Subscribe:

Thursday, March 29, 2012

Cloud Computing - I

హ్మ్ ! ఎప్పుడు చూసినా  పేరేమో  టెక్నికల్ , పోస్టేమో నాన్ టెక్నికల్  ఈ సారి ఏమి   రాసి పూడ్చిందో  అని కంగారు పడుతున్నారు  కదా ?  నో  ఈ సారి  పద్దతి మార్చా   పేరు  టెక్నికల్  ఇంకా  పోస్ట్ కూడా   టెక్నికల్  అన్న మాట :)

ఇక మీకు అర్ధం  అయ్యింది కదా  మనం ఇప్పుడు   cloud  computing   గురించి మాట్లాడుకుందాం .

క్లౌడ్  కంప్యూటింగ్  అంటే  ఏదైనా  కంప్యూటింగ్  సేవలను  ఇంటర్నెట్  ద్వారా  వాడుకోవటం . ఉదాహరణ కు  మన బ్లాగు నే  తీసుకోండి, మీరు  రాసేవి  కానీ చదివేవి కానీ మీ  సిస్టం లో  ఉండనవసరం  లేదు కదా ? అలాగే  మీ కంపెనీకి  కావలసిన  పే రోల్  సాఫ్ట్వేర్  కావొచ్చు  లేదా  మీ  కంపెనీ  డాటా మొత్తాన్ని   జాగ్రత్త  పరిచే  సర్వీసు  కావొచ్చు  ఇలాంటి వన్నీ  ఇంటర్నెట్  ద్వారా  పొందటాన్ని  క్లౌడ్  కంప్యూటింగ్  అని  అంటారు  .

అసలు  ఈ  క్లౌడ్  కంప్యూటింగ్  అనేది    Old Wine in New Bottle అని కొంతమంది అభిప్రాయం  .  అలా  ఎందుకూ  అంటే   ఈ కాన్సెప్ట్   traditional  web హోస్టింగ్  సర్వీసెస్ కి  చాలా  దగ్గర గా   ఉంటుంది  .  కానీ  ఇక్కడ  ఉన్న  అదనపు  advantage  ఏమిటంటే   ఎప్పుడైతే  అదనపు  resources   అవసరం అయితే అప్పుడు  అదే  స్కేల్ లో  పెంచుకుంటూ  పోవటం  ,  అలాగే  అవసరం లేనప్పుడు తగ్గించుకుంటూ  పోవటం అనే   ఫ్లెక్షిబిలిటీ  ఉంటుంది . 

ఈ క్రింది  బొమ్మలో  ఉన్న  అంశాలు  క్లౌడ్ కంప్యూటింగ్ లో  ఉండవలసిన  ప్రధానమైన  లక్షణాలు :

 అసలు  క్లౌడ్  అనే  పేరు ఎలా  వచ్చింది  అనేది ఈ పాటికి  మీరు ఆలోచిస్తూ  ఉంది ఉంటారు కదా ?  కరెక్టు  దీనికి  ఒక  కారణం  ఉంది . అది   సాధారణం  గా  ఫ్లో  చార్ట్స్  గీసేటప్పుడు  ఇంటర్నెట్  ని   రెప్రజేంట్ చేయటానికి  క్లౌడ్  సింబల్ ని  వాడతారు కదా  ,   ఆ ఇన్స్పిరేషన్  తో  ఈ పేరు పెట్టారన్న  మాట .

క్లౌడ్ కంప్యూటింగ్ తో  ప్రోవైడ్ చేసే సర్వీసెస్ ని మూడు  రకాలు గా   చెప్పొచ్చు  అవి :

1. Infrastructure as a Service (IaaS)

 ఈ సర్వీసు  ని కొన్ని సార్లు  Hardware as a Service (HaaS) అని  కూడా  చెప్తారు .   ఈ సర్వీసెస్ లో ప్రధానం గా infrastructure   అంటే     సర్వర్స్ ,  storage equipment  ,   నెట్వర్క్  components  లాంటివి  అవుట్ సోర్సు  చేస్తారు .    ఈ సర్వీసెస్ సాధారణం గా  పే పర్ యూజ్  మోడల్  లో బిల్ చేయబడతాయి . అంటే  మీకు  అవసరం అయినప్పుడు  వాడుకొని  ఆ వాడుకున్న  సమయానికి  మాత్రమే   డబ్బు కడతారన్న మాట . 

2. Platform as a Service (PaaS) 


ఈ మోడల్  సర్వీసెస్ లో development  కి ఉపయోగపడే    software,  ప్రోడక్ట్ టూల్స్    లాంటివి  అందుబాటులో  ఉంటాయి .  డెవలపర్స్  ఈ  సర్వీసెస్  సహాయం తో  ఉదాహరణ కి  గూగుల్ apps  లాంటి  అప్లికేషన్స్  క్రియేట్  చేయొచ్చు .   ప్రస్తుతానికి  మాత్రం ఈ  సర్వీసెస్  ఇంకా   అంత గా  వాడకం లోకి  రాలేదు . దీనికి  ముఖ్యం గా  పోర్టబిలిటీ,    clients   క్రియేట్  చేసిన apps  move  off  చేయనివ్వక పోవటం   వంటివి  కొన్ని కారణాలు . 


3. Software as a Service (SaaS)


క్లౌడ్  కంప్యూటింగ్ లో  అత్యంత  ప్రాధ్యానత  గల  సర్వీసు  గా దీన్ని చెప్పొచ్చు .   గూగుల్ , మైక్రోసాఫ్ట్  వంటి కంపెనీలు  ప్రోవైడ్ చేసే  వెబ్ బేసేడ్   ఈమెయిలు  సర్వీసు  ఈ కాటగిరి లోకే వస్తుంది .  అంతే కాకుండా    HR ,  Payroll ,  ఫైనాన్సు సాఫ్ట్వేర్ సర్వీసెస్   ని  నచ్చిన వెండార్ నుంచి  కొనుక్కోవచ్చు .   ఈ softwares maintenance కి ఎటువంటి  ప్రత్యేకమైన  IT  ఉద్యోగుల  నియామాకాలు  అవసరం ఉండవు .

సరే   క్లౌడ్  కంప్యూటింగ్  అందించే  సేవలు  గురించి  తెలుసుకున్నాం  కదా ఇప్పుడు  అసలు  ఈ క్లౌడ్ కంప్యూటింగ్  లో ఉన్న  రకాలు గురించి  తెలుసుకుందాం .  అవి :

1. పబ్లిక్  క్లౌడ్

పబ్లిక్  క్లౌడ్ లో  ప్రొవైడర్  తన  సేవలని , ఇంటర్నెట్  ఉన్న   ఏ  వాడకదారు  (User)   కైనా  అందించే  సౌలభ్యం ఉంటుంది .  ఈ మోడల్  ని  స్టాండర్డ్  క్లౌడ్ కంప్యూటింగ్  అని కూడా అంటారు .  ఈ మోడల్ లో  సాధారణం  గా ప్రొవైడర్స్  ఇంటర్నెట్ లో  access చేయగలిగిన  అప్లికేషన్స్  కి స్టోరేజ్  సర్వీసు  ని  ప్రోవైడ్ చేస్తారు .

Elastic Compute Cloud (EC2), IBM's Blue Cloud, Sun Cloud, Google AppEngine and Windows Azure Services Platform    వంటిని  పబ్లిక్  క్లౌడ్స్  ఉదాహరణ గా చెప్పొచ్చు .


2. ప్రైవేటు క్లౌడ్

ప్రైవేటు క్లౌడ్  అంటే మనకు  పేరు తోనే  అర్ధం అవుతుంది కదా కేవలం  కొద్ది మంది  లిమిటెడ్  users  కి  మాత్రమే అందించే సౌలభ్యం ఉంటుంది .  ఈ ప్రైవేటు క్లౌడ్  ప్రధాన ఉద్దేశ్యం    organizations కి  తమ డేటా పైన పూర్తి    కంట్రోల్  కలిగి ఉండటం .

3. హైబ్రిడ్ క్లౌడ్

 హైబ్రిడ్ క్లౌడ్  అనేది  కనీసం ఒక  పబ్లిక్ క్లౌడ్ , అలాగే కనీసం  ఒక  ప్రైవేటు క్లౌడ్ ల  కంపోజిషన్ తో ఏర్పడుతుంది .
ఈ మూడు రకాల  ఆర్కిటెక్చర్  లో  హైబ్రిడ్  క్లౌడ్  ఐడియల్  మోడల్  గా చెప్పొచ్చు .  ఈ మోడల్ లో  పబ్లిక్  క్లౌడ్   లో  పరిమిత వనరులతో  అవసరమైనప్పుడు  స్కేలబిలిటీ  పెంచుకునే అవకాశం ఉంటుంది అలాగే vulnarable డేటా , లేదా అప్లికేషన్స్ కి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది .


ఇప్పటికే  మీ తలలు  పట్టుకు  ఎటో చూస్తున్నారు అని  నాకు అర్ధం  అయ్యింది,   సో ఇది ఇక్కడితో ఆపేసి  వేరే భాగం లో క్లౌడ్  కంప్యూటింగ్  వలన   IT  కంపెనీల , ఉద్యోగుల    రోల్  ఎలా  మారబోతుంది . అలాగే  దీని వలన   ఉపయోగాలు  చూద్ద్దాం , అర్జెంటు గా ఇప్పుడైతే వెళ్లి ఒక కప్పు కాఫీ తాగేయండి      :)))

19 comments :

శేఖర్ (Sekhar) said...

Read regarding this in newspaper but couldn't understand.Your's is somewhat uncomplicated.

Waiting to get more knowledge in next part

శ్రీరామ్ said...

Good Article :-)

వేణూశ్రీకాంత్ said...

మంచి వివరాలు అందించారు శ్రావ్యా.. ధన్యవాదాలు..

Rao S Lakkaraju said...

వివరణ చాలా చక్కగా ఉంది. థాంక్స్.

చైతన్య.ఎస్ said...

చాల బాగుంది నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్.
క్లౌడ్ సెక్యురిటి గురించి కుడా రాయండి

బులుసు సుబ్రహ్మణ్యం said...

కాఫీ తాగి మళ్ళి వస్తాను.... దహా.

Anonymous said...

very good post.
:venkat

Krishna Palakollu said...

Nice One Ma'm

పద్మవల్లి said...

Good one and explained in a simple words. Sure it helps undrstanding the concept for techies and non-techies as well.

Sravya V said...

@శేఖర్ , @శ్రీరాం గారు , @వేణు గారు , @లక్క రాజు గారు , @చైతన్య గారు , @బులుసు మాస్టారు , @వెంకట్ గారు , @కృష్ణ గారు , @పద్మవల్లి గారు అందరికీ ధన్యవాదాలు !
చైతన్య నెక్స్ట్ పార్ట్ లో రాస్తానండి !

హరే కృష్ణ said...

very Well written :)
Resume లో బేసిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా చేర్చేసుకోవచ్చు after this series

ఫోటాన్ said...

ఈ మధ్య దీని గురించి ఎక్కువ వింటున్నా, మీరు సవివరంగా రాసి నా శ్రమని తగ్గించారు... బాగుంది,.. త్వరగా నెక్స్ట్ పార్ట్ రిలీజ్ చెయ్యండి,. :)

మంచు said...

Nice Start :-)
ఇవి ఫండమెంటల్స్ కానీ ...

నాది చైతన్య ఎస్ రెక్వెస్టే.. అందులొ బొల్డు సందేహాలు ఉన్నాయ్ నాకు

Sravya V said...

@హరే కృష్ణ హ హ ఇంతకీ మీ resume లోనేనా యాడ్ చేసేది ? థాంక్ యు :))

@ఫోటాన్ అవునా రాస్తున్న రాస్తున్నా థాంక్ యు :))

@చాణుక్య మీరు చెప్పింది కరెక్టు కొన్ని సార్లు కమ్యూనిటీ క్లౌడ్ ని కూడా కొంతమంది ఒక ప్రత్యేకమైన కాటగిరీ లో గా clasify చేస్తున్నారు . కానీ ఆర్కిటెక్చర్ ని చూస్తే కమ్యూనిటీ క్లౌడ్, ప్రైవేటు క్లౌడ్ ని లేదా హైబ్రిడ్ క్లౌడ్ ఈ రెండిటి లో ఏదో ఒక మోడల్ ఫాలో అవుతుంది . ఒక ఒక తేడా ఏమిటి అంటే ఒక organization బదులు గా కొన్ని organizations ఈ infrastructure లేదా సర్వీసెస్ ని షేర్ చేసుకుంటాయి . అందుకనే నేను కమ్యూనిటీ క్లౌడ్ ఒక ప్రత్యెక వర్గం గా చూపించలేదు . థాంక్ యు :))

@మంచు గారు తప్పకుండా , థాంక్ యు :))

Anonymous said...

nice job... nenu ee cloud computing ante chala sarlu vinanu.. chala sarlu telsukundam ani google lo search kooda chesanu.. kani anta pedda pedda pages chadavaleka sagam chadivi apesanu.. ila brief ga icharu.. thanks.. Srinivas

Anonymous said...

మేఘగణనం మేడ్ ఈజీ అన్నమాట! మీ ప్రయత్నం బాగుంది.

Sravya V said...

@More Entertainment, @శ్రీనివాస్ గారు Thank you :))
హ హ శంకర్ గారు భలే translalate చేసారు గా :)) థాంక్ యు :))

నిషిగంధ said...

టెక్నికల్ విషయాలు తెలుగులో.. అదీ ఇంత సింపుల్‌గా వివరించడం కాస్త కష్టమైన పనే, శ్రావ్యా! appreciate your effort! :-)

Sravya V said...

@Nishi Thank you :))

Post a Comment