Subscribe:

Saturday, April 23, 2011

శ్రమైకజీవన సౌందర్యం

మీరు రాంబాబు డైరీ చదివారా ? ఆగండి ! మీ తిట్లతో నా చెవులు చిల్లులు పడుతున్నాయి.  ఆ శ్రమైకజీవన సౌందర్యం అన్న హెడ్డింగ్ ఏంటి , రాంబాబు డైరీ చదివారా అన్న ప్రశ్నకి సంబంధం ఏమిటి అసలా మాటకొస్తే ఆ రాంబాబు గాడు ఎవడు అనే గా మీ సందేహం? చెప్తానండి ! ఒక్క క్షణం.

రాంబాబు డైరీ అనేది నండూరి పార్ధసారధి గారు రాసిన ఒక పుస్తకం పేరండి. ఆ సరే ఐతే ఆ పుస్తకానికి ఈ శ్రమైకజీవన సౌందర్యంకి సంబంధం ఏంటి అనేగా ఇప్పుడు మీ ప్రశ్న?  ఆ వివరాలలోకే వస్తున్నా . ఈ రాంబాబు డైరీ ల మొదటి బాగం మూడు సంవత్సరాల క్రితం నేను ఇండియాలో ఉన్నప్పుడు చదివాను. అది మొదటిసారి నేను చూసింది నేను చిక్కడపల్లి లైబ్రరీ లో (ఇప్పుడు ఆ లైబ్రరీ గురించి తెలిసిన వాళ్ళు సందేహపడకండి ఒక్కోసారి అంతే లక్కు లాగిపెట్టి తంతే మనం వెళ్లి బూరెల బుట్టలో పడతాం ). ఆ పుస్తకాన్ని మొదటి సారి చదవగానే నేను అర్జెంటు గా చేసిన పని , విశాలాంధ్ర  కెళ్ళి అది సంపాదించటం ఎందుకు అనుకుంటారేమో ఆ రాంబాబు కి ఉన్న సందేహలలో కొన్ని నాకు ఉన్నాయి మరి ఆయన వాటిని డైరీలో రాసుకున్నాడు, నాకు రాయటానికి బద్ధకం అందుకే రాసే పని తప్పుతుంది అని కొనేసుకున్నా :)

అందులో మచ్చుకి కొన్ని :
1.దేశంలో ఔషదాల పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నప్పటికీ , ఎన్ని టానిక్కులు ఉత్పత్తి అవుతున్నప్పటికీ బలహీన వర్గాల పరిస్తితి ఎందుకు మెరుగుపడటం లేదు ?
2.షాపింగ్ అంటే షాప్ కి వెళ్లి కొనటం ఐతే , మార్కెటింగ్ అంటే మార్కెట్ కి వెళ్లి కొన్నుకోవటం ఎందుకు కాదు ?
3.దున్నేవాడిది భూమి అంటున్నారు రైతులు , రేపు బట్టలు ఉతికే వారు ఉతికేవాడిది బట్ట అనొచ్చు , తల క్రాఫింగ్ చేసే వారు గోరిగే వాడిది తల అని వాదించరు అని గ్యారెంటి ఏమిటి ?

  • సరే, సందేహాల సంగతి పక్కన పెడితే అనుభూతుల సంగతి చూద్దాం ఎంత సిన్సియర్ గా చెబుతాడో
    గ్రీష్మ ఋతువులో మధ్యాహాన్నం పాడే ముల్తానీ రాగం వింటే వేసవి కాలం మిట్ట మధ్యాహన్నం చెమటలు పోస్తుంటే బామ్మ గారు ఆవలిస్తూ గచ్చునేల మీద చెంగు పరుచుకొని పడుకుని ఆవలిస్తూ ఈగలు తోలుకుంటూ విసిన కర్రతో విసురుకుంటున్నట్లు ఉండటం (మామూలు జనాలకైతే ప్రియుని కోసం ఎదురుచూసే ప్రియురాలి విహార వేదన తెలియాలి ) .

  • ఇక మచ్చుకి మన రాంబాబు ప్రతిపాదించిన సిద్దాంతం :
    అవతలి వాడికి తెలిసిన విషయం గురించి మనం ఎప్పుడు మాట్లాడకూడదు , అవతలి వాడికి ఏది తెలియదు అని మనకి గట్టిగా తెలుసో దాన్ని గురించి మనకి తెలియకపోయినాసరే అనర్గళం గా మాట్లాడొచ్చు అందుకని అవతలి వాడికి ఏది తెలియదో అది తెలుసుకోవాలి ముందు .

ఈ పైవి చదివితే మనలోని రాంబాబుని ఒకసారి చదవాలి అనిపించటం లేదు ?! అనిపిస్తుంది కదా :) అందుకే నేను జనవరి లో వెళ్ళినప్పుడు రాంబాబు డైరీ రెండో బాగం దొరకబుచ్చుకుని నా వెంట తెచ్చుకున్నా. ఇక అప్పటినుంచి ఒక రెండు నెలలు పని పని , కాని చదవాలన్న కోరిక.  సరే ఆ బాధ తట్టుకోలేక ఎలాగోలా , రాంబాబు డైరీ తో పాటు ఇంకొక రెండు పుస్తకాలు హడావుడిగా ముద్దలు ముద్దలు మింగుతాం చూడండి అలా కానిచ్చేసా .

ఇక వారంతం మాకు గుడ్ ఫ్రైడే సందర్భం గా పొడుగాటి వారంతం , పైగా ఆఫీసులో కూడా ఒక పది రోజుల నుంచి తగ్గిన పని ఒత్తిడి వీటితో గురువారం సాయంత్రమే డిసైడ్ అయిపోయాను ఈ మూడు రోజులు కాలు తీసి బయట పెట్టకూడదు , పర్స్ లోంచి ఒక్క సెంట్ కూడా ఖర్చు చేయకూడదు అని . అంతే నిన్న , ఈవాళ పండగ రాంబాబు డైరీ రెండో బాగం మళ్ళీ తీరిగ్గా చదివేసా , ఇంకొక కొత్త బ్లాగు మొదలెట్టేసా. కొన్ని రోజులు పని తరవాత వచ్చే తీరిక సమయాన్ని ఈ మూడు రోజులు క్షణం కూడా వృధా చేయకుండా ఎంజాయ్ చేస్తున్నా , ఇప్పుడు అర్ధం అయ్యిందా మీకు ఈ పోస్టుకు ఆ హెడ్డింగ్ ఎందుకు అనేది :)

అలాగే శ్రమలో ఆనందాన్ని అనుభవించటమే కాదు శ్రమించే వారిని అభినందించటం కూడా మంచి పని కాబట్టి :

విజయవంతం గా మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంత్సరంలోకి అడుగు పెట్టిన శుభసందర్భం లో మాలిక టీం మెంబెర్స్ కి శుభాకాంక్షలు . చిన్నారి మాలిక కు బెలేటేడ్ హ్యాపీ బర్త్ డే !

మాలిక , మాలిక ప్రతిక , వనితా మాలిక ఇవే కాకుండా మీరు మరన్ని విజయవంతమైన పనులు చేయాలి అని మనస్పూరిగా గా కోరుకుంటున్నా !



25 comments :

kiran said...

ఈ మధ్యే పుస్తకాల పిచ్చి పట్టుకున్న నాకు..ఇంకో పుస్తకాన్ని పరిచయం చేసారు....మీకు బద్ధకం ఏంటి చక్కగా..మీకు నచ్చినవి..ఇక్కడ టైపు చేస్తేను..:)..thank u..:)
మొత్తానికి వారంతం మీరనుకున్నట్లే జరిగిందన్నమాట..:)
మాలిక వారికీ అభినందనలు..:)

శ్రీనివాస్ పప్పు said...

"అవతలి వాడికి తెలిసిన విషయం గురించి మనం ఎప్పుడు మాట్లాడకూడదు , అవతలి వాడికి ఏది తెలియదు అని మనకి గట్టిగా తెలుసో దాన్ని గురించి మనకి తెలియకపోయినాసరే అనర్గళం గా మాట్లాడొచ్చు అందుకని అవతలి వాడికి ఏది తెలియదో అది తెలుసుకోవాలి ముందు"

బ్రతుకుతెరువుకి కావాల్సిన ముఖ్యమయిన వాక్యం ఇది,దీన్ని పాటిస్తే దూసుకుపోడమే, కాకపోతే అన్నిచోట్లా పనిచెయ్యకపోవచ్చు అందువల్ల లౌక్యంగా వాడుకోవాలి ఈ సూత్రాన్ని.

మాలిక సభ్యులందరికీ శుభాభినందనలు.మీ/మా/మన మాలిక పత్రిక దినదినప్రవర్ధమానంగా ఎదిగి ఇంతింతై వటుడింతై ఎంతెంతో అయి ఇంకెంతో అవ్వాలని కోరుకుంటూ....భవదీయుడు శ్రీనివాస్ పప్పు

రాజ్ కుమార్ said...

హహహ.. పప్పు గారి కామెంట్ళే నావీనూ.. :) :)

దున్నేవాడిది భూమి అంటున్నారు రైతులు , రేపు బట్టలు ఉతికే వారు ఉతికేవాడిది బట్ట అనొచ్చు , తల క్రాఫింగ్ చేసే వారు గోరిగే వాడిది తల అని వాదించరు అని గ్యారెంటి ఏమిటి ? హహహహ్ నాకు భలే నవ్వొచ్చిందీ.. అయినా అలా ఎలా కుదురుతుందండీ? కమెంట్ పెట్టినవాడిదే బ్లాగ్ అయిపోతుందా??
"రాంబాబు (బాబ్బబ్బాబు... అన్నట్టులేదూ?) డైరీ " పుస్తకం పరిచయం చేసినందుకు ధన్యవాదాలండీ. అర్జెంట్ గా కొనెయ్యాలి అయితే.

హరే కృష్ణ said...

హ హ :))
భలే ఉన్నాయి :) సాఫ్ట్ కాపీ దొరికితే బావుండు
మొత్తం ఎన్ని బుక్స్ ఉన్నాయి సిరీస్ లో
జీవిత సత్యాలను ఎంత సింపుల్ గా చెప్పాడు! Thanks for sharing.
మాలిక టీం కు అభినందనలు

మంచు said...

ఎప్పుడూ పేరు కూడా వినలేదు. కానీ రాంబాబు ప్రతిపాదించిన సిద్దాంతం బాగా నచ్చేసింది :-)

సాఫ్ట్ కాపీ దొరకకూడదనికొరుకుంటూ .....:D:D

వేణూశ్రీకాంత్ said...

రాంబాబు సిద్దాంతం సందేహాలూ బాగున్నాయండీ.. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
మాలిక టీంకు శుభాభినందనలు..

Sravya V said...

కిరణ్ Thank you ! ఈ పుస్తకం తప్పకుండా చదవండి , మీకు ఖచ్చితం గా నచ్చుతుంది నాది హామీ (అదేమో మిక్షే యాడ్ లాగా )

పప్పు శ్రీనివాస్ రావ్ గారు ధన్యవాదాలు , ఆ సూత్రం పుస్తకం లో కొంచెం కామెడీ గా చెబుతారన్న మాట అది విషయం , ఇక మీరు చెప్పినట్లు లోక్యం అనేది ముఖ్యం !

వేణురాం గారు Thank you ! కామెంట్ పెట్టినవాడిదే బ్లాగు అవుతుందా హ హ కొత్త సందేహం :)

హరేకృష్ణ గారు Thank you ! ప్రస్తుతానికి రెండు బాగాలు ఉన్నాయి , సాఫ్ట్ కాపీ దొరకక పోవచ్చు , వీలయితే చదవటానికి ప్రయత్నిచండి మీకు నచ్చుతుంది .

Sravya V said...

మంచు గారు thank you , ఇంకొన్ని మీకు నచ్చే సిద్ధాంతాలు ఉంటాయి ఒకసారి రాంబాబు డైరీ లో తొంగి చూడటానికి ప్రయత్నం చేయండి ;D

వేణు గారు Thank you మీరు నచ్చుతుంది , చదివాకా మీ అభిప్రాయం చెప్పండి .

ఆకాశరామన్న గారు Thank you ! ఇంకెందుకు ఆలస్యం ప్రతిపాదించేయండి మేము వినపెడతాం :D

Bhardwaj Velamakanni said...

LOL Sravya


and Thank you!

మురళి said...

సీరియల్గా వచ్చిన రోజుల్లో కొన్ని భాగాలు చదివానండీ.. పుస్తకం చదవలేదు.. తన ఉద్యోగాన్ని గురించి అందరికీ గొప్పగా చెప్పుకోవడం అన్నీ గుర్తొచ్చాయి మీ టపా చూడగానే..

Vinay Datta said...

Really I feel like reading the novel, you made me feel that way.

madhuri.

Sravya V said...

@భరద్వాజ్ గారు Thank you !
@మురళి గారు హ్మ్ ! నాకు మహా సంతోషం గా ఉంది , మీరు మిస్సయిన పుస్తకం నేను పరిచయం చేయటం :) అలాగే మీరు చదివిన భాగాలు ఈ పోస్టు ద్వారా మీకు గుర్తు చేసినందుకు . ధన్యవాదాలు !
@ మాధురి గారు ధన్యవాదాలు !

సుజాత వేల్పూరి said...

ఈ పుస్తకాన్ని నేనొక సుదీర్ఘ రైలు ప్రయాణంలో చదివాను. పదేళ్ళ క్రితం. మూడో భాగం కూడా వచ్చింది కదా! అది చదవలేదా?

ఈ పుస్తకాన్ని మీరు ఒక టపాలో పూర్తి చేయలేరు:-))

రాంబాబు "అనువాదాల" గురించే రెండు పోస్టులు రాయాలి. బెజవాడ గోపాల రెడ్డిని విజయవాడ గోపాల రెడ్డిగా రాయడం, మదర్ డైరీని తల్లి పాల కేంద్రం అని రాయడం, ఓవర్సీస్ బాంక్ ని సముద్రాల మీది బాంక్ గా రాయడం ఇవన్నీ నవ్వు ఆపుకోనివ్వవు.

మరదలు ఎర్ర మందారం తెల్ల మందారం మొక్కలు నాటుతుంటే "భక్త మందార, ఆశ్రిత మందార మొక్కలు దొరకలేదా" అని రాంబాబు అడగడం హైలైట్!

మీరంతా షాపింగ్ కి వెళ్తే నేను మార్కెటింగ్ కి వెళ్ళాను. మోండా మార్కెటింగ్ కి అని చెప్పడం!
డైరీలో పేజీ చివర్లో "ఓం మంగళం మహత్" అని రాయడం!

ఇవన్నీ కూడా బాగా నవ్విస్తాయి. నం పా సా గారి హాస్యం చాలా పదునుగా ఉంటుంది. ఇది ఆంధ్ర ప్రభ డైలీలో సీరియల్ గా వచ్చిన గుర్తు. మూడో భాగం పెద్ద గొప్పగా ఏమీ లేదు. వీలైతే ఆయన రాసిన "కార్ఖానాఖ్యము" చదవండి. అలాగే "సాహిత్య హింసావలోకనం" కూడా!

Sravya V said...

సుజాత గారు ముందు గా ధన్యవాదాలు ! ఐతే మూడో భాగం కూడా వచ్చిందా ? తెలియదండి నాకు . మూడు భాగం అంట బాగా లేదు అంటే నాకు బారిస్టర్ పార్వతీశం గుర్తుకు వస్తుంది . అందుకో మొక్కపాటి వారు చెబుతారు కదా పార్వతీశం అమాయకత్వం ఉన్నంత వరకు అందరికి నచ్చుతుంది , లోకజ్ఞానం పెరిగిన అంతగా నచ్చదు అని అలా రాంబాబు కూడా మారిపోతే కష్టం , అదే కారణం అంటారా ? ఏమైనా అది కూడా చదవాలి .
"కార్ఖానాఖ్యము", "సాహిత్య హింసావలోకనం" కూడా నండూరి గారివేనా ? ఐతే తప్పనిసరి గా చదువుతాను .
మీరు చెప్పినట్లు ఈ పుస్తకం గురించి ఒక పోస్టులో చెప్పలేండి , మొదటి భాగం ఐతే నేను ఇప్పటి కి సార్లు చదివినా , చదివిన ప్రతిసారి చాలా ఎంజాయ్ చేస్తాను :)

సుజాత వేల్పూరి said...

శ్రావ్య,
మూడో భాగంలో రాంబాబు పార్వతీశంలాగా మారడు కానీ అదే రకం అమాయకత్వం,వెర్రి వైఖరి ప్రతి సన్నివేశంలోనూ పదే పదే వెలగబెట్టేస్తుంటాడు. రెండో భాగమే మళ్ళీ చదివిన ఫీలింగ్ వస్తుంది. అందువల్ల విసుగనిపిస్తుంది! మొదటి భాగం అల్టిమేట్!

Sravya V said...

ఓహ్ అలా అంటారా ! మొదటి భాగం మాత్రం నిజం గా సూపరండి !

Ennela said...

తల క్రాఫింగ్ చేసే వారు గోరిగే వాడిది తల అని వాదించరు అని గ్యారెంటి ఏమిటి ?.. బాబోయ్!!!
కొత్త బ్లాగు అని వ్రాసారు..అది ఎక్కడ?
మాలికకి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Sravya V said...

హ హ అవునేమో అని రాంబాబు తో పాటు నా సందేహం కూడా నండి:)))))

కొత్త బ్లాగులో మీరు కామెంట్ కూడా పెట్టారు మర్చిపోయారా లింక్ ఇక్కడ
Http://sravyav20202.blogspot.com

buddhamurali said...

బాగుందండి . ఇతరుల డైరీ చదవ వద్దు కానీ నేను మాత్రం రాంబాబు డైరీ చదివేశాను . మీ పోస్ట్ లో చిక్కడపల్లి లైబ్రరీ ప్రస్తావన నన్ను ఎక్కడికో తీసుకు వెళ్ళింది ౧౯౮౬ వరకు దాదాపుగా రోజు వెళ్ళే వాళ్ళం. మిత్రులం కలవాలన్న అదే మాకు సెంటర్ .

Sravya V said...

హ హ మురళి గారు రాంబాబు డైరీ మనందరి కోసం కదా అందుకే చదవొచ్చు :)))
Thanks you !

Sravya V said...

చాణుక్య ఇది తప్పక చదవాల్సిన పుస్తకం . గారెలు బుట్టలో పడితే మీరు సింగపూర్ ఎందుకు హాయి ఏ అమెరికా నో , యురోపో కోరుకోవాలి కాని :)

మూడు నెలలనుంచి రాయకపోవటానికి బిజీ అని పైకి చెప్పుకొనే బద్ధకం కాక వేరే కారణాలు ఏమి లేవు :))) ఐతే నాకు ఒక రెగ్యులర్ పాఠకుడు దొరికారన్న మాట , హ హ Thank you !

MURALI said...

బావుంది. వేరే వాళ్ళ డైరీ చదవటం సభ్యత కాదనుకున్నా. మీరు చెప్పారుగా చదివేద్దాం.

Sravya V said...

మురళి గారు తప్పకుండా చదివేయండి , మీరు గారెంటీ గా ఎంజాయ్ చేస్తారు :))))

Anonymous said...

ఈ పుస్తకంలో కొంత భాగమో, పరిచయమో హాసం(హాస్య-సంగీత పత్రిక)లో వచ్చిన గుర్తు. ప్రింటులో ఉందా?ఎక్కడ దొరుకుతుంది?
ఇవన్నీ సరే గానీ మీ బ్లాగు బావుంది. మీపై మరో బ్లాగులో బురద చల్లడానికి ప్రయత్నించిన వారిని మీ ఏరియాలో ఉతికి ఆరెయ్యడం మరీ బాగుంది(గత పోస్టులో).

Sravya V said...

పక్కంటి అబ్బాయి గారు అవును సీరియల్ గా వచ్చిందంటండి, పైన మురళి గారు కామెంట్ లో చెప్పారు , నేను మాత్రం మొత్తం పుస్తకం గానే చదివాను మొదటి రెండు భాగాలు , మూడో భాగం చదవలేదు . విశాలాంద్ర లో దొరుకుతుందండి ఈ పుస్తకం !

Thank you very much !

Post a Comment