Subscribe:

Monday, March 21, 2011

ఇలా జరిగింది !


21 -03 -2011 - సమయం 9 :15 అం HR ఒక సౌత్ ఇండియన్ లుక్ తో ఉన్న అమ్మాయిని పరిచయం చేస్తుంది . ఈమె సో అండ్ సో మీ టీం లో సో అండ్ సో పొజిషన్ లో జాయిన్ అయ్యింది అని .
ఎదురు సీట్ తమిళ్ కొలీగ్ : తెలుగు అమ్మాయా ?
నేను : తెలియదు కాని పేరు మాత్రం తెలుగు పేరు లా ఉంది.
సరే introduction session అయ్యాకా ఆ అమ్మాయికి నా పక్క సీట్ allot చేసారు .
ఆమె ఏదో అడుగుతుంది , నేను ఆన్సర్ చేస్తున్నా (ఇదంతా ఇంగ్లీష్ లోనే ).
సమయం 4 PM :
నేను : కాఫీ ?
ఆమె : I don't like coffee , I like Milo .
5 నిమషాల తరవాత చెరొక కప్పు తో సీట్ దగ్గర కి వచ్చాం .
నేను : ఇండియా లో ఈ ప్రాంతం నుంచి వచ్చారు ?
ఆమె : ఆంధ్రప్రదేశ్
ఆమె : మీరు ?
నేను : హైదరాబాద్ !

నేను : హ్మ్ ! AP లో ఎక్కడ ? (ఇక్కడ నుంచి తెలుగు లోకి దిగిపోయాం :))
ఆమె : గుంటూరు
నేను : ఓహ్ గుంటురేనా , లేదా దగ్గర వేరే ఊరా ?
ఆమె : పొన్నూరు తెలుసా
నేను : తెలుసు పొన్నురా ? ఒకే !
ఆమె : అంటే పొన్నూరు కూడా కాదు దగ్గర xxxxxxx
నేను : హ (ఇక్కడ చచ్చేంత ఆశ్చర్యం) అవునా అదెలా ఎవరమ్మాయి మీరు ?
ఆమె : ఏమి మీకు తెలుసా ?
నేను : తెలుసా ? అది నా నేటివ్ ప్లేస్ .
ఆమె : అవునా నేను పలానా వాళ్ళ మనవరాలిని , మీరు
నేను : హ హ నేను పలానా !
ఆమె : హ మీరా ?
మా ఇద్దరి పెరిగిన గొంతులు , వాటిలోని excitement చూసి మిగిలిన కొలీగ్స్ ఏమి జరిగింది జరిగింది అని క్యురియస్ . ఇక తరవాత మా explanation :)


ఇంతకీ విషయం ఏంటంటే మా ఫ్యామిలీ తనకి తెలుసు , వాళ్ళ ఫామిలీ నాకు తెలుసు , మేము ఎప్పుడో చాలా చిన్నపుడు చూసుకొని ఉండొచ్చు , తరవాత వాళ్ళు గుంటూరు వెళ్ళిపోయారు , మేము హైదరాబాద్ . ఈ మధ్యనే రీసెంట్ గా పర్సనల్ reasons తో వాళ్ళు సొంత ఊరికి వచ్చేసారు . ఇప్పుడు పక్కనే పక్కనే కూర్చొని ఇన్ని సంవత్సరాల తరవాత కలిసి పని చేస్తున్నాం .
world is small అంటే ఇదే కదూ :)

29 comments :

వేణూరాం said...

hmm... baavundandi..:) :)

హరే కృష్ణ said...

హ్మ్మ్..కెవ్వ్ కలయిక అంటే ఇదేనేమో
బాగా రాసారు

kiran said...

:):)

Sravya Vattikuti said...

Thank you Rajkumar, Hare Krishna and Kiran :)

లత said...

బావుందండీ,అలా సడెన్ గా అయినవాళ్ళు కలిస్తే భలే ఉంటుంది,మీరు పెట్టిన ఫొటో చాలా బావుంది

Sravya Vattikuti said...

లత గారు అవునండి భలే థ్రిల్లింగ్ గా అనిపించింది . ఆ బొమ్మ గూగుల్ పుణ్యమే నండి :)

Anonymous said...

చాలా బాగున్ది

Arun Kumar said...

బావుందండీ

Sravya Vattikuti said...

అనానిమస్ గారు Thank you !
అరుణ్ గారు మీకు నచ్చిందుకు Thank you !

మాలా కుమార్ said...

చాలా త్రిల్లింగ్ కదూ ! బాగుంది .

మురళి said...

వావ్.. అస్సలు ఊహించని ముగింపు.. మీ థ్రిల్ ని ఊహించి ప్రయత్నం చేస్తూ..

Sravya Vattikuti said...

మాలకుమార్ గారు అవునండీ భలే థ్రిల్లింగ్ అనిపించింది . Thank you !

Sravya Vattikuti said...

మురళి గారు మీ కామెంట్ చూడడం భలే ఆనందం గా ఉంది , అవునండి సూపర్ థ్రిల్లింగ్ !
Thank you !

seshu said...

very thrilling n the image is very good

Sravya Vattikuti said...

Seshu gaaru Thank You !

కథాసాగర్ said...

మీ కథ లో ట్విస్ట్ బాగుందండి...
నాకు ఒక సారి ఇలాంటి అనుభవమే ఎదురయ్యిందండి..
మనం అపరిచితులు అనుకున్న వారు కూడా అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో మన కుటుంబాలకి గని , స్నేహితులకు గాని పరిచయం ఉన్నవారేకావచ్చు..
గుడ్ పోస్ట్

Sravya Vattikuti said...

కదాసాగర్ గారు అవునండీ అపరిచితులు అనుకున్నవారు కొన్ని సార్లు తెలిసినవాల్లె కావచ్చు , Thank You !

డేవిడ్ said...

చాలా బాగుంది కొన్ని సార్లు అలాగే జరుగుతాయి..

Sravya Vattikuti said...

డేవిడ్ గారు అవునండీ Thank You !

పరుచూరి వంశీ కృష్ణ . said...

బాగుంది....నేను కూడా ఇలా నే ఒకసారి మా ఫ్రెండ్స్ తో వెళ్తూ మా వూరి గురించి భారీ ఎత్తున డబ్బా కొడుతూ ఉన్నా ! అంత లోపు ఒకాయన వచ్చి పలకరించారు ..నేను గుర్తు పట్టలేదు ఆయన వెంటనే అదేంటయ్య మీదీ మాదీ ఒకే వూరు కదా అని డిటైల్స్ చెప్పారు ..అంతే పరువు పోయింది : (

Sravya Vattikuti said...

వంశీ Thank you , చాలా రోజులకి కనిపించారు ! ఫైనల్ ఇయర్ అయ్యిపోయి కొత్త ఉద్యోగం లో చేరినట్లేనా :)
ఇంతకీ ఏమని డబ్బా కొట్టారెంటి :)

పరుచూరి వంశీ కృష్ణ . said...

గుర్తుంచుకుని మరీ ఫైనల్ ఇయర్ అనడం ఏమీ బాగోలేదండి ...ఏ ఇయర్ అయితే ఏం లెండి ! అన్నీ అయిపోయి చివరికి అలా జాయిన్ అయిపోయాను ..! డబ్బా గురించి మీకు చెప్పేదేముంది ? ఎప్పుడూ ఉండే మామూలు డబ్బా నే !

Sravya Vattikuti said...

వంశీ :)

Ennela said...

భలే బాగుంది..నేను తెలుగు వాళ్ళని చూడగానే డైరెక్టుగా, తెలుగు వారా అని అడుగుతా! మా చిన్నోడు బోల్డు హాశ్చర్యపోయి.."ఇంకా మాట్లాడకుండానే నీకు ఎలా తెలుసమ్మా" అంటాడు..."నాన్నా తెలుగు మొహాల్లో ఒకానొక స్పష్టమైన కళ ఉంటుంది ,పట్టెయ్యడం ఈసీ" అని చెప్పా...వాడూ సీరియస్ గా ఆ కళని గుర్తించే పనిలో పడ్డాడు...
ఇంక మీలా చుట్టాలని కలిస్తే ...వావ్! థ్రిల్లింగ్ ....

Sravya Vattikuti said...

తెలుగు మొహాల్లో ఒకానొక స్పష్టమైన కళ ఉంటుంది ,పట్టెయ్యడం ఈసీ" అని చెప్పా,...వాడూ సీరియస్ గా ఆ కళని గుర్తించే పనిలో పడ్డాడు.

-------------------------

హ హ ఇప్పుడు నేను కూడా అదే పని మీద బయలుదేరుతున్నాను ఎన్నెల గారు :))))))
Thank you !

శేఖర్ (Sekhar) said...

Unbelievable.It happen only with andhra ppl :)

రసజ్ఞ said...

వావ్ భలే ఉంటుంది కదా! ఒక మంచి ఫీల్ వస్తుంది!

santu said...

అనుకోకుండా ఒక రోజు :p

Sravya Vattikuti said...

@Sekhar , @Rasagna gaaru , @Santu gaaru Thank you :-)

Post a Comment