సౌత్ ఇండియన్ , నార్త్ ఇండియన్ ఇంకా ఇంకా . ఇక చాల్లెండి మీకు అర్ధం అయ్యింది కాదా, ప్రస్తుతం మనం ఉంది స్పెషలైజేషన్ యుగం లోనని .

ఇప్పుడు ఈ పైదంతా చదివాక మీకేమి అర్ధం అయ్యింది ? ఏంటి ఏమి అర్ధం కాలేదా ? మరీ అంత మొహమాటం లేకుండా చెప్తే నాకు బాధ వేయదండీ ? సరే ఏమి చేస్తాను నేనే చెబుతా . కాలం తో పాటు గా మన జీవనశైలి లో సంక్లిష్టత పెరిగి దాని కోసం అని మన జీనానికి అవసరమైన పనులన్నీ మనమే చేసుకోలేక రకరకాలు విడగొట్టి పంచుకున్నామన్న మాట అంగీకరిస్తారు కదా ? కాకపొతే ఇక్కడే మనకి కొంచెం పాత , కొత్త పనులు అనేవి ఉన్నాయి . మనకెప్పుడూ పాత ఒక రోత కొత్తొక వింతా కాబట్టి , సాధారణం ఏమి చేస్తాము కొత్త వాటి వెంట పరుగు అందుకుంటాము . అలాగని పరుగు అందుకని ఊరుకుంటామా? లేదు, అబ్బే ఇది లేకపోయినా పర్వాలా , వెనకటి రోజుల్లో మేము లేమా ? ఇదీ మన ఆలోచన , ఇది సహజం !కాకపొతే మనం ఇక్కడ మర్చిపోయే విషయం ఏమిటంటే దీని వల్ల కలిగే సౌకర్యాలు , అలాగే ఇవాళా మనకి అంత అవసరం గా కనిపించని ఇవే అవసరాలు రాబోయే తరాలకు కనీస అవసరాలు గా మారతాయి అని .

ఒక ఉదాహరణ చెబుతా ఎప్పుడో నేను పుట్టక పూర్వం పొలాలలో వరి నూర్పిడి మనుషులు చేసేవారట , కాని ఇప్పుడు నాకైతే ఎక్కడా కనపడలేదు , ప్రతి దగ్గర ట్రాక్టర్ తోనే . ఒకసారి ఊహించండి ఇప్పుడున్న పరిస్తితులలో మనుషులతో అది సాధ్యమా ? ఎన్ని రోజులు చేస్తారు ? ఎంత కూలీ కడతారు ? ఇక ఇప్పటి కాలం లో ఐతే చాలాచోట్ల నాట్లు , కోతలు కూడా మెషిన్ సాయం తోనే . నిజం గా ఒక్కసారి ఊహించండి ఇది మనిషి శ్రమ ని మేధస్సు తో తగ్గించటం కదా ? నా చిన్నపుడు కొన్ని జోక్స్ చదువుతుండే వాళ్ళం ఈ రోజు వర్షం పడుతుంది అని రేడియో లో చెబితే వడియాలు చేయాటానికి రెడీ అవ్వండీ అంటూ . ఇవాళ పరిస్తితులు మారలేదా ఎప్పుడు ఋతుపవనాలు వస్తాయి అనేది లెక్కలు కట్టి మరీ చెబుతున్నారు , అలాగే ఒక వారం ముందే ఈ రోజు వాతావరణ పరిస్తితి ని తెలుసుకోగలుగుతున్నాం దేని వల్ల ఇది సాధ్యం ? ఆ మేధస్సు కి విలువ అక్కరలేదా ?

ఇక మా తాత చిన్నప్పుడు చెబుతుండే వారు ఆయనకి ఏదో గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ ఉద్యోగం వస్తే వాళ్ళ నాన్న బస్తా వడ్ల ఖరీదు చేయదు ఆ ఉద్యోగం ఎందుకు అని పంపలేదని . మీలో ఎంత మంది ఇలాంటివి విని ఉంటారో చెప్పండి ? రేపెప్పుడో నేను నా మనవరాల్లలో , మనవళ్ళకో చేబుతానేమో , నన్ను మా అమ్మ నాన్న వ్యవసాయం చేయనీయకుండా ఇదుగో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని చేసారు అని :) ఇలా చెప్పటం లో నా ఉద్దేశ్యం ఒక్కొక్క కాలం లో ఒక్కొక్క వృత్తికి డిమాండ్ ఉంటుంది , అది రేపు ఏలా అన్న మారొచ్చు అని .దాని ప్రకారమే జనాలు choose చేసుకునే ప్రాధాన్యత క్రమం మారుతుంది అంత మాత్రానా ఈ వృతి మాత్రమే గౌరవనీయమైంది , వేరేది కాదు అనేది ఉండదు . అలాగే ఒక వృత్తి ని చేపట్టే వాళ్ళంతా ఉత్తములూ కాదు , వేరే పనులు చేసే వాళ్ళు కొంచెం తక్కువ కాదు . ఎవరైతే నిబద్దతతో వాళ్ళ వృత్తిని చేస్తారో వాళ్ళే గౌరవనీయులు, వాళ్ళ వల్లే ఆ వృత్తికి గౌరవం లబిస్తుంది .
మీరు మీ జీవితం లో ఒక్క రోజు మీ దినచర్య ని గమనించండి అది సక్రమం గా సాగటానికి ఎంతమంది సేవలు అవసరమో కూడా ఉహించండి . వారిలో ఏ ఒక్కరు సరిగా వాళ్ళ పని చేయక పోయిన ఎంత చిరాకు వేస్తుందో ఆలోచించండి . మనం ప్రస్తుతం గడిపే సామాజికజీవనం లో మనకు అనేక మంది సేవలు అవసరమవుతాయి , అలాగే మన సేవలు వేరే వాళ్లకి అవసరమవుతాయి సో ఒకరి మీద ఒకరు ఆధారపడక తప్పదు, ఈ ఆధారపడటం లో కొంచెం ఎక్కువ , కొంచెం తక్కువ అనే వర్గీకరణ అంత సబబు కాదు అని నా ఉద్దేశ్యం .
పైన నున్న లింకులలో రాసిన బ్లాగరుల అంత చక్కగా నేను రాసి ఉండక పోవచ్చు కాని నేను చెప్పదలుచుకున్న విషయం మాత్రం "ప్రపంచం లో వేరే వాళ్ళకి హాని కలిగించని ఏ వృత్తి ఐనా గౌరవనీయమైనదే నిబద్దతతో పనిచేసే వ్యక్తుల వల్ల ఆ వృత్తికే గౌరవం పెరుగుతుంది !".

15 comments :

భాస్కర్ రామరాజు said...

ప్రపంచం లో వేరే వాళ్ళకి హాని కలిగించని ఏ వృత్తి ఐనా గౌరవనీయమైనదే నిబద్దతతో పనిచేసే వ్యక్తుల వల్ల ఆ వృత్తికే గౌరవం పెరుగుతుంది !
చక్కగా చెప్పారండీ శ్రావ్య గారూ. పైన మీరుదహరించిన కొన్నిటితో నేను ఏకీభవించకపోయినా, మీ భావంతో, అంటే పై స్టేట్మెంటుతో ఏకీభవిస్తున్నా.
వాతావరణం కోసం టెక్నాలజీ మీద ఆధారపడేలా చేసాయి మన చదువులు. మన పరంపర బ్రేక్ అయ్యింది. మబ్బుల పాటర్న్ చూసి వాన పడుతుందా లేదా అని ఊహించగలిగిన విజ్ఞాన వంతులు మన పూర్వీకులు. ఆ విజ్ఞానాన్ని మనం అందుకోలేకపొయ్యాం.
ట్రాక్టర్లు గట్రా పెట్టి భూమి గుండెల్ని చీల్చుతున్నాం. ఐనా, పంటపండించలేక పోతున్నాం. అదే ఏ టెక్నాలజీ లేకుండా, స్వశక్తితో రైస్ బౌల్స్ లాగా నిలిచాం ఆనాడు.
టెక్నాలజీ రూయిన్డ్ లైఫ్. చేతివృత్తులు మూలపడ్డాయి. కూలీలు వేరే ప్రదేశాలకు వలస వెళ్ళారు. అన్నీ మిషన్లే చేస్తున్నాయి. ఇది మన ఆర్థిక వ్యవస్థని ఎంతలా దెబ్బదీసాయో, నిదానంగా ఆలోచించండి.
పవర్ లూం వచ్చి మన మగ్గాలను మింగేసాయి.
క్షణం తీరిక లేకుండా ఏదోక పని చేస్తూ ఆరోగ్యంగా ఉన్న నూలు వడికే చేతుల్లోకి టీవీ రిమోట్లు వచ్చాయి. ఇంట్లో జానా బెత్తెడు స్థలంలో కూరగాయలు పండించుకుంటూ పాదులూ గట్రా చేసుకునే చేతులు ఖాళీగా ఉన్నాయీనాడు.
ఇది వేరే వర్టికల్. దీనిపై వేరేగా డిస్కస్ చేయటం ఉత్తమం.
మీ టపా, భేషుగ్గా ఉంది. నిబద్ధతతో పనిచేసే వ్యక్తుల వల్ల ఆ వృత్తికే గౌరవం పెరుగుతుంది. చక్కగా చెప్పారు.

శుభం.

Sravya Vattikuti said...

భాస్కర్ గారు ముందు గా ఇంత చక్కటి వివరణాత్మక వాఖ్య కి ధన్యవాదాలు ! నిజమే మీరన్నట్లు టెక్నాలజీ వాళ్ళ కలిగే దుష్ఫలితాలను చూస్తున్నాము . దీనికి ప్రత్యేకం గా ఎవరి ని తప్పు పట్టలేము . అలాగే తరతరాలు గా వస్తున్న మన వారసత్వ సంపాదనని వదులుకోని పరాయి దేశాల వైపు అర్రులు చాస్తున్నాము .

చదువరి said...

వృత్తులన్నీ వేటికవే గొప్పవి, సందేహం లేదు. ఒకటి ఎక్కువ, ఇంకోటి తక్కువా అనేది ఉందో లేదోగానీ, ఒక్కో వృత్తికి ఒక్కో ప్రాముఖ్యత ఉందని నేను భావిస్తున్నాను. "ఒక్కొక్క కాలం లో ఒక్కొక్క వృత్తికి డిమాండ్ ఉంటుంది" అని అనడంలో మీరూ కూడా అదే మాట చెప్పారని అనుకుంటున్నాను.

రోజూ నాకు అవసరమయ్యే వృత్తుల్లో ఏవేవి ఎంతెంత అవసరమో ఆలోచించి చూసాను..

1. మా నాన్న (రైతు) నాకు బియ్యం పంపిస్తాడు. రైతు లేకపోతే నాకు పూట గడవదు బాబోయ్.
2. మా మహేందరు నాకు క్షవరం చేస్తాడు. మంగలి లేకపోతే కష్టమే. ఉండాల్సిందే.
3. పొద్దుటిపూట టీవీ పెట్టి చర్చలు చూస్తూంటాను. ఆ మధ్యెప్పుడో ఓ నాలుగు నెలలు అసలు టీవీ కనెక్షను లేకుండానే బతికేసాను కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా అంత అవసరమేమీ కాదు.

ఇక్కడ ఆపేస్తాను. ఇప్పుడు పై వృత్తుల్లో ఏది ప్రధానమైనది అని నన్నడిగితే ఠక్కున చెప్పెయ్యగలను. అన్నీ అవసరమే గానీ, కొన్ని ఎక్కువ అవసరం, కొన్ని తక్కువ అవసరమని నాకు అనిపిస్తోంది. (వృత్తులన్నింటితోటీ మనకు నేరుగా పని ఉంటుందని నా ఉద్దేశం కాదులెండి.) నా ఆలోచనా ధోరణిలో ఏమైనా లోపముందా?
---------------------
"ఏది క్లిక్ ఐతే దానికి వెనకే పరిగెత్తే తెలుగు జాతిలో.." ఈ మధ్యే స్నేహితులం మాట్టాడుకుంటూ ఈ ముక్కే అనుకున్నాం.

హరి said...

పారిశ్రామికీకరణ పెరిగిన కొద్దీ వృత్తులు క్రమ క్రమంగా తగ్గిపోతున్నాయి. ఆ వృత్తులకు బదులుగా కేవలం మెషీన్ ఆపరేటర్లు మిగులు తున్నారు. కనుమరుగై పోయిన వృత్తికి సరిపడా, కొండొకచో ఎక్కువగానే మనకు సంబంధిత ఉత్పత్తులో, సర్వీసులో లభిస్తూనే ఉన్నాయి.

రేపు వ్యవసాయంలోకి కూడా పరిశ్రమలు ప్రవేశిస్తే రైతు అనే వృత్తి ఉండక పోవచ్చు. దానికి బదులుగా ట్రాక్టర్ డ్రైవర్, హార్వెస్టర్ ఆపరేటర్, పంప్ ఆపరేటర్ లాంటి వృత్తులు(??) పుట్టుకు రావచ్చు. అప్పుడు "పంప్ ఆపరేటర్ లేక పోతే నాకు తిండి ఎలా?" అనే ప్రశ్న ఉదయించదు, అది అంత skilled job కాదు కాబట్టి.

నేత కార్మికుల విషయంలో ఇది ఇప్పటికే అమలు జరిగింది. ఒకప్పుడు "చేనేత వృత్తి వారు లేక పోతే మన మానాలు కాపాడుకోవడం ఎలా?" అన్న భావన ఉండేది. ఇప్పుదో, అసలు ఆ ఆలోచన కూడా రాదు. అంతా పారిశ్రామికీకరణ మహిమ!

Sravya Vattikuti said...

చదువరి గారు మీ ఆలోచన దోరణి లోపమా ఎంత మాట ? లేదు మంచి discussion నడుస్తుంది కదా దీన్ని రెండు ముక్కలు తెలుసుకుందాం అనే స్వార్ధం అంతే:)

మనం ఆలోచించేటప్పుడు ఇక్కడ మనకి ప్రాధానం గా కనపడుతున్న తిండి , బట్ట వీటి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాము , కాని అవి తయారు కావాటనికి మనకి కనపడని ఇంకొన్ని వృత్తుల సహకారం అవసరం అనే దాని మీద ద్రుష్టి పెట్టటం లేదు అనిపిస్తుంది .

ఇక్కడ మీరు చెప్పిన ఉదాహరణే తీసుకుందాం , మీ నాన్న గారు మీకు బియ్యం పంపటానికి ఎంత ప్రాసెస్ ఉందొ . ముందు మీ పొలం లో పంట పండాలి అంటే దానికి కావాల్సిన ఎరువులు ఇవి ఎవరో తయారు చెయ్యాలి కదా (ఎరువులు లేకుండా పండిచటం ఈ రోజుల , మన జనాభా కి భూమి కి ఉన్న నిష్పత్తి ప్రకారం కుదరదు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి ) . ఒక్కరి వల్లే కాదు కాబట్టి వేరే మనషులు , లేదా యంత్రాల సహకారం అవసరం (మరి ఈ యంత్రాలు ఎవరో చెయ్యాలి ) . సరే వీళ్ళందరికీ డబ్బు కట్టడానికి మీ నాన్న గారు ఎవరికో ఈ ధాన్యాన్ని అమ్మాలి కదా ? (అందరూ పండిస్తే కొనేది ఎవరు సో కొంచెం మంది కన్జ్యుమర్స్ అవసరం ) . ఇక ఆ తరవాత ఆ ధాన్యాన్ని ఏ మిల్లుకో పంపిస్తే గాని బియ్యం కాదు (అక్కడ అతను రైతు కాకపోయినా మీ బియ్యం కోసం పని చేస్తున్నాడు ). ఇక ఆ బియ్యం మీ కావూరి నుంచి హైదరాబాద్ రావటానికి ఏదో వాహనం అవసరం ఒక మీ స్వంత కారు ఐనా అది ఎక్కడో తయారు కావాలి , అది నడవటానికి పెట్రోల్ కావాలి , ముందు ముఖ్యం గా రోడ్డు కావాలి . వీటన్నిటి వెనక వ్యక్తుల ప్రమేయం లేకుండా ఇది సాధ్యం కాదు కదా ? ఇక ప్రాసెస్ ని కొంచెం సమర్దవంత గా చేయటానికి ఆధునిక టెక్నాలజీ అవసరం .

ఒక్క బియ్యనికే ఇంత కష్టం పడుతుంటే ఇక మనం ఒక్క అన్నమే తినం కదా ? దానిలోకి కావాల్సిన అధరవుల కోసం ఇంకా కొంత మంది సహాయం అవసరం .

అందుకే నేను అంటాను మనకి కనపడే వృత్తుల మీదనే కాకుండా మనకు తెలియకుండా ఎంతో మంది మీద ఆధారపడతాము ఇందులో ఎవరూ తక్కువ కాడు అని :)

మరీ మీకు ఇంతగా వివరించనవసరం లేదు అని నాకు తెలుసూ కాని నా వాదన చూపించాలి కదా అందుకే ఈ ప్రయత్నం :)

ఇక వృత్తుల డిమాండ్ అనేది నేను ఇక్కడ డిమాండ్ అండ్ supply సూత్రాన్ని నమ్ముతాను !

Sravya Vattikuti said...

హరి గారు పారిశ్రామికీకరణ పెరిగిన కొద్దీ వృత్తులు క్రమ క్రమంగా తగ్గిపోతున్నాయి ఇది నిజం కాని ఒక రకం గా మంచిది కూడానేమో కదా ? ఎవరు ఇష్టం వచ్చిన వృత్తి ని వాళ్ళు ఎంచుకోవచ్చు . దీని వల్ల నష్టాలు లేవు అని నేను అనను కాని జనాల మధ్య అంతరాలు తగ్గటానికి మాత్రం నిజం ఆ మంచి మార్గం అని నా ఊహ .

ఇక కార్పోరేట్ ఫార్మింగ్ విషయం లో మాత్రం నేను మీతో వంద శాతం అంగీకరిస్తాను ఇవాళా చిన్న, మధ్య తరగతి మనుగడ కష్టం గా మారి అందరూ కార్పోరేట్ కూలీలు గా మారారో , రేపు చిన్న సన్న కారు రైతులు రైతు కూలీలు గా మారతారు . దీనికన్నా నాగార్జున గారు వేరే దగ్గర చెప్పినట్లు సహకార వ్యవసాయం అనేది మంచి అని నా అభిప్రాయం .

Mauli said...

Please find my view here

http://teepi-guruthulu.blogspot.com/2011/01/blog-post_28.html

Sravya Vattikuti said...

మౌళి చదువుతానండీ Thank you !

pureti said...

nice post.
kanee link icchepudu peru vrayakumda ikkada akkada ani rayatam endukano nacchaledamdi.

Sravya Vattikuti said...

వేణుబాబు గారు Thank you ! నేను ఈ పోస్టు రాసేటప్పుడు అంత ఐడియా రాలేదు , నిజం గానే పేర్లు రాసి ఉండాల్సింది , మారుస్తాను

Venhu said...

thanx

కృష్ణప్రియ said...

శ్రావ్య,

ముందుగా అభినందనలు చాలా చక్కగా రాశారు..
ఇక అన్ని వృత్తులూ సమానమా? కాదా?

నాకు తలనొప్పి గా ఉన్నప్పుడు ఏదీ తోచదు.. మిగిలిన body parts బాగానే పని చేసినా.. తల నొప్పి వల్ల కాన్సెన్ ట్రేషన్ లేక 'అబ్బా.. ఏ నొప్పైనా భరించగలం కానీ.. ఈ తలనొప్పి మాత్రం .. నా వల్ల కాదు..' అనిపిస్తుంది. పన్ను నొప్పి కీ, నడుం నొప్పి కీ అదే తంతు..

ఒక దెబ్బ పడుతుందనో లేక ఒక attack అవుతుందనో తెలిసినప్పుడు.. అసంకల్పిత ప్రతీకార చర్యగా మొహాన్నీ ఉదరాన్నీ రక్షించుకోవటానికి డక్ ఇన్ చేస్తాం.

మీరు చెప్పినది అక్షరాలా నిజం ..
ప్రపంచం లో వేరే వాళ్ళకి హాని కలిగించని ఏ వృత్తి ఐనా గౌరవనీయమైనదే నిబద్దతతో పనిచేసే వ్యక్తుల వల్ల ఆ వృత్తికే గౌరవం పెరుగుతుంది !

స్టిల్.. నాకు ఎక్కడో సన్నకారు రైతు పట్ల soft corner ఉంది.
మంచు గారి పోస్ట్ లో నేను చెప్పిన విధం గా..

వేరే అవకాశాలున్నా సమాజ హితం కోరి 'ఎవరూ చేయకపోతే.. గింజలెలా వస్తాయి? ' అనుకునే సన్నకారు రైతులు, ప్రాణానికి హాని ఉందని తెలిసినా.. సామాన్య ప్రజలకి రక్షణ అందించటానికి నిజాయితీ గా ముందుకెళ్ళే చిన్న కాడెర్ పోలీసులూ etc వల్ల వారి వృత్తులంటే నాకు అదనపు గౌరవం ఏర్పండిందనుకుంటాను.

Sravya Vattikuti said...

కృష్ణ ప్రియ గారు ముందు గా చదివి ఓపిక గా కామెంటినందుకు ధన్యవాదాలు ! మీ బ్లాగు లో నారాయణ రెడ్డి గారి గురించిన పోస్టు నాకు బాగా గుర్తుండి పోయింది అందుకే మీ అభిప్రాయం అడిగాను :).
మీతో పాటు నేను ఒప్పుకుంటున్నాను , మనం దగ్గర గా చూసిన కొన్ని పరిస్తితులు ప్రభావం తో కొంత softcorner , అదనపు గౌరవం కలుగుతాయి .

సంతు (santu) said...

వృత్తులు ఆ నేను 2days back చూసి వృత్తాలు అనుకొని ఇదేదో maths కి సంబందించిన పోస్ట్ అనుకొని బయపడిపోయి చదవలేదు(తీరిగ్గా ఉన్నప్పుడు చేద్దాం ఈ లెక్కలు అని).... :p

బహు బాగా చెప్పారు, మనం ఒకరిపై ఒకరం ఆదార పది జీవించక తప్పదు, మనుషుల మద్యన అంతర్యం పోయినప్పుడే ఈ వర్గీకరణ సమస్యలు కూడా తీరతాయి...

Sravya Vattikuti said...

హ హ సంతు గారు అబ్బా లెక్కలు అనుకున్నారేం :-)) నేను అంత పెద్ద పోస్ట్లో చెప్పింది మీరు రెండు లైన్ల లో తేల్చారు థాంక్ యు :-))

Post a Comment