కొంతమంది వ్యక్తులతో మనకు ఎటువంటి రక్త సంబంధం ఉండకపోవచ్చు కానీ సడన్ గా తళుక్కున మెరిసి మన జీవితం లో మంచి మలుపు కి మాత్రం కారణం అవుతారు . ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి ఒక్కరి జీవితం లో కనీసం ఒక్కరన్నా అలా గుర్తుకొస్తారు అని నాకు గట్టి నమ్మకం . . అలా వెనక్కి తిరిగి చూసుకుంటే నేను తప్పని సరి గా గుర్తు చేసుకోవాల్సిన వారు శ్రీ జయచంద్ర IPS . వీరి దగ్గర నేను దాదాపు ఒక సంవత్సర కాలం పని చేసాను .
వీరి గురించి కొన్ని వివరాలు
Education : | M.Sc, (Nuclear Physics) | |
M.Phil, MBA (HRD) |
Awards | Police Medal for meritorious services | |
President's Police Medal for Distinguished services | ||
Indira Gandhi National Award for Outstanding Services | ||
Indian Medical Association (IMA) Award for Outstanding Services వీరి పూర్తి బయోడేటా ని ఇక్కడ చూడొచ్చు . |
దేశం లోని అత్యున్నత సర్వీసు లో పని చేసిన వీరి గురించి నేను ప్రత్యేకం గా చెప్పవలసిన పని లేదు కానీ, వారిని చూసి నేను నేర్చుకున్నా , తెలుసుకున్న విషయాలు మాత్రం బోలెడు , వాటిని పంచుకుందామనే ఈ ప్రయత్నం ....
సాధారణం గా మనలో చాలా మంది కి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావటం అంటే పడి పడి చదవటం , లేదా బోలెడు రిఫెరెన్సు పుస్తకాలు సంపాదించటం , అది వ్రాత పరీక్ష ఐతే నేరుకున్న దాన్ని సరిగా ప్రెజెంట్ చేయగలుతున్నామా అని చెక్ చేసుకోవటం, ఇంకా ఓపిక ఉంటె మాక్ టెస్టులు అటెండ్ అవటం ఇలా చేస్తాం కదా ? వీరి దగ్గర నేను నేర్చుకున్నది , మనకి ఒక సబ్జెక్టు కి సంబంధించిన ఎక్షామ్ ఏ సమయం లో ఉంటుందో ఆ సమయం లో అదే విధం గా పరీక్షలకి కొంచెం ముందు నుంచి ప్రిపేర్ అవ్వడం . దీని వల్ల మనకి తెలియకుండానే మన బ్రెయిన్ షెడ్యూల్ అవుతుంది , దానితో మంచి result కి అవకాశం ఉంటుంది
ఈ టిప్ నేను ఇప్పటికి ఫాలో అవుతాను . ఒకవేళ క్లైంట్ కి ఒక పర్టిక్యులర్ టైం లో రన్ అవ్వవలసిన schedules ఉంటె కరెక్టు గా ఆ షెడ్యూల్ టైం కి కనీసం ఒక్క సారన్న టెస్ట్ రన్ చేయకుండా రిలీజ్ చేసే ప్రసక్తే లేదు :)
ఇలా నన్ను ఆశ్చర్య పరచిన కొన్ని విషయాలు
- హాబీ గా వెబ్ designing చేయటం .
- ఎంతో ఓపికగా టెక్నికల్ టిప్స్ వివరించటం .
- ఈ సివిల్ సర్వీస్ లో ఉండే వారికి మరి ఆ ఎనర్జీ ఎలా వస్తుందో కానీ లాంగ్ hours వర్క్ చేసినా సరే అదే ఎనర్జీ తో ఉన్నారు . మరి అది ఎలా సాధ్యం వాళ్ళే చెప్పాలి .
- అంత బిజీ లైఫ్ లో ఉండి కూడా విష్ణు సహస్రం ని అర్ధం తో సహా తెనిగించడం .
- ఇక భక్తి విషయం లో నాకు తెలిసినప్పటి నుంచి కార్తీక మాసం మొత్తం ఉపవాసం చేస్తారు .
- పదవులతో తో సంబంధం లేకుండా టాలెంట్ ని గుర్తించి ఎంకరేజ్ చేయటం .
ఇలా చెబుతూ ఉంటె ఈ లిస్టు చాలా పొడవుతుంది కాబట్టి , ఇక్కడి తో సరిపెడతాను .
నాతో సహా ఎందరికో స్పూర్తినిచ్చిన జయచంద్ర గారు గత నెలాఖరున డీజీపీ గా పదవీ విరమణ చేశారు. పదవులతో నిమిత్తం లేకుండా వారు అందించే స్ఫూర్తి మరెందరికో అందాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...
( నెమలికన్ను మురళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు )
31 comments :
బాగా రాశారండీ..
జయచంద్ర గారికి శుభాకాంక్షలు కొంచేమ్ ఆలస్యం గా..
పదవీ విరమణ సంధర్భంగా జయచంద్ర గారికి శుభాభినందనలు.... వారు ఇలాగే మరెందరో యువతకు స్ఫూర్తిప్రదాత కావాలని మనసారా కోరుకుంటున్నాను.
హ్మ్, అదేదో సినిమాలో లాగా విదేశాల్లో సాఫ్ట్ గా జీవిస్తున్న మీ గతజీవితంలో, మీ పేరు చెప్తేనే పిట్టలు ఎగరటం ఆపేసి, చేపలు ఈదడం ఆపేసి, పశువులు మేయటం ఆపేసి, కొందరు కామెంట్లు పెట్టటం ఆపేసేంత భయపెట్టే బాక్ గ్రౌండ్ ఉందని ఏనాడో అనుమానం వచ్చింది శ్రావ్యా గారూ.
అది నిజమే అని ఈరోజు తెలిసింది.
భారతదేశంలో ఉన్న రియల్ క్రీమీ లేయర్ టాలెంటెడ్ స్టఫ్ కి, నిలువెత్తు ఉదాహరణ, మీరు పైన ఉదహరించిన జయచంద్ర గారి లాంటి వాళ్ళు.
God bless him and his family, with healthy and peaceful retired life.
శ్రీ జయచంద్ర IPS గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు.
వారితో కలసి పని చేసే అదృష్టం మీకు దక్కినందుకు సంతోషం.
వారి గురించి, మీ అనుభవాలు కూడా సవివరం గా రాసినందుకు ధన్యవాదములు.
Nice Post.
--
Harsha
Inspiring post Sravya! I wish him a happy, healthy and peaceful retired life!
ఇంతకీ సంవత్సరం పాటు మీరేం నేర్చుకున్నారో, ఏమేం సాహసాలు చేసారో వివరంగా చెప్పొచ్చు కదా మాకు. :)
@ కుమార్ గారూ,
బాగా చెప్పారు. అసలు శ్రావ్య ప్రొఫైల్‌లో సాదా సీదా అమ్మాయని చెప్పడం ఎంత modesty నో కదా! ;)
మరిచిపోయాను.. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు..
నా మీద ఏ కేసూ పెట్టకండి ;)
ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి ఒక్కరి జీవితం లో కనీసం ఒక్కరన్నా అలా గుర్తుకొస్తారు
-------------------------
వాళ్ళ మూలానే కదా మనము ముందుకు ఈదేది. జయచంద్ర గారి మీద చక్కటి వ్యాసం.
ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.... జయచంద్రగారికి పదవీవిరమణ శుభాకాంక్షలు :)
హమ్మ్మయ్యా ఇప్పుడు నామీద కేసులు పెట్టరు ;)
మీ బ్లాగ్ టెంప్లేట్ భలే ఉందండీ :) నాకు సూపర్ గా నచ్చేసింది :) [ఇప్పుడు అస్సలు పెట్టరు ;) ]
@రాజ్ Thank you ! నేను పోస్టు లేట్ గా పెట్ట్టాను కాబట్టి మీరు కూడా లేట్ గా శుభాకాంక్షలు చెబుతున్నారు !
@వేణు గారు Thank you ! మరంత మందికి తప్పక స్పూర్తిని ఇవ్వాలి నేను కూడా మనసారా కోరుకుంటున్నాను .
కుమార్ గారు ఏంటి వీక్ ఎండ్ లో కూర్చొని బాగా పోకిరి , ఇంద్ర ఇల్లాంటి సినిమాలు చూసారా ఏంటి :-) భయపెట్టే బాక్ గ్రౌండ్ ఏమి లేదండి . కాకపొతే పూలతో పాటు వాటిని మాల గా అల్లటానికి వాడిన దారానికి కూడా సుగంధం అంటినట్లు ఇదుగోండి జయచంద్ర గారు , ఇంకా మీ లాంటి వారిని చూసి , లేదా దగ్గర గా గమనించటం ద్వారా వచ్చిన జ్ఞానమే .
Thank you very much !
@హర్ష నిజం గానే నాది అదృష్టమే అలాంటి వారి పరిచయం కలగటం ! Thank you !
@మధుర :-) అంత సాహసాలు ఏమి చేయలేదు , ఏదన్న ఉంటె ఈపాటికి ఊదర కొట్టేయక పోదునూ :-)) నిజం గానే సాదా సీదా అమ్మాయినే అది ఉన్న నిజం మోడెస్టీ లేదు పాడు లేదు . Thank you very much for your wishes !
@ రాజ్ హ హ :-))మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు !
@లక్క రాజు గారు అవునండి వాళ్ళ మూలానే కదా మనము ముందుకు ఈదేది, అందుకే అటువంటి వారిని ఎప్పటికి గుర్తు ఉంచుకోవాలనే ఈ ప్రయత్నం . Thank you Very much !
ఇందు మీ మీద అస్సలు పెట్టం :-))
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ! Thank you very much for your warm wishes !
జయచంద్ర గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. అయినా ఇలాంటి వారికి విరమణ ఉండదేమో అఫీషియల్ గానే విరమణ!
నీలాంటి వారిని ఇన్స్పైర్ చేయటం ఆయన గొప్పతనమయితే..అలాంటి వారిని చూసి ఇన్స్పైర్ అవటం నీ గొప్పతనం..keep it up!
శుభాకాంక్షలు చెప్పడానికి కూడా బెదిరింపులు అవసరమా చెప్పండి, మీరు మరీనూ !!
జయచంద్ర గారికి పదవి విరమణ శుభాకాంక్షలు.
గొప్ప వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
జయచంద్ర గారికి మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు :)
@నాగార్జున, హ హ అయితే భయపడ్డారా ? :-)
Thanks for the wishes !
@శ్రీకాంత్ గారు హ హ తెలుగు సినిమాలు తగ్గించండి :)))
Thank you very much !
చైతన్య థాంక్ యు ! మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు !
సిరిసిరిమువ్వ గారు అది నిజం, వారికి retirement అనేది offical అంతే !
Thank you very much for your wishes !
శ్రావ్యా, నీ పోస్ట్‌తో నన్నిక్కడ చాలా ఇన్స్పైర్ చేశేశావు.. చాలా ఉత్తేజితంగా అనిపిస్తోంది నీమీద ఆయన ప్రభావం చదువుతుంటే!! అంతటి ప్రతిభావంతుడి గురించి బయటవారికి అందరికీ తెలియని ఇంకొన్ని అబ్బురాలు తెలుసుకోవడం బావుంది..
జయచంద్ర గారినికి పదవీవిరమణ అభినందనలతో పాటు ఇంత చక్కని పరిచయాన్ని మాకందించినందుకు నీకు కృతజ్ఞతలు..
ఒక స్పూర్తి నిచ్చె వ్యక్థి గూర్చి చెప్పారు.థాంక్యు
జయచంద్ర గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు
నిషి , శశి గారు మీ ఇద్దరి విషెస్ కి ధన్యవాదాలు !
<>
Very much True Sravya. శ్రీ జయచంద్ర గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు.
So Sravya has some mafia background! Cool!!!
:p
చాలా బాగుంది శ్రావ్య గారూ! మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి గురించి తెలుసుకోవడం మాకూ బాగుంది.
శ్రీ జయచంద్ర గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు.
పద్మ ఉండవల్లి గారు Thank you for the wishes :-)
కోవా గారు ధన్యవాదాలు !
భరద్వాజ్ గారు మరే అన్నకి తగ్గ చెల్లి :P
ఒక్క టెక్నికల్ డౌటండి. డిజిపి దినేష్ రెడ్డిగారు పోయిన నెల ఏదో ప్రకటన చేశారని చాందస మూర్ఖ నాస్థికవాద తీతువాదులు అక్కడ ఇంకా హోరాహోరిగా మొరుగుతూనే వున్నారు, మీరేమో డిజిపి గా జయచంద్ర గారు పోయిన నెల పదవీ విరమణ అంటున్నారు!
1)ఇంతకీ డిజిపి దినేష్ రెడ్డిగారా లేదా జయచంద్ర గారా? ఒకరికన్నా ఎక్కువ డిజిపిలు వుంటారా?
2) ఈయన IPS అంటే పోలీస్ సర్వీసా? లేక పోస్టల్ సర్వీసా?
3) పోలీసు సర్వీస్ మెడల్ పోస్టల్ కిచ్చారా?! కాస్త కంఫ్యూజింగ్ గా వుందండి, ఇదెన్న విష్ణుమాయన్?! :)
శంకర్ గారు మన స్టేట్ లో కనీసం కనీసం 7 - 11 మంది DGP లు ఉంటారండి .
పోలీసు డిపార్టుమెంటు లో DGP అనేది highest cadre అందులోంచి సీనియర్ ఆఫీసర్ ని DG & IPG గా అప్పాయింట్మెంట్ చేస్తారు (కొన్ని సార్లు సీనియారిటీ కాకుండా వేరే విషయాలు కూడా దీన్లో కీ రోల్ ప్లే చేస్తాయి అది చాలా కొద్ది శాతం ) . ఆ పోస్టు టెక్నికల్ గా DG & IGP అయినప్పటికీ , మన మీడియా లో ఆంతా ఆ cadre తో నే రిఫర్ చేస్తుంటారు .
IPS అంటే ఇండియన్ పోలీసు సర్వీసే, మీరు డౌట్ పడాల్సిన పనేలేదు .
వాళ్ళని అదనపు డిజిపిలు అనాలేమో కదా. చీఫ్ సెకరెట్రీ, చీఫ్ మినిస్టర్, ప్రధాని, ఆర్మీ చీఫ్లలా, డిజిపి అంటే ఒక్కరే వుండాలి. మందెక్కువైతే మజ్జిగ పలుచబడినట్టు, ఇది అన్యాయం.
ఆయన తెనిగీకరించిన(అంటే ఆంధ్రీకరించిన, అంటే తెలగాణీకరించిన కాదు :) ) విష్ణు సహస్రనామం తో పోస్ట్ వేసి, ఇది రాసిందెవరో తెలుసా? అని చదువరులనడుగుతూ, ఇది అనువదించింది ఫలాన ... అంటూ ఆయన్ని పరిచయం చేసివుంటే వెరైటీగా వుండేది. తెలుగులో ఎలావుంటుందో, తదుపరి పోస్ట్‌లో తెలుసుకోబోతున్నామన్న మాట.
శంకర్ గారు లేదండి Addl. DGP నుంచి DGP అవ్వాలంటే కనీసం 5 సంవత్సరాలు పడుతుంది . అది వేరే రాంక్ ఇది వేరే రాంక్ , ఇంకా కరెక్టు గా చెప్పాలి అంటే Addl. DGP హోదా లో కనీసం 5 ఏళ్ళు పని చేసాకనే DGP గా పదోన్నతి వస్తుంది .
ఆయన తెనిగీకరించిన(అంటే ఆంధ్రీకరించిన, అంటే తెలగాణీకరించిన కాదు :) ) విష్ణు సహస్రనామం తో పోస్ట్ వేసి, ఇది రాసిందెవరో తెలుసా? అని చదువరులనడుగుతూ, ఇది అనువదించింది ఫలాన ... అంటూ ఆయన్ని పరిచయం చేసివుంటే వెరైటీగా వుండేది
-----------------------------
పుస్తకం ప్రచురించి ఇప్పటికి మూడేళ్ళ పైనే అయ్యిందండి , పైగా పుస్తకాన్ని పరిచయం చేసే ఉద్దేశ్యం తో కూడా ఈ పోస్టు రాయలేదు :-)) .
ఆ పుస్తకం గురించి వారే ఏదన్న గెస్ట్ పోస్ట్ రాస్తారేమో అడిగి చూస్తాను .
Nice..
ఆయన ప్రొఫెషనల్ అచీవ్ మెంట్లు, అలాగే వ్యక్తిగత అలవాట్లు,హాబీలు..
గొప్ప వ్యక్తి దగ్గర పని చేశారన్నమాట!
కృష్ణప్రియ గారు అవునండి ! థాంక్ యు :-))
Post a Comment