Subscribe:

Wednesday, December 28, 2011

బెర్రీలమ్మ బెర్రీలు రక రకాల బెర్రీలు !

మొన్నొక రోజు తృష్ణ గారి plus లో ఒక రకం పండ్లు (fruits ) ఫోటో పెట్టి ఇవేంటో  చెప్పుకోండి అన్నారు . అంతే ఇక ఒకరి తో ఒకరం సంభంధం లేకుండా మాకు దొరికిన లింకుల తో సహా రక రకాల పేర్లు చెప్పేసాం . అంటె అదుగో ఆ పల్నాడు వీర బ్రదర్స్ ఇద్దరూ ఒకే పేరు చెప్పారు లెండి వాళ్ళిద్దరూ కాకుండా మిగిలిన వాళ్ళం అన్న మాట .
ఇక ఆ పోస్టు చూసిన దగ్గర నుంచి ఏదో ఒక రకం గా క్లాస్ తీసుకోవాలి అన్న దురద విపరీతం గా పెరిగిపోయి ఇదుగో ఈ రూపం లో మీ ప్రాణాలు తీసుకోబోతుందన్న మాట :)
సరే ఇక పిట్ట కథలు ఆపేసి అసలు కథ లోకి వద్దాం నేను నేను బెర్రీ పళ్ళ గురించి ఈ పోస్టు రాస్తునన్నమాట . అసలు   బెర్రీ అంతె ఎంతంతే అది ఒకటి లేదా బోలెడు గింజలు కలిగిన గుజ్జు ఫలం అన్నమాట . (ఈ వాక్యం లో నేను రాసిన పదాలు నా శతకోటి టైపోలలో ఇవి కూడా కొన్ని అని ఫిక్స్ అయిన వారు ఇక్కడ చూడ ప్రార్ధన ) .చా మరీ ఎక్కువ కామెడీ చేస్తే అది కాస్త వికటించి అసలకే మోసం వచ్చే ప్రమాదం ఉంది అందుకే కాసేపు మనందరం సీరియస్ నెస్ పాటిద్దాం .
పైన చెప్పినట్లు బెర్రీ అనేది పండ్ల లో ఒక రకం . ఈ పండ్ల సాధారణ లక్షణం జ్యుసీ గా ఉండటం , తినలేనటువంటి గింజలు లేకపోవటం . ఇప్పుడు మనం అన్నీ కాకపోయినా, కొన్ని రకాల బెర్రీ పండ్ల గురించి తెలుసుకుందాం .


Blackberries

బ్లాక్ బెర్రీస్ (Blackberries)

: (ఏయ్ ఎవరిది ఇది ఫోన్ అనే వాళ్ళు :P)   ఇవి పచ్చి గా ఉన్నప్పుడు రెడ్ ఒక రకమైన రెడ్ కలర్ ఉండి, పండి తినటానికి రెడీ అయినాయి మనకి అని చెప్పటానికి బ్లాక్ కలర్ (చిక్కని పర్పుల్ ) కలర్ లో మారి జ్యుసీ గా మెరుస్తుంటాయి .

Raspberries

రాస్బెర్రీస్(Raspberries) : రాస్బెర్రి , బ్లాక్ బెర్రీ చూడటానికి ఒకే రకం గా ఉన్నా రాస్బెర్రీ పండు మధ్య లో ఖాళీ గా ఉంటుంది . అలాగే మామూలు గా బెర్రీ లలో ఉండే విటమిన్ సి తో పాటు వీటిలో మెగ్నీషియం అధికం గా ఉంటుంది . వీటి ని భారీ ఎత్తు న సాగుచేయాలి అన్న ప్రయత్నాలు ఫలించకపోవటం తో మిగిలిన బెర్రీ లతో పోల్చితే మార్కెట్ లో తక్కువ గా దొరుకుతాయి అందుకే రేటు కూడా అధికం .

Boysenberryబోయ్సేన్బెర్రి (Boysenberry) : ఇవి బాగా చిక్కని మెరూన్ కలర్ లో ఉంటాయి . ఈ బెర్రీ రాస్బెర్రెస్ , బ్లాక్ బెర్రీస్ , లంగాన్ బెర్రీస్ ల క్రాస్ సెక్షన్ తో ఏర్పడిన హైబ్రిడ్. మిగిలిన వాటితో పోల్చితే ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ తో ఉంటాయి .

Cloudberries
క్లౌడ్బెర్రీస్(Cloudberries) : ఇవి బ్రౌన్ కలర్ లో ఉండే బుల్లి బుల్లి బెర్రీలన్న మాట . వీటిలో విటమిన్ సి తో పాటు గా benzoic acids ఉండటం తో నాచురం preservative గా ఉపయోగపడతాయి .
Mulberries
మల్బెర్రీస్ (Mulberries) : ఇవి మనకు బాగా తెలుసు కదా , ఈ చెట్టు ఆకులు పట్టు పురుగుల కోసం అయితే పళ్ళు మాత్రం మన పొట్ట కోసం అన్న మాట .
స్ట్రాబెర్రీస్(Strawberries ) : ఇవి జగమెరిన బెర్రీలన్న మాట , అంటే తెగ ఫేమస్ . మంచి రుచి తో ప్రపంచమంతా దొరికే ఈ బెర్రీ లలో విటమిన్ సి తో పాటు మాంగనీస్ , ఫోలిక్ యాసిడ్ అధికం గా ఉంటాయి .

Strawberries

 
పైన చూసిన కొన్ని aggregate ( in which one flower contains several ovaries ), multiple (fruits that are formed from a cluster of flowers) బెర్రీ లతో పాటు Tayberries, Logan berreis బొమ్మల్లో చూడండి .

Loganberries
   
Tayberries

ఇప్పుడు కొన్ని సింపుల్(A fruit that develops from a single ovary in a single flower) బెర్రీలు ఎలా ఉంటాయో చూద్దాం .


 
Blue Berry

బ్లూ బెర్రీస్ (Blueberries) : బ్లూ బెర్రీస్ లో flavonoid antioxidants ఎక్కువ గా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు . అందులో ఎంత నిజం ఉందొ మన డాక్టరు బ్లాగర్లు కౌటిల్య గారు లేదా శైలజ గారు గాని confirm చేస్తారేమో చూద్దాం .

Gooseberries
Gooseberries: ఈ పేరు వినగానే మన ఉసిరి కాయ అని confuse   అవుతాం కాని Gooseberries,  Indian Gooseberries  వేరు వేరు అన్న మాట .
Blackcurrant
Blackcurrant & Red Currants :  బ్లూ బెర్రీస్ లాగా ఇవి బాగా ఫేమస్ బెర్రీలు అన్న మాట , వీటిలో విటమిన్ సి తో పాటు  high levels of potassium, phosphorous, iron and Vitamin B5 ఉంటాయి .

RedcurrantCranberries
Cranberries: ఇవి బుల్లి బుల్లి ఎర్ర గా ఉండే బెర్రీలన్న మాట . పచ్చి గా ఉన్నపుడు తెల్ల గా ఉంటాయి , పండినా ఎర్ర గా అవుతాయి . వీటిని మామూలు గా తినలేము కాని కాన్బెర్రే రైస్ , లేదా మన రోటి పచ్చడి లాగానో   , లేదా జ్యూస్ గానో  ఐతే బాగా లాగించోచ్చు .
.

ఇప్పుడ మనందరికీ బాగా తెలిసిన రెండు రకాల బెర్రీలు వీటి పేర్లు నేను చెప్పా , మీరే చెప్పేయాలి

ఇవండీ నాకు తెలిసిన కొన్ని బెర్రీలు . విటమిన్ సి , ఇంకా antioxidant లు ఎక్కువ గా ఉన్న ఈ బెర్రీ పళ్ళని తిని ఆనందించండి . అలాగే మీకేమన్నా doubts ఉంటె మన మొక్కల డాక్టరు మధుర , మామూలు డాకర్లు శైలజ గారు , కౌటిల్య గార్ల ని సంప్రదించండి .
ఏదో అమెరికా లో , యూరోప్ లలో ఉన్న వాళ్ళు అంత స్టైల్ గా మనం  "We are going for summer berrying"
అని చెప్పలేకపోయినా మార్కెట్ కెళ్ళి కొనుక్కొని సంతోష పడొచ్చు ఏమంటారు , మరి ఇంకెందుకు ఆలస్యం కానివ్వండి :)
42 comments :

SHANKAR.S said...

"ఇప్పుడ మనందరికీ బాగా తెలిసిన రెండు రకాల బెర్రీలు వీటి పేర్లు నేను చెప్పా , మీరే చెప్పేయాలి "

tomato berries, grape berries :))))) (ఏంటండీ ఏమన్నా తప్పు చెప్పానా)

లత said...

చాలా రకాల బెర్రీలు చూపించారు, భలే ఉన్నాయండి

చిలమకూరు విజయమోహన్ said...

మాకందుబాటులోలేని బెర్రీలను చూపించి ఇలా ఊరించడం మీకు భావ్యమేనా? :)

Anuradha said...

మార్కెట్ కెళ్ళి కొనుక్కొని సంతోష పడొచ్చు ఏమంటారు
---------------------------------------
Indian Market లో ఈ బెర్రీస్ అన్నీ దొరకవు కదండి.

Surya said...

మా పల్లెటూర్లో ఎర్ర అల్లిపళ్ళు, నల్ల అల్లి పళ్ళు, వాక పళ్ళు, పరింపళ్ళు అంటూ చిన్నప్పుడు సోలల లెక్కన అమ్మేవాళ్ళు. వాటి ఇంగ్లీషు అన్నదమ్ములు పై ఫొటోల్లో ఒకళ్ళిద్దరు ఉన్నట్టుగా అనిపిస్తోంది

Surya said...

మా పల్లెటూర్లో ఎర్ర అల్లిపళ్ళు, నల్ల అల్లి పళ్ళు, వాక పళ్ళు, పరింపళ్ళు అంటూ చిన్నప్పుడు సోలల లెక్కన అమ్మేవాళ్ళు. వాటి ఇంగ్లీషు అన్నదమ్ములు పై ఫొటోల్లో ఒకళ్ళిద్దరు ఉన్నట్టుగా అనిపిస్తోంది

తృష్ణ said...

ఇప్పటికింకా నాకు తెలీని సంగతేంటంటే నే పెట్టిన ఫోటోలోవి బ్లాక్ బెర్రీలా? మల్బెర్రీలా? అని... :((((

శేఖర్ (Sekhar) said...

ఇలా ఊరించటం భావ్యమా....కాని ఇన్ని రకాలు ఉన్నాయ్ అని ఇప్పుడే తెలిసింది ....good research
happy berries

సుజాత said...

శంకర్ గారు చెప్పిన టొమాటో బెర్రీలు మా ఇంట్లో కాశాయి కొన్నాళ్ళు. అవన్నీ కలిపి పచ్చడి చేయాలని అనుకుంటూనే ఎప్పటికప్పుడు ఎర్రగా పండిన వాటిని చూసి నొరూరి హాం ఫట్ చేశాం:-)

ఆ బ్లాక్ కరెంట్ ఏంటి మన వైపు దొరికే జాన పళ్ళు గుర్తొస్తున్నాయ్?

గూస్ బెర్రీస్ చూస్తేనేమో బుడమకాయలు (పొలం గట్ల మీద పెరిగేవి) గుర్తొస్తున్నాయి.

మొత్తానికి శ్రావ్య పోస్టు ఇవాళ యమీ యమీగా ఉంది.

కొత్త టెంప్లేట్ చాలా బాగుంది.(girly గా) బాటిల్ గ్రీన్ అంటారనుకుంటా ఈ రంగుని!

Chandu S said...

శ్రావ్య గారూ,
బొమ్మలు బాగున్నాయి. మధ్యలో వీడియో ఒక సర్ప్రైజ్. చివర్లో నా పేరు సజెస్ట్ చేసినందుకు థాంక్స్.

షరా: ఫీజు తెచ్చుకోగలిగిన వారే, బుర్రలో డౌట్లు తెచ్చుకోమని ప్రార్ధన.

Sravya Vattikuti said...

@ శంకర్ గారు మీరు కరెక్టు గా చెప్పేశారు :-)
@ లత గారు మీకు నచ్చినందుకు హ్యాపీ గా ఉందండి.
@విజయ్ మోహన్ గారు ఇప్పుడు కొన్ని రకాలు మన హైద్ లో కూడా దొరుకుతున్నాయండి . ఇవి మరీ పెరిషబుల్ అండి, లేకపోతే నేనే పంపిద్దును ఇక్కడ నుంచి కనీసం కొన్ని రకలన్నా:( థాంక్ యు !
@ అను గారు నిజమే నండి అన్ని రకాలు దొరకవు :(.

Sravya Vattikuti said...

@సూర్య గారు ఉహు కాదండి అవి బెర్రీలు కాదండి , కొంచెం రేగి పండ్లకి దగ్గరలో ఉంటాయి కదా వాటిని drupes అంటారు .
@తృష్ణ గారు అవి మల్బెర్రి నే నండి :)
@శేఖర్ గారు నోరు ఊరుతుందా , బెంగుళూర్ లో దొరకోచ్చేమో కదా కొన్ని రకాలు ట్రై చేయండి మరి :)

Sravya Vattikuti said...

@సుజాత గారు ఐతే మీరు చెర్రీ టమోటా లు పెంచారా , హ్మ్ ఐతే అవి స్నాక్స్ గానే కరెక్టు లెండి , నేను కొని మరీ వాటిని స్నాక్స్ గా వాడతాను :) ఈ జాన పళ్ళు నేను ఇప్పుడే వింటున్నానండి తెలియదు మరి . గూస్ బెర్రీ అవుతునండి చూడటానికి కొంచెం అలానే ఉంటాయి కాని taste కొంచెం వేరే ఉంటుంది . పోస్ట్ యమ్మీ యమ్మీ గా ఉందంటారా థాంక్స్ ఇంకా టెంప్లేట్ నచ్చినందుకు కూడా :))

Sravya Vattikuti said...

శైలజ గారు వీడియో? ఎక్కడండి ? అర్ధం కాలేదు :((
హ హ ఐతే ఫీజు తప్పదంటారు హ హ హ :)))

Chandu S said...

(ఈ వాక్యం లో నేను రాసిన పదాలు నా శతకోటి టైపోలలో ఇవి కూడా కొన్ని అని ఫిక్స్ అయిన వారు ఇక్కడ చూడ ప్రార్ధన )

'ఇక్కడ' అన్న చోట ఎ వి ఎస్ ( మిష్టర్ పెళ్లాం) వీడియో వచ్చిందే

Sravya Vattikuti said...

ఓహ్ అర్ధం అయ్యింది శైలజ గారు , నేను ఇచ్చిన లింక్ గురించా Thank you :)

హరే కృష్ణ said...

బావున్నాయి
మల్టీ టాస్కింగ్ blackberry లేదా :)

కృష్ణప్రియ said...

మన దేశం లో దొరికే రేగు పళ్ళు, గంగ రేగు పళ్ళు కూడా ఒక రకమైన బెర్రీ లే కదా? హిందీ లో బేర్ అంటారు కాబట్టి ఇండియన్ బెర్రీలు అనుకుంటున్నాను. ఇప్పటిదాకా.

మధురవాణి said...

బాగుంది మీ బెర్రీల పాఠం.. పుల్లపుల్లగా తియ్యతియ్యగా.. :)
నాకు ఈ రకరకాల బెర్రీలన్నీ ఇక్కడికొచ్చాకే తెలిసాయి కాబట్టి చాలావాటి పేర్లు ఇంగ్లీషులో తెలీదు కానీ జర్మన్ లో మాత్రం తెలుసు. :))
ఇంతకీ Blackberries కి Boysenberries కి నాకు తేడా తెలుసా అని అప్పటినుంచీ తీవ్రంగా ఆలోచిస్తున్నాను. :D

వేణూ శ్రీకాంత్ said...

ఆహా మేడం.. ఏం చెప్పారండి..
what a post what a post..
What an information..
అసలు అందరి సందేహాలూ తీర్చేలా ఇలా బెర్రీలన్నీ ఒకచోట కూర్చాలన్న మీ ఐడియా ఉంది చూశారూ.. అబ్బో.. what an idea what an idea
(వీడికేమైంది అని అలా చూడకండి మీరిచిన్న క్లిప్ లో ధర్మవరపు ని గుర్తుతెచ్చుకోండి:D)

వేణూ శ్రీకాంత్ said...

BTW Template chaala baagundi :-)

కొత్తావకాయ said...

బాగున్నాయండీ. :)

Sravya Vattikuti said...

@హరేకృష్ణ ఉంది ఉంది దాంతో పాటు గా యాపిల్ కూడా ఉంది :)
@కృష్ణప్రియ గారు బెర్రీ పండు లో గట్టి గా గింజలు ఉండకూడదన్న మాట అందుకని రేగుపళ్ళు బెర్రీ జాతి కాదు ఇవి drupes కేటగిరీ లోకి వస్తాయి .
@మధుర :) వీటి రెంటిని ఈజీ గా గుర్తు పట్టటానికి ఒక బండ గుర్తుంది , అది బోయ్సేన్బెర్రీస్ కి రాస్ప్బెర్రీస్ లాగా మధ్య లో ఖాళీ ఉంటుంది , బ్లాక్ బెర్రీస్ అది ఇల్లె అది విషయం :))
@వేణు గారు గారు భలే ఉంది మీ కామెంట్ అచ్చు ధర్మవరం స్టైల్లో :))
@కోవా గారు థాంకులు థాంకులు :))

Rao S Lakkaraju said...

బెర్రీల సమీక్ష చాలా బాగుంది. థాంక్స్.

Bhardwaj Velamakanni said...

Nice ones ..

GRRRRRRRRR for not sending them across

sunita said...

నా కామెంట్ ఎగిరిపోయింది శ్రావ్యా!పోస్ట్ బెర్రీ లంత బాగుంది. ఇన్నిట్లో నా ఫావ్ బ్లూ బెర్రీస్.యోగర్ట్ ఐనా ఐసుక్రీమైనా! ఫ్రెష్ వి దొరికినప్పుడు పండగ, మామూలుగా ఫ్రోజన్ తెచ్చుకుంటా! నవ్వకూ,నేను క్రాంబెర్రీలతో కలపాటం పప్పు వండేదాన్ని:)))

శ్రీనివాస్ పప్పు said...

ఇలా చూపించి నోరూరించండం ఏంబాలేదు శ్రావ్స్,కొన్ని పార్సిల్ ప్లీజ్

Sravya Vattikuti said...

@రావు గారు థాంక్ యు :))
@భరద్వాజ్ గారు ఇది అసలైన అన్యాయం, మీకే కదా బోలెడు దొరుకుతాయి సో మీరు కదా పంపాల్సింది :)))
@ఓహ్ సునీత గారు ఐతే మీకు బ్లూ బెర్రీ ఇష్టమా , నాకు కూడా ఇష్టమే ఎంతైనా సూపర్ ఫ్రూట్ కదా :)))
@పప్పు సారూ అలాగలాగే :)))

జయ said...

With all these Berries I wish you a very happy new year.

Sravya Vattikuti said...

జయ గారు థాంక్స్ అండీ ! మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు !

Rao S Lakkaraju said...

శ్రావ్య గారూ Wish you the best in year 2012.

Sravya Vattikuti said...

రావు గారు థాంక్ యు ! మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు !

చైతన్య.ఎస్ said...

పోస్ట్ బాగుంది. అన్నట్టు బెర్రీస్ కొనుక్కొటానికి కాస్త డబ్బు ట్రాన్స్ ఫర్ చెయ్యాల్సిందిగా మనవి .. :)

Sravya Vattikuti said...

చైతన్య గారు డబ్బే కదా అలాగలాగే :)) అవును ఎక్కడా కనపడటం లేరు అంతా బాగేనా ?

రాజ్ కుమార్ said...

వామ్మో.. ఇన్ని రకాల బెఱీలు తినేశారా మీరూ.. ;)
నేను స్ట్రాబెఱీ ఒక్కటే తిన్నా..నాకు నచ్చలేద్..;(

టేస్ట్ ఎలా ఉన్నాగానీ అండీ.. మీరు ఫెట్టినఫోటోలు సూపర్ గా ఉన్నాయ్.. ;)కొనుక్కొనో కొట్టుకొచ్చో తినేయాలనిపించేలా ;)

Sravya Vattikuti said...

హ హ రాజ్ కొట్టుకొచ్చి తినేయండి ఇంకా బావుంటాయి నాదే గారెంటీ :))
స్ట్రాబెర్రీ నచ్చలేదా హ్మ్ అదేంటి ? ఈ సారి milkshake లాగా ట్రై చేయండి తప్పక నచ్చుతుంది !

kiran said...

శ్రావ్య గారు....
నేను చూసింది ఒక్క strawberry ....మీరేంటో ఇన్ని రకాలు చెప్పేసారు..
colorful గా భలే ఉన్నాయి..... :D ..
మీరు మళ్లీ...ఇప్పుడు ఏ ఫ్రూట్ లో ఏముంది అంటే నేను చెప్పలేను...:)

Sravya Vattikuti said...

హ హ కిరణ్ దీనికి కూడా ఎక్షామ్ పెడతా అనుకున్నారా ? :))) థాంక్ యు !

జయ said...

సంక్రాంతి వచ్చినా ఇంకా బెర్రీలేనా:) అయితే, మీకు బెర్రీలతో సంక్రాంతి శుభాకాంక్షలు.

Sravya Vattikuti said...

జయ గారు హ హ ఇప్పుడే కొత్త పొస్టు పబ్లిష్ చేసానండి :))
Thank you very much for you wishes, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు !

రసజ్ఞ said...

బెర్రీ లోయ్ అంటే ఇస్తారేమో అనుకున్నా చూపించి ఊరించటమేనా ;) నాకు బ్లూ బెర్రీస్ అంటే పిచ్చి ఎంత అంటే అవి ఎవరయినా కొనిపెడితే వాళ్ళు నా దృష్టిలో చాలా మంచోల్లనమాట :)

Sravya Vattikuti said...

హ హ రసజ్ఞ గారు అయితే చెప్పండి ఎన్ని కేజీలు కొనమంటారు నేను రెడీ :)))

Post a Comment